Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ఈ వారం తెలుగులో థియేటర్లలో విడుదలైన ‘వాలా 2’ థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకోగా, దర్శకుడు సావిన్ ఎస్ఏ ఒక చిన్న కథను తీసుకుని, దానికి యూత్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఎమోషన్స్‌ను జోడించి ఆసక్తికరంగా మలిచారు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో సహజంగా నటిస్తూ సినిమాకు బలం చేకూర్చారు. ముఖ్యంగా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా కామెడీతో వేగంగా సాగిపోతూ, కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఎదురయ్యే సమస్యలను చూపిస్తూ కథలో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.
సాంకేతికంగా కూడా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. అయితే కొత్త నటీనటులు మాత్రమే ఉండి, పెద్దగా పేరున్న నటులు లేకపోవడం చిన్న వెలితి. మొత్తంగా ‘వాలా 2’ యూత్‌ను టార్గెట్ చేసిన కమింగ్ ఆఫ్ ఏజ్ ఎంటర్టైనర్. ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్‌లో చూసేందుకు ఓ సరదా చిత్రం. ఫైనల్ గా "ఇది బిలియన్ బాయ్స్ బయోపిక్. అంటే నాది నీది మనందరిది".
తెలుగులో ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ లో 'వాలా 2' ఒకటి. మలయాళం లో పెద్ద హిట్ అయిన ఈ సినిమా తాజాగా తెలుగులో విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కొత్త నటుల ఎనర్జీ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచింది.
దర్శకుడు సావిన్ ఎస్ఏ చిన్న కథను తీసుకుని, దానిలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్షిప్ వైబ్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి బాగా ప్రెజెంట్ చేశాడు. హషీర్, అలన్, వినాయక్, అజిన్ లాంటి లీడ్ యాక్టర్స్ తమ పాత్రల్లో నేచురల్‌గా లివ్ చేశారు. వారి మధ్య కెమిస్ట్రీనే సినిమాను ముందుకు నడిపించే ప్రధాన బలం.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ రైడ్ లా సాగిపోతూ, కాలేజ్ డేస్‌ను రీక్రియేట్ చేస్తుంది. సెకండ్ హాఫ్‌లో విదేశాల్లో ఫేస్ చేసే స్ట్రగుల్స్‌ను చూపిస్తూ, నవ్వుల మధ్య ఒక ఫీలింగ్ కూడా ఇస్తుంది. క్లైమాక్స్ మాత్రం సైలెంట్‌గా హార్ట్‌ని టచ్ చేసేలా డిజైన్ చేశారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి సపోర్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల స్లోగా అనిపించినా, ఓవరాల్‌గా ‘వాలా 2’ యూత్‌తో పాటు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ మూవీ.
ఫైనల్ వర్డ్: ఫ్రెండ్షిప్ + ఫన్ + ఎమోషన్ కావాలంటే ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఛాయిస్
ThimmarajuPalli TV movie Review
By 10TV Telugu
ఈ వారం విడుదలైన క్రేజీ సినిమాల్లో తిమ్మరాజుపల్లి టివి ఒకటి. అంతా కొత్త నటులతో తెరకెక్కిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. రొటీన్ కథే అయినా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ మునిరాజు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మంది కొత్తవాళ్ళైనా అదరగొట్టేసారు. హీరో సాయి తేజ్ చాలా బాగా నటించాడు. హీరోయిన్ వేద జలంధర్ క్యూట్ గా కనిపిస్తూనే చక్కగా నటించింది. ప్రదీప్ కొట్టె సినిమాకు హైలెట్. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు. సినిమా మొదట్లో కిరణ్ అబ్బవరం వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. పోరాటాలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకు లొకేషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. 1996 విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో దానికి తగ్గట్టు లొకేషన్స్ చాలా బాగా వెతికి పట్టుకున్నారు. కొత్త కథని రొటీన్ లవ్ స్టోరీతో ఆసక్తికర స్క్రీన్ ప్లే తో బాగానే రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ లో అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండు. మొత్తంగా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఓ క్యూట్ లవ్ స్టోరీతో పాటు టీవీ దొంగతనం అనే సస్పెన్స్ తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
ThimmarajuPalliTV movie Review
By TV9 Telugu
అంతా కొత్తవాళ్ళతో తెరకెక్కిన తిమ్మరాజు పల్లి TV తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా గురించి చెప్పుకుంటే... దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ పల్లెటూరి ఎమోషన్స్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు దర్శకుడు మునిరాజ్.
ఇక ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారు అనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. టెక్నికల్‌గా ఈ సినిమాకు ప్రధాన బలం వంశీకాంత్ రేఖన అందించిన నేపథ్య సంగీతం. సాధారణ సన్నివేశాలకు కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ 90స్ నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా కళ్లకు కట్టింది. అక్షయ్ రామ్ కెమెరా పనితనం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా నేచురల్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మునిరాజు దర్శకత్వం కూడా మెప్పించింది. ఓవరాల్‌గా తిమ్మరాజుపల్లి టీవీ.. 90ల్లోని జ్ఞాపకాలు.. స్వచ్ఛమైన పల్లెటూరి కథ
ThimmarajuPalli TV Movie Review
By NTV Telugu
తాజాగా విడుదలైన తిమ్మరాజు పల్లి TV చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. సినిమాలో హీరో సాయితేజ, హీరోయిన్ వేద జలంధర్ తమ నటనతో ఆకట్టుకోగా… రూరల్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ ను బాగా చూపించారు. రాజప్ప పాత్రలో ప్రతీక్ కూడా మంచి నటన కనబరిచారు. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే… సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా విజువల్స్‌ను నేచురల్‌గా చూపించింది.
అయితే ఎడిటింగ్ విషయంలో లోపాలు కనిపిస్తాయి. రెండు గంటల సినిమా అయినా స్లో నేరేషన్ వల్ల మరింత పొడవుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ బలహీనంగా ఉండటం, కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజింగ్‌గా అనిపించడం మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా తక్కువ బడ్జెట్‌లో చేసిన ప్రయత్నం కనిపించినా, కథనం బలహీనతల వల్ల సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. అయితే రూరల్ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్ కి తిమ్మరాజు పల్లి TV నచ్చే ఛాన్స్ ఉంది.
ThimmarajuPalli TV Movie Review
By Sakshi
తిమ్మరాజుపల్లి టీవీ’ పేరుతో వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 90స్ వాతావరణం కట్టిపడేస్తుంది.
అయితే కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లోపం సినిమాకు మైనస్‌లుగా మారాయి. నటీనటుల విషయానికి వస్తే… కొత్తవాళ్లే అయినప్పటికీ అందరూ సహజంగా నటించారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు వి. మునిరాజు బాగా హ్యాండిల్ చేసాడు. అలాగే వంశీ కాంత్ మ్యూజిక్ బాగా ఉంది. నిర్మాతగా కిరణ్ అబ్బవరం కు ఈ మూవీతో మంచి సక్సెస్ దక్కే అవకాశం ఉంది. ఇక ‘తిమ్మరాజుపల్లి టీవీ’ పీరియాడికల్ కథలను ఇష్టపడే వారికి కొంతవరకు కనెక్ట్ అయ్యే సినిమా.
తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... కథ చాలా చిన్న పాయింట్. దర్శకుడు ఎస్.పీ. దుర్గా నరేష్ దానికి ఎమోషన్స్, పల్లెటూరి కామెడీని జోడించి సినిమాగా మలిచారు. మధ్యతరగతి భర్త పడే కష్టాలు, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే ఇంత చిన్న పాయింట్‌ను రెండున్నర గంటల సినిమాగా మలచడం అనేది కత్తిమీద సాము లాంటిదే. కానీ అది కాస్త గాడి తప్పింది. ఫస్టాఫ్ అంతా బాగానే వెళ్లిపోతుంది. హీరోకు ఉన్న సమస్యేంటి అనేది ల్యాగ్ చేయకుండా త్వరలోనే రివీల్ చేసాడు దర్శకుడు.. అయితే కీలకమైన ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది.
సినిమాలో కొన్ని డబుల్ మీనింగ్ జోకులు, సీన్లు అవసరం లేదేమో అనిపించింది. క్లైమాక్స్ ఓకే..! నిర్మాణ విలువలు కథా నేపథ్యానికి తగ్గట్లుగా, రాజీ పడకుండా చాలా బాగున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశం చిన్నదే అయినా.. 90ల నాటి గోదావరి నేటివిటీని తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. పల్లెటూరి కథ.. డీసెంట్ ఎంటర్‌టైనర్..!
తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. ఎప్పట్లాగే తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. అమాయకుడిగా, చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వాడిలా నటించి మెప్పిస్తాడు. పాయల్ రాధకృష్ణ తన పాత్రకు తగ్గట్టుగా ఎమోషనల్‌గా మెప్పిస్తుంది. సీనియర్ నటి రాశీ అమ్మ పాత్రలో ఆకట్టుకుంటుంది. అజయ్ ఘోష్ తండ్రిగా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఓ కొత్త సమస్యతో భార్యాభర్తల మధ్య కథగా రాసుకొని నవ్వించడంలో, ఎంటర్టైన్ చేయడంలో పాపం ప్రతాప్ సక్సెస్ అయినా భావోద్వేగాలు ఇంకాస్త పండించాల్సింది. కొన్ని డైలాగ్స్ మాత్రం ఎమోషనల్ గా మెప్పిస్తాయి. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. పాపం ప్రతాప్ అని టైటిల్ పెట్టి హీరోకి ఏదో ఒక సమస్య ఉంది అనే విషయాన్ని నేరుగా ఆడియెన్స్‌కి చెప్పేసాడు దర్శకుడు. మొత్తంగా ‘పాపం ప్రతాప్’ ఓ కొత్త సమస్యతో ప్రేక్షకులని నవ్విస్తూ ఎమోషనల్ చేసే సినిమా.
ఈ వారం రిలీజ్ అయిన ‘పాపం ప్రతాప్’ థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, ఓవరాల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తిరువీర్ హీరోగా వచ్చిన ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా బీలో యావరేజ్ టాక్‌ను ఎదుర్కొంటోంది.
సినిమాలో నటీనటులు తమ పరిధిలో బాగానే నటించినా… అసలు సమస్య కథ, కథనం దగ్గరే కనిపిస్తుంది. “పిండే బాగోలేకపోతే వంట ఎలా బాగుంటుంది?” అన్నట్టుగా, బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల టెక్నికల్ టీమ్ కూడా పూర్తి న్యాయం చేయలేకపోయింది.
అయితే 90స్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను డిజైన్ చేసిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ కొంతవరకు ప్లస్‌గా నిలిచాయి. కానీ రొటీన్ కథనం, ఆసక్తి కలిగించని సీన్స్ కారణంగా సినిమా ఎక్కడా ఎంగేజ్ చేయలేకపోయింది. మొత్తంగా ‘పాపం ప్రతాప్’ కొన్ని టెక్నికల్ ప్లస్‌లతో ఉన్నా… ఓవరాల్ గా కొన్ని మంచి కామెడీ సీన్లతో పాపం ప్రతాప్ కొంతవరకు నవ్విస్తాడు.
తిరువీర్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం పాపం ప్రతాప్ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ, ఎమోషనల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నటీనటుల విషయానికి వస్తే తిరువీర్, అజయ్ ఘోష్ తమ పెర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు. కొన్నిచోట్ల కామెడీ సీన్స్ మంచి నవ్వులు పంచుతాయి. టెక్నికల్‌గా సినిమాకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించగా, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది.
అయితే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ, కథలో డెప్త్, స్క్రీన్‌ప్లేలో బలం లేకపోవడం సినిమాకు మైనస్ అయింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయినా, మొత్తం కథనం రొటీన్‌గా అనిపిస్తుంది.
మొత్తానికి… పాపం ప్రతాప్ ఒక సింపుల్ విలేజ్ డ్రామాగా, కొన్ని కామెడీ ఎలిమెంట్స్‌తో మాత్రమే పరిమితమైంది. అంచనాలు తగ్గించుకుని చూస్తే ఓకే అనిపించే సినిమా.
టెక్నాలజీతో ముడిపడి ఉన్న భవిష్యత్తులో ప్రేమ అనే కాన్సెప్ట్ వినడానికి చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. కానీ, దర్శకుడు దాన్ని పైపైన మాత్రమే టచ్ చేశాడు తప్ప, డెప్త్‌లోకి వెళ్లలేదు. 2040 నాటి ఫ్యూచరిస్టిక్ సెటప్ ప్రస్తుత సమాజానికే అద్దం పట్టినట్లు ఉంటుంది కానీ, భవిష్యత్తును చూస్తున్నామనే ఫీలింగ్ కలగదు. అలాగే ఆర్గానిక్ వరల్డ్ అనే కాన్సెప్ట్ కూడా కృత్రిమంగా అనిపిస్తుందే తప్ప కన్విన్సింగ్‌గా లేదు. లీడ్ పెయిర్ మధ్య ఎమోషనల్ కనెక్షన్, సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం వల్ల కథనం వీక్ అయిపోయింది. ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీకి ఎమోషనల్ డెప్త్ చాలా అవసరం.
యోగి బాబు లాంటి కమెడియన్ ఉన్నా, కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రేక్షకులను కట్టిపడేసేలా ఒక్క బలమైన సన్నివేశం కూడా లేకపోవడం, ఫీల్ గుడ్ ఎమోషన్స్ మిస్ అవ్వడం కథనంలోని అతిపెద్ద లోపం. ఇక టెక్నికల్ గా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ పెద్దగా ఎక్కలేదు. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ పర్వాలేదనిపించినా, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేయలేకపోయింది. ఓవరాల్ గా LIK.. నైస్ కాన్సెప్ట్.. వీక్ ఎగ్జిక్యూషన్..!
సాధారణంగా ప్రదీప్ రంగనాథన్ సినిమాలు యూత్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ‘లవ్ టుడే’ వంటి బ్లాక్ బస్టర్ చూసిన తర్వాత ‘డ్రాగన్’ చూస్తున్నామని, ఒక నిరీక్షణతో అంచనాలు పెంచుకుని ఈ సినిమా చూస్తారు. దాదాపుగా LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కూడా అలాంటి స్టోరీనే. అయితే ఈ సినిమా కథలో ప్రదీప్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో తెలియదు కానీ, విఘ్నేష్ శివన్ రాసుకున్న కథ కొంత రిలేటబుల్ గానే అనిపించింది. సినిమా మొదలు 2040లో జరుగుతున్నట్టు చూపించినా కూడా, ఇప్పటి యూత్ సమస్యలను ఎత్తి చూపించేలా ఈ కథ ఉంటుంది.
నిజానికి ఫోన్ హీరోలా నిలబడిన మనిషి అనిపించినా, అతనికి ఫోన్ తోనే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కూడా ఉంటాయి. అలాగే ఫోన్ మనుషుల్ని కంట్రోల్ చేసే పరిస్థితులు కూడా ఈరోజుల్లో కనిపిస్తున్నాయి అని ఆలోచన ఎక్కడో ఉంటుంది, బహుశా దాన్ని ఒక ఆసక్తికరమైన లైన్ గా రాసుకున్నట్లున్నారు దర్శకుడు. ఓవరాల్ గా LIK ప్రదీప్ రంగనాథన్, విగ్నేష్ శివన్ మార్క్ సినిమా అయితే కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి థియేటర్లలో ట్రై చేయొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers