మిస్సింగ్ మేఘన (Missing Meghna)
టాలెంటెడ్ హీరోయిన్ అమ్ము అభిరామి మెయిన్ లీడ్ లో నటించిన మూవీ "మిస్సింగ్ మేఘన". కొత్త డైరెక్టర్ వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Available in:
Reviews
What critics and the public are saying about మిస్సింగ్ మేఘన (Missing Meghna)
Media Reviews
5 Avg: 5.2/10Above Average
Missing meghana movie review
సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ప్రధానంగా సాగిన (మిస్సింగ్ మేఘన) చిత్రమిది. ఇందులో లవ్ ట్రాక్ కూడా ఉంది. అయితే అదొక డిఫరెంట్ లవ్ స్టోరీ కావడం విశేషం. పెళ్లి సెట్ అయిన అమ్మాయి ఆ తర్వాత వేరే వ్యక్తితో ప్రేమలో పడటమనే కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అందులోనూ ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇక మేఘన మిస్...
సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ ప్రధానంగా సాగిన (మిస్సింగ్ మేఘన) చిత్రమిది. ఇందులో లవ్ ట్రాక్ కూడా ఉంది. అయితే అదొక డిఫరెంట్ లవ్ స్టోరీ కావడం విశేషం. పెళ్లి సెట్ అయిన అమ్మాయి ఆ తర్వాత వేరే వ్యక్తితో ప్రేమలో పడటమనే కథలతో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ అందులోనూ ఇది కొంత భిన్నంగా ఉంటుంది. ఇక మేఘన మిస్సింగ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అయితే సినిమా అర్థం కావడానికి టైమ్ పడుతుంది. ఫస్టాఫ్ చాలా వేగంగా పూర్తవుతుంది. కానీ సెకండాఫ్ లెంన్తీగా అనిపిస్తుంది. కార్తీక్ లవ్ ట్రాక్, మేఘనతో ఆయన పరిచయం రివీల్ కావడానికి టైమ్ తీసుకున్నారు. ఆ లవ్ ట్రాక్ కొత్తగా ప్రారంభమైనా, ఆ తర్వాత కొంత రొటీన్‌గా, మరికొంత బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఇక సినిమాలో మెయిన్ ఎమోషన్ మిస్ అయ్యింది. చాలా సీన్లు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ట్విస్ట్ లు కూడా గొప్పగా వర్కౌట్ కాలేదు. కాకపోతే ఇంకా బాగా చేయాల్సింది. వాహ్ ఫ్యాక్టర్ విషయంలో, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగుండేది. ఫైనల్ గా కొంత వరకు ఎంగేజ్ చేసి, ట్విస్ట్, టర్న్ లతో ఆకట్టుకునే మూవీ `మిస్సింగ్ మేఘన`. మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
Average
Missing Meghana movie review
కూతురు మిస్సింగ్ నేపథ్యంలో ఓ నాన్న ఏం చేశాడు అనే కథతో వచ్చిన సినిమా మిస్సింగ్ మేఘన. వాచస్పతి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని కేవలం ఒక అమ్మాయి అదృశ్యం చుట్టూ తిరిగే పాయింట్‌లా కాకుండా మర్డర్ మిస్టరీ, డ్రగ్ మాఫియా, ప్రేమకథ ఇలా రకరకాల ఎలిమెంట్స్‌ను జోడించి తీశారు. అయితే దర్శకుడు రాసుకున్న కొన్న...
కూతురు మిస్సింగ్ నేపథ్యంలో ఓ నాన్న ఏం చేశాడు అనే కథతో వచ్చిన సినిమా మిస్సింగ్ మేఘన. వాచస్పతి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని కేవలం ఒక అమ్మాయి అదృశ్యం చుట్టూ తిరిగే పాయింట్‌లా కాకుండా మర్డర్ మిస్టరీ, డ్రగ్ మాఫియా, ప్రేమకథ ఇలా రకరకాల ఎలిమెంట్స్‌ను జోడించి తీశారు. అయితే దర్శకుడు రాసుకున్న కొన్ని మలుపులు సగటు ప్రేక్షకుడికి ముందే అర్థమైపోతాయి. ముఖ్యంగా మెయిన్ విలన్ ఎవరనేది రివీల్ చేసినప్పుడు ఎలాంటి సర్‌ప్రైజ్ అనిపించదు. అలాగే క్లైమాక్స్ కూడా రొటీన్ యాక్షన్ సినిమాలను తలపిస్తాయి.
ఇన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో ఉండే ఇన్వెస్టిగేషన్ ట్రాక్, అక్కడక్కడా వచ్చే కొన్ని థ్రిల్లింగ్ అంశాలు సినిమాను బోర్ కొట్టకుండా కాపాడాయి. క్రైమ్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మోస్తరుగా నచ్చుతుంది. ఎడిటర్ బసవ తన కత్తెరకు ఫస్ట్ హాఫ్‌లో కొంచెం పని చెప్పాల్సింది. సాగదీతగా అనిపించే సీన్లను కట్ చేసి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా వచ్చేది. నిర్మాణ విలువలు కథా స్థాయికి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. ఓవరాల్ గా మిస్సింగ్ మేఘన.. డీసెంట్ థ్రిల్లర్..!
Average
Missing Meghana movie review
అమ్ము అభిరామి లీడ్ రోల్‌లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' ఒక డీసెంట్ అబోవ్ యావరేజ్ థ్రిల్లర్! ఒక గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ కథ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా, పక్కా సస్పెన్స్‌తో సాగిపోతుంది. అమ్ము అభిరామి పర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి!బ్...
అమ్ము అభిరామి లీడ్ రోల్‌లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' ఒక డీసెంట్ అబోవ్ యావరేజ్ థ్రిల్లర్! ఒక గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ కథ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా గ్రిప్పింగ్‌గా, పక్కా సస్పెన్స్‌తో సాగిపోతుంది. అమ్ము అభిరామి పర్ఫార్మెన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ సీన్స్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి!
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ థ్రిల్లర్ మూడ్‌ని భలే క్యారీ చేశాయి. సెకండ్ హాఫ్‌లో డ్రామా కాస్త స్లో అయ్యి, కొద్దిగా ల్యాగ్ అనిపించినా... క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ మెయిన్ కాన్సెప్ట్ సినిమాని సేవ్ చేశాయి!
రొటీన్ రొమాంటిక్ సీన్స్ పక్కన పెడితే... థ్రిల్లర్ జానర్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ఇష్టపడే ఆడియన్స్‌కి ఇది ఒక డీసెంట్ వీకెండ్ వాచ్! సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్లు కత్తిరించి ఉంటె, సినిమా ఇంకాస్త క్రిస్పీ గా, ఎంగేజింగ్ గా ఉండేది. చివరిగా మిస్సింగ్ మేఘన థ్రిల్లర్ లవర్స్ కి నచ్చే అటెంప్ట్.
Average
Missing meghana movie review
‘మిస్సింగ్ మేఘన’ మూవీ యావరేజ్ రివ్యూ: నటి అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో, నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. కథలోకి వెళ్తే... ఒక అమ్మాయి అదృశ్యం కావడం, దాన్ని ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్...
‘మిస్సింగ్ మేఘన’ మూవీ యావరేజ్ రివ్యూ: నటి అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో, నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. కథలోకి వెళ్తే... ఒక అమ్మాయి అదృశ్యం కావడం, దాన్ని ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ మరియు అమ్ము అభిరామి నటన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. శ్యామ్ కే నాయుడు కెమెరా వర్క్ సినిమాకి మంచి లుక్ తీసుకొచ్చింది.
అయితే, ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ కైనా స్క్రీన్ ప్లే ప్రధాన బలం, కానీ సెకండ్ హాఫ్‌ని విపరీతంగా సాగదీయడం ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. ఊహకందే క్లైమాక్స్, లాజిక్ లేని సన్నివేశాలు మరియు పాతకాలపు నాటి లవ్ సీన్లు గ్రాఫ్‌ను తగ్గించేశాయి. ఓవరాల్‌గా ‘మిస్సింగ్ మేఘన’ కొత్తదనం లేని ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఇష్టపడేవారు ఈ వీకెండ్‌కి ఒకసారి క్యాజువల్‌గా చూసేయొచ్చు!
Average
Missing Meghana movie review
అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల విజయం అంతా స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్...
అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వాచస్పతి జొన్నలగడ్డ తెరకెక్కించిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బిలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ల విజయం అంతా స్క్రీన్‌ప్లే, ఎగ్జిక్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా, సెకండ్ హాఫ్‌ను సాగదీయడం అతిపెద్ద మైనస్. రెండో భాగంలో వచ్చే కొన్ని సీన్లు, డైలాగ్స్ 2010 కాలం నాటి రొమాంటిక్ షార్ట్ ఫిలింలను గుర్తు చేస్తాయి.
మొత్తంగా చెప్పాలంటే.. ‘మిస్సింగ్ మేఘన’ కొత్తదనం లేని ఒక రొటీన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు, అమ్ము అభిరామి నటన మినహా ఆకట్టుకుంటయి. సాగదీసిన సెకండ్ హాఫ్, ఊహకందే క్లైమాక్స్, లాజిక్ లేని సీన్లు ఈ సినిమా గ్రాఫ్ ను తగ్గించేశాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ వీకెండ్‌కి వేరే ఆప్షన్స్ చూసుకోవడం బెటర్.
Public Reviews
3 Avg: 4.3/10Not Good
Missing Meghana movie review
Missing Meghana is a lifeless crime mystery that fails to deliver even basic suspense. While the premise of a missing girl and a police hunt sounds promising, bad pacing and weak writing ruin the experience entirely.The first half tries to set up an investigative mystery, but it quickly devolves int...
Missing Meghana is a lifeless crime mystery that fails to deliver even basic suspense. While the premise of a missing girl and a police hunt sounds promising, bad pacing and weak writing ruin the experience entirely.
The first half tries to set up an investigative mystery, but it quickly devolves into a sluggish narrative filled with plot holes and outdated romantic subplots that feel straight out of a decade-old short film. Ammu Abhirami tries her best, but flat character writing gives her very little to work with.
The twist in the second half is easily predictable miles away, leaving zero impact or payoff.
overall A complete waste of time. Skip this and save your weekend for something better.
Average
Missing Meghana movie Review
weekend kada bore kodutundani.. edo ala Missing Meghana chusi vacha. Honestly, naakaithe idi oka average thriller gane anipinchindi!Story oka girl disappearance & police investigation chutte tirugutundi. First half matram chala gripping ga, tight suspense tho nadustundi. Ammu Abhirami acting and...
weekend kada bore kodutundani.. edo ala Missing Meghana chusi vacha. Honestly, naakaithe idi oka average thriller gane anipinchindi!
Story oka girl disappearance & police investigation chutte tirugutundi. First half matram chala gripping ga, tight suspense tho nadustundi. Ammu Abhirami acting and background score scene-by-scene mood ni super ga carry chesay!
Second half lo koncham lag undhi, love scenes and dialogue presentation koncham outdated ga anipistay. But still, main investigation track and mystery element movie ni save chesay.
Average
Missing Meghana movie review
just now అమ్ము అభిరామి లీడ్ రోల్ లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' చూశాను. నాకైతే ఇదొక డీసెంట్ యావరేజ్ వాచ్ అనిపించింది! ఓ గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా గ్రిప్పింగ్ గా, పక్కా సస్పెన్స్ తో నడిచాయి. అమ్ము అభిరామి యాక్టింగ్ అండ్ BGM థ్రిల్ ని బాగా క్యారీ చేశాయి.సె...
just now అమ్ము అభిరామి లీడ్ రోల్ లో వచ్చిన 'మిస్సింగ్ మేఘన' చూశాను. నాకైతే ఇదొక డీసెంట్ యావరేజ్ వాచ్ అనిపించింది!
ఓ గర్ల్ మిస్సింగ్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా గ్రిప్పింగ్ గా, పక్కా సస్పెన్స్ తో నడిచాయి. అమ్ము అభిరామి యాక్టింగ్ అండ్ BGM థ్రిల్ ని బాగా క్యారీ చేశాయి.
సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉన్నా, కొన్ని లాజిక్స్ మిస్ అయినా... ఓవరాల్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ సినిమాని little bit నిలబెట్టింది. may be థ్రిల్లర్ లవర్స్ కి ఇది గుడ్ వీకెండ్ ఆప్షన్ ! నార్మల్ ఆడియన్స్ కి ఎక్కడం కష్టమే.
overall my rating : 2.5 / 5
About This Movie
Story :
కథ విషయానికి వస్తే.. వైజాగ్ లో ఓ బేకరి నడిపే మేఘన (అమ్ము అభిరామి) అనుకోకుండా అదృశ్యం అవుతుంది. దీంతో తండ్రి (గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ అర్జున్ (కౌశిక్) స్పెషల్ గా డీల్ చేస్తానని రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో మేఘనని చివరిసారిగా డ్రాప్ చేసిన బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్) మేఘన మిస్ అవడానికి కారణం అని తెలుస్తుంది. మరి అర్జున్ మేఘనను కనిపెట్టారా? అసలు మేఘన నిజంగా కిడ్నప్ అయిందా? ఈ కేసులో ఉన్న క్రైమ్ నెట్ వర్క్ ని అర్జున్ ఎలా ఛేదించాడు. చివరికి మేఘనను కాపాడారా లేదా అని సినిమా చూసి తెలుసుకోవాలి.
Plus Points :
టాలీవుడ్ మాత్రమే కాకుండా ఏ భాషలోనైనా కిడ్నాప్ డ్రామాలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు విడుదలైన ఈ మిస్సింగ్ మేఘన సినిమా కూడా అలాంటి కథాంశంతోనే తెరకెక్కింది. ఇక ఈ సినిమా కథ సింపుల్ గానే ఉన్నా, మూవీలో స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసాడు. ఇంటర్వెల్ కొచ్చేసరికి మంచి క్యూరియాసిటీతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెంచాడు. ఇక మూవీలో మెయిన్ లీడ్ లో నటించిన అమ్ము అభిరామి తన రోల్ లో బాగా నటించింది. అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కౌశిక్, హీరోయిన్ ఫ్రెండ్ గా అంకిత్ కొయ్య బాగా నటించారు. అలాగే గోపరాజు రమణ, రామ్ కార్తీక్ తదితరులు వాళ్ళ రోల్స్ పరిధిమేరకు నటించారు.
Minus Points :
అయితే ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తెరకెక్కించినపుడు దాన్ని ఎంత బాగా తీసాం అని కాదు, ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయింది అన్న మ్యాటరే లెక్కలోకి వస్తుంది. ఆ విషయంలో ఈ సినిమా మేకర్స్ ఫెయిల్ అయ్యారు. రాసుకున్నదే చిన్న కథంటే ఆ కథని గాలికొదిలేసి సినిమాలో అనవసరమైన సీన్స్ క్రియేట్ చేసి టైమ్ వేస్ట్ చేసారు. దాంతో ఆడియన్స్ కి ల్యాగ్ ఫీల్ రావడమే కాకుండా విసుగెత్తిపోయింది. అసలు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో మెయిన్ గా ట్విస్ట్ లు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ లనే ఇష్టపడతారు ఆడియన్స్. కానీ ఈ సినిమాలో ఆడియన్స్ అదే మిస్ అయ్యారు.
సరైన స్క్రీన్ ప్లే రాసుకోలేక దర్శకుడు తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ ని బాగానే హ్యాండిల్ చేసాడు గాని, సెకండ్ హాఫ్ ని పూర్తిగా మిస్ చేసాడు. కనీసం క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్ చూపించినా కొంత సాటిస్ఫై అయ్యేవారు. పైగా క్వాలిటీ లెస్ సీన్స్ తో స్క్రీన్ పై కూడా చూడాలని అనిపించలేదు. షార్ట్స్ ఫిల్మ్స్ కంటెంటే దీని కన్నా బెటర్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. పైగా కొన్ని లాజిక్ లెస్ సీన్లు కూడా బోర్ కొట్టించాయి. మేకర్స్ కి సస్పెన్స్ ని మెయింటైన్ చేయడం కూడా కష్టమైపోయింది. ఓవరాల్ గా పదేళ్ల కిందట రావాల్సిన సినిమా ఇప్పుడొచ్చినట్టయింది.
Technical Values :
ఇక టెక్నికల్ పరంగా చూస్తే... ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. కానీ మరింత ఖర్చు పెట్టి, ఇంకా టైం తీసుకుంటే మూవీ క్వాలిటీ పరంగా ఇంకా బాగా వచ్చి ఉండేదేమో. ఇక డైరెక్టర్ వాచస్పతి జొన్నలగడ్డ అనుకున్న స్టోరీ పాయింట్ పేపర్ పై రాసుకున్నపుడు బాగానే ఉన్నా, స్క్రీన్ పై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని పూర్తిగా పక్కనపెట్టేశారు. ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం అంత ఇంప్రెసివ్ గా లేదు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ వర్క్ మాత్రం చాలా ఉంది. అనవసరమైన ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. సాంగ్స్ తో సహా 20 నిముషాలు సినిమాని ట్రిమ్ చేసి ఉంటే బెటర్ రిసల్ట్ వచ్చి ఉండేదేమో.
Final Review :
ఓవరాల్ గా "మిస్సింగ్ మేఘన" ఒక రెగ్యులర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా బోరింగ్ డ్రామాగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మూవీలో సరైన కథనం లేకపోవడం వల్ల, సాగదీత సీన్స్ వల్ల, ఊహాజనిత క్లైమాక్స్ వల్ల ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోయింది. ఫైనల్ గా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు.