Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన బ్యాండ్‌మేళం మూవీ టాక్ పరంగా పెద్దగా కొత్తదనం చూపించలేదు. రొటీన్ కథ, ఊహించదగ్గ సన్నివేశాలతో ముందుకు సాగిపోయింది. కామెడీ ట్రాక్ ఓకే అనిపించినా… ఎక్కువ భాగం బలవంతంగా నెట్టినట్టే ఫీల్ ఇస్తుంది. హర్ష రోషన్, శ్రీదేవి జంట మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా… హీరో-హీరోయిన్ ఫీల్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ దగ్గర ఎమోషనల్ టచ్ కొంత మేర మెప్పిస్తుంది. ఫ్యామిలీ సీన్స్ కూడా అప్పుడప్పుడు ఓకే అనిపిస్తాయి.
అయితే సెకండాఫ్‌లో డ్రామా డోస్ ఎక్కువైపోయింది. కామెడీ, ఎమోషన్ రెండూ ఓవర్‌గా అనిపించడం మైనస్. చాలా సన్నివేశాలు సహజంగా కాకుండా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా బలవంతపు కామెడీ ట్రాక్స్ అసహనం కలిగిస్తాయి. మ్యూజిక్ పరంగా చివర్లో ట్రెండింగ్ సాంగ్ వాడిన విధానం కూడా సంతృప్తి ఇవ్వదు. సౌండ్ డిజైన్ కొన్ని చోట్ల లౌడ్‌గా అనిపిస్తుంది. నటీనటుల యాక్టింగ్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఓవర్‌గా కనిపిస్తుంది. ఓవరాల్ గా బలం లేని కథా, కథనాల వల్ల రెండు గంటల సినిమా కూడా నాలుగు గంటల సినిమాల పరమ బోరింగ్ అనిపించింది.
ఈ వారం థియేటర్లలో విడుదలైన "బ్యాండ్‌మేళం" మూవీ టాక్ పరంగా రొటీన్ టాక్ తెచ్చుకోగా, కామెడీ పరంగా పర్లేదనిపించుకుంది. హర్ష రోషన్, శ్రీదేవి జంట కెమిస్ట్రీ బాగున్నా, హీరోహీరోయిన్ల ఫీల్ రాదు. క్లైమాక్స్ లో వీరి లవ్ ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. ఫ్యామిలీ సీన్లు ఫర్వాలేదనిపించాయి. కానీ కామెడీ డ్రామా ఓవర్ గా అనిపిస్తుంది. చాలా వరకు అసహజంగా అనిపిస్తుంది. బలవంతపు కామెడీ ట్రాక్ లు రోత పుట్టిస్తాయి.
సెకండాఫ్ లో డ్రామా కూడా ఓవర్ గా ఉంటుంది. చాలా వరకు రొటీన్‌గా, ఊహించినట్టుగానే ఉంటూ తేలిపోయింది. క్లైమాక్స్ కూడా సేమ్. ట్రెండింగ్ లో ఉన్న పాట చివర్లో రావడం, అది అలా ఇచ్చి ఇలా పోవడం నిరాశ పరుస్తుంది. ఇక సినిమాలో ఒరిజినాలిటీ కూడా మిస్ అయ్యింది. సౌండింగ్ కూడా కొంత ఇబ్బందిగా ఉంది. లౌడ్‌గా ఉంది. ఆర్టిస్ట్ ల యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ బ్యాండ్ మేళంలో నవ్వులు తక్కువ, గోల ఎక్కువ. కోన వెంకట్ మార్క్ ఓల్డ్ ఫార్మూలా లవ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.
"బ్యాండ్‌మేళం" మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. సరిగా వాయించలేదని అనిపిస్తుంది. గట్టిగా మోగాల్సిన ఈ బ్యాండ్‌మేళం రొటీన్ మేళం అయ్యింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ & లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాల పరంగా దర్శకుడు సతీష్ జవ్వాజి నిరాశపరిచాడు. విజయ్ బుల్గానిన్ ఉన్నంతలో మ్యూజిక్ బాగానే అందించారు.
తెలంగాణ నేటివిటీకి తగ్గట్టుగా ఉండే ట్యూన్స్, మాస్ బీట్స్, రీమిక్స్ పాటలు ఆకట్టుకున్నాయి. ‘తిప్పుకుంటున్నావ్’ సాంగ్ థియేటర్స్‌లో దద్దరిల్లింది. అయితే మ్యూజిక్‌తో సీన్ లను ఎలివేట్ చేసేటంత బలమైన, భావోద్వేగమైన సీన్లు ఇందులో లేకపోవడంతో విజయ్ బుల్గానిన్ కి పెద్దగా పని పడలేదేమో అనిపిస్తుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ బావుంది. ఓవరాల్ గా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి బ్యాండ్ మేళం అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
కోర్ట్ మూవీ ఫేమ్ హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల మరో సారి స్క్రీన్ మీదకు వచ్చిన సినిమా బ్యాండ్ మేళం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ & లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనాల పరంగా దర్శకుడు సతీష్ జవ్వాజి డిస్సపాయింట్ చేసాడు. కథలో కొత్తదనం లేకపోగా, కామెడీ వరకు పర్లేదనిపించింది.
ఓవరాల్ గా చూస్తే.. ‘బ్యాండ్ మేళం’ ఎలాంటి కొత్తదనం లేని రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపల్ల తమ పాత్రల్లో బాగా నటించినా, హీరో, హీరోయిన్లలా అనిపించలేదు. ఇక విజయ్ బుల్గానిన్ సంగీతం బాగుంది. అయితే రొటీన్ స్టోరీ లైన్, ఆకట్టుకోని సెకండాఫ్ మరియు ఎమోషన్ మిస్ కావడం ఈ సినిమాకు మేజర్ డ్రాబ్యాక్స్. రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
Dhurandhar The Revenge Movie Review
By Great Andhra
ధురంధర్: ది రివెంజ్’ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ తన స్టాండ్ ను మరింత బలంగా చూపించాలనే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సీక్వెల్‌లో దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను మరింత హై నోట్‌లో ప్రెజెంట్ చేశారు. ఈ అంశాలు కొన్ని చోట్ల థియేటర్లలో విజిల్స్ తెప్పించినా, కొన్నిచోట్ల అతిశయోక్తిగా అనిపిస్తాయి.
ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. కానీ సెకండాఫ్ లో యాక్షన్, హై మూమెంట్స్ తో సినిమా ట్రాక్ లోకి వస్తుంది. క్లైమాక్స్ మాస్ ఫీలింగ్ తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇస్తుంది. అయితే నాలుగు గంటల నిడివి కారణంగా మధ్య మధ్యలో ల్యాగ్ ఫీల్ తప్పదు. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే సినిమా ప్రధానంగా హీరో చుట్టూనే తిరుగుతుంది. అతని యాక్షన్, ఎమోషనల్ సీన్స్ సినిమాను ముందుకు తీసుకెళ్తాయి. మాధవన్ తన స్టైల్‌లో కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి.
టెక్నికల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ అసెట్. యాక్షన్ సీన్స్, విజువల్స్ స్టైలిష్‌గా ఉన్నాయి. దర్శకుడు కథను లోతుగా చెప్పడం కంటే, స్టైల్, ఎలివేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే ‘ధురంధర్: ది రివెంజ్’ మాస్ ఎలిమెంట్స్, దేశభక్తి కోణంతో కూడిన కమర్షియల్ స్పై యాక్షన్ డ్రామా. ఫస్ట్ పార్ట్ నచ్చిన వారికి ఇది కూడా నచ్చే అవకాశం ఉంది. కానీ కొత్తదనం ఆశిస్తే మాత్రం మిక్స్‌డ్ ఫీలింగ్ ఇస్తుంది.
Dhurandhar The Revenge Movie Review
By One India
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన "ధురంధర్" కి సీక్వెల్ గా వచ్చిన 'ధురంధర్ ' - ది రివెంజ్ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ పార్ట్ లో 'ధురంధర్ ది రివెంజ్' స్టోరీని మొత్తం ఆరు ఛాప్టర్లుగా చూపించారు. సినిమా సెకండ్ పార్ట్ అజయ్ ఖన్నా పాత్ర చనిపోయిన తర్వాత బలోచి ల్యారీలో జరిగే సన్నివేశాలతో కథ మొదలవుతుంది. హమ్జాగా రణ్వీర్ సింగ్ పాకిస్థాన్ రాజకీయాల్లో ఎదిగిగిన తీరు, దాని కోసం వేసిన ఎత్తులు కూడా ఆడియన్స్‌కి కిక్కిస్తాయి. ముఖ్యంగా భారత్ కు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగిన పలు ముఖ్యమైన ఘటనలను కూడా ప్రస్తావించారు.
ఇవే కాకుండా నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలని స్టోరీకి లింక్ చేయడంలో కూడా ఆదిత్య టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ సీన్లన్నీ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. సెకండాఫ్‌లో కూడా మొత్తం పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులు, భారత్‌కి వ్యతిరేకంగా పనిచేసే పలువుర్ని ఏరిపారేసే సీన్లు ఇవన్నీ కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. అలానే హమ్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎలీనా (సారా అర్జున్)కి కూడా ఇందులో రెండు మూడు బలమైన సీన్లు పడ్డాయి. ఇక క్లైమాక్స్‌లో ఒక పాత్రలో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌కి మంచి థ్రిల్ ని ఇస్తుంది. ఓవరాల్‌గా ఇదొక అదిరిపోయే "దేశభక్తి ఉన్న రివెంజ్ డ్రామా".
Dhurandhar The Revenge Movie Review
By T2B Live
ధురంధర్2 గురించి చెప్పాలంటే.. ముందుగా కథ గురించే చెప్పాలి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకుల్ని థియేటర్లో కట్టిపడేస్తుందని చెప్పాలి. కథ మెయిన్ పాయింట్ విషయానికి వస్తే మొదటి పార్ట్ లో ల్యారీ బాద్ షా ని చంపినా ఇంకా శత్రువులు చాలా మంది ఉండటంతో ఒక్కొక్కరినీ ఎలా మట్టుపెట్టాలి అని ఎదురు చూసే హీరో ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొదలవుతుంది. తన ఫ్లాష్ బ్యాక్ తర్వాత ప్రజెంట్ టైంలో, ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో ఎలా ఎదిగాడు, తన నిజం గురించి అందరికీ తెలిసే టైంకి తను చేయాలి అనుకున్నది చేశాడా లేదా అనేది స్టోరీ.
క ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హైని ఏమాత్రం తగ్గించకుండా స్టార్ట్ అయిన ధురంధర్2 ప్రతి సీన్ ని కథలో లోతుగా చూపిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తాడు. ల్యాగ్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఆసక్తిని మరింతగా పెంచేస్తూ దావూద్ ఇబ్రహీంని సీన్ లోకి తీసుకు రావడం అలాగే ఫస్ట్ పార్ట్ మొదట్లో ఫ్లైట్ హైజాక్ చేసిన పాకిస్తాన్ విలన్ ని చూపించడం తో మళ్ళీ ఆసక్తి పెంచుతారు. ఓవరాల్ గా మూవీ లెంగ్త్ ఎక్కువైనా అదిరిపోయే డ్రామా సీన్స్ తో ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతుంది. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఇది కదా సినిమా అంటే అన్న ఫీలింగ్ తో రావడం మాత్రం ఖాయం.
Dhurandhar The Revenge Movie Review
ధురంధర్’పై వచ్చిన ప్రాపగాండ విమర్శలను పక్కన పెట్టి, ఈ సీక్వెల్ ధురంధర్2 లో దర్శకుడు ఆదిత్య ధర్ మరింత బలంగా తన కథను ఆడియన్స్ కు చెప్పాడు. దేశ భద్రత, టెర్రరిజం, డీమోనిటైజేషన్ వంటి అంశాలను కలిపి రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. ఈ సన్నివేశాలు థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాయనడంలో ఆశ్చర్యం లేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లో గా ఉన్నా… సెకండాఫ్ నుంచి సినిమా పికప్ అవుతుంది. క్లైమాక్స్ మాస్ గా, ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంటుంది . అయితే నిడివి ఎక్కువగా ఉండటం, కొన్నిచోట్ల వైలెన్స్ ఎక్కువ కావడం మైనస్ అయింది.
పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా ఎక్కువగా రణవీర్ సింగ్ మీదే నడుస్తుంది. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా బాగా ఆకట్టుకుంది. ఇక మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో బాగా నిలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి. అలాగే దేశభక్తి, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సాలిడ్ ఎంటర్టైనర్ గా ధురంధర్ అలరిస్తుంది. ఇక సినిమాలో చూపించే కొన్ని నిజ జీవిత సంఘటనల సన్నివేశాలు ఆడియన్స్ కి కథలోకి మరింత ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి.
Dhurandhar The Revenge Movie Review
By ABP Desam
ధురంధర్ 2 సినిమా మొదలవుతూనే కథ ఇండియా బ్యాక్‌డ్రాప్ లో జస్కరిత్ సింగ్ కథతో స్టార్ట్ కావడం సినిమాకు కొత్త ఫీల్ ఇస్తుంది. కానీ పాకిస్తాన్ ట్రాక్‌లోకి వెళ్లిన తర్వాత గ్యాంగ్ వార్, రెగ్యులర్ స్పై థ్రిల్లర్ టోన్‌లో సాగుతుంది. అయినా యాక్షన్ బ్లాక్స్, నటీనటుల అదిరిపోయే పెర్ఫార్మెన్స్ వల్ల ధురంధర్ సినిమా బోర్ కొట్టదు.
రణ్‌వీర్ సింగ్ డ్యూయల్ షేడ్స్ లో అద్భుతంగా నటించి ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాడు. మాధవన్ డీసెంట్ ఎలివేషన్స్ తో తన రోల్ తో మెప్పించగా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సారా అర్జున్‌కు స్కోప్ తక్కువైనా, ఎమోషనల్ సీన్స్‌లో బాగుంది.
అయితే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. యాక్షన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే బలంగా ఉండటంతో నాలుగు గంటల నిడివి ఉన్నా సినిమా చాలా ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ నచ్చితే ఇది కూడా తప్పకుండా నచ్చుతుంది.
Dhurandhar The Revenge Movie Review
‘ధురంధర్’ సక్సెస్ తర్వాత వచ్చిన ‘ధురంధర్ 2’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఆ అంచనాలను పూర్తిగా మించకపోయినా, మొదటి పార్ట్ స్థాయిని మాత్రం మెయింటైన్ చేసింది.
మొదటి అరగంట రేసీగా సాగుతూ యాక్షన్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. హీరో బ్యాక్‌స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఏజెంట్‌గా మారే ట్రాక్ బాగా వర్క్ అవుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, నోట్ల రద్దు ట్విస్ట్ హైలైట్స్.
పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో హీరో ఎదుగుదల, టెర్రరిస్ట్ ట్రాక్ బాగున్నా… ఈ మధ్యలో సినిమా కాస్త స్లో అవుతుంది. సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, హై మూమెంట్స్ ఉన్నా… నేరేషన్ మళ్లీ డ్రాప్ అవుతుంది.
క్లైమాక్స్, ఎమోషనల్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. డైలాగ్స్ దేశభక్తి ఫీల్‌ను బాగా ఎలివేట్ చేస్తాయి. పెర్ఫార్మెన్స్ పరంగా హీరో హైలైట్ కాగా, సంజయ్ దత్, మాధవన్ పాత్రలు కూడా బాగా నిలిచాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుంది. మొత్తానికి
హై మూమెంట్స్, యాక్షన్ కోసం మాత్రమే కాదు.. అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాగా ధురంధర్ అలరిస్తుంది.
Dhurandhar The Revenge Movie Review
By Tupaki
రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్-2’ మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. శశ్వత్ సచ్ దేవ్ తన నేపథ్య సంగీతంతో ‘దురంధర్’కు మంచి ఊపు తీసుకొచ్చాడు. సినిమా మంచి ఫ్లోతో సాగేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. వికాస్ నౌలాఖా ఛాయాగ్రహణం కూడా అదిరిపోయింది. కెమెరా యాంగిల్స్.. టేకింగ్.. కలర్ థీమ్స్.. మొత్తంగా విజువల్స్ కట్టిపడేస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ గొప్పగా అనిపిస్తుంది. నిజంగా పాకిస్థాన్లోనే ఉన్న భావన కలిగేలా ల్యారీ సిటీని క్రియేట్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ఎంత కొనియాడినా తక్కువే. ఎంతో సమాచారం సేకరించి.. దాని చుట్టూ కథాకథనాలు అల్లిన తీరు.. తెర మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. తన టేకింగ్ గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారనడంలో.. ‘దురంధర్’తో దర్శకుడిగా అతను చాలా ఏళ్లు గుర్తుండిపోతాడనడంలో.. ఈ చిత్ర ప్రభావం ఇండియన్ సినిమా మీద చాలా కాలం ఉంటుందనడంలో సందేహం లేదు.
Dhurandhar The Revenge Movie Review
ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ ది రివెంజ్ ఆడియన్స్ నుండి యానానిమస్ గా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ పరంగా అందర్నీ పూర్తిగా డామినేట్ చేశాడు. మొదటి సీన్ నుంచి చివరి వరకు హమ్జా పాత్రలో వన్ మ్యాన్ షో చూపిస్తూ ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. యాక్షన్ లో ఎంత క్రూరంగా కనిపించాడో, ఎమోషనల్ సీన్స్‌లో అంతగా కంటతడి పెట్టించాడు.
మాధవన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కూల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. అలాగే నిర్మాణ విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. రెండో పార్ట్ లెంగ్త్ కాస్త ఎక్కువ ఉన్నా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు ఆ రేంజ్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు. ఇక టెక్నికల్ గా ఎడిటింగ్, కెమెరా వర్క్ అన్ని బాగా కుదిరాయి. ఓవరాల్ గా ధురంధర్ ది రివెంజ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టడం ఖాయమనిపిస్తుంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers