Register as a Reviewer
ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)

ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)

04 Sep 2026
Overall Rating
5.9/10
7 Reviews

Dharmasthala Niyojakavargam : ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల్లో "ధర్మస్థల నియోజకవర్గం" కూడా ఒకటి. రూరల్ బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సాయికుమార్, సుమన్, వితికా షెరు ప్రధాన పాత్రల్లో నటించగా, జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 4న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Jai Jnana Prabha Thota
Cast: Suman, Sai Kumar, Natarajh, Rayancha, Vithika Sheru, Rajeev Kanakala, Kasthuri Shankar, Shiva Kumar, Harika, Anjali

Available in:

Reviews

What critics and the public are saying about ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)

Media Reviews

5 Avg: 6.2/10
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Dharmasthala Niyojakavargam movie Review

ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదుర...

ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదురించారు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే డ్రగ్స్ తో యువత ఎలా పాడైపోతుంది అనే మెసేజ్ ని, ఓటు హక్కు మెసేజ్ ని చూపించారు. 


అయితే ఫస్ట్ హాఫ్ ని రొటీన్ ఫైట్స్, సాంగ్స్ తో సాగదీసినా సెకండ్ హాఫ్ సీన్స్ పరిగెడతాయి. అయితే రాజకీయ నాయకులపై సామాన్యులు పోటీకి నిలబడి గెలిచినా సినిమాలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే కొన్ని మెసేజ్ లు ఇస్తూ పొలిటికల్ యాక్షన్ గా తెరకెక్కించారు. ఇక సినిమాలో సాయికుమార్, సుమన్ తో పాటు, వరుణ్ సందేశ్, వితిక షేరు కూడా బాగా నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ యూత్ కి, జనాలకు మెసేజ్ ఇస్తూ సాగిన పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.


Sep 04, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Dharmasthala Niyojakavargam Movie Review

సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. పైగా ఇది కే...

సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. పైగా ఇది కేవలం ఒక ఊరికి సంబంధించిన కథ కాదు, నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిన సామాజిక అంశాలు ఈ సినిమాలో డిస్కస్ చేసాడు దర్శకుడు ప్రభ. 


అలాగే ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్‌గా, ఒక అద్భుతమైన సామాజిక ప్రయోజనంతో ఒక మంచి ప్రయత్నమే చేసారు. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ తమ అద్భుత నటనతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చారు. అలాగే వితిక షేరు కి కూడా మంచి రోల్ పడింది. ఇక మొదటి చిత్రంతోనే ఇంతటి బరువైన కథాంశాన్ని ఎంచుకోవడం దర్శకుడు జై చేసిన సాహసమే. తను ఎంచుకున్న రెండు ప్రధాన సమస్యలకు సరైన ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసాడు. తొలి ప్రయత్నంలోనే చాలా మంది సీనియర్స్‌ను హ్యాండిల్ చేసారు. ఓవరాల్‌ గా ధర్మస్థల నియోజకవర్గం.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్..!

Sep 04, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Dharmasthala Niyojakavargam Movie Review

సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. డ్రగ్స్ మాఫియా, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయికుమార్ విలనిజం, డైలాగ్స...

సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. 


డ్రగ్స్ మాఫియా, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయికుమార్ విలనిజం, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అండ్ చాలా రోజుల తర్వాత సుమన్ కి కూడా స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ కీ రోల్ లో నటించిన వితికా షేరుకి కూడా మంచి రోల్ వచ్చింది. 


అయితే, నెమ్మదించిన కథనం, పాత సీన్లు నిరాశపరుస్తాయి. మంచి మెసేజ్ ఉన్నా స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉండటంతో సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఒక్కసారి చూసేలా ఉంది. 

Sep 05, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

Dharmasthala Niyojakavargam movie review

దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు రాసుకొన్న పొలిటికల్, క్రైమ్ డ్రామా పాయింట్ బాగుంది. అలాగే స్టోరి పాయింట్‌ కు తగినట్టుగా కొన్ని బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నం కూడా బాగుంది. కాకపోతే రెగ్యులర్ సీన్లు, రొటీన్ ఫార్మాట్ ఎంచుకోకుండా ఉండాల్సిందన ఫీలింగ్ కలుగ...

దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు రాసుకొన్న పొలిటికల్, క్రైమ్ డ్రామా పాయింట్ బాగుంది. అలాగే స్టోరి పాయింట్‌ కు తగినట్టుగా కొన్ని బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నం కూడా బాగుంది. కాకపోతే రెగ్యులర్ సీన్లు, రొటీన్ ఫార్మాట్ ఎంచుకోకుండా ఉండాల్సిందన ఫీలింగ్ కలుగుతుంది. 


ఇక డైరెక్టర్ నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం కూడా బాగుంది. సాయికుమార్, సుమన్ అలాగే వితికా షేరు లకు మంచి స్ట్రాంగ్ రోల్స్ పడ్డాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.


దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట ఎక్కడా డివియేట్ కాకుండా తను చెప్పాలనుకున్న కథను మెసేజ్ రూపంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. డెబ్యూ దర్శకుడే అయినా... పొలిటికల్ యాక్షన్ డ్రామాను చాలా ఎంగేజింగా తీశారు. రచయిత చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. కాకపోతే ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను ఈ వారం సరదాగా చూసేయండి.


Sep 04, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

Dharmasthala Niyojakavargam Movie Review

ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam)..అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ టైటిల్ పరంగా బాగానే ఉన్నా, సినిమాలో మాత్రం అంత విషయం లేనట్టు అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచయిత చంద్రబోస్ ‘రంగస్థలం’ తర్వాత అంతటి సంతృప్తిని ఇచ్చిన చిత్రమిదని ఆయన చెప్పడంతో.. నార్మల్‌గానే సినిమాపై క...

ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam)..అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ టైటిల్ పరంగా బాగానే ఉన్నా, సినిమాలో మాత్రం అంత విషయం లేనట్టు అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచయిత చంద్రబోస్ ‘రంగస్థలం’ తర్వాత అంతటి సంతృప్తిని ఇచ్చిన చిత్రమిదని ఆయన చెప్పడంతో.. నార్మల్‌గానే సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కానీ సినిమాలో మాత్రం అంత స్టఫ్ కనిపించలేదు.

 

అయితే సినిమాలో బైర్రాజుగా సాయికుమార్ ని చూపించిన తీరు బాగుంది. అలాగే మాదకద్రవ్యాల బిజినెస్‌తో కాలేజీ స్టూడెంట్స్ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనేది చూపించి, బర్నింగ్ టాపిక్‌ ని దర్శకుడు టచ్ చేశాడు. కానీ, తొలి చిత్రం కావడంతో అనుభవలేమీ.. హిట్‌ కు అడుగడుగునా అడ్డుపడిందనే చెప్పాలి. సాయి కుమార్ ని విలన్‌ గా చూపించాలంటే ‘ప్రస్థానం’ చిత్రాన్ని బీట్ చేసేలా పాత్ర ఉండాలి. కానీ సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారి డైలాగ్స్ చెప్పించడంపైనే దృష్టి పెట్టారు. కానీ ఆ పాత్ర స్వభావాన్ని ఎలివేట్ చేయలేకపోయారు. 


పైగా ఈ కాన్సెప్ట్స్‌తో చాలా సినిమాలు వచ్చాయి. వాటిని అందుకునే రేంజ్ మాత్రం సినిమాలో లేదు. అయితే డైలాగ్స్, పాటలు మినహా.. ఈ సినిమాలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం రొటీన్‌గానే సాగింది.

Sep 04, 2026 Read Review

Public Reviews

2 Avg: 5.0/10
G
Goshika Shreshta CA/Advocate
5

Average

Dharmasthala Niyojakavargam movie review

వారమంతా వర్క్ ప్రెజర్ తర్వాత కాస్త మైండ్ రిలీఫ్ కోసం సినిమాకెళ్తే, అక్కడ స్లో నెరేషన్ మన ఓపికకి పరీక్ష పెడుతుంది. అసలు ధర్మస్థల నియోజకవర్గం మూవీకి డైరెక్టర్ ఎంచుకున్న 'సోషల్ మెసేజ్ + పొలిటికల్ డ్రామా' ఐడియా పర్ఫెక్ట్. మూవీలో సాయికుమార్, సుమన్ గారి పెర్ఫార్మన్స్ వల్ల సినిమా అక్కడక్కడా హోల్డ్ అవు...

వారమంతా వర్క్ ప్రెజర్ తర్వాత కాస్త మైండ్ రిలీఫ్ కోసం సినిమాకెళ్తే, అక్కడ స్లో నెరేషన్ మన ఓపికకి పరీక్ష పెడుతుంది. అసలు ధర్మస్థల నియోజకవర్గం మూవీకి డైరెక్టర్ ఎంచుకున్న 'సోషల్ మెసేజ్ + పొలిటికల్ డ్రామా' ఐడియా పర్ఫెక్ట్. 


మూవీలో సాయికుమార్, సుమన్ గారి పెర్ఫార్మన్స్ వల్ల సినిమా అక్కడక్కడా హోల్డ్ అవుతుంది. కానీ సెకండాఫ్ లో సాగదీత సీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎంగేజ్‌మెంట్ దెబ్బతింది. టైమ్ వాల్యూ బేస్ చేసుకుంటే థియేటర్ కి వెళ్లేంత వర్త్ లేదు. నాకైతే మిక్స్డ్ ఫీల్ వచ్చింది. ఎవరైనా చూడాలనుకుంటే.. వీకెండ్ బింజ్ వాచ్ కోసం OTT రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు.

Sep 09, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Dharmasthala Niyojakavargam movie review

కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో డ్రగ్స్ మాఫియా అనగానే ధర్మస్థల నియోజకవర్గం స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టే. వితికా షెరు లెక్చరర్‌గా, స్టూడెంట్ బద్రి (నటరాజ్) చేసిన ఫైట్ బాగుంది. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే.. మేకింగ్ అంతా చాలా ఓల్డ్ స్కూల్‌లా ఉంది.మన ఇప్పటీ జనరేషన్ స్పీడ్‌ కి ఈ స్క్రీన్‌ ప్లే మ్యాచ్...

కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌ లో డ్రగ్స్ మాఫియా అనగానే ధర్మస్థల నియోజకవర్గం స్టూడెంట్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టే.


వితికా షెరు లెక్చరర్‌గా, స్టూడెంట్ బద్రి (నటరాజ్) చేసిన ఫైట్ బాగుంది. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే.. మేకింగ్ అంతా చాలా ఓల్డ్ స్కూల్‌లా ఉంది.


మన ఇప్పటీ జనరేషన్ స్పీడ్‌ కి ఈ స్క్రీన్‌ ప్లే మ్యాచ్ అవ్వలేదు. సాయికుమార్ సార్ విలన్‌గా డైలాగ్స్ తో రచ్చ లేపారు కానీ, ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఇంకా స్ట్రాంగ్‌ గా ఉంటే బాగుండేది.


ovarall : గ్యాప్ దొరికినప్పుడు విత్ ఫ్రెండ్స్ క్యాజువల్ ఓటిటి వాచ్.. అంతే!


Sep 09, 2026

About This Movie

Story :

"ధర్మస్థల నియోజకవర్గం"లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే బైర్రాజు (సాయికుమార్) తన పవర్ తో ఆ ఊరిని శాసిస్తుంటాడు. అయితే అదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజీ యజమాన్యం వాసుదేవ్ (రాజీవ్ కనకాల), అతని భార్య (కస్తూరి) బిజినెస్ కోసం పక్కదార్లు తొక్కి వారి కాలేజీలోనే డ్రగ్స్ దందాని ప్రోత్సహిస్తున్నారు. అయితే తను లెక్చరర్‌ గా పని చేస్తున్న కాలేజ్ లో యాజమాన్యమే స్టూడెంట్స్ జీవితాన్ని నాశనం చేస్తున్నారని తెలిసి, ఆ కాలేజ్ లెక్చరర్ అరుంధతి (వితికా షేరు) వారికి వ్యతిరేకంగా, తన స్టూడెంట్స్ బద్రి (నటరాజ్), ఈషా (రాయంచ కొక్కుర) యొక్క సపోర్ట్‌ తో పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. కానీ అక్కడ ఏ సపోర్ట్ దొరకదు. అలాగే ఎమ్మెల్యే బైర్రాజు దృష్టికి తీసుకెళ్లినా పని జరగదు. అయితే వాళ్ళ కాలేజ్ యాజమాన్యానికి ఎమ్మెల్యే బైర్రాజు సపోర్ట్ ఉండడంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అరుంధతికి సపోర్ట్ చేసిన స్టూడెంట్ బద్రిని ఎమ్మెల్యే అనుచరులు హత్య చేస్తారు. ఈ క్రమంలో బద్రి చావుకు అతని తండ్రి టీ కొట్టు నడుపుకునే ఈశ్వరయ్య (సుమన్) న్యాయం కోసం పాలిటిక్స్ లోకి వస్తాడు. మరి ధర్మస్థల నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే బైర్రాజు ఇంకా ఆ కాలేజీ యాజమాన్యం అక్రమాలకు ఈశ్వరయ్య ఎలా అడ్డుకట్ట వేసాడు? అరుంధతి తన పోరాటంలో విజయం సాధించిందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Plus points : 

"ధర్మస్థల నియోజకవర్గం" సినిమాకి డైరెక్టర్ జ్ఞాన ప్రభ రాసుకున్న కథే పెద్ద ప్లస్ అనుకోవాలి. చూడ్డానికి రొటీన్ గా  అనిపించినా, ఈ జెనరేషన్ కి సంబంధించి మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ లైన్ ఉంది. అలాగే కథకు తగ్గట్టు స్ట్రాంగ్ గ్రిప్పింగ్ సీన్స్ ని రాసుకోవడం బాగుంది.  ఇక డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఇంతకు ముందు స్టార్ హీరోస్ కమర్షియల్ మూవీస్ లోనే ఎక్కువ చూసారు. కానీ ఈ మూవీలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో దాన్ని చూపించడం బాగుంది. ఇక డైరెక్టర్ నటీనటుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ ని కూడా రాబట్టుకొన్నాడు. 

 

ముఖ్యంగా సాయికుమార్ ఈ సినిమాలో ఒక అవినీతి రాజకీయ నేతగా మరోసారి విలక్షణ నటన కనబరిచారు. ఆయన చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్‌ ప్రస్థానం సినిమాని గుర్తుచేశాయి. ఇక మరో నెగిటివ్ పాత్రల్లో నటించిన రాజీవ్ కనకాల, కస్తూరి కూడా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో నటించిన సుమన్ ఈ సినిమాలో మంచి రోల్ చేయగా, ఆయన రోల్ స్ట్రాంగ్ గా సినిమాకి ప్లస్ అయింది. ఇక నటరాజ్, రాయంచ, వితిక షేరు వాళ్ళ పాత్రల పరిధిమేరకు నటించారు. డైరెక్టర్ జై ఙ్ఞాన ప్రభ తోట తన కథ ద్వారా ఏం చెప్పాలనుకొన్నాడో తన పాయింట్ అఫ్ వ్యూ లో బాగా చూపించాడు. 

 

Minus points : 

డైరెక్టర్ జ్ఞానప్రభకి ఇది మొదటి సినిమా అయినా చక్కగా హ్యాండిల్ చేసారు. అయితే మంచి స్టోరీ లైన్ ని తీసుకున్నా అదే స్థాయిలో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. అంటే చాలా సీన్లు ఆడియన్స్ కి ఎంగేజ్ చేసేలా ఉన్నా, ఎక్కడో మరి మూవీలో చూసినట్టే అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లలో సాగదీత ఎక్కువైంది. అందువల్ల ఆడియన్స్ కి బోరింగ్ ఫీల్ వస్తుంది. ఇక సుమన్, నటరాజ్ కి తండ్రీకొడుకులుగా బలమైన భావోద్వేగ సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా వాడుకోలేదు. అలాగే కస్తూరి, రాజీవ్ కనకాల పాత్రలు నీరసంగా ఉన్నాయి. ఉన్నంతలో వితికా, వరుణ్ సందేశ్, హీరోయిన్ రాయంచ పాత్రలు పర్లేదు. మొత్తంగా అయితే.. మూవీలో కొత్తదనం అంటూ ఏమీ కనిపించలేదు. 

 

Technical Values : 

టెక్నికల్ పరంగా మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ ఏలేందర్ అందించిన సంగీతం బాగుంది. రచయిత చంద్రబోస్ రాసిన పాటలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఇక సాయిబాబు ఎడిటింగ్ వర్క్ పర్లేదు.. కొన్ని సాగదీత సీన్లను ట్రిమ్ చేయాల్సింది.  ఇక డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ దర్శకుడిగా తొలి చిత్రంతోనే తన ప్రతిభ చాటుకునే ప్రయత్నం చేసాడు. కాకపోతే కథలో పాత్రల ఎంపిక కి సంబంధించి బలమైన సీన్లు రాసుకోలేకపోయాడు. 

 

Final Review : 

ఓవరాల్ గా ధర్మస్థల నియోజకవర్గం అంటూ వచ్చిన ఈ రూరల్  పొలిటికల్ డ్రామా ఓ వర్గం ఆడియన్స్ ని మెప్పించేలానే ఉంది. దర్శకుడు జ్ఞానప్రభ తోట డెబ్యూ మూవీతోనే ఆకట్టుకొనే ప్రయత్నం చేయగా, కథ దానికి తగ్గ బలమైన కథనం తోడయ్యుంటే సినిమా మరో ప్రస్థానం లాంటి మూవీ అయ్యేది. అలాగే నటీనటులకు బలమైన సీన్లు కూడా పడాల్సింది. అయితే ఓ మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్న దర్శకుడి ప్రయత్నం కోసం, సాయికుమార్, సుమన్ వంటి దిగ్గజాల పెర్ఫార్మన్స్ కోసం మూవీని ఓసారి ట్రై చేయొచ్చు. రెగ్యులర్ మూవీ లవర్స్ తక్కువ అంచనాలతో ఈ సినిమాని ఓసారి ట్రై చేసేలా ఉంది. 

Review Statistics

5.9
Overall Rating
Avg. of all reviews
7
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
6.2/10
Public
5.0/10
Why MRO?