Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

1045
Total Reviews
71
Movies Reviewed
24
Reviewer Categories
Active filters:
Showing 697-708 of 1045 reviews
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్కడుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సినిమా చూసిన తర్వాత కూడా అదే డౌట్ క్లియర్ అవదు. స్టోరీ అనేది కొత్తదేమీ కాదు… పాత టెంప్లేట్‌ని మళ్లీ రీపీట్ చేసినట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడటం అంటే… ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసినది ఒకటి, స్క్రీన్ మీద వచ్చినది ఇంకొకటి. మొదట్లో మాస్ ఎలివేషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తుంది… కానీ కొద్దిసేపటికి అసలు కథ ఎక్కడుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సినిమా చూసిన తర్వాత కూడా అదే డౌట్ క్లియర్ అవదు. స్టోరీ అనేది కొత్తదేమీ కాదు… పాత టెంప్లేట్‌ని మళ్లీ రీపీట్ చేసినట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం టాప్. కానీ డైరెక్టర్ ఆ ఎనర్జీని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయాడు. ఒక్కోసారి మంచి సీన్ వస్తుంది… వెంటనే రెండు వీక్ సీన్స్ వచ్చి ఫ్లోని బ్రేక్ చేస్తాయి. విలన్ ట్రాక్ అసలు థ్రెట్ ఫీల్ ఇవ్వదు. కామెడీ కూడా పెద్దగా వర్క్ కాలేదు. మ్యూజిక్, BGM—లౌడ్‌గా ఉంటుంది కానీ ఇంపాక్ట్ మాత్రం జీరో. ఫస్టాఫ్ డ్రాగ్, సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్ ఉన్నా… మొత్తం సినిమాను సేవ్ చేయడానికి సరిపోవు. ఓవరాల్ గా ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సేఫ్ గేమ్… కానీ ఆడియెన్స్‌కు కొత్తగా ఏమీ ఇవ్వలేదు. ఫ్యాన్స్ వరకు ఒకసారి థియేటర్ కి వెళ్లొచ్చు... నార్మల్ ఆడియన్స్ చూడడం కష్టమే.

Mar 23, 2026 Telugu

Ustaad Bhagat Singh Movie Review

Thyview

By Thyview

5.0
out of 10
మొదటే క్లియర్ చేస్కుందాం… ఈ సినిమా ఫుల్‌గా ఫ్యాన్స్ కోసమే. జనరల్ ఆడియెన్స్‌కి అయితే కొంచెం టఫ్. స్టార్ట్‌లో మాస్ ఎలివేషన్స్ బాగానే ఉంటాయి… కానీ స్టోరీ ముందుకెళ్తుంటే “ఇది ఎక్కడో చూసినట్టుంది” అనే ఫీలింగ్ తప్పదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫుల్ ఫైర్. ఆయన ఎంట్రీలు, డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్—all good. కానీ సమస్య ఏమిటంటే… ఆ హైకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ కంటిన్యూగా రావు. మధ్యలో డ్రాప్ అ...
మొదటే క్లియర్ చేస్కుందాం… ఈ సినిమా ఫుల్‌గా ఫ్యాన్స్ కోసమే. జనరల్ ఆడియెన్స్‌కి అయితే కొంచెం టఫ్. స్టార్ట్‌లో మాస్ ఎలివేషన్స్ బాగానే ఉంటాయి… కానీ స్టోరీ ముందుకెళ్తుంటే “ఇది ఎక్కడో చూసినట్టుంది” అనే ఫీలింగ్ తప్పదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఫుల్ ఫైర్. ఆయన ఎంట్రీలు, డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్—all good. కానీ సమస్య ఏమిటంటే… ఆ హైకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ కంటిన్యూగా రావు. మధ్యలో డ్రాప్ అవుతుంది. ఫస్టాఫ్ ఎక్కువగా డ్రాగ్ అనిపిస్తుంది… సెకండాఫ్‌లో కొన్ని మాస్ మూమెంట్స్ వర్క్ అవుతాయి. కానీ మొత్తం సినిమా లిఫ్ట్ అవ్వడానికి మాత్రం సరిపోవు. విలన్ ట్రాక్ వీక్, కామెడీ కూడా మిస్ అయింది. మ్యూజిక్ పరంగా… పాటలు ఓకే కానీ BGM మాత్రం ఇంపాక్ట్ ఇవ్వలేదు. కొంచెం లౌడ్‌గా అనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యాన్స్‌కి “పవన్ కళ్యాణ్ స్వాగ్” కోసం ఓకే.. థియేటర్‌కి వెళ్లాలా అంటే… ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుని వెళ్తే బెటర్!
Mar 21, 2026 Telugu
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్టఫ్ లేదనే ఫీలింగ్ వస్తుంది. కథ చాలా రొటీన్, ఏదో పాత సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఎమోషన్ కనెక్ట్ కావడం లేదు, సీన్స్ మధ్యలో డ్రాగ్ ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎనర్జీ మాత్రం టాప్ లెవెల్ . క...

ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సూటిగా చెప్పాలంటే… ఈ సినిమా మీద ఎంత హైప్ పెట్టారో, అంత మాత్రం డెలివర్ చేయలేదు. స్టార్టింగ్ లోనే మాస్ ఎలివేషన్స్‌తో ఓ రేంజ్‌లో మొదలవుతుందనుకుంటాం కానీ… కొద్దిసేపటికే అసలు స్టఫ్ లేదనే ఫీలింగ్ వస్తుంది. కథ చాలా రొటీన్, ఏదో పాత సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఎమోషన్ కనెక్ట్ కావడం లేదు, సీన్స్ మధ్యలో డ్రాగ్ ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎనర్జీ మాత్రం టాప్ లెవెల్ . కానీ ఆ ఎనర్జీకి సరిపోయే స్ట్రాంగ్ సీన్స్ మాత్రం లేవు. కొన్ని డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ బాగున్నా… మొత్తం సినిమాను సేవ్ చేయలేవు. విలన్ ట్రాక్ పూర్తిగా వీక్. మ్యూజిక్ కూడా పెద్దగా హెల్ప్ కాలేదు… బ్యాగ్రౌండ్ స్కోర్ లౌడ్‌గా అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ లేదు. కామెడీ కూడా చాలా చోట్ల ఫ్లాట్. మొత్తానికి ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా తప్ప… జనరల్ ఆడియెన్స్‌కి మాత్రం బోర్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే డిసప్పాయింట్ అవ్వడం ఖాయం. టైమ్ పాస్ కోసం అయితే ఓకే… కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం మాత్రం థింక్ చేయాలి!

Mar 21, 2026 Telugu
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత...

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ విషయానికి వస్తే... హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ కథలో రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, గ్యాంగ్ వార్స్ మిక్స్ అవుతాయి. హీరో పవన్ కళ్యాణ్ తన స్టైల్, స్వాగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సీన్స్, డైలాగ్స్ బాగా వర్క్ అవుతాయి. అయితే కథలో భావోద్వేగాలు, సామాజిక అంశాలు ఉన్నా కూడా అవి పూర్తిగా ప్రభావం చూపలేకపోతాయి. కొన్ని సన్నివేశాలు బాగున్నా మొత్తం కథనం కొంచెం నెమ్మదిగా, ఫ్లాట్‌ గా అనిపిస్తుంది. విలన్ ట్రాక్ కూడా అంతగా స్ట్రాంగ్‌గా ఏం లేదు. హరీష్ శంకర్ తన మార్క్ లో బాగానే సినిమాని ప్రెజెంట్ చేసినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. మొత్తానికి ఇది పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినా, కొత్తదనంలేని కథా కథనాలతో ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్‌గా ఉంటుంది.

Mar 21, 2026 Telugu
5.0
out of 10
ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించారు. దర్శకుడిగా టేకింగ్ తో హరీష్ మెప్పించినా, కథకుడిగా ఫెయిల్ అయ్యాడ...
ఉగాది పచ్చడిలో అన్ని రుచులు ఉన్నట్టే కమర్షియల్ సినిమాలో కామెడీ, థ్రిల్స్, యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్, ఎమోషన్స్ కలిపి దర్శకులు కథ రెడీ చేస్తారు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా అన్ని హంగులు కలగలిపి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించారు. దర్శకుడిగా టేకింగ్ తో హరీష్ మెప్పించినా, కథకుడిగా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. థమన్ బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. దేవిశ్రీ సాంగ్స్ కూడా అంతగా ఏం లేవు. కానీ హరీష్ శంకర్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ, ఆయన పంచ్ డైలాగ్స్, యాక్షన్, డాన్స్ అభిమానులకు నచ్చుతాయి. అయితే… ఆసక్తిగా మొదలైన సినిమా మధ్యలో ఎక్కడో తిరిగి చివరకు ఆపరేషన్ సింధూర్ డైలాగులతో ఎండ్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ కు నచ్చే ఈ సినిమాను మిగిలిన వాళ్లు కూడా ఓసారి ట్రై చెయ్యొచ్చు. అంటే ఎక్కువగా కొత్తదనం ఆశిస్తే తీవ్ర నిరాశ తప్పదు.
Mar 21, 2026 Telugu
6.0
out of 10
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అ...

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ వన్ మ్యాన్ షో తో సినిమాని నడిపించాడు. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌ లతో మెప్పించాడు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌ లో వస్తుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. రాశి పాత్రకి పెద్దగా స్కోప్ లేనట్టు ఉంటుంది. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అయ్యాడు. రాంకీ డీజీపీగా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గొప్పగా లేదు. థమన్‌ బీజీఎం కూడా రొటీన్‌ గానే ఉంది. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలను జనం పెద్దగా చూడటం లేదు. అయినా ఇలాంటి సినిమా చేయడం హరీష్‌ చేసిన సాహసమనే చెప్పాలి. కాకపోతే అభిమానులకు కావాల్సిన విధంగా మూవీని రూపొందించారు. అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నా, అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. రొటీన్‌ ఫీలింగ్‌నే తెస్తాయి. ఓవరాల్ గా సినిమాపై తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఓ మోస్తరు ఎంజాయ్ చేయొచ్చు.

Mar 21, 2026 Telugu
6.0
out of 10
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడు హరీష్ తన టేకింగ్ తో మెప్పించినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. ముందే నార్మల్...

గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో లో సెట్టయిన మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు పెరిగిపోగా, సినిమా మాత్రం చాలా రోజులు షూటింగ్ జరుపుకుని తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కథా, కథనాల పరంగా నిరాశ పరిచింది. దర్శకుడు హరీష్ తన టేకింగ్ తో మెప్పించినా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. ముందే నార్మల్ స్టోరీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు కాబట్టి, లో అంచనాలు పెట్టుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్తే బాగుంటుంది. పైగా ఎడిటింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా థియేటర్లలో సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. అలాగే రెగ్యులర్ మూవీ లవర్స్ కి కూడా ఓ మోస్తరు నచ్చోచ్చు. కానీ కొత్తదనం ఆశిస్తే నిరాశ తప్పదు.

Mar 21, 2026 Telugu
5.0
out of 10
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేసాడు. ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. శ్రీ లీల, రాశి ఖన్నా పాత్రలు ఇంకా బాగా రాసుకోవలసింది. ఓవరాల్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ అభిమ...
ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ థియేటర్లలో ఉగాది నుండి సందడి చేస్తున్నాడు. అయితే సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కథ, కథనాల్లో బలం లోపించగా, డైరెక్షన్ పరంగా హరీష్ శంకర్ తన వంతు న్యాయం చేసాడు. ఇక సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా నడిపించాడని చెప్పొచ్చు. శ్రీ లీల, రాశి ఖన్నా పాత్రలు ఇంకా బాగా రాసుకోవలసింది. ఓవరాల్ గా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు ఖచ్చితంగా నచ్చే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కానీ, ఫ్యాన్స్ 'గబ్బర్ సింగ్'తో పోలిస్తే ఏమాత్రం సరిపోదు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ విషయంలో మాత్రం ఆయన అభిమానులు పెద్దగా కంప్లైంట్ చేయకుండా ఈ సినిమా చూడటానికి సరిపడా అంశాలు ఉన్నాయి. కథానాయకుల స్టార్‌డమ్‌పై ఎక్కువగా ఆధారపడే మూస ధోరణి వాణిజ్య వినోద చిత్రాలను చూడటానికి సౌకర్యంగా భావించే ఇతర వర్గాల ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను థియేటర్‌లో చూడటానికి ప్రయత్నించవచ్చు.
Mar 21, 2026 Telugu
6.0
out of 10
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హరీష్ శంకర్‌లో కొత్తగా ఏమి ట్రై చేయలేదు కానీ.. తన మార్కును బ్రహ్మండంగా ప్రజెంట్ చేశాడు. అలాగే సినిమాటో...
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలకు దిగువన.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలు మ్యాచ్ అయ్యేలా చేసిన పూర్తిస్థాయి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ప్యాకేజ్డ్ మూవీ. పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో, శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కోసం ఈ సినిమాను చూడాలి. హరీష్ శంకర్‌లో కొత్తగా ఏమి ట్రై చేయలేదు కానీ.. తన మార్కును బ్రహ్మండంగా ప్రజెంట్ చేశాడు. అలాగే సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మైత్రీ మూవీ మేకర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. అతిగా ఆశపడితే నిరాశ తప్పదు.. అంచనాలు లేకుండా వెళ్తే రెండున్నర గంటలపాటు వినోదాన్ని ఎంజాయ్ చేయొచ్చు.
Mar 21, 2026 Telugu
5.0
out of 10
అభిమానులను అలరించడమే లక్ష్యంగా తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారు మెచ్చే రీతిలో కనిపించాడు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఫన్ టచ్ ఉన్న పాత్ర ఇందులో చేసారు. ఓవైపు పవర్ ఫుల్ గా సాగుతూనే.. ఇంకోవైపు వినోదం కూడా పంచుతుందా పాత్ర. అయితే శ్రీలీల.. పవన్ పక్కన కొంచెం చిన్నమ్మాయిలా కనిపించింది. గీత పాత్రలో ఆమె లుక్.. అభినయం బాగానే సాగాయి. రాశి ఖన్నా పాత్ర కాస్త గ్లామర్ కోణంలో సాగింది. పార్తీబన్ మంచి...
అభిమానులను అలరించడమే లక్ష్యంగా తీసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వారు మెచ్చే రీతిలో కనిపించాడు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఫన్ టచ్ ఉన్న పాత్ర ఇందులో చేసారు. ఓవైపు పవర్ ఫుల్ గా సాగుతూనే.. ఇంకోవైపు వినోదం కూడా పంచుతుందా పాత్ర. అయితే శ్రీలీల.. పవన్ పక్కన కొంచెం చిన్నమ్మాయిలా కనిపించింది. గీత పాత్రలో ఆమె లుక్.. అభినయం బాగానే సాగాయి. రాశి ఖన్నా పాత్ర కాస్త గ్లామర్ కోణంలో సాగింది. పార్తీబన్ మంచి పేరున్న నటుడే అయినా ఆయనకు రొటీన్ విలన్ పాత్ర ఇచ్చాడు హరీష్ శంకర్. ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ అంటే.. పాటల మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం. కానీ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడిచ్చిన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. థమన్ బీజీఎమ్ కూడా కొన్ని చోట్ల మరీ లౌడ్ బీజీఎంతో ఇబ్బంది పెట్టాడు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఓవరాల్ గా కథలో కొత్తదనం లేదు కానీ.. పవన్ శైలికి తగ్గ ఎంటర్టైనింగ్.. మరియు ఎలివేషన్ సీన్ల మీద బండి నడిపించాడు. 'ఓజీ' స్థాయిలో కాదు కానీ.. పవన్ ను అభిమానులు మెచ్చేలా చూపించాడు హరీష్ శంకర్.
Mar 21, 2026 Telugu
6.0
out of 10
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మరోసారి మెప్పించారు. శ్రీలీల ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బాగా నటించింది కూడా, రాశీఖన్నా పాత్ర కు మాత్రం పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. నాగప్ప గా నెగిటివ్ షేడ్స్ లో పార్తీబన్, సీఎం గా, KS రవికుమార్ సహా కిల్లి క్రాం...
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ఫైనల్ గా థియేటర్లలో రిలీజ్ కాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మరోసారి మెప్పించారు. శ్రీలీల ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. బాగా నటించింది కూడా, రాశీఖన్నా పాత్ర కు మాత్రం పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. నాగప్ప గా నెగిటివ్ షేడ్స్ లో పార్తీబన్, సీఎం గా, KS రవికుమార్ సహా కిల్లి క్రాంతి, టెంపర్ వంశీ వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. ఇక టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్ గా ఉండగా, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వర్క్ బాగుంది. అలాగే హరీష్ శంకర్ అందించిన కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకి ప్లస్ అవుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అవుతుంది. కానీ నార్మల్ ఆడియన్స్ ని అంతగా మెప్పించదు.
Mar 21, 2026 Telugu
6.0
out of 10
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో అంటేనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తితో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియన్స్ ని ఊహించిన రేంజ్ లో ఎంటర్టైన్ చేయకపోయినా, ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఫ్యాన్ అండ్ మాస్ స్టఫ్‌గా డిజైన్ చేశారు. వింటేజ్ సాంగ్స్‌తో వచ్చే పవన్ మూమెంట్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ని ఊగేలా చేస్తాయి. పవన్ స్క...

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబో అంటేనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్.. ‘గబ్బర్ సింగ్’ రేంజ్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆసక్తితో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆడియన్స్ ని ఊహించిన రేంజ్ లో ఎంటర్టైన్ చేయకపోయినా, ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ ఇస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఫ్యాన్ అండ్ మాస్ స్టఫ్‌గా డిజైన్ చేశారు. వింటేజ్ సాంగ్స్‌తో వచ్చే పవన్ మూమెంట్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ని ఊగేలా చేస్తాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, యాక్షన్ సీన్స్ సినిమా మొత్తాన్ని మోస్తాయి. పాతబస్తీ సీక్వెన్స్‌లో గబ్బర్ సింగ్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్ మాత్రం అంతగా ఎంగేజ్ చేయదు. స్టోరీ నెమ్మదిగా సాగుతూ కొన్ని చోట్ల ఫ్లాట్‌గా అనిపిస్తుంది. ట్విస్ట్స్ ఉన్నా ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీలీల తమ పాత్రల్లో ఓకే. విలన్ పార్థిబన్ పెర్ఫార్మెన్స్ బాగున్నా క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. టెక్నికల్‌గా విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మిస్ అయ్యిన ఫీలింగ్ ఇస్తుంది. ఓవరాల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తిగా పవన్ ఫ్యాన్స్ కోసం తీసిన మాస్ ఎంటర్టైనర్. స్టోరీలో కొత్తదనం తక్కువ అయినా, పవన్ స్వాగ్ & యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు

Mar 21, 2026 Telugu
Why MRO?