Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
శివకార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా ఫైనల్ గా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. రెండేళ్లయినా సరే ఈ సినిమాను ఫ్యామిలీస్ ప్లస్ కిడ్స్ ఎంజాయ్ చేస్తూ సినిమా చుడ్డొచ్చు. టెక్నికల్‌గా “అయలాన్” మంచి ప్రయత్నం. విజువల్ ఎఫెక్ట్స్ మీద భారీ శ్రమ కనిపిస్తుంది. ఏలియన్ క్యారెక్టర్ డిజైన్ మరియు యానిమేషన్ ప్రశంసనీయం. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సైన్స్ ఫిక్షన్ ఫీల్‌ను బాగా తీసుకొచ్చింది. ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్థాయిలో ఉన్నాయి. ఇండియన్ సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ జానర్‌ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ సినిమా నిలుస్తుంది, టెక్నికల్ టీమ్‌కు మంచి మార్కులు వేయొచ్చు. ఓవరాల్ గా మరీ ఎక్కువ అంచనాలు లేకుండా చూస్తే బెస్ట్.
ఆర్. రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన “అయలాన్” ఒక సగటు సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. అయితే శివకార్తికేయన్ అభిమానులకు “అయలాన్” ఒక ట్రీట్. ఆయన ఎనర్జీ, ఇన్నోసెన్స్, కామెడీ అన్నీ సినిమాకు హైలైట్. ఏలియన్‌తో ఆయన చేసే సీన్లు చాలా క్యూట్‌గా ఉంటాయి. సినిమా మొత్తం పాజిటివ్ వైబ్‌తో సాగుతుంది. పిల్లలతో కలిసి చూసేలా క్లీనుగా తెరకెక్కించారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. హీరో క్యారెక్టర్ డిజైన్ చాలా నచ్చుతుంది. మెసేజ్ కూడా బాగుంది. కథ సింపుల్ అయినా, ఎస్‌కే స్టైల్ వల్ల సినిమా ఎంజాయబుల్‌గా మారింది. ఫ్యాన్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది. కాకపోతే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సరదాగా సినిమా చూడ్డానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాకి బాగా అట్రాక్ట్ అవుతారు.
తమిళ నాట ఎప్పుడో రిలీజ్ అయి తెలుగులో మాత్రం రెండేళ్ల విరామం తర్వాత ఎన్నో అవాంతరాలు దాటుకుని ఫైనల్ గా ఓటిటి లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన మూవీ అయలాన్. శివకార్తికేయన్ ఇందులో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే “అయలాన్”లో కాన్సెప్ట్ బాగున్నా, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉంది. కథ చాలా ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. కొన్ని సీన్లు అవసరం లేనట్టు అనిపిస్తాయి. సీజీ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని సీన్లలో కృత్రిమంగా కనిపిస్తాయి. విలన్ పాత్రకు సరైన డెప్త్ లేదు. భావోద్వేగాలు పూర్తిగా కనెక్ట్ కావు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. శివకార్తికేయన్ ఫ్యాన్స్‌కి నచ్చొచ్చు కానీ, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంది.
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా చాలా రోజులకు ఓటిటి లోకి అందుబాటులోకి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శరద్ కెల్హర్, ఇషా కొప్పికర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా రెండేళ్ల తర్వాత ఓటిటి లోకి అందుబాటులోకి రావడంతో, ఒరిజినల్ సబ్ టైటిల్స్ తో చూసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. కానీ ఇప్పటివరకు సినిమా చూడని వారికి ఇప్పుడు చూసినా అయలన్ కొత్తగానే ఉంటుంది. కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడదగ్గ అన్ని ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. కానీ, స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే ఏలియన్ జానర్ లో బెస్ట్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిన చిత్రంగా తనదైన ముద్ర వేసి ఉండేది. మొత్తానికి జాలీ మోడ్ లో ఆకట్టుకునే 'అయలాన్' యాక్షన్ మోడ్ లో జారిపోయింది.
శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా కోసం అనుకున్న లైన్ బాగుంది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు కూడా బాగుంది. అయితే సరైన సన్నివేశాలను డిజైన్ చేసుకోవడమే ఆశించిన స్థాయిలో జరగలేదనిపిస్తుంది. ఈ కారణంగానే యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కనెక్ట్ కాలేదని చెప్పచ్చు. నీరవ్ షా ఫొటోగ్రఫీ .. ఏఆర్ రెహ్మాన్ సంగీతం .. రూబెన్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. ఇక ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఓవరాల్ గా ఏలియన్ తో కలిసి హీరో చేసే హంగామాగా మాత్రమే ఈ సినిమా కనిపిస్తుంది. ఆ దారిలో వెళ్లాలనుకున్నప్పుడు కామెడీ సీన్స్ కాస్త బలంగా రాసుకోవలసింది. కామెడీ వర్కౌట్ కాకపోగా లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కూడా కనెక్ట్ కాలేదు. వినోదం పరంగా పిల్లలను అలరిస్తుందని మాత్రం చెప్పచ్చు.
తమిళ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమా ఒక ఏలియన్ బేస్డ్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా, రెండేళ్ల కిందటే విడుదల కావాల్సిన సినిమా తెలుగులో థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోలేదు. తమిళ్ లో విడుదలై యావరేజ్ గా ఆడగా, ఎన్నో అవాంతరాలు దాటుకుని, ఎట్టకేలకు తెలుగులో ఆహాలో తాజాగా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఓవరాల్ గా అయలాన్ విషయానికి వస్తే... సినిమాలో శివ కార్తికేయన్ పెర్ఫార్మన్స్ బాగుంది. అలాగే మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్, ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎక్స్ ప్లోర్ చేయాలనే ప్రయత్నం బాగుంది. ఇందులో కామెడీ, విజువల్స్ అలాగే లీడ్ నటుల పెర్ఫామెన్స్ లు మెప్పిస్తాయి. కానీ ఈ సబ్జెక్టుకి తగ్గట్టుగా ఇంకా బలమైన కథనం ఇందులో యాడ్ చేస్తే బాగుండేది. ఇది మినహా ఈ కొత్త ప్రయత్నం పిల్లలతో కలిసి ఒక్కసారికి అలా సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ఆహా లో చూడొచ్చు.
తెలుసు కదా అంటూ ఆడియన్స్ ని పలకరించిన సిద్ధూ, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పేసి, తెల్సిన కథనే మళ్ళీ మళ్ళీ కొత్తదనం లేనట్టు చేసారు. దర్శకురాలిగా పరిచయమైన నీరజ కోన తన ఎఫర్ట్ బాగానే పెట్టినా, కథనంలో ఆశించిన మేర అంచనాలను అందుకోలేదు. కానీ టెక్నికల్ గా మూవీ విజువల్స్ బాగున్నాయి. జ్ఞానశేఖర్ విజువల్స్ బాగున్నాయి. నవీన్ ఎడిటింగ్ నీట్‌గా ఉంది. దర్శకురాలు నీరజ కోన ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్ చేయడం మామూలు విషయం కాదు. చాలా బాగా తెరకెక్కించారు. సినిమాని చాలా క్లాసీగా తీశారు. మాస్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలిమెంట్లు జోడిస్తే బాగుండేది. కామెడీ ట్రాక్‌కి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కానీ లేటెస్ట్ ట్రెండ్‌ని ఆవిష్కరించిన తీరు మాత్రం బాగుంది. ఒక లేడీ డైరెక్టర్ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథని చెప్పడం, అంతే ఓపెన్‌గా తెరకెక్కించడం ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు. కాకపోతే ఆడియన్స్ కాన్సెప్ట్ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ సింపుల్ గా చెప్పాలనుకుంటే... పిల్లలు కావాలనుకునే భార్యాభర్తలు, సరోగసీ ద్వారా బిడ్డను అందించడానికి, మాజీ లవర్ రావడం... ఆ తర్వాత ముగ్గురు మధ్య చోటుచేసుకునే పరిస్థితులతో కూడిన ఒక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. పెర్ఫార్మన్స్ వరకూ సిద్ధు జొన్నలగడ్డ తన పాత్రలో అదరగొట్టాడు. తనతో పోటీ పడి రాశి, శ్రీనిధి పెర్ఫార్మ్ చేసారని చెప్పాలి. అలాగే కీ రోల్ ప్లే చేసిన వైవా హర్షతో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. తమన్ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. డైరెక్టర్ టేకింగ్ ఓకే. కాకపోతే స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఎండింగ్ ఊహించినంత బెస్ట్ గా లేకపోవడంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టం.
దీపావళి స్పెషల్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ అతని పాత్రను మరింత బాగా రాసుకుని ఉండాల్సింది. లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్ లోని ట్వస్ట్స్ అండ్ టర్న్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో లోటు కనిపించింది. హీరో స్నేహితుడిగా వైవా హర్ష బాగా చేశాడు. అతని పాత్రే సినిమాలో కొంత రిలీఫ్ ను ఇచ్చింది. ఎస్. థమన్ స్వరపర్చిన 'మల్లిక గంథ' సాంగ్ బాగుంది. నేపథ్య సంగీతం గురించి పెద్దంత చెప్పుకోవాల్సిందేమీ లేదు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ కూల్ గా ఉంది. ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ ఫ్యూజన్ కు గురిచేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 'తెలుసు కదా' అని హీరో ఎంత చెప్పినా... ఏదో తెలియని భావనే ఆడియెన్ కు కలుగుతుంది.
తెలుసు కదా చిత్రంలో దర్శకురాలు నీరజ కోన అనుకున్న విధంగా స్టోరీని ఆడియన్స్ కి చెప్పాలని ట్రై చేసినా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మూవీ స్లో గా రన్ అవుతున్నట్లుగా ఉంటుంది. కానీ రన్‌టైమ్ కూడా ఎక్కువగా లేదు. అయితే ఈ మధ్య వయలెన్స్, బ్లడ్ బాత్ సినిమాలకి ఎక్కువగా అలవాటు అయిపోయిన ఆడియన్స్‌కి ఇలాంటి స్లో నెరేషన్ కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఫీల్ గుడ్ మూవీస్ ఆడియన్స్ చూసే ఆడియన్స్ కి నచ్చవచ్చు. ఇక థమన్ చాలా రోజుల తర్వాత మంచి క్లాసిక్ సాంగ్స్, ఫీల్ గుడ్ బీజీఎమ్ ఇచ్చాడు. అలానే సొగసు చూడతరమా పాట కూడా కొన్నాళ్లు వినపడుతుంది. సినిమాటోగ్రఫీ పనితనం కూడా బావుంది. స్క్రీన్ ప్లే బలంగా లేకపోవడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టం.
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ దీపావళి స్పెషల్ గా రిలీజ్ అవగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నీరజ కోన డైరెక్ట్ చేయగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ముగ్గురూ పోటీ పడి నటించారు. వీళ్ళతో పాటు వైవా హర్ష రోల్ కూడా బాగుంది. అయితే కథ పరంగా పాత సినిమాలనే అడ్వాన్స్డ్ జెనరేషన్ కి తగ్గట్టుగా తీసినట్టుంది. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా కథనం సాగింది. ఇలాంటి కాన్సెప్ట్ చాలా మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా, దర్శకురాలు సీన్స్ ని ఎంగేజింగ్ గా హ్యాండిల్ చేయలేకపోయారు. సిద్ధూ ఫ్యాన్స్ కి అయితే కనెక్ట్ అవుతుంది. సాధారణ ప్రేక్షకులు ఒకసారి వీలైతే చూడొచ్చు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, రిషబ్ శెట్టి నటించి స్వీయ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా పరంగా తొలి సగంలో కొంత సాగదీసినట్లు అనిపించినా, సెకండ్ హాఫ్ మాత్రం వేగం పుంజుకుని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చే అనుభూతిని అందించిందనడంలో సందేహం లేదు. రిషబ్ శెట్టి నటన, సెకండ్ హాఫ్ కథనం, క్లైమాక్స్, ఇవన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. సాంకేతిక విలువల పరంగానూ సంగీతం, ఆర్ట్, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయి. భారీ అంచనాల కారణంగా 'కాంతార' చూసిన ఫీలింగ్ కలగకపోయినా, రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో, అద్భుతమైన సాంకేతిక విలువలు, సెకండ్ హాఫ్ కథనం కోసం ఈ సినిమాను ఒకసారి తప్పక చూడొచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers