Register as a Reviewer
కర్మాఖ్య (Karmakhya)

కర్మాఖ్య (Karmakhya)

31 Aug 2026
Overall Rating
5.6/10
5 Reviews

జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది.

Director: Abhinaya Krishna
Cast: Samaira, Samuthrakhani, Abhirami, Anand, Sharanya Pradeep, Madhunandan, Vaishnav, Dhanraj, Raghava, Aishwarya, Gaddam Naveen

Available in:

Reviews

What critics and the public are saying about కర్మాఖ్య (Karmakhya)

Media Reviews

5 Avg: 5.6/10
One India
One India Website
5

Average

Karmakhya Movie Review

కామాఖ్య దేవి నేపథ్యం, మూఢనమ్మకాలు, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్స్‌ను మిళితం చేస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అదిరే అభి దర్శకత్వం వహించారు.ఓవరాల్ గా కర్మాఖ్య మూవీ ఒక మంచి కాన్సెప్ట్‌ తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశ...

కామాఖ్య దేవి నేపథ్యం, మూఢనమ్మకాలు, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్స్‌ను మిళితం చేస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అదిరే అభి దర్శకత్వం వహించారు.


ఓవరాల్ గా కర్మాఖ్య మూవీ ఒక మంచి కాన్సెప్ట్‌ తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రశంసనీయమే.. కానీ కథనం మరింత ఆసక్తికరంగా, భావోద్వేగాలు మరింత బలంగా ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేదని టాక్ వినిపిస్తోంది.

Jul 31, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

Karmakhya Movie review

జబర్దస్త్ తర్వాత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అదిరే అభి తెరకెక్కించిన కర్మాఖ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాఖ్య దేవత కాన్సెప్ట్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌లో హర్రర్ లేదా సూపర్‌నేచురల్ అంశాలు పెద్దగా కనిపించవు.ట్విస్టులు ఆశించిన స్థాయిలో ఇంప...

జబర్దస్త్ తర్వాత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న అదిరే అభి తెరకెక్కించిన కర్మాఖ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాఖ్య దేవత కాన్సెప్ట్, మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌లో హర్రర్ లేదా సూపర్‌నేచురల్ అంశాలు పెద్దగా కనిపించవు.


ట్విస్టులు ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వకపోయినా, ఇటీవల వచ్చిన థ్రిల్లర్‌లతో పోలిస్తే కొత్త తరహా థ్రిల్లింగ్ అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. భారీ అంచనాలు లేకుండా చూస్తే కర్మాఖ్య ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఫైనల్ గా కర్మాఖ్య ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్. 

Jul 31, 2026 Read Review
6

Above Average

Karmakhya Movie review

అదిరే అభి(అభినయ కృష్ణ) జబర్దస్త్ వదిలేసిన తర్వాత దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు ముందు `చిరంజీవ` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `కర్మాఖ్య` అనే చిత్రాన్ని రూపొందించాడు. దీని అసలు పేరు `కామాఖ్య`. కానీ సెన్సార్‌, లీగల్ ఇబ్బందుల కారణంగా `కర్మాఖ్య`గా పేరు మార్చారు. దర్శకుడు అదిరే...

అదిరే అభి(అభినయ కృష్ణ) జబర్దస్త్ వదిలేసిన తర్వాత దర్శకుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకు ముందు `చిరంజీవ` చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు `కర్మాఖ్య` అనే చిత్రాన్ని రూపొందించాడు. దీని అసలు పేరు `కామాఖ్య`. కానీ సెన్సార్‌, లీగల్ ఇబ్బందుల కారణంగా `కర్మాఖ్య`గా పేరు మార్చారు. దర్శకుడు అదిరే అభి ఈ మూవీని మిస్టీరియస్‌, సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. కామాఖ్య దేవత శక్తిని ఆధారంగా చేసుకుని, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచారు. అయితే బయటకు ఇది హర్రర్‌ థ్రిల్లర్‌గా కనిపించినా, హర్రర్‌ అంశాలు లేవు. అదే సమయంలో సూపర్‌ నేచురల్‌ అంశాలు కూడా లేవు. 


ట్విస్ట్ లు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కాకపోతే ఇటీవల వస్తోన్న థ్రిల్లర్‌ చిత్రాలతో పోల్చితే బెటర్‌ గానే ఉంది. కొత్తరకమైన థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే సరికొత్త థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందించే మిస్టీరియల్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌ `కర్మాఖ్య`. అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకుంటుంది. థ్రిల్‌ నిస్తుంది.

Jul 31, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Karmakhya Movie Review

జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". ఈ సినిమా గురించి చెప్పుకుంటే మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ మూఢ నమ్మకాల కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్‌ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ ఆడియెన్స్‌ పై ముద్ర వేసే విధంగా ముగింపు...

జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య". ఈ సినిమా గురించి చెప్పుకుంటే మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ మూఢ నమ్మకాల కారణంగా జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనే పాయింట్‌ ను ఈ సినిమాలో ప్రధానంగా చెప్పడం జరిగింది. కానీ ఆడియెన్స్‌ పై ముద్ర వేసే విధంగా ముగింపు లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. 


నటీనటులు అభిరామి, ఆనంద్, సముద్రఖని అలాగే సమైరా కొత్త అమ్మాయి అయినప్పటికీ.. కథను తన భుజాల మీద మోసింది. శరణ్య ప్రదీప్ సపోర్టింగ్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే కథ, సన్నివేశాలపై ఇంకా బెటర్‌గా ఆలోచించి ఉంటే మంచి డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ అయి ఉండేది. జబర్దస్త్ అభి తనదైన శైలిలో వినోధభరితంగా ఈ ఎమోషనల్ సబ్జెక్ట్‌ ను చెప్పి ఉంటే.. ఆడియెన్స్‌ కు బాగా కనెక్ట్ అయి ఉండేదనిపిస్తుంది. ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారని అనడానికి పార్ట్ 2 ఉండటమే కారణంగా భావించాలి.

Jul 31, 2026 Read Review
123telugu
123telugu Website
6

Above Average

Karmakhya Movie Review

జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య", థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ అన్న రేంజ్ లోనే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘కర్మాఖ్య’ సినిమాలో అక్కడక్కడా ఎంగేజ్ చేసే థ్రిల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంట...

జబర్దస్త్ నటుడు (అదిరే అభి) అభినయ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ "కర్మాఖ్య", థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ అన్న రేంజ్ లోనే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘కర్మాఖ్య’ సినిమాలో అక్కడక్కడా ఎంగేజ్ చేసే థ్రిల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి.


నటీనటుల పెర్ఫామెన్స్ లను దర్శకుడు అభినయ కృష్ణ బాగా రాబట్టారు. అలానే సెకండాఫ్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. కానీ ఫస్టాఫ్ లో కూడా ఈ మూమెంటం పూర్తి స్థాయిలో ఉంటే బాగుండేది. ఇవి పక్కన పెడితే ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఈ జానర్ సినిమాలని ఇష్టపడేవారికి నచ్చుతుంది.


Jul 31, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : 

వైజాగ్ లో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేసే కామాఖ్య (సమైరా), ప్రవల్లిక (శరణ్య ప్రదీప్) క్లోజ్ ఫ్రెండ్స్. అయితే అనుకోకుండా ప్రవల్లిక వెళ్లాల్సిన ఓ ఇన్సూరెన్స్ పనిమీద ఓ ఫ్యామిలీ ఇంటికి కామాఖ్య వెళ్లాల్సివస్తుంది. ఆ ఇంట్లో ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ అయిన సరోజిని (అభిరామి), ప్రభాకర్ (ఆనంద్) తో పాటు మతిస్థిమితం సరిగా లేని వారి కొడుకు సాత్విక్ (వైష్ణవ్) ఉంటారు. అయితే ఇన్సూరెన్స్ పనిమీద వచ్చిన వచ్చిన కామాఖ్య ఊహించని విధంగా వీళ్ళ ఇంటి నుంచి బయటకు రాకుండా చిక్కుకుపోతుంది. ఈ క్రమంలో అసలు కామాఖ్య వీరి ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.  ఆ ఇంటి నుంచి బయట పడటానికి కామాఖ్య చేసిన ప్రయత్నాలు ఏమిటి? అలాగే కామాఖ్యకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కామాఖ్య దేవతకు ఉన్న లింక్ ఏంటి? అలాగే సరోజిని ఇంటిలో ఉండే శవం వెనుక మిస్టరీ ఏంటి? ఈ మిస్టరీపై పోలీస్ ఇన్స్‌పెక్టర్ తిరుపతి (సముద్రఖని) ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? ఫైనల్ గా కామాఖ్య అన్ని  సమస్యల నుండి బయటపడిందా లేదా అన్నదే కథ. 

Plus Points :

ఇక కామాఖ్య సినిమా గురించి చెప్పుకుంటే ట్రైలర్ చూసాకే సినిమాపై ఇండస్ట్రీలో మంచి హైప్ రాగా, ఈ మధ్య థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ కూడా బాగా ఉండడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. అలాగే దర్శకుడు అభి ఈ సినిమాకు ఎంచుకున్న కోర్ కాన్సెప్ట్ బాగుంది. మంచి ట్విస్ట్ లతో కూడిన స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ కి వెళ్తున్న కొద్దీ వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి. అలాగే సమైరా, శరణ్య ప్రదీప్, అభిరామి వాళ్ళ రోల్స్ లో అదరగొట్టారు. అలాగే సముద్రఖని రోల్ క్లైమాక్స్ లో బాగున్నా, మరింత నిడివి ఉండాల్సింది. ఇక మధునందన్, ఆనంద్, వైష్ణవ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా చేశారు. 

Minus Points :

అయితే కామాఖ్య సినిమాకు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగానే ఉన్నా, ట్రీట్మెంట్ ఆసక్తికరంగా లేదు. చాలా సీన్స్ లో ఇతర థ్రిల్లర్ మూవీస్ గుర్తొస్తాయి. అందువల్ల కొత్తరకమైన థ్రిల్స్ కోరుకునే ఆడియన్స్ నిరాశపడవచ్చు. సముద్రఖని లాంటి నటుల్ని మరింత వాడుకోవాల్సింది. క్లైమాక్స్ బాగున్నా, సినిమాలో ఇంట్రెసింగ్ కథనాన్ని ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటినుంచి మైంటైన్ చేసుంటే వేరే విధంగా ఉండేది. అలాగే క్లైమాక్స్ బాగున్నా అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది. 

Technical Values :

ఇక టెక్నికల్ వాల్యూస్ గమనిస్తే.. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని వర్క్ సినిమాకి బాగా ప్లస్ అయింది. సాంగ్స్ పర్వాలేదనిపించాయి. ఈశ్వర్ పెంటి కెమెరా వర్క్ ఇంప్రెసివ్ గా ఉంది. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లో కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఇక దర్శకుడు అభినయ కృష్ణ రెండో సినిమాగా కామాఖ్యని మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాడని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకు హీరోహీరోయిన్లకు కంటే కథకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం బాగుంది.

Final Review : 

ఓవరాల్ గా కామాఖ్య కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఒకవర్గం ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది. నటీనటుల నుండి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టడంలో, అలాగే టెక్నిషియన్స్ నుండి మంచి పనితనం రాబట్టడంలో దర్శకుడు అభినయ కృష్ణ బాగా సక్సెస్ అయ్యాడు. అయితే మరింత థ్రిల్లింగ్ గా స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకుంటే బాగుండేది. ఓవరాల్ గా కామాఖ్య సినిమా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ని కొంతవరకు మెప్పిస్తుంది. 

Review Statistics

5.6
Overall Rating
Avg. of all reviews
5
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.6/10
Public
N/A
Why MRO?