Register as a Reviewer
ది ఇండియా స్టోరీ (The India Story)

ది ఇండియా స్టోరీ (The India Story)

24 Jul 2026
Overall Rating
6.0/10
1 Reviews

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ గా బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రలో చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ లీగల్ డ్రామా "ది ఇండియా స్టోరీ". తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Chetan DK And Team
Cast: Kajal Aggarwal Kitchlu, Shreyas Talpade, Trisha Sarda, Murli Sharma, Manish Wadhwa, Atul Tiwari, Kamlesh Sawant, Sham Mashilkar, among others.

Available in:

Reviews

What critics and the public are saying about ది ఇండియా స్టోరీ (The India Story)

Media Reviews

1 Avg: 6.0/10
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

The india story review

ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం.. ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న తీవ్రమైన సమస్యల్లో ఇది ఒకటి. ఇలాంటి సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. అయితే "సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, కేవలం ఉద్వేగాలను వాడుకోవాలనే...

ఆహార పదార్థాల్లో కల్తీ, పంట పొలాల్లో పరిమితికి మించి క్రిమిసంహారకాల వాడకం.. ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న తీవ్రమైన సమస్యల్లో ఇది ఒకటి. ఇలాంటి సామాజిక ప్రాధాన్యత ఉన్న అంశంతో తెరకెక్కిన సినిమా 'ది ఇండియా స్టోరీ'. అయితే "సమాజానికి అత్యంత కీలకమైన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, కేవలం ఉద్వేగాలను వాడుకోవాలనే తాపత్రయంలో దర్శకుడు కథనాన్ని దారితప్పించారు" అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అయితే ఈ సినిమాను చూడటం అంత సులభం కాదు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనసు భారంగా ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. బహుశా మీరు తీసుకునే ఆహారం పట్ల మీ ఆలోచన కూడా మారుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ది ఇండియా స్టోరీ అనేది నిజాయితీతో కూడిన ఆలోచింపజేసే కోర్ట్ డ్రామా అని నెటిజన్ రివ్యూ ఇచ్చారు.


Jul 24, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story : 

కథ విషయానికి వస్తే... యోగేష్ (శ్రేయాస్ తల్పడే) అనే వ్యక్తి యొక్క తన చిన్నారి కూతురు క్యాన్సర్ వ్యాధి వల్ల చనిపోతుంది. అయితే పంటల్లో వాడే క్రిమిసంహారకాల వల్ల, అలాగే ఆహారంలో జరిగిన కల్తీ వల్లే తన కూతురు చనిపోయిందని తెలుసుకుని న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఈ పోరాటంలో అడ్వకేట్ అర్చన (కాజల్ అగర్వాల్) ఈ కేసు టేకప్ చేసి యోగేష్ తరఫున అడ్వకేట్ గా కోర్టులో పోరాడుతుంది. ఈ క్రమంలో పలు కార్పొరేట్ సంస్థల నుండే కాకుండా, రాజకీయ పరంగానూ ఎన్నో ఇబ్బందులు పడతారు వీరు. మరి ఈ సొసైటీ లో కొందరి తప్పుల వల్ల కూతుర్ని కోల్పోయిన ఓ సామాన్య తండ్రికి న్యాయం జరిగిందా? అడ్వకేట్ అర్చన ఈ కేసులో ఎలా సహాయపడింది. చివరికి కోర్టులో ఎలాంటి న్యాయం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాలి. 

 

Plus Points : 

కథ పరంగా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ సమాజంలో చాలా మంది ప్రజలతో సహా వాళ్ళు చేసే తప్పులను, లోటుపాట్లను ప్రశ్నించిన సినిమా ఇది. పైగా ఈ మధ్య కాలంలో కోర్ట్ రూమ్ డ్రామాలు బాగా సక్సెస్ అవుతున్నాయి. ట్రైలర్ కూడా మంచి అంచనాలను పెంచేయగా, స్క్రీన్ ప్లే పరంగా ఈ లోటుపాట్లను తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు చేతన్ డీకే తడబడ్డారు. అయితే సినిమాలో శ్రేయాస్ తల్పడే, కాజల్ అగర్వాల్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే సినిమాలో సహజంగా సొసైటీలో ప్రజలు తాము తెలియకుండానే చేసే అలవాటు పడి చేసే తప్పుల్ని బాగా చూపించే ప్రయత్నం చేసారు. 

 

MinusPoints :

అయితే ది ఇండియా స్టోరీ అంటూ మంచి స్టోరీ లైన్ తీసుకున్న దర్శకుడు సినిమాలో ట్రైలర్ లో చూపించినంత ఆసక్తికరమైన కథనాన్ని సినిమాలో చూపించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ చాలా సాగదీసినట్టు అనిపించగా, కోర్ట్ రూమ్ డ్రామా కూడా సీన్స్ కూడా ఇల్లాజికల్ గా ఉన్నాయి. అలాగే కాజల్ అడ్వకేట్ పాత్రలో బాగానే చేసినా, ఒక సీనియర్ అడ్వకేట్‌ గా హుందాతనం, గాంభీర్యత కాన్ఫిడెన్స్ తనలో పెద్దగా కనిపించలేదు. పైగా ఎంత సేపూ వాదప్రతివాదనలు తప్ప సరైన ఆధారాలు ప్రవేశపెట్టే సీన్లు రాయడంలో మేకర్స్ తడబడ్డారు. సెకండ్ హాఫ్ కూడా తేలిపోయింది. పాప మరణానికి కారణమైన ప్రూఫ్స్ ని కోర్టులో చూపించే తీరు సరిగా లేవు. దాని కన్నా మేకర్స్ కోర్టులో బాధితుడి భావోద్వేగాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల కాన్సెప్ట్ పక్కదారి పట్టింది. 

 

Technical Values : 

కథకు తగ్గట్టు సరైన స్క్రీన్ ప్లే దర్శకుడు సరిగా రాసుకోలేకపోయాడు. అయితే మంగేష్ ధడ్కే బీజీఎమ్ బాగుంది. ఆశిష్ మాత్రే ఎడిటింగ్ వర్క్ అంతగా లేదు. అనవసరమైన సీన్లు కొన్ని ట్రిమ్ చేయాల్సింది. అయితే కొన్ని AI సీన్లు అంత రియలిస్టిక్ గా లేకపోవడం వల్ల సహజత్వం లోపిస్తుంది. 

 

Final Review : 

ఓవరాల్ గా కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యం వల్ల, క్యాన్సర్ కి బలైన ఓ చిన్నారికి న్యాయం జరిగే నేపథ్యంలో తెరకెక్కిన ఈ 'ది ఇండియా స్టోరీ' మూవీలో కథ పరంగా చర్చించాల్సిన మంచి విషయాలను కాన్సెప్ట్ గా ఎంచుకున్నా, దాన్ని ప్రేక్షకులకు ఆసక్తికరంగా చెప్పడంలో మూవీ టీం తడబడింది. పైగా సరైన ముగింపు కూడా లేకపోవడం నిరాశపరుస్తుంది. లేదంటే మంచి కథాబలమున్న సినిమాగా నిలిచేది. డాక్యుమెంటరీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ని ఈ సినిమా కొంతవరకు మెప్పించే ఛాన్స్ ఉంది. 

Review Statistics

6.0
Overall Rating
Avg. of all reviews
1
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
6.0/10
Public
N/A
Why MRO?