Register as a Reviewer
గట్టా కుస్తీ (Gatta Kusthi 2)

గట్టా కుస్తీ (Gatta Kusthi 2)

31 Jul 2026
Overall Rating
4.8/10
14 Reviews

తమిళంలో మూడేళ్ళ కింద విడుదలైన సూపర్ హిట్ మూవీ "గట్టా కుస్తీ" కి సీక్వెల్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "గట్టా కుస్తీ 2". విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తమిళ్ లో థియేట్రికల్ రిలీజ్ కాగా, తెలుగులో మాత్రం తాజాగా డైరెక్ట్ గా ఓటిటి ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.

Director: Chella Ayyavu
Cast: Vishnu Vishal, Aishwarya Lekshmi, Ramya Krishnan, Yogi Babu, Karunaas, Muniskanth, Kaali Venkat, Karunakaran, Zara, Mokksha and others.

Available in:

Reviews

What critics and the public are saying about గట్టా కుస్తీ (Gatta Kusthi 2)

Media Reviews

3 Avg: 5.3/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
5

Average

Gatta Kusthi 2 movie Review

గట్ట కుస్తీ 2. అంటే తెలుగులో మట్టి కుస్తీ 2 అని అర్ధం. 2022 లో వచ్చిన మట్టి కుస్తీ కి సీక్వెల్ ఈ మూవీ. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూసి తీరాలి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడి నుండే మొదలవుతుంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఫస్ట్ పార్ట్ బాగానే నచ్చిం...

గట్ట కుస్తీ 2. అంటే తెలుగులో మట్టి కుస్తీ 2 అని అర్ధం. 2022 లో వచ్చిన మట్టి కుస్తీ కి సీక్వెల్ ఈ మూవీ. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ కూడా చూసి తీరాలి. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అక్కడి నుండే మొదలవుతుంది. అండ్ సినిమా గురించి చెప్పాలంటే నాకైతే ఫస్ట్ పార్ట్ బాగానే నచ్చింది. ఈ సినిమా మాత్రం అంత లేదు. అండ్ లాజిక్స్ గురించి మాట్లాడితే సినిమా అస్సలు చూడలేం.


సినిమా కథ అయితే ఏం పెద్దగా లేదు. విష్ణు విశాల్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాడు కానీ, తన కెరీర్ కి ఈ మూవీ ఉపయోగపడలేదు. ఐశ్వర్య లక్ష్మికి కూడా అంతే. కానీ కామెడీ బాగుంది. కొన్ని కామెడీ సీన్స్ కోసం మాత్రం ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు. ఇక ఈ మూవీకి నా రేటింగ్ చెప్పాలంటే 5.5

Aug 03, 2026 Watch
123telugu
123telugu Website
5

Average

Gatta Kusthi 2 movie Review

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై డీసెంట్ సక్సెస్ అవగా, తెలుగులో మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా...

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై డీసెంట్ సక్సెస్ అవగా, తెలుగులో మాత్రం డైరెక్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. సినిమా గురించి ఓవరాల్ గా చెప్పాలంటే.. రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ‘గట్టా కుస్తీ 2’ మూవీ పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. స్పోర్ట్స్ నేపథ్యం ఉన్నా, వీక్ రైటింగ్‌తో కథను ట్రాక్ తప్పించారు. విష్ణు విశాల్-ఐశ్వర్య లక్ష్మిల పర్ఫార్మెన్స్, కొన్ని కామెడీ సీన్స్ వర్కవుట్ అయ్యాయి. అయితే, రొటీన్ కథ, సాగదీసిన రన్‌టైమ్ ఈ చిత్రానికి మైనస్. టైమ్ పాస్ కోసం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకునే వారు ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు. మిగతా వారు ఈ సినిమాను స్కిప్ చేయడం బెటర్.


Jul 31, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Gatta Kusthi 2 movie review

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై, తెలుగులో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానంగా సాగుతాయి. విష్ణు విశాల్ తన న్యాచురల్ కామెడీ టైమింగ్...

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'గట్టా కుస్తీ 2' తమిళంలో థియేటర్లలో విడుదలై, తెలుగులో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి భాగానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య అపార్థాలు, భావోద్వేగాలు, కామెడీ ప్రధానంగా సాగుతాయి. విష్ణు విశాల్ తన న్యాచురల్ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ జారా నటన హైలైట్‌గా నిలిచింది. అయితే కథ పూర్తిగా రొటీన్‌గా ఉండడం, ముందే ఊహించగల స్క్రీన్‌ప్లే, కొన్ని సాగదీత సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. మొత్తంగా 'గట్టా కుస్తీ 2' నవ్వులు పంచే టైంపాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కొత్త కథ ఆశించే వారికి మాత్రం పెద్దగా మెప్పించకపోవచ్చు. ఓవరాల్ గా మంచి టైం పాస్ మూవీగా ఫ్యామిలీతో ఓసారి చూసేయొచ్చు.


Jul 31, 2026 Read Review

Public Reviews

11 Avg: 4.6/10
T
Tharuni Valluru Small Business Owner
4

Below Average

Gatta kusthi 2 review

just now finished gatta kusthi 2 movie. cinema chusaka na opinion cheppalante kothaga movies chuse vallu, ee cinema skip cheyadam better. chala mandi comey bagundi, routeen ga unnaa, worth movie ani chepte chusa.. nakaithe mari navvu raledu kadaa.. chirakochindi. mari cinema lo fun kosam bagane try...

just now finished gatta kusthi 2 movie. cinema chusaka na opinion cheppalante kothaga movies chuse vallu, ee cinema skip cheyadam better. chala mandi comey bagundi, routeen ga unnaa, worth movie ani chepte chusa.. nakaithe mari navvu raledu kadaa.. chirakochindi. mari cinema lo fun kosam bagane try chesaru. konchem better ante aa child artist papa baga chesindi. inka ee cinema gurinchaithe naku cheppe opika ledu.. audiance edo timepass cheddam anukunte ee cinema okasari try cheyandi. lekapothe skip cheyadam better.

Aug 03, 2026
A
3

Not Good

Gatta kusthi 2 movie review

ninnane ott lo gatta kusthi 2 movie chusa... nakaithe movie assalu nacchaledu. edo first part comedy bagundani.. sequel movie chusa... but manchi story ledu, songs levu. fights kooda levu. edo konni comedy sences tappa, cinemalo ivi baguntayi ani cheppadaniki naku okka sence kooda gurtuku ravatledu....

ninnane ott lo gatta kusthi 2 movie chusa... nakaithe movie assalu nacchaledu. edo first part comedy bagundani.. sequel movie chusa... but manchi story ledu, songs levu. fights kooda levu. edo konni comedy sences tappa, cinemalo ivi baguntayi ani cheppadaniki naku okka sence kooda gurtuku ravatledu. nenaithe kottha movies chusevallaku naa suggestion ga ee movie ni chudakandi ane chepta..

Aug 03, 2026
A
A Varadharaju Students & Youth
5

Average

Gatta kusthi 2 movie review

"Friends tho weekend plan lo Gatta Kusthi 2 chusa. Movie start ayyaka first half lo comedy scenes full ga enjoy chesa. Vishnu Vishal screen presence and timing super undi. Kani story daggara ki vaste already chala sarlu chusina concept laga anipinchindi. Husband-wife fights, misunderstandings, emoti...

"Friends tho weekend plan lo Gatta Kusthi 2 chusa. Movie start ayyaka first half lo comedy scenes full ga enjoy chesa. Vishnu Vishal screen presence and timing super undi. Kani story daggara ki vaste already chala sarlu chusina concept laga anipinchindi. Husband-wife fights, misunderstandings, emotional scenes anni predictable ga unnayi. Second half lo konchem drag feel vachindi. Aishwarya Lakshmi performance bagundi, but character ki inka strong moments unte better undedi. Overall ga movie bore kottinchadu kani wow factor matram ledu. Friends tho chill avvadaniki okay.

Aug 03, 2026
B
Baswaraj Students & Youth
5

Average

gatta kusthi 2 movie review

"Nenu first part matti kusthi ki pedda fan bro. so Gatta Kusthi 2 meeda full expectations tho chusa. Honestly, Vishnu Vishal comedy aithe full enjoy chesa... konni scenes ki baaga navvukunna. Hero-heroine chemistry kuda baagundi. Kani story matram chala routine anipinchindi. Interval tarvatha movie...

"Nenu first part matti kusthi ki pedda fan bro. so Gatta Kusthi 2 meeda full expectations tho chusa. Honestly, Vishnu Vishal comedy aithe full enjoy chesa... konni scenes ki baaga navvukunna. Hero-heroine chemistry kuda baagundi. Kani story matram chala routine anipinchindi. Interval tarvatha movie ekkadaina surprise istundemo anukunna, but almost anni scenes mundhe guess chesesa. Konni places lo pace slow aipoyindi. First part lo unna fresh feel ee sequel lo miss ayindi. Timepass ki, friends or family tho chill ga chudataniki aithe okay... but strong story expect chesthe konchem disappoint avtaru. Naaku aithe one-time watch anipinchindi."

Aug 02, 2026
B
Baru Sri Harshitha Students & Youth
4

Below Average

Gatta kusthi 2 movie review

watched Gatta Kusthi 2 over the weekend just to relax after a hectic work week. The first half was quite entertaining, especially Vishnu Vishal's comedy, which genuinely made me laugh. But in the second half, the story felt very routine, and I could easily predict what was coming next. Aishwarya Lak...

watched Gatta Kusthi 2 over the weekend just to relax after a hectic work week. The first half was quite entertaining, especially Vishnu Vishal's comedy, which genuinely made me laugh. But in the second half, the story felt very routine, and I could easily predict what was coming next. Aishwarya Lakshmi delivered a good performance, and the family emotions worked well. Still, the screenplay could have been much tighter. Overall, it's a decent one-time watchable.

Aug 03, 2026
T
Talari Snehalatha IT Employee
5

Average

Gatta kusthi 2 movie review

"ఫస్ట్ పార్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ సినిమా అయిపోయాక ఫీలింగ్ ఏంటంటే... ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, కథ మాత్రం లేదు. విష్ణు విశాల్ ఉన్న సీన్స్‌లో నవ్వులు బాగానే పడ్డాయి. కానీ అదే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోవడం, మళ్లీ కలవడం అనే ట్రాక్ చాలా రొటీ...

"ఫస్ట్ పార్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమాపై కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ సినిమా అయిపోయాక ఫీలింగ్ ఏంటంటే... ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది, కథ మాత్రం లేదు.


విష్ణు విశాల్ ఉన్న సీన్స్‌లో నవ్వులు బాగానే పడ్డాయి. కానీ అదే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోవడం, మళ్లీ కలవడం అనే ట్రాక్ చాలా రొటీన్‌గా అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎక్కడికైనా కొత్త టర్న్ తీసుకుంటుందేమో అనుకున్నా... అలాంటిదేమీ జరగలేదు.


కొన్ని సీన్లు బాగా సాగదీసిన ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు కానీ సినిమా అయిపోయాక గుర్తుండిపోయే మూమెంట్ మాత్రం లేదు. నా వరకు ఇది 'ఒక్కసారి చూస్తే సరిపోయే' సినిమా."

Aug 03, 2026
P
Patwari Sinduja Homemaker / Housewives
4

Below Average

Gatta Kusthi 2 movie review

"ఫ్యామిలీ మూవీ అని gatta kusthi 2 చూసాను. హీరో తన భార్య కెరీర్‌కి ఇచ్చిన సపోర్ట్ చాలా నచ్చింది. ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది. కానీ కథ ముందే ఊహించేసేలా ఉండటం వల్ల పెద్దగా థ్రిల్ అనిపించలేదు. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ కూడా కొట్టించాయి. story lo freshnes లేకపోయినా, ఇంట్లో అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంట...

"ఫ్యామిలీ మూవీ అని gatta kusthi 2 చూసాను. హీరో తన భార్య కెరీర్‌కి ఇచ్చిన సపోర్ట్ చాలా నచ్చింది. ఆ ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది. కానీ కథ ముందే ఊహించేసేలా ఉండటం వల్ల పెద్దగా థ్రిల్ అనిపించలేదు. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ కూడా కొట్టించాయి. story lo freshnes లేకపోయినా, ఇంట్లో అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ చూడాలంటే ఈ సినిమా ఓకే. కానీ ఫస్ట్ పార్ట్‌లా మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఫీలింగ్ మాత్రం రాలేదు."

Aug 02, 2026
V
Velugubantla Ramadurga Private Employee
4

Below Average

Gatta kusthi 2 movie review

"Weekend lo light ga timepass kosam Gatta Kusthi 2 chusa. First half baane entertain chesindi, Kani second half ki vellaka story complete routine anipinchindi. Next scene lo em jaruguthundo easy ga guess cheyochu. Aishwarya Lakshmi performance bagundi.Kani screenplay inkonchem tight ga unte cinema n...

"Weekend lo light ga timepass kosam Gatta Kusthi 2 chusa. First half baane entertain chesindi, Kani second half ki vellaka story complete routine anipinchindi. Next scene lo em jaruguthundo easy ga guess cheyochu. Aishwarya Lakshmi performance bagundi.


Kani screenplay inkonchem tight ga unte cinema next level undedi. Overall ga stress lekunda family tho kalisi okasari chudocchu... but high expectations tho velthe konchem disappoint avtaru. Naaku aithe one-time watch kanna takkuva anipinchindi."

Aug 03, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

gatta kusthi 2 movie review

"వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్ తర్వాత వీకెండ్‌ లో లైట్‌గా ఏదైనా చూడాలని 'గట్టా కుస్తీ 2' పెట్టా. కామెడీ పరంగా సినిమా ఓకే అనిపించింది. విష్ణు విశాల్ తన టైమింగ్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైన్ చేశాడు. కానీ కథలో ఒక్క ట్విస్ట్ కూడా కొత్తగా అనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోయింది. కొన్ని సీన్లు కట్ చే...

"వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్ తర్వాత వీకెండ్‌ లో లైట్‌గా ఏదైనా చూడాలని 'గట్టా కుస్తీ 2' పెట్టా. కామెడీ పరంగా సినిమా ఓకే అనిపించింది. విష్ణు విశాల్ తన టైమింగ్‌తో చాలా చోట్ల ఎంటర్‌టైన్ చేశాడు. కానీ కథలో ఒక్క ట్విస్ట్ కూడా కొత్తగా అనిపించలేదు. తర్వాత ఏం జరుగుతుందో ముందే అర్థమైపోయింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా క్రిస్ప్‌గా ఉండేది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈసారి మ్యాజిక్ కాస్త తక్కువే. నా వరకు ఇది ఒక వన్‌టైమ్ వాచ్ మూవీ."

Aug 03, 2026
G
Gandam Monica Sravanthi Doctor/Health Worker
6

Above Average

Gatta kusthi 2 movie review

"రోజంతా hospital lo బిజీగా ఉండి relax అవ్వాలని ఈ సినిమా చూశా. నిజం చెప్పాలంటే విష్ణు విశాల్ కామెడీ బాగా నవ్వించింది. family emotions కూడా కనెక్ట్ అయ్యాయి. కానీ కథ మాత్రం చాలా predictible గా అనిపించింది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, విడిపోవడం, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం....

"రోజంతా hospital lo బిజీగా ఉండి relax అవ్వాలని ఈ సినిమా చూశా. నిజం చెప్పాలంటే విష్ణు విశాల్ కామెడీ బాగా నవ్వించింది. family emotions కూడా కనెక్ట్ అయ్యాయి. కానీ కథ మాత్రం చాలా predictible గా అనిపించింది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, విడిపోవడం, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. కొన్ని సీన్లు కాస్త lengthy గా అనిపించాయి.


ఐశ్వర్య లక్ష్మీ తన role లో బాగా చేసింది, చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఆకట్టుకుంది. కొత్త కథ కోసం చూస్తే నిరాశే. కానీ ఎక్కువగా ఆలోచించకుండా ఫ్యామిలీతో కలిసి రెండు గంటలు నవ్వుకుంటూ timepass చేయాలంటే మాత్రం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు."

Aug 01, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
6

Above Average

Gatta kusthi movie review

సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్‌ అనిపించింది ఒక్కటే... **'గట్టా కుస్తీ 2'**లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. విష్ణు విశాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రలో బాగా చేసింది. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, మళ్లీ కలవడం...

సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్‌ అనిపించింది ఒక్కటే... **'గట్టా కుస్తీ 2'**లో కామెడీ బాగానే వర్కౌట్ అయింది కానీ, కథ మాత్రం చాలా రొటీన్‌గా ఉంది. విష్ణు విశాల్ స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా నవ్వించాడు. ఐశ్వర్య లక్ష్మీ కూడా తన పాత్రలో బాగా చేసింది. అయితే భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు, మళ్లీ కలవడం లాంటి ట్రాక్ చాలా సినిమాల్లో చూసినట్టే అనిపించింది. తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు.


మధ్యలో కొన్ని సీన్లు కాస్త సాగదీసిన ఫీలింగ్ కూడా వచ్చింది. అయినా ఫ్యామిలీతో కలిసి లైట్‌గా టైంపాస్ చేయాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ పార్ట్‌లా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం కొంచెం నిరాశే. నా వరకు అయితే ఇది వన్‌టైమ్ వాచ్ మూవీ...

Aug 03, 2026

About This Movie

Story :

ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూగా ఈ సినిమా కథ నడుస్తుండగా, వీరా (విష్ణు విశాల్), తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) తో, కూతురు మలర్ (జారా) తో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అలా ఆరేళ్ళ ప్రయాణం తర్వాత వీరా తన భార్య కోసం ఇంటి బాధ్యతలు స్వీకరించి కూతురు బాగోగులు చూసుకుంటూ, కీర్తిని తన రెజ్లింగ్ కెరీర్ కంటిన్యూ చేసేందుకు ప్రోత్సహిస్తాడు. ఇటు కీర్తి కూడా రైల్వే లో జాబ్ చేస్తూ, కుస్తీ కెరీర్ లో ముందుకు వెళ్తుంది. అయితే కీర్తికి వచ్చినంత పేరు తనకు రాలేదని అసూయపడ్డ కోచ్ (తారక్ పొన్నప్ప) ఆమెను నేషనల్స్ కి వెళ్లకుండా చేస్తాడు. దానికి వీరాను అతనికి తెలియకుండానే వాడుకుంటాడు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు మొదలై విడాకుల వరకు దారితీస్తుంది. ఈ క్రమంలో వీరా, కీర్తి అసలు నిజం తెలుసుకున్నారా? కీర్తి తన రెజ్లింగ్ కెరీర్ తిరిగి నిలబెట్టుకుందా? మళ్ళీ ఈ భార్యాభర్తలు కలిసారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

గట్టా కుస్తీ 2 అంటూ తమిళ్ పేరుతోనే ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎంటర్టైన్మెంటే. కథా, కథనాలు సాదా సీదాగా ఉన్నా, దాన్ని కామెడీ వే లో ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ కి నచ్చే తీరులో తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే హీరో విష్ణు విశాల్ మరోసారి ఈ సినిమాకు మంచి ప్లస్ అయ్యాడు. తన న్యాచురల్ కామెడీ టైమింగ్ తో స్క్రీన్ ప్రెజెన్స్ తో బాగా ఎంటర్టైన్ చేసాడు. అలాగే ఐశ్వర్య లక్ష్మి రోల్ హీరోతో పోలిస్తే లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. అయినా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన జారా ఇంప్రెస్ చేస్తుంది. విష్ణు విశాల్ తో మంచి సీన్స్ పడ్డాయి. 

 

Minus Points : 

అయితే "గట్టా కుస్తీ 2" సినిమా ఎంటర్టైనింగ్ గానే ఉన్నా, కథ మాత్రం చాలా రొటీన్ గా ఉండడం బిగ్గెస్ట్ మైనస్. ఎంత సేపూ భార్యా భర్తల మధ్య అపార్థాలు, అలకలు, గొడవలు, విడాకులు... మళ్ళి కలవడం ఇలాంటివి కొన్ని వందల సినిమాల్లో చూసాం. ఈరోజుల్లో ఆడియన్స్ కథ ఎంత కొత్తగా ఉందా అనే ఆలోచిస్తున్నారు. అందువల్ల కొత్తదనం కోరుకునే ఆడియన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. పైగా ఈ సినిమాలో నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుందో ముందే చెప్పేసేలా ఉంటుంది. పైగా కొన్ని సాగదీత సీన్స్ కూడా ఆడియన్స్ ని విసిగించేలా ఉన్నాయి. రమ్యకృష్ణ క్యామియో రోల్ ఏమాత్రం ఉపయోగపడలేదు. 

 

Technical Values : 

ఇక టెక్నికల్ గా చూసుకుంటే దర్శకుడు చెల్లా అయ్యవు ఈసారి కథ కంటే కామెడీని ఎక్కువ నమ్ముకున్నాడు. అందువల్ల కథలో కొత్తదనం లేకపోగా, స్క్రీన్ ప్లే కూడా కాస్త నిరాశపరుస్తుంది. భరత్ విక్రమన్ ఎడిటింగ్ అంత బాగా లేదు. సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. కె.ఎం.భాస్కరన్ సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. రోల్డన్  మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. 

 

Final Review :

ఓవరాల్ గా గట్టా కుస్తీ 2 మూవీ ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించేలా అయితే లేదు. సినిమా ఎంటర్టైనింగ్ గానే సాగినా బలమైన కథా, కథనాలు లేకపోవడంతో సినిమా  వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. సాగదీత రన్ టైం కూడా సినిమాకి మైనస్ అయింది. అయితే టైంపాస్ కోసం రెగ్యులర్ మూవీ లవర్స్ ఈ సినిమాని ఓసారి ట్రై చేయొచ్చు.

Review Statistics

4.8
Overall Rating
Avg. of all reviews
14
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
5.3/10
Public
4.6/10
Why MRO?