Register as a Reviewer
లెనిన్ (LENIN)

లెనిన్ (LENIN)

10 Jul 2026
Overall Rating
6.7/10
3 Reviews

టాలీవుడ్ యంగ్ స్టార్ అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "లెనిన్". మురళి కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇక పలుమార్లు వాయిదా పడ్డాక ఎట్టకేలకు సినిమా థియేటర్లలో విడుదలైంది.

Director: Murali Kishore Abburu
Cast: Akkineni Akhil, Bhagyashri Borse, Shivaji, Brahmaji, Getup Srinu, Rangasthalam Mahesh and others

Available in:

Reviews

What critics and the public are saying about లెనిన్ (LENIN)

Media Reviews

3 Avg: 6.7/10
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
7

Hit

Lenin Movie Review

లెనిన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. అదిరింది సినిమా. చాలా చాలా బాగుంది. అండ్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కం బ్యాక్ ఫర్ అక్కినేని అఖిల్ గారు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ ప్యాకెడ్ ఫిలిం. సినిమా అంతాఒక ఫ్లో లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడ...

లెనిన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. అదిరింది సినిమా. చాలా చాలా బాగుంది. అండ్ వన్ అఫ్ ది బిగ్గెస్ట్ కం బ్యాక్ ఫర్ అక్కినేని అఖిల్ గారు అని చెప్పొచ్చు. దీంట్లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఏ ప్యాకెడ్ ఫిలిం. సినిమా అంతాఒక ఫ్లో లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బేసిగ్గా ఆ ప్లాట్ అయితే కొత్త ప్లాట్ లాగా అనిపించదు. బేసిగ్గా ధర్మం తప్పిన దసరా అని అనిపిస్తుంది. అంటే దసరా సినిమా లాగే... కొంచెం డిఫరెంట్ గా.. అది ఎందుకన్నానో సినిమా చూస్తే తెలుస్తుంది. 


అండ్ సినిమా కొన్ని వేరే సినిమాలతో మ్యాచ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. మెయిన్ గా నాకైతే ఊరు పేరు భైరవకోన గుర్తొచ్చింది. కథ వరకు చాలా రొటీన్ గానే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు డైరెక్టర్ మురళికిషోర్. అండ్ పాటలు మాత్రం ఒక్కటి తప్ప వేరే ఏం అంత బాగా లేవు. అండ్ సాంగ్స్ ప్లేస్ మెంట్స్ కూడా బాగాలేదు. 


లెనిన్ లో ట్విస్ట్ లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా బాగా హ్యాండిల్ చేసారు. అండ్ సినిమాలో డివోషనల్ టచ్ లైట్ గా బాగుంది. అండ్ అఖిల్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా అదరగొట్టాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. అండ్ భాగ్యశ్రీ బోర్సే కూడా బాగానే చేసింది. అండ్ శ్రీ లీలని తీసేసి భాగ్యశ్రీ ని పెట్టడం మంచి పని చేశారనిపిస్తుంది. ఎవరీవన్ డిడ్ బెస్ట్ జాబ్. ఫైనల్ గా సోది లేకుండా ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పాలంటే... పేరుతో పెద్దగా సంబంధం లేదు కానీ, అఖిల్ కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోయే సినిమా లెనిన్ అని చెప్పాలి.

Jul 10, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Lenin Movie Review

లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం...

లెనిన్ 2 hours 40 minutes రన్ టైం తో థియేటర్స్ లో విడుదలైంది. అండ్ సినిమా థియేటర్లో చూసాక నాకైతే నిర్మొహమాటంగా చెప్తున్నా avarage అనిపించింది guys. ఫస్ట్ హాఫ్ ఇంట్రో అండ్ ఇంటర్వెల్ ముందు తప్ప మిగతా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. ఇక సెకండ్ హాఫ్ చాలా బెటర్. అక్కడే అసలు స్టోరీ అండ్ డ్రామా ఉంది. సెకండ్ హాఫ్ కోసం ఓ సారి ట్రై చేయొచ్చు. అండ్ ఒక సాంగ్ లో చిన్న రొమాన్స్ సీన్ తప్పా మిగతా అంతా ఒకే. కాబట్టి ఫామిలీ తో చూడొచ్చు. 


ఇక హీరో అఖిల్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. భాగ్యశ్రీ కూడా మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. అండ్ మెయిన్ లీడ్ లో చేసిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ లో డిఫరెంట్ షేడ్స్ తో అదరగొట్టారు. అండ్ విలన్ రోల్ ఫ్రెష్ గా ఉంది. ఎవరన్నది రివీల్ చెయ్యకూడదు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంది. 


మైనస్ గురించి చెప్పుకుంటే... హీరో కంటే విలన్ రోల్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ కురుక్షేత్రం అంటూ రిఫరెన్స్ తీసుకున్నారు కానీ, పెద్దగా స్ట్రాంగ్ స్టోరీ ఎం లేదు. స్క్రీన్ ప్లే కొంచెం మార్చారు సెకండ్ హాఫ్ లో... అండ్ సినిమాలో కొన్ని ట్విస్ట్ లు ముందే తెలిస్తే.. అంత ఇంప్రెస్ కాకపోవచ్చు. ఓవరాల్ గా లెనిన్ కూడా అఖిల్ పూర్తి స్థాయి బ్రేక్ ఇచ్చే మూవీ కాదు. బట్ లెనిన్ తో అఖిల్ మంచి సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. 

Jul 10, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
7

Hit

Lenin Movie Review

Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అ...

Hello all... first off all లెనిన్ (Lenin) మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే... just ok.. పర్లేదు అనిపించింది నాకు.. ఫిలిం మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్స్ చాలా strong గా ఉంటాయి. ఓవరాల్ structure గాని, మూవీ రూరల్ పాయింట్ గాని, మహాభారతం రిఫరెన్స్ గాని, అవన్నీ కలిపి ఈ మూవీని ఒక మాస్ మసాలా మూవీ అవడానికి support చేసేలా ఉంటాయి. చాలా parts లో Genuine గా ఎలివేట్ చేసాయి కూడా. బట్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని హోల్డ్ చేసి పట్టుకునే main thread ఈ సినిమాలో హీరో హీరోయిన్ లవ్ స్టోరీ.  


బట్ అది lorgly ineffective గా ఉంది. so overall impact అనుకున్నదానికన్నా తగ్గిపోయింది. అండ్ మేకర్స్ చెప్పినట్టే మహాభారతం షేడ్స్ లోనే క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా సీన్స్ కూడా ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఉంటాయి. ఇక లెనిన్ గా అఖిల్ అక్కినేని (Akhil akkineni) సూపర్ గా ఇంప్రెస్ చేసాడు. చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. అండ్ థమన్ also did hit duty.


అయితే సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నా, ప్లేస్ మెంట్ బాగాలేవు. అండ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree borse) పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. బట్ ఇద్దరి మధ్యలో అనుకున్నంత connectivity కనిపించలేదు. అండ్ సినిమాలో సపోర్ట్ రోల్స్ లో చేసిన వాళ్ళందరూ బానే చేసారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ మురళి కిషోర్ (murali kishore) డీసెంట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా లెనిన్ వర్త్ మూవీ. ఫ్రెష్ నెస్ కోరుకున్నా ఓసారి థియేటర్లో ట్రై చేయొచ్చు.

Jul 10, 2026 Watch

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story :

కథ విషయానికి వస్తే... 20స్ స్టార్టింగ్ లో జైలు నుండి విడుదలైన ఖైదీ లెనిన్ (అఖిల్ అక్కినేని) తన ఊరు శ్రీ రామపురం వెళ్లడంతో కథ ఫ్లాష్ బ్యాక్ కి 90స్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ లెనిన్ కి తానూ ప్రాణంగా ప్రేమించిన భారతి (భాగ్యశ్రీ బోర్సే)కి జరిగిన విషాదం ఏంటి? అసలు ఎవరి వల్ల వాళ్ళు తమ జీవితాన్ని కోల్పోతారు. మధ్యలో తన క్లోజ్ ఫ్రెండ్ వసంత్ (ప్రమోద్ పంజు) కథేంటి? అసలు లెనిన్ జైలుకి  వెళ్తాడు? ఊళ్ళో జాతర బాగా జరిపించాడా? జైలు నుండి బైటికి వచ్చి తన పగ తీర్చుకున్నాడా? లేదా అనేది  సినిమా చూసి తెలుసుకోవాలి. 

 

Pluspoints : 

ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే... ఈ సినిమా నెరేషనే అని చెప్పాలి. చాలా సింపుల్ కథని ఆడియన్స్ కి నచ్చేట్టు మంచి మాస్ మసాలా సీన్లతో ఎంగేజింగ్ గా చూపించడానికి ట్రై చేసారు డైరెక్టర్. అసలు నిజం చెప్పాలంటే సినిమాకు చాలా వరకు హైప్ లేదు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ ట్రైలర్ కట్ చూసిన తర్వాతే పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ సినిమా పలు వాయిదాల తర్వాత రిలీజ్ అయినా కూడా, రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది. సినిమాలో మహా భారతం రిఫరెన్స్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేసారు. కథకి కనెక్ట్ అయితే కొన్ని సీన్స్ కి గూస్బంప్స్ రావడం గ్యారెంటీ. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు ట్విస్ట్ లు క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నారు.

ఇక లెనిన్ గా అఖిల్ తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో చాలా ఇంప్రెసివ్ గా నటించాడని చెప్పాలి. అలాగే భాగ్యశ్రీ బొర్సే కి కూడా ఫస్ట్ టైం మంచి స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అఖిల్ ఎమోషనల్ సీన్స్ లో బాగా పండించేసాడు. ఇక ప్రమోద్ పంజు తన రోల్ లో డిఫరెంట్ షేడ్స్ తో సర్ప్రైజ్ చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ లో అదరగొట్టారు. 

 

Minus Points :

అయితే ఈ లెనిన్ మూవీకి మైనస్ పాయింట్ కథే అని చెప్పాలి. మహాభారతం రిఫరెన్స్ లతోనే తీసుకున్నప్పటికీ కథ పరంగా చాలా సింపుల్ గా, అంతా ఊహించినట్టు ఉంటుంది. పైగా కథలో అంత ఫ్రెష్ నెస్ కనిపించదు. అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం, దసరా లాంటి మూవీస్ ఈ సినిమా చూసేటప్పుడు పక్కా గుర్తుకొస్తాయి. పైగా సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకుని ఉంటే, థియేటర్లో ఆడియన్స్ ఇంకా బాగా సప్రైజ్ అవడానికి షాక్ అవడానికి ఆస్కారం ఉండేది. ఇక సినిమాలో సాంగ్స్ బాగానే ఉన్నా, ప్లేస్ మెంట్ సరిగా లేదు, అలాగే కథలో కొన్ని అవసరం లేదనిపిస్తుంది.  

 

Technical values : 

టెక్నికల్ గా చూసుకుంటే... సినిమాటోగ్రఫీ బాగుంది. భారీ సెట్టింగ్స్ ని చాలా నేచురల్ గా డిజైన్ చేసి, ఒక సాలిడ్ రూరల్ అండ్ రా రాండ్ రస్టిక్ డ్రామాగా, మాస్ మసాలా మూవీగా తీర్చిదిద్దారు. ఇక ఈ సినిమాకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ బీజీఎమ్ స్కోర్ ఇంతకు ముందు విన్నట్టు అనిపిస్తుంది. కానీ మ్యాచ్ అయ్యాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. కొన్ని లెంగ్తీ షాట్స్ ని ట్రిమ్ చేయాల్సింది. డైరెక్టర్ మురళి కోశోర్ అబ్బూరి చాలా చిన్న కథనే తీసుకున్నా, తన వరకు అనుకున్న కథని ఆడియన్స్ కి నచ్చే విధంగా చూపించే ప్రయత్నం చేసారు. 

 

Final Review :

ఫైనల్ గా లెనిన్ మూవీ గురించి చెప్పుకోవాలంటే... చిన్న కథతో వచ్చినా... ఈ లెనిన్ మహాభారత యుద్ధంలో గెలిచేలాగానే ఉన్నాడు. అఖిల్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోగా, డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అలాగే భాగ్యశ్రీ బోర్సే రోల్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా అఖిల్ పెర్ఫార్మన్స్ కోసం, డీసెంట్ రూరల్ మాస్ డ్రామా కోసం, లెనిన్ ని ఓసారి థియేటర్లో ట్రై చేయొచ్చు. 

Review Statistics

6.7
Overall Rating
Avg. of all reviews
3
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
6.7/10
Public
N/A
Why MRO?