Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన మాస్ జాతర భానుభోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేదు. సినిమాలో రవితేజ నటన కంటే పాటల్లో గ్లామర్ హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా 'సూపర్ డూపర్ హిట్ సాంగ్' లో మరీ సన్నగా కనిపించారు. వన్ మ్యాన్ షో గా సినిమాని నడిపించారు మాస్ రాజా. శివుడిగా నవీన్ చంద్ర విలనిజం అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇటువంటి క్యారెక్టర్లు చేయడం రాజేంద్ర ప్రసాద్‌కు కొత్త కాదు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ మధ్యలో కొంత నవ్వించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ, నవ్య స్వామి, సముద్రఖని తదితరులు కనిపించారు. రవితేజ కటౌట్‌కు తగ్గ యాక్షన్ కొరియోగ్రఫీ కుదిరిన సినిమా 'మాస్ జాతర'. ఫైట్స్ ఒక్కటే చాలు, కథతో సంబంధం లేదనుకునే ప్రేక్షకులు - రవితేజ డై హార్డ్ ఫ్యాన్స్ ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమాకు వెళ్ళవచ్చు. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అంతే.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేదు. ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెప్పినట్టు, ఇందులో సగం కూడా ఆడియన్స్ కి ఆకట్టుకునేలా సీన్స్ లేవు. ఓవరాల్‌గా మాస్ జాతర గురించి చెప్పాలంటే.. రవితేజ మార్క్ మాస్, యాక్షన్ థ్రిల్లర్. మాస్ ఆడియెన్స్‌కు మాస్ మహారాజ్, శ్రీలీల కాంబో అలరించే అవకాశం ఉంది. కేవలం రవితేజ, శ్రీలీల ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలతో రూపొందించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే టైంపాస్ చేసే సినిమా. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే.. ఇంకా బెటర్ రిజల్డ్ వచ్చి ఉండేదనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్ ఓ సారి ఈ సినిమాపై లుక్కేయండి.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన సినిమా "మాస్ జాతర". నవంబర్ లో థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా, థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రవితేజ వన్ మ్యాన్ షో తో ఈ సినిమాని నడిపించాడు గాని, దర్శకుడు భాను భోగవరపు సరైన కథ, కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యాడు. రొటీన్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి బోర్ కొట్టించాడు. ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది కానీ, కామన్ ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది ఈ సినిమా. రొటీన్ స్టఫ్ గా ఉన్న మాస్ జాతర లో మాస్ పల్స్ ఉన్నా వాటికి బలమైన సన్నివేశాలు ఏమి కనిపించవు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక రవితేజ గుర్తుంటాడు గాని, పాత్రలు అంతగా గుర్తుకు రావు. ఓవరాల్ గా మాస్ జాతర ఫ్యాన్స్ కి మాత్రమే అని చెప్పాలి.
'మాస్ జాతర' తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. ఈ క్రమంలో భానుభోగవరపు డైరెక్షన్ లో నటించిన రవితేజ మాస్ జాతర నవంబర్ లో రిలీజ్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓవరాల్ గా సినిమాలో ఓ సాంగ్ లో చెప్పినట్టు.. అంటే "సూపర్ డూపర్.. సూపర్ డూపర్" హిట్ అంటూ... పాటలో ఉన్న లిరిక్స్ మాదిరే.. "అర్ధం లేదు పర్థం లేదు.. తలా తోక లేదు.. రాగం, తాళం లేదు.. రిథమ్ లేదు.. కథం లేదు, పల్లవి లేదు.. చరణం లేదు, సెన్స్ లేదు.. కామన్ సెన్స్ లేనే లేదు.. అన్నట్టు కామన్ ఆడియన్స్ కి ఈ సినిమా అలాగే అనిపిస్తుంది. కానీ ఇవన్ని లేకపోయినా మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే ఎలివేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యాన్స్ ని మెప్పించొచ్చు.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మూవీ "మాస్ జాతర". భానుభోగవరపు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఒక పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాని రవితేజ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించాడు. అలాగే నవీన్ చంద్ర కూడా ప్రతినాయకుడిగా సినిమాకి ప్లస్ అయ్యాడు. భీమ్స్ మ్యూజిక్ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి. కానీ దర్శకుడు భాను కథ మీద పెట్టిన ఫోకస్ కథనం మీద పెట్టలేకపోయాడు. స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లో గా సాగగా, సన్నివేశాలు ఊహాజనితంగా ఉండడం వల్ల ప్లస్ అవుతాయనుకున్న కొన్ని మాస్ సీన్స్ కూడా మైనస్ అయ్యాయి. సినిమాని ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటె ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఉండేది. కానీ రవితేజ మాస్ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. కామన్ ఆడియన్స్ రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు.
టాలీవుడ్ లో ఈ మధ్య అడల్ట్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువైపోయాయి. అందులో రీసెంట్ గా వచ్చిన సైక్ సిద్ధార్థ్ ఒకటి. నందు హీరోగా నటించిన ఈ సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా కథా, కథనాల విషయంలో ఎక్కడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. నందు సిద్ధార్థ్ క్యారెక్టర్ ని సైక్ ని అర్ధం చేసుకుంటూ నటించాడు. యామిని భాస్కర్ అందంగా, పద్దతిగా సహజంగా వుంది. కాకపోతే ఈ రెండు పాత్రల మధ్య కెమిస్ట్రీ సహజంగా బిల్డ్ చేసే సీన్స్ పడలేదు. అయితే ఫ్రెండ్ గా చేసిన నటుడు సహజంగా కుదిరాడు. ఇక డైరెక్టర్ వరుణ్ రెడ్డి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ని ఫాలో అయ్యాడు. ఎడిటింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మూడు సీన్స్ ఒకేసారి నడుస్తుంటాయి. రీల్స్ ఫాలో అయ్యేవారికీ ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ మీద ఒక వీడియో గేమింగ్ నడిచినట్టే వుంటుంది. కెమరా వర్క్, స్మరణ్ సాయి మ్యూజిక్ ఈ కాన్సెప్ట్ కి సరిపడ్డాయి. వరుణ్ కొన్ని డైలాగుల్ని బానే రాసుకున్నాడు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. అలాగని ఆడియన్స్ పూర్తిగా ఎంగేజ్ చేసిన సినిమా కూడా కాదు.
శ్రీ నందు, యామిని భాస్కర్ హీరో, హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా ఉన్న సినిమా ఇది. ఇది డైరెక్టర్ ఛాయిస్ అయి ఉండొచ్చు. కానీ ఆ అతిగా ఉన్న నరేషనే సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గించేసింది. ఈ సినిమాను చూస్తే రెండు సినిమాలు గుర్తు వస్తాయి, ఒకటి అర్జున్ రెడ్డి.. రెండు డీజె టిల్లు. ఈ రెండిటిని మిక్సీలో వేసి దానికి అతి నేరేషన్ జోడించి సినిమా చేస్తే అది సైక్ సిద్దార్థ. కానీ ఆ రెండు సినిమాలలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. మనసుకు హత్తుకునే సీన్లు ఉంటాయి. టిల్లు చెప్పే పంచులకు నవ్వలేక పొట్ట నొప్పి వస్తుంది. అవేవీ ఈ సిద్ధార్థ లో లేవు. అదే ఈ సినిమా మైనస్. ఏ పాత్ర కూడా బలంగా లేదు. రైటింగ్ వీక్ అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా ఆఫ్ బీట్ గా సాగింది. గుర్తుంచుకోదగ్గ పాట ఒక్కటీ లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ ఒక ప్రయోగాత్మక సినిమా తరహాలో సాగాయి.
కొత్త తరహా పత్రాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే శ్రీ నందు ఈసారి సైక్ సిద్ధార్థ్ మూవీతో హీరోగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో ఇద్దరూ తమ తమ నటనతో ఇంప్రెస్ చేసారు. కానీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు. సినిమా కోసం ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు. ఇక సినిమాలో మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించడంతో పాటు కాస్తంత భిన్నంగా నటించే ప్రయత్నం చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తాను తీయాలనుకున్న విధంగా సినిమాను తీసేశాడు... అంతే. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం డిఫరెంట్ గా ఉండి, ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నా... మేకర్స్ కథ మీద ఇంకాస్తంత గట్టిగా వర్క్ చేసి ఉంటె బాగుండేది. కానీ సినిమాలో రొమాన్స్, కామెడీ పై మాత్రమే ఫోకస్ పెట్టగా, సినిమా కంటెంట్ ఆడియన్స్ కి చేరువ కాలేదు.
శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. సినిమాలో నందు తన పెర్ఫార్మన్స్ తో బాగానే ఆకట్టుకున్నాడు. అలాగే కథానాయికగా యామినీ భాస్కర్ నటన బావుంది. కానీ ఆడియన్స్ కి అంతగా రీచ్ అవలేదు. బూతులు, బోల్డ్ సీన్లు చూపిస్తే అది న్యూ ఏజ్ సినిమా అవ్వదు. ట్రైలర్లలో ఆ కంటెంట్ కొంత మందిని థియేటర్లకు రప్పిస్తుందంతే. ఒక్క విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి... హీరోయిన్ గా పెళ్లి కాని అమ్మాయిని కాకుండా బిడ్డతో భర్త నుంచి వేరుపడిన మహిళతో హీరోతో ప్రేమలో పడినట్టు చూపించడం. ప్రేమ కోసం కష్టపడమని చివరిలో చెప్పిన మాటలు బావున్నాయి. అందరికీ నచ్చే సినిమా కాదిది. జెన్ జి (ఈ తరం యువత)కు అయినా సరే హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఒక్కటే సరిపోదు. కథ కావాలి. యామినీ భాస్కర్, నందు నటనకు పేరొస్తుంది. విజయం మాత్రం కష్టమే.
శ్రీ నందు హీరోగా, యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన మూవీ సైక్ సిద్ధార్థ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథ, కంటెంట్ పరంగా డైరెక్టర్ నెగ్లెట్ చేసాడని చెప్పొచ్చు. అయితే అనేక లోపాలు కనిపిస్తాయి గాని, వాటిని సాంకేతిక విభాగాలు సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు తమ ప్రతిభతో కప్పిపుచ్చాయి. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. డైలాగ్స్ బాగున్నప్పటికీ.. అవసరం లేకున్నా లౌడ్‌గా అరిచి గీపెట్టడం వల్ల సౌండ్ పొల్యూషన్ ఎక్కువగానే అయింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వాల్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమా ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా ఉండే మూవీ. కానీ ఈ కంటెంట్ పరంగా చూస్తే.. షార్ట్ ఫిలింకు ఎక్కువగా.. సినిమాకు తక్కువలా అనిపిస్తుంది. పూర్తిస్థాయి కథతో, ప్రాపర్‌గా క్యారెక్టర్ల డిజైన్ చేసి ఉంటే.. యూత్ ఫుల్, రొమాంటిక్ జోనర్‌లో డెఫినెట్‌గా ట్రెండ్ సెట్టర్ అయి ఉండేది.
నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా అంతగా మెప్పించలేదు గాని, టెక్నికల్ విషయానికి వస్తే... స్మరణ్ సాయి సంగీతం బాగుంది. అయితే చాలా చోట్ల అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తుంది. కె ప్రకాష్ రెడ్డి కెమెరా వర్క్ ఫర్వాలేదు. ప్రతీక్ నూతి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. కంటెంట్ లేకపోవడంతో పదే పదే రిపీటెడ్ సీన్లు వేయడం చిరాకు తెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. దర్శకుడు వరుణ్ రెడ్డి సినిమాని క్రేజీగా తీశాడు. కాకపోతే దశ దిశ లేని సినిమాని రూపొందించారు. చూస్తే చూడండి,లేకపోతే లేదు అనేలా తీశారు. చాలా నిర్లక్ష్యంతో తీసిన సినిమాగా ఇది అని చెప్పొచ్చు. అతను ప్రాపర్‌గా వర్క్ చేసి తీస్తే బాగుండేది. ఫైనల్ గా సైక్ కాదు, సైకో సిద్ధార్థ. జెంజీ కుర్రాళ్లకి కొంత వరకు నచ్చే మూవీ, కానీ కామన్ ఆడియెన్స్ కి మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది.
శ్రీ నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసాడు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. మంచి కాన్సెప్ట్ ఉన్నా, సినిమాలో అనవసరమైన సీన్స్ తో దర్శకుడు కిచిడి చేసాడు. అలాగే అడల్ట్ సన్నివేశాలు తగ్గించి ఉంటే కొంతవరకు ఫ్యామిలీస్ కి ప్లస్ అయ్యేది. ఇక మొత్తానికి "సైక్ సిద్ధార్థ" మూవీ స్టోరీ కంటే స్టైల్ మీదే ఎక్కువగా ఆధారపడిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. అయితే నందు నిజాయితీ తో కూడిన ప్రయత్నం, కొన్ని ఫన్నీ మూమెంట్స్ ప్లస్‌గా నిలిచినా, లైట్ కథ, అతిగా సాగే నరేషన్, రా కంటెంట్ సినిమాను పరిమితం చేశాయి. ప్రయోగాత్మక, ఆఫ్‌బీట్ సినిమాలు ఇష్టపడే యూత్‌కు ఇది కనెక్ట్ కావచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమా చూడటం కష్టమే.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications