Register as a Reviewer
మండాడి (Mandaadi)

మండాడి (Mandaadi)

10 Sep 2026
Overall Rating
5.5/10
2 Reviews

Mandaadi : కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సూరి, టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ "మండాడి". ఎల్రెడ్ కుమార్ 'ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్' బ్యానర్‌ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీని మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేయగా, తాజాగా థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Mathimaran Pugazhendhi
Cast: Soori, Suhas, Mahima Nambiar, Sathyaraj, Mithun Jai Sankar, Ravindravjay, Bala Saravanan, Stun Siva & Others.

Available in:

Reviews

What critics and the public are saying about మండాడి (Mandaadi)

Media Reviews

2 Avg: 5.5/10
One India
One India Website
5

Average

Mandaadi movie review

గ్రామీణ నేపథ్యం, సాంప్రదాయ క్రీడలు, మానవ సంబంధాల కలయికతో తెరకెక్కిన తమిళ డ్రామా 'మండాడి' సినిమా. తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా గురువారం థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో సముద్ర తీర ప్రాంత ప్రజల జీవనశైలిని, వారి సాంప్రదాయ పడవల...

గ్రామీణ నేపథ్యం, సాంప్రదాయ క్రీడలు, మానవ సంబంధాల కలయికతో తెరకెక్కిన తమిళ డ్రామా 'మండాడి' సినిమా. తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా గురువారం థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాలో సముద్ర తీర ప్రాంత ప్రజల జీవనశైలిని, వారి సాంప్రదాయ పడవల పోటీని అత్యంత వాస్తవికంగా తెరకెక్కించడం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. అలాగే సినిమాలో సూరి, సుహాస్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. 


అయితే ఫస్టాఫ్ వేగంగా, ఆసక్తికరంగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌ కు వచ్చేసరికి స్టోరీలో రొటీన్ ఫార్ములా కనిపించి వేగం తగ్గుతుంది. ఇక సినిమాలో హీరోల మధ్య ఉన్న స్నేహం, భావోద్వేగ నేపథ్యాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల కొన్ని సీన్లలో ఎమోషన్ లోపించింది. 


దర్శకుడు మతిమారన్ పుగలేంది ఓ విభిన్నమైన వాటర్ స్పోర్ట్ నేపథ్యాన్ని ఎంచుకుని మెప్పించే ప్రయత్నం చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సముద్రతీర పోరాట ఘట్టాలకు ప్రాణం పోసింది. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ తీరప్రాంత అందాలను గ్రాండ్ గా చూపించింది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉంటే బాగుండేది. ఫైనల్‌ గా.. 'మండాడి' సినిమా సాంప్రదాయ నీటి క్రీడ ఆధారంగా ఈగో, ప్రతీకారాల చుట్టూ సాగే ఓ ఆసక్తికరమైన డ్రామా. విభిన్నమైన కథాంశాలను కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

Sep 11, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

Mandaadi movie review

కోలీవుడ్ నటుడు సూరి, మన టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో సముద్రపు పడవ పందాల నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'మండాడి'. కళింగపట్నంలో స్నేహితులైన ముత్తుకాళి (సూరి), సట్టా పులి (సుహాస్) పగలు, ప్రతికారాల వల్ల శత్రువులుగా మారి పడవ రేసుల్లో ఎలా తలపడ్డారనేదే ఈ చిత్ర కథ.స్క్రీన్ ప్రెజెన్స్‌ తో సూరి అదరగ...

కోలీవుడ్ నటుడు సూరి, మన టాలీవుడ్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్‌లో సముద్రపు పడవ పందాల నేపథ్యంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'మండాడి'. కళింగపట్నంలో స్నేహితులైన ముత్తుకాళి (సూరి), సట్టా పులి (సుహాస్) పగలు, ప్రతికారాల వల్ల శత్రువులుగా మారి పడవ రేసుల్లో ఎలా తలపడ్డారనేదే ఈ చిత్ర కథ.


స్క్రీన్ ప్రెజెన్స్‌ తో సూరి అదరగొడితే, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో సుహాస్ సరికొత్తగా మెప్పించాడు. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్ బీజీఎమ్, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ, హై-వోల్టేజ్ పడవ పందాల సీక్వెన్సెస్ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. అయితే, మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, సాగదీత సన్నివేశాలు ఆడియన్స్‌కు కాస్త బోర్ కొట్టిస్తాయి. సుహాస్ అభిమానులకు ఆయన పాత్ర కొంత నిరాశ కలిగించవచ్చు.


ఫైనల్ వర్డిక్ట్: ఆకట్టుకునే నటన, మాస్ ఎలిమెంట్స్ ఉన్నా.. స్లో నెరేషన్ వల్ల ఓ మోస్తరుగా మిగిలిన యాక్షన్ డ్రామా ఇది. రెగ్యులర్ కమర్షియల్ మూవీ లవర్స్ ఒకసారి చూడొచ్చు!

Sep 10, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story :

 

కథ విషయానికి వస్తే... సముద్ర తీర ప్రాంతమైన కళింగపట్నంలో మత్స్యకారులైన సట్టా పులి (సుహాస్), ముత్తు కాళి (సూరి) బోటింగ్ రేస్ లో ఆరితేరిన వాళ్ళు. అంతే కాదు వీళ్లిద్దరు ఎన్నో పడవ రేస్ పోటీల్లో విజయాలు సాధిస్తారు. అయితే ఒకప్పుడు స్నేహితులైన వీళ్ళు అనుకోకుండా ఓ కారణం వల్ల బద్ధ శత్రువులవుతారు. సూరి వేరే ఊరికి వెళ్లి స్విమ్మర్ గా లైఫ్ గడుపుతుంటాడు. సట్టా పులి మాత్రం అదే ఊళ్ళో పడవ రేసుల్లో ముందుండి, తన వాళ్ళతోనే ఆధిపత్యం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పలు కుట్రలు కూడా చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత అనుకోకుండా సట్టా పులిపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. దీంతో కళింగపట్నంలో పడవ పందాల టీమ్ ల మధ్య గొడవలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మళ్ళీ ముత్తుకాళి రంగంలోకి దిగుతాడు. అంతా కొత్తవాళ్లను తీసుకుని, సట్టా పులి టీమ్ కి ప్రత్యర్థిగా పడవ రేసుల్లో బరిలోకి దిగుతాడు. అసలు ఒకప్పుడు స్నేహితులైన వీరికి గతంలో వైరం ఏంటి? మధ్యలో ఏంజెల్ (మహిమా నంబియార్) తో ముత్తుకాళి రిలేషన్ ఎలా సాగింది. చివరకు పడవ రేసుల్లో ఎవరు గెలిచారు, అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

 

ఇక మండాడి కథ పరంగా మంచి స్టోరీ లైన్ రాసుకున్నారు డైరెక్టర్. చిన్న కథే కానీ దాని చుట్టూ అల్లుకున్న డ్రామా స్క్రీన్ పై దర్శకుడు మతిమారన్ పుగళేంది చక్కగా ఆవిష్కరించాడు. ఇక మూవీలో ముత్తుకాళి పాత్రలో సూరి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో అద్భుతంగా నటించాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో సూరి నటన మంచి ప్లస్ అవుతుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో సుహాస్ సరికొత్తగా నటించాడు. గతంలోనూ కొన్ని మూవీస్ లో నెగిటివ్ రోల్స్ చేయగా, ఈ సినిమా మాత్రం సుహాస్ కి మంచి పేరు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. కీ రోల్ లో నటించిన మహిమా నంబియార్ కి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా బాగా నటించి మెప్పించింది. ఇక సత్యరాజ్, రవీంద్ర విజయ్ సహా ఇతర కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు తమ వరకు మెప్పించడానికి ప్రయత్నించారు. అయితే ట్రైలర్ చూసి చాలా మంది ఇది సముద్రంలో పడవల పోటీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా అని అనుకున్నా, దీన్ని పక్కా కమర్షియల్ మూవీ గానే ఆడియన్స్ కి అనుగుణంగా తీసాడు. ఇక సినిమాలో పడవ పందాల సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌ గా నిలిచాయి. 


Minus Points :

 

"మండాడి" సినిమా స్టోరీ లైన్ బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా స్లో గా సాగడం వల్ల ఆడియన్స్ కి బోర్ కొట్టే అవకాశం ఉంది. అయితే తెలుగు వరకు చూస్తే... రిలీజ్ కి ముందు ఇది మల్టీస్టారర్ లా ఆడియన్స్ అనుకున్నారు. సుహాస్ కూడా ఇందులో హీరో అనుకుంటే, తీరా సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో చూపించడం వల్ల ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నా, సుహాస్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యే అవకాశం ఉంది. పైగా సినిమాలో దర్శకుడు మతిమారన్ పుగళంది స్టార్టింగ్ లో సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి, ఆ తర్వాత అనవసరమైన సన్నివేశాలతో సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగున్నా, ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. 

 

Technical Values :

 

ఇక టెక్నికల్ గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి ఎంత కావాలో అంతా మంచి సాంకేతిక నిపుణులతో పెట్టి మంచి కమర్షియల్ మూవీగా రెడీ చేసారు మేకర్స్. అయితే డైరెక్టర్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు. అంటే ఇంకా గ్రిప్పింగ్ గా రెసీగా స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది. ఇక సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ బాగుంది. బీజీఎమ్ అదిరిపోయింది. అలాగే సినిమాటోగ్రఫర్ ఎస్ఆర్ కతిర్ సినిమాలో సీన్స్ అన్ని చాలా నీట్ గా ఫ్రెష్ గా చూపించారు. ఎడిటింగ్ విషయంలో కొన్ని సాగదీత సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. 

 

Final Review :

 

మొత్తంగా "మండాడి" అంటూ సముద్రపు పడవ పందాల నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్ ని ఆకట్టుకునేలానే ఉంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగినా, కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఏమాత్రం లోటు ఉండదు. ఊళ్ళో ఉండే పగ, ప్రతీకారాల మొదలుకొని, ఆట, ఎమోషన్స్ అన్ని కలిపి సినిమాలో బాగా చూపించారు. అయితే బోరింగ్ ప్లే, స్లో నెరేషన్ వల్ల కొంతవరకు సినిమా బోర్ కొట్టేస్తోంది. ఓవరాల్ గా ఈ మూవీ రెగ్యులర్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. 

Review Statistics

5.5
Overall Rating
Avg. of all reviews
2
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
5.5/10
Public
N/A
Why MRO?