మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)
Mahendragiri Varahi Trailer : మహేంద్రగిరి రాజవంశానికి అమ్మవారి శాపం... దానికోసం అమ్మవారికే ఎదురెళ్ళిన హీరో...
Available in:
About This Movie
టాలీవుడ్ లో మోస్ట్ అండర్రేటెడ్ హీరోస్ లో ఒకరైన సుమంత్ తాజాగా "మహేంద్రగిరి వారాహి" అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ తో ఆడియన్స్ ని మెప్పించడమే లక్ష్యంగా సినిమాలు చేసే సుమంత్ ఈసారి కూడా థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఇంతకు ముందు సుబ్రహ్మణ్యపురం మూవీతో మంచి సక్సెస్ అందుకున్న సుమంత్ అలాంటి డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ తోనే ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇక ట్రైలర్ ని గమనిస్తే... మహేంద్రగిరి రాజవంశంలో 33 ఏళ్లు నిండిన ప్రతి మగబిడ్డ అనుకోని విధంగా మరణిస్తూ ఉండడంతో, ఇది వారాహి అమ్మవారి శాపం అంటూ ట్రైలర్ లో చూపిస్తారు... కానీ ఇది అమ్మవారి శాపం కాదు.. దీని వెనకాల ఏదో తెలియని కుట్ర దాగుదంటూ హీరో దాన్ని ఛేదించడానికి ట్రై చేస్తారు. ఇక ట్రైలర్ ని కట్ చేసిన షాట్స్ కూడా అదిరిపోయాయి. దానికి తగ్గట్టు అనూప్ రూబెన్స్ ఇచ్చిన బీజీఎమ్ కూడా సూపర్ గా ఉంది. అలాగే ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ వారాహి అమ్మవారుగా కనిపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇక మాళవికా నాయర్, మీనాక్షి గోస్వామి కీ రోల్ లో నటిస్తుండగా, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చిన్న స్పెషల్ క్యామియో రోల్ లో మెరవడం ట్రైలర్ లో హైలెట్.
ఇక మహేంద్రగిరి వారాహి ట్రైలర్ ని చూస్తుంటే... సినిమాకి విజువల్స్ క్వాలిటీ చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలో వారాహి అమ్మవారి ఉగ్రరూపం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఫైనల్ గా ఈ సినిమా సుమంత్ కెరీర్ లో మరో డిఫరెంట్ అటెంప్ట్ గా నిలవడం ఖాయమని తెలుస్తుంది. ఇక రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్ లో మధు కాలిపు, లక్ష్మణ్ మహేంద్రగిరి వారాహి చిత్రాన్ని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా సెప్టెంబర్ 11న మహేంద్రగిరి వారాహి సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.