Register as a Reviewer
(మారెమ్మ) Maremma

(మారెమ్మ) Maremma

10 Sep 2026
Overall Rating
4.5/10
2 Reviews

Maremma : మాస్ మహారాజా రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "మారెమ్మ". తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ జాతర కాన్సెప్ట్ తో తెరకెక్కగా, మంచాల నాగరాజ్ డైరెక్ట్ చేసాడు. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బిలౌ యావరేజ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Manchala Nagaraj
Cast: Maadhav, Deepa Balu, Vikas Vasishta, Vinod Kumar, V.S. Rupa Lakshmi, Dayanand Reddy

Available in:

Reviews

What critics and the public are saying about (మారెమ్మ) Maremma

Media Reviews

2 Avg: 4.5/10
Filmi Beat
Filmi Beat Website
4

Below Average

Maremma movie review

దర్శకుడు మంచాల నాగరాజు మారెమ్మ కథకు రాసుకొన్న పాయింట్ బాగున్నది. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయాలను, ఆచారాలను జోడించి కథగా మార్చుకొన్నాడు. సినిమా ఆరంభంలో వచ్చిన సన్నివేశాలను చూస్తే.. ఎదో డిఫరెంట్ కథ చెప్పబోతున్నాడా? అనే ఫీలింగ్ కలిగించాడు. కానీ కథలోకి వెళ్లిన కొద్ది పేలవమైన రైటింగ్, అర్ధం పర్థం లేని సన్...

దర్శకుడు మంచాల నాగరాజు మారెమ్మ కథకు రాసుకొన్న పాయింట్ బాగున్నది. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయాలను, ఆచారాలను జోడించి కథగా మార్చుకొన్నాడు. సినిమా ఆరంభంలో వచ్చిన సన్నివేశాలను చూస్తే.. ఎదో డిఫరెంట్ కథ చెప్పబోతున్నాడా? అనే ఫీలింగ్ కలిగించాడు. కానీ కథలోకి వెళ్లిన కొద్ది పేలవమైన రైటింగ్, అర్ధం పర్థం లేని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా విసుగు పుట్టిస్తాయి. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు. కొన్ని సీన్లు చాలా దారుణంగా చిత్రీకరించారనే ఫీలింగ్ కలుగుతుంది. 


కథలో ఓ ఫ్లో ఉండదు. ప్రేమ కథలో ఎమోషన్ ఉండదు. ఓవరాల్‌ గా అతుకుల బొంత మాదిరిగా ఉంటుంది. ఫస్టాఫ్ ఏదో పర్వాలేదనిపించినా .. సెకండాఫ్‌ను సాగదీసి సాగదీసి సహనానికి పరీక్ష పెట్టారేంటి? అనే విసుగు పుడుతుంది. మంచి పాయింట్‌ను ఎమోషనల్‌గా రాసుకోలేని నిస్సహాయత ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. మాధవ్ యాక్టింగ్ బాగానే ఉన్నా, పూర్తి స్థాయిలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ లా డిజైన్ చేయలేదు. కథ బలం, కథనంలో పసలేకపోతే సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతేలా ఉంటుందనేది ఈ సినిమాలో కనిపించింది. లైటింగ్ ఈ సినిమాకు మైనస్. నటీనటుల ముఖాలు, వారి హావభావాలు కనిపించనంతగా చీకటిలో ముంచేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ అవుట్‌పుట్ చాలా నాసిరకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించుకొండి.


Sep 11, 2026 Read Review
123telugu
123telugu Website
5

Average

Maremma movie Review

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు అంశాలు మెప్పిస్తాయి. అక్కడి సాంప్రదాయ విలువలు, ముఖ్యంగా జానపద పాటలు ఇంప్రెస్ చేసాయి. ఇక యువ నటుడు మ...

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు అంశాలు మెప్పిస్తాయి. అక్కడి సాంప్రదాయ విలువలు, ముఖ్యంగా జానపద పాటలు ఇంప్రెస్ చేసాయి. ఇక యువ నటుడు మాధవ్ భూపతిరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. పాత్రకి తగ్గట్టుగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఇందులో బాగున్నాయి. అయితే రచనా లోపం వల్ల అతని ప్రతిభకు తగ్గ స్కోప్ దక్కలేదు. అలానే యంగ్ హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి అమ్మాయిగా డీసెంట్ లుక్స్, నటనతో ఆకట్టుకుంది. 


ఇక మొత్తంగా చూసుకుంటే ‘మారెమ్మ’ అనేది స్పష్టత లేని ఒక బోరింగ్ రూరల్ డ్రామాగా నిలిచింది. సినిమా కథనం ఆద్యంతం నీరసంగానే సాగుతుంది. ఎలాంటి హై, ఎమోషనల్ మూమెంట్స్ లేకుండా చప్పగా నడిపించడం డిజప్పాయింట్ చేస్తుంది. యువ నటుడు మాధవ్ తన మొదటి సినిమా అయినా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ పేలవమైన రచన మరియు దర్శకత్వం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది.


Sep 11, 2026 Read Review

Public Reviews

Avg: —

No public reviews yet.

About This Movie

Story :

వరంగల్ లోని మహిషాపురం అనే గ్రామంలో, ఊరి క్షేమం కోసం ఏటా జాతరలో ఆ ఊరి ‘మారెమ్మ’ అమ్మవారికి గ్రామస్థులు ఓ దున్నపోతుని బలిదానం ఇవ్వడం ఆచారంగా చేస్తూ ఉంటారు. అలా చేస్తే ఊరికి ఏ కరువు కాటకాలు, రోగాలు రాకుండా అమ్మోరు కాపాడుతుందని వారి నమ్మకం. అయితే ఆ ఊళ్ళో రాబోయే జాతర కోసం మారెమ్మ పేరిట పుట్టిన దున్నపోతును జాతర సమయం దాకా పెంచమని, దాని బాధ్యతను ఆ గ్రామానికి చెందిన కర్ణి (మాధవ్ భూపతిరాజు) కి ఇస్తారు. అయితే జాతర సమయం దగ్గరికొస్తున్న సమయంలో ఊహించని విధంగా ఆ దున్నపోతు మిస్సవుతుంది. అక్కడి నుండి ఊళ్ళో పరిస్థితులు ఎలా మారాయి? బలి జరగకపోతే ఊరికి మళ్ళీ అరిష్టం చుట్టుకుంటుందా? మారెమ్మ - కర్ణి స్నేహం ఎలా సాగింది? మధ్యలో మారెమ్మను పక్క ఊరికి చెందిన వ్యక్తి (వికాస్ వశిష్ట) ఎందుకు చంపాలని అనుకొన్నాడు? చివరికి మారెమ్మ దొరికిందా? కర్ణిని ఏం చేసారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

 

Plus Points :

ఈ సినిమా ట్రైలర్ లోనే కథకి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ చెప్పేసారు కాబట్టి, ఆడియన్స్ క్లారిటీతోనే సినిమాకి వెళ్లారు. ఇక సినిమాకి దర్శకుడు మంచాల నాగరాజు రాసుకొన్న పాయింట్ బాగుంది. తెలంగాణ ప్రాంతంలో ఆచారాలను, సంప్రదాయాలను నేపథ్యంగా జోడించి కథగా రాసుకొన్నాడు. సినిమా స్టార్టింగ్ లోనే స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ సీన్స్ తో ఆడియన్స్ కి చెప్పే ప్రయత్నం చేసాడు. అలాగే మూవీలో దానికి తగ్గట్టు గ్రామీణ నేపథ్యంలో మంచి సాంగ్స్ కూడా పెట్టడం బాగుంది. ఇక యంగ్ హీరో మాధవ్ భూపతిరాజు సినిమాలో తన పాత్రకు న్యాయం చేస్తూ, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. కాకపోతే ఆ పాత్రను మరింత బలంగా రాసుకుని ఉంటే యాక్టింగ్ కి స్కోప్ ఉండేది. అలాగే హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి అమ్మాయిగా డీసెంట్ నటనతో ఆకట్టుకుంది. అన్నిటికి మించి ఆ గ్రామీణ వాతావరణం కూడా బాగా ఆకట్టుకుంది. 

 

Minus Points :

అయితే సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్తే చాలానే ఉన్నాయి. ట్రైలర్ ద్వారా మంచి ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు అసలు ప్రేక్షకులకు ఈ సినిమాతో ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అర్ధమే కానట్టుంటుంది. జంతు బలుల గురించి ఏదైనా సందేశం ఇవ్వాలని భావించి ఉంటే మాత్రం ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ కాలేదు. సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్ లో జాతర సీన్స్, దున్నపోతుతో హీరో సీన్స్ ని నింపేసి, సెకండ్ హాఫ్ అంతా తప్పిపోయిన దున్నపోతును వెతకడంతోనే సరిపోయింది. క్లైమాక్స్ లో ఓ చిన్న మెసేజ్ తో సినిమా ముగించారు. స్టోరీ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే పరంగా చాలా బోరింగ్ గా సాగుతుంది. హీరో క్యారెక్టర్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. అలాగే చేతబడి వంటి సీన్స్ కథపై ఎలాంటి ప్రభావం చూపలేదు. నిజానికి కథ బలంగా ఉంటే మిగతావన్నీ సినిమాకి మరోబలం అయ్యేవి. అసలు సరైన కథే లేనపుడు ఎన్ని మంచి సీన్లు పెట్టి ఏం లాభం.

 

Technical Values :

ఇక మారెమ్మ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మ్యూజిక్ పరంగా ప్రశాంత్ విహారి ఇచ్చిన సాంగ్స్ తో పాటు, బీజీఎమ్ స్కోర్ బాగున్నాయి. ప్రశాంత్ అంకిరెడ్డి కెమెరా వర్క్ కూడా పర్లేదు. పల్లెటూరి  గ్రామీణ వాతావరణాన్ని చక్కగా కెమెరాలో బంధించాడు. ఎడిటింగ్ వర్క్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. ఇక డైరెక్టర్ మంచాల నాగరాజ్ కథ, కథనం రెండూ పేలవంగానే రాసుకున్నాడు. చెప్పాలనుకున్న మెసేజ్ బాగానే ఉన్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. అన్ని సీన్లు సాగదీతగా ఉంటూ ఆడియన్స్ కి విసుగు తెప్పించాయి. క్లైమాక్స్ కూడా ఏదో ఆశిస్తే సింపుల్ గా ముగించేశారు.

 

Final Review :

ఓవరాల్ గా మారెమ్మ సినిమా ఒక గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన సస్పెన్స్ తో కూడిన బోరింగ్ ఎమోషనల్ డ్రామాగా నిలిచింది. స్టోరీ పాయింట్ బాగానే ఉన్నా, స్క్రీన్ ప్లే మొత్తం పేలవంగా బోరింగ్ గా సాగింది. ఇటు రూరల్ డ్రామా టచ్ గాని, ఎమోషన్స్ కానీ దేనికి పెద్దగా కనెక్ట్ కాలేదు ప్రేక్షకులు. కాకపోతే ఆ గ్రామీణ వాతావరణానికి తెలంగాణ ఆడియన్స్ కొంతవరకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి కొత్తదనం కోరుకుంటే మాత్రం ఈ సినిమా తీవ్రంగా నిరాశపరుస్తుంది.

Review Statistics

4.5
Overall Rating
Avg. of all reviews
2
Total Reviews
From 1 Provider Types

Review Average

Media
4.5/10
Public
N/A
Why MRO?