Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో సత్య ఒకరు. సత్య కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గతంలో అలీ లాంటి కమెడియన్లు హీరోలుగా నటించారు. సత్య కూడా తొలిసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ జెట్లీ అనే మూవీలో నటించారు. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర పాత్రల్లో నటించారు. అయితే కథ కొంచెం యావరేజ్ గా ఉన్నా తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా ఉంటే ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. కానీ ఈ చిత్రంలో ఆ రెండూ మైనస్ అయ్యాయి.
సరైన కథ లేదు, తెరకెక్కించిన విధానం కూడా గొప్పగా లేదు. ఈ చిత్రం చూశాక అంత రన్ టైం ఏమాత్రం అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. చాలా సన్నివేశాలు షార్ప్ గా ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉండొచ్చు. కానీ అది జరగలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలా టెక్నికల్ గా ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా, కథ, కథనాల విషయంలో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయితే నిర్మొహమాటంగా తిరస్కరించే అవకాశం ఉంది. ఓవరాల్ గా... దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య హీరోగా 'జెట్లీ'తో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కథ, కామెడీ ఏదీ ఆకట్టుకునే విధంగా లేదు.
కమెడియన్ కం హీరో సత్య మెయిన్ లీడ్ లో నటించిన జెట్లీ మూవీ తాజాగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. కథా, కథనాల గురించి ఏం మాట్లాడకపోవడమే బెటర్. ఎంతకూ ముందుకు కదలని కథ, విసుగు తెప్పించే సన్నివేశాల కారణంగా నటీనటుల, సాంకేతిక నిపుణుల ప్రతిభ బూడిదలో పోసిన పన్నేరే అయ్యింది. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సీన్స్ ను ఎలివేట్ చేశాడు. చాలా చోట్ల కేవలం సైగలకు కూడా అర్థవంతమైన ఆర్. ఆర్. ఇచ్చాడు. లిమిటెడ్ స్పేస్‌లో సినిమాటోగ్రాఫర్ సురేశ్ సారంగం తన ప్రతిభను కనపరిచాడు.
మేకింగ్ పరంగా ఎలాంటి వంకా పెట్టడానికి లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రెజెంటేషన్ లో చెర్రీ, హేమలత ఈ సినిమాకు అవసరమైన దాని కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఎటొచ్చి కథను జడ్జ్ చేసుకోవడంలోనే అట్టర్ ఫెయిల్ అయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చెర్రీకి, మైత్రీ మూవీస్ వారికి ఈ కథ ఎలా నచ్చిందనే విషయం బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. కథే లేకుండా కేవలం కామెడీ సీన్స్ రాసుకుని ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ తో దర్శకుడు రితేష్ రానా సినిమా తీసినట్లుంది. ఎంత గాల్లో తీసిన సినిమా అయినా నేలవిడిచి సాము చేస్తామంటే కుదరదు కదా! అందుకే 'జెట్లీ' సినిమా థియేటర్లలో నిరాశతో కూడిన నిట్టూర్పులు, అసహనంతో వచ్చిన అరుపులు వినిపిస్తున్నాయి.
ప్రజాపతి బ్యాంక్ దివాళాతో జెట్లీ సినిమాను ఆరంభించిన దర్శకుడు రితేష్ రానా.. ప్రారంభంలో ఆసక్తికరంగా కథను చెప్పే ప్రయత్నం చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. కథ సాగుతున్న కొద్ది సన్నివేశాల్లో పసలేదనే విషయం సినిమా ఆరంభమైన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. పొంతనలేని కథనం, అర్ధపర్థం లేని డైలాగ్స్, అసందర్భంగా సాగే కామెడీతో అనుక్షణం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా మూవీ సాగుతుంది. ఫస్టాఫ్ ముగిసే సమయానికే ఈ సినిమా గమ్యం లేని ఫ్లయిట్ దారి తప్పినట్టుగా అనిపిస్తుంది.
ఇక కథలో బలం, కథనం పేలవంగా ఉండటంతో సత్య లాంటి కమెడియన్ ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అయ్యాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. నాసిరకమైన స్క్రిప్టును కూడా సత్య తన పెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి. ఏ పాత్ర కూడా ఆడియెన్స్ ను కనెక్ట్ చేసే విధంగా లేకపోవడం వల్ల అజయ్, కబీర్ సింగ్, రియా సింఘా, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్ల నటన నామమాత్రంగానే మిగిలిపోయిందని చెప్పాలి. ఉన్నంతలో కాలభైరవ తన మ్యూజిక్‌తో కొంత బెటర్‌గా అనిపిస్తాడు. ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సింది. ఈ సినిమాలో థియేట్రికల్ వాల్యూ ఎక్కడా కనిపించదు. కనీసం ఓటీటీలోనైనా ప్రేక్షకులను మెప్పించే సరుకు సినిమాలో కనిపించదు. కాబట్టి ఈ సినిమా తలరాత ఏమిటో మీకే అర్ధం అయి ఉంటుందనుకొంటా.
‘మత్తువదలరా’తో సత్యలోని టైమింగ్‌ను రితేష్ రానా అద్భుతంగా వాడుకున్నాడు. రితేష్ రానా మేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే అదే రితేష్ రానా ఇప్పుడు సత్యని హీరోగా పెట్టి ‘జెట్‌లీ’ అని మూవీని తీశాడు. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా డిస్సపాయింట్ చేసారు. నటీనటులందరూ బాగానే పెర్ఫార్మ్ చేసినా, మెయిన్ కథను వదిలేసారు.
ఇక టెక్నికల్ గా చూసుకుంటే జెట్‌లీ కి చాలా తక్కువ బడ్జెట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్, వీఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా నాసిరకంగా కనిపిస్తాయి. ఆర్ఆర్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఆర్ఆర్‌తోనే చాలా వరకు నవ్వించే ప్రయత్నం చేశారు. మాటలు చాలా వరకు మీమ్స్ రిఫరెన్స్‌లానే అనిపిస్తాయి. చాలా సినిమాల మీద కౌంటర్లు వేసినట్టుగా అనిపిస్తుంది. పెట్టిన ఖర్చుకి, తీసిన అవుట్‌పుట్‌కి వచ్చే ఫలితానికి సంబంధం ఉండకపోవచ్చేమో. సత్య, వెన్నెల కిషోర్ ఉన్నారు.. వారిద్దరూ చూసుకుంటారు.. నవ్విస్తారు.. ఎంటర్టైన్ చేస్తారు.. పైగా రితేష్ రానా.. అని ఎక్కువగా ఆశించి వస్తే మాత్రం ఆడియెన్స్ భంగపడతారు. ఓవరాల్ గా జెట్‌లీ చూస్తే థియేటర్స్‌లో ప్రేక్షకుల ఆర్తనాదాలు అని చెప్పుకోవచ్చు.
కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "జెట్లీ". మత్తు వదలరా ఫేమ్ 'రితేష్ రానా' దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆడియన్స్ నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది జెట్లీ. సినిమా కథ కథనాల పరంగా కూడా అంతగా మంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. కాల భైరవ మ్యూజిక్ బీజీఎమ్ బాగుంది.
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టైతే ఈ ‘జెట్ లీ’ సినిమా స్ట్రిక్ట్ గా కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే కామెడీ ఫ్లిక్ అని చెప్పొచ్చు. సత్య, వెన్నెల కిషోర్ లతో రితేష్ ప్లాన్ చేసిన కామెడీ ట్రాక్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ కథనం మాత్రం ప్యాకెడ్ గా లేదు. దర్శకుడు ఈ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. సో కొన్ని చోట్ల నవ్వించినా కొన్ని చోట్ల మాత్రం బోర్ కొట్టిస్తుంది. తక్కువ అంచనాలతో చూస్తే ఒకసారి ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది.
సత్య మెయిన్ లీడ్ లో నటించిన ‘జెట్లీ’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. కథా కథనాల పరంగా ఈసారి దర్శకుడు రితేష్ రానా పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉన్నా, ప్రతి ఆడియన్ ఎంతో కొంత కథను ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇందులో అంత ఏమి కనిపించలేదు. ఇక సాంకేతికంగా చూస్తే పాటలు లేని ఈ సినిమాలో కాలభైరవ బీజీఎమ్తో కొంత వరకు మెప్పించాడు. రితేష్ రాణా శైలికి తగ్గట్లే అతను ఆర్ఆర్ ఇచ్చాడు.
సురేష్ సారంగం ఛాయాగ్రహణం బాగానే సాగింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బాగా చేశారు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక జయేంద్రతో కలిసి రితేష్ రాణా రాసిన కథలో పెద్దగా విషయం లేదు. స్క్రీన్ ప్లే తో మాయ చేయాలని చూసినా.. అది వర్కవుట్ కాలేదు. రితేష్ డైలాగులు మాత్రం ఆకట్టుకుంటాయి. తన రైటింగ్-టేకింగ్ లో తన సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని చోట్ల కనిపించింది కానీ.. అందులో నిలకడ లేకపోయింది. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్ చేయకపోవడంతో రితేష్ తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా జెట్లీ.. అంచనాలను కుదిపేశాడు.
ధనుష్ నటించిన కర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటన పరంగా ధనుష్ అదరగొట్టాడు. ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షోగా కర మూవీ ఆకట్టుకుంటుంది. అయితే మమితా బైజు పాత్ర పరిధి చాలా తక్కువ. దొంగ అని తెలిసి కర స్వామిని పెళ్లి చేసుకునే మహిళగా నటించారు. ఆమె నటన సహజంగా ఉంది. వైట్ కాలర్ క్రిమినల్ తరహా పాత్రను జయరామ్ పోషించారు. పాత్రకు అవసరమైన కన్నింగ్ నేచర్‌ను కేవలం కళ్ళలో చూపించారు.
ఇక ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా రైతులు కనెక్ట్ అయ్యే సినిమా 'కర' అని చెప్పాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అవగాహన లేకుండా లోనులు తీసుకున్న మధ్య తగరతి ప్రజలను కొందరు అధికారులు జలగల్లా పీల్చుకుని తింటున్న సమయంలో ఎదురు తిరిగిన ఓ దొంగ కథ 'కర'. ధనుష్ లేని సినిమాను ఊహించుకోలేం. అంత అద్భుతంగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాను ఎలివేట్ చేసింది. ఇదొక స్లో బర్న్ థ్రిల్లర్. నిదానంగా మొదలై చివరకు ఓ శాటిస్‌ఫ్యాక్షన్ ఇస్తుంది.
ధనుష్ నటించిన కర మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల కాగా, ఆశించిన రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయింది. కథాకథనాలు రొటీన్ గా ఉండగా, దర్శకుడు విగ్నేష్ ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు. ఇక ధనుష్ నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ, ఇక హీరోయిన్ మమిత బైజు తొలిసారి డీ గ్లామర్ పాత్రలో కనిపించగా, తన పాత్రలో డీసెంట్ లుక్స్ తో ఆకట్టుకుంది. కాకపోతే నటన పరంగా మరింత రాణించాల్సింది. కందస్వామిగా కెఎస్ రవికుమార్ జీవించాడు. ఇక జయరామ్, సూరజ్ కరుణాస్, పృథ్వీ రాజన్ తదితరులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.
ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రఫీ. తేని ఈశ్వర్ కథకు తగ్గట్టు కెమెరా వర్క్ బాగా చేశారు. కానీ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ మార్క్ సినిమాలో కనిపించలేదు సందర్భానుసారం వచ్చే రెండు పాటలు సోసో… తెలుగు డబ్బింగ్ విషయంలో కొంత వరకూ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ధనుష్ గత చిత్రం 'ఇడ్లీ కడై' కూడా ఇదే తరహాలో తండ్రి సెంటిమెంటుతో వచ్చినదే. ఈసారి కూడా అదే జానర్ సినిమా కావటం వల్ల కర ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది.
తమిళ స్టార్ హీరో ధనుష్ చివరగా వచ్చిన ఇడ్లీ కొట్టుతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే దర్శకుడు కథా కథనాల విషయంలో నిరాశపరచగా, ధనుష్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడని చెప్పాలి. కథలో ఆయన పాత్రకు ఉన్న బలం స్క్రీన్ పై అంతగా కనిపించలేదు. అలాగే హీరోయిన్ మమిత బైజు నటన కూడా కొంచెం ఓవర్‌గా, సహజత్వం లేకుండా అనిపించింది.
అయితే సీనియర్ నటులు కె.ఎస్. రవికుమార్, ఎం.ఎస్. భాస్కర్ మాత్రం తమ పాత్రల్లో బాగా నటించి ఆకట్టుకున్నారు. ఇక కర సినిమా మొదటి భాగం సరాసరిగా అనిపించగా, రెండో భాగం మాత్రం చాలా నెమ్మదిగా, బోర్‌గా సాగింది. క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టలేకపోయింది. ఓవరాల్ గా కర సినిమా ధనుష్ అభిమానులను కూడా మెప్పించలేకపోయింది.
తెలుగులో ధనుష్ మూవీకి మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందో.. తెలుగులోనూ ఇంచు మించు అదే స్థాయిలో రిలీజ్ అవుతుంటాయి ఆయన సినిమాలు. ఏడాది మూడు, నాలుగు సినిమాల్ని ధనుష్ అందిస్తున్నారు. ఇప్పుడు ‘కర’ అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో కరసామిగా ధనుష్ బాగా మెప్పించాడు. అలాగే మామితా బైజు సహజ నటనతో మెప్పించింది.
టెక్నికల్ గా చూస్తే... 90వ దశకాన్ని, ఆ వాతావరణాన్ని తెరపై తీసుకు రావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ ఆర్ఆర్ బాగుంటుంది. పాటలు అయితే అంత గుర్తు పెట్టుకునేలా లేవు. విజువల్స్ ఎంతో నేచురల్‌గా, యాక్షన్ సీక్వెన్స్ సింపుల్‌గా ఉంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘కర’ మూవీ.. ఓ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా అయితే కాదు. కొన్ని చోట్ల నిదానంగా, బోరింగ్ గా అనిపిస్తుంది. రైతులు, బ్యాంకులు అంటూ మంచి పాయింట్ ను విఘ్నేశ్ రాజా చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఈ ప్రయత్నానికి కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.
కోలీవుడ్ స్టార్ ధనుష్, మమిత బైజు హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఇక రివ్యూ విషయానికి వస్తే... ‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం పరవాలేదు.
కొన్ని సాగదీత సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఓవరాల్ గా ఈ సినిమాలో ధనుష్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి కర సినిమా డీసెంట్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వాఝా2 పేరిట మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా తాజాగా తెలుగులో వాలా 2 పేరుతో రిలీజ్ కాగా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది. హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ మెయిన్ లీడ్స్ లో నటించగా, వీరు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేకపోయినా, ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక దర్శకుడిగా సావిన్ SA తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ డీసెంట్ గా ఉన్నాయి. పైగా సినిమాలో సహజత్వం చాలా ఇంప్రెస్ చేస్తుంది. పైగా మండుతున్న సమ్మర్ లో కూల్ గా ఇలాంటి పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది.
ఇక రకరకాల కారణాలతో కుటుంబాలను వదిలి దూరం వెళ్లిన యువత ఎలా రియలైజ్ అవుతుంది. వారి మార్పు కుటుంబాలకు ఎలా అండగా ఉంటుందనే క్లైమాక్స్ ఎంతో బలంగా నిలిచింది. దర్శకుడు ఆ సన్నివేశాలు తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. సినిమా నాచురల్ గా ఉంది. అనువాదం చేసే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. మిడిల్ క్లాస్ కుర్రకారుకు, కుటుంబాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. మధ్యతరగతి మనుషుల జీవితాల్లో పలు విషయాలను గుర్తు చేస్తుందీ వాలా 2 సినిమా.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers