Register as a Reviewer
సిగ్మా (Sigma)

సిగ్మా (Sigma)

Upcoming Expected Release: 02 Oct 2026

Sigma Telugu Trailer : సీఎం దళపతి కొడుకు డైరెక్టర్ గా... సందీప్ కిషన్ హీరోగా సినిమా... మరి ఎలాంటి డెబ్యూ దక్కుతుందో..

Director: Jason Sanjay
Cast: Sundeep Kishan, Faria Abdullah, Raju Sundaram, Sampath Raj, Shiv Panditt, Anbu Thasan, Yog Japee, Magalakshmi, Sheela Rajkumar, Kamalesh, Kiran Konda

Available in:

About This Movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటించిన లేటెస్ట్ ఆక్షన్ ఎంటర్టైనర్ "సిగ్మా" (Sigma). తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా, తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. 

 

ఇక సిగ్మా ట్రైలర్ ఆద్యంతం స్టైలిష్ యాక్షన్ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ లో "ఈ జూదము, మత్తు.. కాయిన్‌ కి రెండు వైపుల్లాంటివి.. ఈ రెండూ అలవాటు చేస్తే కోట్లు సంపాదించవచ్చు.." .. "ఎంత? ఐదు వందల కోట్లు!"... అంటూ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ మంచి హైప్ క్రియేట్ చేయగా, కథ నేపథ్యాన్ని కూడా ఈ డైలాగ్ ద్వారా రివీల్ చేసినట్లుంది. ఇక ఈ సినిమాను రోబెరీ, డ్రగ్స్ నేపథ్యంలో పక్కా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

 

ఇక ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా, సంపత్ రాజ్ విలన్ గా నటించాడు. ఇక సందీప్ కిషన్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్‌ లో కనిపిస్తున్నాడు. ఇక దళపతి విజయ్ వంటి స్టార్ హీరో కొడుకైనప్పటికీ హీరోగా కాకుండా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్, మొదటి సినిమాతోనే ట్రైలర్ ద్వారా తన మేకింగ్ టాలెంట్ ని చూపిస్తున్నాడు. దీనికి తోడు ట్రైలర్ కి ఎస్. థమన్ అందించిన బీజీఎమ్ అదిరిపోయింది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఇక ఈ సిగ్మా సినిమాను అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో  సందీప్ కిషన్ ఎలాంటి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి. అలాగే విజయ్ కొడుకు జాసన్ సంజయ్ కి డైరెక్టర్ గా ఎలాంటి డెబ్యూ దక్కుతుందో వేచి చూడాలి. 

Why MRO?