Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

608
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 85-96 of 608 reviews
Clear all filters

Irumudi Movie Review

7.0
out of 10
టీచర్, స్టూడెంట్ రిలేషన్ గురించి మంచి ఎమోషనల్ సీన్‌ తో "ఇరుముడి" కథను మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ తొలి సీన్‌లోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ క్యారెక్టర్లను రెండు, మూడు సీన్లలో ఎస్టాబ్లిష్ చేసి.. ఆయన కూతురు మణెమ్మతో బంధాన్ని భావోద్వేగంగా ఎస్టాబ్లిష్ చేసి సినిమాను పరుగులు పెట్టించాడు. ఎలాంటి హంగామా, ఆర్భాటం లేకుండా, రవితేజ్ ఇమేజ్‌ కు భి...

టీచర్, స్టూడెంట్ రిలేషన్ గురించి మంచి ఎమోషనల్ సీన్‌ తో "ఇరుముడి" కథను మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ తొలి సీన్‌లోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ క్యారెక్టర్లను రెండు, మూడు సీన్లలో ఎస్టాబ్లిష్ చేసి.. ఆయన కూతురు మణెమ్మతో బంధాన్ని భావోద్వేగంగా ఎస్టాబ్లిష్ చేసి సినిమాను పరుగులు పెట్టించాడు. ఎలాంటి హంగామా, ఆర్భాటం లేకుండా, రవితేజ్ ఇమేజ్‌ కు భిన్నంగా ఫీల్ గుడ్ సీన్స్ తో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. 


ఇరుముడి సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, అయ్యప్ప స్వామి డివైన్, రూరల్ డ్రామాగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ అంశాలను పర్‌ఫెక్ట్‌ గా బ్లెండ్ చేశారు. దాంతో ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ఎమోషనల్ కనెక్ట్ చేసి సినిమాతో జర్నీ చేసేలా ఉంటుంది. రవితేజ కెరీర్‌ లో ది బెస్ట్ మూవీ. బేబీ నక్షత్ర, ఆడపిల్లలందరూ బాగా నటించారు. ఈ వారం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాను చూడాలంటే.. ఇరుముడిని ఏ మాత్రం ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

Tupaki

By Tupaki

7.0
out of 10
ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. కానీ ఈసారి దెబ్బపడలేదు. ఏ ముహూర్తంలో ఇరుముడి టైటిల్ తో సినిమా స్టార్ట్ చేస...

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. కానీ ఈసారి దెబ్బపడలేదు. ఏ ముహూర్తంలో ఇరుముడి టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసారో తెలీదు గాని, సినిమా ఆడియన్స్ లోకి రిలీజ్ కి ముందే ఖచ్చితంగా చూడాలన్నట్టు మైండ్ లో ఫిక్స్ అయినట్టున్నారు. చాలా ఏళ్ళ తర్వాత రవితేజ సినిమాకి ఓ రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి


పైగా మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ఇలాంటి సినిమాకు ఒప్పుకోవడం.. ఆయన్ని పెట్టి శివ నిర్వాణ ఈ సినిమా తీయాలనుకోవడం షాకింగే. అయితే ‘ఇరుముడి’లో సగటు తెలుగు ప్రేక్షకులు ‘జీర్ణించుకోలేని’ విషయాలు చాలానే ఉన్నాయి. ఐతే ‘ఇలా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు’ అనే స్టాక్ డైలాగును దాటి ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమే. మాస్ చిత్రాల మూసలో మరుగున పడిపోయిన రవితేజలోని పెర్ఫామర్ ను ఈ సినిమాలో చూడొచ్చు. తెర మీద పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు ఎంత బాగా ఫీలయ్యారంటే.. ఆ కథ వారికి అంతగా కనెక్ట్ అయినట్లు. ‘ఇరుముడి’లో చివరి అరగంటలో ప్రేక్షకుల భావోద్వేగాలు అలాగే పతాక స్థాయికి వెళ్తాయి. హీరో పాత్ర తాలూకు బాధను.. కసిని ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఫీలవుతారు. ఫైనల్ గా చివరగా ఇరుముడి.. డ్రామా బలంగా.. మెసేజ్ హృద్యంగా ఆకట్టుకుంటుంది. 






Aug 21, 2026 Tamil +1

Irumudi movie review

7.0
out of 10
‘ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌ గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా ఉండాలి, ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎంత ధైర్యంగా పెంచాలి అన్నది చూపించాడు శివ నిర్వాణ. ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని అంశాల్ని జోడించి ఇరుముడిని శివ నిర్వాణ ఎమోష...

‘ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌ గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా ఉండాలి, ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎంత ధైర్యంగా పెంచాలి అన్నది చూపించాడు శివ నిర్వాణ. ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని అంశాల్ని జోడించి ఇరుముడిని శివ నిర్వాణ ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 


త్రినాథ్ గా రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. కానీ కథలో ఎమోషన్ కి కనెక్ట్ అయితే అవి ఏం అంత అనిపించవు. కొన్ని చోట్ల సినిమా కాస్త వీక్‌గా అనిపించినా.. టోటల్‌గా చూసుకుంటే మాత్రం ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. రవితేజకు చాలా రోజులకు మంచి విజయం వచ్చినట్టే. అలాగే శివ నిర్వాణకు దర్సకుడిగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక కమర్షియల్‌గా ఇది ఏ రేంజ్‌కి వెళ్తుంది అన్నది మున్ముందు తెలుస్తుంది. 

Aug 21, 2026 Tamil +1

Irumudi movie review

8.0
out of 10
రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ‘ఇరుముడి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన...

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ‘ఇరుముడి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


అయితే కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. ఐతే, రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.


Aug 21, 2026 Tamil +1

Irumudi Movie Review

Gulte

By Gulte

6.0
out of 10
#Irumudi - Empowering & EngagingFirstly, kudos to Raviteja and Shiva Nirvana for choosing a socially relevant subject and telling it honestly without deviating from the core point. If you are a parent of a girl child, the film will prompt you to reflect and may lead you to make some changes in your current parenting approach. Throughout the first half of the film, Shiva Nirvana superbly built...

#Irumudi - Empowering & Engaging


Firstly, kudos to Raviteja and Shiva Nirvana for choosing a socially relevant subject and telling it honestly without deviating from the core point. If you are a parent of a girl child, the film will prompt you to reflect and may lead you to make some changes in your current parenting approach.


Throughout the first half of the film, Shiva Nirvana superbly built the tension. The bond between the father and the son, Sai Kumar's dialogues about girls and parenting, and the undercurrent suspense and thrill were nicely built along with a good pre-interval sequence in the first half.


Shiva Nirvana succeeded in writing the emotional drama and the twist in the second half well. However, the episode after the twist reveal, should have been a bit better. But, the director made sure to end the film with a very emotional climax. Also, the action episode with the ‘Mallepoola Pallaki’ song in the background, brought the roof down in the theatre with loud cheers from the audience.


Overall, Irumudi is empowering, thought provoking and entertaining. Raviteja is most likely to earn a lot of respect for doing such a socially relevant film.


Rating - 3/5

Aug 21, 2026 Tamil +1

Agadha Movie Review

5.0
out of 10
MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre where the divinity wins over evil, with his latest directorial, expressing strong confidence in its success.HighlightsThe climax twistCinematographyDrawbacksLack of novelty in the horror genreForced ch...

MS Raju, the successful producer of films like Okkadu, Varsham, and Nuvvostanante Nenoddantana, turned director and ventured into bold filmmaking with Dirty Hari. He has now entered the horror genre where the divinity wins over evil, with his latest directorial, expressing strong confidence in its success.


Highlights

The climax twist

Cinematography


Drawbacks

Lack of novelty in the horror genre

Forced characters

Cliched episodes


Overall, “Agadha” does not provide excitment. It neither scares nor thrills consistently. Apart from the kala tantra episode and a few portions in the second half, it remains a routine horror drama. The ending also hints at a possible second part.


Aug 20, 2026 Telugu

Agadha Movie Review

5.0
out of 10
దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ కనిపించవు. ఎక్కడా కూడా ఓ కొత్త సీన్, వావ్ అనిపించేలా ఓ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపించదు. ...

దైవం, దుష్టశక్తి అనే కాన్సెప్ట్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌‌లో ప్రారంభం, ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. అయితే దైవశక్తిని చూపించే తీరు, దుష్టశక్తి చేసే విధ్వంసం, దాని మూలాన వచ్చే సమస్యలు ఇవే సినిమాని ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి. కానీ ఈ ‘అగధ’లో అలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు ఏమీ కనిపించవు. ఎక్కడా కూడా ఓ కొత్త సీన్, వావ్ అనిపించేలా ఓ ఎపిసోడ్ ఉన్నట్టు కనిపించదు. 


డైరెక్టర్ ఎమ్మెస్ రాజు మాటల్లో ఎంతో బిల్డప్ ఇచ్చిన అగధ.. చేతల్లో మాత్రం ఏమీ చూపించదు. అగధకి ఇచ్చిన బిల్డప్‌ చూస్తే సెకండాఫ్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఆశిస్తే మాత్రం నిరాశే కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగుంటాయి. టెక్నికల్ టీం ఈ సినిమాకి ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు.చివరగా ‘అగధ’లో బ్లాక్ మ్యాజిక్ ప్రభావవంతంగా అనిపించదు.. తెరపైనా ఎంఎస్ రాజు మ్యాజిక్ కనిపించదు. ఫైనల్ గా వన్ టైం వాచబుల్. 

Aug 20, 2026 Telugu

Agadha movie review

Tupaki

By Tupaki

5.0
out of 10
దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్తులతో నింపేయాలని చూసే ఒక మహా దుష్ట శక్తితో.. దైవానుగ్రహం ఉన్న ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ అగధ సిన...

దైవ భక్తికి.. దుష్ట శక్తికి మధ్య పోరాటం అన్నది సినిమాల్లో దశాబ్దాల నుంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఫార్ములా. సీనియర్ నిర్మాత ఎంఎస్ రాజు కూడా 90వ దశకంలో ఈ జానర్లో ‘దేవి’ సినిమా తీసి హిట్టు కొట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఇప్పుడు దర్శకుడిగా అదే తరహాలో తీసిన ‘అగధ’ మూవీ తీశారు. ఈ ప్రపంచాన్ని ప్రతికూల శక్తులతో నింపేయాలని చూసే ఒక మహా దుష్ట శక్తితో.. దైవానుగ్రహం ఉన్న ఒక అమ్మాయి చేసే పోరాటమే ఈ అగధ సినిమా. 


కానీ ఎప్పుడో ఒక సీన్లో మెరుపులు మెరిపించడమే తప్ప.. ఈ సినిమాలో ఫ్లో మాత్రం మిస్ అయింది. ఎగుడు దిగుడు కథనం.. అసహనం కలిగించే కొన్ని పాత్రల చిత్రణ.. ఆ పాత్రల్లో ఆర్టిస్టుల నటన.. స్లో నేరేషన్ అగధ ఫ్లోను దెబ్బ తీశాయి. రైటర్ కం డైరెక్టర్ ఎంఎస్ రాజు అగధ కోసం ఎఫర్ట్ పెట్టారు కానీ.. అది సరిపోలేదు. ఆయన క్లారిటీ లేని రైటింగ్ వల్ల కథనం ఆసక్తికరంగా సాగలేదు. కొన్ని సన్నివేశాల వరకు రాజు టేకింగ్ బాగున్నా.. కంప్లీట్ సినిమాను అందించలేకపోయారు. చివరగా: అగధ.. సరిపోని థ్రిల్



Aug 20, 2026 Telugu

Agadha Movie Review

5.0
out of 10
ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే.&nbs...

ఈ మధ్య కాలంలో తెలుగులో స్పిరిట్‌, ఈవిల్ స్పిరిట్‌ సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకదానిని మించి మరొకటి ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తున్నాయి. 'అగధ' కూడా అలాంటి మిస్టికల్‌ స్పిరిట్‌ రిలేటెడ్ మూవీనే. ఈ తరహా చిత్రాలలో లాజిక్ జోలికి పోకుండా ఉంటేనే మంచిది. అప్పుడే సినిమాను ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. మూవీ చూస్తుండగా, 'ఇది ఎలా సాధ్యం?' అనే ప్రశ్న ప్రేక్షకుడి మనసులో ఉదయించిందంటే, దర్శకుడు ఫెయిల్‌ అయినట్టే. 


సినిమాలో.. తన బలాన్ని పెంచుకోవడానికి క్షుద్ర శక్తి చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న కారణంగా, దానికి కారకులైన వారి మీద అది పగ బట్టడం అనేది చాలా రొటీన్ థీమ్‌. కాకపోతే దాన్ని టెక్నికల్‌ సపోర్ట్ తో కొత్తగా చూపించే ప్రయత్నం ఎమ్మెస్ రాజు చేశారు. కొత్తదనం లేని కథను తీసుకుని, భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినా... రొటీన్ అండ్ రిపీటెడ్ సీన్స్ తో అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలా అని ఇది తీసి పారేసే సినిమా కాదు. కానీ ఏదో ఊహించుకుని వస్తే మాత్రం నిరాశకు గురికాక తప్పదు. టెక్నికల్‌ ఇష్యూస్ మీద, నటీనటుల యాక్టింగ్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టిన దర్శకుడు ఎమ్మెస్ రాజు... కథ విషయంలోనూ ఎక్కువ కసరత్తు చేసి ఉంటే అగధ మరో స్థాయిలో ఉండేది.

Aug 20, 2026 Telugu

Agadha movie Review

5.0
out of 10
మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్క...

మిస్టరీ, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లతో కూడిన సినిమాలు చాలా వస్తూనే ఉంటాయి. అయితే కామెడీ హార్రర్‌ థ్రిల్లర్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కామెడీని ప్రధానంగా చేసుకొని ఇలాంటి హర్రర్‌ చిత్రాలను రూపొందిస్తుంటారు. సీరియస్‌ ఫిల్మ్స్ వచ్చి చాలా రోజులవుతుంది. ఎంఎస్‌ రాజుగారు `అగధ` ని సీరియస్‌ ఫిల్మ్ గా రూపొందించారు. ఒక మిస్టరీని బేస్ చేసుకొని, హర్రర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక సినిమా ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. 


సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్‌ కొన్ని బాగున్నాయి. బీజీఎం ఆకట్టుకుంటుంది. కొత్తగా ఉంటుంది. మహాదేవి పాత్రలో కామాక్షి అదరగొట్టింది. శ్రావణ్‌ రెడ్డి పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపిస్తుంది. గుహలోని సన్నివేశాలు థ్రిల్‌కి గురి చేస్తాయి. కానీ కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలో థ్రిల్స్ సరిపోవని చెప్పొచ్చు. ఎంఎస్‌ రాజు చెప్పింతనంతగా అయితే సినిమా లేదు. డివైన్‌ హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది. అగధ కొత్త అనుభవాన్నిస్తుంది. కొంత వరకు ఎంగేజ్‌ చేస్తుంది.

Aug 20, 2026 Telugu

Agadha movie Review

6.0
out of 10
ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్‌ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌ లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది....

ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన అగధ మూవీ గురించి చెప్పాలంటే... సినిమా మంచి స్టోరీ ఉన్నా, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల అంత ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫస్టాఫ్‌ లో కొన్ని చోట్ల సాగదీసినట్టు.. కథ నత్త నడకగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌ లో సన్నివేశాలను రాసుకొన్న విధానం బాగుంది. సెకండాఫ్‌ లో యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు చెప్పిన కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. అయితే ఈ సినిమాలో నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్‌ను ఎంఎస్ రాజు రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. క్రైస్తవ, ఇస్లాం మతాల కంటే.. హిందూ మతమే గొప్పది. హిందూ మతంలో ఆచరించే పద్దతులే ఉత్తమం అనే కోణంలో కథను నడించిన తీరు ఆకట్టుకొంటుంది.


ఈ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ మూవీ కొత్త రకమైన హారర్, థ్రిల్లర్, మైథాలజీ ఎలిమెంట్స్, హిందూ మత అచారాలను జోప్పించి చేసిన మిస్టిక్ డివైన్ మిస్టరీ, సైకాలజికల్ థ్రిల్లర్. ఈ సినిమాను ఎంగేజింగ్‌గా చెప్పడానికి ఎంఎస్ రాజు విజన్ బాగా ప్లస్ అయింది. థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన మూవీ. ఈ వారం మంచి హారర్ థ్రిల్లర్‌ను చూడాలనుకొంటే అగాధ మూవీ బెస్ట్ ఆప్షన్.


Aug 20, 2026 Telugu

Agadha movie Review

6.0
out of 10
ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇక మొత్తంగా చూసుకున్నట్ట...

ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం ‘అగధ’. కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అగధ అంటూ తీసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ దీనితో నడిపించే కథనమే కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల బాగా పెర్ఫార్మ్ చేసింది. 


ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అగధ’ అక్కడక్కడా ఓకే అనిపించే మిస్టరీ థ్రిల్లర్ గా నిలుస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అలాగే దానికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇదే తరహాలో కథనం కొనసాగితే బాగుండేది. సో ఈ చిత్రం థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కొంతమేర ఓకే అనిపిస్తుంది.


Aug 20, 2026 Telugu
Why MRO?