Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
`చిరంజీవి` అంటే మరణం లేనివారు, చచ్చిబతికిన వారిని పిలుస్తుంటారు. ఇందులో రెండో యాంగిల్ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు కాలుస్తారు. కానీ అతను చనిపోడు. అది ఎలా జరిగిందనేది ఇందులో ఆసక్తికరం. అదే పెద్ద ట్విస్ట్. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కనిపిస్తాయి. ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. ఓవరాల్‌గా మూవీ ఫర్వాలేదనిపించింది.
సినిమాలో ఫన్, రొమాన్స్, యాక్షన్ అంశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఎగ్జిక్యూషన్‌లోనే కొంత లోపం కనిపిస్తుంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే కొంత తడబాటు కనిపిస్తుంది. ఒక సారి చూడొచ్చు అనిపించేలా చేశాడు. హార్ట్ కుడివైపు ఉండటమనే పాయింట్ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. అంచనాలు లేకుండా చూస్తే కొంత వరకు ఎంగేజ్ చేసే సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ `కికు చిరంజీవి`.
లవ్, ఎమోషనల్, యాక్షన్, ట్విస్టులతో సాగే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న డిఫరెట్ మూవీ కికు చిరంజీవి. ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడివైపుకు ఉండటం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు శుభ సాయి వెంకట్ రాసుకొన్న పాత్రలు, కథను నడిపించిన విధానం బాగుంది. స్టోరీ గ్రిప్పింగ్‌గా ప్లాన్ చేశారు. ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మూవీ డిఫరెంట్ జోనర్ లో కనిపిస్తుంది. క్లైమాక్స్‌ను భావోద్వేగాలతో ముగించడం ఈ సినిమాకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా మారిందని చెప్పాలి.
దీప్తి నడిమింటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్ గా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ వారం చూడాల్సిన సినిమాలో లిస్టులో ఈ మూవీని ఎలాంటి సందేహం లేకుండా చేర్చుకోవచ్చు. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాగా కికు చిరంజీవి మూవీ ఓ రకమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో ఓ చిన్న థ్రిల్లర్ చిత్రం “చిరంజీవి” కూడా ఒకటి. యువ నటుడు కికు యనమల హీరోగా ఈశ్వరి రావు, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “చిరంజీవి” సినిమా అక్కడక్కడా ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామాగా నిలిచింది.
దర్శకుడు శుభ సాయి వెంకట్ తీసుకున్న పాయింట్ లో మంచి పోటెన్షియల్ ఉంది. దీనికి అనుగుణంగా కొన్ని సీన్స్ అక్కడక్కడా బాగున్నాయి. నటీనటులు కూడా తమ బెస్ట్ ఇచ్చారు. కానీ ఇంకా క్లారిటీతో కూడిన కథనం ఇందులో అవసరం ఉంది. దర్శకుడు కొన్ని మూమెంట్స్ ని సింపుల్ గా వదిలేశారు. వీటిని కూడా బాగా డిజైన్ చేసుకొని ఉంటే ఈ థ్రిల్లర్ బెటర్ గా ఉండేది. సో, ఈ కికు చిరంజీవి చిత్రాన్ని తక్కువ అంచనాలతో ప్రయత్నిస్తే మంచిది.
టాక్సిక్ కథ పాయింట్ చాలా సాదాసీదాగా అనిపించే పాయింట్ తో రూపొందగా యష్ ఈ కథని ఎందుకని ఒప్పుకున్నాడో అన్న డౌట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అయితే హీరోగా సినిమాను సేఫ్ చేయడానికి యష్ ఎంత చేయాలో అంతా చేశాడు. కానీ కథలో బలం లేక పోవడంతో యష్ శ్రమ వృధా అయింది. ఇక హీరోయిన్స్ చాలా మంది ఉండగా ఉన్నంతలో కీయరా అద్వాని రోల్ ఆకట్టుకుంది. ఇక సినిమాలో సంగీతం జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది.
చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండొచ్చు…లెంత్ చాలా తగ్గించవచ్చు కూడా కానీ మేకర్స్ అలా చేయలేదు. దాంతో అనవసరంగా సీన్స్ అన్నీ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. అయితే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగానే ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా ఓకే అనిపించింది. మొత్తం మీద ఏమాత్రం అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచం ఎక్కువ ఓపిక పట్టి చూస్తె మొత్తం మీద యష్ కోసం స్టైలిష్ టేకింగ్ కోసం ఒక సారి చూడొచ్చు అనిపించవచ్చు. కానీ కొంచం అంచనాలను పెట్టుకుని వెళ్ళినా చాలా చాలా చాలా ఓపిక పట్టాల్సి వస్తుంది.
స్టార్ హీరో యష్ కథానాయకుడిగా 'టాక్సిక్' మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అయితే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ రావడంతో పాటు ప్రమోషన్ కంటెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందోనన ఆసక్తి ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాలో మొదటి సీన్ నుంచే అసలు ఏం జరుగుతుందే విషయం మీద ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడా కూడా ఈ చిత్రం హై మూమెంట్స్ లేకపోవడం కాస్త ఇబ్బంది కలిగించే అంశం.
చివరలో వచ్చే సైకలాజికల్ ట్విస్ట్ ఉన్నప్పటికీ.. అప్పటికే కన్ఫ్యూజింగ్ గేమ్ లా మారిన కథనానికి ఆ ట్విస్ట్ ఏ మాత్రం సహాయపడదు. దాదాపు 3 గంటల నిడివి విషయం కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. యష్ మాత్రం తన వరకు సినిమాని బాగా నెట్టుకొచ్చాడు. నయనతార, కియారా అద్వానీ రోల్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా... నిడివి విషయంలో కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ కొంతవరకు మెరుగ్గా ఉండేది.ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉంటే బాగుండేది. నిడివి ఎక్కువగా ఉండటం చిత్రానికి మైనస్ గా మారింది. ఫైనల్‌గా.. ఈ సినిమా.. మితిమీరిన వయోలెన్స్ ఇష్టపడే వారికి మాత్రమే!
ఒక సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు? ఎంత గ్రాండియర్‌గా తీశారనేది ఆడియెన్స్ కి అవసరం లేదు. ఎంత కనెక్టింగ్‌గా తీశారు. ఎంతగా ఆకట్టుకుంది? ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉందా? లేదా అనేదే ముఖ్యం. అలా లేకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసినా అది బూడిదలో పోసిన పన్నీరులాగే మిగిలిపోతుంది. `టాక్సిక్` సినిమా చూశాక అలాంటి ఫీలింగ్ కలగక మానదు. కథగా ఇది చాలా డెప్త్ ఉన్న స్టోరీ. కాకపోతే అది మనకు అర్థమయ్యేలా చెప్పడంలోనే తడబాటు కనిపిస్తుంది.
హీరో లైఫ్ లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి ఉత్కంఠభరితంగా ఉంటాయి. అదే సమయంలో విసిగించేలా ఉంటాయి. కథ ఎటువెళ్తుందో అర్థం కాదు. క్లైమాక్స్ లెన్తీగా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ కథ మొత్తాన్ని మార్చేస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్ గ్రాండియర్ గా యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు, రొమాన్స్, స్టయిలీష్ మూవీని తీయడంపై పెట్టిన ఫోకస్.. కథ, కథనంపై పెడితే బాగుండేది. సినిమాగా నిరాశ తప్పదు. నటుడిగా యష్ ఆకట్టుకుంటాడు. విజువల్స్ కనువిందు చేస్తాయి.
Yash is back to testing his luck at the Pan-India Box Office after KGF 2 with Toxic. His choice of going with Geethu Mohandas raised many eyebrows and the movie has become a talking point with bold scenes in the Promotional material and postponements.
Positives:
1. Granduer
2. Yash’s Screen Presence
3. Cinematography
Negatives:
1. Aimless Writing
2. Painfully Bad Second Half
3. Patience-Testing Narration
4. Excessive Runtime
5. Lack of Emotional Connect
Overall, everything that could go wrong had gone wrong for the Toxic. Except for lavish filmmaking with some technically brilliant portions here and there, there is nothing for the audience to get engaged with. It tests your patience and makes you restless with its confused screenplay.
కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో టాక్సిక్ మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో రొమాంటిక్ సీన్స్ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ విజయానికి కారణం అందులో యాక్షన్ సీన్స్ కాదు... యాక్షన్ ఉన్నా మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్ ప్రారంభం నుంచి చివరి వరకు కంటిన్యూ అవుతుంది, టాక్సిక్ ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ఎమోషన్ వర్కవుట్ కాలేదు. అయితే యాక్షన్ లేదంటే రొమాన్స్... బ్యాక్ టు బ్యాక్ రెండిటిలో ఏదో ఒకటి తెరపై వస్తున్నా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు.
బట్ యష్ మాత్రం తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా అయితే... కథ మనల్ని మెప్పించేలా ఉండాలి కదా! సినిమాలో రొమాన్స్ ఉంది. యాక్షన్ ఉంది. స్టార్ కాస్ట్ ఉంది. కానీ... ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ, ఆకట్టుకునే సన్నివేశాలు గానీ లేవు. సాగదీశారు సార్... మూడు గంటలు పాటు ఆ వయలెన్స్ భరించడం, థియేటర్లలో చివరి వరకు ఆడియన్స్ ఉండటం కష్టమే. టెక్నికల్ అవుట్ పుట్ కోసం లేదంటే యష్ కోసం అయితే వెళ్ళండి.
టాక్సిక్ సినిమా గురించి నిజం చెప్పాలంటే సినిమా మీద ఉన్న అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం అస్సలు సంతృప్తి కలగలేదు. యష్ ఎంట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్ మాత్రం అదిరిపోయాయి. యష్‌ని తెరపై చూసిన ప్రతిసారీ ఒక మాస్ ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించినా, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా కొంచెం స్లో అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కొన్ని సీన్స్ మాత్రం ఎందుకు పెట్టారో అర్థం కానట్టుగా అనిపించాయి. యష్ మాత్రం తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ యష్ లాంటి హీరోకి ఇలాంటి కథ కాకుండా ఇంకాస్త స్ట్రాంగ్ కథ, పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లే ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది.
మొత్తంగా చెప్పాలంటే టాక్సిక్ చెత్త సినిమా కాదు… కానీ వచ్చిన హైప్‌కి, యష్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మాత్రం జస్టిస్ చేయలేకపోయింది. చివర్లో తెరమీద... నిర్మించింది వెంకట్ కె నారాయణ.. కానీ కూల్చింది గీతూ మోహన్ దాస్ అని వేయాల్సింది అనిపించింది. అంతలా చెత్తలా ఉంది సినిమా. సినిమా గురించి ఇందులోనే డబ్బింగ్ స్టాండర్డ్స్ లో లాగా ఒక్క ముక్కలో చెప్పాలంటే... అర్ధం పర్ధం లేని వృధా ప్రయాస తో కూడిన వ్యర్ధ చిత్రం ఈ టాక్సిక్.
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... బేసిక్ గా ఇది ఓ అక్క, తమ్ముడు అనుబంధాన్ని తెలిపే కథ. అలానే ఓ తండ్రీ కూతురు బంధాన్ని చెప్పే స్టోరీ. అంతేకాదు కన్న కొడుకును నిర్దాక్షిణ్యంగా దూరం చేసుకున్న ఓ తండ్రి మనో వ్యథ. అయితే ఈ ఎమోషన్స్ ను మనసు లోతుల్లోకి తీసుకెళ్లేలా చేయడంలో గీతూ మోహన్ దాస్ పూర్తిగా విఫలం అయ్యారు. తెరమీద విజువల్స్ ఎంత కలర్ ఫుల్ గా ఉన్నా, నటీనటుల నటన అద్భుతంగా ఉన్నా... అవేవీ మనసును ప్రభావితం చేయవు. దాంతో టాక్సిక్ ఓ టార్చర్ గా మారిపోయింది.
సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలు నిదానంగా కరిగిపోవడంతో థియేటర్లలో ప్రేక్షకులు అసహనంగా అరుపులు అరిచే పరిస్థితి వస్తుంది. అండ్ యశ్ ఎప్పటిలానే తన పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. రాయ పాత్రలో ఎంతో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో, కొడుకు టిక్కెట్ పాత్రలో అంత తెంపరి తనాన్ని ప్రదర్శించాడు. సినిమాలో అసలు మరబొమ్మల్లా తెర మీద జరిగే సన్నివేశాలను ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి కథను చెప్పిన గీతూ మోహన్ దాస్ ను నమ్మి, ఈ ప్రాజెక్ట్ ఆమె చేతిల్లో పెట్టిన యశ్, వెంకట్ నారాయణను అభినందించాలి. ఈ సినిమాలో హీరో ఒక మాట పదే పదే చెబుతుంటాడు. 'మనం తీసుకున్న నిర్ణయానికి ఎప్పటికైనా మూల్యం చెల్లించకతప్పదు' అని. ఈ సినిమా చూడాలనుకునే వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహిస్తే మంచిది.
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఏదో మ్యాజిక్ చేయబోతుందని భావించిన ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. సినిమా సెకండాఫ్ లో కథ గాడి తప్పడం, బలమైన సీక్వెన్స్ లేకపోవడం, ఎమోషనల్ కనెక్టివిటీ లోపించడం, యష్ ఎలివేషన్ డ్రామా ఆకట్టుకోకపోవడంతో అప్పటి వరకు గ్రాండియర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను చూస్తున్నామనే ఫీలింగ్ నుంచి సాదాసీదా మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ తెప్పిస్తుంది. ఓవరాల్ గా అంచనాలకు ఏ మాత్రం చేరుకోలేని సినిమా అనిపిస్తుంది.
ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. యష్ స్టైలిష్ లుక్, మాస్ ఎలిమెంట్స్ తో, యాక్టింగ్ తో మ్యాజిక్ చేశాడు. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. కానీ కథ మాత్రం నిల్. సినిమాకు కావాల్సిన మెయిన్ కాన్‌ప్లిక్ట్ లో పస లేకపోవడం వల్ల సెకండాఫ్ డల్ గా సాగుతుంది. అవసరం లేకపోయిన బోల్డ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్స్ జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా నిడివి మరో మైనస్. కనీసం 20 నిమిషాల సినిమాను కట్ చేస్తే.. కొంత బెటర్ అవుట్ పుట్ ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. మేకింగ్ పై పెట్టిన శ్రద్ద.. కథ, కథనాలు, పాత్రల డిజైన్ మీద మరింత పెట్టి ఉంటే.. ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదనిపిస్తుంది. ఫైనల్ గా యష్ కోసం, గ్రాండియర్ మేకింగ్ కోసం టాక్సిక్ సినిమా ఓసారి చూడొచ్చు.
టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే... ఒక ట్రెండ్ సెట్టింగ్.. బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడడం అంత తేలిక కాదు. యశ్ కూడా ‘కేజీఎఫ్’ హ్యాంగోవర్లోనే ‘టాక్సిక్’ సినిమా చేశాడన్నది స్పష్టమైంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అయిన కుర్రాడు.. మాఫియా సామ్రాజ్యంలోకి అనామకుడిగా అడుగుపెట్టి అందలమెక్కడం.. ‘కేజీఎఫ్’ను గుర్తుకుతెచ్చే ‘టాక్సిక్’ స్టోరీ లైన్ ఇది. మేకర్స్ ప్రయత్నమైతే గట్టిగానే చేశారు, కానీ కథలో విషయం లేకపోతే.. స్క్రీన్ ప్లేలో క్లారిటీ మిస్సయియితే.. ఎంత భారీగా- స్టైలిష్ గా తీసినా ప్రయోజనం ఉండదు.
‘టాక్సిక్’తో వచ్చిన సమస్య ఇదే. సినిమాలో వైలెన్స్, రొమాన్స్ తప్ప ఇంకేమీ చూపించకపోతే.. అది వ్యర్థ ప్రయత్నమే అవుతుంది. ‘టాక్సిక్’లో కథా కథనాలు ప్రేక్షకులకు తలపోటు తెప్పిస్తాయన్నది వాస్తవమే అయినా.. కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు వావ్ అనిపిస్తాయి. ఇక పాత్ర కోసం ప్రాణం పెట్టేసిన యశ్ సూపర్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఆ కష్టాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఓవరాల్ గా టేకింగ్ స్టైలిష్ గా ఉన్నా.. కంటెంట్ మరీ వీక్ అయిపోవడంతో ‘టాక్సిక్’ ప్రేక్షకులకు తీవ్ర అసహనాన్నే మిగులుస్తుంది. ఓవరాల్ గా టాక్సిక్.. నిజంగా టాక్సికే యష్ ఫ్యాన్స్ కి ఓ చేదు జ్ఞాపకం.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers