Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

608
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 49-60 of 608 reviews
Clear all filters

IM Game movie review

6.0
out of 10
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ఐమ్ గేమ్, తెలుగులో పలు ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, తెరపై దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథను బాగా సెట్ చేసి ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగుస్తుంది. కానీ అందుకు భిన్నంగా సెకండాఫ్ కథనం పేలవంగా మిగిలిపోవడం బ...

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన అవైటెడ్ సినిమా ఐమ్ గేమ్, తెలుగులో పలు ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా ఫైనల్ గా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో కథాంశం కొత్తగా ఉన్నప్పటికీ, తెరపై దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా రొటీన్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కథను బాగా సెట్ చేసి ఒక పెద్ద ట్విస్ట్‌తో ముగుస్తుంది. కానీ అందుకు భిన్నంగా సెకండాఫ్ కథనం పేలవంగా మిగిలిపోవడం బాధాకరం.


ఈ సినిమా కథ ముందుగానే ఊహించేలా ఉండటంతో మెల్లగా సినిమాపై పట్టు తగ్గిపోతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే, ‘ఐమ్ గేమ్’ ఆసక్తికరమైన కథాంశాన్ని కలిగి ఉన్నప్పటికీ, కథనంలో ఇంపాక్ట్ లోపించింది. దుల్కర్ సల్మాన్, సాంకేతిక బృందం సినిమాను నిలబెట్టడానికి తమ వంతు కృషి చేసినా, నెమ్మదిగా సాగే సెకండాఫ్, ఊహాజనితంగానే సాగే సీన్స్ ఈ సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. సో ఈ సినిమా అక్కడక్కడా మాత్రమే వర్కౌట్ అవుతుంది. కాబట్టి, కొత్త కథలను ఇష్టపడే యాక్షన్ సినీ ప్రియులు ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారికి ట్రై చేయవచ్చు.






Sep 07, 2026 Telugu +1
6.0
out of 10
హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు.‘రంభ ఊర్వశి మేనక’...

హీరో అల్లరి నరేష్, సురభీ, రాశీ సింగ్, విష్ణుప్రియ భీమినేని, ప్రిషా సింగ్ నటించిన చిత్రం రంభ ఊర్వశి మేనక. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయి బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు.


‘రంభ ఊర్వశి మేనక’ అంటూ వచ్చిన ఈ ఫాంటసీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఐతే, మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, బోరింగ్ అండ్ సిల్లీ ప్లేతో సినిమా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్నిచోట్ల మాత్రమే ఫన్ బాగుంది.


Sep 05, 2026 Telugu
4.0
out of 10
దర్శకుడు చంద్రమోహన్ చింతాడ రాసుకొన్న "రంభ ఊర్వశి మేనక" కథ నేటి ప్రేక్షకుల అభిరుచికి సుదూరంగా ఉందనే విషయం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఇక పాత చింతకాయపచ్చడి లాంటి కథకు 80 దశకం నాటి కథనం, సన్నివేశాలు జోడించడంతో ఫస్టాఫ్‌లో పూర్తిగా విసుగు, పరమ బోర్‌గా ఉంటాయి. అలా నిస్సారంగా, ఎలాంటి కొత్తదనం, వెగటు హాస్యంతో సాగడంతో సినిమా ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఇక అల్లరి నరేష్ నటన చూస్తే ఇంక...

దర్శకుడు చంద్రమోహన్ చింతాడ రాసుకొన్న "రంభ ఊర్వశి మేనక" కథ నేటి ప్రేక్షకుల అభిరుచికి సుదూరంగా ఉందనే విషయం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్. ఇక పాత చింతకాయపచ్చడి లాంటి కథకు 80 దశకం నాటి కథనం, సన్నివేశాలు జోడించడంతో ఫస్టాఫ్‌లో పూర్తిగా విసుగు, పరమ బోర్‌గా ఉంటాయి. అలా నిస్సారంగా, ఎలాంటి కొత్తదనం, వెగటు హాస్యంతో సాగడంతో సినిమా ప్రేక్షకుడిని సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. 


ఇక అల్లరి నరేష్ నటన చూస్తే ఇంకా పాతకాలం స్ట్రాటెజీలోనే కొట్టుమిట్టాడుతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారింది. ప్రేక్షకులు మామూలు కంటెంట్‌ను విసిరికొడుతున్న విషయాన్ని ఆయన గ్రహించలేదా? అనే డౌట్ వస్తుంది. ఇక వీకే నరేష్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొన్ని సన్నివేశాల్లో తన మార్క్ కామెడీ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నాడు. ఇక రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, సురభి గ్లామర్‌పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా నిరాశపరిచారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించుకోండి.


Sep 05, 2026 Telugu
'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ మనల్ని కథతో పాటు ట్రావెల్ చేసేలా చేస్తాయి. అందుకు కారణం... ఆయా సన్నివేశాలను గిరీష్ ఏడీ తీసిన విధానంతో పాటు నటీనటుల ప్రతిభ కూడ...

'ప్రేమలు' తర్వాత మరోసారి స్వచ్ఛమైన వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు గిరీష్ ఏడీ. 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్'లో కథ, స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే... ప్రతి సన్నివేశం, క్యారెక్టర్ మనల్ని కథతో పాటు ట్రావెల్ చేసేలా చేస్తాయి. అందుకు కారణం... ఆయా సన్నివేశాలను గిరీష్ ఏడీ తీసిన విధానంతో పాటు నటీనటుల ప్రతిభ కూడా! కొన్ని వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. ఫస్టాఫ్ అంతా క్యూట్, ఫన్ మూమెంట్స్‌తో వెళుతుంది. సెకండాఫ్‌లోనూ వినోదమే ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. 


అయితే హీరో లవ్ ఫెయిల్యూర్ గానీ, హీరోయిన్ కోసం పడిన తపనను గానీ ఎక్కువ చూపించలేదు. అందువల్ల, ప్రేమలో డెప్త్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఆ లోటును కామెడీ కవర్ చేసింది. సినిమాలో నివిన్ పౌలి - మమితా బైజు నటనలో మెలోడ్రామా గానీ, ఓవర్ డోస్ గానీ లేవు. ప్రారంభం నుంచి ముగింపు వరకు స్వచ్ఛమైన వినోదం, సహజత్వానికి దగ్గరగా అనిపించే ప్రేమ, ఆహ్లాదకరమైన నటనతో 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' మంచి అనుభూతి ఇస్తుంది. క్లీన్ అండ్ ఆర్గానిక్ రొమాంటిక్ కామెడీ ఇది. తొలకరి చినుకులా, ప్రేమలో పడిన తర్వాత వచ్చే ఫీలింగ్‌లా బావుంటుంది. డోంట్ మిస్ ఇట్.




Sep 05, 2026 Telugu +1
6.0
out of 10
Bethlehem Kudumba unit movie review : Positives:1.⁠ ⁠First Half2.⁠ ⁠Organic Comedy At Most Parts3.⁠ ⁠Nivin & Mamitha’s Chemistry4.⁠ ⁠Good MusicNegatives:1.⁠ ⁠Dragged-Out Second Half2.⁠ ⁠Predictable Narration3.⁠ ⁠Lack of Emotional DepthOverall, Bethlehem Kudumba Unit, is definitely a worthy watch for the genuine fun it offers and an excellent first half. You can happily watch it and laugh...

Bethlehem Kudumba unit movie review : 


Positives:


1.⁠ ⁠First Half

2.⁠ ⁠Organic Comedy At Most Parts

3.⁠ ⁠Nivin & Mamitha’s Chemistry

4.⁠ ⁠Good Music


Negatives:


1.⁠ ⁠Dragged-Out Second Half

2.⁠ ⁠Predictable Narration

3.⁠ ⁠Lack of Emotional Depth


Overall, Bethlehem Kudumba Unit, is definitely a worthy watch for the genuine fun it offers and an excellent first half. You can happily watch it and laugh out loud with your friends and family. It may not be as wholesome as ‘Premalu’, but it certainly is a breezy entertainer which let you have a smile on your face at most parts. However, a bit more care in giving emotional depth, would have made the film even better.


Bottom Line – Fun Worked

Sep 05, 2026 Telugu +1
పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌ కథ, పచ్చని పరిసరాల్లో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్‌ కొట్టేస్తుంటారు మలయాళ మేకర్స్‌. అందుకే ఆ చిత్రాలకు టాలీవుడ్‌ లో అంత క్రేజ్‌. ఓటీటీల్లోనే కాకుండా థియేట్రికల్‌గా కూడా మాలీవుడ్‌ చిత్రాలకు చక్కని ఆదరణ లభిస్తుంది. తాజాగా వచ్చిన అలాంటి సింపుల్‌ సినిమానే బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌. నివీన్‌ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్ర...

పెద్ద హడావిడి లేకుండా సింపుల్‌ కథ, పచ్చని పరిసరాల్లో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్‌ కొట్టేస్తుంటారు మలయాళ మేకర్స్‌. అందుకే ఆ చిత్రాలకు టాలీవుడ్‌ లో అంత క్రేజ్‌. ఓటీటీల్లోనే కాకుండా థియేట్రికల్‌గా కూడా మాలీవుడ్‌ చిత్రాలకు చక్కని ఆదరణ లభిస్తుంది. తాజాగా వచ్చిన అలాంటి సింపుల్‌ సినిమానే బెత్లెహామ్‌ కుటుంబ యూనిట్‌. నివీన్‌ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రేమలు తరహా లోనే దర్శకుడు గిరీష్‌ మరోసారి సింపుల్‌ కథ, ఫన్‌ ఎలిమెంట్స్‌ కి, చిన్నపాటి భావోద్వేగాలను మిళితం చేసి రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని మలిచారు. 


ఇటు నివిన్ పౌలి - మామితా బైజు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ కూడా పెర్‌ఫార్మర్స్‌ అని మరోసారి నిరూపించుకున్నారు. సంగీత్‌ ప్రతాప్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌. పైగా స్ర్కీన్‌ ప్లే పర్ఫెక్ట్‌ గా కుదిరింది. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు. సింపుల్‌ లైన్‌ తో పడిపడి నవ్వేలా దర్శకుడు చక్కగా సీన్స్‌ రాసుకున్నాడు. మలయాళం నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన రొమాంటిక్‌ కామెడీ చిత్రాల్లో ఇది బెస్ట్‌ గా నిలుస్తుంది. చిన్న లవ్‌స్టోరీ, వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది.





Sep 05, 2026 Telugu +1
మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యుత్తమ రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వినోదం విషయంలో ఈ సినిమా ‘ప్రేమలు’ స్థాయిని గుర...

మలయాళంలో ఘన విజయం సాధించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏడీ దర్శకత్వంలో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అత్యుత్తమ రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వినోదం విషయంలో ఈ సినిమా ‘ప్రేమలు’ స్థాయిని గుర్తుచేస్తూ చివరివరకు ఆకట్టుకుంటుంది.


దర్శకుడు గిరీష్ ఏడీ ‘ప్రేమలు’ తర్వాత మరోసారి తన మార్క్ కామెడీతో హిట్ కొట్టారు. హింస, క్రైమ్ ప్రధానంగా సాగే సినిమాల నడుమ ఇలాంటి ఆహ్లాదకరమైన రొమాంటిక్ కామెడీలు రావడం ప్రేక్షకులకు మంచి ఊరట. ఓవరాల్‌ గా చెప్పాలంటే, ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ ఫుల్-ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చక్కని రొమాంటిక్ కామెడీ డ్రామా. నివిన్ పౌలీ, మమితా బైజుల నటన, దర్శకుడు గిరీష్ ఏడీ మార్క్ హిలేరియస్ కామెడీ సీన్స్ సినిమాకు ప్రధాన బలం. సెకండాఫ్‌లో కాస్త సాగతీతను తగ్గించి, భావోద్వేగాల తీవ్రత మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సమేతంగా హాయిగా చూసి నవ్వుకోదగ్గ మంచి చిత్రమిది. ఈ వీకెండ్‌ కు నిరభ్యంతరంగా థియేటర్‌లో చూడొచ్చు.

Sep 04, 2026 Telugu +1
 బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) సినిమా విషయానికి వస్తే.. గిరీష్, కిరణ్ కలిసి ఈ కథను ఎంతో వినోదాతక్మంగా, మనసుకి హత్తుకునేలా, ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా రాసుకున్నాడు. జెన్ జీ అమ్మాయి.. 90స్ అబ్బాయిని జత కలిపి ఓ ప్రేమ కథను అల్లుకున్నారు. అమ్మాయిలోని అల్లరి తనం, అబ్బాయిలోని అమాయకత్వాన్ని జోడించి రాసుకున్న సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. తెరపై నివిన్ పౌలీ, మమిత జంట బాగుంటుంది. ఇద్దర...

 బెత్లెహెం కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit) సినిమా విషయానికి వస్తే.. గిరీష్, కిరణ్ కలిసి ఈ కథను ఎంతో వినోదాతక్మంగా, మనసుకి హత్తుకునేలా, ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగించేలా రాసుకున్నాడు. జెన్ జీ అమ్మాయి.. 90స్ అబ్బాయిని జత కలిపి ఓ ప్రేమ కథను అల్లుకున్నారు. అమ్మాయిలోని అల్లరి తనం, అబ్బాయిలోని అమాయకత్వాన్ని జోడించి రాసుకున్న సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. తెరపై నివిన్ పౌలీ, మమిత జంట బాగుంటుంది. ఇద్దరూ తమ తమ పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద ఎలివేషన్స్, దెబ్బకు వంద మందిని గాల్లోకి లేపేయడం, విపరీతమైన రక్తపాతం ఏమీ లేని ఓ సింపుల్ లవ్ అండ్ కామెడీగా ఈ సినిమా అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.



ఇక సినిమాలో టెక్నికల్‌ గానూ చాలా వరకు ఓ పెయింటింగ్‌లా అనిపిస్తుంది. కేరళ అందాలు కనువిందుని చేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నీ కూడా చాలా సింపుల్‌ గానే కనిపించినా ఎంతో ఎఫెక్టివ్‌ గా అనిపిస్తాయి. చివరగా.. బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ అనే టైటిల్ చూసి.. ఇదేదో వెరైటీ సినిమా అనుకోకండి.. ఇది జెన్ జీ అమ్మాయి, 90స్ అబ్బాయి క్యూట్ ప్రేమ కథ.


Sep 04, 2026 Telugu +1

Romanchakam movie Review

5.0
out of 10
రోమాంచకం సినిమా ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్ష‌కుల నుంచి మంచి అటెన్షన్‌ రాబ‌ట్టుకుంది. కానీ సినిమాలో అదేం లేదు. రొటీన్ లవ్ స్టోరీకి, సస్పెన్స్‌ ను, కామెడీని జ‌త చేసి న‌వ్వించే ప్ర‌య‌త్నాలు చేశారు, గానీ ఇప్ప‌టికే వంద‌ల కొద్ది సినిమాల్లో చూసిందే మ‌ళ్లీ ఇక్క‌డ కూడా రిపీట్ అవుతూ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌ పెట్టినట్టు అయ్యింది. సినిమా చూసే...

రోమాంచకం సినిమా ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఇది యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్ష‌కుల నుంచి మంచి అటెన్షన్‌ రాబ‌ట్టుకుంది. కానీ సినిమాలో అదేం లేదు. రొటీన్ లవ్ స్టోరీకి, సస్పెన్స్‌ ను, కామెడీని జ‌త చేసి న‌వ్వించే ప్ర‌య‌త్నాలు చేశారు, గానీ ఇప్ప‌టికే వంద‌ల కొద్ది సినిమాల్లో చూసిందే మ‌ళ్లీ ఇక్క‌డ కూడా రిపీట్ అవుతూ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌ పెట్టినట్టు అయ్యింది. సినిమా చూసే ప్రేక్ష‌కుడికి త‌ర్వాత జ‌ర‌గ‌బోయేదేంటో ఇట్టే తెలిసి పోతూ రొటీన్‌ గా సాగిపోతుంది. 


మొద‌టి నుంచి రొమాంటిక్ మూవీ అంటూ చెప్పుకొచ్చిన‌ప్ప‌టికీ ఓ పాట‌లో మిన‌హా మ‌రెక్క‌డా ఆ ల‌వ్ అనేది కనిపించదు. ఆ మేర‌కు హీరోహీరోయిన్ల మ‌ధ్య బ‌ల‌మైన‌ స‌న్నివేశాలు సైతం లేవు. ఇక క్లైమాక్స్ అయితే ఇటీవ‌ల వ‌చ్చిన 'పాపం ప్ర‌తాప్' క్లైమాక్స్‌ను గుర్తు చేసి అస‌లు ఏం జ‌రుగుతుందిరా, ఎందుకురా ఇదంతా అనిపిస్తుంది. ఎడిటింగ్‌, డైలాగుల విష‌యంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బావుండేది. అయితే సినిమా క్యాప్ష‌న్‌ లో చెప్పిన‌ట్టుగా ప్రేమ లోపించినా అక్క‌డ‌క్క‌డ హాస్యంతో న‌వ్వించారు. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే.. జెన్ జీ, నిబ్బిల‌కు ‘రోమాంచకం. 



Sep 03, 2026 Telugu

Romanchakam movie review

Tupaki

By Tupaki

5.0
out of 10
ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా సినిమాలో డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ...

ప్రేమ- హాస్యం- ఉత్కంఠ.. ‘రోమాంచకం’ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ ఇది. కానీ ఇందులో హాస్య రసం మాత్రమే పండింది. ప్రేమకథల్లో ప్రతిసారీ కొత్తదనం చూపించడం కష్టం. కథ కంటే కథనంతోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. కానీ ‘రోమాంచకం’లో ఆ మ్యాజిక్ జరగలేదు. అసలు హీరో - హీరోయిన్ ఎప్పుడు ప్రేమించుకున్నారో అర్ధం కాదు. పైగా సినిమాలో డైలాగులకు.. కథకి సంబంధం ఏంటో అర్థం కాదు. ఇలా లాజిక్ లేని బోలెడన్ని సన్నివేశాల మధ్య కేవలం ఫ్రెండ్స్ మధ్య కామెడీ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.


హీరో హీరోయిన్ల కంటే.. ‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ ఫేమ్ నరేంద్ర రవి పాత్ర సెకండాఫ్ ను కొంత ఎంగేజింగ్ గా మార్చింది. సినిమాలో క్లైమాక్స్ బాగానే పండింది. అక్కడ కూడా కామెడీ వర్కవుట్ అయింది. ట్విస్టు ఓకే. ‘రోమాంచకం’ టైటిల్ కు న్యాయం చేసే సినిమా కాదు. ఓవరాల్ గా కథాకథనాల్లో ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంతకంటే ఎక్కువ ఫ్రెష్నెస్ ఆశిస్తారు. చివరగా ‘రోమాంచకం’ టైటిల్‌ కు తగ్గ రోమాంచనం లేకపోయినా.. టైంపాస్ బడ్డీ కామెడీ కోసం ఓ లుక్కేయొచ్చు!

Sep 03, 2026 Telugu

Romanchakam movie Review

5.0
out of 10
‘రోమాంచకం’ అనే సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఏ పాయింట్లతో కథని అల్లుకున్నాడు.. ఏం రాసుకున్నాడు.. ఏం తీశాడు.. ఏం కన్వే చేయాలని అనుకున్నాడు.. ఇలా ఏ విషయం కూడా ఓ పట్టాన అర్థం కాదు. చాలా చోట్ల కథ సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. అసలు ఏ పాత్రలోనూ సీరియస్‌నెస్ కనిపించదు. అనంతిక ఓకే చేసిన స్క్రిప్ట్ కదా.. పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని ఎవరైనా ఊహించి, ఆశించి వస్తే మాత్రం...

‘రోమాంచకం’ అనే సినిమాతో దర్శకుడు ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఏ పాయింట్లతో కథని అల్లుకున్నాడు.. ఏం రాసుకున్నాడు.. ఏం తీశాడు.. ఏం కన్వే చేయాలని అనుకున్నాడు.. ఇలా ఏ విషయం కూడా ఓ పట్టాన అర్థం కాదు. చాలా చోట్ల కథ సిల్లీగా అనిపిస్తుంది. ఎక్కడా లాజిక్స్ కనిపించవు. అసలు ఏ పాత్రలోనూ సీరియస్‌నెస్ కనిపించదు. అనంతిక ఓకే చేసిన స్క్రిప్ట్ కదా.. పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని ఎవరైనా ఊహించి, ఆశించి వస్తే మాత్రం దారుణంగా నిరాశ చెందాల్సి వస్తుంది.


టెక్నికల్‌ గా చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. బీజీఎం కంటే.. పాటలు చాలా హృద్యంగా అనిపిస్తాయి. తెరపై పాటల్ని చూస్తుంటే ఎంతో ప్లెజెంట్‌గా కనిపిస్తాయి. ఎడిటింగ్ బాగుంటుంది. లొకేషన్స్ కూడా ఎక్కువగా లేకుండా.. ఉన్నంత వరకు బాగా చూపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది.


ఓవరాల్ గా సినిమా గురించి చెప్పాలంటే... ఎదిగీఎదగని.. ఓ ఇమ్మెచ్యూర్.. నిబ్బానిబ్బిలానే హీరో హీరోయిన్లు తెరపై కనిపిస్తారు. పాత్రల్నే అలా రాసుకున్నట్టుగా, కథనే అలా డీల్ చేసినట్టుగా కనిపిస్తోంది. చాలా చోట్ల జెన్ జీ ని రిఫర్ చేసుకున్నాడు డైరెక్టర్. బహుషా తలాతోక లేనట్టుగా అనిపించే ఈ మూవీ జెన్ జీ ఆడియెన్స్‌కి నచ్చితే నచ్చొచ్చు. కొన్ని పాటలు, కొంత కామెడీ చాలు అనుకుంటే మాత్రం ‘రోమాంచకం’ ఓ ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. చివరగా ఈ సినిమాకి పెట్టుకున్న క్యాప్షన్స్‌లో చెప్పాలంటే.. గోరంత ప్రేమ, కొండంత హాస్యం, పిసరంత ఉత్కంఠ.


Sep 03, 2026 Telugu

Romanchakam movie Review

6.0
out of 10
‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. స్టోరీ పరంగా యావరేజ్ గానే ఉన్నా, డీసెంట్ కామెడీ తో మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా సినిమాని తీసాడు డైరెక్టర్. సినిమా మొత్తం కామెడీయే హైలెట్ గా మెయిన్ గా సాగ...

‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోమాంచకం’. వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. స్టోరీ పరంగా యావరేజ్ గానే ఉన్నా, డీసెంట్ కామెడీ తో మంచి స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా సినిమాని తీసాడు డైరెక్టర్. సినిమా మొత్తం కామెడీయే హైలెట్ గా మెయిన్ గా సాగుతుంది. సాంగ్స్ డీసెంట్ గా ఉన్నాయి.


మొత్తంగా చూస్తే, ‘రోమాంచకం’ వినోదమే ప్రధానంగా సాగే ఒక టైమ్‌పాస్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. సుమంత్ ప్రభాస్ నటన, అతని స్నేహితుల గ్యాంగ్ మధ్య వచ్చే నవ్వుల సన్నివేశాలు సినిమాను ముందుకు నడిపించాయి. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్లు కాస్త నిరాశపరిచినా, ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునే ప్రేక్షకులకు ఈ వారాంతంలో ఈ చిత్రం మంచి ఆప్షన్.


Sep 03, 2026 Telugu
Why MRO?