Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
Vishwanath and Sons movie review
విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ ఎలా ఉందంటే... అలా ఉందంతే... ఎలా ఉంటదంటే... మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు... ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫ్రెష్ గా ఉంది. మమిత చాలా బాగా చేసింది. సూర్య గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన చాలా క్లాసిక్ గా చేసారు. బట్ ఈ సినిమా చూస్తే... ఫైనల్లీ ఆయనకు డీసెంట్ సినిమా పడిందనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ప్లాట్ పాయింట్ నాకు అంతలా ఎక్కాలా.
Actually ఈ సినిమా మన్మథుడు మూవీకి చాలా దగ్గరగా ఉంటది. ఈ సినిమాకి ఇంకా బాగా రాసుండాల్సింది. కానీ చాలా సింపుల్ గా డీల్ చేసాడు డైరెక్టర్. అందుకే అంత ఎక్కలేదు. సింపుల్ గా చెప్పాలంటే వెంకీ అట్లూరి సినిమాలు రెగ్యులర్ గా ఉండవు. కానీ ఇది రెగ్యులర్ డ్రామాగా అనిపించింది. బట్ ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ఇది చాలా బెటర్ సినిమా ఇది. అండ్ ఇది డబ్బింగ్ సినిమాలానే ఉంది. తెలుగు మేకర్స్ ఉన్నప్పుడు, కొంచెమైనా తెలుగులో ట్రై చేయొచ్చుగా అనిపించింది. ఓవరాల్ గా నాకైతే అంత ఎక్కలేదు... ఓకే.
Mahidhar Vibes movie review
వెల్కమ్ టు తమిళ్ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons Movie) మూవీ రివ్యూ స్టారింగ్ సూర్య, మామితా బైజు. తమిళ్ మూవీ ఎందుకన్నానంటే ఇది తమిళ్ మూవీ. తమిళ్ లోనే షూట్ చేసారు. తెలుగులో డబ్ చేసారు. బట్ చాలా మంది అన్నట్టు సూర్య అడాప్టడ్ సన్ అఫ్ తెలుగు స్టేట్స్ అన్న ట్యాగ్ తీసేసి, వాళ్ళ తమ్ముడు కార్తీకి ఇవ్వడం బెటర్. ఎందుకంటే అతను ఇక్కడికెప్పుడొచ్చినా తెలుగులోనే మాట్లాడతారు. తమిళ్ వాళ్ళకంటే తెలుగు ఫ్యాన్స్ ఏ ఇష్టమంటాడు.
కమింగ్ టు ది రివ్యూ.. బానే ఉంది సినిమా.. ఒక డీసెంట్ సినిమా. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డీవియేట్ అయిపోతుంది. అండ్ సినిమాలో కొన్ని సీన్స్ ఆర్టిఫీషియల్ గా అనిపిస్తాయి. అందుకే కొంత నచ్చలేదు. అలాగే కొన్ని తెలుగులో కొన్ని సీన్స్ పై ఎఫర్ట్ పెట్టి ఉంటె బాగుండేది. కానీ కొంచెం కూడా పెట్టలేదు. యాక్టింగ్ కొస్తే సూర్య, మమితా సహా అందరూ బాగా చేసారు. ఓవరాల్ గా బాగానే ఉంది పర్లేదు. నా రేటింగ్ అయితే 3.8
Vishwanath and sons Movie Review
విశ్వనాధ్ అండ్ సన్స్... ఒక 2 hours 41 minutes రన్ టైం ఉన్న ఈ సినిమా ఒక ఫుల్ లెంగ్త్ బెస్ట్ ఫ్యామిలీ సినిమా ఇది. చాలా బాగుంది guys ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయినా బానే ఉంది. ఓవరాల్ గా ప్లెసెంట్ గా ఉండే క్లాస్ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ మూవీ ఇది. ఓవరాల్ గా మూవీ నవ్వించింది, ఏడిపించింది, ఆలోచించేలా చేసింది... సూర్య గారి stamina ఏంటో చూపించింది. ఇక ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. బేసిక్ స్టోరీ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన సూర్య, పెళ్లి చేసుకుని వారసుడ్ని ఇమ్మని తల్లి రాధికా అడిగితే.. సూర్య ఒక పనిచేస్తారు. ఆ డెసిషన్ ఏంటి? అందులో మామితా రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇక ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ అనే ఫీల్ కూడా రాకుండా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మామితా బైజు తో సీన్స్ చాలా బాగున్నాయి. రవీనా టాండన్ కి మంచి రోల్ పడింది. అండ్ సినిమాలో 40 vs 20 లవ్ కి రీసన్ కూడా ఇందులో బాగా చూపించారు. జివి ప్రకాష్ మ్యూజిక్ అయితే దుమ్ములేపేసారు. మైనస్ పాయింట్ విషయానికి వస్తే... సినిమాటిక్ లైబర్టిని వాడుకుని కొన్ని అనవసరమైన సీన్స్ తీశారు అంతే... ఇదొక తెలుగు డైరెక్టర్ తీసిన తమిళ సినిమా కాబట్టి అందరికి ఈజీగా నచ్చుతుంది. ఓవరాల్ గా worth watchable movie.
Vishwanath and sons movie review
By Cinema Picha
ఇప్పుడే విశ్వనాధ్ అండ్ సన్స్ (Viswanath & Sons) మూవీ చూసి రావడం జరిగిందన్నమాట. first of all i have to say kudos to directer venky atluri గారు. అయన అనుకున్న story ని ఎక్కడా డీవియేట్ అవకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక 40 year and 20 year age గ్యాప్ మధ్యలో జరిగే ఒక స్టోరీని ఎలా అయితే చూపించాలి అని అనుకున్నారో, ఆ స్టోరీని కళ్ళకు కట్టినట్టు చాల beautiful writing, and excellent characterization, అండ్ చాలా neat presentation తో మన ముందుకు తీసుకొచ్చి, చాలా నీట్ సినిమాగా చాలా క్లాస్ సినిమాగా, ఒక మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్ తో బైటికి వచ్చేలా చేసాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి.
ఈ మూవీలో మన సూర్య గారి క్యారెక్టర్, మమతా క్యారెక్టర్, అలాగే రాధికా గారి క్యారెక్టర్ గాని వీళ్ళ ప్లేస్ లో వేరే ఎవ్వర్నీ ఊహించుకోలేం. ఎందుకంటే అంతలా వీళ్ళు నటించి మెప్పించారు. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయానికొస్తే.. మమతా కుమ్మేసింది. సూర్య సెటిల్డ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ తో, మంచి ఎమోషనల్ సీన్స్ తో పర్ఫెక్ట్ గా కనిపించారు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ పై ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటె బాగుండేది.. బట్ బానే ఉంది. ఓవరాల్ గా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే కొన్ని సీన్స్ లో రైటింగ్ ఫెంటాస్టిక్ గా అనిపించింది. విశ్వనాధ్ అండ్ సన్స్ అగైన్ a very neat and clean film.
Korean kanakaraju movie review
By Cinema Picha
హలో గైస్. ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూసాం అనమాట. అయితే ఈ సినిమాలో కొరియా ఉంది, కనకరాజు ఉన్నాడు. బట్ ఈ సినిమాలో సత్య ని తీసేస్తే ఇంకేం ఉండదు అనమాట. సినిమాలో అద్భుతమైన సీన్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్, ఇంకేమి అంతగా లేవు గాని, కామెడీ మాత్రం ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ లో అయితే ఎదో కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్ ఫైట్స్ తో అలా రొటీన్ గా సాగుతూ, ఇంటర్వెల్ కి మాత్రం మంచి సీన్స్ ని కొరియన్ వాడికోసం ఎస్టాబ్లిష్ చేసారు.
ఇంక కొరియా ఎపిసోడ్లు అయితే అసలు ఇంట్రెస్టింగ్ గా లేవు. ఇక సెకండ్ హాఫ్ లో సత్య కామెడీయే స్పెషల్ గా ఉంది కానీ, ఆ ట్విస్ట్ లు మాత్రం ఎక్కలేదు. అండ్ క్లైమాక్స్ లో AI ఫైట్స్ మాత్రం బాలేవు. ఇక వరుణ్ తేజ్ సినిమాలో చాలా బాగున్నాడు. బట్ సినిమాలో వరుణ్ తేజ్ కి మంచి ఎంటర్టైనింగ్ రోల్ గా తన రోల్ ని డిజైన్ చేసే ఛాన్స్ ఉన్నా, పెద్దగా వాడుకోలేదు. ఇక సత్య అయితే ఫస్ట్ నుండి లాస్ట్ దాకా తన షోల్డర్ తో లాక్కొచ్చాడు. ఇక థమన్ మ్యూజిక్ అయితే బాగున్నా, ఒక గ్రేట్ అన్నట్టు మాత్రం లేదు. హీరోయిన్ కూడా ఉందా లేదా అన్నట్టుంటుంది. ఓవరాల్ గా నాకైతే హిలేరియస్ ఫీల్ అయితే రాలేదు.
కొరియన్ కనకరాజు సినిమా గురించి చెప్పాలంటే... చాలా బాగుంది సినిమా, కాకపోతే క్లైమాక్స్ చెడగొట్టింది. ఫస్ట్ అయితే సినిమా చాలా ఫన్ గా ఉంది. నిజానికి సినిమా మల్టీస్టారర్ అని చెప్పాలి. వరుణ్ తేజ్ ఒకరు, సత్య మరొకరు అని చెప్పాలి. అండ్ సినిమాలో బేసిగ్గా సత్య లేకపోతే సినిమా లేదన్నట్టు అనిపించింది. సో ఒక రకంగా సేవియర్ సత్య అన్నట్టుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే చెడగొట్టారు.
సో అట్లాగ క్లైమాక్స్ ఏంటో ఈ vfx కూడా బాలేదు. అండ్ ఎండింగ్ ఎదో చేసారంటే చేసాం అన్నట్టుంది. అండ్ పార్ట్ టు కూడా ప్లాన్ చేశారు. ఈసారి కెన్యా కనకరాజు అంటా. ఏమో మరి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే పర్టికులర్ గా ఒకటనిపించింది, వరుణ్ తేజ్ ఇంత మంచి కటౌట్ పెట్టుకుని, ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారో తెలీట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే వరుణ్ తేజ్ ని 100% అయితే ఇందులో వాడలేదు. అంటే ఆయన కటౌట్ కి తగ్గ సినిమా అయితే కాదు.
అండ్ పార్ట్ టు కూడా అనౌన్స్ చేసారు. తీయొచ్చు. ఈ రేంజ్ ఫ్రెష్ కామెడీ అయితే తీయొచ్చు. బట్ అక్కడైతే ఆపేస్తే బెటర్. ఫైనల్ గా క్లైమాక్స్ తప్ప నాకంతా బాగుంది.
Korean Kanakaraju movie review
సో మల్టి స్టారర్ మూవీ అయిన కొరియన్ కనకరాజు మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. అదేంటి మల్టి స్టారర్ సినిమా అంటున్నారేంటి అనుకోవచ్చు. ఈ సినిమా సత్య లేకపోతే హుష్ ఫటక్ అనుకోవచ్చు. సీరియస్లి ఈ సినిమాలో సత్య, వరుణ్ తేజ్ అక్కడక్కడా ఇద్దరు ముగ్గురి క్యారెక్టర్స్ సీన్స్ తప్ప ఏం అట్రాక్ట్ కాలేదు. రెండున్నర గంటలైతే బాగా నవ్వుకున్నా. అండ్ సినిమాలో లిటిరల్లి సినిమాలో మీ స్ట్రోక్ చాలా అమ్మెచ్యూరిష్ గా ఉందని meme ఫేమస్ అయింది. అది అదిరిపోయింది సినిమాలో.
బట్ నాకు సినిమాలో ఎక్కడ కోపమొచ్చిందంటే... AI ఫైట్ సీన్ పెడతారు అది అస్సలు నచ్చలేదు. ఎదో మీ మొహాలకు ఇదొక్కటి చాలు అన్నట్టు తీశారనిపించింది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి పదినిమిషాలకొకసారి నవ్విస్తారు. ఏదైతే చెప్పుకోవాలి. బట్ హీరో ఇంట్రడక్షన్ ఏమో అలా గడిచిపోయింది. సినిమాలో హీరో కంటే కమెడియన్ సత్య కామెడీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. సత్య ఎంట్రీకైతే అరుపులే. అండ్ సినిమాలో కొరియన్ ఆత్మ ఇండియాకి వచ్చే సీన్ రైటింగ్ మాత్రం వరెస్ట్. అండ్ సినిమాలో పెద్దగా లవ్ స్టోరీ కూడా లేదు. ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే... రొట్ట రొటీన్ సినిమాలో కామెడీ వర్కౌట్ అయింది. వర్తా అంటే మాత్రం నాకైతే నవ్వుకుంటాం కానీ అంత అనిపించలేదు. మ్యూజిక్ అయితే మాత్రం థమన్ సగం పార్ట్ లెనిన్, ఇంకో సగం ఓజి నుండి లేపేసి ఇందులో పెట్టినట్టు అనిపించింది.
Korean kanakaraju movie review
సినిమా కొత్త కాన్సెప్ట్ బాగుంటుందనుకుని... ఎదో చించేద్దాం అనుకునెల్లా... బట్ వెళ్ళిన తర్వాత... లెక్క మారిపోయింది. సినిమా రొటీన్ టెంప్లేట్ లో ఉన్నా, పర్ఫెక్ట్ గా తీయాలి. ఈ సినిమాకి మాత్రం ఎం లేదు. సత్య గారి కామెడీ మాత్రం చాలా బాగుంది. అండ్ వరుణ్ తేజ్ గెటప్ ఈ సారి పేలలేదు. బేసిగ్గా వరుణ్ మూవీ సెలక్షన్ కూడా బాగుంటది కానీ. ఈ సినిమా రాంగ్ సెలక్షన్ అనిపించింది నాకు.
అండ్ సినిమాని సూపర్ మ్యాన్ లెవెల్లో తీద్దామని ట్రై చేసినట్టు అనిపిస్తుంది. చాలా సీన్లు లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. అండ్ సినిమాలో హీరోను ఎస్టాబ్లిష్ చేసే సీన్లు అస్సలు బాలేవు. అండ్ ఈ సినిమాలో కొరియా లో చాలామంది గన్స్ పట్టుకుని ఉండడం షాకింగ్ అనిపిస్తది. ఎందుకంటే నిజానికి కొరియా లో గన్స్ బ్యాన్డ్. అండ్ సినిమాలో అమ్యేచ్యురీష్ డైలాగ్ మాత్రం పేలింది. ఇక మ్యూజిక్ సాంగ్స్ అయితే చేతులెత్తేశారు. బట్ మ్యూజిక్ బాగుంది. బీజీఎమ్ చాలా సీన్స్ లో బాగుంది. ఫైనల్ గా నాకైతే మూవీ చాలా కష్టమండి. మీకెలా ఉంది చూసి చెప్పండి.
Korean kanakaraju movie review
కొరియన్ కనకరాజు.... 2 hours 45 minutes తో రిలీజ్ అయింది. సినిమా అయితే అలా కామెడీ సీన్స్ తో గడిచిపోయింది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీతో టైంపాస్ అయిపొయింది. అండ్ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే... ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎలా అయితే సెకండ్ హాఫ్ డౌన్ అయిపోతుందో... ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. ఏం చేయాలో తెలియక కామెడీ ఆక్టర్స్ ని పెట్టి కామెడీతో అలా అలా లాగించేసినట్టుంది.
ఇక ఫ్యామిలీ తో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఎం లేదు చూడొచ్చు. అండ్ క్లైమాక్స్ లో పార్ట్ టు అని అనౌన్స్ చేసారు... ఏ ధైర్యంతో అలా చేసారో ఏమో. ఇక వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ బాగుంది. నెగిటివ్ షేడ్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమాలో మేజర్ హైలెట్స్ సత్య కామెడీనే. బాగా నవ్వుకోవచ్చు. ఇక హీరోయిన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. థమన్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ ఏంటంటే రొటీన్ స్టోరీ, కాన్సెప్ట్ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. ఫైనల్ గా మూవీని కామెడీ కోసం ఓసారి ట్రై చేయొచ్చు. ఇక రేటింగ్ ఇవ్వాలంటే నా రేటింగ్ 2.75/5
మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం డిసి. ఈ సినిమా ఒక సీరియస్ టోన్ లో ఈవెంట్ బేస్డ్ ఫిలిం అనమాట. ఎటువంటి కామెడీ ట్రాక్స్ లేకుండా, స్టోరీ కి స్ట్రిక్ అయి స్ట్రయిట్ గా వెళ్లిపోయే సినిమా ఇది. అండ్ ఈ సినిమాకి డిసి అనే టైటిల్ కన్నా, గన్స్ అండ్ రొసెస్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ సినిమాకి.
ఇక ఈ సినిమాకి ఎటువంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా పాయింట్ టు పాయింట్ వెళ్లిపోయారు. అండ్ సినిమాలో లోకేష్ కానగరాజ్ పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. ఆ లుక్స్ కూడా క్యారెక్టర్ రోల్ కి తగ్గట్టు మ్యాచ్ అయింది. అండ్ వామికా గబ్బి కూడా సూపర్ గా చేసారు. ఇక సినిమాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీ వాడి కొన్ని సీన్స్ బాగా చేసారు. అండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్ మ్యూజిక్. అన్ని సీన్స్ కి ఫ్రెష్ మ్యూజిక్, ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఓవరాల్ గా చెప్పాలంటే బాగుంది సినిమా.
అండ్ సినిమాలో కామెడీ, ఫన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. యాక్షన్ మాత్రమే చూడండి. మంచి ఐ ఫీస్ట్ ఇస్తుంది.
సో లోకేష్ కానగరాజ్ సినిమా డిసి చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే బానే ఉంది. గ్రేట్ అని కాదు గాని, పర్లేదు చూసేలానే ఉంది. అండ్ సినిమా చిన్న స్టోరీనే బట్ మంచి స్క్రీన్ ప్లే రాసారు. ఈ సినిమాలో నాకేం నచ్చిందంటే స్పెషల్లీ అనిరుద్ మ్యూజిక్ బాగా నచ్చింది. ర్యాంప్ ఆడించారు. టెక్నికల్లి కూడా సినిమా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే సినిమాలో తమిళ్ నేటివిటీ బాగా ఎక్కువైంది. ఎదో మణిరత్నం స్టయిల్లో ఏదో చెప్దామని ట్రై చేసారు.
అండ్ ఆక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ఇక్కడవరకైతే బాగానే ఉంది. కాకపోతే సినిమాలో ఎదో యూనిక్ పాయింట్ తీసుకున్నారా అంటే ఎం లేదు. వైలెన్స్ కూడా ఎక్కువైంది. కొన్ని సీన్స్ అయితే నాకు చాలా చిరాకేసింది. పెర్ఫార్మన్స్ వైస్ మాత్రం టూ గుడ్. స్పెషల్లీ వామికా గబ్బి చాలా బాగా చేసింది. అండ్ లోకేష్ కానగరాజ్ అయితే సలార్ లో ప్రభాస్ లాగా ఎక్కువగా మాట్లాడాడు. అలా పని చేసుకుంటూ పోతాడు. చాలా వన్ టోన్ గా క్యారెక్టర్ పోతా ఉంటది. ఇక డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ గురించి చెప్పాలంటే తన లాస్ట్ మూవీ కంటే బెస్ట్ గా తీశారు. ఓవరాల్ గా ఇట్స్ ఏ డీసెంట్ మూవీ.
"డీసీ". ఈ సినిమాలో చెప్పాలంటే ఇద్దరు హీరోలున్నారు. ఒకరు లోకేష్ కానగరాజ్, ఇంకొకరు అనిరుధ్. హీరోయిన్ వచ్చేసి వామిక గబ్బి. ఇక సినిమా గురించి చెప్పాలంటే... అదిరిపోయింది సినిమా. మాములుగా లేదు. మాస్ కమర్షియల్ సినిమా.. దానికి రీసన్ ఏంటంటే.. ముందుగా అనిరుద్ గారు ఈ సినిమాకి వంద పెర్సెంట్ వర్క్ ఇస్తారనుకుంటే 500 పర్సెంట్ ఇచ్చారు. నిజానికి అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు లేకపోతే అంతా డొల్లే. madness మ్యూజిక్.
అండ్ సినిమా కూడా చాలా బాగుంది. లోకేష్ కూడా హీరోగా గ్రాండ్ డెబ్యూ ఇచ్చారని చెప్పాలి. పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. అండ్ వామికా గబ్బి కూడా టూ గుడ్ అసలు. స్టోరీ చిన్నగా ఉంది కానీ, స్క్రీన్ ప్లే అయితే స్ట్రాంగ్ గా రాసుకున్నారు. డైరెక్టర్ కూడా టూ గుడ్ హ్యాండిల్ చేసారు. అండ్ సినిమాకైతే నేను 4.5 రేటింగ్ ఇస్తాను. ఫైనల్ గా సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ డిసి సినిమా గురించి చెప్పాలంటే.. its a story between a gun and a plastic flower. అండ్ ఈ సినిమాతో లోకి హీరోగా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ ఉంది.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers