Register as a Reviewer
ఇమ్మోర్టల్ (Immortal)

ఇమ్మోర్టల్ (Immortal)

18 Sep 2026
Overall Rating
5.6/10
5 Reviews

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఇమ్మోర్టల్‌". హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డబ్ అయి తాజాగా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Mariyappan Chinna
Cast: GV Prakash Kumar, Kayadu Lohar, TM Karthik, Kumar Natarajan, Lollu Sabha Maaran, Aaditya Kathir, Arshu Maharjan, Pema Tsamchoe, Sunita Shrestha & Others.

Available in:

Reviews

What critics and the public are saying about ఇమ్మోర్టల్ (Immortal)

Media Reviews

2 Avg: 5.5/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Immortal Movie Review

ఇమ్మోర్టల్ రివ్యూ... జీవీ ప్రకాష్ కుమార్ అండ్ కాయదు లోహర్ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ మూవీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలిసి జీరో ఎక్స్పెటేషన్స్ తోనే థ్రిల్లర్ కి వెళ్ళాను. సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ట్రైలర్ కూడా చూడలేదు. కానీ సినిమా చూసాక నాకైతే సాటిస్ఫైడ్ అండి, మూవీ నచ్చింది. స్టార్ట...

ఇమ్మోర్టల్ రివ్యూ... జీవీ ప్రకాష్ కుమార్ అండ్ కాయదు లోహర్ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ మూవీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలిసి జీరో ఎక్స్పెటేషన్స్ తోనే థ్రిల్లర్ కి వెళ్ళాను. సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ట్రైలర్ కూడా చూడలేదు. కానీ సినిమా చూసాక నాకైతే సాటిస్ఫైడ్ అండి, మూవీ నచ్చింది. స్టార్టింగ్ లో ఒక 10 మినిట్స్ బ్యాక్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ ఆన్ అవర్ కొంచెం స్లోగా బోరింగ్ అనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ తో ఒక హౌస్ లో ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తుంది సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. 


కానీ ఇంటర్వెల్ కి ముందు ఒక 20 టు 25 మినిట్స్ ఉందన్నప్పుడు అక్కడి నుండి మూవీ కంప్లీట్ గా గేర్ చేంజ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎంగేజింగ్ గానే అనిపించింది నాకైతే. గ్రాఫిక్స్ కొన్ని ప్లేసెస్ లో కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి, స్టోరీ టెల్లింగ్ మాత్రం పర్లేదు బానే ఉంది, మరి వర్స్ట్ గా కూడా లేదు. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే స్టార్టింగ్ లో కాయదు లోహర్ గారి కొంచెం రొమాంటిక్ అండ్ గ్లామర్ పోర్షన్స్ ఉంటాయి. ఇక ఈ సినిమాకి కాయదు లోహర్ గారు మేజర్ ప్లస్ అండి. జీవీ ప్రకాష్ కుమార్ గారు కూడా ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. నాకైతే సాటిస్ఫైడ్. హారర్ మూవీ లాగా కాకుండా సూపర్ నేచురల్ థ్రిల్లర్ లాగా సినిమాని చూడాలి. 

Sep 19, 2026 Watch
123telugu
123telugu Website
5

Average

Immortal Movie Review

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్‌’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లలో బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ హారర్‌ కథలో వేయి ఏళ్ల నటి వింత మృగం, ఆ మృగానికి సంబంధించిన ఫాంటసీ ఎలిమెంట్స్‌.. వీటి మధ్యలో ఓ సగటు క...

జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్‌’. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లలో బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ హారర్‌ కథలో వేయి ఏళ్ల నటి వింత మృగం, ఆ మృగానికి సంబంధించిన ఫాంటసీ ఎలిమెంట్స్‌.. వీటి మధ్యలో ఓ సగటు కుర్రాడైన మహి పాత్ర, అతని ఆశ, అమాయకత్వం.. నిజం తెలిశాక ప్రాణాలు కాపాడుకోవడానికి అతను ప్రయత్నించే దారులు.. మొత్తానికి ఈ ఇమ్మోర్టల్‌ చిత్రంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది.


అయితే కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు. కానీ, కథే పూర్తి కల్పన అయితే, ఆ కల్పనలో అబ్బురపరిచే విషయాలు ఉండాలి, నమ్మశక్యం కానీ సంఘటనలను కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ, దర్శకుడు మారియప్పన్‌ తీసిన ఈ ‘ఇమ్మోర్టల్‌’ సినిమాలో అది మిస్ అయ్యింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర క్రియేట్ చేసిన మాయ ప్రపంచం.. పూర్తిగా ఇల్లాజికల్ గా సాగుతుంది. ఓవరాల్ గా ‘ఇమ్మోర్టల్‌’ అంటూ వచ్చిన ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే, విజువల్స్ మరియు నటీనటుల నటన కూడా బాగుంది. ఐతే, కథనం స్లోగా రెగ్యులర్ గా సాగడం, అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో హారర్ ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.


Sep 18, 2026 Read Review

Public Reviews

3 Avg: 5.7/10
G
Goshika Shreshta CA/Advocate
5

Average

Immortal movie review

Immortal (starring GV Prakash Kumar and Kayadu Lohar) still manages to disappoint. What starts as a simple flat-sharing setup quickly collapses into a sluggish, highly predictable thriller that relies far too heavily on deafening background music rather than genuine suspense.The first forty minutes...

Immortal (starring GV Prakash Kumar and Kayadu Lohar) still manages to disappoint. What starts as a simple flat-sharing setup quickly collapses into a sluggish, highly predictable thriller that relies far too heavily on deafening background music rather than genuine suspense.


The first forty minutes are an absolute test of patience with weak pacing and flat character setups. While the interval twist attempts to shift gears, poor CGI creatures, illogical writing, and artificial supernatural rules kill the tension. Despite Kayadu Lohar's earnest efforts, this half-baked survival drama fails to deliver any real scares.



Sep 21, 2026
T
Talari Snehalatha IT Employee
7

Hit

Immortal Movie review

Zero expectations tho Immortal first show ki velthe... pure surprise package bro!Starting 30 mins flat lo room - sharing concept thoni slow ga lag chesina, interval ki 20 mins mundhu nundi cinema complete ga gear maarusthundi! Aah interval twist aithe mind-blowing! Second half till climax full engag...

Zero expectations tho Immortal first show ki velthe... pure surprise package bro!


Starting 30 mins flat lo room - sharing concept thoni slow ga lag chesina, interval ki 20 mins mundhu nundi cinema complete ga gear maarusthundi! Aah interval twist aithe mind-blowing! Second half till climax full engaging ga, tight survival thriller ga vellindi.


G.V. Prakash acting super, & Kayadu Lohar dual-shaded character lo racha lepindi. BGM peak level! Horror thakkuve aina, supernatural thriller vibe ki 100% worth watch!



Sep 20, 2026
A
Arige Srikanth Private Employee
5

Average

Immortal movie review

Immortal : అసలు ఈ సినిమా రిలీజైనట్టే తెలీదు, నైట్ 10:50 షో Book my show లో చూసి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లా. కానీ థియేటర్ నుండి బయటకొచ్చాక... పక్కా Satisfied feeling..ఫస్టాఫ్ స్టార్టింగ్‌ లో 10 నిమిషాల బ్యాక్‌స్టోరీ ఓకే, ఆ తర్వాత అర గంట కాస్త బోరింగ్‌గా సాగదీశారు. కానీ ఇంటర్వెల్ ముందు 20 నిమిషా...

Immortal : అసలు ఈ సినిమా రిలీజైనట్టే తెలీదు, నైట్ 10:50 షో Book my show లో చూసి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లా. కానీ థియేటర్ నుండి బయటకొచ్చాక... పక్కా Satisfied feeling..


ఫస్టాఫ్ స్టార్టింగ్‌ లో 10 నిమిషాల బ్యాక్‌స్టోరీ ఓకే, ఆ తర్వాత అర గంట కాస్త బోరింగ్‌గా సాగదీశారు. కానీ ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల నుండి కథ రేంజ్ మారిపోతుంది! అప్పటివరకు రూమ్ షేరింగ్ అనుకున్న సీన్ తిరగబడి, ప్రాపర్ థ్రిల్లర్ గేర్ మార్చుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ చివరి వరకు ఫుల్ ఎంగేజింగ్!


కయాదు లోహర్ గ్లామర్‌తో పాటు గ్రే షేడ్స్‌ ఉన్న రోల్‌లో మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జీవీ ప్రకాష్ నటన, శామ్ CS BGM (లౌడ్ ఉన్నా బిజియం కిల్లే) సీట్‌కి హుక్ చేసేశాయి. క్రీచర్ VFX కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉన్నా, మేజర్ హారర్ కాకుండా సర్వైవల్ థ్రిల్లర్‌గా వర్కవుట్ అయ్యింది.

overall.. స్టార్టింగ్ ఓపిక పడితే... ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి క్లైమాక్స్ వరకు క్రేజీ థ్రిల్లింగ్ రైడ్!


Sep 19, 2026

About This Movie

Story : 

 

కథ విషయానికి వస్తే... హైదరాబాద్ లో ఉండే మహి (జీవీ ప్రకాశ్‌కుమార్‌) తన మామయ్య ప్రింటింగ్‌ ప్రెస్‌ లోనే డిజైనర్‌ గా వర్క్ చేస్తుంటాడు. అయితే అప్పటికే తను ఉంటున్న అద్దె ఇంటి రూమ్ యజమాని పెట్టే ఇబ్బందుల్ని భరించలేక, మరో అద్దె ఇంటి కోసం చూస్తుంటాడు. ఇలాంటి టైం లో మహికి షేరింగ్ ఫ్లాట్ ఉందని సింధు (కయాదు లోహర్‌) అనే యువతి నుంచి కాల్ వస్తోంది. వెంటనే మహి కూడా ఆమె ఫ్లాట్‌ కు షిఫ్ట్ అయిపోతాడు. అయితే అక్కడ సింధుని చూసిన తొలి చూపులోనే మహి ఆమెతో లవ్ లో పడతాడు. ఇటు సింధు కూడా మహికి క్లోజ్ అవుతుంది. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం... సింధు తాతయ్య ద్వారా.. మహికి సింధు గురించి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. అప్పట్నుంచి మహి సింధు నుండి, ఆమె ఫ్లాట్ నుండి పారిపోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అయితే అసలు సింధు గురించి మహికి తెలిసిన నిజం ఏంటి? మహి ఎందుకు పారిపోవాలని చూస్తాడు. మధ్యలో వెయ్యేళ్ల కిందటి మృగానికి సింధుకి సంబంధమేంటి? ఫైనల్ గా మహి లైఫ్ ఎలా టర్న్ అయింది.. అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


 
Plus Points : 

ఒక సస్పెన్స్ అండ్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ద్వారానే మంచి బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇలాంటి కాన్సెప్ట్ లతో ఇంతకు ముందు కూడా చాలా సినిమాలొచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఓ వింత మృగం ఆ మృగం నుండి తప్పించుకోవడానికి యువకుడి పాట్లు... ఇంతే... చాలా సినిమాల్లో ఇలా సింపుల్ కథలే ఉంటాయి. కానీ అవి హారర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి ఎంగేజ్ చేసేలా భయపెడుతూ కనెక్ట్ చేసే సినిమాలే సక్సెస్అవుతాయి.

 

ఇక ఈ సినిమాలో ఇలాంటి వాటికి దూరంగా ఉండే మాములు కుర్రాడైన మహి పాత్రలో జివి ప్రకాష్ చక్కగా నటించాడు. ఇక ఈ ఇమ్మోర్టల్‌ చిత్రంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఇక ఫిమేల్ లీడ్ లో నటించిన కాయదు లోహర్ కూడా అద్భుతంగా నటించింది. అలాగే సింధు - మహి తో పాటు మృగం ట్రాక్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే కీ రోల్స్ లో నటించిన టీఎమ్‌ కార్తిక్‌, కుమార్‌ నటరాజన్‌, ఆదిత్య కథిర్‌ వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. 

 

Minus Points :

అయితే మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే కథ చాలా వరకు సింపుల్ గా అర్ధమైపోతుంది. ట్విస్ట్ లు అనేవి రివీల్ అయిపోతే ఇక కథ గురించి తెలుసుకోవాల్సింది ఏముండదు. ఈ సినిమా కథ కూడా అంతే. అయితే ఇలాంటి ఒక హారర్ కథలో ఎంత క్రియేటివిటీ అయినా చూపిస్తూ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రాసుకోవచ్చు. షాకింగ్ ట్విస్ట్ లు ఎంత పగడ్బందీగా ఉంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇందులో అలాంటి ఎలిమెంట్స్ చాలా చాలా తక్కువ. ఒక్క ఇంటర్వెల్ ట్విస్ట్ తప్పితే ఏమీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కనిపించలేదు. అలాగే ఇమ్మోర్టల్ లో హీరోయిన్ పాత్ర క్రియేట్ చేసిన మాయ ప్రపంచం.. చాలా ఇల్లాజికల్ గా సాగుతుంది. 

 

అయినా హారర్ ఎలిమెంట్స్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అయితే ఇలాంటివేమీ పట్టించుకోడు. కానీ ఇందులో అవేం పెద్దగా కనిపించలేదు. డైరెక్టర్ మంచి స్టోరీ పాయింట్ నే తీసుకున్నా, దానికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. బోరింగ్ స్క్రీన్ ప్లే, లాజిక్ లెస్ సీన్లు, సాగదీత కథనం ఇవన్నీ స్టోరీ ఫ్లో ని దెబ్బతీశాయి. 

 

Technical Values :
 
ఇక టెక్నికల్ గా చూస్తే... ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ గా ఉన్నాయి. అయితే కథ పాయింట్ బాగా తీసుకుని స్క్రీన్ ప్లే బాగా రాసుకోలేక ఈ సినిమాలో అన్ని టెక్నికల్ వాల్యూస్ ని దెబ్బ తీసారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్‌ సీఎస్‌ ఇచ్చిన బీజీఎమ్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అనవసరమైన సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. కెమెరా వర్క్ బాగుంది. 

 

Final Review :

ఓవరాల్ గా "ఇమ్మోర్టల్‌" అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ హారర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ లో కొన్ని రకాల ట్విస్ట్ లు, హారర్ ఎలిమెంట్స్ తో పాటు, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. కానీ సరైన కథ కథనాలు లేకపోవడం, థ్రిల్లింగ్ మూమెంట్స్ రొటీన్ గా ఉండడం, బోరింగ్ సీన్స్ వల్ల ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవలేదు. కానీ హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ కోసం, కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ కోసం రెగ్యులర్ మూవీ లవర్స్ ఓసారి ట్రై చేయొచ్చు. 

 

Review Statistics

5.6
Overall Rating
Avg. of all reviews
5
Total Reviews
From 3 Provider Types

Review Average

Media
5.5/10
Public
5.7/10
Why MRO?