Register as a Reviewer
మీర్జాపూర్ ది మూవీ (Mirzapur The Movie)

మీర్జాపూర్ ది మూవీ (Mirzapur The Movie)

05 Sep 2026
Overall Rating
6.0/10
5 Reviews

Mirzapur The Movie : ఇండియన్ ఓటిటి వెబ్ సీరిస్ లలో అసలు వెబ్ సిరీస్ లపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఫేమస్ వెబ్ సిరీస్ లలో ఒకటి మీర్జాపూర్. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ని ఇప్పుడు సినిమాగా మార్చి సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. అదే యాక్టర్స్ తో చిన్న చిన్న ఛేంజెస్ తో తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీని హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయగా, డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Gurmmeet Singh
Cast: Ali Fazal, Pankaj Tripathi, Divyenndu, Jitendra Kumar, Ravi, Abhishek B ,Rasika Dugal, Mohitt Maalik, Sheeba Chadha, Rajesh Tailang, Pramod Pathak, Shriya Pilgaonkar, Harshita Shekhar Gaur, Shweta Tripathi, Sonal S. Chauhan, Anangsha Biswas, Shaji Choudhary, Satendra Soni, Kulbhushan Kharbanda, Sushant Singh

Available in:

Reviews

What critics and the public are saying about మీర్జాపూర్ ది మూవీ (Mirzapur The Movie)

Media Reviews

2 Avg: 6.5/10
123telugu
123telugu Website
6

Above Average

Mirzapur The Movie Review

ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్...

ఇండియన్ ఓటీటీ సెన్సేషనల్ సిరీస్ మీర్జాపూర్ బిగ్ స్క్రీన్ పై సినిమాగా ప్లాన్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి మంచి బజ్ సెట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాని మేకర్స్ హిందీ, తెలుగు భాషల్లో విడుదలకి ప్లాన్ చేశారు. మరి నేడు థియేటర్స్ లో విడుదలకి వచ్చిన ఈ బోల్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇందులో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సిరీస్‌ను బిగ్ స్క్రీన్‌పైకి చాలా అద్భుతంగా మలిచారాలని చెప్పొచ్చు. పంకజ్ త్రిపాఠీ, అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 


ఇక మొత్తానికి, మీర్జాపూర్: ది మూవీ అనేది ఓ ఇంటెన్స్ బోల్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో అభిమానించే మీర్జాపూర్ ప్రపంచాన్ని బిగ్ స్క్రీన్‌పైకి మేకర్స్ సాలిడ్ గా వర్కవుట్ చేశారు. ప్రధాన నటీనటుల బలమైన నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్, హ్యూమర్, ఇంటెన్స్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ లు అలాగే థియేట్రికల్ మూమెంట్స్‌తో నిండిన మాస్ సెకండ్ హాఫ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్ లో కొంచెం స్లో కథనం, కొన్ని పాత్రలని వీక్ గా వదిలేయడం కొంచెం డిజప్పాయింట్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే మీర్జాపూర్ సినిమా సాలిడ్ ట్రీట్ అందిస్తుంది, వాచ్ ఇట్.


Sep 06, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

Mirzaapur movie review

అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రమంలో ఇదే కథతో సినిమాగా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్‌ కథ, సన్నివేశాలు, డైలాగ్స్‌, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా దర్శకుడు గుర్మిత్ సింగ్ మరో ప్రయోగమే చేశాడన...

అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో సూపర్ డూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రమంలో ఇదే కథతో సినిమాగా వస్తున్నదంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే వెబ్ సిరీస్‌ కథ, సన్నివేశాలు, డైలాగ్స్‌, యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా దర్శకుడు గుర్మిత్ సింగ్ మరో ప్రయోగమే చేశాడని చెప్పాలి. మెయిన్ స్టోరి పాయింట్‌ తీసుకొని కొత్తగా సన్నివేశాలు, పాత్రలను సృష్టించి.. అంతే గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి.


స్టోరీ లైన్ చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు కొత్తగా ఉండటంతో న్యూ వెర్షన్ ఆఫ్ మీర్జాపూర్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు వచ్చే కిక్, మజా, ఈ మూవీ చూస్తే అంతగా అనిపించదు. కాకపోతే డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీర్జాపూర్ సిరీస్ చూడని వాళ్లకు ఈ మూవీ తెగనచ్చేస్తుంది. ఈ సినిమాలో కాళిన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నా భయ్యాగా దివ్యేందు, గుడ్గుగా అలీ ఫజల్, బబ్బన్ యాదవ్‌గా రవికిషన్ తమ పాత్రల్లో రెచ్చిపోయారు. రసిక దుగల్ పాత్ర సిరీస్‌లో ఉన్నదాని కంటే భిన్నంగా డిజైన్ చేశారు. జాన్ స్టీవార్డ్ ఎడ్యూరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. గూమార్ పాట బాగుంది. ఓవరాల్ గా మంచి అనుభూతితో బయటకు వచ్చేలా సినిమాగా మీర్జాపూర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.


Sep 05, 2026 Read Review

Public Reviews

3 Avg: 5.7/10
M
Mulollu Praveen Kumar CA/Advocate
5

Average

Mirzapur The movie Review

The theatrical version of Mirzapur is a bold experiment that offers a fresh twist to the iconic web series.Instead of a routine copy-paste, director Gurmeet Singh presents a newly packaged narrative that keeps you engaged. Pankaj Tripathi and Divyendu deliver standout performances, while Rasika Duga...

The theatrical version of Mirzapur is a bold experiment that offers a fresh twist to the iconic web series.


Instead of a routine copy-paste, director Gurmeet Singh presents a newly packaged narrative that keeps you engaged.


Pankaj Tripathi and Divyendu deliver standout performances, while Rasika Dugal's character redesign adds a surprising fresh layer.


John Stewart’s background score elevates the mass elevation scenes significantly.


However, compared to the cult OTT series, the theatrical cut feels a bit toned down and misses the original raw punch.


Overall, if you keep high expectations aside, it serves as a crisp, stylish, and engaging action drama for the big screen experience!

Sep 06, 2026
T
Talari Snehalatha IT Employee
6

Above Average

Mirzapur The movie Review

Mirzapur ante Prime lo aah raw violence & mass dialogues chusi peaks hype thoni theater ki velthe... scene koncham Average to Decent ga anipinchindi bro! Director Gurmeet Singh series ni complete ga dhimchakundha, main point theskoni oka new version try chesaru. Pankaj Tripathi (Kaleen Bhayya),...

Mirzapur ante Prime lo aah raw violence & mass dialogues chusi peaks hype thoni theater ki velthe... scene koncham Average to Decent ga anipinchindi bro!


Director Gurmeet Singh series ni complete ga dhimchakundha, main point theskoni oka new version try chesaru.


Pankaj Tripathi (Kaleen Bhayya), Divyenndu (Munna), and Ali Fazal (Guddu) valla best performance iccharu.


Background score & Goomar song visuals thope unnai. Kani series lo unna aah asli Mirzapur kick & raw violence ikkada koncham missing.


Series chudanollaki idhi next level anipisthundhi, kani already series chusina vallaki mathram just oka Average one-time watch feeling e osthundhi!

Sep 05, 2026
A
Arige Srikanth Private Employee
6

Above Average

Mirzapur The movie review

అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్‌ కి వెళ్లా.డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్...

అమెజాన్ ప్రైమ్‌లో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ అంటే నాకు Favorate ! అలాంటి కథ సినిమాగా వస్తుందంటే high range అంచనాలతో థియేటర్‌ కి వెళ్లా.


డైరెక్టర్ గుర్మిత్ సింగ్ సిరీస్ కథను అచ్చంగా దించకుండా, మెయిన్ పాయింట్ తీసుకొని ఒక new version experiment చేశారు. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, మున్నాగా దివ్యేందు, గుడ్డుగా అలీ ఫజల్, రవికిషన్ solid performance చూపించారు! రసికా దుగల్ క్యారెక్టర్ fresh గా ఉంది. జాన్ స్టీవార్డ్ BGM రచ్చ.. కిక్ ఇచ్చింది.


అయితే, సిరీస్ ఇచ్చే ఆ మాస్ మజా ఈ మూవీలో కాస్త తగ్గినా... ఒక different and gripping సినిమా చూసిన ఫీలింగ్ ఐతే పక్కా వస్తుంది. సిరీస్ చూడని వాళ్లకైతే ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్!


Finally పాత మీర్జాపూర్ కిక్ కొంచెం మిస్ అయినా, ఈ బిగ్ స్క్రీన్ ప్రయోగం డెఫినెట్‌గా ఒక worth watchable.

Sep 05, 2026

About This Movie

Story :

 

మీర్జాపూర్ మాఫియాకి రాజుగా పిలవబడే అఖండానంద్ త్రిపాఠి అలియాస్ కాళిన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), మీర్జాపూర్ అలాగే చుట్టూ పక్కల ప్రాంతాల్లో డ్రగ్స్, గన్స్ స్మగ్లింగ్ ఇంకా చట్టవ్యతిరేక బిజినెస్ లు చేస్తూ ఆ ప్రాంతాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడు. దీనికి గుడ్డు పండిత్ (అలి ఫజల్), బబ్లూ పండిత్ (జితేంద్ర కుమార్) లు కుడి, ఎడమ భుజాలుగా అండగా నిలుస్తారు. అయితే గుడ్డు, బబ్లూ పండిత్ లు అంటే ఏమాత్రం నచ్చని కాళిన్ భయ్య కొడుకు మున్నా భయ్యా (దివ్యెందు శర్మ) మీర్జాపూర్ కి యువరాజుగా ప్రకటించుకొంటాడు. కానీ మున్నా దురుసు ప్రవర్తన వల్ల కాళిన్ భయ్యా మున్నాను నమ్మకుండా గుడ్డు, బబ్లూ ల చేతికే పని చెప్తుంటాడు. ఈ క్రమంలో రాజస్థాన్‌ లో కూడా తమ హవా చాటాలని గుడ్డు, బబ్లూ తో పాటు మున్నా ని కూడా కొంతమందితో సంప్రదింపులకు అనుకోకుండా పంపాల్సి వస్తుంది.  ఈ క్రమంలో జైసల్మేర్‌ కు చెందిన బబ్బన్ యాదవ్ (రవికిషన్) మీర్జాపూర్ మార్కెట్‌ పై కన్నేసి వీళ్లకు అడ్డుపడతాడు. మరి ఇంతకీ కాళిన్ భయ్యా అనుకున్నది జరిగిందా? అసలు మున్నాకు గుడ్డు, బబ్లూలు అంటే కోపం ఎందుకు మీర్జాపూర్‌ లో త్రిపాఠి ఫ్యామిలీ హవా అలాగే కొనసాగిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

 

Plus Points : 

ఇండియన్ ఓటిటి సిరీస్ లలో మీర్జాపూర్ కి ఉండే ఫ్యాన్ బేస్, ఆ రేంజే వేరు. అందుకే సిరీస్ వచ్చిన ఐదారేళ్ళ తర్వాత కూడా మీర్జాపూర్ సినిమాగా వస్తుందంటే అదే క్రేజ్ వచ్చింది. ఇక ఈ సిరీస్ లో నటించిన అదే యాక్టర్స్ తో మళ్ళీ చేయడం మంచి ప్లస్ పాయింట్. చాలా మంది సినిమాగా థియేటర్లలో వర్కవుట్ అవుతుందా లేదా అని డౌట్ పడ్డారు కానీ, థియేటర్లలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది ఈ సినిమాకి. ఎందుకంటే పక్కా కమర్షియల్ సినిమాలాగానే అన్ని హంగులతో మీర్జాపూర్ సినిమాని తెరకెక్కించారు మేకర్స్. మాస్, యాక్షన్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ వెబ్ సిరీస్ కి ఏమాత్రం తగ్గకుండా తీశారు సినిమాని. 

అయితే సినిమాగా తీశారు కాబట్టి, వెబ్ సిరీస్ లో ఉన్న బూతు డైలాగ్స్ ని, రొమాంటిక్ సీన్స్ ని తగ్గించి ఫ్యామిలీస్ కూడా చూసేలా సినిమాని తీశారు అది బెటర్ అయిందని చెప్పాలి. ఇక ప్రీ-క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ కి మంచి గూస్బంప్స్ వస్తాయి థియేటర్లలో. అలాగే పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, రవి కిషన్ సహా మిగిలిన నటీనటులు కూడా న్యాచురల్ గా నటించి మెప్పించారు. వీరి ఆటిట్యూడ్ తో కూడిన నటన సినిమాకి మంచి హై ఇస్తుంది. 

 

Minus Points :

అయితే మీర్జాపూర్ సిరీస్ రేంజ్ లో ఆకట్టుకునే కంటెంట్ ఈ సినిమాలో ఉందా అంటే.. ఉంది కానీ.. ఆ రేంజ్ లో స్క్రీన్ ప్లే తగ్గిందనే చెప్పాలి. మీర్జాపూర్ లో ఉన్న డైలాగ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో సెన్సార్ ఇబ్బందుల వల్ల సినిమాలో పెట్టలేదు. కాబట్టి ఈ మూవీ లవర్స్ కొంచెం డిస్సపాయింట్ అయ్యారు. అలాగే కథ సూపర్ ఫాస్ట్ గా మొదలై, తర్వాత నెమ్మదిస్తూ బోర్ ఫీల్ వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పాటు, సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లను ఎడిట్ చేసి ట్రిమ్ చేయాల్సింది. ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్స్ లో నటించిన శ్రియా పిల్గావ్కర్, శ్వేతా త్రిపాఠీ, హర్షితా గౌర్ పాత్రల నిడివి తగ్గించడం మరో మైనస్ గా మారింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లో ఫిమేల్ క్యారెక్టర్లకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇందులో తగ్గించారు.

 

Technical values :

 

అయితే టెక్నికల్ గా చూస్కుంటే మీర్జాపూర్ సినిమాలో టెక్నికల్ వాల్యూస్ అదిరిపోయాయి. దర్శకుడిగా గుర్మీత్ సింగ్ సిరీస్ కి ఏమాత్రం తగ్గకుండా మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే తో పాటు, టెక్నికల్ గానూ అన్ని సమకూరేలా చూసుకున్నాడు. ముఖ్యంగా జాన్ స్టీవర్ట్ ఎడూరి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉండి, చాలా సీన్లు ఎలివేట్ అయ్యేలా చేసాయి. అలాగే సంజయ్ కపూర్ సినిమాటోగ్రఫీ స్టన్నింగ్ గా ఉంది. కాకపోతే మూవీలో ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది. అనవసరమైన సీన్స్ కొన్నింటిని ట్రిమ్ చేయాల్సింది. అలాగే సినిమాకి తెలుగు డబ్బింగ్ బాగుంది. యాక్షన్ సీన్స్ కొరియోగ్రఫీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.

 

Final Review : 

ఇక ఓవరాల్ గా మీర్జాపూర్: ది మూవీ ఒక పర్ఫెక్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఆడియన్స్ ని మెప్పిస్తుందనడంలో సందేహం లేదు. కాకపోతే తెలుగు ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుందో తెలీదు. వెబ్ సిరీస్ ఫ్యాన్స్ కైతే మళ్ళీ బిగ్ స్క్రీన్ పై కూడా ఎంజాయ్ చేసేలానే ఉంది సినిమా. సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన నటీనటుల యాక్టింగ్ కి తోడు, బీజీఎమ్, స్క్రీన్ ప్లే సినిమాలో హైలెట్ గా నిలిచాయి. కొన్ని సాగదీత సీన్స్ ని పక్కన బెడితే కాస్త తక్కువ అంచనాలతో వెళ్తే మూవీని ఎంజాయ్ చేయొచ్చు. 

 

Review Statistics

6.0
Overall Rating
Avg. of all reviews
5
Total Reviews
From 2 Provider Types

Review Average

Media
6.5/10
Public
5.7/10
Why MRO?