Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సర్దార్ 2 సినిమా గురించి చెప్పుకుంటే... డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానికి అతిగా మందులు, యాంటీబయోటిక్స్ అలవాటు చేయడం వల్ల వచ్చే ముప్పును ప్రధానాంశంగా ఎంచుకున్నారు. అయితే సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. స్టోరీలో రొటీన్ ఫార్ములా సీన్లు, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుడికి ముందే ఊహించగలిగేలా ఉండటం కాస్త నిరాశపరుస్తుంది.
అయితే ఎడిటింగ్ టేబుల్ పై ఇంకాస్త కత్తెర వేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. మొత్తానికి ఎలాంటి థ్రిల్స్ లేని స్టోరీ, లాజిక్ లేని సీన్లు, సుదీర్ఘమైన రన్ టైమ్‌తో వచ్చిన 'సర్దార్ 2' ఓ విఫల సీక్వెల్‌గా మిగిలిపోయింది. ఫైనల్‌గా.. మొదటి భాగం స్థాయి మ్యాజిక్‌ను పూర్తిగా రిపీట్ చేయలేకపోయినప్పటికీ.. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్స్, కార్తీ నటనను ఇష్టపడే వారు 'సర్దార్ 2' సినిమాను ఒకసారి వీక్షించవచ్చు.
సర్దార్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... కమల్ హాసన్‌కు 'భారతీయుడు'లా తనకు 'సర్దార్' అని కార్తీ చెప్పారు. అది నిజమే. 'భారతీయుడు'లో కమల్, 'సర్దార్'లో కార్తీ... తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా మెప్పించారు. రెండు సినిమాల్లోనూ కంటెంట్ ఉంది. 'భారతీయుడు'కు సీక్వెల్ 'ఇండియన్ 2'తో కమల్ డిజాస్టర్ అందుకున్నారు. అలాగే సర్దార్ 2 తో కూడా కార్తీ డిజాస్టర్ అందుకున్నట్టు అనిపిస్తుంది.
చాలా మంచి విషయం చెప్పాలనుకున్నారు. కానీ, ఎగ్జిక్యూషన్ పరంగా ఎగ్జైట్ చేయలేదు. స్పై థ్రిల్లర్ కథకు కమర్షియల్ హంగులు యాడ్ చేసి సినిమాను సాగదీశారు. కానీ, కథ సీరియస్‌గా సాగేటప్పుడు కామెడీ చేసి కంపరం పుట్టించారు.
'సర్దార్ 2'లో ప్రజలకు చెప్పాలనుకున్న సందేశం బావుంది. కానీ, చెప్పిన విధానం బాలేదు. ఆసక్తిగా సినిమా ముందుకు సాగలేదు. కథను సాగదీసి సాగదీసి చెప్పారు. అక్కడక్కడా యోగిబాబు నవ్వించారు. అయితే... సీరియస్ కథలో ఆ కామెడీ సెట్ కాలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే చిత్రమిది. ఫైనల్ గా మరో భారతీయుడు 2 లా, మరో సర్దార్ 2 ఉంది.
సర్దార్ 2 చూస్తుంటే అసలు కొత్తగా ఏం చూస్తున్నామో అనిపించదు.
రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడిన ఫీలింగ్ వస్తుంది. Part 1లో పనిచేసిన elementsనే తీసుకొచ్చారు కానీ ఈసారి అవి అంతగా work అవ్వలేదు. Story చాలా predictableగా ఉంటుంది.
atleast screenplay లో grip కనిపించదు. కొన్ని interesting ideas ఉన్నప్పటికీ వాటిని proper గా develop చేయలేదు.
Karthi మాత్రం తన performance తో సినిమాని నిలబెట్టడానికి full effort పెట్టారు. కానీ S.J. Suryah లాంటి strong actorని కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు.
దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మనం తీసుకునే ఆహారం, అందులో కలిసే మందులు, యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోలాస్టిన్ (Colastin) అంశం ద్వారా చూపించారు. పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు.
స్పై థ్రిల్లర్‌కు కమర్షియల్ అంశాలను జోడించడంతో సినిమా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే కామెడీ కూడా కథ ఫ్లోను దెబ్బతీసింది. తెలుగు డబ్బింగ్ కూడా దారుణంగా ఉంది. ఏమాత్రం సహజంగా అనిపించలేదు. అది పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ లో మాత్రం ఏ డోకా లేదు. ఎస్.జె. సూర్య మాత్రం చాలా సినిమాల్లో చేసిన క్యారెక్టర్ నే మళ్ళీ మళ్ళీ చేసినట్టుంది. మొత్తంగా సందేశం బాగున్నా.. ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ‘సర్దార్ 2’ నిరాశపరుస్తుంది. మంచి పాయింట్‌ను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు.
Sardar 2 Review :
Positives:
Karthi’s screen presence
Negatives:
Weak screenplay
Forced Comedy
Heavily inspired action
Sardar2 basic idea is good, but the screenplay never interests you. Yet another major drawback is the lack of tension in the narrative. Spy thrillers are always pulsating, but that aspect is totally missing in the film. The makers have spent money and given the film a lavish scale, but in all this, the basic emotion is missing, and the characters are hardly developed, making Sardar 2 a tedious watch. The film is only made to cash in on the franchise and nothing else.
Bottomline: Failed Mission.
దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తన సినిమాల ద్వారా సాధారణ ప్రజలలో ఏదో ఒక అంశంపై అవగాహన కల్గించడానికి కృషి చేస్తుంటారు. 'సర్దార్' మూవీలో డ్రింకింగ్ వాటర్ మాఫియా గురించి చెప్పిన మిత్రన్... ఈ సీక్వెల్ లో మనం తినే ఆహారం ఎంతగా కలుషితం అయిపోయింది? విపరీతంగా మందుల వాడకం కారణంగా మన శరీరం ఎలా నిర్వీర్యం అయిపోతోందన్నది తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే డైరెక్టర్ ఈసారి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు.
ఇక సర్దార్ 2' సినిమా ఒక ఫ్లో లో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయినా... తెర మీద జరిగే తంతు అంతా యాంత్రికంగా ఉంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఏమంత గొప్పగా లేవు. అవీ రొటీన్ గానే సాగాయి. సినిమా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా హై మూమెంట్ అనేది లేదు. 'రా' ఏజెంట్స్ పై తీసిన సినిమాను మరీ ఇంత 'రా'గా తీయడం అవసరమా అనిపిస్తుంది. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ మాత్రం బాగుంది. ఓవరాల్ గా కథలో కొత్తదనం లేకపోవడం, కథనం ఆసక్తిని కలిగించకపోవడంతో ప్రేక్షకులను మెప్పించడంలో 'సర్దార్ 2' విఫలమైంది.
సర్దార్ సినిమా ద్వారా ప్లాస్లిక్ బాటిల్ వాడకం వల్ల ఎలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయనే సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు. సర్దార్ 2 విషయానికి వస్తే.. కోలాస్టిన్ అనే మెడిసిన్ గురించి యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పించే చక్కటి ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఎంచుకొన్న కథ, కథనాలు, చెప్పిన విధానం ఆకట్టుకోలేకపోయింది.
దర్శకుడు మిత్రన్ రాసుకొన్న సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. దాంతో ఇలాంటి థీమ్‌తో ఇప్పటికే ఎన్నో కథలు రావడం వల్ల పాత సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విదేశీ మాఫియా కుట్రలు, బయో వెపన్ లాంటి కథలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే అనిపిస్తాయి. ఇక పెర్ఫార్మన్స్ పరంగా కార్తీ చేయాల్సింది చేస్తే... ఎస్.జె. సూర్య చేయాల్సిందనికన్నా ఎక్కువ చేసినట్టు ఉంది.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ప్రామిసింగ్ ఎఫర్ట్స్ పెట్టారనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విభాగం పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో సినిమా నేరేషన్ గ్రిప్పింగ్‌గా అనిపించదు. బీజీఎమ్ కూడా డిస్సపాయింట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా కథ మంచి పాయింటే అయినప్పటికీ.. దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. దాంతో కార్తీ సర్దార్ కంప్లీట్ గా నిరాశపరిచిందనే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాల్సిందే.
సర్దార్-2’ ఎంతో ఎఫర్ట్ పెట్టిన రాసిన కథతో తయారైన సినిమా. రైటర్ కమ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ అంత భారీగా.. అనేక లేయర్లతో ఆ కథను రాసుకున్నాడు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టి రాసినా.. తెర మీద ఎంత భారీగా ఆ కథను ప్రెజెంట్ చేసినా.. చెప్పాలనుకున్న విషయం అర్థవంతంగా అనిపిస్తేనే.. ప్రేక్షకులకు అది సరిగ్గా చేరితేనే మంచి అనుభూతి కలుగుతుంది. ‘సర్దార్’లో వాటర్ మాఫియా అంశాన్ని.. ఒక పంచె కట్టిన గూఢచారి చేసే విన్యాసాలను మిత్రన్ అలా అర్థవంతంగానే తెరపై ప్రెజెంట్ చేశాడు. కానీ ‘సర్దార్-2’కు వచ్చేసరికి.. బయో వార్ కాన్సెప్టు చుట్టూ అల్లుకున్న కథను కనీసం తన టీం సభ్యులకు అయినా అర్థమయ్యేలా చెప్పగలిగాడా అనే సందేహం కలుగుతుంది.
ఎస్.జె.సూర్య చేసిన విలన్ పాత్రను తీర్చిదిద్దిన విధానమే ప్రేక్షకులకు తీవ్ర గందరగోళంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు అతను విలనో హీరోనో అర్థం కాదు. ఒకవైపేమో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లాసులు పీకుతాడు. ఇంకోవైపేమో అలా చేయడం తప్పు కాబట్టి ఆ మనుషులకు బతికే అర్హత లేదంటాడు. ఇంకోవైపేమో ఈ తరం అంతా పోయాక ఒక మంచి తరాన్ని తయారు చేస్తా అంటాడు.
అయితే కార్తి పెర్ఫామెన్స్ పరంగా ఏమీ లోటు చేయలేదు. ఇటు డైరెక్టర్ కూడా కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశాడని.. ఎంతో కసరత్తు చేసి స్క్రిప్టు రాశాడని అర్థమవుతుంది. కానీ ఎంత కష్టపడ్డప్పటికీ.. అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా కథను చెబితేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. కానీ రైటింగ్-టేకింగ్ లో విపరీతమైన గందరగోళం.. అర్థరహితంగా అనిపించే విలన్ పాత్ర వల్ల.. కన్విన్సింగ్ గా లేని కొన్ని సన్నివేశాల వల్ల మిత్రన్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. చివరగా సర్దార్-2.. దారి తప్పిన ఏజెంట్ అయ్యాడు.
కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ లు ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ సీక్వెల్ సినిమానే ‘సర్దార్ 2’. పార్ట్ 1 మంచి హిట్ కావడంతో దాని సీక్వెల్ ని తీసుకురాగా, థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక గత సినిమాలో లానే ఈసారి కూడా ఓ సెన్సిటివ్ సబ్జెక్ట్ ని దర్శకుడు పట్టుకోవడం జరిగింది. అయితే పార్ట్ 1 లో ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్, మూమెంట్స్ పార్ట్ 2 లో బాగా మిస్ అయ్యాయి.
అయితే మూవీలో కొన్ని ఐడియాలు పార్ట్ 2 లో బాగానే ఉన్నాయి. కానీ వాటికీ తగ్గ సెటప్, స్క్రీన్ ప్లే మిస్ అయినట్టు కూడా చూసే ఆడియెన్ కి అర్ధం అయ్యిపోతుంది. కార్తీ బాగానే నటించినా, సినిమాలో అనవసర సన్నివేశాలతో ల్యాగ్ చేసారు. ఇక మొత్తంగా చూసుకుంటే ‘సర్దార్ 2’ మాత్రం పార్ట్ 1 తో పోలిస్తే అంచనాలు అందుకోలేకపోయింది. అలాగే సబ్జెక్టులో కోర్ పాయింట్ కూడా బాగానే ఉంది, కానీ ఇవే ఎలిమెంట్స్ పార్ట్ 1 లో కూడా ఉన్నప్పటికీ అక్కడ కనిపించిన గ్రిప్పింగ్ కథనం, థ్రిల్ మూమెంట్స్ ఇందులో బాగా మిస్ అయ్యాయి. సో వీటితో ఈ చిత్రం ఒక డల్ స్పై థ్రిల్లర్ గా నిలిచిపోయింది.
సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశామని బయటకు వస్తారు.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్ పేట్ సెంటర్ లో నిలబడి గుండు కొట్టించుకుంటా.. అని చెప్పింది.
సినిమా మాత్రం దానికి రివర్స్ లో ఉంది. డీసెంట్ అనే దానికి కూడా వంద అడుగుల దూరంలో ఆగిపోయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి బోర్ కొట్టేసింది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే సంజు పాత్రలో శివ కుమార్ బాగా చేశారు. అలాగే సహ పాత్రలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. లాజిక్ లెస్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి హీరో, హీరోయిన్లు శపథం చేసినంతగా ఈ సినిమా లేదని చెప్పాలి.
స్యాడ్ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడటం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు డబ్బులు లేక, జాబ్ లేక ఇబ్బంది పడటం, ఈ క్రమంలో ఎదురయ్యే అవమానాలు, చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ మూవీ.
ఈ మూవీ క్లైమాక్స్ ఏంటో ప్రారంభంలోనే అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి కంటెంట్ ని జనాలు ఎంజాయ్ చేయడం కష్టమే, అంత ఓపిక జనాలకు లేదు. ఇక చిన్నపాటి సస్పెన్స్, ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత అది తేలిపోతుంది. సినిమా మొత్తం ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే ఆయా సీన్లు కొంత వరకు హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి. స్లోగా, ఊహించేలా సాగే లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా `సహ`. కొంత వరకు 7/జి బృందావన కాలనీని తలపిస్తుంది. హీరోహీరోయిన్లు సవాల్ విసిరి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. కానీ అదే ఈ మూవీకి పెద్ద మైనస్.
నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే... ఓ యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ సాగిన ఈ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కుమార్ కాసారం
ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో శివ కుమార్ కాసారం నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన శ్వేతా లక్ష్మణ్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది.
ఓవరాల్ గా ‘సహ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers