Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, రానా, దుల్కర్ కలిసి సినిమా నిర్మించారు. కాంత విషయానికి వస్తే.. మీకు రెగ్యులర్ మసాలా సినిమాలు బోర్ కొట్టి, ఒక మంచి రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే కాంత బెస్ట్ ఆప్షన్. నటన విషయంలో ఎవరికీ వారే పోటీ పడి మరీ అద్భుతంగా నటించారు. టెక్నికల్ గా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్. నైట్ ఎఫెక్ట్ ని కెమెరాలో బంధించిన విధానం, సినిమాటోగ్రఫీ మూడ్ చాలా బాగుంటుంది. ఇది స్లో-బర్న్ థ్రిల్లర్ (నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లేది), కాబట్టి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ ఆశించవద్దు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా, బరువుగా ఉంటుంది. కానీ థియేటర్లో మాత్రం కాంతాని ఆడియన్స్ ఆదరించలేదు. ఓటిటి లో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా మూవీ "కాంత". భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కడం జరిగింది. ఇక దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. ఈ మూవీ మన తెలుగు ఆడియెన్స్ కి డ్రైగా అనిపిస్తుంది. మనకు తెలియని సబ్జెక్ట్ కావడమే మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కథలో డెప్త్, టేకింగ్‌లో డెప్త్, రూపొందించిన తీరు, ఆర్టిస్ట్ ల నుంచి బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ రాబట్టిన తీరు మాత్రం సూపర్. సినిమా కోసం పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడితోపాటు టీమ్ అందరిని అభినందించాల్సిందే. టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉండే మూవీ ఇది. ఫైనల్‌గా: `కాంత` కమర్షియల్ కోణంలో కాకుండా ఆర్ట్ ఫామ్ యాంగిల్‌లో చూస్తే ఆకట్టుకునే మూవీ అవుతుంది. తెరవెనుక విషయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ సినిమాని ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్ కోసం చూడొచ్చు.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలో నటించిన సినిమా కాంత. పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రానా, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక కాంత సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. నటీనటుల అద్బుతమైన పెర్ఫార్మెన్స్, బలమైన సాంకేతిక విలువలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కానీ ఈ పీరియాడిక్ డ్రామాను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా మార్చే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టింది. సెకండాఫ్ బోరింగ్‌తో విసుగు పుట్టిస్తుంది. సినిమాలో ఎమోషన్స్ పూర్తి మిస్ అయ్యాయి. తెలుగు ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఒక్కటి కూడా కనిపించవు. సెకండాఫ్ అత్యంత పేలవంగా, సహనానికి పరీక్షగా సాగుతుంది. దుల్కర్ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా ఉంటుంది. సాధారణ ఆడియెన్స్‌కు మాత్రం రుచించని వంటకంలా ఉంటుంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన మూవీ "కాంత". రానా, సముద్రఖని కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో గురు శిష్యులుగా దుల్కర్, సముద్రఖని వాళ్ళ మధ్య సన్నివేశాల్లో ఇద్దరూ పోటాపోటీగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే కూడా నటన పరంగా మెప్పించింది. అలాగే రానాకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా తన పాత్ర వరకు న్యాయం చేసాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెర వెనుక జరిగే సంగతులు తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు. అటువంటి ప్రేక్షకులకు పర్ఫెక్ట్ సినిమా 'కాంత'. అయితే దీనిని కంప్లీట్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ సినిమాగా చెప్పలేం. దీనిని ఒక్క జానర్ కింద చూడలేం. ప్రేమ కథ, ఈగో క్లాష్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్... ఒక దాని నుంచి మరొక దానికి షిఫ్ట్ అయ్యింది సినిమా. కానీ ఎంగేజ్ చేయలేదు. దుల్కర్ సల్మాన్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కానీ, ఆయన ఒక్కరి ప్రయత్నం సినిమాను నిలబెట్టడానికి సరిపోలేదు. ఫస్టాఫ్ ఓకే. కానీ చివరి వరకు థియేటర్లలో కూర్చోవడానికి కాస్త ఓపిక కావాలి.
టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా "కాంత". సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక దర్శకుడు సెల్వరాజ్ కాంత కోసం దుల్కర్, సముద్రఖని ఇద్దరినీ మహదేవన్, అయ్య పాత్రలకి సెలక్ట్ చేసుకున్నప్పుడే సక్సెస్ అయిపోయాడు. "ఆడియన్స్ ఇవే చూస్తారు.. ఆడియన్స్ కోసమే ఇలాంటివి తీస్తున్నామనే సినిమాలు ఒకవైపు".. "నటుడిగా తమ ఆకలి తీర్చుకోవడానికి తీసే సినిమాలు మరోవైపు".. అయితే కాంత ఈ రెండో కోవకి చెందిన సినిమా. కాంత చూసాక చివరిగా థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు "మనం మాట్లాడుకోవడం మానేసాం.. మనం ఏమీ చేయక్కర్లేదు ప్రపంచం బాగుండాలి అంటే ఇద్దరు మనుషులు పక్కపక్కన కూర్చొని ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకుంటే చాలు.." అనే త్రివిక్రమ్ మాట గుర్తుకువస్తే ఆడియన్స్ కి కాంత చాలా బాగా అర్థమవుతుంది.
దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, రానా, సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, రానా కలిసి మూవీ నిర్మించారు. ఇక ‘కాంత’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కథ, అప్పటి సినీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రేమంటే థియేటర్లో విడుదలై నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మెయిన్ లీడ్స్ అయిన ప్రియదర్శి, ఆనంది పెర్ఫార్మన్స్ పరంగా మెప్పించినా, డైరెక్టర్ స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇతర పాత్రలు కూడా సినిమాలో పేలవంగా అనిపిస్తాయి. విశ్వనాథ్ రెడ్డి, లియోన్ జేమ్స్ పనితీరు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తుంది. కానీ పాటలు అంతగా ఆకట్టుకొనేలా ఉండవు. సెకండాఫ్‌లో ఎడిటర్ రాఘవేంద్ర చాలా సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. ఇక నిర్మాతలు జాన్వీ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు అనుసరించిన నిర్మాణ విలువలు భారీగా ఉన్నా, వాటికి తగ్గ ఫలితం తెర మీద కనిపించదు. మెదడుకు పనిపెట్టకుండా సినిమాను నార్మల్ గా చూస్తే ఏమైనా నచ్చుతుందేమో గాని, కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ప్రేమంటే రెండు గంటలపాటు ప్రేక్షకుడికి కఠిన పరీక్షే.
Premante Movie Review
ప్రియదర్శి ,ఆనంది జంటగా నటించిన ప్రేమంటే థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కామెడీ డ్రామా బాగానే ఉన్నా, కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ముఖ్యంగా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ బలమైన కథా కథనాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. ఇటు లియోన్స్ జేమ్స్ సంగీతం బానే ఉన్నా, బీజీఎమ్ ఇంప్రెస్ చేయలేదు. విశ్వనాథ్ రెడ్డి కెమెరా వర్క్ ఆకట్టుకునేలా కలర్‌ఫుల్ గా ఉంది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ వర్క్ తగ్గింది. పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఇందులో హీరోహీరోయిన్ల లవ్ కి కనెక్ట్ కానీ ఆడియన్స్ కనీసం కామెడీ వర్కౌట్ అయితే అయినా కనెక్ట్ అవుతారా అంటే, అందులోనూ కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్ కి నిరాశ తప్పదు. ఓవరాల్ గా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తీసుకున్న పాయింట్ ఫర్వాలేదు, కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో ఆయన తడబాటు కనిపిస్తుంది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసేలా? ఎంగేజ్ చేసేలా ఈ మూవీని తెరకెక్కించలేకపోయారు.
ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. హీరోహీరోయిన్లు బాగానే నటించినా, కమెడియన్స్ మిగతా ఆర్టిస్టులు అతిగా చేసినట్టనిపిస్తుంది. యాక్షన్ బదులు ఓవరాక్షన్ చేశారు. ఒక్కరి నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేదు దర్శకుడు నవనీత్. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ బాగున్నా, ఇరికించినట్టు అనిపిస్తుంది. ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాలకి సినిమాలో మంచి సీన్స్ ఉన్నా, ఆ సీన్స్ స్ట్రాంగ్ గా అనిపించవు. ఓవరాల్ గా డైరెక్టర్ ఈ సినిమాకు మేకింగ్ క్వాలిటీ విషయంలో తప్ప, కథా కథనాల విషయంలో మెప్పించలేదు. ఒకసారి చూడొచ్చు గాని, నవ్వుల కోసం చూస్తే ఏమాత్రం నచ్చదు, సరికదా చికాకు తెప్పిస్తుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వించకపోగా మొత్తం మీద ప్రేమంటే... నవ్వులు అస్సలు లేవంతే!
కమెడియన్ కం హీరో ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన ప్రేమంటే రీసెంట్ గా థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెర్ఫామెన్స్ పరంగా ప్రియదర్శి ఆకట్టుకున్నప్పటికీ, ఇంపాక్ట్ అంతగా లేదు. అలాగే ఆనంది కూడా తన వరకూ బాగానే నటించినా ఎక్కడో ఏదో మిస్ అయిందనిపిస్తుంది. వీళ్ళ తర్వాత కీలక పాత్రలో నటించిన సుమ పాత్ర కూడా చాలా తేలిపోయింది. చాలా వరకు ఆ పాత్ర విసిగిస్తుంది. ఇక టెక్నికల్ గా కూడా "ప్రేమంటే" బీలో యావరేజ్ గా కనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ పాటలు బాగా లేకున్నా, బీజీఎమ్ పర్లేదు. నవనీత్ శ్రీరామ్.. క్రేజీగా ఉండే కథను సెలెస్ట్ చేసుకున్నా, స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడంలో తడబడ్డాడు. ప్రతివారం రెగ్యులర్ గా సినిమాలు చూసేవారు, కామెడీ సినిమాలు ఇష్టపడే వారు ఒక్కసారి ట్రై చేయొచ్చు.
ప్రియదర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే. కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకక్రైమ్ రోమ్ కామ్ డ్రామాగా ఆడియన్స్ ని అలరిస్తుంది. లీడ్ జంట మంచి పెర్ఫామెన్స్ కనబరచగా, సుమ, వెన్నెల కిషోర్ తదితరులు కూడా ఆకట్టుకున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫన్ సెకండ్ హాఫ్ లో మైంటైన్ చేయలేకపోయారు మేకర్స్. స్క్రీన్ ప్లే బాగా లేకపోవడం వల్ల ఆడియన్స్ కి ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. మ్యూజిక్ పరంగా లియోన్ పనితనం పర్లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. పైగా కొత్తదనం లేకపోవడంతో రెగ్యులర్ మూవీ లవర్స్ ఇష్టపడే అవకాశం లేదు. మొత్తానికి ప్రియదర్శికి ఈ సినిమాతో కూడా సరైన సక్సెస్ దొరకడం కష్టమైపోయింది. కేవలం కామెడీ కోసం ఒకసారి ట్రై చేయాలనుకునే వారు ప్రేమంటే మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు.
కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా, ఒక డార్క్ హ్యూమర్ క్రైమ్ కామెడీ, ఇది ఏ ఉప-శైలిలోనూ బలమైన పట్టును ఏర్పరచుకోలేకపోయింది. కొన్ని చిన్న క్షణాలు తప్ప, ఈ చిత్రం పూర్తిగా పడిపోయి బోరింగ్‌గా ఉంది, దీని వలన థియేటర్లలో మరియు OTTలో సులభంగా దాటవేయవచ్చు.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Homemaker / Housewives
Women managing households
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers