Register as a Reviewer
మకుటం (Makutam)

మకుటం (Makutam)

Upcoming Expected Release: 2026

Makutam Teaser : స్వీయ దర్శకత్వంలో విశాల్... ఈసారి సరికొత్తగా...

Director: Vishal
Cast: Vishal, Anjali, Dushara Vijayan, John Vijay, Jeya prakash, Ajay, Vamsi Krishna, Abu Salim, Arjai, Vj Jhansi, Padam Kumar, Sabhumon

Available in:

About This Movie

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరోల్లో విశాల్ ఒకరు. లాస్ట్ ఇయర్ 'మదగదరాజా' సినిమాతో సక్సెస్ అందుకున్న విశాల్ ఈసారి గేర్ మార్చాడు. తన స్వీయ దర్శకత్వంలో "మకుటం" అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అయితే మొదటి సారి సినిమా డైరెక్ట్ చేస్తున్న విశాల్ ఈ సినిమాలో మూడు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నాడు. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్  బ్యానర్‌ పై తెరకెక్కుతున్న మకుటం మూవీ నుండి తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేసారు. 

 

ఇక టీజర్ మొత్తం పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో క్రేజీగా కట్ చేసారు, విశాల్ వాయిస్ ఓవర్, బీజీఎమ్ తో బాగా ఎలివేట్ అయింది. ఫస్ట్ లో మండుతున్న శవం దగ్గర ప్రశాంతంగా సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ ఎంట్రీ ఇచ్చిన సీన్ హైలెట్.. ఇక మకుటంలో ఒక దర్శకుడిగా విశాల్ చూపించిన విజువల్ ప్రెజెంటేషన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ మూవీలో నటి అంజలి కూడా చాలా పవర్ఫుల్ గా కనిపించింది.  ఇప్పటి వరకు కనిపించని మాస్ షేడ్‌ లో అంజలిని చూపించారు మేకర్స్. 

 

టెక్నికల్ గా సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్ విజువల్స్ బాగున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ బీజీఎమ్ సాలిడ్ గా ఉండి సినిమాకి మంచి హై ఇచ్చింది. ఇక ఈ సినిమా సముద్ర పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం. మకుటం మూవీలో దుషార విజయన్‌, అంజలి, జాన్ విజయ్, అజయ్, వంశి కృష్ణ కీ రోల్స్ లో నటిస్తుండగా, జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జులై లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

 

Why MRO?