అగధ (Agadha)
ప్రముఖ నిర్మాత దర్శకుడు ఎం ఎస్ రాజు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ హారర్ - థ్రిల్లర్ మూవీ "అగధ". కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ గా నటించిన ఈ మూవీ ఆగష్టు 14న థియేటర్లలో విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది.
Available in:
About This Movie
Story :
కథ విషయానికి వస్తే... స్నేహితులైన ముగ్గురు మహిమ (ఉల్కా గుప్త), శ్యామ్ (శ్రవణ్ రెడ్డి) అలాగే బబ్లూ (వైవా రాఘవ్) ముగ్గురూ కలిసి ఛత్తీస్ ఘర్ అటవీ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాన్ చేసిన ఓ మిస్టీరియస్ గుహలోకి వెళ్దామని ప్రయత్నిస్తారు. అయితే ఆ ప్రయత్నంలో బబ్లూ అక్కడే చనిపోగా, శ్యామ్ మిస్ అవుతాడు. పైగా నిండు గర్భిణీ అయిన మహిమ కూడా కొన్ని నెలల్లో చనిపోతుంది. ఈ క్రమంలో ఈ మరణాల మిస్టరీ ఛేదించడానికి యోగిని మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అక్కడికి వస్తుంది. అసలు మహిమ ఎందుకు చనిపోతుంది. మహిమకు మహాదేవికి సంబంధమేంటి? మహాదేవి చిన్నాన్న కుటుంబం కథేంటి? అసలు అసలు వీటికి కారణమైన "అగధ" ఎవరు? ఇంతకీ ఈ మరణాల వెనుక ఉన్న మిస్టరీని మహాదేవి చేదించిందా? అన్నది మిగిలిన కథ.
Plus points :
మాములుగా ఈ సినిమా గురించి ఆడియన్స్ కి చాలా వరకు తెలీదు. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడే మంచి అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడిగా మారాక నిర్మాత ఎం.ఎస్ రాజు అంతగా గుర్తుండిపోయే సినిమాలు చేయకపోయినా, ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తన గత చిత్రాలకు భిన్నంగా "అగధ" పేరుమీద డిఫరెంట్ కొత్త పాయింట్ తో స్టోరీ లైన్ రాసుకున్నారు. పైగా సినిమాలో అగధ చుట్టూ మెయింటైన్ చేసిన సస్పెన్స్ కూడా బాగుంది. పైగా కొన్ని డివోషనల్ టచ్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక మెయిన్ లీడ్ లో నటించిన కామాక్షి భాస్కర్ల చాలా ఇంటెన్స్ తో కూడిన నటన చూపించి ఇంప్రెస్ చేసింది. అలాగే ఉల్కా గుప్త, శ్రవణ్ రెడ్డి, షిజు అబ్దుల్ రషీద్ సహా మిగిలిన నటులు కూడా తమ పాత్రల పరిధిమేరకు బాగా యాక్ట్ చేసారు.
Minus points :
అయితే ఈ అగధ మూవీ కాన్సెప్ట్ బాగానే రాసుకున్నప్పటికీ, కథకి తగ్గ కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో కొంతమేర సస్పెన్స్ బాగానే మైంటైన్ చేసినా, సెకండ్ హాఫ్ లో కథనం పూర్తిగా డల్ అయిపొయింది. మనం చాలా సినిమాల్లో చూసిన థ్రిల్లర్ మూవీస్ తరహాలోనే ఈ మూవీ కూడా ఉండడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టించింది. అలాగే కొన్ని సీన్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడంతో ఆడియన్స్ కి విసుగు పుట్టించాయి. అలాగే సినిమాలో కొందరి పాత్రలు అవసరం లేకపోయినా ఇరికించినట్టు
అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కొంచెం బాగానే ఉన్నా, వేరే సినిమాలు గుర్తొస్తాయి. పైగా సినిమాలో మహాదేవి ఆత్మలతో మాట్లాడడం కోసం వెళ్లే టైం లూప్ సీన్స్ కి కొన్ని సినిమాలనుండి కాపీ చేసినట్టు తెలుస్తుంది. ఇవి చూసిన ఆడియన్స్ కి రొటీన్ ఫీల్ తెస్తుంది.
Technical Values :
అయితే సినిమాలో టెక్నికల్ గా వంక పెట్టడానికి పెద్దగా ఏం లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. అలాగే రాకేష్ వెంకటాపురం మ్యూజిక్, బీజీఎమ్ కూడా బాగున్నాయి. కాకపోతే జునైద్ సిద్ధఖీ ఎడిటింగ్ బాగా చేయాల్సింది. సినిమాలో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. ఇక డైరెక్టర్ ఎమ్మెస్ రాజు డైరెక్టర్ గా మారిన తర్వాత పెద్దగా సక్సెస్ఫుల్ మూవీస్ ఏం తీయలేదు. ఈ అగధ కాన్సెప్ట్ బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే బాగా రాసుకుంటే మంచి ఫలితం ఉండేది.
Final Review :
ఓవరాల్ గా అగధ సినిమా గురించి చెప్పాలంటే మంచి స్టోరీ పాయింట్ తో తెరకెక్కినప్పటికీ, బోరింగ్ స్క్రీన్ ప్లే కారణంగా ఆకట్టుకోలేకపోయింది. అనవసరమైన సీన్లు ఎడిట్ చేసి, క్లైమాక్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ రాసుకుంటే మరోలా ఉండేదేమో. ఓవరాల్ గా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ ఓసారి ట్రై చేయొచ్చు. మిగతా వారికి కష్టమే.