Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
తిమ్మరాజుపల్లి టీవీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది. హీరోహీరోయిన్లుగా నటించిన సాయి తేజ్, వేదా జలంధర్ మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వగా, ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి కూడా మెచ్యురిటీతో కూడిన పెర్ఫార్మెన్స్‌ను అందించారు. కిరణ్ అబ్బవరమ్ నుంచి లభించిన ఒకే ఒక్క ఛాన్స్‌ను ప్రూవ్ చేసుకోవాలనే తపన కనిపించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు కూడా వందకు వందశాతం తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చడంలో తమ వంతు సహకారాన్ని అందించారు.
ఇక ఈ మూవీకి అత్యంత బలంగా మారిన సాంకేతిక విభాగాల్లో మ్యూజిక్, సినిమాటోగ్రఫి గురించి చెప్పుకోవాలి. వంశీకాంత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. అక్షయ్ రామ్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం టీమ్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. సరైన కంటెంట్ ఉంటే.. భారీ బడ్జెట్‌తో కాకుండా తక్కువ వ్యయంతో ప్రేక్షకులను మెప్పించవచ్చు అని నిరూపించారు. ఈకలు పీకి..లోపాలు వెతకాలనే టార్గెట్‌తో కాకుండా.. ఓ నిజాయితీతో కూడిన అంటెంప్ట్‌ను చూడాలంటే.. తిమ్మరాజుపల్లి టీవీని ఈ వారం మీ ఛాయిస్‌గా ఎంచుకోవచ్చు.
ThimmarajuPalliTV Movie Review
By Great Andhra
తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్ చేయలేదు. చిన్న కథని ఇంట్రెస్టింగ్ గా మలచడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. ఇక నటీనటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే తమ పాత్రల్లో మెప్పించారు. హీరోయిన్ వేద కి మంచి రోల్ దక్కగా, రాజప్ప పాత్రధారి ప్రతీక్ కూడా అద్భుత నటనను కనబరిచాడు. మిగిలిన నటీనటులంతా వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఇంతకి చెప్పుకోవాల్సిన విషయం మరొకటుంటే సంగీతోం. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ గా నిలిచింది. పాటలు ఒకటి బాగుంది. కెమెరా వర్క్ కూడా ఇంట్రెస్టింగ్ గా, న్యూ మ్యూజిక్ మూడ్ కి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త ఫాస్ట్ గా ఉండాల్సింది. రెండు గంటల సినిమా అయినా మూడు గంటల భావాన్ని అనిపించింది. దానికి కారణం కొన్ని ఎడిటింగ్ అంశం చెప్పాల్సిందే. సీన్స్ పేస్ లో బాగా ఉంది. సినిమా మొత్తానికి కూడా వర్క్ ఫ్రెండ్ మెంట్ గా ఉంది. ఇంటర్వెల్ కి అప్పుడు కధ మొదలవ్వడం ఫీలింగ్ రావు. అంతే డ్రామాటిక్ గా జంక్ అయ్యింది. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా చాలా వీక్ గా ఉంది. ఫోకస్ టీమ్ చెప్పిన అంశాలను అంతగా సక్సెస్ కి నెత్తురం పడ్డ సన్నివేశాలు లో ఏమి చెప్పాలో తెలియని సన్నివేశాలుగా అనిపించింది. ఓవరాల్ గా మూవీ టీవీల్లో చూసేలా ఉంది గాని, థియేటర్ కి హాల్లో చూడాల్సిన మూవీలా లేదు.
‘తిమ్మరాజుపల్లి టీవీ’ అంటూ వచ్చిన ఈ పీరియాడికల్ ఎమోషనల్ డ్రామా ఓ వర్గం ప్రేక్షకులకు తమ గత అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథ, అప్పటి టీవీ నేపథ్య సన్నివేశాలు, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్.. ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ రెగ్యులర్ గా అండ్ స్లోగా సాగడం, మరియు రొటీన్ స్క్రీన్ ప్లే, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.
అంతా కొత్త వాళ్ళతో చేసినప్పటికీ దాదాపుగా నటీనటులందరూ బాగా పెర్ఫార్మ్ చేసారు. ముఖ్యంగా సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టే వారి పాత్రల్లో సహజంగా బాగా నటించారు. ఇక దర్శకుడిగా వి. మునిరాజు మంచి పనితనం కనబరిచాడు. ఓవరాల్ గా పీరియాడికల్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమాలో కొన్ని అంశాలు కనెక్ట్ అవుతాయి.
పాపం ప్రతాప్ మూవీ గురించి చెప్పుకుంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ ఇది. ఓ చిన్న పాయింట్ తీసుకుని దాదాపు రెండున్నర గంటల సినిమాగా సాగదీయడమే ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద పొరపాటు. ఓ తీవ్రమైన సమస్యను వినోదాత్మకగా చెప్పాలని దర్శకుడు ఎస్. పి. దుర్గ నరేశ్ భావించాడు. కానీ దానిని అంత ఎఫెక్టివ్‌గా తెర మీద చూపించలేకపోయాడు. గతంలోనూ గురక, నిద్రలో నడిచే అలవాటు నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో హీరో సమస్య దానికంటే చాలా పెద్దది.
టెక్నికల్ గా కె. ఎం. రాధాకృష్ణన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) నేపథ్య సంగీతం అందించారు. ఆర్. ఆర్. బాగుంది. ఈటీవీ విన్ లాంటి సంస్థ నుండి వస్తున్న సినిమా కావడం, తిరువీర్ హీరోగా నటించడం వంటి అంశాల వల్ల 'పాపం ప్రతాప్'ను చూద్దాం అనుకుంటే తప్పు చేసినట్టే. ఎలానూ రెండు మూడు వారాల తర్వాత ఓటీటీలో వస్తుంది కాబట్టి... అప్పటి వరకూ వేచి ఉండటం బెటర్. లేకపోతే... ఆడియెన్స్‌ను 'పాపం' అనుకోవాల్సి వస్తుంది!
ఈటివి వాళ్ళు నిర్మించిన కొత్త సినిమా పాపం ప్రతాప్(Papam prathap Movie)తో యంగ్ హీరో తిరువీర్(ThiruVeer) మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…హీరో తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు… కానీ పెళ్లి అయిన మూడో రోజే పెళ్ళికూతురు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది…దాంతో హీరో తనని తిరిగి బ్రతిమలాడి తిరిగి రప్పించుకుంటాడు..కానీ మళ్ళీ సీన్ రిపీట్ అవుతుంది. అసలు వీళ్ళకి ప్రాబ్లెం ఏంటి అసలు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
ఇక హీరోగా తిరువీర్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ ఓకే అనిపించగా అజయ్ ఘోష్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…ఇక సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో నరేషన్ తో సాగింది. సినిమా ఎందుకో ఎక్కువ లాగ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించేలా ఎండ్ అవ్వగా సెకెండ్ ఆఫ్ కథ చాలా స్లో నరేషన్ తో సాగుతూ రిపీటివ్ సీన్స్ తో సాగింది…ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ ఊపు అందుకుని క్లైమాక్స్ లో పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఒకసారి చూసేయొచ్చు అనిపించేలా ఉంది పాపం ప్రతాప్.
ఈ వారం విడుదలైన క్రేజీ మూవీస్ లో పాపం ప్రతాప్ ఒకటి. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటే... దర్శకుడు ఎస్‌పి దుర్గా నరేష్ ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. కానీ దానికి పల్లెటూరి హాస్యాన్ని, బలమైన ఎమోషన్లను జోడించి హృద్యంగా మలిచారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటలు, అమాయకత్వం చాలా సరదాగా సాగిపోతాయి. హీరోకు ఉన్న వింత సమస్యను రివీల్ చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తాయి.
అయితే సెకండాఫ్ ద్వితీయార్థంలో కథనం కాస్త నెమ్మదించింది. కొన్ని డబుల్ మీనింగ్ జోకులు లేకపోయినా సినిమా బాగుండేది. కానీ, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే... ఈ సినిమాకు ప్రధాన బలం తిరువీర్ నటన. భార్య దూరమైన బాధను, లోపల ఉన్న ఆవేదనను తన కళ్లతోనే పలికించాడు. ఒక సగటు మధ్యతరగతి భర్త పడే కష్టాలను అద్భుతంగా పండించాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ చాలా సహజంగా ఉంది. కేఎం రాధాకృష్ణన్ అందించిన పాటలు వినడానికి ఇంపుగా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సీన్లను బాగా ఎలివేట్ చేసింది. విశ్వేశ్వర్ ఎస్.వి సినిమాటోగ్రఫీ గోదావరి అందాలను ఫ్రెష్‌గా చూపించింది. ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా 'పాపం ప్రతాప్'.. మనసును హత్తుకునే స్వచ్ఛమైన గ్రామీణ వినోదం.
తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ గురించి చెప్పుకుంటే... ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతాప్ పాత్రలో తిరువీర్ బాగా నటించాడు. నటుడిగా కొన్ని చిన్న ఎక్స్‌ప్రెషన్స్ భలే పలికించారు. పాయల్ రాధాకృష్ణకు మంచి ఎమోషనల్ పాత్ర దక్కింది. ఆమె కూడా చక్కగా నటించారు. అమ్మ పాత్రలో రాశి ఆకట్టుకున్నారు. అజయ్ ఘోష్, గోపరాజు రమణ తమ పాత్రల్లో చక్కగా నటించారు. మిగతా వారు పర్లేదనిపించారు.
ఇక సినిమా విషయానికి వస్తే... కథలో అసలు పాయింట్ పక్కనపెట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వీక్‌నెస్ క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు చేసిన పబ్లిసిటీ 'పాపం ప్రతాప్'కు మెయిన్ మైనస్ పాయింట్. ప్రేమ కథకు డిజార్డర్ యాడ్ చేసిన సినిమా తీయాలనే ఆలోచన బావుంది. దర్శకుడు అనుకున్న పాయింట్ కూడా బావుంది. కానీ, ఎగ్జిక్యూట్ చేసిన తీరు బాలేదు. కామెడీలో డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువైంది. అది కొన్ని చోట్ల వర్కవుట్ అయ్యింది. కానీ, సినిమాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేయలేదు. ప్రతాప్ సమస్యను దర్శకుడు సీరియస్‌గా తీసుకోలేదు. సినిమాను ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకోవడం కష్టమే. థియేటర్లకు వెళ్లిన వాళ్ళను చూసి పాపం ఆడియన్స్ అనుకోవాలి!
తిరువీర్ నటించిన పాపం ప్రతాప్ మూవీ రివ్యూ విషయానికి వస్తే.. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. రాత్రిళ్లు ఒక వ్యక్తి చేసే విచిత్రమైన ప్రవర్తన ఆధారంగా తెరకెక్కింది. దాని వల్ల హీరో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు? తన భార్య ఎలాంటి ఎంతటి నరకం అనుభవించింది, ఆ సమస్య ఆయన ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టిందనేది కామెడీ కోణంలో రూపొందించారు. అయితే కామెడీ పండలేదు కదా, చిరాకు తెప్పించింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు గోల గోలగా, అరుపులు, కేకలు అన్నట్టుగానే సాగుతుంది.
సినిమాలో కొన్ని కామెడీ సీన్లు బానే ఉన్నా, అవి తప్ప ఇందులో నవ్వుకోవడానికి ఏం లేదు సరికదా, పెద్ద టార్చర్‌గా సాగుతుంది. ఒక్క సీన్‌కి మించి మరో సీన్ చిరాకు తెప్పిస్తాయి. ఆర్టిస్ట్ ల ఓవర్ పర్ఫెర్మెన్స్, లౌడ్‌గా రియాక్ట్ అయిన తీరు కామెడీని పండించడంలో విఫలమయ్యాయి. ప్రతి సీన్ ఓవర్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ దారుణం అంటే, దాన్ని మించి సెకండాఫ్ ఉంది. సీన్లు, ఆర్టిస్ట్ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతిదీ సినిమాకి మైనస్‌గానే మారాయి. ఏదైనా ఇందులో ఆకట్టుకునే అంశం ఉందంటే ఇది రియల్ లైఫ్ స్టోరీ అని లాస్ట్ లో చెప్పడం, క్లైమాక్స్ లో వచ్చే చిన్న ఎమోషనల్ సీన్, అది తప్పితే మూవీ మొత్తం ఔట్ ఆఫ్ ది కంట్రోల్‌లో సాగిందని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పాపం ఆడియెన్స్. రెండున్నర గంటలు చుక్కలు.
తిరువీర్ హీరోగా నటించిన పాపం ప్రతాప్ సినిమా థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, కథాకథనాల పరంగానూ రొటీన్ స్టఫ్ అన్న టాక్ తెచ్చుకుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ బాగున్నా, కంటెంట్ బలహీనంగా ఉన్నప్పుడు అంతా బలహీనంగానే ఉంటుంది. ఇక టెక్నికల్ గా పాటలు ఏమంత వినసొంపుగా, గుర్తు పెట్టుకునేలా ఉండవు. క్యాస్టూమ్స్, ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ ఇవేవీ కూడా సినిమాకి అదనపు హంగుల్లా కనిపించవు. నిర్మాణ విలువలు కూడా అంతగా కనిపించవు.
నటీనటుల విషయానికి వస్తే తిరువీర్ తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు. పాయల్ రాధాకృష్ణ తన పాత్ర వరకు ఓకే అనిపిస్తుంది. రాశీ, అజయ్ ఘోష్ పెయిర్ అంతగా ఆకట్టుకోకపోయినా.. తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. గోపరాజు రమణ కారెక్టర్, అతను చేసే కామెడీ కొన్ని సార్లు ఓవర్ అనిపించొచ్చు, నచ్చకపోవచ్చు. రవి ఆంటోని, ప్రసాద్ బెహరా అక్కడక్కడ నవ్విస్తారు. మిగిలిన పాత్రలన్నీ కూడా వారి పరిధి మేరకు నటించారు. ఓవరాల్‌గా పాపం ప్రతాప్.. చివరకు పాపం తిరువీర్ అనేట్టుగానే ఉంటుంది. మంచి పాయింట్‌లను పట్టుకుని తిరువీర్ కథల్ని ఓకే చేస్తాడు. కానీ ఎగ్జిక్యూషన్‌లో తేడా కొట్టేస్తుంటుంది. ఈ పాపం ప్రతాప్ కూడా అంతే.. పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ పూర్తి స్థాయి సినిమాగా మాత్రం ఆకట్టుకోలేకపోతుంది.
‘పాపం ప్రతాప్’ అంటూ ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. తిరువీర్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటులు వారి పరిధిలో బాగానే నటించినా, మిగతా విభాగాల్లో మూవీ ఏమాత్రం ఆశించిన విధంగా లేదు. కానీ 90స్ బ్యాక్ డ్రాప్ వాతావరణాన్ని బాగా డిజైన్ చేసారు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. అసలు పిండే బాగా లేకపోతే వంటకాలు ఎలా బాగుంటాయి అంటారు. పసలేని కథ, కథనాల కారణంగా టెక్నిషియన్స్ కూడా న్యాయం చేయలేకపోయారు. అంతలో కొంత కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్, విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫి బెటర్‌గా అనిపిస్తుంది.
అన్వర్ అలీ ఎడిటింగ్ కంగాళీగానే ఉంది. ఈటీవీ విన్, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ఈ సినిమాలో కంటెంట్ పరంగా ఎలాంటి నాణ్యత కనిపించదు. రెండున్నర గంటలపాటు ఈ సినిమా ప్రేక్షకుడికి మానసిక సమస్యగానే మారుతుంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా తెచ్చుకొన్న బజ్‌కు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. ఇన్నీ విషయాలు చర్చించుకొన్న తర్వాత.. పాపం ప్రతాప్ సినిమా చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి నిర్ణయానికే వదిలి వేస్తున్నాం.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. రొటీన్ టాక్ అన్న రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీలో తిరువీర్ నటన బాగుంది. అలాగే సినిమా మొదటి ఇరవై నిమిషాల్లో అజయ్ ఘోష్ కామెడీ టైమింగ్ బాగా నవ్వించింది. కథలోని అసలు విషయాన్నీ వెల్లడించే ప్రీ-ఇంటర్వెల్ సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారు. అయితే ఈ రెండు విషయాలు తప్ప, సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.
చూస్తుంటే, తిరువీర్ తన గత చిత్రానికి ప్రమోషన్లు సరిగ్గా లేవన్న ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని, తన శక్తినంతా ఈ సినిమా ప్రమోషన్ల కోసం తీవ్రంగా వెచ్చించినట్లు అనిపించింది. కానీ స్క్రిప్ట్‌ను ఖరారు చేయడంలో మాత్రం తగినంత శ్రద్ధ పెట్టలేదు. మార్చిలో వచ్చిన ‘సంప్రదాయిని సుప్పిని శుద్ధపుసాని’, ఇప్పుడు ‘పాపం ప్రతాప్’ - ఈ రెండు ఈటీవీ విన్ చిత్రాలకు మంచి కాన్సెప్ట్‌లు ఉన్నప్పటికీ, ఆకట్టుకోని స్క్రీన్‌ప్లే, కథనం కారణంగా చప్పగా ముగిశాయి. ఓవరాల్ గా మూవీ పెద్దగా ఆకట్టుకోదు.
తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే తిరువీర్, ఈసారి ‘పాపం ప్రతాప్’ అంటూ కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాతో వచ్చాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. నటీనటుల పరంగా మంచి పెర్ఫార్మన్స్ కనబరిచినా, కథాకథనాలు రొటీన్ స్క్రీన్ ప్లే దెబ్బేసాయి. ఇక ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా నీట్ గా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. కె.ఎమ్. రాధాకృష్ణన్ సంగీతం, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లు పర్వాలేదనిపిస్తాయి. విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ విలేజ్ విజువల్స్ ని బాగా చూపించారు.
అలాగే దర్శకుడు ఎస్పీ దుర్గా నగేష్ మంచి లైన్ ని తీసుకున్నా, కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్ వరకు ఓకే అనిపిస్తాయి కానీ, ఇదే స్టోరీ లైన్ కి తగ్గ డెప్త్, లాజిక్ ని మాత్రం తాను మిస్ అయ్యారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘పాపం ప్రతాప్’ లో యువ నటుడు తిరువీర్, అజయ్ ఘోష్ లు తమ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు. అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్, కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కగా మంచి నవ్వు తెప్పిస్తాయి. కానీ కథనంలో డెప్త్, కొంచెం సీరియస్ నెస్ తక్కువ అయ్యింది. వీటితో ఈ సినిమా కొన్ని చోట్ల నవ్వించే సింపుల్ విలేజ్ డ్రామాలా మిగిలింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సినిమా ట్రై చెయ్యండి.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers