Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

333
Total Reviews
46
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 133-144 of 333 reviews
Clear all filters

K - Ramp Movie Review

F

By FilmyFocus

6.0
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సి...

కిరణ్ అబ్బవరం నటించిన కె - ర్యాంప్ మూవీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా చూడండి అని చెప్పడంలో తప్పు లేదు, కానీ.. ఆ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ గా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. “K-ర్యాంప్” సినిమా కొంతమేర ఎంటర్టైన్ చేస్తుంది. కిరణ్ అబ్బవరం టైమింగ్, మాస్ ఫైట్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం కానీ, దానికి సమాధానం చెప్పిన విధానం కన్విన్సింగ్ గా లేదు. ఆ విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే.. ఇబ్బందిపట్టే హాస్యం కూడా ఉంది. ఇక యుక్తి తరేజా, సాయికుమార్, మురళీధర్ గౌడ్ వాళ్ళ పరిధి మేరకు బాగా నటించారు. టెక్నికల్ గా మూవీ టీం ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోకుండా మూవీ చూస్తే బెటర్. కథలో కొత్తదనం మాత్రం ఉండదు.

Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

6.0
out of 10
కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శ...

కే - ర్యాంప్ మూవీ కథ విషయానికి వస్తే.. కథలో కొత్తదనం ఉందని అనిపించదు కానీ.. కథనంలో మాత్రం కొత్తదనం ఉంది. లాజిక్స్ వెతకకుండా ఓ లవ్ స్టోరీ చూసి నవ్వుకోవాలి అంటే ఈ సినిమా బెటర్ చాయిస్. పైగా లాజిక్స్ వెతకొద్దని సినిమా టీం ముందే అనౌన్స్ చేసేసింది. డైరెక్టర్ కూడా దానికి తగినట్టుగానే కథ రాసుకున్నాడు. అయితే మరీ డీప్ గా వెళ్లకుండా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా, దీని చుట్టూ కొన్ని కామెడి లేయర్స్ రాసుకున్నాడు దర్శకుడు. వన్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. కిరణ్ అబ్బవరం స్టైల్ లు కరెక్ట్ గా సూట్ అయ్యాయి. మూవీ స్టార్ట్ అయిన మొదటి 15నిముషాల తర్వాత కథ కాలేజ్ కు షిఫ్ట్ అవుతుంది. తర్వాత అంతా ప్రెడిక్టబిల్ గానే ఉంటుంది. హీరో హీరోయిన్ తో ప్రేమలో పడడం. ఆమెను పడేయడం కోసం తిప్పలు పడడం. ఆ తర్వాత హీరోయిన్ కు ఉన్న సమస్య బయటపడడం.. దాని కోసం హీరో పడే పాట్లు , టెన్షన్స్ ఇవన్నీ ఫన్నీ వే లోనే చూపించారు. అలా మొదటి హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఆఫ్ లో కథ కొంచెం సీరియస్ గా సాగి హీరో తన తండ్రి గురించి తెలుసుకోవడం.. లాంటివి జరుగుతాయి. ఓవరాల్ గా నవ్వుకోవడానికి కే - ర్యాంప్ మంచి ఛాయస్.

Feb 10, 2026 Telugu

K - Ramp Movie Review

6.0
out of 10
కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్ర...

కిరణ్ అబ్బవరం నటించిన కే - ర్యాంప్ మూవీ ఆడియన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయింది. దర్శకుడు జైన్స్ నాని స్టోరీ పరంగా మెప్పించలేదు గాని, ఆడియన్స్ ని నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమా కంటెంట్ విషయానికి వస్తే..ఈ మూవీ కేవలం కామెడీ చిత్రం మాత్రమే కాదు.. యూత్‌కు నచ్చే లవ్ స్టోరి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే ఫాదర్ సెంటిమెంట్ ఈ కథలో భాగమయ్యాయి. కిరణ్ అబ్బవరం హృదయాన్ని భారంగా మార్చే నటనను ప్రదర్శించాడు. దీపావళీ పండుగ సీజన్‌లో కుటంబ సమేతంగా చూసే చిత్రమే కాకుండా మంచి వినోదాన్ని ఆస్వాదించేలా మూవీని రూపొందించారు. ఈ పండుగ సెలవుల్లో ఈ సినిమాను మీ లిస్టులో ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు. మీరు పెట్టే టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ మూవీ ఈ కె ర్యాంప్. కాకపోతే కొత్తదనం ఎక్స్పెక్ట్ చేయకుండా మూవీ చుస్తే బెటర్.

Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

6.0
out of 10
కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే...

కే ర్యాంప్.. కిరణ్ అబ్బవరం ర్యాంప్‌నో.. కుమార్ ర్యాంప్‌నో.. లేదంటే కు** ర్యాంప్‌నో.. ర్యాంప్‌కి ముందు తోక ఏదైనా కావచ్చు కానీ.. ముందు మాత్రం ఆడియన్స్‌కి కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అదే పాయింట్‌తో మీకు హామీ ఇస్తున్నా.. ‘కే ర్యాంప్‌’లో మాత్రం ఎంటర్‌టైన్మెంట్ పక్కా.. దీపావళి పండుగ పూట ఫ్యామిలీ మొత్తం థియేటర్స్‌కి వచ్చి హాయిగా నవ్వుకుంటారని ప్రామిస్ చేశాడు కిరణ్ అబ్బవరం. ప్రామిస్ తప్పితే ఎలా ఉంటుందనే కో ఇన్సిడెంట్ కథే ‘K ర్యాంప్. కంటెంట్ పరంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా, ల్యాగ్ ఫీల్ ఉన్నా, ఎక్స్పెక్ట్ చేసే కథనమే ఉన్నా, ఓవరాల్ గా క్లైమాక్స్ వరకు దాదాపుగా మూవీ ఎంటర్టైన్ చేస్తుంది. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ‘కే ర్యాంప్’ అనిపించకపోయినా.. నిరాశపరచలేదు. సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ కే ర్యాంప్‌కి బాగా సెట్ అయ్యింది. కేరళ బ్యూటీని కెమెరాలో బంధించారు. ఓవరాల్ గా నవ్వుకోవడానికి మాత్రమే ఒకసారి ట్రై చేయొచ్చు.

Feb 10, 2026 Telugu

K - Ramp movie Review

6.0
out of 10
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సి ఉన్నా, అన్ని సీన్లు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల పెద్దగా ఎడిట్ చేయలేదు. కానీ సన్నివేశాలు చాలా వరకు ఊహాజన...

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె - ర్యాంప్ మూవీని జైన్స్ నాని డైరెక్ట్ చేయగా, యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. ఫక్తు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా అంతగా ఇంప్రెస్ చేయకపోయినా, ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడా ట్రిమ్ చేయాల్సి ఉన్నా, అన్ని సీన్లు ఎంటర్టైనింగ్ గా ఉండడం వల్ల పెద్దగా ఎడిట్ చేయలేదు. కానీ సన్నివేశాలు చాలా వరకు ఊహాజనితంగా ఉంటాయి. అందువల్ల కొత్తదనం కోరుకునే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో అక్కడక్కడా డీసెంట్ ఎమోషనల్ టచ్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా కొత్త కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆడియన్స్ డిస్సపాయింట్ అవుతారు. కథా, కథనాలతో సంబంధం లేకుండా నవ్వుకోవడానికి మాత్రమే ఈ సినిమా చూడొచ్చు.

Feb 10, 2026 Telugu
6.0
out of 10
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఓవరాల్ గా ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే సినిమాలో చాలా సెన్స్ ఉందని అందరికి అనిపించడం ఖాయం. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా.. ఇద్దరిలో ఒకరు ఇలా టాక్సిక్ గా బెహేవ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ సినిమా అంతా కూడా అమ్మాయి చుట్టూనే తిర...

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఓవరాల్ గా ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే సినిమాలో చాలా సెన్స్ ఉందని అందరికి అనిపించడం ఖాయం. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా.. ఇద్దరిలో ఒకరు ఇలా టాక్సిక్ గా బెహేవ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ సినిమా అంతా కూడా అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. కథ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయినా మాట నిజమే కానీ.. ఓ ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు అవి పెద్దగా పట్టించుకోరు జనాలు. అలాగే కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా అనిపించవు. కానీ ఈ కథను అమ్మాయిలు ఇష్టపడతారు.. అబ్బాయిలలో కొంతమంది మెచ్చుకుంటారు. ఓవరాల్ గా రాహుల్ రవీంద్రన్ యూత్ ను మెప్పించి సక్సెస్ అయ్యాడు.

Feb 09, 2026 Telugu
5.0
out of 10
రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. సినిమా కంటెంట్ ఓవరాల్ గా బాగున్నా, స్క్రీన్ ప్లే విషయంలో బాగా శ్రద్ధ వహించాల్సి ఉండాల్సింది. రష్మిక నటనలో మౌనం ఎక్కువ భావోద్వేగాలు పలికించింది. అలాగే రష్మికతో సమానమైన నటన దీక్షిత్ శెట్టి కనబరిచారు. ఇద్దరి అద్వితీయమైన నటన సన్నివేశాలను అద్భుతంగా మార్చాయి. రావు రమేష్, రోహిణి కనిపించిన సన్నివేశాలు తక్కువ. నటనతో చూపించి...

రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. సినిమా కంటెంట్ ఓవరాల్ గా బాగున్నా, స్క్రీన్ ప్లే విషయంలో బాగా శ్రద్ధ వహించాల్సి ఉండాల్సింది. రష్మిక నటనలో మౌనం ఎక్కువ భావోద్వేగాలు పలికించింది. అలాగే రష్మికతో సమానమైన నటన దీక్షిత్ శెట్టి కనబరిచారు. ఇద్దరి అద్వితీయమైన నటన సన్నివేశాలను అద్భుతంగా మార్చాయి. రావు రమేష్, రోహిణి కనిపించిన సన్నివేశాలు తక్కువ. నటనతో చూపించిన ప్రభావం ఎక్కువ. ఓవరాల్ గా కాన్సెప్ట్ సింపుల్ గా చెప్పాలంటే... మగాడికీ పరువు ఉంటుంది. కాని మహిళ పరువు తీసే విధంగా సమాజం ప్రవర్తిస్తుందని చెప్పే సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ కథ, క్లైమాక్స్‌ తో మగాళ్లు ఏకీభవించడం కష్టం. మహిళలు హారతులు పట్టడం, జేజేలు పలకడం పుష్కలం. మహిళల కోసం మగాడు తీసిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. మహిళలు మెచ్చే సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’.

Feb 09, 2026 Telugu
5.0
out of 10
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, డిఫరెంట్ లవ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టెక్నికల్ గా సినిమా గురించి చెప్పాలంటే రాహుల్ రవీంద్రన్ మంచి టెక్నిషియన్స్ ని పట్టుకున్నాడు. అలాగే స్టోరీ లైన్ కూడా బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కాస్త ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. ఇక హేషమ్...

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేయగా, డిఫరెంట్ లవ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టెక్నికల్ గా సినిమా గురించి చెప్పాలంటే రాహుల్ రవీంద్రన్ మంచి టెక్నిషియన్స్ ని పట్టుకున్నాడు. అలాగే స్టోరీ లైన్ కూడా బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా తడబడ్డాడు. కాస్త ల్యాగ్ ఫీల్ ఇస్తుంది. ఇక హేషమ్ అబ్దుల్ సినిమాకు బలం చేకూర్చే పాటలు ఇచ్చాడు గాని, అవి మరీ వినసొంపుగా లేవు. కృష్ణన్ వసంత్ విజువల్స్ బాగున్నాయి. ఇక రచయిత-దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు-2 తర్వాత మళ్లీ తన మార్కు చూపించాడు. రిలేషన్‌ షిప్ విషయంలో అతను ఒక సైడ్ తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ.. చెప్పాలనుకున్న కథను మాత్రం బలంగానే చెప్పాడు. కథ కొత్తది కాకపోయినా, కొంచెం కొత్తగా దాన్ని నరేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా ఒక వర్గం ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Feb 09, 2026 Telugu
5.0
out of 10
ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి మెయిన్ హీరో, హీరోయిన్ అన్నీ రష్మిక మంధానానే. సినిమా, సినిమాకి తన నటనతో విమర్శకులను కూడా అభిమానులుగా మార్చుకుంటున్న రష్మక, ఈ మూవీలో నట విశ్వరూపం చూపించేసింది. ముఖ్యంగా మిర్రర్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, క్లైమాక్స్.. ఇలా చాలా సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.. క్లైమాక్స్‌లో ఆమె నటనకి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పులేదని అనిపిస్తుంది. అను ఇమ్మాన్యూయెల్ అందంతో ఆకట్టుకుంది....

ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీకి మెయిన్ హీరో, హీరోయిన్ అన్నీ రష్మిక మంధానానే. సినిమా, సినిమాకి తన నటనతో విమర్శకులను కూడా అభిమానులుగా మార్చుకుంటున్న రష్మక, ఈ మూవీలో నట విశ్వరూపం చూపించేసింది. ముఖ్యంగా మిర్రర్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, క్లైమాక్స్.. ఇలా చాలా సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.. క్లైమాక్స్‌లో ఆమె నటనకి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పులేదని అనిపిస్తుంది. అను ఇమ్మాన్యూయెల్ అందంతో ఆకట్టుకుంది. హీరో దీక్షిత్ కూడా మంచి నటన చూపించాడు. కానీ ఇది బ్రేకప్ చెప్పడానికి ఓ అమ్మాయి పడే కష్టాన్ని చూపించే సినిమా. నిమిషంలో పరిచయం, గంటలో డేటింగ్ అంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్‌కి అలవాటుపడిన నేటి తరానికి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది.. ఇక ‘మన్మథుడు 2’ మూవీతో తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేసిన రాహుల్ రవీంద్రన్, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు.. ఫస్టాఫ్‌ స్లోగా స్టార్ట్ అయినా, సెకండాఫ్‌ బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా రష్మిక మంధాన నట విశ్వరూపాన్ని చూపించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ, నేటి యూత్‌కి ముఖ్యంగా అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Feb 09, 2026 Telugu
6.0
out of 10
ఆడది అంటే మగవాడికి సేవలు మాత్రమే చేసేది కాదు, తనకంటూ ఓ లైఫ్‌ ఉంటుందని, దాన్ని గౌరవించాలని చెప్పే సినిమాగా ది గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ తెరకెక్కిందని చెప్పొచ్చు. ఇక ఈ సందేశాన్ని అందించడంతో దర్శకుడు సక్సెస్‌ అయ్యారు. దాన్ని అంతే బాగా తన పాత్ర ద్వారా ఆవిష్కరించడంలో రష్మిక సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. మహిళ స్వేచ్ఛని ఆవిష్కరించే ఈ మూవీ లేడీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమా చాలా చోట్ల ప...

ఆడది అంటే మగవాడికి సేవలు మాత్రమే చేసేది కాదు, తనకంటూ ఓ లైఫ్‌ ఉంటుందని, దాన్ని గౌరవించాలని చెప్పే సినిమాగా ది గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ తెరకెక్కిందని చెప్పొచ్చు. ఇక ఈ సందేశాన్ని అందించడంతో దర్శకుడు సక్సెస్‌ అయ్యారు. దాన్ని అంతే బాగా తన పాత్ర ద్వారా ఆవిష్కరించడంలో రష్మిక సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. మహిళ స్వేచ్ఛని ఆవిష్కరించే ఈ మూవీ లేడీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమా చాలా చోట్ల పడుతూ, లేస్తూ వచ్చింది. ఆయా చోట్ల ట్రిమ్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌.. మహిళల స్వేచ్ఛకి సంబంధించి చెప్పిన పాయింట్‌ బాగుంది. దాన్ని చూపించిన తీరు బాగుంది. సినిమాని కూడా ఇంటెన్సిటీతో నడొపించిన తీరు బాగుంది. అయితే ఈ చిత్రం ఏ సెంటర్లకి పరిమితమయ్యే మూవీలా ఉంటుంది. కానీ ఫైనల్‌గా.. మహిళలు చూడాల్సిన మూవీ. మగాళ్లు తెలుసుకోవాల్సిన పాయింట్‌. పైనల్‌గా హృదయాన్ని హత్తుకునే చిత్రం.

Feb 09, 2026 Telugu
6.0
out of 10
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రమిది. విడుదల ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఓవరాల్ గా సినిమాలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి బాగా చేసారు. ఫ్యాకల్టీగా రాహుల్ రవీంద్రన్ కూడా బాగా చేశారు. ఇక 'ది గర్ల్ ఫ్రెండ్'కు వెళ్లిన ప్రేక్షకులకు...

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన చిత్రమిది. విడుదల ముందు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఓవరాల్ గా సినిమాలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి బాగా చేసారు. ఫ్యాకల్టీగా రాహుల్ రవీంద్రన్ కూడా బాగా చేశారు. ఇక 'ది గర్ల్ ఫ్రెండ్'కు వెళ్లిన ప్రేక్షకులకు ఈ కథ, అందులో క్యారెక్టర్లతో లవ్ - హేట్ రిలేషన్ తప్పకుండా ఏర్పడుతుంది. రాహుల్ రవీంద్రన్ ఫెమినిస్ట్ అని, హీరోయిన్ కోణంలో సినిమా తీసి హీరోని విలన్ చేశారని ఆయనపై కోపం రావచ్చు. దీక్షిత్ శెట్టి పాత్రపై ప్రేమ కలగవచ్చు. రాహుల్ రవీంద్రన్ కథతో ఏకీభవిస్తే రష్మిక పాత్ర నచ్చుతుంది. ఒక్కటి మాత్రం నిజం... ప్రేమలో స్పష్టత ఉండటం ముఖ్యమని చెబుతుందీ సినిమా. రష్మిక, దీక్షిత్ శెట్టి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వాళ్ళ కోసం సినిమాకు హ్యాపీగా వెళ్ళవచ్చు. అన్నట్టు... సినిమాపై డిబేట్ తప్పకుండా జరుగుతుంది.

Feb 09, 2026 Telugu
6.0
out of 10
ప్రేమలో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కానీ అందులోని గాఢత అర్థం కాదు. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా కూడా.. మాటల్లో వివరించలేక మనోవేదన అనుభవించే ప్రేమకథలెన్నో. ప్రాణంగా ప్రేమించిన ప్రతి ప్రేమికురాలు నిలదీసి అడగలేని ప్రశ్నలు కొన్ని మిగిలిపోతుంటాయి. అలా అడగలేని ప్రశ్నలు, చెప్పలేని ఫీలింగ్స్‌కి సమాధానం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ‘ది...

ప్రేమలో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే కానీ అందులోని గాఢత అర్థం కాదు. ఎన్నో ఫీలింగ్స్ ఉన్నా కూడా.. మాటల్లో వివరించలేక మనోవేదన అనుభవించే ప్రేమకథలెన్నో. ప్రాణంగా ప్రేమించిన ప్రతి ప్రేమికురాలు నిలదీసి అడగలేని ప్రశ్నలు కొన్ని మిగిలిపోతుంటాయి. అలా అడగలేని ప్రశ్నలు, చెప్పలేని ఫీలింగ్స్‌కి సమాధానం ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన భూమాదేవి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. సినిమా పరంగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ నచ్చేస్తుందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే పరంగా కాస్త ల్యాగ్ అనిపించినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అమ్మాయిలు భూమాదేవి పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. ఈ ప్రేమలేంటో పడుకోవడాలేంటో.. విడిపోవడాలేంటో అని అనుకునే వాళ్లకి మాత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ బోరింగే. బట్.. ప్రేమ కథ ఏదైనా అది నచ్చాలంటే ముందు దాన్ని ఫీల్ అవ్వాలి. అలా అయ్యేవాళ్లకి మాత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నచ్చేస్తుంది.

Feb 09, 2026 Telugu