Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1211
Total Reviews
Showing 121–132 of 1211 media reviews
ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic Movie Review

‘ఎపిక్’ మూవీని చూసిన తర్వాత ఇది మన ‘90స్’ తీసిన ఆదిత్య హాసన్ రాసుకున్న కథేనా? మనోడు తీసిన సినిమానేనా? అని అనిపిస్తుంది. ‘90స్’ తర్వాత ఆదిత్య హాసన్ మీద పెరిగిన బాధ్యత అంతా ఇంతా కాదు. పైగా ‘90స్’ వరల్డ్...

‘ఎపిక్’ మూవీని చూసిన తర్వాత ఇది మన ‘90స్’ తీసిన ఆదిత్య హాసన్ రాసుకున్న కథేనా? మనోడు తీసిన సినిమానేనా? అని అనిపిస్తుంది. ‘90స్’ తర్వాత ఆదిత్య హాసన్ మీద పెరిగిన బాధ్యత అంతా ఇంతా కాదు. పైగా ‘90స్’ వరల్డ్ నుంచి తీసుకున్న ఆదిత్య పాత్రతో ఈ ‘ఎపిక్’ అనే సినిమాని రాసుకున్నాడు. కానీ ‘ఎపిక్’ చూశాకా చాలా మంది నిరుత్సాహ పడే అవకాశం ఉంటుంది. ‘90స్’తో అద్భుతమైన ఫీల్ కలిగించిన ఆదిత్య హాసన్.. ‘ఎపిక్’తో మాత్రం ఫీల్‌ను కలిగించలేకపోయాడు. 


అసలు హీరో, హీరోయిన్ల ఉద్దేశం ఏంటి? వారి టార్గెట్ ఏంటి? ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు.. ఏ మాత్రం అర్థం కాలేదు. ఇక హీరో హీరోయిన్ గురించి ఏమైనా చెప్పాలంటే.. బేబీ లో క్యారెక్టర్సే ఇందులో చేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా ఎపిక్ అనే టైటిల్‌కి అయితే ఆదిత్య హాసన్ న్యాయం చేయలేదని చెప్పుకోవచ్చు. ‘90స్’ రేంజ్‌లో ఇది ట్రెండ్ అయి ప్రభంజనం సృష్టించేంత అయితే లేదనిపిస్తుంది. ‘ఎపిక్’ యూత్‌కి కొన్ని చోట్ల హాయిగా, ఇంకొన్ని చోట్ల భారంగా అనిపించే అవకాశం ఉంది. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఆదిత్య హాసన్ కొన్ని సబ్జెక్టులు పాస్ అయినా.. కొన్నింట్లో ఫెయిల్ అయ్యాడు.


5.0
out of 10

Average

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic Movie review

#Epic is a mature film. Not a typical love story. A story which is practical.Both Anand Deverakonda and Vaishnavi have done a fabulous job.Director Aditya Hasan does his job with conviction and he cre...

#Epic is a mature film. Not a typical love story. A story which is practical.


Both Anand Deverakonda and Vaishnavi have done a fabulous job.


Director Aditya Hasan does his job with conviction and he credited it as Aditya Hasan PoV at the end.


It has got ups and downs in the second half. But there are a few strongly written scenes that stay with you.


Worth a watch!

6.0
out of 10

Above Average

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ (Epic First Semister)

Epic movie review

#Epic A Relationship Drama That Never Really Connects!First half starts well with the India episodes and few enjoyable moments but loses its way after a while. The film never builds a convincing confl...

#Epic A Relationship Drama That Never Really Connects!


First half starts well with the India episodes and few enjoyable moments but loses its way after a while. The film never builds a convincing conflict around the live in relationship, and the second half becomes tiring with forced emotions and characters behaving inconsistently. Even the parents angle towards the end fails to create much impact, leading to an unsatisfying climax.


The UK setting adds very little, and for a film trying to be relatable, a lot of it just feels artificial. Hesham’s music is decent. Performances by the lead cast are sincere but the writing lets them down big time. Not up to the mark!


Rating: 2/5

5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

సర్దార్ 2.. 2022 లో రిలీజ్ అయిన సర్దార్ కి సీక్వెల్ ఇది. మూవీ లో సినిమాలో ఉన్న పాజిటివ్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. మన సర్దార్ ఫ్...

సర్దార్ 2.. 2022 లో రిలీజ్ అయిన సర్దార్ కి సీక్వెల్ ఇది. మూవీ లో సినిమాలో ఉన్న పాజిటివ్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. మన సర్దార్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా బాగున్నాయి. సాంగ్స్ డిస్ట్రబ్ చేయడం కూడా పెద్దగా ఏమి లేవు. ఫన్ కూడా కొన్ని బాగుంటాయి. అండ్ ఆ మూమెంట్ లో ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే మెసేజ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ ఈ జెనరేషన్ వాళ్ళకి చాలా బాగా కావాల్సిందే. 


అండ్ ఫస్ట్ హాఫ్ అలా ఉండగా, సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి మాత్రం కథ మారిపోతుంది. మూవీ లో మెయిన్ మైనస్ లెంగ్త్. అండ్ కార్తీ - ఎస్.జె. సూర్య మధ్య కాంబో సీన్స్ అంతగా పేలలేదు. డైరెక్టర్ స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. అండ్ ఒక స్పై సినిమాకి కావాల్సిన ఎలెమెంట్స్ ఇందులో మిస్ చేసారు. ముఖ్యంగా స్పై సినిమాలో గన్స్ చాలా నార్మల్. కానీ ఇందులో చాలా తక్కువగా వాడారు. అండ్ సినిమాలో VFX చాలా బాడ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా బానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త డిస్సపాయింట్ చేస్తుంది. 

6.0
out of 10

Above Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

సర్దార్ మొదటి పార్ట్ సాలిడ్ విజయం సాధించడంతో రెండో పార్ట్ ను తెరకెక్కించగా ఎక్కడా కూడా సీక్వెల్ హైప్ కి మ్యాచ్ అయ్యేలా అయితే సర్దార్2 స్క్రీన్ ప్లే ను రాసుకోలేక పోయాడు డైరెక్టర్. కథ ఎటు నుండి ఎటో వెళ్...

సర్దార్ మొదటి పార్ట్ సాలిడ్ విజయం సాధించడంతో రెండో పార్ట్ ను తెరకెక్కించగా ఎక్కడా కూడా సీక్వెల్ హైప్ కి మ్యాచ్ అయ్యేలా అయితే సర్దార్2 స్క్రీన్ ప్లే ను రాసుకోలేక పోయాడు డైరెక్టర్. కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే చాలా లాగ్ ఉన్న సీన్స్ తో డ్రాగ్ అవుతూ అసలు ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అయిన సర్దార్ సీక్వెలేనా అని అనిపించేలా ఉంటుంది. ఉన్నంతలో కార్తి తన వరకు రెండు రోల్స్ డిఫెరెంట్ గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ ఉన్నంతలో ఓకే అనిపించుకోవా ఎస్ జే సూర్య విలన్ గా పర్వాలేదు అనిపించినా కథ పెద్దగా లేక పోవడంతో ఇంపాక్ట్ లేకపోయింది.



ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపించగా ఏ దశలో మెప్పించలేకపోయింది…ఫస్టాఫ్ లోనే డ్రాగ్ ఎక్కువ ఉందంటే సెకెండ్ ఆఫ్ డ్రాగ్ మరీ ఎక్కువ అయింది…సీన్స్ వైజ్ గా కూడా చాలా కొన్ని సీన్స్ మినహా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది ఈ సీక్వెల్. మొత్తం మీద మరీ తక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళినా కూడా సినిమా ఆ అంచనాలను కూడా అందుకోవడానికి చాలా ఓపిక పట్టి చూడాల్సి ఉంటుంది…అంత ఓపిక ఉంటే ఓవరాల్ గా కొంచం కష్టం అయినా ఓకే అనిపించవచ్చు.


5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 Movie Review

సర్దార్ 2... ఇది ఫస్ట్ హాఫ్ కి డైరెక్ట్ కంటిన్యుయేషన్.. ఇది చూడాలంటె ముందు ఫస్ట్ పార్ట్ కూడా చూడల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి కనెక్షన్స్ చాల ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ చూసాక చెప్పాలంటే... ఫస్...

సర్దార్ 2... ఇది ఫస్ట్ హాఫ్ కి డైరెక్ట్ కంటిన్యుయేషన్.. ఇది చూడాలంటె ముందు ఫస్ట్ పార్ట్ కూడా చూడల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి కనెక్షన్స్ చాల ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ చూసాక చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ కే వచ్చేసింది. దీంతో సెకండ్ హాఫ్ లో ఏం పెట్టాలో డైరెక్టర్ మర్చిపోయాడు అన్నట్టుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే... చూడొచ్చు... 


ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే కార్తీ.. చాలా బాగా చేసాడు. అండ్ స్టోరీ పాయింట్ కూడా బాగుంది. అయితే ఎస్.జె. సూర్య రోల్ మాత్రం వేరే సినిమాల్లో ఉన్నట్టే ఉంది. యాక్టింగ్ కూడా ఫ్రెష్ గా లేదు. బీజీఎమ్ అయితే వరెస్ట్ గా ఉంది. అండ్ ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ సినిమాలో ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న స్ట్రాంగ్ మెసేజ్ పాయింట్ సెకండ్ పార్ట్ లో రాసుకోలేదు. అది సినిమాకి మైనస్ అయింది. అండ్ AI విజువల్స్ బాగాలేవు. మూవీ లెంగ్త్ చాలా మైనస్ అయింది. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంది నాకు నచ్చింది కాబట్టి, ఎవరైనా చూడాలంటె వన్ టైం వాచబుల్ అంటాను. కాబట్టి ఓవరాల్ గా నా రేటింగ్ 2.75\5


6.0
out of 10

Above Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

Sakshi

By Sakshi

కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది. పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంట...

కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది.


పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ఈసారి పెద్దగా ప్రభావం చూపించవు. కథనం రొటీన్ ఫార్ములాలో సాగుతూ, చాలా సందర్భాల్లో ముందే ఊహించే విధంగా ఉంటుంది.


కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని బలమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యారు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. కార్తీ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. బలహీనమైన రైటింగ్ కారణంగా పూర్తిస్థాయిలో ఫలితం కనిపించదు.


overall.. భారీ అంచనాలతో వచ్చిన ‘సర్దార్ 2’ రొటీన్ కథనం, బలహీనమైన స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచింది. పార్ట్ 1తో పోలిస్తే ఇది స్పష్టంగా డౌన్‌గ్రేడ్ సీక్వెల్.

4.0
out of 10

Below Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

సర్దార్ 2 సినిమా గురించి చెప్పుకుంటే... డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానిక...

సర్దార్ 2 సినిమా గురించి చెప్పుకుంటే... డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానికి అతిగా మందులు, యాంటీబయోటిక్స్ అలవాటు చేయడం వల్ల వచ్చే ముప్పును ప్రధానాంశంగా ఎంచుకున్నారు. అయితే సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. స్టోరీలో రొటీన్ ఫార్ములా సీన్లు, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుడికి ముందే ఊహించగలిగేలా ఉండటం కాస్త నిరాశపరుస్తుంది. 


అయితే ఎడిటింగ్ టేబుల్ పై ఇంకాస్త కత్తెర వేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. మొత్తానికి ఎలాంటి థ్రిల్స్ లేని స్టోరీ, లాజిక్ లేని సీన్లు, సుదీర్ఘమైన రన్ టైమ్‌తో వచ్చిన 'సర్దార్ 2' ఓ విఫల సీక్వెల్‌గా మిగిలిపోయింది. ఫైనల్‌గా.. మొదటి భాగం స్థాయి మ్యాజిక్‌ను పూర్తిగా రిపీట్ చేయలేకపోయినప్పటికీ.. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్స్, కార్తీ నటనను ఇష్టపడే వారు 'సర్దార్ 2' సినిమాను ఒకసారి వీక్షించవచ్చు.

5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 Movie Review

సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా...

సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంతగా ఆకట్టుకోలేదు దర్శకుడు మిత్రన్. సర్దార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి కలిగే నష్టాల గురించి చెప్పినట్లే.. ఇందులో కృత్రిమ మాంసాహారం, శరీరానికి మందులు విపరీతం అలవాటు చేస్తున్న విధానం గురించి చూపించారు. 


అయితే ఫస్ట్ పార్ట్ చూసి చాలా ఏళ్లవడంతో కాస్త కన్ప్యూజన్స్ కూడా వస్తుంటాయి. మొదటి భాగానికి లింక్ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు మళ్లీ గుర్తు చేసుకోవడం కష్టం. ఇక మూవీలో చివర్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్క్రీన్‌ ప్లేలో నిడివి కొంచెం తగ్గించి, ఎమోషన్స్‌ను ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ స్పై థ్రిల్లర్ రేంజ్ మరింత పెరిగి ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్లుగా చాలా రిచ్‌ గా ఉన్నాయి. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్‌ పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేది. ఓవరాల్‌ గా సర్దార్ 2.. యావరేజ్ స్పై థ్రిల్లర్..!


5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

సర్దార్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... కమల్ హాసన్‌కు 'భారతీయుడు'లా తనకు 'సర్దార్' అని కార్తీ చెప్పారు. అది నిజమే. 'భారతీయుడు'లో కమల్, 'సర్దార్'లో కార్తీ... తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. ల...

సర్దార్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... కమల్ హాసన్‌కు 'భారతీయుడు'లా తనకు 'సర్దార్' అని కార్తీ చెప్పారు. అది నిజమే. 'భారతీయుడు'లో కమల్, 'సర్దార్'లో కార్తీ... తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా మెప్పించారు. రెండు సినిమాల్లోనూ కంటెంట్ ఉంది. 'భారతీయుడు'కు సీక్వెల్ 'ఇండియన్ 2'తో కమల్ డిజాస్టర్ అందుకున్నారు. అలాగే సర్దార్ 2 తో కూడా కార్తీ డిజాస్టర్ అందుకున్నట్టు అనిపిస్తుంది. 


చాలా మంచి విషయం చెప్పాలనుకున్నారు. కానీ, ఎగ్జిక్యూషన్ పరంగా ఎగ్జైట్ చేయలేదు. స్పై థ్రిల్లర్ కథకు కమర్షియల్ హంగులు యాడ్ చేసి సినిమాను సాగదీశారు. కానీ, కథ సీరియస్‌గా సాగేటప్పుడు కామెడీ చేసి కంపరం పుట్టించారు. 


'సర్దార్ 2'లో ప్రజలకు చెప్పాలనుకున్న సందేశం బావుంది. కానీ, చెప్పిన విధానం బాలేదు. ఆసక్తిగా సినిమా ముందుకు సాగలేదు. కథను సాగదీసి సాగదీసి చెప్పారు. అక్కడక్కడా యోగిబాబు నవ్వించారు. అయితే... సీరియస్ కథలో ఆ కామెడీ సెట్ కాలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే చిత్రమిది. ఫైనల్ గా మరో భారతీయుడు 2 లా, మరో సర్దార్ 2 ఉంది. 


5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

సర్దార్ 2 చూస్తుంటే అసలు కొత్తగా ఏం చూస్తున్నామో అనిపించదు. రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడిన ఫీలింగ్ వస్తుంది. Part 1లో పనిచేసిన elementsనే తీసుకొచ్చారు కానీ ఈసారి అవి అంతగా work అవ్...

సర్దార్ 2 చూస్తుంటే అసలు కొత్తగా ఏం చూస్తున్నామో అనిపించదు.


రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడిన ఫీలింగ్ వస్తుంది. Part 1లో పనిచేసిన elementsనే తీసుకొచ్చారు కానీ ఈసారి అవి అంతగా work అవ్వలేదు. Story చాలా predictableగా ఉంటుంది.


atleast screenplay లో grip కనిపించదు. కొన్ని interesting ideas ఉన్నప్పటికీ వాటిని proper గా develop చేయలేదు.


Karthi మాత్రం తన performance తో సినిమాని నిలబెట్టడానికి full effort పెట్టారు. కానీ S.J. Suryah లాంటి strong actorని కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు.

5.0
out of 10

Average

సర్దార్ 2 (Sardar 2)

Sardar 2 movie review

దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మన...

దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మనం తీసుకునే ఆహారం, అందులో కలిసే మందులు, యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోలాస్టిన్ (Colastin) అంశం ద్వారా చూపించారు. పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు.


స్పై థ్రిల్లర్‌కు కమర్షియల్ అంశాలను జోడించడంతో సినిమా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే కామెడీ కూడా కథ ఫ్లోను దెబ్బతీసింది. తెలుగు డబ్బింగ్‌ కూడా దారుణంగా ఉంది. ఏమాత్రం సహజంగా అనిపించలేదు. అది పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ లో మాత్రం ఏ డోకా లేదు. ఎస్.జె. సూర్య మాత్రం చాలా సినిమాల్లో చేసిన క్యారెక్టర్ నే మళ్ళీ మళ్ళీ చేసినట్టుంది. మొత్తంగా సందేశం బాగున్నా.. ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ‘సర్దార్ 2’ నిరాశపరుస్తుంది. మంచి పాయింట్‌ను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు.


5.0
out of 10

Average

Why MRO?