Epic semister movie review
By One India
EPIC-First Semester Review: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. 'బేబీ' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ కలిసి నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ అండ్ లైఫ్ డ్రామా తాజాగా ప్రేక్షకుల ముందు విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. డైరెక్టర్ ఆదిత్య ఈ సినిమాకు మంచి కథను ఎంచుకున్నా, ఆ కథకి తగ్గ స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయాడు.
సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ స్టోరీ, నెమ్మదించిన వేగం. ఫస్టాఫ్, అలాగే సెకండాఫ్‌లో ఎక్కువ శాతం సీన్లు ప్రధాన జంట మధ్య ఉండే డైలాగ్స్ చుట్టూనే తిరుగుతాయి. ఇవి పదే పదే ఒకే తరహాలో సాగడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతాయి. క్లైమాక్స్, ప్రీ-క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్లు ఉన్నప్పటికీ.. ఇవి రావడం చాలా ఆలస్యమైంది. అలాగే '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్‌తో ఉన్న కనెక్షన్ కూడా స్టోరీకి పెద్దగా ఉపయోగపడలేదు.
ఓవరాల్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ మంచి ఆలోచనతో వచ్చినప్పటికీ.. స్క్రీన్‌ప్లే సరిగ్గా రాయకపోవడంతో స్టోరీ ముందుకు సాగదు. ఎడిటింగ్ ఇంకా పదునుగా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా.. మొత్తంగా 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' అనేది లవ్ స్టోరీలను ఇష్టపడే వారిని మెప్పించే ప్రేమకథా చిత్రం. అంచనాలు లేకుండా వెళ్తే చూడదగిన చిత్రం.
Above Average
Epic Movie Review
By Sakshi
‘90s – A Middle Class Biopic’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమ, కుటుంబం, కెరీర్ అంశాల చుట్టూ సాగుతుంది. సినిమా కోసం కలలు కనే ఆదిత్యను కుటుంబం లండన్ పంపించడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడ కడలితో పరిచయం, ఆ తర్వాత ప్రేమ అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేది ప్రధాన కథాంశం.
సినిమా ప్రారంభంలో వచ్చే కుటుంబ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆనంద్ దేవరకొండ సహజమైన నటనతో మెప్పించగా, వైష్ణవి చైతన్య కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. శివాజీ, వాసుకి సన్నివేశాలు కూడా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. హేశం అబ్దుల్లా సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి.
అయితే కథ, కథనం విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ తీసుకోవాల్సింది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించడంతో పాటు, సినిమా అక్కడక్కడా నెమ్మదిస్తుంది. ప్రేమకథను కూడా మరింత బలంగా చూపించి ఉంటే ఫలితం మెరుగ్గా ఉండేది. మొత్తంగా మంచి ప్రయత్నంగా నిలిచిన ‘Epic’.. అంచనాలు తగ్గించుకుని చూస్తే ఓసారి ఓకే అనిపిస్తుంది.
Average
Epic movie review
By 10TV Telugu
ఎపిక్ సినిమా విషయానికి వస్తే... పేరెంట్స్ కచ్చితంగా ఈ సినిమాని చూడాలి. విదేశాలకు వెళ్లి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల ఆలోచనలు, ఆశలు ఏంటి అని తెలుసుకోడానికి ఈ సినిమా చూడాలి. అయితే యు/ ఏ ఇచ్చే సినిమాకు A సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో సెన్సార్ వాళ్ళకే తెలియాలి. టీజర్, ట్రైలర్స్ లో చూపించిన కొన్ని షాట్స్ సినిమాలో లేవు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా వనపర్తి నుంచి యూకేకి వెళ్లి అక్కడ చదువుకొని ఇక్కడకు వచ్చి దర్శకుడు అయ్యాడు. ప్రమోషన్స్ లో దర్శకుడి లైఫ్ లో, యూకే లో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు అన్నారు
కానీ సినిమా చూస్తే ఇది దర్శకుడి బయోపిక్ అనిపిస్తుంది. ఇది ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. క్లైమాక్స్ లో కథ పూర్తి కాకుండా పార్ట్ 2 ఎపిక్ – ఫైనల్ సెమిస్టర్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం. దర్శకుడు తన లైఫ్ లో జరిగిన సంఘటనలను తీసుకొని బాగానే రాసుకొని తెరకెక్కించినా సెకండ్ హాఫ్ లో కాస్త తడబడ్డాడు. డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కట్ చేయాల్సింది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా విదేశాల్లో చదువుకోడానికి వెళ్లి ఒకే రూమ్ లో జీవించిన ఒక అమ్మాయి – అబ్బాయి మధ్య జరిగే కథ.
Above Average
Epic First Semister Movie review
By ABP Desam
ఎపిక్'లో దర్శకుడు ఆదిత్య హాసన్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చూపించానని తెలిపారు. ఎవరి పాయింట్ ఏమిటి? అనేది పక్కన పెడితే... ప్రేక్షకులు సినిమాగా చూస్తారు. అందులోనూ '#90స్' వెబ్ సిరీస్ విజయం, 'బేబీ' విజయం తర్వాత ఆనంద్ - వైష్ణవి జంటగా నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉందా? అంటే... అనుకున్నంత లేదనే చెప్పాలి. ఆదిత్య హాసన్ చెప్పాలనుకున్న పాయింట్‌లో స్పష్టత లోపించింది. పెర్ఫార్మన్స్ పరంగా హీరోహీరోయిన్లు బాగా నటించారు.
చదువుల కోసం విదేశాలు వెళ్ళిన విద్యార్థులు 'ఎపిక్'లో తమను తాము చూసుకునే అవకాశాలు ఎక్కువ. కథ, క్యారెక్టర్లకు ఎక్కువ కనెక్ట్ అవుతారు కూడా. కానీ, తెలుగు రాష్ట్రాల్లో యువతకు అర్థం కావడం కాస్త కష్టమే. 'ఎపిక్' ఫస్టాఫ్ సీన్స్ నవ్వించాయి. పాటలు మెప్పించాయి. కానీ సెకండాఫ్ సంభాషణలు ప్రేక్షకుల మనసులను తాకేలా లేవు. క్యారెక్టర్లలో సీరియస్‌నెస్ సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. దాంతో ఓ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. అయితే... ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటన - ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కొంత కవర్ చేసింది. థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది.
Average
Epic movie review
By Great Andhra
90s – A Middle Class Biopic’తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ‘Epic’.. ప్రేమ, ఫ్యామిలీ, కెరీర్ చుట్టూ తిరిగే కథ. చిన్నప్పటి నుంచి సినిమా మీద పిచ్చితో ఉండే ఆదిత్య (ఆనంద్ దేవరకొండ)ను కుటుంబం లండన్ పంపిస్తుంది. అక్కడ కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అతని జీవితాన్ని మరో మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత ప్రేమ, కెరీర్, లైఫ్ మధ్య అతని జర్నీ ఎలా సాగిందనేదే సినిమా.
సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఫ్యామిలీ సీన్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌ను దర్శకుడు బాగానే డీల్ చేశాడు. ఆనంద్ దేవరకొండ తన ఇన్నోసెంట్ లుక్, నేచురల్ యాక్టింగ్‌తో క్యారెక్టర్‌కు బాగా సెట్ అయ్యాడు. వైష్ణవి చైతన్య కూడా తన పాత్రలో ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మంచి ప్లస్. శివాజీ, వాసుకి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. హేశం అబ్దుల్లా మ్యూజిక్, BGM సినిమాకు మంచి ఫీల్ ఇచ్చాయి.
అయితే అసలు సమస్య కథ, స్క్రీన్‌ప్లే దగ్గరే వస్తుంది. హీరో గోల్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, లవ్ ట్రాక్‌కు సరైన ఎమోషనల్ బిల్డప్ లేకపోవడం మైనస్. కొన్ని సీన్స్ రొటీన్‌గా అనిపించడంతో పాటు సినిమా అక్కడక్కడా ల్యాగ్ అవుతుంది.
మొత్తంగా ‘Epic’లో మంచి ఐడియా, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నాయి.. కానీ వాటిని కలిపే బలమైన కథనం మాత్రం మిస్సైంది. ఫన్ కోసం ఒకసారి చూడొచ్చు.. కానీ ‘ఎపిక్’ అనిపించేంత ఇంపాక్ట్ మాత్రం ఇవ్వదు.
Average
Epic movie Review
By Gulte
Epic movie review ... directed by Aditya hasan
Positives:
1. Dialogue Writing
2. Situational Humour In First Half
Negatives:
1. Second Half
2. Inconsistent Narration
3. Lack of Dramatisation
4. Overreliance on ‘Reality
Overall, EPIC has its share of positives but they were few and far between. After a promising first half, the film gets into a monotonous zone and gets tedious to sit through. The overreliance on telling a personal story as it happened without adding enough drama, worked against the film. You may give it a try for some sensible writing and a few good moments in the first half but it definitely is not what the audience expected from Aditya Hasan’s debut feature film.
Bottom Line – Epic ‘Struggles’
Rating – 2.25/5
Average
Epic movie review
ఫారెన్ వెళ్లిన చాలా మంది స్టూడెంట్స్ జీవితాలను అద్దంపట్టే కథతో రూపొందించిన చిత్రమిది. ఒక అబ్బాయి ప్రేమ, పెళ్లి కంటే ముందు లైఫ్‌లో సెటిల్ కావడమనేది మంచి సందేశాన్ని అందించిన చిత్రమిది. అమ్మాయి, ప్రేమ వంటి అంశాలు కూడా ముఖ్యమే, కానీ వాటి మాయలో పడి గోల్ ని మిస్ అయితే లైఫ్ తలక్రిందులవుతుందనే విషయాన్ని ఇందులో సున్నితంగా చెప్పాడు దర్శకుడు ఆదిత్య హాసన్. అయితే సినెమాల్కో చాలా సీన్స్ లాగ్ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ని మాత్రం చాలా నీట్‌గా డీల్ చేశాడు. అక్కడే దర్శకుడి టాలెంట్ కనిపిస్తుంది. రొటీన్‌కి భిన్నంగా నడిపించినతీరు బాగుంది. ఆలోచింప చేసేలా ఉంది.
ఇక దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ మూవీ కథని అదిరిపోలా రాసుకున్నారు.. డైలాగ్‌లు అదిరిపోయాయి. చాలా వరకు రియాలిటీకి దగ్గరగా మూవీని తెరకెక్కించారు. ఇందులో హీరో పాత్రతో కుర్రాళ్లు రిలేట్ అవుతారు, హీరోయిన్ పాత్రతో చాలా మంది అమ్మాయిలు రిలేట్ అవుతారు. పేరెంట్స్ కి సంబంధించిన పాత్రలు పెద్దవాళ్లకి కనెక్ట్ అవుతాయి. ఇలా అందరిని ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఎపిక్. జెంజీ కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి యూత్‌ఫుల్ లవ్ రొమాంటిక్ కామెడీగా ఆకట్టుకుంటుంది, ఆలోచింప చేస్తుంది. బాధ్యతల్ని గుర్తు చేస్తుంది.
Average
Epic Movie Review
By NTV Telugu
‘90s – A Middle Class Biopic’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘Epic’ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ.. లవ్, కెరీర్, ఫ్యామిలీ నేపథ్యంలో సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ సీన్స్, కామెడీ, ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి. ఆనంద్ తన ఇన్నోసెంట్ క్యారెక్టర్‌లో నేచురల్‌గా మెప్పించగా, వైష్ణవి కూడా మంచి నటన కనబరిచింది.
హేశం అబ్దుల్లా మ్యూజిక్, BGM సినిమాకు ప్లస్. అయితే కథ, స్క్రీన్‌ప్లే అంతగా బలంగా లేకపోవడం, రొటీన్ సీన్స్, ల్యాగ్ మైనస్‌గా మారాయి. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా ఎగ్జిక్యూషన్ మాత్రం నిరాశపరుస్తుంది. ఓవరాల్‌గా టైమ్‌పాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ‘Epic’ ఓకే అనిపించొచ్చు.
Average
Epic Movie review
చదువు కోసం విదేశాలకు వెళ్లిన ఇరవై నాలుగేళ్ళ ఓ అబ్బాయి, అమ్మాయి కథ ఇది. ఈ నేపథ్యంలో చాలా కథలే వచ్చాయి. అయితే కథను కన్‌ఫ్యూజ్ కాకుండా తెరపై ఎలా అవిష్కరించాం అన్నది చాలా ప్రధానం. కానీ దర్శకుడు తను రాసుకున్న సన్నివేశాలను తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కథగా చెప్పుకోవాలంటే ఇందులో ఏమీ లేదు. ఒకే గదిలో ఆదిత్యా, కడలి సంభాషణలు, అలాగే ఊళ్లో ఉన్న స్నేహితుడితో ఫోన్ సంభాషణ బావున్నప్పటికీ చూసిన సన్నివేశమే మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ సన్నివేశాలను కాస్తంత ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సితార సంస్థకు తగ్గట్టు గ్రాండ్‌గా ఉన్నాయి.
ఇక సినిమాలో హీరో హీరోయిన్ల తొమ్మిది నెలల జర్నీకి సరైన ముగింపు ఇవ్వలేదనిపిస్తుంది. ఎండింగ్ పాయింట్ బలంగా లేదు. ఇంకేదో చెప్పాలి.. చెప్పలేకపోయాం అన్నట్లుగా అసంతృప్తిగా సినిమా ముగిసిపోయింది. సినిమాలో యూత్‌ఫుల్ మూమెంట్స్ ఎన్నో ఉన్నప్పటికీ.. వాటిని కలిపి బలమైన కథగా మార్చడంతో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ‘90’s లాంటి సిరీస్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఓ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడి సినిమా అంటే డెఫినెట్ గా అంచనాలు ఉంటాయి. కానీ వాటిని దర్శకుడు అందుకోలేకపోయాడు. ఈ సినిమా విషయంలో అతని రాత.. తీత అంచనాలకు అనుగుణంగా లేవు. ‘90’s సిరీస్ కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. ఈ సినిమా కొందరు మాత్రమే చూసేలా ఉంటుంది.
Average
Epic movie review
By Tupaki
నిజ జీవితంలో ఎక్కువ మంది ఏదో ఒక దశలో ప్రేమలో పడేవాళ్లే కాబట్టి.. మిగతా జానర్లతో పోలిస్తే లవ్ స్టోరీల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. ఐతే ‘ఎపిక్’లో ప్రేమజంట మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్.. ఆయా సమయాల్లో వారి మధ్య జరిగే కాన్వర్జేషన్ల వరకు భలేగా అనిపిస్తాయి. అబ్బాయి-అమ్మాయి కలిసిన తొలి రోజే ముద్దు పెట్టేసుకోవడం.. తర్వాత మంచం ఎక్కేయడం లాంటి సీన్లు చూసి అందరినీ ఈ గాటన కట్టేస్తారా? ఫారిన్లో చదువుకునే వాళ్లంతా ఇంతేనా అనే అభ్యంతరాలు వ్యక్తం అయితే కావచ్చు. కానీ ఇక్కడ దర్శకుడు టైటిల్ కిందే ఇది ’నా పాయింట్ ఆఫ్ వ్యూ’ అని చెప్పుకున్నాడు కాబట్టి అందరినీ కలిపి జనరలైజ్ చేసేశాడని అనుకోవాల్సిన పని లేదు.
అయితే ప్రేమకథలో కాన్ఫ్లిక్ట్ రావడానికి ముందు వరకు ఆదిత్య-కడలి పాత్రల మధ్య సన్నివేశాలన్నీ చాలా వరకు అందంగా రూపుదిద్దుకున్నాయి. అయితే ప్రేమకథలో సమస్యంటూ మొదలయ్యాక అది ప్రేక్షకులకు ఒకింత అసహనం కలిగించడం మామూలే. కానీ ఇందులో దాని మోతాదు మరీ ఎక్కువైపోయింది. కొన్ని సీన్లు కొంచెం సిల్లీగా.. సాగతీతగా అనిపిస్తాయి. ఆఖర్లో ఎపిక్ ‘ఫైనల్ సెమిస్టర్’ అంటూ పార్ట్-2కు లీడ్ ఇస్తుంటే.. ఎవరైనా ఎగ్జైట్ అయ్యేవాళ్లు ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.
ఓవరాల్ గా కథా కథనాల పరంగా సగటు లవ్ స్టోరీలను దాటి డైరెక్టర్ ఆశ్చర్యపరచలేకపోయాడు. ముఖ్యంగా లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్.. ఆ తర్వాతి పరిణామాలను రొటీన్ గా రాసుకుని.. కథనాన్ని మరీ స్లోగా నడిపించడం ద్వారా నిరాశకు గురిచేశాడు ఆదిత్య. చివరగా: ఎపిక్.. తియ్యగా మొదలై.. చేదుగా ముగిసింది.
Average
Epic Movie Review
By Filmi Beat
ఎపిక్ సినిమాకు కర్త, కర్మ, క్రియ దర్శకుడు ఆదిత్య హసన్. కథ, కథనాలు రాసుకొన్న తీరు చాలా మెచ్యుర్డ్ గా, బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా ఉండటం సినిమాకు విలువను పెంచింది. నేటి తరం యువకుల జీవనశైలిని ప్రతిబింబించేలా చూపిస్తూనే.. తల్లిదండ్రుల ఎమోషన్స్, స్నేహితుల బాధ్యతను ప్రతీ సీన్ లో చెప్పిన విధానం ఈ సినిమాను క్లాసిక్‌గా మలిచింది. లవ్, రొమాన్స్, కామెడీ అంశాలతో మొదటి భాగాన్ని ఫర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు. ఫీల్‌గుడ్ లాంటి ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్‌ను నడిపించాలంటే ఎవరికైనా కత్తి మీద సాములా అనిపిస్తుంది.
సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్ల మానసిక సంఘర్షణ చూస్తే.. 90 జనరేషన్ కాకుండా నేటి తరం యువతీ, యువకుల లైఫ్ కు సాక్ష్యంగా నిలిచేలా చేస్తుంది. కాకపోతే సెకండాఫ్ లో కొంత మేరకు సాగదీసినట్టు అనిపిస్తుంది. రెగ్యులర్ ఆడియెన్స్‌కు కంప్లీట్‌నెస్ లేకపోవడం కొంత అసంతృప్తి గురి చేసేలా చేస్తుంది. ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాన్ని, మానసిక సంఘర్షణను దర్శకుడు ఆదిత్య చూపించడంలో పక్కాగా సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొనేలా ఉంది. ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. ఈ వారం మీరు చూసే సినిమాల జాబితాలో ఎపిక్ ని హాయిగా చేర్చుకోవచ్చు.
Above Average
Epic Movie Review
By 123telugu
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బేబి జంట ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన సినిమా ‘ఎపిక్’. అయితే ఈ సినిమా బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమా విషయానికి వస్తే... దాదాపు 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ చూసినవారికి ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. సినిమా ఆరంభంలోని కొన్ని నిమిషాల కథనం డీసెంట్ గా చాలా ప్లెజెంట్ గా సాగుతుంది.
ఈ చిత్రంలో కొన్ని అంశాలు ఓకే కానీ అసలు లీడ్ జంట నడిచే సన్నివేశాలు ఆ కథనమే ఇబ్బందికరంగా ఒక క్లారిటీ లేకుండా చాలా రొటీన్ గా వెళుతున్నట్టు అనిపిస్తుంది. అసలు దర్శకుడు ఆ ఇద్దరితో ఏం చెప్పాలి అనుకుంటున్నాడు అనేది ఎంతకీ అర్ధం కాదు. అలాగే ఈ సినిమాలో ఇంత సాగదీత అవసరమా అని అనిపించక మానదు. ఇలా వీరి ట్రాక్ లో బలం లోపించినట్టు అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ఎపిక్’ లో అక్కడక్కడా మూమెంట్స్ బాగున్నాయి. కొన్ని ఫ్యామిలీ సీన్స్ లో ఎమోషన్స్, అలాగే ఫన్ సీన్స్ బాగున్నాయి. లీడ్ జంట కూడా ఇందులో బాగా చేశారు. కానీ కథనం ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సో దీనితో అక్కడక్కడా సినిమా ఆకట్టుకుంటుంది.
Average