Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1211
Total Reviews
Showing 145–156 of 1211 media reviews
సహ (Sahaa)

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్...

సహ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతేకాక హీరో, హీరోయిన్ ఓ అడుగు ముందుకు వేసి మరీ శపథాలు చేశారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సహ మూవీ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశామని బయటకు వస్తారు.. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్‌ పేట్ సెంటర్‌ లో నిలబడి గుండు కొట్టించుకుంటా.. అని చెప్పింది.


సినిమా మాత్రం దానికి రివర్స్ లో ఉంది. డీసెంట్ అనే దానికి కూడా వంద అడుగుల దూరంలో ఆగిపోయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండి బోర్ కొట్టేసింది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే సంజు పాత్రలో శివ కుమార్ బాగా చేశారు. అలాగే సహ పాత్రలో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. లాజిక్ లెస్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు ఆడియన్స్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి హీరో, హీరోయిన్లు శపథం చేసినంతగా ఈ సినిమా లేదని చెప్పాలి.

3.0
out of 10

Not Good

సహ (Sahaa)

Sahaa movie review

సహ (Sahaa) 2026 News Channel
నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పె...

నవతరం ప్రేమకథల్లో మునుపెన్నడూ చూడని విభిన్నమైన ఎమోషనల్ డెప్త్‌తో దర్శకుడు నిశాంత్ దోటి తెరకెక్కించిన చిత్రం 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు). పూర్తిగా నాయకానాయికల కోణం నుంచే సాగే ఈ కథ, ప్రేమలో తీవ్రమైన అనుబంధం పెంచుకుని ఆ బంధం తెగిపోయాక ఒక యువకుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను, డిప్రెషన్ మరియు ట్రామాను ఎంతో సహజంగా ఆవిష్కరించింది.


సంజు, సహ పాత్రల్లో నటించిన శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ తమ సహజసిద్ధమైన నటనతో పాత్రలకు నూటికి నూరుపాళ్లు ప్రాణం పోయగా, చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తాయి. అయితే, కథనంలో కొన్ని చోట్ల లాజిక్ లోపించడం, కథ ముందుకు వెళ్లే కొద్దీ వాతావరణం అత్యంత భారంగా మారడం వల్ల ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోకపోవచ్చు.


కేవలం తీవ్రమైన ఎమోషనల్ డ్రామాలను ఆస్వాదించే ప్రత్యేక వర్గం (ఓ సెక్షన్) ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యే ఈ చిత్రాన్ని చూడటానికి కాస్త ఓపిక, సహనం తప్పనిసరి. ఫైనల్లీ.. గుండెల్ని పిండేసే ఎమోషన్స్ తో సహా ఫీల్ గుడ్ డ్రామా. 


6.0
out of 10

Above Average

సహ (Sahaa)

Sahaa movie review

సహ (Sahaa) 2026 News Channel
సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది....

సహా అనే చిన్న సినిమాకు మొదట్లో పెద్ద బజ్ లేకపోయినా ప్రమోషన్స్ కి కిరణ్ అబ్బవరం, బన్నీ వాసు, వంశీ నందిపాటి రావడం, సినిమా నచ్చకపోతే హీరోయిన్ గుండు కొట్టించుకుంటా అనడంతో ఒక్కసారిగా ఈ సినిమా వైరల్ అయింది. రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్, సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే ఇది మాములు లవ్ స్టోరీనే అని ముందునుంచే అనిపించింది. అయితే ఈ కథ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో నడుస్తుంది. ముందుకు, వెనక్కి కథ వెళ్తూ ఉంటుంది.


నటీనటులు అక్కడక్కడా కామెడితో నవ్వించారు. క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఇదేమి కొత్త కథ, కథనం అయితే కాదు. చాలా చోట్ల సన్నివేశాలను బాగా సాగదీశారు. కాకపోతే మరీ బోరింగ్ ఫీల్ రాకుండా కథనంతో మెప్పించారు. ఈ సినిమా చాలా చోట్ల ఒక మంచి షార్ట్ ఫిలిం, నిడివి ఎక్కువ ఉన్న షార్ట్ ఫిలిం చూసినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల 7/G బృందావన కాలనీ, లాంటి పలు సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఇక ఇలాంటి లవ్ సీన్స్ బోలెడన్ని సినిమాల్లో ఉన్నవే. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మొత్తంగా ‘సహా’ ఒక అబ్బాయి జీవితాంతం ఒకే అమ్మాయిని ప్రేమించడం, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలతో ఏం జరిగింది అనే సినిమా.


6.0
out of 10

Above Average

సహ (Sahaa)

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
స్యాడ్‌ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్‌ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడ...

స్యాడ్‌ ఎండింగ్ తో ఇటీవల చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్నింటినే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. `సహ` ఏ సైడ్‌ ఉంటుందనేది సస్పెన్స్. అయితే ఇదొక లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా. టీనేజ్‌లో ప్రేమలో పడటం, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు డబ్బులు లేక, జాబ్ లేక ఇబ్బంది పడటం, ఈ క్రమంలో ఎదురయ్యే అవమానాలు, చోటు చేసుకునే సంఘటనల సమాహారమే ఈ మూవీ. 


ఈ మూవీ క్లైమాక్స్ ఏంటో ప్రారంభంలోనే అర్థమయ్యేలా ఉంది. ఇలాంటి కంటెంట్ ని జనాలు ఎంజాయ్‌ చేయడం కష్టమే, అంత ఓపిక జనాలకు లేదు. ఇక చిన్నపాటి సస్పెన్స్, ట్విస్ట్ తో ఇంటర్వెల్‌ పడుతుంది. ఆ తర్వాత అది తేలిపోతుంది. సినిమా మొత్తం ఊహించినట్టే ఉంటుంది. కాకపోతే ఆయా సీన్లు కొంత వరకు హార్ట్ టచ్చింగ్‌ గా ఉంటాయి. స్లోగా, ఊహించేలా సాగే లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామా `సహ`. కొంత వరకు 7/జి బృందావన కాలనీని తలపిస్తుంది. హీరోహీరోయిన్లు సవాల్‌ విసిరి సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. కానీ అదే ఈ మూవీకి పెద్ద మైనస్‌.

5.0
out of 10

Average

సహ (Sahaa)

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే....

నిశాంత్ దోటి దర్శకత్వంలో శివ కుమార్ కాసారం కథానాయకుడిగా, శ్వేతా లక్ష్మణ్ కథానాయికగా నటించిన సినిమా సహ. రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే... ఓ యువకుడి జీవితంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగే ప్రేమ, జ్ఞాపకాల చుట్టూ సాగిన ఈ సినిమా. ఈ సినిమాలో హీరోగా నటించిన శివ కుమార్ కాసారం

ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో శివ కుమార్ కాసారం నటన బాగుంది. హీరోయిన్ గా నటించిన శ్వేతా లక్ష్మణ్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది.



ఓవరాల్ గా ‘సహ’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ మరియు ఎమోషనల్ క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.


6.0
out of 10

Above Average

సహ (Sahaa)

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అ...

సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అమ్మాయి ప్రేమలో పడి, తనే లోకంగా బతికి, అందులోంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన సంజు కథే ‘సహ’. ఈ కథకు కొన్ని చోట్ల లాజిక్స్ కనిపించవు. ఇలా కూడా ఉంటారా? అని అనిపించే అవకాశం ఉంటుంది. అయితే సహ మూవీ మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే అవకాశం ఉంటుంది.


సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారుతుంటుంది. ఇన్ని కష్టాలా? ఇన్ని బాధలా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం గుండెల్ని మరింత భారంగా చేస్తుంది. చివరి 20 నిమిషాల్లో ఆడియెన్స్ కన్నీరు పెట్టే అవకాశం ఉంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ ఎక్కువగా కనిపిస్తారు. సంజు, సహ పాత్రలకు వారిద్దరూ వంద శాతం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. వ్రజన పాండ్య పాత్ర కూడా బాగుంటుంది. చివరగా సహ మూవీని చూడాలంటే కాస్త ఓపిక, సహనం అయితే ఉండాల్సిందే. అసలే ఇంకా బ్రేకప్ బాధలు, డిప్రెషన్, ట్రామా ఉంటే మాత్రం ‘సహ’ మరింత భారంగా అనిపించే అవకాశం ఉంది.


6.0
out of 10

Above Average

ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)

Dharmasthala Niyojakavargam movie Review

ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.....

ధర్మస్థల నియోజకవర్గం అనే టైటిల్ తో, పొలిటికల్ సినిమా, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు రీ ఎంట్రీ సినిమా అని ఈ సినిమాపై రిలీజ్ కి ముందే కాస్త బజ్ నెలకొంది. ఇక స్టోరీ లైన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఒక నియోజకవర్గాన్ని తన చేతిలో పెట్టుకొని జనాల్ని భయపెడుతూ విర్రవీగుతున్న ఓ రాజకీయనాయకుడిని ఎలా ఎదురించారు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే డ్రగ్స్ తో యువత ఎలా పాడైపోతుంది అనే మెసేజ్ ని, ఓటు హక్కు మెసేజ్ ని చూపించారు. 


అయితే ఫస్ట్ హాఫ్ ని రొటీన్ ఫైట్స్, సాంగ్స్ తో సాగదీసినా సెకండ్ హాఫ్ సీన్స్ పరిగెడతాయి. అయితే రాజకీయ నాయకులపై సామాన్యులు పోటీకి నిలబడి గెలిచినా సినిమాలు అనేకం ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే కొన్ని మెసేజ్ లు ఇస్తూ పొలిటికల్ యాక్షన్ గా తెరకెక్కించారు. ఇక సినిమాలో సాయికుమార్, సుమన్ తో పాటు, వరుణ్ సందేశ్, వితిక షేరు కూడా బాగా నటించారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ యూత్ కి, జనాలకు మెసేజ్ ఇస్తూ సాగిన పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.


6.0
out of 10

Above Average

ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)

Dharmasthala Niyojakavargam Movie Review

సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజా...

సమాజంలో ఒక స్త్రీ గట్టిగా నిర్ణయించుకుంటే ఎంతటి మార్పునైనా తీసుకురాగలదు అనే బలమైన సందేశాన్ని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెరపై ఆవిష్కరించారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ధనం కోసం ఎంతటి నీచానికైనా ఎలా దిగజారుతున్నారో చాలా సున్నితంగా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన విధానం మెచ్చుకోదగ్గది. పైగా ఇది కేవలం ఒక ఊరికి సంబంధించిన కథ కాదు, నేటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిన సామాజిక అంశాలు ఈ సినిమాలో డిస్కస్ చేసాడు దర్శకుడు ప్రభ. 


అలాగే ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్‌గా, ఒక అద్భుతమైన సామాజిక ప్రయోజనంతో ఒక మంచి ప్రయత్నమే చేసారు. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ తమ అద్భుత నటనతో ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చారు. అలాగే వితిక షేరు కి కూడా మంచి రోల్ పడింది. ఇక మొదటి చిత్రంతోనే ఇంతటి బరువైన కథాంశాన్ని ఎంచుకోవడం దర్శకుడు జై చేసిన సాహసమే. తను ఎంచుకున్న రెండు ప్రధాన సమస్యలకు సరైన ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసాడు. తొలి ప్రయత్నంలోనే చాలా మంది సీనియర్స్‌ను హ్యాండిల్ చేసారు. ఓవరాల్‌ గా ధర్మస్థల నియోజకవర్గం.. పొలిటికల్ ఎంటర్‌టైనర్ విత్ మెసేజ్..!

7.0
out of 10

Hit

ధర్మస్థల నియోజకవర్గం (Dharmasthala Niyojakavargam)

Dharmasthala Niyojakavargam Movie Review

Sakshi

By Sakshi

సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో...

సాయికుమార్, సుమన్ ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ పొలిటికల్ డ్రామా 'ధర్మస్థల నియోజకవర్గం'. సినిమా స్టోరీ పరంగా బాగానే రాసుకున్నా, దానికి తగ్గ మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ తడబడ్డాడు. 


డ్రగ్స్ మాఫియా, రాజకీయాల చుట్టూ తిరిగే ఈ కథలో సాయికుమార్ విలనిజం, డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అండ్ చాలా రోజుల తర్వాత సుమన్ కి కూడా స్ట్రాంగ్ రోల్ పడింది. అండ్ కీ రోల్ లో నటించిన వితికా షేరుకి కూడా మంచి రోల్ వచ్చింది. 


అయితే, నెమ్మదించిన కథనం, పాత సీన్లు నిరాశపరుస్తాయి. మంచి మెసేజ్ ఉన్నా స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉండటంతో సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. ఓవరాల్ గా ఒక్కసారి చూసేలా ఉంది. 

6.0
out of 10

Above Average

రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

Ramba Oorvasi Menaka Movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ఆల్మోస్ట్ అల్లరి నరేష్ గత మూవీ యముడికి మొగుడు కాన్సెప్ట్ లాగానే ఇది కూడా ఉంటుంది. అండ్ సినిమా స్టోరీ పాయింట్ గురించి చెప్తే బానే ఉంది. ఓవరాల్ గా కామెడీ...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ఆల్మోస్ట్ అల్లరి నరేష్ గత మూవీ యముడికి మొగుడు కాన్సెప్ట్ లాగానే ఇది కూడా ఉంటుంది. అండ్ సినిమా స్టోరీ పాయింట్ గురించి చెప్తే బానే ఉంది. ఓవరాల్ గా కామెడీ అయితే నాకు వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి కూడా కనెక్ట్ అవలేం. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక AI అయితే సినిమాలో వరెస్ట్ గా ఉన్నాయి. సెట్ ప్రాపర్టీస్ ఫేక్ గా అనిపిస్తాయి. 


అండ్ సినిమాలో మెయిన్ గా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పెద్దగా లేదు. కానీ ఆయన పొటెన్షియల్ కి తగ్గ రోల్ కాదు ఇది. అండ్ మిగతా వాళ్ళు అంతంత మాత్రమే.. అండ్ సినిమాలో ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఇంకేమి వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ అల్లరి నరేష్ గారు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా బాగా చేద్దామనుకున్నారు కానీ, ఇది యముడికి మొగుడు 2.0 లా ఉంది కానీ, కనెక్ట్ కాదు. 

4.0
out of 10

Below Average

రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

Ramba oorvasi menaka movie review

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. నాకు అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసాక ఓవరాల్ గా కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బేసిగ్గా స్టోరీ పాయింట్ చూస్తే.....

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. నాకు అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసాక ఓవరాల్ గా కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బేసిగ్గా స్టోరీ పాయింట్ చూస్తే.. ఒక బుక్ లో ఉన్నట్టు, రంభ ఊర్వశి మేనక లు ఏదో ఒకరోజు వచ్చి వరం ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. ఓపెన్ గా చెప్పాలంటే మంచి లైన్ ని తీసుకొచ్చి, రొటీన్ ట్రీట్మెంట్ తో తలనొప్పి తీసుకొచ్చారు. అండ్ సినిమాలో నరేష్ గారు మాత్రం బాగా పెర్ఫార్మ్ చేసారు. 


కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూసేలానే ఉంది. మూవీలోని కాన్సెప్ట్ బాగుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా బాగున్నాడు. మైనస్ పాయింట్స్ చెప్పుకుంటే, రొటీన్ సీన్స్, రొటీన్ స్టోరీ.. అండ్ ట్రీట్మెంట్ కూడా యావరేజ్ టెంప్లెట్ తో వెళ్ళిపోతుంది. అండ్ మదర్ సెంటిమెంట్ కనెక్ట్ కాలేదు. కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా లేదు. అండ్ ముగ్గురి హీరోయిన్లకు సరైన సీన్లు లేవు. ఓవరాల్ గా పెద్ద పెద్ద కామెడియన్లను పెట్టి బాగానే ట్రై చేసారు. కానీ ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు. కొన్ని ఫన్ సీన్ల కోసం ఒకసారి చూసేలా సినిమా ఉంది. అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ 2.75\5

6.0
out of 10

Above Average

రంభ ఊర్వశి మేనక (Ramba Oorvasi Menaka)

Rambha Oorvasi Menaka movie review

Thyview

By Thyview

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. అసలు సినిమాలో స్టోరీ పాయింట్ ఏముందో కూడా సరిగా అర్ధం కాదు. ఎందుకంటే టైటిల్ రోల్ చేసిన వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుంది కానీ...

'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. అసలు సినిమాలో స్టోరీ పాయింట్ ఏముందో కూడా సరిగా అర్ధం కాదు. ఎందుకంటే టైటిల్ రోల్ చేసిన వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుంది కానీ, వాళ్లకు అస్సలు కనెక్ట్ అవదు. అండ్ ఈ సినిమా పదేళ్ల కిందట వచ్చినా కూడా హిట్ అవదు. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా నచ్చలేదు. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో సినిమా చేంజ్ అవుతుంది అన్న ఆశ వస్తుంది, కానీ సినిమాలో అదొక్క సీన్ తప్ప ఇంకేమి లేదు. 


అండ్ సినిమాలో హీరోయిన్లు ఐదు నిమిషాల కొచ్చి ఏవో డాన్సులు వేసి, డైలాగులు చెప్పి వెళ్ళిపోతారు. అండ్ సినిమాలో వింటేజ్ నరేష్ కనిపిస్తాడు అని, చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు కానీ, ఇప్పుడు కూడా దెబ్బేసారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎవ్వరు కూడా ఫ్రెష్ గా చేయలేదు. ఓవరాల్ గా మూవీలో కథ పరంగా ఎక్కడా సీరియస్ నెస్ లేదు. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు. ఓవరాల్ గా రంభ ఊర్వశి మేనకా డిస్సపాయింట్ చేసిందండి. 

4.0
out of 10

Below Average

Why MRO?