Ramba Oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. మూవీ గురించి చెప్పాలంటే గుడ్. బాగుంది సినిమా.. అంటే అవుట్ రైట్ ఫన్నే. స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటది, ఎండింగ్ లో ఒకలా ఉంటది. సినిమాలో ఫన్ బాగానే వర్కవుట్ అయింది. అవుట్ డేటెడ్ అనుకున్నా, కానీ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పాలి. అల్లరి నరేష్ గారు ఇలా ఫన్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తే బాగుంటుంది. అండ్ సినిమాలో చాలా సినిమాల రిఫరెన్స్ లు ఉంటాయి. ఇక ఎమోషనల్ డ్రామా అనేది సినిమాలో వర్కౌట్ అయింది. కానీ దానికన్నా ఫన్ మెయిన్ కంటెంట్ అని చెప్పాలి.
అండ్ సినిమాలో 1 or 2 సీన్స్ రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తాయి. అల్లరి నరేష్ గారితో పాటు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్లు అందరూ బాగా చేసారు. సినిమాలో చిన్న మెసేజ్ కూడా బాగుంది. సాంగ్స్ అండ్ బీజీఎమ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా గుడ్. ఇప్పటికైతే ఈ రివ్యూ ఇంతే.
Average
Ramba Oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ముందు నేను అల్లరి నరేష్ మూవీ చాలా రోజులుగా మిస్ అయ్యాను ఎలాగైనా వెళ్లాలని వెళ్ళా... చూసాక it is so bad... ఈ సినిమా అయితే ఇక కష్టమే. మాములుగా కొన్ని సినిమాలుంటాయి.. అరె ఇది అప్పుడొచ్చుంటే ఆడుండేదేమో రా అనేట్టు ఉంటాయి.. కానీ ఈ సినిమా అలా కూడా ఉండదు. ఎప్పుడొచ్చినా ఆడవు అనేలా ఉంటుంది.
పైగా ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనకలను దేవతలంటూ చూపిస్తూ ఐటెం సాంగ్ చేయించారు అది అస్సలు నచ్చలేదు. పైగా వెకిలి చేష్టలు చేయిస్తారు. ఈ స్టోరీ లైన్ రాయడం చాలా రొట్టగా ఉంది. అసలు ఈ సీన్ కి నవ్వాలా అని ఒక్క సీన్ కూడా అనిపించదు. తల తోక సంబంధం లేని జబర్దస్త్ కామెడీ కన్నా ఘోరంగా రోతగా ఉంటుంది ఈ సినిమా. సినిమాలో ఎన్ని బెస్ట్ సీన్స్ ఉన్నాయో లెక్కబెట్టడం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే నాకైతే ఎక్కడా కనిపించలేదు. అసలు స్టోరీ ఎట్నుంచి ఎటొచ్చి ఎల్తుందో కూడా తెలీదు. పైగా సినిమాలో AI సీన్లు పెట్టారు. దరిద్రంగా ఉంటాయి. చాలా సీన్లు non sink లో ఉంటాయి. ఓవరాల్ గా దీని గురించి ఎంత మాట్లాడితే అంత వేస్ట్.
Bad
Ramba oorvasi menaka movie review
సో 'రంభ ఊర్వశి మేనక' మూవీ చూసొస్తున్నాను. సగమే చూసొస్తున్నాను. బేసిగ్గా అంతే ఎం లేదు మూవీ.. నేను సినిమాలో ఎంత దరిద్రం ఉన్నా, ఒక్క పాజిటివ్ ఉన్నా మొత్తం చూస్తా.. కానీ ఈ సినిమాలో ఒక్క జోక్ కి నవ్వు రాలేదు. నాకొక్కడికే నవ్వు రావట్లేదేమో అనుకున్నా, కానీ థియేటర్లో మిగతా వాళ్ళు కూడా నవ్వట్లేదు. సినిమా మొత్తం 90స్ లో కూడా రాని క్రిమ్జ్ కామెడీని ఇరికించారు. ఎంతలా అంటే నేను చూసిన థియేటర్లో కొంతమంది నిద్రపోయారు.
సినిమా అయితే దారుణాతి దారుణం. సినిమాలో హీరో సహా ఎవ్వరి క్యారెక్టర్ కూడా నచ్చలేదు నాకు. అండ్ సినిమా కోసం చాలా ట్రావెల్ చేశా.. దాంతో మరింత తలనొప్పి ఒచ్చింది నాకు. అండ్ ట్రైలర్ కూడా నచ్చలేదు కానీ ఎందుకు పోయాను అంటే... ఈ ఇయర్ లో కొన్ని రొటీన్ ట్రైలర్ ఇచ్చి, సినిమాలో మంచి కంటెంట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందేమో అని ఆశతో వెళ్ళాను. కానీ తప్పు చేసానని వెళ్ళాక తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే ఏదో పైత్యంతో వెళ్ళాను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే... నా వల్ల కాదు. ఇక మిగతా వాళ్ళు రుద్దుతున్నావు అంటే కూడా నేనేం చేయలేను. ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు.
Not Good
Ramba oorvasi menaka movie review
By ABP Desam
అల్లరి' నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది ఒకప్పుడు. తెరపై ఆయన కనిపిస్తే చాలు... ఆడియన్స్ కూడా నవ్వేవారు. అయితే... క్రమక్రమంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక ఒకప్పటి అల్లరి నరేష్ సినిమాల్లో జోకులకు జనాలు నవ్వడం మానేశారు. ఇటువంటి తరుణంలో 'రంభ ఊర్వశి మేనక' అంటూ కామెడీ మూవీతో వచ్చారు.
ఇక సినిమా విషయానికి వస్తే... ఒక మూవీలో ఉండాల్సిన సెంటిమెంట్, ఎమోషన్ గాని, కామెడీ గాని 'రంభ ఊర్వశి మేనక'లో మిస్ అయ్యింది. ఒక్కటంటే ఒక్క జోక్ కూడా సరిగా ల్యాండ్ కాలేదు. నవ్వించలేదు. సీనియర్ నరేష్ కాస్త నవ్వించడానికి ట్రై చేశారు గానీ వర్కవుట్ అవ్వలేదు. అల్లరి' నరేష్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'రంభం ఊర్వశి మేనక'లో ఆ టైమింగ్ కనిపించలేదు. ఓవరాల్ గా కష్టపడకుండా ఏదీ రాదని, యువత కలలు కంటే సరిపోదని, కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సందేశంతో తెరకెక్కిన సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చివరిలో మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ రెండూ మంచి పాయింట్స్. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. అసలు నవ్వించలేదు. అల్లరి నరేష్ మరోసారి డిజప్పాయింట్ చేశారు. కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి.
Below Average
Ramba Oorvasi menaka movie review
By NTV Telugu
రంభ ఊర్వశి మేనక : మంచి రోల్ తో కమ్‌బ్యాక్ ఇస్తాడనుకుంటే, అల్లరి నరేష్ మళ్లీ అదే రొటీన్ ట్రాప్‌లో పడిపోయాడు. రంభ ఊర్వశి మేనక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం కంప్లీట్ హెడేక్!
దేవలోకం డ్రామాలు, యముడి సీన్లు, దానికి తోడు కాలం చెల్లిన సుడిగాడు స్పూఫ్‌లు.. అబ్బో! ఏమాత్రం వర్కవుట్ అవ్వని ఐడియాలని కలిపి తిప్పి కొట్టారు. ఆడియెన్స్‌ని సర్ ప్రైజ్ చేసే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు.
నరేష్ ఎనర్జీ ఓకే కానీ, రాసిన రైటింగ్‌లోనే అసలు దమ్ము లేదు. సీన్లలో పంచ్‌లు పేలక నవ్వులు అస్సలు రావు. ఫస్టాఫ్ ఎటో వెళ్తే, సెకండాఫ్ ఇంకాస్త సాగదీసి ఆడియెన్స్ ఓపికకి పెద్ద పరీక్షే పెట్టారు.
Above Average
Ramba Oorvasi Menaka movie Review
ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ "రంభ ఊర్వశి మేనక" చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్ అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ మధ్య గ్యాప్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అలాంటి జోనర్‌లో ఈ మూవీ చేశాడు. చేస్తే చేశాడు కానీ, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కామెడీ ఉండాలి, కానీ ఆయన తన ఇరవై ఏళ్ల క్రితం స్టయిల్ కామెడీతోనే రావడం, అదే ఫార్మాట్‌లో ఈ మూవీ చేయడం గమనార్హం.
మూవీ స్టార్టింగ్ నుంచి అల్లరి నరేష్ మార్క్ రొటీన్ కామెడీ డైలాగ్‌లు, సీన్లతో సాగుతుంది. సీన్లలో మ్యాటర్ లేదు, డైలాగ్‌ల్లో కామెడీ లేదు. పైగా నాయిస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో నవ్వు రాదు కదా, చిరాకు తెప్పిస్తుంది. చాలా సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. సీన్లలో క్వాలిటీ లేదు. అంతా ఊహించినట్టుగా, మరోవైపు రొటీన్‌గా నడుస్తుంటాయి. ఓవరాల్ గా మూవీ క్లైమాక్స్ ఉన్నంతలో బెటర్ గా ఉంటుంది. మిగిలిన సినిమా మొత్తం రొటీన్ రొడ్డకొట్టుడు, అరిగిపోయిన ఓల్డ్ ఫార్మాట్‌లో సాగే కామెడీ మూవీగా చెప్పొచ్చు.
ఓవరాల్ గా ఇది అల్లరి నరేష్ మార్క్ పరమ రొటీన్ కామెడీ సినిమా. నవ్వులు తక్కువ గోల ఎక్కువ. అల్లరి నరేష్ తన బలమైన గ్రౌండ్(కామెడీ)లోనూ సిక్స్ కాదు కదా, కనీసం ఫోర్ కూడా కొట్టలేకపోయారు.
Average
Ramba oorvasi menaka movie review
By TV9 Telugu
ఈ మధ్య సీరియస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్న అల్లరి నరేష్.. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా రంభ ఊర్వశి మేనక. దానికితోడు దేవకన్యలు భూమ్మీదకు వస్తే అనే ఫాంటసీ పాయింట్‌తో ఈ సినిమాను చంద్రమోహన్ తెరకెక్కించారు. కానీ ఈ పాయింట్‌ను తీసుకుని వినోదాన్ని పంచాలని దర్శకుడు చేసిన ప్రయత్నం తెరపై మాత్రం బెడిసికొట్టింది. ఎక్కడా ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాతో సాగడం వల్ల తర్వాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ఈజీగా ఊహించేయవచ్చు.
చాలా గ్యాప్ తర్వాత తన మార్క్ పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో అల్లరి నరేష్ చక్కగా నటించాడు. కానీ ఏం చేస్తాం కథ సహకరించకపోతే నరేష్ ఎంత బాగా చేసినా ప్రయోజనం అయితే ఉండదు. దర్శకుడు చంద్రమోహన్ రాసుకున్న కాన్సెప్ట్‌కు బలమైన స్క్రిప్ట్ తోడై ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. కానీ సరైన ఎగ్జిక్యూషన్ లేకపోవడంతో సినిమా నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా రంభ ఊర్వశి మేనక.. ఆకట్టుకోని ఫాంటసీ డ్రామా..!
Above Average
I'm Game movie review
By TV9 Telugu
వరుసగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు ఐమ్ గేమ్ అనే మలయాళ డబ్బింగ్ సినిమాతో వచ్చాడు. గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఐమ్ గేమ్ సినిమాను దుల్కర్ స్వయంగా తన నిర్మాణంలో తీసుకొచ్చాడు. ఇక సినిమా గురించి చెప్పాలంటే... కథ పరంగా మంచి పాయింట్ నే తీసుకున్నాడు. కాకపోతే ఈ స్టోరీ లైన్ తెలుగు మూవీ సవ్యసాచికి దగ్గరగా ఉంటుంది.
అయితే సినిమాలో చాలా సీన్లు అన్నీ మూస పద్ధతిలోనే సాగుతాయి. ఒక అద్భుతమైన ఫాంటసీ థ్రిల్లర్‌లా మొదలైన సినిమా, కాస్తా చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం ప్రేక్షకుడికి కొంత అసంతృప్తిని మిగులుస్తుంది. దానం చేసిన వ్యక్తి గతం ఏంటో తెలిశాక, కథ ముగింపు ఎలా ఉండబోతుందో ఎవరైనా ఇట్టే ఊహించేయవచ్చు. ఓవరాల్ గా దర్శకుడు నహాస్ హిదాయత్ తనకున్న మంచి కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో తడబడ్డాడు. అద్భుతమైన ఐడియాతో కథను మొదలుపెట్టిన అతను, ద్వితీయార్థంలో మాత్రం కొత్తగా రిస్క్ తీసుకోలేక పాత ఫార్ములాతోనే సేఫ్ గేమ్ ఆడాడు.
Average
Ramba oorvasi menaka movie review
By Great Andhra
సినిమా రివ్యూ: రంభ ఊర్వశి మేనక
ఏదో కొత్త రుచి చూపిస్తారనుకుంటే, తిప్పి తిప్పి అదే పాత చింతకాయ పచ్చడిని విస్తరిలో వడ్డించారు! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలు చూస్తుంటే మన తాతల కాలం నాటి దేవలోకం ఫార్ములాకి కాస్త తిరగమాత పెట్టి రీ-సర్వ్ చేసినట్టే ఉంది.
దేవలోకం కాన్సెప్ట్, యముడి హడావుడి, సుడిగాడు టైమ్ నాటి పాత స్పూఫ్‌లు.. ఇవన్నీ మనం ఎన్నో ఏళ్లుగా నమిలేసిన పాత రోటీన్ పిండే! రీసెంట్‌గా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన అల్లరి నరేష్, మళ్లీ ఈ బూజు పట్టిన రెసిపీని ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు.
ఆయన తన టైమింగ్‌తో కాపాడే ప్రయత్నం చేసినా, చప్పబడిన సీన్ల వల్ల ఎక్కడా నవ్వులు పండవు. ద్వితీయార్థంలో సాగదీత ఎక్కువై ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.
ఆఖరి మాట:
ఏమాత్రం కొత్తదనం లేని ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాను జీర్ణించుకోవడం కష్టమే. నిరభ్యంతరంగా స్కిప్ చేసేయొచ్చు!
Below Average
Romanchakam movie review
By Great Andhra
ఐయామ్ గేమ్.. దుల్కర్ ఆడిన గేమ్ ఎలా ఉందంటే?
దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.
దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను ఆయన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చక్కగా చూపించారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్ తమ పాత్రలకు న్యాయం చేయగా.. కయాదు లోహర్ ఆకట్టుకున్నారు.
సినిమాకు జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. జిమ్షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా రిచ్‌గా ఉంది. అయితే లాంగ్ రన్‌టైమ్, సెకండాఫ్‌లో స్లో నెరేషన్, కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.
Above Average
I'm Game movie review
By Sakshi
దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.
దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను ఆయన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చక్కగా చూపించారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్ తమ పాత్రలకు న్యాయం చేయగా.. కయాదు లోహర్ ఆకట్టుకున్నారు.
సినిమాకు జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. జిమ్షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా రిచ్‌గా ఉంది. అయితే లాంగ్ రన్‌టైమ్, సెకండాఫ్‌లో స్లో నెరేషన్, కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.
ఓవరాల్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్, దుల్కర్ పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వాల్యూస్ కోసం ‘ఐయామ్ గేమ్’ను ఓసారి ట్రై చేయొచ్చు.
Average
Ramba Oorvasi menaka movie review
By Sakshi
ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథలతో మెప్పించిన అల్లరి నరేష్, మళ్లీ తనదైన మార్క్ సోషియో-ఫాంటసీ కామెడీతో ముందుకు వచ్చిన చిత్రం 'రంభ ఊర్వశి మేనక'. దేవలోక నేపథ్యంతో తెరకెక్కిన ఈ కథలో దర్శకుడు చంద్రమోహన్ 'సుడిగాడు' తరహా స్పూఫ్‌లు, హాస్యాన్ని జోడించి అలరించే ప్రయత్నం చేశారు.
అల్లరి నరేష్ తనదైన ఈజీ మేనరిజమ్, కామెడీ టైమింగ్‌తో సినిమాను నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, స్క్రిప్ట్‌లో కొత్తదనం లేకపోవడం సినిమాకు పెద్ద మైలేజ్ ఇవ్వలేకపోయింది. గతంలో వచ్చిన అనేక ఫాంటసీ సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపించడంతో పాటు, ద్వితీయార్థంలో సాగదీత సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి.
ప్రొడక్షన్ విలువలు, శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదనిపించినా, బలహీనమైన కథనం వల్ల సినిమా గ్రాఫ్ కిందకే పడిపోయింది. మొత్తంగా చెప్పాలంటే, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా కేవలం అల్లరి నరేష్ కామెడీ కోసం చూస్తే ఈ పాత ఫార్ములా చిత్రం ఒకసారి ట్రై చేయొచ్చు!
Average