Summer Holidays Movie Review
సమ్మర్ హాలీడేస్‌లో కొత్తగా కథ అంటూ ఏమీ ఉండదు. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే బాగుంటాయి. మార్కులే జీవితం కాదని కొన్ని సీన్స్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. కథ ఒక దగ్గర స్టార్ట్ అయి.. ఎటెటో వెళ్లిపోయి.. ఎక్కడో ఆగినట్టు అనిపిస్తుంది. ఇక ఈ కథలో పెద్ద సంఘర్షణ కూడా ఏమీ కనిపించదు. ఒక కథకు హీరో, విలన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆ రెండూ కనిపించవు. కేవలం ఇద్దరు పిల్లల చుట్టూనే తిరుగుతుంది. అందుకే చాలా వరకు కాన్ ఫ్లిక్ట్ ఎక్కువగా కనిపించదు. ఏదో సినిమా ముందుకు సాగుతోంది అంటే.. సాగుతోంది అన్నట్టుగా ఉంటుంది.
సిటీలో పిల్లాడు.. మార్కుల కోసం మందలించే తండ్రి.. ఆటలు పాటలకు దూరంగా ఉండే ఆ పిల్లాడు.. అమ్మమ్మ ఊరికి రావడంతో కథ కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అక్కడ పిల్లలిద్దరి స్నేహం బాగుంటుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే బాల్యాన్ని గుర్తు చేస్తాయి. కథ ఊరికి షిఫ్ట్ అయిన తర్వాత కేవీ పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. పాయింట్ వరకు, మెసెజ్ వరకు బాగానే అనిపించినా.. పూర్తి స్థాయి సినిమా మాత్రం అంత ప్రభావవంతంగా అనిపించదు. ఏదో వెలితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. టెక్నికల్‌గా చూసుకుంటే ఊరి వాతావరణం మాత్రం చక్కగా చూపించారు. ఎక్కువగా మామిడి తోటలోనే షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. సింజిత్ పాటలు, బీజీఎం హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. చివరగా ‘సమ్మర్ హాలీడేస్’ అద్భుతాలు సృష్టించకపోవచ్చు కానీ.. బాల్యాన్ని గుర్తు చేసే ఓ సింపుల్, అందమైన సినిమాగా అయితే నిలుస్తుంది. ఇప్పటి పిల్లలకి కూడా ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.
Average
Scene Movie review
By 123telugu
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి ఈ ఏడాది ముచ్చటగా వచ్చిన మూడో చిత్రమే ‘సీన్’. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు జీతూ మాధవ్ ఐడియా అండ్ దానిని తెరకెక్కించిన విధానం ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. దీనిలో కూడా మంచి ఫన్ ని యాడ్ చేయడంతో కథనం మరింత ఎంగేజింగ్ గా వెళుతుంది. సూర్య తన పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇది వరకు తన నుంచి మరో పోలీస్ ని చూసాం కానీ ఇది మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.
ఈ సినిమాలో నేపథ్యం, కామెడీ వంటివి బాగానే ఉన్నాయి కానీ యంగ్ విలన్ వెర్షన్ లో మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సింది. తన బ్యాక్ స్టోరీ సినిమాలో ఒకింత వీక్ గా అనిపిస్తుంది. ఎందుకు అతను అలా చేస్తున్నాడు అనే దానికి మరింత బలమైన కారణాన్ని పెట్టి ఉంటే ఇంకా అర్ధవంతంగా ఉండేది. ఇక మొత్తంగా చూసుకుంటే ‘సీన్’ అనేది ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ సినిమాగా నిలుస్తుంది. అనవసర హంగు ఆర్భాటాలు లేకుండా డీసెంట్ గా సినిమా వెళ్ళిపోతుంది. సూర్య తన వెర్సటైల్ నటనతో ముందుండి నడిపించగా, నజ్రియా ఫహద్ మరియు నస్లెన్ లు అతనికి మంచి సహకారం అందించారు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బెటర్ ఫీల్ ఇస్తుంది. విలన్ బ్యాక్ స్టోరీ, స్లో ఫస్టాఫ్ ని పక్కన పెడితే ఈ క్రైమ్ కామెడీ సినిమా ఒకసారికి ధారాళంగా చూడొచ్చు. తెలుగు సినిమా వార్తలు
Above Average
Scene movie review
By NTV Telugu
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన రాజీనామా కోసం ట్రై చేస్తుండగా, పెర్ఫ్యూమ్ కిల్లర్ కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో తన అసిస్టెంట్ మాయ (నజ్రియా ఫహద్) తో కలిసి ఆయన ఈ మిస్టరీని ఎలా చేధించారు అనేదే ఈ సినిమా కథాంశం.
సూర్య తన యంగ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ మరియు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశారు. ఇదివరకు చూడని ఫ్రెష్ పోలీస్ రోల్లో ఆయన వెర్సటైల్ యాక్టింగ్ సినిమాకు మెయిన్ హైలైట్. ఇక సూర్యతో కలిసి నజ్రియా చేసిన కామెడీ సీన్స్, ముఖ్యంగా మార్చురీ దగ్గర ప్రపోజల్ సీన్ బాగా వర్కౌట్ అయ్యాయి. మొదటిసారి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించిన నెస్లేన్ కూల్‌గా అదరగొట్టగా, సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఫస్టాఫ్‌లో కథనం ఒకింత నెమ్మదిగా సాగుతుంది. విలన్ బ్యాక్‌స్టోరీ బలహీనంగా ఉండటం, హీరో-విలన్ మధ్య బలమైన ఫేస్-ఆఫ్ సీన్స్ మిస్ అవ్వడం చిన్న నిరాశ కలిగిస్తాయి. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా, సెకండాఫ్ పర్వాలేదపించింది.
Average
Ramayana movie review
రామాయణ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే యావరేజ్ అనిపించింది. మనం పాజిటివ్స్ మాట్లాడేస్తుందాం ఫస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం విజువల్స్ ఆబియస్లీ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతారు 4000 కోట్లు పెట్టిరో రెండు పార్ట్లు కలిపేసి దీనికి 2000 పెట్టారో 1500 పెట్టారో తెలియదు కానీ యు కెన్ సీ ఈ సినిమాలో ద గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ ఏదైనా ఉంది అంటే మాత్రం విజువల్స్ భయ్యా జటాయు ఫైట్ సీక్వెన్స్ గాని జెట్టాయు గాని అనిమల్స్ గాని టోటల్ ల్ాండ్స్కేప్ గాని ద వే ద ఫిలి లుక్ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ విజువల్ పరంగా మాత్రం టాప్ నానాచ్ ఉంది. టెక్నికల్ చెప్పాలంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో అసలు ఈ హాలీవుడ్ మూవీస్ కూడా ఈ రేంజ్ లో చూపెట్టలేరేమో అనే ఫీలింగ్ తో ఉన్న విజువల్స్ ఉన్నాయి ఈ సినిమాలో ఫెంటాస్టిక్ అనిపించినాయి.
ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మాత్రం పర్ఫార్మెన్సెస్ అని చెప్తా ముఖ్యంగా నాకు రణ్‌బీర్ కపూర్ యస్ రామ చాలా యస్ రామ ఆయనకు కొన్ని డైలాగ్స్ పర్ఫార్మెన్స్ విత్ కన్విక్షన్ తో చాలా చాలా బాగా చేసి అనిపించింది. కొన్ని కొన్ని ఏరియాస్ లో అక్కడ మన వనవాసం ఎపిసోడ్ గాని వనవాసానికి ఒప్పుకునే సీన్ గాగానీ అక్కడ పడే డైలాగ్స్ గాని చాలా చాలా బాగా పడ్డాయి రణ్‌బీర్ ప్రాణం పెట్టిండు. సీతగా సాయి పల్లవి గారు చాలా బాగా చేశారు అనిపించింది. అంటే లైక్ ఆమెకి చాలా తక్కువ స్కోప్ ఇచ్చారు.
ముఖ్యంగా రవి దూబే యస్ లక్ష్మణ్ క్యారెక్టర్ ఆయన కొంచెం కామిక్ రిలీఫ్ లు ఎక్కువ ఉంటాడు అన్నమాట సినిమాలో అండ్ ఆల్సో లైక్ లక్ష్మణుడు కొంచెం కోపం ఎక్కువ బిజీ వచ్చేస్తది ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్ ఎక్కువ ఉంటాడు. యష్ యస్ రావణ బాయ యష్ అనిపించింది. కొన్ని కొన్ని ఏరియాస్ లో యు కెన్ సీ రాకీ బాయ్ యు కెన్ సీ రాయ
ఫ్రమ్ టాక్సిక్ అక్కడ కొంచెం తేడా కొట్టింది.
అందరూ వచ్చి చూస్తారు డబ్బులు కచ్చితంగా వస్తాయి కలెక్షన్స్ బాగా వస్తాయి ఇంకా పెట్టిన డబ్బులన్నీ తిరిగి వస్తాయి నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వీలైనంత ఎక్కువ మంది చూడాలి సినిమాని అంటే నువ్వు పెట్టిన డబ్బులకి మన ఇండియన్స్ మాత్రమే చూస్తే సరిపోదు ఏం చేయాలి ఇంటర్నేషనల్ ఆడియన్స్ అందరూ కలిసి చూడాలి అందరూ సినిమా బాగుంది. పట్టించారు అనే బాధ అయితే గ్యారెంటీగా ఉంది. మాట్లాడాలి ఇంకా బట్ ఇట్స్ ఆన్ ఆవరేజ్ మూవీ పక్క చెప్తా అట్ల చెప్పేసి ఓ ఇంత ఇంత మాట్లాడి యవరేజ్ అంటాం ఏంటరా అంటే లిటరల్ గా సినిమాలో చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనిపించినాయి. సెకండ్ హాఫ్ మొత్తానికి లిటరీల వాస్ లిట్రలీ ఫ్యూమింగ్ అన్నమాట.
Above Average
Scene movie review
By Filmi Beat
సూర్య ఇమేజ్‌కు భిన్నంగా స్టోరీని డిజైన్ చేసుకొని ఫన్,కామెడీ ఎలిమెంట్స్‌తో జీతూ మాధవన్ చేసిన ప్రయోగంగా ఈ సినిమాను చెప్పుకోవాలి. ఫుల్ ఫన్ మోడ్, కామెడీతో సాగే ఈ సినిమాలో క్రైమ్ అంశాలను జొప్పించిన తీరు బాగుంది. కానీ ఎక్కడా కూడా కథ, కథనాలు, పాత్రల చిత్రీకరణ మాత్రం లాజిక్కు సుదూరంగా ఉంటాయి. కొన్ని సీన్లు సినిమాటిక్ ఉండటంతో నమ్మశక్యంగా ఉండవు. సూర్యతో యాక్టింగ్ చేయించిన విధానం బాగుంది. అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ఎలిమెంట్స్ కొత్తగా ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడం, కథనంలో కొత్తదనం లేకపోవడం సాదాసీదా సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మామూలు క్రైమ్ డ్రామాను కూడా సూర్య తన పెర్ఫార్మెన్స్తో బెటర్ సినిమాగా మార్చేందుకు ప్రయత్నించాడు.
ఇక సింగిల్ పాయింట్ తో కథ సాగడం వల్ల మూవీ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ మూమెంట్స్ ఫన్ క్రియేట్ చేస్తాయి. కొన్నిసీన్లు రొటీన్‌గా, లాజిక్ లేకుండా ఉండటం వల్ల బోర్ కొట్టిస్తాయి. ఓవరాల్‌గా ఈ సినిమా సూర్య రేంజ్ సినిమా కాదనేది స్పష్టం. అయితే ఈ మూవీలో గొప్పగా చెప్పుకొనేంతగా టెక్నికల్ వాల్యూస్ కనిపించవు. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ కథకు తగినట్టుగా ఉంటాయి. తెలుగులో డైలాగ్స్ బాగా రాశారు. ఎడిటింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బలమైన కథ, కథనాలు ఉండి ఉంటే.. ఈ సినిమా బెటర్ క్రైమ్ కామెడీ మూవీ అయి ఉండేది. లాజిక్‌లు వెతకుండా సూర్య మూవీని ఎంజాయ్ చేద్దామనుకొనే వారికి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. సూర్య నుంచి ఎక్కువగా ఆశించి వెళితే కొంత నిరాశ వెంటాడుతుంది. క్రైమ్ కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
Average
Scene movie review
క్రైమ్, సస్పెన్స్ డ్రామాలకు ఓ ప్యాట్రన్ ఉంటుంది. కిల్లర్ పక్కనే ఉన్నా ఎవ్వరూ గుర్తించరు.. పోలీసులు ఇన్వెస్ట్ చేస్తూ.. చివరకు ఆ కిల్లర్‌ని పట్టేసుకుంటారు. పోలీసులు, కిల్లర్ మధ్య జరిగే డ్రామాని ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తే సినిమా అంతగా జనాలకు నచ్చుతుంది. ఇక పైగా ఇన్వెస్టిగేట్ చేసే పోలీసు ఆఫీసర్‌కి ఏదో ఒక లోపం పెడితే కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆ లోపాన్ని జయించి కిల్లర్‌ని హీరో ఎలా పట్టుకుంటాడు అనే ఆసక్తి ఆడియెన్స్‌లో రేకెత్తిస్తే దర్శకుడు అక్కడే సగం సక్సెస్ అవుతాడు. ఈ విషయంలో జిత్తు మాధవన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. జితు మేకింగ్, టేకింగ్ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. పాటలు, బీజీఎం ఓ వైబ్‌లా అనిపిస్తాయి. సూర్య స్టైలింగ్, క్యాస్టూమ్స్ బాగుంటాయి.
సూర్య యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నస్లేన్ అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. చివరకు ఓ మాలీవుడ్ క్రైమ్ డ్రామాకి తెలుగు టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ‘సీన్’ అలా ఉందనిపిస్తుంది. కొన్ని లాజిక్స్ వదిలేస్తే సినిమాని పూర్తిగా ఆస్వాధించొచ్చు. ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానాలు కనిపించవు. బహుశా వాటిని నెక్ట్స్ పార్ట్‌లో వివరిస్తారేమో చూడాలి. చివరగా సీన్ సినిమాలోని ప్రతీ సీన్ బాగుంటుంది. క్రైమ్‌కి డార్క్ కామెడీ యాడ్ చేసి పక్కా తెలుగు కమర్షియల్ సినిమాలా ఉంటుంది. కచ్చితంగా ఆడియెన్స్‌ని మాత్రం ఈ ‘సీన్’ నిరాశపర్చదని చెప్పుకోవచ్చు.
Above Average
Scene movie review
#Scene Fresh in Treatment, Mediocre in Impact!
A dark crime comedy with a unique treatment and plenty of quirkiness that works in parts but also backfires when it goes too over the top. The comedy is hit or miss, and while the plot feels innovative, the investigative portions never become as engaging as they should. Feels very low stakes and stays more on the lighthearted side than expected.
Music leans heavily on EDM and works only in parts. Suriya, Nazriya, and Naslen deliver solid performances. Setup had the potential to become something genuinely impactful and unique, but the film never fully gets there. Strictly Mediocre!
Rating: 2.25-2.5/5
Average
Ramayana Part 1 movie review
By Gulte
Positives:
1. The director’s emphasis on lesser-known details of the Ramayana
2. Grandeur & Visuals
3. Ranbir Kapoor’s performance from the start of the Vanavasa episode
4. Yash’s screen presence
5. Action episode involving Jatayu
6. Sequence involving Ravana’s ten personalities
Negatives:
1. Dragged-out episode between Ravana & Vidyutjihva
2. Leisurely pace at times
Overall, the Ramayana part one lived up to all the pre-release hype and expectations. Barring a couple of dragged-out sequences and a leisurely pace at times, the film largely engages the audience. The soul of the Ramayana was beautifully blended with amazing visuals and the film gives a pleasant feeling throughout its runtime. The film certainly deserves to be watched in the theatre with family to witness our epic story in all its glory. Especially, it is definitely worth showing the film to the kids, preferably on an IMAX screen. And yes, Part One ends at the crucial juncture of the Ramayana and it certainly makes us wait for Part Two which is scheduled to release in theatres next year.
Bottomline – Grand, yet it retained the Ramayana’s soul.
Above Average
Ramayana part 1 movie review
By Tupaki
‘రాామాయణం’ కథ చాలాసార్లు విన్నది.. చూసిందే కాబట్టి.. తెలిసిన విషయాలను తెర మీద ఎలా ప్రెజెంట్ చేశారా అని చూస్తాం. ఈ ప్రెజెంటేషన్ విషయంలో లోపాలు ఎంచలేని విధంగా.. చాలా నీట్ గా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దింది నితీశ్ తివారి అండ్ టీం. మనం ఎప్పుడూ రామాయణంలో చూసే ఘట్టాలకు తోడు.. ఇందులో కొన్ని అదనపు సన్నివేశాలున్నాయి. అలాగే ఇంతకుముందు సింపుల్ గా.. షార్ట్ గా చూసిన సన్నివేశాలను ఇందులో కొంచెం లెంగ్తీగా.. చాలా గ్రాండ్ గా చూస్తాం. సీతను రావణుడు అపహరిస్తుంటే.. జటాయువు ఎదురుపడి పోరాడే సన్నివేశాాన్ని ఒకట్రెండు నిమిషాల వ్యవధిలో చూసి ఉంటాం. కానీ ఇందులో అదే ఒక క్లైమాక్సులా మారి అరగంట పాటు ప్రేక్షకులను విజువల్ మాయాజాలంలో ముంచెత్తి అద్భుత అనుభూతిని పంచుతుంది.
కాకపోతే ‘రామాయణం’ విజువల్ గా ఎంత గొప్పగా అనిపించినప్పటికీ.. ప్రేక్షకులను ఎమోషనల్ గా కదిలించడంలో.. రామాయణ గాథను తెర మీద చూస్తే వచ్చే డివైన్ ఫీలింగ్ తీసుకురావడంలో మాత్రం అనుకున్నంత మేర విజయవంతం కాలేకపోయింది. దర్శకుడు నితీశ్ తివారి.. రామాయణ గాథను ఇప్పటి సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకుంటూ విజువల్ వండర్ గా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని సిన్సియర్ గా చేశాడు. తన టేకింగ్ చాలా బాగుంది. కాకపోతే భావోద్వేగాలను పండించే విషయంలో మరింత కసరత్తు చేయాల్సింది. నరేషన్లో ఇంకొంత వేగం చూపించాల్సింది. చివరగా: రామాయణం.. దృశ్యాలు అద్భుతం.. భావోద్వేగాలు పరిమితం.
Above Average
Ramayana Part 1 movie review
వాల్మీకి రామాయణాన్ని ఎందరెందరో తమ అనుభూతులను జోడించి, వేల గ్రంథాలుగా తీసుకొచ్చారు. అలాగే 'రామాయణ' గాథను ఎందరెందరో దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు. ఇక రామానందసాగర్ వంటి వారు బుల్లితెర ధారావాహికగానూ రూపొందించారు. తెలుగులో అయితే రామాయణం ఎన్నిసార్లు సినిమాగా వచ్చిందో లెక్కేలేదు. తాజాగా వచ్చిన నితీశ్ తివారీ 'రామాయణం', నిజానికి ఇదో విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నితీశ్ 'రామాయణం' కాకుండా 'రావణాయణం' చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు విడుదలైన ప్రథమభాగం చూస్తే అందరికీ అదే భావన కలగటం ఖాయం.
అయితే ప్రథమ భాగం చూసిన తర్వాత అందరికీ కలిగే సందేహం ఒక్కటే. రాముడి గాథను కాకుండా నితీశ్ తివారి రావణ గాథగా ఈ కథను ఎందుకు చెప్పాడు అని!? రావణాసుడితో మొదలైన సినిమా, రాముడి ప్రతిజ్ఞతో ముగిసింది. అందరూ ఎదురుచూసిన రాముడి ఆగమనం సినిమా మొదలైన అరగంటకు కానీ జరగదు. అక్కడ కూడా బాలకాండకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా... సీతారాముల వివాహఘట్టానికి, ఆపైన అరణ్యవాసానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రావణుడు, శూర్పణఖ కథకు ప్రాధాన్యం ఇచ్చాడు తప్ప... సీతారాముల అనుబంధానికి పెద్దంత చోటు దక్కనివ్వలేదు. దాంతో వెండితెరపై రామాయణాన్ని చూద్దామని వచ్చిన వారికి కాస్తంత నిరాశ ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఏదేమైనా... సర్వజనులకు తెలిసిన రామాయణాన్ని ధైర్యంగా మరోసారి వెండితెరపై భారీ బడ్జెట్‌తో ఆవిష్కరించాలనే సాహసం చేసిన దర్శక నిర్మాతలను అభినందించి తీరాలి.
Average
Ramayana movie part 1 review
By ABP Desam
ప్రేక్షకులకు తెలిసిన కథతో సినిమా తీయడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ భారతీయులు దైవంగా కొలిచే శ్రీరామునిపై, 'రామాయణం' మీద సినిమా తీయడం అంటే సవాలే. కొంచెం తప్పు జరిగినా సరే చీల్చి చెండాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ప్రభాస్ 'ఆదిపురుష్' ఓ ఉదాహరణ. ఈ తరుణంలో 'రామాయణ' అంటూ వచ్చారు దర్శక నిర్మాతలు నితేష్ తివారి, నమిత్ మల్హోత్రా. అయితే రామాయణం గురించి పూర్తి అవగాహన ఉన్న ప్రేక్షకులకు తప్పులు కనిపించే అవకాశం లేకపోలేదు. తెలియని ప్రేక్షకులకు ఓ అద్భుత దృశ్యకావ్యంగా అనిపిస్తుంది.
టెక్నికల్ పరంగా 'రామాయణ' సినిమాను హై స్టాండర్డ్స్‌లో తీశారు. విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. ఐరావతం, జటాయువు సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. సీతారాములుగా సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఒదిగిపోయారు. అయితే వాళ్ళిద్దరినీ డామినేట్ చేశారు రావణాసురునిగా నటించిన యష్. భారతీయులకు, ఈతరం సినిమా ప్రేక్షకులకు సైతం తెలిసిన కథను వెండితెరపై అద్భుత దృశ్య కావ్యంగా మలచడంలో దర్శక నిర్మాతలు నితేష్ తివారి, నమిత్ మల్హోత్రా, యష్ సక్సెస్ అయ్యారు. కథ, కథనంతో కంటే విజువల్స్‌తో మేజిక్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడంలో దర్శక నిర్మాతలతో పాటు నటీనటులు పడిన కృషి స్పష్టంగా తెలుస్తుంది. సంగీత పరంగా కొంచెం డిజప్పాయింట్ చేసిన చిత్రమిది. ఓవరాల్‌గా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Above Average
Ramayana movie review
రామాయణం మన తెలుగువారికి చాలా బాగా తెలుసు. చిన్నప్పట్నుంచి రామాయణం వింటూ, రామాయణంపై వచ్చిన సినిమాలు, సీరియల్స్ చూస్తూ, కథలు చదువుతూ, వింటూ పెరిగాం. కథగా ఇదేమి కొత్త కాదు. కానీ ఈ `రామాయణం` మూవీని ఎలా చూపించారనేది ఇందులో ఆసక్తికరం. ఆడియెన్స్ ని ఎలా ఎంగేజ్ చేశారనేది ఇందులో మెయిన్. అలా చూస్తే ఈ సినిమాని విజువల్ ట్రీట్‌గా ప్రజెంట్ చేశారు. సినిమాలో మెయిన్‌గా కథ ముందే తెలియడం, దీనికితోడు రాముడు గొప్పవాడు అని పదే పదే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కన్విన్సింగ్‌గా లేదు. ఆ సస్పెన్స్ ని నీరుగార్చినట్టుగా ఉంది. అలాగే రాముడు, సీత కలయికలోని డ్రామా కూడా తేలిపోయినట్టుగా ఉంది.
రామాయణం మన తెలుగు వారికి, ఇండియన్స్ కి తెలిసిన గాథ. దాన్ని ఎంత ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారు, తీసుకెళ్తారు, ఎంత అలరించేలా నడిపిస్తారు, చూపిస్తారనేది ముఖ్యం. ఇందులో ఆ విషయంలో విజువల్ గ్రాండియర్ పరంగా ఎక్కువ ఫోకస్ కనిపించింది. దీనికితోడు ఇందులో కొన్ని కొత్త ఎలిమెంట్లని చూపించి ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించారు. అదే సమయంలో ఎమోషన్స్ ని ఇంకా బాగా రాసుకోవాల్సింది. డ్రామాపై కూడా వర్క్ చేయాల్సింది. మెయిన్‌గా సస్సెన్స్ అంశాలు, వాహ్ ఫ్యాక్టర్స్ పై ఇంకా ఫోకస్ పెట్టాలి. అవి ఇందులో ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఓవరాల్‌గా మాత్రం ఒక విజువల్ ట్రీట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. కొంత వరకు ఆకట్టుకుంటుంది.
Above Average