Register as a Reviewer
Home Reviews Media Reviews

Media Reviews

Reviews from top media outlets, YouTube channels, and publications

1211
Total Reviews
Showing 85–96 of 1211 media reviews
హ్యాపీ జర్నీ (Happy Journey)

Happy Journey Movie Review

హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భు...

హ్యాపీ జర్నీ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, చెప్పాలనుకున్న సందేశం చాలా బాగున్నాయి. ఫస్టాఫ్, సెకండాఫ్‌ లో అక్కడక్కడ వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా వంశీధర్ గౌడ్ అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకోగా.. రవి శివతేజతో ఆయన కాంబినేషన్ బాగుంది.


కొన్ని అనవసరమైన సీన్లు, కొన్ని రిపీటెడ్ సన్నివేశాల వల్ల కథనం కాస్త నెమ్మదించినా పరవాలేదనిపిస్తుంది. ప్రతినాయిక పాత్రకు సంబంధించిన భావోద్వేగాలను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. కామెడీకి, ఎమోషన్ కు మధ్య సరైన సమతుల్యత లోపించినట్లు అనిపిస్తుంది.


ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. హేమంత్ ధోమే కథ బాగున్నా, అభిరామ్ నాయుడు కథనాన్ని మరికొంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్ది ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. ఫైనల్‌ గా .. 'హ్యాపీ జర్నీ' కొన్ని మంచి నవ్వులు, సందేశం కావాలనుకునేవారికి బెస్ట్ ఛాయిస్.


6.0
out of 10

Above Average

హ్యాపీ జర్నీ (Happy Journey)

Happy Journey movie Review

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అ...

అభిరామ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. ఒక మంచి ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం కొంతమంది ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఇక టైటిల్‌ తోనే ఈ సినిమా ఇచ్చే మెసేజ్ ఏమిటో అర్థమవుతుంది.


అయితే స్క్రీన్‌ ప్లే సరిగ్గా కుదరకపోవడం వల్ల ‘హ్యాపీ జర్నీ’ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కొన్ని అనవసరమైన సన్నివేశాల వల్ల మంచి సీన్ల ఇంపాక్ట్ తగ్గి, సినిమా ఫ్లో దెబ్బతింది. రిపీటెడ్ సీన్లను తగ్గించి ఉంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసుకుంటే.. ‘హ్యాపీ జర్నీ’ అక్కడక్కడా ఓకే అనిపించే ఫన్ డ్రామాగా నిలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫీమేల్ సెంట్రిక్ పాయింట్, వారితో జెనరేట్ చేసిన ఫన్ అక్కడక్కడా మెప్పిస్తాయి. కానీ కథ, కథనాల్లో కావాల్సిన ఫుల్ ఫ్లెడ్జ్ డెప్త్ మిస్ కావడంతో ఫలితంకి దెబ్బ పడింది. సో చాలా తక్కువ అంచనాలు పెట్టుకుంటే ఈ కామెడీ డ్రామా కనెక్ట్ అవుతుంది.


6.0
out of 10

Above Average

హ్యాపీ జర్నీ (Happy Journey)

Happy Journey movie review

హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు...

హ్యాపీ జర్నీ మూవీ విషయానికి వస్తే... కొంతమంది గ్రూప్ గా ఏదో ఒక ట్రిప్ కి వెళ్లడం, అక్కడ జ్ఞాపకాలు, ఎమోషన్స్ అనే డైలాగ్స్ తో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అలా ఓ ఏడుగురు ఆడవాళ్లు డిఫరెంట్ ఏజ్ ఉన్నవాళ్లు వెళితే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో కథ, ఎమోషన్ పెట్టి ఈ హ్యాపీ జర్నీ సినిమాని తీశారు. అయితే సినిమా అంతా వీరి ట్రావెలింగ్ నడుస్తూనే మధ్యమధ్యలో కామెడీ నడుస్తూనే ఒక్కొక్కరి కథ, వ్యథ, కన్నీటి గాధ చూపించారు. ఇవి చూస్తుంటే ఈ కాలంలో ఆడవాళ్లు మగవాళ్ళని దాటేసి, తోసేసి ముందుకు వెళ్లిపోతున్నా ఇంకా దర్శకుడు ఎక్కడో పదేళ్ల క్రితమే ఆగిపోయి అప్పటి సమస్యలని చూపించాడు అనిపిస్తుంది. 


అయితే సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. ఈ ఆడవాళ్ళ మధ్య గొడవలు అవుతాయి. ఆ గొడవలు కూడా కామెడీగానే చూపించారు. అయితే సెకండ్ హాఫ్ అంతా ఎటెటో వెళ్ళిపోతుంది అనుకునే సమయానికి క్లైమాక్స్ లో గోవింద్ ఇచ్చిన ట్విస్ట్ తో హమ్మయ్య బతికించారు అనిపిస్తుంది.ఇక సినిమా చూస్తుంటే వెంకటేష్ జయం మనదేరా ఫస్ట్ హాఫ్ గుర్తుకు రావడం ఖాయం. అలాగే ఫ్రాన్స్ దేశం ట్రావెల్ వ్లోగ్ కూడా చూసినట్టు ఉంటుంది. మొత్తంగా ‘హ్యాపీ జర్నీ’ ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లు ఫ్రాన్స్ దేశానికి ట్రిప్ కి వెళ్తే అక్కడ ఏం చేశారు, వాళ్ళ కథేంటి అని కామెడీగా ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేశారు.


5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi Movie Review

ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ,...

ఈ మధ్య డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్స్ చాలా వస్తున్నాయి కదా. వాటిలో ఒకటిగా వచ్చిన మహేంద్రగిరి వారాహి... సినిమాపై ముందు నుండి ఇంట్రస్ట్ రావడానికి కారణం సుమంత్ గారి యాక్టింగ్. దానికితోడు సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ క్యామియోస్ కూడా ఇంట్రెస్ట్ పెంచాయి. ఇక సినిమా చూసాక సినిమా ఎలా ఉందంటే ఒకె. వన్ టైం వాచబుల్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి సినిమా చూసానన్న ఫీల్ వచ్చింది. 


కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలో ప్రాబ్లెమ్ ఈ సినిమాలో కూడా వచ్చింది. అందుకే ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అని చెప్పాను. ఇక సినిమాలో సుమంత్ గారి క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ రోల్స్ లిమిటెడ్ గానే ఉంది. కానీ బాగుంది. అండ్ ఈ సినిమా వల్ల చాలా మంది వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటారు. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో థ్రిల్స్ బాగున్నాయి. ట్విస్ట్ రివీల్ చేసేటపుడు కొన్ని సప్రైజ్ చేస్తాయి. ఇక గ్రాఫిక్స్ బాగా లేవు. అండ్ వారాహి అమ్మవారి గురించి కొంచెం ఎక్కువ చెప్పి ఉంటె ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. ఓవరాల్ గా సుమంత్ కోసం, డివోషనల్ థ్రిల్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇక దీనికి నా రేటింగ్ 2.75/5.

6.0
out of 10

Above Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie Review

మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక...

మహేంద్రగిరి వారాహి... స్టారింగ్ సుమంత్ గారు... ఇక సినిమా గురించి చెప్పాలంటే... పర్లేదు.. ఓ మాదిరిగా బానే ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. కథ ముందుకు కదలకపోయినా, ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. ఒక అన్ ఎక్స్పెక్టడ్ ట్విస్ట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ అంతా కూడా చాల బోరింగ్ గా వెళ్ళిపోతూ ఉంటది. సో ఎదో జరుగుతా ఉంటది అనిపిస్తది తప్ప... మనకేమి అనిపించదు. అండ్ సినిమాలో ఉన్న డౌట్ ని లాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో అవి మాములే కదా. అండ్ రెండు క్యారెక్టర్ల విషయంలో ట్విస్ట్ లు ఎక్సపెక్ట్ చేయలేదు. అది బాగా అనిపించింది. 


అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ మొత్తం బోర్ కొట్టేసింది. ఫ్లాట్ గా వెళ్తుంది. కథ ఏం ముందుకెళ్ళదు. అండ్ VFX దారుణంగా ఉంది. ఏదైతేనేం మొత్తానికి బడ్జెట్ కూడా ఎక్కువ లేదు. ఇక రివీల్ అయిన ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి. కానీ ఒకవేళ పార్ట్ టు తీయొచ్చు అనుకుంటే కూడా తీసే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. ఇక కార్తికేయ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉందొ, ఇందులో హీరో సుమంత్ రోల్ కూడా అలాగే ఉంది. కానీ సుమంత్ సహా అందరు ఆర్టిస్ట్ లు బాగానే చేసారు. ఒకటి నచ్చలేదు ఏంటంటే ఐశ్వర్య రాజేష్ ట్విస్ట్ ని ట్రైలర్ లోనే రివీల్ చేసారు అది నచ్చలేదు. సో ఓవరాల్ గా మహేంద్రగిరి వారాహి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... సగం బాగుంది. నా రేటింగ్ అయితే 3.25\5.


5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie review

Thyview

By Thyview

మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది...

మహేంద్రగిరి వారాహి.. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతగా నచ్చలేదండి. సినిమా స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లోనే చెప్పేసారు. సినిమాలో ఉన్న శాపం మిస్టరీని హీరో ఎలా సాల్వ్ చేసాడు అనేది కథ. అయితే సినిమాలో శాపం గురించి స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చి కథలోకి తీసుకెళ్లారు. ఇక మహేంద్రగిరికి సంబంధించిన పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. స్టోరీ లోకి ఒక డివోషన్ ఎలిమెంట్ వచ్చినపుడు ఆటోమేటిక్ గా క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. 


అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ నుండి మొత్తం ట్రాక్ తప్పుతుంది. ఒక ఆర్గానిక్ ఫ్లో అనేది సినిమాలో మిస్ అయింది. ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ కి ఇంటర్వెల్ బ్లాక్ ఇంపార్టెంట్, అది సినిమాలో వర్కౌట్ అయింది. అయితే సినిమాలో క్లైమాక్స్ లో క్లారిటీ మిస్ అయింది. చాలా సీన్స్ కి ట్విస్ట్ రివీల్స్ వర్త్ అనిపించవు. అండ్ హీరో సినిమాలో అన్ని సమస్యలను సాల్వ్ చేయడు. అండ్ సినిమాలో ఐశ్వర్య, సిద్ధూ జొన్నలగడ్డ కామియోస్ బాగున్నాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగా లేవు. VFX వరెస్ట్ గా ఉన్నాయి. అండ్ డైరెక్టర్ సినిమా మొత్తం స్టోరీ చెప్పటానికి బాగా ట్రై చేసినా, వర్త్ ట్విస్ట్ లు, ఎమోషన్స్ పండకపోకపోయేసరికి, ఓ డీసెంట్ డివోషనల్ థ్రిల్లర్ గా మిగిలిపోయింది. 

5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie review

సహజంగా ఇలాంటి డివోషనల్‌ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ...

సహజంగా ఇలాంటి డివోషనల్‌ సోషియో ఫాంటసీ చిత్రాలలో దర్శకుడు ఏదో ఒక వైపు నిలబడతారు. పూర్తిగా భక్తిని లేదంటే ఆ భక్తి పేరుతో కొందరు చేసే మోసాలను ఎక్స్ ప్లోర్ చేస్తారు. కానీ ఇందులో దైవశక్తి ఉందని చెబుతూనే, ఆ దైవ శక్తి పేరుతో కొందరు తమ పగను ఎలా తీర్చుకుంటారో చూపించారు. నాస్తికుడైన సిద్ధార్థ్‌ ఆస్తికుడిగా మారడంతో ఈ సినిమా ముగుస్తుంది. అయితే సినిమాలో హీరో సమస్యని ఛేదించడానికి లేట్ గా ఎంట్రీ ఇస్తాడు. దాంతో క్లయిమాక్స్ ట్విస్ట్ ను కన్వెన్సింగ్‌ గా చెప్పడానికి దర్శకుడికి టైమ్‌ సరిపోలేదు. దానికి తోడు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ సాగదీయడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అయ్యింది. 


మొత్తం మీద దర్శకుడు ఏదో అనుకుని, మరేదో తీశాడనే భావనే కలుగుతుంది. సంతోష్‌ జాగర్లపూడికి ఈ తరహా సినిమా తీయడంలో అనుభవం ఉన్నా.. ఎందుకో ఈ కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. క్లయిమాక్స్ ట్విస్ట్ తప్పితే... సినిమా అంతా సాదాసీదాగా సాగిపోవడంతో 'మహేంద్రగిరి వారాహి' ప్రేక్షకులను మెప్పించడం కష్టమే!


5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie Review

‘మురారి’ శైలిలోనే రాజవంశానికి 200 ఏళ్ల నాటి శాపం, ప్రతీ 33 ఏళ్లకు ఒకరి మరణం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘మహేంద్రగిరి వారాహి’. లైన్ ఒకటే అయినా, దర్శకుడు సంతోష్ ప్రెజెంటేషన్ పూర్తి భిన్నంగా ఉంటుంది...

‘మురారి’ శైలిలోనే రాజవంశానికి 200 ఏళ్ల నాటి శాపం, ప్రతీ 33 ఏళ్లకు ఒకరి మరణం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే ‘మహేంద్రగిరి వారాహి’. లైన్ ఒకటే అయినా, దర్శకుడు సంతోష్ ప్రెజెంటేషన్ పూర్తి భిన్నంగా ఉంటుంది.


సినిమా ప్రామిసింగ్ ఆరంభంతో, మంచి ఇంటర్వెల్ సస్పెన్స్‌తో ఆకట్టుకుంటుంది. అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లేకుండా కేవలం పాయింట్‌కే కట్టుబడి తీయడం బిగ్ ప్లస్. సిద్ధూ నటన, ఐశ్వర్య రాజేష్ క్యామియో సీన్స్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్టులు బాగా వర్కవుట్ అయ్యాయి.


అయితే, కొన్ని సీన్లలో లాజిక్ మిస్ అవ్వడం, ల్యాగ్, ప్రమోషన్స్‌లోనే ఐశ్వర్య పాత్రను రివీల్ చేయడం వల్ల థియేటర్ థ్రిల్ కొంత తగ్గింది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త పకడ్బందీగా ఉంటే నెక్స్ట్ లెవల్‌లో ఉండేది.


ఫైనల్ వర్డిక్ట్: థ్రిల్లర్ లవర్స్‌కు ఒక డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వాచ్!


5.0
out of 10

Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri Varahi movie Review

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి...

అనగనగా ఓ ఊరు.. ఆ ఊళ్ళో ఓ గుడి.. రాజవంశానికి శాపం.. ప్రతీ 33 ఏళ్ళకు ఒకరి మరణం.. 200 ఏళ్లుగా సాగుతున్న ఆనవాయితీ.. ఇదంతా వింటుంటే మురారి సినిమా కథ గుర్తుకొస్తుంది కదా..? అలాంటి కథతోనే మహేంద్రగిరి వారాహి కూడా వచ్చింది. కాకపోతే కాన్సెప్ట్ ఒకేలా అనిపించినా.. ట్రీట్‌మెంట్ డిఫెరెంట్‌ గా ఉంది.. వారాహి మొదలవ్వడమే చాలా ప్రామిసింగ్‌ గా మొదలైంది.. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ అనిపించినా.. ఇంటర్వెల్ ముందు సెట్ అయిపోతుంది. సెకండాఫ్‌ కు చాలా ప్రశ్నలు వదిలేసి సస్పెన్స్ మెయింటేన్ చేసారు. అమ్మవారి శాపం నుంచి తప్పించుకోలేక వచ్చే మరణాలు చూస్తుంటే.. కచ్చితంగా దానివెనక ఏదో రహస్యం ఉందనే విషయం అర్థమైపోతుంది. క్లైమాక్స్ వరకు ట్విస్ట్ రివీల్ కాకుండా బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు సంతోష్.. 


కానీ మరీ ఊహించలేనంత ట్విస్టులు మాత్రం ఉండవు.. ఆ టైమ్‌కు పాస్ అయిపోతాయి. సిద్ధూతో పాటు ఐశ్వర్య రాజేష్ క్యామియో బాగుంది.. ఇక అనవసరమైన రొమాంటిక్ ట్రాక్స్ లాంటివి ఇరికించకుండా తీసుకున్న పాయింట్‌ కే కట్టుబడి ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. ఇక ప్రీ క్లైమాక్స్, ముగింపు సన్నివేశాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు, వాటిని రాసుకున్న తీరు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో కొన్ని సీన్లకు సరైన వివరణ ఇవ్వకుండా వదిలేయడం నిరాశపరుస్తుంది. ఇక ప్రమోషన్స్‌ లోనే ఐశ్వర్య రాజేష్ పాత్రను బయట పెట్టేయడం వల్ల థియేటర్లో ఆ థ్రిల్ చాలా వరకు మిస్ అవుతుంది. స్క్రీన్‌ప్లేను ఇంకొంచెం పకడ్బందీగా, లాజిక్స్‌తో రాసుకుని ఉంటే ఈ మిస్టిక్ థ్రిల్లర్ స్థాయి మరింత పెరిగి ఉండేది.

ఓవరాల్‌గా మహేంద్రగిరి వారాహి.. డీసెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్..!


6.0
out of 10

Above Average

మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi)

Mahendragiri varahi movie review

సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంట...

సుమంత్ హీరోగా, సిద్దూ జొన్నలగడ్డ కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదలయి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. సంతోష్ జాగర్లమూడి రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ ‘మహేంద్రగిరి వారాహి’లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అండ్ డివోషనల్ టచ్ కూడా బాగుంది. అయితే ఇలాంటి డివోషనల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు.


‘మహేంద్రగిరి వారాహి’ అంటూ వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ లో కొన్ని ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ రాసిన కథ, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, డివోషనల్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.

6.0
out of 10

Above Average

(మారెమ్మ) Maremma

Maremma movie review

దర్శకుడు మంచాల నాగరాజు మారెమ్మ కథకు రాసుకొన్న పాయింట్ బాగున్నది. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయాలను, ఆచారాలను జోడించి కథగా మార్చుకొన్నాడు. సినిమా ఆరంభంలో వచ్చిన సన్నివేశాలను చూస్తే.. ఎదో డిఫరెంట్ కథ చెప్ప...

దర్శకుడు మంచాల నాగరాజు మారెమ్మ కథకు రాసుకొన్న పాయింట్ బాగున్నది. తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయాలను, ఆచారాలను జోడించి కథగా మార్చుకొన్నాడు. సినిమా ఆరంభంలో వచ్చిన సన్నివేశాలను చూస్తే.. ఎదో డిఫరెంట్ కథ చెప్పబోతున్నాడా? అనే ఫీలింగ్ కలిగించాడు. కానీ కథలోకి వెళ్లిన కొద్ది పేలవమైన రైటింగ్, అర్ధం పర్థం లేని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా విసుగు పుట్టిస్తాయి. కొన్ని పాత్రలు ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు. కొన్ని సీన్లు చాలా దారుణంగా చిత్రీకరించారనే ఫీలింగ్ కలుగుతుంది. 


కథలో ఓ ఫ్లో ఉండదు. ప్రేమ కథలో ఎమోషన్ ఉండదు. ఓవరాల్‌ గా అతుకుల బొంత మాదిరిగా ఉంటుంది. ఫస్టాఫ్ ఏదో పర్వాలేదనిపించినా .. సెకండాఫ్‌ను సాగదీసి సాగదీసి సహనానికి పరీక్ష పెట్టారేంటి? అనే విసుగు పుడుతుంది. మంచి పాయింట్‌ను ఎమోషనల్‌గా రాసుకోలేని నిస్సహాయత ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. మాధవ్ యాక్టింగ్ బాగానే ఉన్నా, పూర్తి స్థాయిలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ లా డిజైన్ చేయలేదు. కథ బలం, కథనంలో పసలేకపోతే సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతేలా ఉంటుందనేది ఈ సినిమాలో కనిపించింది. లైటింగ్ ఈ సినిమాకు మైనస్. నటీనటుల ముఖాలు, వారి హావభావాలు కనిపించనంతగా చీకటిలో ముంచేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ అవుట్‌పుట్ చాలా నాసిరకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను చూడాలా? వద్దా? అనేది మీరే నిర్ణయించుకొండి.


4.0
out of 10

Below Average

(మారెమ్మ) Maremma

Maremma movie Review

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు...

మాస్ మహారాజా రవితేజ కుటుంబం నుంచి వచ్చిన యువ హీరో మాధవ్ భూపతి రాజు నటించిన విలేజ్ డ్రామా ‘మారెమ్మ’ తాజాగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ చిత్రంలో తెలంగాణ నేపథ్యానికి చెందిన పలు అంశాలు మెప్పిస్తాయి. అక్కడి సాంప్రదాయ విలువలు, ముఖ్యంగా జానపద పాటలు ఇంప్రెస్ చేసాయి. ఇక యువ నటుడు మాధవ్ భూపతిరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. పాత్రకి తగ్గట్టుగా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్ ఇందులో బాగున్నాయి. అయితే రచనా లోపం వల్ల అతని ప్రతిభకు తగ్గ స్కోప్ దక్కలేదు. అలానే యంగ్ హీరోయిన్ దీపా బాలు పల్లెటూరి అమ్మాయిగా డీసెంట్ లుక్స్, నటనతో ఆకట్టుకుంది. 


ఇక మొత్తంగా చూసుకుంటే ‘మారెమ్మ’ అనేది స్పష్టత లేని ఒక బోరింగ్ రూరల్ డ్రామాగా నిలిచింది. సినిమా కథనం ఆద్యంతం నీరసంగానే సాగుతుంది. ఎలాంటి హై, ఎమోషనల్ మూమెంట్స్ లేకుండా చప్పగా నడిపించడం డిజప్పాయింట్ చేస్తుంది. యువ నటుడు మాధవ్ తన మొదటి సినిమా అయినా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ పేలవమైన రచన మరియు దర్శకత్వం వల్ల ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది.


5.0
out of 10

Average

Why MRO?