Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1888 Reviews
Showing 13–24 of 1888 reviews

ENE Repeat Movie Review

ఈNఈ (ENE Repeat) 2026 Twitter Channel
#ENE2 #IderamMediaRating 2.5/5Setting the story aside,this is a movie that aims to make you laugh.An over-the-top, crazy fun ride.It takes a little while for the movie to get going.From then on,...

#ENE2 #IderamMediaRating 2.5/5


Setting the story aside,


this is a movie that aims to make you laugh.


An over-the-top, crazy fun ride.


It takes a little while for the movie to get going.


From then on, right to the end,


it keeps you laughing whenever it gets the chance.


Abhinav Gomatam steals the show. It's a one-man show.


He wrote dialogue with lines


that would make the masses laugh,


without the slightest hesitation.


The first half-hour


and a little stretch in the second half slow things down a bit.


Everything else is a fun ride.


It's not a bad way to pass the time.


Punchline - A time-pass with no story.

5.0
out of 9
2 days ago
Nov 19, 2026 Telugu

ENE Repeat Movie review

ఈNఈ (ENE Repeat) 2026 Twitter Channel
#ENE2 like ENE has all the ingredients to age beautifully. Cranky characters, quirky behaviour, unrealistic situations and childish mindsets eventually come together in a heart-touching climax.Amidst...

#ENE2 like ENE has all the ingredients to age beautifully. Cranky characters, quirky behaviour, unrealistic situations and childish mindsets eventually come together in a heart-touching climax.


Amidst all the madness, one character consistently stands out and keeps you entertained - Kaushik! Brilliantly written by Tharun and exceptionally performed by Abhinav Gomatam.


The climax, especially its take on TFI, is refreshingly honest. I haven’t seen such candid dialogues about the Telugu film industry in a film since Neninthe.


The film’s dialogues are one of its biggest highlights.


The cameos towards the end leave you walking out of the theatre with a big smile!


Definitely worth a watch!

6.0
out of 9
2 days ago
Nov 19, 2026 Telugu

ENE Repeat Movie Review

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది ?’ రిపీట్. మంచి బజ్ నడుమ ఈ సినిమా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన రైటింగ్ తో ఆకట్టుకున్నారు.&n...

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది ?’ రిపీట్. మంచి బజ్ నడుమ ఈ సినిమా విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన రైటింగ్ తో ఆకట్టుకున్నారు. బలమైన నాలుగు పాత్రల్ని రాసి, వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో కథనాన్ని అల్లుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా ప్రధాన పాత్రలు, వాటి మాటలు ట్రెండీగా ఉండటంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ముందుగా చెప్పుకోవాలంటే, ‘కౌశిక్’ పాత్ర ఈ సినిమాకు అతిపెద్ద బలం. మొదటి భాగంలో తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్న అభినవ్, ఈసారి కూడా అదే తరహా నటనతో అలరించారు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ బాగానే నటించాడు. ఉప్పి పాత్రలో వెంకటేష్ కాకుమాను మంచి నటనను కనబరిచాడు. 


ఈ చిత్రం కూడా పార్ట్ వన్ శైలినే అనుసరిస్తుంది, అయితే ఇది భిన్నమైన నేపథ్యంలో సాగుతుంది. అదే నలుగురు స్నేహితులు మరోసారి ఇబ్బందుల్లో పడి, తమను తాము నిరూపించుకోవడానికి ఒక సినిమా తీయాల్సిన సవాలును ఎదుర్కొంటారు. కథాంశం హాస్యానికి ఆస్కారం కల్పించినప్పటికీ, ఈ సీక్వెల్‌లో కొత్తదనం కొరవడింది, కొన్ని చోట్ల రొటీన్ సీన్స్ తో ప్లే సాగడం బాగాలేదు. మొత్తమ్మీద ఈ సినిమా ఒక బడ్డీ కామెడీ డ్రామాగా సరదాగా సాగుతూ ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అండ్ అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ మరియు మిగిలిన నటీనటుల కామెడీ టైమింగ్ తో కొన్ని సీన్స్ బాగానే నవ్వించాయి. కానీ, రెగ్యులర్ కథనం, కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. ఐతే, ఈ సినిమా ఓవరాల్ గా బాగానే ఆకట్టుకుంది.


6.0
out of 9
2 days ago
Nov 19, 2026 Telugu

ENE Repeat Movie Review

నలుగురు ప్రాణ స్నేహితులు, బాల్య స్నేహితులు కలిసి కూర్చుంటే.. ఎంత హాయిగా ఉంటుంది.. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది.. అనేది ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో చూపించాడు. ఆ సినిమా అలా అలా సాగుతూ ఉంటుంది. అయితే ఇందులో...

నలుగురు ప్రాణ స్నేహితులు, బాల్య స్నేహితులు కలిసి కూర్చుంటే.. ఎంత హాయిగా ఉంటుంది.. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది.. అనేది ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో చూపించాడు. ఆ సినిమా అలా అలా సాగుతూ ఉంటుంది. అయితే ఇందులో ప్రధాన ఓ కథాంశం అని ఏదీ ఉండదు. వివేక్ ఈ చిత్రంలో తన కథను ఎలా రాసుకున్నాడు.. ఎలా తీశాడో.. తరుణ్ భాస్కర్ కూడా ఈ సినిమాని అలానే రాసుకుని, అలానే తీసినట్టు అనిపిస్తుంది. అసలు వివేక్ అంటే తరుణ్ భాస్కర్ అన్నట్టుగానే కనిపిస్తుంది. అక్కడక్కడా నవ్వించడంలో, మేకింగ్ పరంగా మాత్రం తరుణ్ భాస్కర్ బ్రిల్లియంట్‌గా కనిపిస్తాడు. చివరి 40 నిమిషాలు కాస్త బాగుంటుంది. గెస్ట్ అప్పియరెన్స్‌గా వచ్చిన దర్శకులు, వారి సీన్స్ అన్నీ కూడా థియేటర్లో పేలుతాయి. మరీ ముఖ్యంగా చివర్లో సందీప్ రెడ్డి టచ్ మాత్రం అదిరిపోతుంది.


అలా తరుణ్ భాస్కర్ ఈ రెండో పార్ట్‌తో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌ని మాత్రం సంతృప్తి పరుస్తాడనిపిస్తుంది. బడ్డీ కామెడీ, గ్యాంగ్‌తో కలిసి చేసే అల్లరి పనులు ఇలా సరదాగా సాగే సినిమాల్ని ఇష్టపడే ఆడియెన్స్‌కి ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది. మేకర్‌గా తరుణ్ భాస్కర్ మరోసారి తన టాలెంట్‌ని చూపించాడు. తక్కువ ఖర్చులో మంచి అవుట్ పుట్ తీసుకు వచ్చినట్టు అనిపిస్తుంది. మాటలు మరీ గుర్తు పెట్టుకునేలా ఉండకపోవచ్చు కానీ.. పంచ్ డైలాగ్స్ మాత్రం థియేటర్లో నవ్వులు పూయించేలా ఉంటాయి. ‘ఈ నగరానికి ఏమైంది 2’ కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అక్కడక్కడా నలుగురు స్నేహితులు మాత్రం నవ్విస్తారు. పూర్తిస్థాయిలో మెప్పించకపోయినా నిరాశపర్చకపోవచ్చు.

5.0
out of 9
3 days ago
Nov 19, 2026 Telugu

Donganakoduku movie review

లిటిల్ హార్ట్స్ సినిమా తర్వాత మౌళికి ఏర్పడిన క్రేజ్ కారణంగా దొంగ నా కొడుకు సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా విషయంలో శ్రీను కంబాల రాసుకొన్న పాయింట్ బాగుందే కానీ.. సినిమా కథను విస్తరించిన...

లిటిల్ హార్ట్స్ సినిమా తర్వాత మౌళికి ఏర్పడిన క్రేజ్ కారణంగా దొంగ నా కొడుకు సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా విషయంలో శ్రీను కంబాల రాసుకొన్న పాయింట్ బాగుందే కానీ.. సినిమా కథను విస్తరించిన తీరు, సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు అంచనాలకు దిగువన ఉన్నాయనే చెప్పాలి. కన్వినియేంట్‌గా రాసుకొన్న స్క్రీన్ ప్లే.. అర్ధం పర్థం లేకుండా జొప్పించిన సన్నివేశాలు హ్యాస్యాన్ని చాలా కష్టంగా పండించాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయనిపిస్తాయి. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్ తర్వాత.. ఆ పాయింట్ పట్టుకొని సినిమాను ఎంత లాగాలో అంత లాగి విసుగుపుట్టిస్తారు. 


మౌళికి సూట్ కాని కథ, కథనాలతో చేసిన ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి. మౌళి లాంటి పెర్ఫార్మెన్స్‌ను జాగ్రత్తగా వాడుకోకపోతే.. ఎలాంటి ఫలితం ఉంటుంద అనేది ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. పేలవమైన కథ, కథనాలున్న ఈ సినిమాలో మౌళి నటన విషయంలో ఎలాంటి కంప్లైట్స్ కనిపించవు. ఈ సినిమాలో బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. రకరకాల గెటప్స్‌లో ఆకట్టుకొన్నాడు.. కానీ సినిమాకు అవేమీ ప్లస్ పాయింట్స్‌గా మారలేదనే చెప్పాలి. ఖర్చు విషయంలో రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. కానీ కథ, కథనాలపై జాగ్రత్త తీసుకోవాల్సిందనిపించింది. జబర్దస్త్ కామెడీని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


4.0
out of 9
1 week ago
Nov 14, 2026 Telugu

Donga na koduku movie review

మౌళి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ‘దొంగ నా కొడుకు’ (DNK) సినిమాతో వచ్చేశారు. శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. అయితే థియేటర్లలో యావరేజ్ టాక్ అందుకుంది. క్రైౖమ్‌ క...

మౌళి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ‘దొంగ నా కొడుకు’ (DNK) సినిమాతో వచ్చేశారు. శ్రీను కంబాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. అయితే థియేటర్లలో యావరేజ్ టాక్ అందుకుంది. క్రైౖమ్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌ లో ఓ బంగారు దుకాణంలో జరిగే రాబరీ చుట్టూ ఈ సినిమా కామెడీతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడా సరదాగా సాగింది. సినిమాలో కామెడీ, ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎంటర్టైనింగ్ సీక్వెన్స్ లు అలరిస్తాయి. హీరో మౌళి ఓ దొంగగా సగటు జులాయి యువకుడి పాత్రలో చాలా బాగా నటించాడు. 


అయితే ఈ దొంగ నా కొడుకు సినిమాలో కామెడీ మరియు సస్సెన్స్.. అలాగే కొన్ని క్రైమ్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కథనం పూర్తి ఆసక్తి కరంగా సాగకపోవడం, సినిమా పలు చోట్ల బోర్ గా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్, సెకండ్ హాఫ్ లో మిస్ అవ్వడం, అలాగే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది. క్రైమ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ ‘దొంగ నా కొడుకు’ (DNK) చిత్రం ఆకట్టుకోలేదు. ఐతే, మౌళితో పాటు మిగిలిన నటీనటులు తమ కామెడీ టైమింగ్ తో కొన్ని చోట్ల నవ్వించారు. కానీ, సినిమాలో పెద్దగా కథ లేకపోవడం, కథనంలో ఇంట్రెస్ట్ మిస్ కావడం, రెగ్యులర్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి బలహీనతగా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా కనెక్ట్ కాదు.

5.0
out of 9
1 week ago
Nov 14, 2026 Telugu

Itlu Arjuna movie review

చిన్నతనం నుంచే కీర్తీని ప్రేమించే చిరు దొంగ అర్జున్, వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం లాంటి రెండు లేయర్లతో సాగే కథను దర్శకుడు మహేష్ ఉప్పల రాసుకొన్న తీరు బాగుంది. కథను మొదలు పెట్టిన తీరు చాలా స్టైలిష్‌గాను,...

చిన్నతనం నుంచే కీర్తీని ప్రేమించే చిరు దొంగ అర్జున్, వెయ్యి కోట్ల హవాలా వ్యవహారం లాంటి రెండు లేయర్లతో సాగే కథను దర్శకుడు మహేష్ ఉప్పల రాసుకొన్న తీరు బాగుంది. కథను మొదలు పెట్టిన తీరు చాలా స్టైలిష్‌గాను, ఎమోషనల్‌గాను ఉంది. అయితే ఫస్టాఫ్‌లో కీర్తీ, అర్జున లవ్ ట్రాక్ మొదలు పెట్టి.. అదే పాయింట్‌తో సినిమా మొదటి భాగాన్ని నడిపించడం సాగదీసినట్టు ఉంటుంది. ఫస్టాఫ్‌లో పక్కాగా స్క్రీన్ ప్లే నమ్ముకొని కథను నడిపించిన తీర యూత్‌ఫుల్‌ గా ఉంది. కానీ ఆ ట్రాక్‌లో బలమైన సన్నివేశాలు, కంటెంట్ జొప్పించి ఉంటే మరింత అదిరిపోయేదనిపిస్తుంది.


మూగవాడిగా నటించిన అనీష్ తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ఫైట్స్, డ్యాన్స్, యాక్టింగ్, కామెడీ అంశాలను ఎంతో అనుభవం ఉన్న హీరో లెవెల్‌లో పెర్పార్మ్ చేశాడు. ఇక కీర్తీగా అనశ్వర రాజన్ నటనతోనే కాకుండా గ్లామర్‌తో కూడా ఆకట్టుకొన్నది. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లలో అద్బుతంగా నటించింది. ఈ ఇట్లు అర్జున చిత్రం లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. టాలీవుడ్‌కు యాక్టర్‌గా పరిచయమైన సాయి అనీష్ తన వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు సంపాదించుకొన్నాడు. ఆయన నటన కోసం, అనశ్వర రాజన్ గ్లామర్ కోసం, అలాగే మహేష్ ఉప్పల టేకింగ్, నిర్మాతగా వెంకీ కుడుముల అనుసరించిన ప్రొడక్షన్ స్టాండర్డ్ కోసం థియేటర్‌లోనే ఈ మూవీని చూడాలనిపిస్తుంది. యాక్షన్ మోడ్‌లో సాగే లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

6.0
out of 9
1 week ago
Nov 13, 2026 Telugu

Itlu Arjuna movie review

స్టార్ హీరోల ప్రమోషన్స్‌తో విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

స్టార్ హీరోల ప్రమోషన్స్‌తో విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఈ సినిమాకు అతిపెద్ద బలం సంగీత దర్శకుడు తమన్. హీరోకు మాటలు రావని ముందే స్పష్టం చేయడంతో, సినిమాలో డైలాగుల కంటే సంగీతమే కీలకంగా మారుతుంది. అలాంటి మూగ పాత్రకు తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో తమన్ ప్రాణం పోశాడు. 


కెరీర్ ప్రారంభంలోనే మాటలు రాని ఓ ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకున్న నూతన హీరో అనీష్.. తన తొలి సినిమాతోనే ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మెప్పించాడు. హీరోయిన్ అనస్వర రాజన్ తెరపై చాలా అందంగా కనిపించింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫస్టాఫ్‌ను ఎంతో వినోదాత్మకంగా మలిచిన దర్శకుడు.. సెకండాఫ్‌కు వచ్చేసరికి ఆ వేగాన్ని పూర్తిస్థాయిలో కొనసాగించలేకపోయాడు. ద్వితీయార్థంలో కామెడీ డోస్ కాస్త తగ్గి, క్రైమ్ కథనం నెమ్మదిస్తుంది. మొత్తంగా చూస్తే.. ‘ఇట్లు అర్జున’ ఆద్యంతం ఆకట్టుకునే ఓ మంచి రొమాంటిక్ యాక్షన్ కామెడీ. అనీష్, అనస్వర రాజన్‌ల క్యూట్ కెమిస్ట్రీ, ఫస్టాఫ్‌లో పేలిన కామెడీ, అన్నింటికీ మించి తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టాయి. ఓవరాల్‌గా సినిమా ఇచ్చిన వినోదం ముందు అవి చిన్నవిగానే అనిపిస్తాయి. ఈ వారాంతంలో థియేటర్లలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసే మంచి చిత్రమిది.




7.0
out of 9
1 week ago
Nov 13, 2026 Telugu

Mahashakti movie review

దుష్టశక్తులతో దైవశక్తి పోరాటం, వారిపై అధిపత్యం అంశాల నేపథ్యంతో ప్రస్తుత సామాజిక అంశాలను జోడించిన సుందర్ సీ రూపొందించిన ఈ సినిమాలో ప్రధానంగా టెక్నికల్ అంశాలు డామినేట్ చేశాయనే చెప్పాలి. కథ, కథనాల కంటే.....

దుష్టశక్తులతో దైవశక్తి పోరాటం, వారిపై అధిపత్యం అంశాల నేపథ్యంతో ప్రస్తుత సామాజిక అంశాలను జోడించిన సుందర్ సీ రూపొందించిన ఈ సినిమాలో ప్రధానంగా టెక్నికల్ అంశాలు డామినేట్ చేశాయనే చెప్పాలి. కథ, కథనాల కంటే.. దర్శకుడిగా సుందర్ సీ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌తోనే సినిమా స్టోరీని నేరేట్ చేయాలనే ప్రయత్నం కనిపించింది. అమ్మవారిని ఎదురించే దుష్టశక్తి, మరణమే లేకుండా దైవశక్తులపై కుట్రలు పన్నాలనే రాక్షస జాతి లాంటి పాయింట్స్‌తో ఎన్నో సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అయితే అదే పాయింట్‌ తో రెగ్యులర్, రొటీన్ పగ, ప్రతీకారాలు, పూర్వజన్మ అంశాలతో ఈ సినిమా కథను చెప్పడం కంటే.. ఈ జనరేషన్ టెక్నాలజీతో కొత్త అనుభూతిని పంచాలనే తాపత్రయం దర్శకుడిలో కనిపించింది. 



ఇక నయనతార రెండు విభిన్నమైన పాత్రల్లో నటించింది. శక్తిగా కానిస్టేబుల్, 2 వేల సంవత్సరాల క్రితం అమ్మవారి పాత్రలో ఒదిగిపోయారు. యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలను అవలీలగా పోషించింది. తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. ఇక రెజీనా కసండ్రా డఫరెంట్ రోల్‌లో మెస్మరైజ్ చేసింది. భైరీ అనే దుష్టశక్తి పాత్రలో గెటప్, డైలాగ్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొన్నారు. కుష్బూ, స్నేహా ఇద్దరు గెస్ట్ అప్పియరెన్స్‌తో సినిమాకు ఫీల్ గుడ్‌గా మారారు. డిఫరెంట్ స్టోరి, స్క్రీన్ ప్లే, బ్యాక్ డ్రాప్‌తో వచ్చి ఉంటే.. డెఫినెట్‌ గా మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉండేది. దీపావళీ సమయంలో అమ్మవారి నేపథ్యంతో వచ్చిన చిత్రాన్ని చూడాలనుకొంటే.. మహాశక్తి సినిమాను ఓ సారి లుక్కేయొచ్చు.

5.0
out of 9
1 week ago
Nov 12, 2026 Tamil

Summer Holidays Movie Review

సమ్మర్ హాలీడేస్‌లో కొత్తగా కథ అంటూ ఏమీ ఉండదు. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే బాగుంటాయి. మార్కులే జీవితం కాదని కొన్ని సీన్స్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. కథ ఒక దగ్గర స్టార్ట్ అయి.. ఎటెటో వెళ్లిపోయి.. ఎక్కడో ఆగ...

సమ్మర్ హాలీడేస్‌లో కొత్తగా కథ అంటూ ఏమీ ఉండదు. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే బాగుంటాయి. మార్కులే జీవితం కాదని కొన్ని సీన్స్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. కథ ఒక దగ్గర స్టార్ట్ అయి.. ఎటెటో వెళ్లిపోయి.. ఎక్కడో ఆగినట్టు అనిపిస్తుంది. ఇక ఈ కథలో పెద్ద సంఘర్షణ కూడా ఏమీ కనిపించదు. ఒక కథకు హీరో, విలన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆ రెండూ కనిపించవు. కేవలం ఇద్దరు పిల్లల చుట్టూనే తిరుగుతుంది. అందుకే చాలా వరకు కాన్ ఫ్లిక్ట్ ఎక్కువగా కనిపించదు. ఏదో సినిమా ముందుకు సాగుతోంది అంటే.. సాగుతోంది అన్నట్టుగా ఉంటుంది.


సిటీలో పిల్లాడు.. మార్కుల కోసం మందలించే తండ్రి.. ఆటలు పాటలకు దూరంగా ఉండే ఆ పిల్లాడు.. అమ్మమ్మ ఊరికి రావడంతో కథ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అక్కడ పిల్లలిద్దరి స్నేహం బాగుంటుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే బాల్యాన్ని గుర్తు చేస్తాయి. కథ ఊరికి షిఫ్ట్ అయిన తర్వాత కేవీ పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. పాయింట్ వరకు, మెసెజ్ వరకు బాగానే అనిపించినా.. పూర్తి స్థాయి సినిమా మాత్రం అంత ప్రభావవంతంగా అనిపించదు. ఏదో వెలితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. టెక్నికల్‌గా చూసుకుంటే ఊరి వాతావరణం మాత్రం చక్కగా చూపించారు. ఎక్కువగా మామిడి తోటలోనే షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. సింజిత్ పాటలు, బీజీఎం హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. చివరగా ‘సమ్మర్ హాలీడేస్’ అద్భుతాలు సృష్టించకపోవచ్చు కానీ.. బాల్యాన్ని గుర్తు చేసే ఓ సింపుల్, అందమైన సినిమాగా అయితే నిలుస్తుంది. ఇప్పటి పిల్లలకి కూడా ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది.


5.0
out of 9
2 weeks ago
Nov 07, 2026 Telugu

Scene Movie review

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి ఈ ఏడాది ముచ్చటగా వచ్చిన మూడో చిత్రమే ‘సీన్’. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు జీ...

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి ఈ ఏడాది ముచ్చటగా వచ్చిన మూడో చిత్రమే ‘సీన్’. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు జీతూ మాధవ్ ఐడియా అండ్ దానిని తెరకెక్కించిన విధానం ఒకింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. దీనిలో కూడా మంచి ఫన్ ని యాడ్ చేయడంతో కథనం మరింత ఎంగేజింగ్ గా వెళుతుంది. సూర్య తన పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఇది వరకు తన నుంచి మరో పోలీస్ ని చూసాం కానీ ఇది మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.


ఈ సినిమాలో నేపథ్యం, కామెడీ వంటివి బాగానే ఉన్నాయి కానీ యంగ్ విలన్ వెర్షన్ లో మాత్రం ఇంకా జాగ్రత్త పడాల్సింది. తన బ్యాక్ స్టోరీ సినిమాలో ఒకింత వీక్ గా అనిపిస్తుంది. ఎందుకు అతను అలా చేస్తున్నాడు అనే దానికి మరింత బలమైన కారణాన్ని పెట్టి ఉంటే ఇంకా అర్ధవంతంగా ఉండేది. ఇక మొత్తంగా చూసుకుంటే ‘సీన్’ అనేది ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ సినిమాగా నిలుస్తుంది. అనవసర హంగు ఆర్భాటాలు లేకుండా డీసెంట్ గా సినిమా వెళ్ళిపోతుంది. సూర్య తన వెర్సటైల్ నటనతో ముందుండి నడిపించగా, నజ్రియా ఫహద్ మరియు నస్లెన్ లు అతనికి మంచి సహకారం అందించారు. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బెటర్ ఫీల్ ఇస్తుంది. విలన్ బ్యాక్ స్టోరీ, స్లో ఫస్టాఫ్ ని పక్కన పెడితే ఈ క్రైమ్ కామెడీ సినిమా ఒకసారికి ధారాళంగా చూడొచ్చు. తెలుగు సినిమా వార్తలు


6.0
out of 9
2 weeks ago
Nov 06, 2026 Tamil

Scene movie review

సీన్ (SCENE) 2026 News Channel
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన రాజీనామా కోసం ట్రై చేస్తుండగా, పెర్ఫ్యూమ్...

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన రాజీనామా కోసం ట్రై చేస్తుండగా, పెర్ఫ్యూమ్ కిల్లర్ కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగడం.. ఈ క్రమంలో తన అసిస్టెంట్ మాయ (నజ్రియా ఫహద్) తో కలిసి ఆయన ఈ మిస్టరీని ఎలా చేధించారు అనేదే ఈ సినిమా కథాంశం.


సూర్య తన యంగ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ మరియు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశారు. ఇదివరకు చూడని ఫ్రెష్ పోలీస్ రోల్‌లో ఆయన వెర్సటైల్ యాక్టింగ్ సినిమాకు మెయిన్ హైలైట్. ఇక సూర్యతో కలిసి నజ్రియా చేసిన కామెడీ సీన్స్, ముఖ్యంగా మార్చురీ దగ్గర ప్రపోజల్ సీన్ బాగా వర్కౌట్ అయ్యాయి. మొదటిసారి నెగిటివ్ షేడ్స్‌లో కనిపించిన నెస్లేన్ కూల్‌గా అదరగొట్టగా, సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఫస్టాఫ్‌లో కథనం ఒకింత నెమ్మదిగా సాగుతుంది. విలన్ బ్యాక్‌స్టోరీ బలహీనంగా ఉండటం, హీరో-విలన్ మధ్య బలమైన ఫేస్-ఆఫ్ సీన్స్ మిస్ అవ్వడం చిన్న నిరాశ కలిగిస్తాయి. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా, సెకండాఫ్ పర్వాలేదపించింది.

5.0
out of 9
2 weeks ago
Nov 06, 2026 Tamil
Why MRO?