Register as a Reviewer
Donga Naa Koduku (దొంగ నా కొడుకు)

Donga Naa Koduku (దొంగ నా కొడుకు)

Upcoming Expected Release: 13 Nov 2026

Donga Naa Koduku : మాంచి కామెడీతో దొంగనాకొడుకుగా వచ్చేస్తున్న మౌళి... ఈసారి పెద్దగానే కొట్టేట్టున్నాడు..!

Director: Sreenu Kambala
Cast: Mouli Tanuj Prashanth, Sushmitha Shetty, Ali, Raghu Babu, Rajitha, Priya, Babloo

Available in:

About This Movie

90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో ఫేమస్ అయి, లిటిల్ హార్ట్స్ తో హీరోగా మారిన మౌళి డెబ్యూ మూవీతోనే సక్సెస్ అందుకుని, బడా బ్యానర్ల ప్రొడ్యూసర్లను ఆకర్షించాడు. ఈ క్రమంలోనే మౌళి హీరోగా తాజాగా టాప్ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నుండి ఓ సినిమా  రాబోతుంది. ఈ సంస్థ సమర్పణలో రూపొందుతోన్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ "దొంగ నా కొడుకు". శ్రీను కంబాల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మౌళి హీరోగా సుస్మితా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ తోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా, తాజాగా టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంటుంది. 

 

 

ఇక టీజర్ ను గమనిస్తే... ఈశ్వర్ (మౌళి) బీ టెక్ చదువును మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతూ అడ్డదారిలో డబ్బు సంపాదిద్దామనే కుర్రాడిగా టీజర్ లో చూపించారు. టీజర్ స్టార్టింగ్ లోనే సముద్రం ఒడ్డున నిలబడి "దేవుడా.. మంచి తల్లిదండ్రులను ఇచ్చావ్, బెస్ట్ ఫ్రెండ్‌ ని ఇచ్చావ్, అందమైన గర్ల్‌ఫ్రెండ్‌ ని ఇచ్చావ్.. కానీ వచ్చే జన్మలో వీళ్లెవరూ వద్దు.. కేవలం డబ్బే కావాలి!" అంటూ దేవుడ్ని కోరుతూ డైలాగ్ ద్వారానే క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసారు. ఇక హీరోకి తల్లి తండ్రిగా అలీ, రజిత నటిస్తున్నారు. టీజర్ మొత్తం ఫన్నీ సీన్స్ అండ్ డైలాగ్స్ తో హిలేరియస్ కామెడీగా ఉండి అట్రాక్ట్ చేస్తుంది. ఇక మౌళి తనదైన బాడీ లాంగ్వేజ్, నేచురల్ డైలాగ్ డెలివరీతో మరోసారి అలరించనున్నాడు. హీరోయిన్‌ గా సుష్మిత శెట్టి ఫ్రెష్ లుక్‌ తో ఆకట్టుకుంటుంది. 

 

 

రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సింజిత్ ఎర్రంమిల్లి సంగీతం అందించనున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీని నవంబర్ 13న థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక టీజర్ ను చూస్తుంటే.. లిటిల్ హార్ట్స్ తో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ డెబ్యూ ఇచ్చిన మౌళి ఈసారి అంతకు మించిన బ్లాక్ బస్టర్ కొట్టేట్టు ఉన్నాడని మూవీ లవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

Why MRO?