Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1584 Reviews
Showing 49–60 of 1584 reviews

Secret soldier movie review

దేశభక్తి, దేశం కోసం సీక్రెట్‌ గా పోరాడే సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సీక్రెట్‌ సోల్జర్స్ ని ప్రధానంగా చేసుకొని రూపొందిన మూవీ `సీక్రెట్‌ సోల్జర్`. దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమ...

దేశభక్తి, దేశం కోసం సీక్రెట్‌ గా పోరాడే సైనికులు చాలా మంది ఉంటారు. అలాంటి సీక్రెట్‌ సోల్జర్స్ ని ప్రధానంగా చేసుకొని రూపొందిన మూవీ `సీక్రెట్‌ సోల్జర్`. దేశభక్తి, స్నేహాన్ని మేళవిస్తూ రూపొందించిన చిత్రమిది. నిజానికిది చాలా పెద్ద రేంజ్‌ స్టోరీ. కానీ కొత్త నటీనటులు, అప్‌కమింగ్‌ యాక్టర్స్ తో ఈ రేంజ్‌ సినిమా తీయడం విశేషమని చెప్పాలి. ఇక సినిమాలో డిఫెన్స్ కి సంబంధించిన సీక్రెట్‌ మిషన్‌ లీక్‌కి, స్నేహాన్ని ముడిపెడుతూ రూపొందించిన తీరు బాగుంది. సినిమాలోని ట్విస్ట్ లు, టర్న్ లు మరో హైలైట్‌గా నిలిచాయి. 


ఇక ఒక్కో ట్విస్ట్, అసలు కథ రివీల్‌ అవుతున్న నేపథ్యంలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఓ వైపు దేశానికి సంబంధించిన స్పై ఏజెన్సీ చేసే కార్యక్రమాలు, వారు చేసే మిషన్‌ లీక్‌ కావడం వంటి అంశాలను, మరోవైపు స్నేహానికి సంబంధించిన జర్నీని ఆవిష్కరించిన తీరు బాగుంది. స్క్రీన్‌ ప్లే చాలా నీట్‌గా సాగుతుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా చాలా చోట్ల కథనంలో లింక్‌లు మిస్‌ అయ్యాయి. ఒక వైపు వెళ్లే కథ, మరోవైపు టర్న్ తీసుకున్నట్టుగా ఉంటుంది. చాలా చోట్ల లాజిక్‌ లు మిస్‌ అయ్యాయి. స్పై ఏజెన్సీలోనే వారికే కమ్యూనికేషన్‌ లేకపోవడమనేది కొంత అసహజంగా అనిపిస్తుంది. పాత్రల్లోని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. కాకపోతే చాలా వరకు ఎంగేజ్‌ చేస్తుంది. కొత్త వారైనా చాలా బాగా చేశారు. ఇదొక స్పై యాక్షన్‌ ఫిల్మ్ లా కాకుండా, స్నేహం చుట్టూ కథని నడిపించడం విశేషంగా చెప్పొచ్చు. ఓవరాల్ గా దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఒక కొత్త తరహా చిత్రమిది. స్పై మూవీస్‌, దేశభక్తి మూవీస్‌ని ఇష్టపడే వారికి నచ్చే సినిమా అవుతుంది.




5.0
out of 9
5 days ago
Sep 28, 2026 Telugu

Anumana Pakshi movie review

B

By Baswaraj

Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time! DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaled...

Guys, DJ Tillu teesina Vimal Krishna nundi Anumana Pakshi lanti bakwas film vasthundi ani asalu expect cheyaledu. Outright waste of time!


DJ Tillu lo unnattu magic or comedy ekkada kooda repeat kaaledu. Movie motham oka single character chutte tirugutundi annaru kani, aa characterization-e chala irritating ga undhi.


Comedy movie ani promote chesaru kani, 1 hour 51 minutes duration lo okka scene lo kooda gattiga navvu raaledu! Raag Mayur entha try chesina, flat writing and logic-less scenes valla character completely misfire ayindi.


Music and Kashmir visuals okay anipinchina, content leni cinema ki avi em help cheyale. Pure disappointment guys, totally skippable!


2.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie Review

ఈరోజే 'అనుమాన పక్షి' (anumana pakshi) సినిమా చూశాను. ఓవరాల్‌ గా చెప్పాలంటే... మూవీ పర్లేదు, డీసెంట్‌ గా బాగుంది!'డీజే టిల్లు' లాగే ఇది పక్కా ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమా. రాగ్ మయూర్ తన క్యారెక్టరైజేష...

ఈరోజే 'అనుమాన పక్షి' (anumana pakshi) సినిమా చూశాను. ఓవరాల్‌ గా చెప్పాలంటే... మూవీ పర్లేదు, డీసెంట్‌ గా బాగుంది!

'డీజే టిల్లు' లాగే ఇది పక్కా ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమా. రాగ్ మయూర్ తన క్యారెక్టరైజేషన్‌ తో, తనకు వచ్చే 'అనుమానం' చుట్టూ తిరిగే ప్లాట్‌ తో ఫన్ బాగానే జనరేట్ చేశారు.


సినిమా రన్ టైమ్ 2 hours ఉండటం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ల్యాగ్ లేకుండా స్టోరీ త్వరగా అర్థమైపోతుంది. and బ్రహ్మాజీ, అజయ్ గారి క్యారెక్టర్ల నుండి, హీరోయిన్ ట్రాక్ నుండి కూడా డీసెంట్ కామెడీ ల్యాండ్ అయింది. రాగ్ మయూర్ యాక్టింగ్, సాంగ్స్, పర్ఫెక్ట్ గా సెట్ అయిన BGM movieకి హైలైట్!


but ఫన్ ని ఇంకొంచెం గట్టిగా design చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఒక లైట్-హార్టెడ్ కామెడీ మూవీగా ఒకసారి చూడొచ్చు. 

5.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana pakshi movie review

అనుమాన పక్షి సినిమా గురించి చెప్పాలంటే మూవీ పర్లేదు బాగుంది. అంటే ఇది అవుట్ రైట్ ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా ఇది. కంప్లీట్ గా క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది, క్యారెక్టర్ చుట్టే ఫోకస్ ఉ...

అనుమాన పక్షి సినిమా గురించి చెప్పాలంటే మూవీ పర్లేదు బాగుంది. అంటే ఇది అవుట్ రైట్ ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా ఇది. కంప్లీట్ గా క్యారెక్టర్ చుట్టే తిరుగుతూ ఉంటుంది, క్యారెక్టర్ చుట్టే ఫోకస్ ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్ కి ఏదైతే అనుమానం ఉందో ఆ అనుమానం చుట్టే మొత్తం తిరుగుతది. సో మొత్తం అంతా కూడా ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. సో దాంట్లో రాగమయూర్ అయితే బాగా చేశారు. అయితే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి లైక్ అజయ్ గారు, బ్రహ్మాజీ గారు ఇంకా చాలా మంది ఉంటారు. సో ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కూడా కొంతవరకు ఫన్ అనేది జనరేట్ అవుతది. కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 


రాగ మయూర్ కి ఇలా క్యారెక్టరైజేషన్ వల్ల ఆ అనుమానం క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్ గా వెళ్తున్న కొద్దీ మనకి కొంచెం ఫన్ అనేది బెటర్ అవుతూ ఉంటది అలా అన్నమాట. హీరోయిన్ కి బేసిక్ గా అంత ఎక్కువ స్కోప్ ఏమీ లేదు. రెండు పాటలు అయితే మటుకు చాలా బాగా అనిపిస్తాయి అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఓవరాల్ గా బెటర్ గా ఫన్ అనేది జనరేట్ చేసి ఉండొచ్చు, బట్ అదర్ వైస్ ఒక సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. సో దాని చుట్టూ జరిగే కథ, దాని చుట్టూ జరిగే కన్వర్సేషన్స్, దాని చుట్టూ జరిగే కామెడీ. ఆ బేస్ డీజే టిల్లు. డీజే టిల్లు కూడా అంతే కదా సో అది మ్యాటర్ ఇంకా. సో అట్లా. ఓకే సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3\5 అవుట్ ఆఫ్ ఫైవ్.

6.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie Review

Tupaki

By Tupaki

డీజే టిల్లు’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన విమల్ కృష్ణ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకో సినిమా తీయలేదు. ఎట్టకేలకు అతడి నుంచి ఓ సినిమా వచ్చింది. అదే.. అనుమాన పక్షి. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ...

డీజే టిల్లు’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన విమల్ కృష్ణ ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఇంకో సినిమా తీయలేదు. ఎట్టకేలకు అతడి నుంచి ఓ సినిమా వచ్చింది. అదే.. అనుమాన పక్షి. రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోకు ప్రతి విషయంలోనూ విపరీతమైన అనుమానం. ఈ అనుమానంతో తన జీవితాన్ని ఎలా నరకప్రాయం చేసుకున్నాడన్నది చెప్పాలనుకున్నాడు దర్శకుడు. ఐతే హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో అతడి ఆలోచన బాగుంది కానీ, ఇలా ఒక కాన్సెప్ట్ తీసుకున్నపుడు.. పాత్రను సరిగా ఎస్టాబ్లిష్ చేయడం కీలకం. క్రేజీ సీన్లు రాసుకుని ఆ పాత్ర పట్ల ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడేలా చూడాలి. కానీ హీరో తన గురించి తనే నరేట్ చేసుకునే ఆరంభ సన్నివేశాలే తేలిపోయాయి. 


ఏమాత్రం నవ్వులు పండని సిచువేషన్లతో సినిమా మొదలైన పావు గంటకే ప్రేక్షకుల్లో అసహనం మొదలవుతుంది. రాగ్ మయూర్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. కానీ అతణ్ని ‘అనుమాన పక్షి’లో ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు విమల్ కృష్ణ

ఆ తర్వాత ఇలాంటి సినిమాను ఎంతమాత్రం ఊహించలేం. రైటింగ్ దగ్గరే ‘అనుమాన పక్షి’ తేలిపోయింది. కనీసం ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా ఆసక్తి రేకెత్తించేలా రాసుకోలేదు. ఇలాంటి స్క్రిప్టుతో సినిమా చేయడానికి ఇంతమంది ఎలా రెడీ అయిపోయారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. విమల్ టేకింగ్ గురించి కూడా చెప్పడానికి ఏమీ లేదు. చివరగా అనుమాన పక్షి.. అంతులేని అసహనం


6.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana pakshi movie review

అనుమానం పెనుభూతం' అనే పాత నానుడికి ఆధునిక సోషల్ మీడియా ధోరణులను జోడిస్తూ తెరకెక్కింటిన వినూత్న చిత్రమే 'అనుమాన పక్షి'. 'డీజే టిల్లు' ద్వారా గుర్తింపు పొందిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రి...

అనుమానం పెనుభూతం' అనే పాత నానుడికి ఆధునిక సోషల్ మీడియా ధోరణులను జోడిస్తూ తెరకెక్కింటిన వినూత్న చిత్రమే 'అనుమాన పక్షి'. 'డీజే టిల్లు' ద్వారా గుర్తింపు పొందిన విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో రాగ్ మయూర్ కథానాయకుడిగా నటించారు. ప్రతి చిన్న విషయానికీ అతిగా అనుమానపడే ఓ యువకుడి మనస్తత్వం, ఆ అలవాటు వల్ల అతడి జీవితంలో తలెత్తే ఊహించని విచిత్రమైన పరిస్థితులను కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఎదురైన చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రం.


మొత్తానికి 'అనుమాన పక్షి' అనేది అతి అనుమానం ఎలాంటి విచిత్రమైన సమస్యలకు దారితీస్తుందో చూపించే ఓ కొత్త తరహా కాన్సెప్ట్ డ్రామా. ఫస్టాఫ్‌లో వినోదం, సెకండాఫ్‌లో సస్పెన్స్, థ్రిల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొత్త తరహా కథాంశాలు, రాగ్ మయూర్ కామెడీ టైమింగ్, కశ్మీర్ బ్యాక్ డ్రాప్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ గా నిలుస్తుంది.

6.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie review

Sakshi

By Sakshi

'డీజే టిల్లు'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. వినోదాత్మక చిత్రంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, సినిమాలో కనీస స్థాయిలో క...

'డీజే టిల్లు'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. వినోదాత్మక చిత్రంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, సినిమాలో కనీస స్థాయిలో కూడా కామెడీ పండకపోవడం గమనార్హం. బలహీనమైన కథ, అస్పష్టమైన కథనం ఈ సినిమాకి ప్రధాన బలహీనతలుగా మారాయి.


నటుడు రాగ్ మయూర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినా, దానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. సునీల్ కుమార్ ఛాయాగ్రహణంలో కాశ్మీర్ లొకేషన్లు అత్యంత సుందరంగా, రిచ్‌గా కనిపిస్తాయి. నాసిరకం కంటెంట్‌ని సైతం తన ఎడిటింగ్ నైపుణ్యంతో గాడిలో పెట్టేందుకు చోటా కే ప్రసాద్ గట్టిగానే ప్రయత్నించారు. నిర్మాణ విలువలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, సరైన కథనాన్ని ఎంచుకోవడంలో నిర్మాతలు విఫలమయ్యారు. మొత్తానికి, 'అనుమాన పక్షి' ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.

3.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana pakshi movie review

After being postponed multiple times, Anumana Pakshi has finally hit the screens. Let’s look at its merits and demerits.Rag Mayur, who has appeared in several films as a comedian and supporting actor,...

After being postponed multiple times, Anumana Pakshi has finally hit the screens. Let’s look at its merits and demerits.


Rag Mayur, who has appeared in several films as a comedian and supporting actor, gets a full-length lead role here. Unfortunately, the film suggests that he is not yet ready to carry an entire movie on his shoulders.Despite running for less than two hours, the film feels much longer because of its sluggish narration and weak editing.


Highlights

None

Drawbacks

Boring narration

Laughless jokes

Cringe-worthy scenes

Weak writing and direction


Overall, Anumana Pakshi is painfully boring from beginning to end. It is meant to be a comedy, but it delivers far more irritation than laughter.


3.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie review

కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న రాగ్‌ మయూర్‌ ఇప్పుడు హీరోగా నిలబడుతున్నాడు. `కీడా కోలా`, `పరదా` చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన హీరోగా `అనుమాన పక్షి` మూవీ రూపొందింది. `డీజే టిల్లు` చిత్ర దర్శకుడు విమల్...

కామెడీ పాత్రలతో ఆకట్టుకున్న రాగ్‌ మయూర్‌ ఇప్పుడు హీరోగా నిలబడుతున్నాడు. `కీడా కోలా`, `పరదా` చిత్రాలతో మెప్పించాడు. ఇప్పుడు ఆయన హీరోగా `అనుమాన పక్షి` మూవీ రూపొందింది. `డీజే టిల్లు` చిత్ర దర్శకుడు విమల్‌ కృష్ణ రూపొందించిన చిత్రమిది. అనుమానంతో ఎలాంటి చిక్కులు వచ్చాయనేది, హీరో ఎలాంటి గందరగోళం క్రియేట్‌ చేశాడు, దీని వల్ల ఫన్ క్రియేట్‌ చేయడమనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. సింపుల్‌గా కథ ఇదే. ప్రారంభమే ఫన్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో పాత్రని, ఆయన అనుమానాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆవిష్కరించారు. 


కానీ కాసేపటికే ఇందులో కామెడీ లేదని అర్థమవుతుంది. రాగ్‌ మయూర్‌ చేసిన రచ్చనే ఉంటుంది తప్ప, ఒక్క సీన్‌లోనూ కామెడీ వర్కౌట్‌ కాలేదు. నటుడిగా రాగ్‌ మయూర్‌ బాగానే కష్టపడ్డా, ఆయన చేసే చేష్టల్లో కామెడీ జనరేట్‌ కాలేదు. ఇంకా చెప్పాలంటే దర్శకుడు కామెడీని రాబట్టడంలో ఫెయిల్‌ అయ్యాడు. ఫైనల్ గా ఏమాత్రం నవ్వించలేకపోయిన అనుమాన పక్షి. సినిమాలో చివర్లో ఒక డైలాగ్‌ ఉంటుంది. ఈ అనుమాన పక్షికి దూరంగా ఉండాలని. అది కరెక్ట్ గా ఈ సినిమాకి వర్తిస్తుంది. ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్.


2.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie review

‘అనుమాన పక్షి’ మూవీ రివ్యూ: 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' అత్యంత నాసిరకం కథ, కథనాలతో తీవ్రంగా నిరాశపరిచింది. ఇది కామెడీ సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు ఒక్క క్షణం కూడా నవ్...

‘అనుమాన పక్షి’ మూవీ రివ్యూ: 'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ నుంచి వచ్చిన 'అనుమాన పక్షి' అత్యంత నాసిరకం కథ, కథనాలతో తీవ్రంగా నిరాశపరిచింది. ఇది కామెడీ సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు ఒక్క క్షణం కూడా నవ్వు రాకపోవడం గమనార్హం. రాగ్ మయూర్ ఎంత కష్టపడినా స్క్రిప్ట్ వీక్‌గా ఉండటంతో ఫలితం దక్కలేదు. సునీల్ కుమార్ కాశ్మీర్ విజువల్స్ రిచ్‌గా ఉన్నప్పటికీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, నిర్మాతల గ్రాండ్ ప్రోడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయాయి. 


కంటెంట్ లేని కథను ఎంచుకుని దర్శకుడు విమల్ కృష్ణ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక సినిమాను రెండు గంటల లోపే ఎడిట్ చేయడం చిన్న రిలీఫ్. ఫైనల్ గా నిర్మాణ సంస్థ పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనిపించినా, సరైన కథ లేకపోవడంతో అది వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. ఫైనల్ వర్డ్.. చివరగా నవ్వించడంలో తడబడ్డ అనుమాన పక్షి. 

5.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie review

డీజే టిల్లు లాంటి సినిమాను అందించిన విమల్ కృష్ణ నుంచి అనుమాన పక్షి లాంటి నాసిరకం సినిమా వస్తుందని అనుకోలేదు. డైరెక్టర్ ఎంచుకొన్న కథ, కథనాలు, సన్నివేశాలు రాసుకొన్న విధానం అత్యంత దారుణంగా ఉండటం జీర్ణించ...

డీజే టిల్లు లాంటి సినిమాను అందించిన విమల్ కృష్ణ నుంచి అనుమాన పక్షి లాంటి నాసిరకం సినిమా వస్తుందని అనుకోలేదు. డైరెక్టర్ ఎంచుకొన్న కథ, కథనాలు, సన్నివేశాలు రాసుకొన్న విధానం అత్యంత దారుణంగా ఉండటం జీర్ణించుకోలేని విషయం. సినిమా మొత్తంలో కూడా ఓ నిమిషం కూడా తన మార్కు సీన్ కూడా కనిపించకపోవడంతో అసలు విమల్ కృష్ణ ఈ సినిమా దర్శకుడేనా? అతనే తీశాడా? అనే అనుమానం పట్టి పీడిస్తూనే ఉంటుంది. కామెడీ సినిమాగా రూపొందిన ఈ సినిమా ఓ క్షణం కూడా నవ్వు రాకుండా సన్నివేశాలను రాసుకోన్నారనే చెప్పాలి.


ఇక నటీనటుల విషయానికి వస్తే.. రాగ్ మయూర్ తన వంతుగా కష్టపడినా అందుకు తగినట్టుగా ఫలితం దక్కలేదు. కశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సన్నివేశాలను సునీల్ కుమార్ చక్కగా చిత్రీకరించాడు. సినిమా అంతా రిచ్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. ఇక చోటా కే ప్రసాద్‌కు ఈ సినిమా కత్తీ మీద సామే. కంటెంట్ లేకపోతే.. సినిమాను ఎడిటింగ్ చేయడం ఎంత కష్టమో ఈ సినిమా చూస్తుంటే అర్ధమవుతుంది. కానీ శాయశక్తులా ఈ సినిమాను గాడిన పెట్టే ప్రయత్నాన్ని చోటా చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ ఎలాంటి కథను ఎంచుకోవాలి? కథను ఎలా చెప్పాలనే విషయంలో పూర్తిగా నిర్మాతలు మిస్ అయ్యారని ఈ సినిమా చూస్తే స్పష్టమవుతుంది. ఈ సినిమా విషయంలో విమల్ కృష్ణ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు. ఫైనల్ గా ఇలాంటి సినిమాను చూడాలా? వద్దా? అనేది ప్రేక్షకుడి నిర్ణయానికే వదిలివేయాలి.


2.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu

Anumana Pakshi movie review

డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, యంగ్ హీరో రాగ్ మయూర్ కలయికలో వచ్చిన ఫన్నీ చిత్రం ‘అనుమాన పక్షి’. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదలైన కొంత సేపటికే చూసే ఆడియెన్...

డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, యంగ్ హీరో రాగ్ మయూర్ కలయికలో వచ్చిన ఫన్నీ చిత్రం ‘అనుమాన పక్షి’. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదలైన కొంత సేపటికే చూసే ఆడియెన్ కి విసుగు మొదలవుతుంది. అసలు యువ హీరో రాగ్ మయూర్ ఈ కథను ఎందుకు ఒప్పుకున్నాడా అనే సందేహం రాకమానదు. తన రోల్ పై మరింత ఫన్ ని జెనరేట్ చేసే పాజిబులిటీ ఉంది కానీ ఈ సినిమాలో అది బాగా మిస్ అయ్యింది. అలానే ఇతర పాత్రలతో కూడా అంతగా కనెక్ట్ అవ్వలేం.


రైటింగ్, సీన్స్, నాచురల్ కామెడీ ఇవన్నీ బాగా లోపించాయి. వీటితో తన వర్క్ డల్ గా అనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే, మొత్తంగా చూసుకుంటే ‘అనుమాన పక్షి’ థియేటర్స్ లో ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టే పేలవమైన చిత్రంగా మిగిలిపోయింది. రెండు గంటల లోపు రన్‌టైమ్, రాగ్ మయూర్ పంచిన లిమిటెడ్ ఫన్ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. పస లేని కథనం, కృత్రిమంగా అనిపించే ఫన్ సీన్స్, సంబంధం లేని పాత్రలతో సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. ముఖ్యంగా డీజే టిల్లు లాంటి మేజిక్ ఆశించి వెళ్తే ఆడియెన్స్ కి దర్శకుడు మాత్రం డిజప్పాయింట్ చేసే పంపుతాడు. సో ఈ సినిమా మెప్పించదు.


4.0
out of 9
1 week ago
Sep 26, 2026 Telugu
Why MRO?