Register as a Reviewer
Home Latest Movie Reviews

Latest Movie Reviews

The most recent reviews from top critics and publications

1584 Reviews
Showing 85–96 of 1584 reviews

The Paradise Movie Review

అతిగా చేసిన పనులు బెడిసికొట్టడమే కాదు... వారిపై నెగెటివ్‌ ఇంపాక్ట్ ను కూడా కలగ చేశాయి. తాజాగా విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్‌' విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా జన...

అతిగా చేసిన పనులు బెడిసికొట్టడమే కాదు... వారిపై నెగెటివ్‌ ఇంపాక్ట్ ను కూడా కలగ చేశాయి. తాజాగా విడుదలైన న్యాచురల్ స్టార్ నాని 'ప్యారడైజ్‌' విషయంలోనూ అదే జరిగింది. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా జనం ముందుకొచ్చిన ప్యారడైజ్ బిలో యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చినా గుర్తింపు నోచుకోలేని వాళ్ళ కథలు ఈ మధ్య కాలంలో మనం చాలానే చూశాం. నిజానికి 'పెద్ది' సినిమా బేసిక్‌ పాయింట్‌ కూడా అదే. అయితే అదే అంశాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరో కోణంలో చెప్పాడు.


అస్తిత్వ పోరాట గాథలలో ఎమోషన్ ప్రధానం. అది ఏ మాత్రం అటూ ఇటూ అయినా... హాస్యాస్పదంగా మారిపోతుంది. ఈ కథ చెప్పడానికి ఇంత దారుణ మారణకాండ అవసరమా? అనిపిస్తుంది. సినిమా రంగంలో మరో మెట్టు పైకి వెళ్ళాలనే ఎవరైనా అనుకుంటారు. కానీ మాస్ హీరో ఇమేజ్ కోసం పడే తాపత్రయంలో నాని ఎంచుకునే కథలే అందరినీ ఒప్పించలేకపోతున్నాయి. ఈ సినిమాలో జడల్‌ పాత్రకు అతను సంపూర్ణ న్యాయం చేశాడు. కానీ ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. నిజానికి ఈ సినిమాకు 'ది ప్యారడైజ్‌' అని కాకుండా 'సమ్మక్క' అని పెట్టి ఉంటే సబబుగా ఉండేది. ఇంత హైప్‌ క్రియేట్‌ కాకపోను! ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన జనాలు... ఏదో భిన్నమైన సినిమా చూశాం అని కొంతలో కొంత తృప్తి పడి ఉండేవారేమో! ఒకటి మాత్రం నిజం... ఈ సినిమాలోని పొలిటికల్‌ అంశాల కారణం, సెన్సార్‌ నిర్లిప్తత కారణంగా రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం.

5.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise Movie Review

క్రూరుడైన విలన్, నలిగిపోయే ప్రజా సమూహం, వారి రక్షణ కోసం తిరగబడే కథానాయకుడు... "ది ప్యారడైజ్" (The Paradise) కథాంశం పాతదే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దానిని ఆవిష్కరించిన తీరు super. విలనిజం, హీరోయిజ...

క్రూరుడైన విలన్, నలిగిపోయే ప్రజా సమూహం, వారి రక్షణ కోసం తిరగబడే కథానాయకుడు... "ది ప్యారడైజ్" (The Paradise) కథాంశం పాతదే అయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దానిని ఆవిష్కరించిన తీరు super. విలనిజం, హీరోయిజం సమపాళ్లలో మేళవించి తెరపై ఊరమాస్ విధ్వంసం సృష్టించారు.


కథానాయకుడి తెలంగాణ యాస కొంత తడబడినట్లు అనిపించినా, అంతగా ప్రభావం చూపకపోయినా... ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అల్టిమేట్! థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతుంది. సెకండాఫ్ కాస్త మందగించినా, అనిరుధ్ అందించిన విశ్వరూప బిజిఎమ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.


overall కథలో కొత్తదనం లేకపోయినా, ఊపిరిసలపని రా యాక్షన్ ఎలివేషన్స్‌తో మాస్ ఆడియన్స్, నాని అభిమానులకు ఈ చిత్రం I feast. ఫైనల్ గా ది ప్యారడైజ్ బిర్యానీ బాగుంది.. కానీ ఎదో మిస్సయింది.

5.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise Movie Review

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్‌గా చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ తాను చెప్పాలన...

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకొన్న కథను సింగిల్ పాయింట్‌గా చూస్తే ఫుల్ ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను కథగా విస్తరించి సన్నివేశాలు మలచే క్రమంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ తాను చెప్పాలనుకొన్న కథను పర్‌ఫెక్ట్ ఫ్లోలో చెప్పలేకపోయాడనే విషయం సినిమా స్టార్ట్ అయిన కొద్ది సేపటికే అర్ధమవుతుంది. అలా కథ నడిచిన కొద్ది ట్రాక్ మిస్ అవుతున్నాడనే విషయంపై ఫుల్‌గా క్లారిటీ వస్తుంది. సుబ్బలక్ష్మీగా కాయదు లోహర్ ఎంట్రీతో సినిమా చిన్న కుదుకులోనవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్న మంచి ఎమోషన్స్ డైల్యూట్ చేసేలా చేస్తుంది. 


ఇక ప్యారడైజ్ సినిమా ఫస్టాఫ్‌లోనే కథ ముగిసినంత పని చేశాడనే ఫీలింగ్ శ్రీకాంత్ ఓదెల కల్పించాడు. కానీ సెకండ్ హాఫ్ లో కథలో బలంగా చెప్పడానికి కంటెంట్ లేకపోవడంతో కాసేపు టైంపాస్ చేశాడా? అనే విధంగా కొన్ని సీన్లను సాదాసీదాగా నడిపించాడు. ఓవరాల్ గా మళ్లీ అదే నరుకుడు, హింస, రక్తపాతాన్ని కొనసాగించి.. కథను ఎమోషన్స్‌ తో చెప్పే ఛాన్స్‌ ను మిస్ చేసుకొన్నాడు. ఓవరాల్‌ గా నాని పెర్ఫార్మెన్స్, కాయదు గ్లామర్, మోహన్ బాబు యాక్టింగ్ సంతృప్తిని కలిగిస్తాయి. ఎక్కువ అంచనాలతో కాకుండా వెళితే.. ఫీల్‌గుడ్ మూవీని చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.


5.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise Movie Review

The Paradise takes a classic, time-tested storyline a ruthless villain, an oppressed community, and a savior rising for freedom - and transforms it into a raw, adrenaline - fueled theatrical spectacle...

The Paradise takes a classic, time-tested storyline a ruthless villain, an oppressed community, and a savior rising for freedom - and transforms it into a raw, adrenaline - fueled theatrical spectacle. Director Srikanth Odela delivers high - voltage heroism and a truly "next-level" interval fight sequence that will have single screens roaring.


While Nani's dialect feels a bit off at times and subplots like Priyadarshi’s entry miss the emotional mark, the film’s sheer energy easily overshadows its predictable plot. Backed by Anirudh’s thumping BGM and non-stop mass elevations, the second half may slow down slightly, but the overall experience is a whistle-worthy treat for Nani fans and mass movie lovers!


5.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise Movie Review

Tupaki

By Tupaki

దసరా సినిమాతో సంచలనం రేపిన నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన 'ది ప్యారడైజ్' ఆరంభం నుంచే మాంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్ప...

దసరా సినిమాతో సంచలనం రేపిన నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల కలిసి చేసిన 'ది ప్యారడైజ్' ఆరంభం నుంచే మాంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. తమకంటూ ఏ గుర్తింపు లేని ఒక జాతి.. ఆ గుర్తింపు కోసం చేసే పోరాటం.. ఆ క్రమంలో ఎదిగే ఒక నాయకుడు.. ఇలా ఫెమిలియర్ లైన్లోనే నడిచే ‘ది ప్యారడైజ్’ కథను డిఫరెంట్ స్టైల్లో చెప్పాలని చూశాడు శ్రీకాంత్. ఇందుకోసం అతను ఎంచుకున్న స్టైల్.. వయొలెన్స్. కానీ ఆ వయొలెన్స్ మరీ శ్రుతిమించిపోవడం.. కథలోని ఎమోషన్ అనుకున్నంతగా పండకపోవడం.. హీరో-విలన్ రెండు పాత్రలూ అనుకున్నంతగా క్లిక్ కాకపోవడంతో ‘ది ప్యారడైజ్’ అంచనాలను అందుకోలేకపోయింది. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ఈ సినిమా నిరాశపరుస్తుంది.


సన్నివేశాల టేకింగ్ అదిరిపోయినప్పటికీ వయొలెన్స్ వెనుక ఎమోషన్ మిస్ అవ్వడంతో సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. తన కథను కొంచెం పచ్చిగా చూపించాలనే దర్శకుడి ప్రయత్నాన్ని తప్పుబట్టలేం కానీ.. ఆ క్రమంలో మరీ హద్దులు దాటిపోవడంతో కొన్ని సన్నివేశాలను తట్టుకోవడం కష్టమవుతుంది. ఓవరాల్ గా ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాత.. ఎంతైనా కష్టపడే హీరో.. ఇంకా కోరుకున్న అన్ని వనరులు సమకూరినా.. రైటర్ - డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఉపయోగించుకోలేక పోయాడు. ఎన్నోసార్లు చూసిన కథకే మేకప్ వెయ్యాలని.. టేకింగ్ తో మ్యాజిక్ చెయ్యాలని చూశాడు కానీ ఆశించిన ఫలితం రాలేదు. కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా ఓవరాల్ గా శ్రీకాంత్ తనపై నెలకొన్న భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. చివరగా ప్యారడైజ్.. మాస్ ఓవర్ డోస్



5.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise movie review

teaser చూసినప్పుడే డిసైడ్ అయ్యా ఫస్ట్ డేనే వెళ్లాలని... ఇప్పుడే షో ఫినిష్ అయింది. and నాని 'ది ప్యారడైజ్' కథ కొత్తదేమీ కాదు. అణచివేతకు గురైన సమూహం నుండి ఒక నాయకుడు పుట్టుకురావడం అనే కాన్సెప్ట్‌ ను గతం...

teaser చూసినప్పుడే డిసైడ్ అయ్యా ఫస్ట్ డేనే వెళ్లాలని... ఇప్పుడే షో ఫినిష్ అయింది. and నాని 'ది ప్యారడైజ్' కథ కొత్తదేమీ కాదు. అణచివేతకు గురైన సమూహం నుండి ఒక నాయకుడు పుట్టుకురావడం అనే కాన్సెప్ట్‌ ను గతంలో ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రాసుకున్న హీరో-విలన్ ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్! మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్, అనిరుధ్ ఇచ్చే ఊరమాస్ బిజిఎమ్ థియేటర్లలో రచ్చ లేపాయి.


but హీరో తెలంగాణ యాస సరిగ్గా కుదరకపోవడం చిన్న మైనస్‌. సెకండాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై ఇవ్వలేకపోయింది. ఎమోషన్స్, రా యాక్షన్ సీన్స్ సినిమాకి బలంగా నిలిచాయి. ఓవరాల్‌ గా రొటీన్ కథే అయినప్పటికీ, శ్రీకాంత్ ఎగ్జిక్యూషన్ వల్ల సింగిల్ స్క్రీన్లలో మాస్ ఆడియెన్స్‌కి, నాని ఫ్యాన్స్‌కి ఇది ఒక పూనకాలు తెప్పించే movie.


6.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise movie Review

నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా గురించి చెప్పుకుంటే... కథ కొత్తదేమీ కాదు. ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు.. వాడి కింద నలిగే ఓ సమూహం.. అందులోంచి పుట్టుకొ...

నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా గురించి చెప్పుకుంటే... కథ కొత్తదేమీ కాదు. ఇది వరకు ఎన్నో చిత్రాల్లో చూసే ఉంటాం. అందరినీ గుప్పిట్లో పెట్టుకునే ఓ క్రూరుడు.. వాడి కింద నలిగే ఓ సమూహం.. అందులోంచి పుట్టుకొచ్చే నాయకుడు.. చివరకు ఆ నాయకుడు ఆ సమూహానికి స్వాతంత్ర్యం ఇప్పించడం.. ఓవరాల్‌గా చెప్పుకుంటే ప్యారడైజ్ కథ ఇదే. సినిమాలో మెయిన్ గా విలనిజం, హీరోయిజంకి సంబంధించిన సీన్లను అద్భుతంగా రాసుకుని, తెరకెక్కించడంలో శ్రీకాంత్ ఓదెల సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అదే ఈ సినిమాకి ప్రధానంగా కలిసి వచ్చే అంశం. ఇక ఇందులో శ్రీకాంత్ తన మెగా అభిమానాన్ని చాలా సీన్లలో చూపించాడు.


అయితే తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమానే అయినా.. హీరో మాట్లాడే తీరు మాత్రం తెలంగాణ యాసలా అనిపించదు. ఇంటర్వెల్ ఫైట్ అయితే నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది. ఇక శేఖరన్న పాత్రలో ప్రియదర్శి పాత్ర ఎంట్రీ, సవారీలను టెర్రరిస్టులుగా ముద్ర వేయడం ఇవన్నీ కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వవు. అయితే ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, అనిరుధ్ ఇచ్చే బీజీఎం హైలెట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత హై సెకండాఫ్ ఇవ్వలేకపోయినా.. ఓవరాల్‌ గా ప్యారడైజ్ సినిమా ఆడియెన్స్‌కి ఓ హై ఇస్తుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కి, నాని ఫ్యాన్స్‌కి అయితే ఓ ట్రీట్‌లా ఉంటుంది. ఇక సింగిల్ స్క్రీన్లలో పాటలకు, ఫైట్లకు ఆడియెన్స్‌కి ఊగిపోతారు. మరి కమర్షియల్‌గా ‘ప్యారడైజ్’ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 



6.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

The Paradise Movie Review

న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఎప్పటిలాగే, నాని అద్భుతంగా నటించాడ...

న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన సినిమా ‘ది ప్యారడైజ్’. కాగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఎప్పటిలాగే, నాని అద్భుతంగా నటించాడు. మోహన్ బాబు మాలిక్ పాత్రలో జీవించాడు. 1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్‌తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అయితే బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ‘ది ప్యారడైజ్’ రొటీన్ గా సాగుతూ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. 


హీరో – విలన్ ల మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. పలు సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో శ్రీకాంత్ కొన్ని చోట్ల విఫలం అయ్యారు. ఓవరాల్ గా ‘ది ప్యారడైజ్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో.. నాని నటన, వైల్డ్ యాక్షన్ సీన్స్ అండ్ హెవీ ఎమోషన్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ను మరియు నాని అభిమానులను మాత్రమే ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.


6.0
out of 9
1 week ago
Sep 24, 2026 Hindi

Immortal movie review

Immortal (starring GV Prakash Kumar and Kayadu Lohar) still manages to disappoint. What starts as a simple flat-sharing setup quickly collapses into a sluggish, highly predictable thriller that relies...

Immortal (starring GV Prakash Kumar and Kayadu Lohar) still manages to disappoint. What starts as a simple flat-sharing setup quickly collapses into a sluggish, highly predictable thriller that relies far too heavily on deafening background music rather than genuine suspense.


The first forty minutes are an absolute test of patience with weak pacing and flat character setups. While the interval twist attempts to shift gears, poor CGI creatures, illogical writing, and artificial supernatural rules kill the tension. Despite Kayadu Lohar's earnest efforts, this half-baked survival drama fails to deliver any real scares.



5.0
out of 9
1 week ago
Sep 22, 2026 Telugu

Immortal Movie review

Zero expectations tho Immortal first show ki velthe... pure surprise package bro!Starting 30 mins flat lo room - sharing concept thoni slow ga lag chesina, interval ki 20 mins mundhu nundi cinema comp...

Zero expectations tho Immortal first show ki velthe... pure surprise package bro!


Starting 30 mins flat lo room - sharing concept thoni slow ga lag chesina, interval ki 20 mins mundhu nundi cinema complete ga gear maarusthundi! Aah interval twist aithe mind-blowing! Second half till climax full engaging ga, tight survival thriller ga vellindi.


G.V. Prakash acting super, & Kayadu Lohar dual-shaded character lo racha lepindi. BGM peak level! Horror thakkuve aina, supernatural thriller vibe ki 100% worth watch!



7.0
out of 9
1 week ago
Sep 22, 2026 Telugu

Immortal movie review

Immortal : అసలు ఈ సినిమా రిలీజైనట్టే తెలీదు, నైట్ 10:50 షో Book my show లో చూసి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లా. కానీ థియేటర్ నుండి బయటకొచ్చాక... పక్కా Satisfied feeling..ఫస్టాఫ్ స్టార్టింగ్‌ లో 10 న...

Immortal : అసలు ఈ సినిమా రిలీజైనట్టే తెలీదు, నైట్ 10:50 షో Book my show లో చూసి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లా. కానీ థియేటర్ నుండి బయటకొచ్చాక... పక్కా Satisfied feeling..


ఫస్టాఫ్ స్టార్టింగ్‌ లో 10 నిమిషాల బ్యాక్‌స్టోరీ ఓకే, ఆ తర్వాత అర గంట కాస్త బోరింగ్‌గా సాగదీశారు. కానీ ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల నుండి కథ రేంజ్ మారిపోతుంది! అప్పటివరకు రూమ్ షేరింగ్ అనుకున్న సీన్ తిరగబడి, ప్రాపర్ థ్రిల్లర్ గేర్ మార్చుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ చివరి వరకు ఫుల్ ఎంగేజింగ్!


కయాదు లోహర్ గ్లామర్‌తో పాటు గ్రే షేడ్స్‌ ఉన్న రోల్‌లో మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జీవీ ప్రకాష్ నటన, శామ్ CS BGM (లౌడ్ ఉన్నా బిజియం కిల్లే) సీట్‌కి హుక్ చేసేశాయి. క్రీచర్ VFX కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉన్నా, మేజర్ హారర్ కాకుండా సర్వైవల్ థ్రిల్లర్‌గా వర్కవుట్ అయ్యింది.

overall.. స్టార్టింగ్ ఓపిక పడితే... ఇంటర్వెల్ ట్విస్ట్ నుండి క్లైమాక్స్ వరకు క్రేజీ థ్రిల్లింగ్ రైడ్!


5.0
out of 9
1 week ago
Sep 22, 2026 Telugu

Immortal Movie Review

ఇమ్మోర్టల్ రివ్యూ... జీవీ ప్రకాష్ కుమార్ అండ్ కాయదు లోహర్ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ మూవీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలిసి జీరో ఎక్స్పెటేషన్స్ తోనే థ్రిల్లర్ కి వెళ్ళాను. సినిమా ఎలా ఉంటుందో కూడా...

ఇమ్మోర్టల్ రివ్యూ... జీవీ ప్రకాష్ కుమార్ అండ్ కాయదు లోహర్ మెయిన్ రోల్స్ లో నటించిన ఈ మూవీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ అని తెలిసి జీరో ఎక్స్పెటేషన్స్ తోనే థ్రిల్లర్ కి వెళ్ళాను. సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ట్రైలర్ కూడా చూడలేదు. కానీ సినిమా చూసాక నాకైతే సాటిస్ఫైడ్ అండి, మూవీ నచ్చింది. స్టార్టింగ్ లో ఒక 10 మినిట్స్ బ్యాక్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ ఆన్ అవర్ కొంచెం స్లోగా బోరింగ్ అనిపిస్తుంది. ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ తో ఒక హౌస్ లో ఏదో జరుగుతూ ఉంటుంది కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తుంది సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. 


కానీ ఇంటర్వెల్ కి ముందు ఒక 20 టు 25 మినిట్స్ ఉందన్నప్పుడు అక్కడి నుండి మూవీ కంప్లీట్ గా గేర్ చేంజ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఎంగేజింగ్ గానే అనిపించింది నాకైతే. గ్రాఫిక్స్ కొన్ని ప్లేసెస్ లో కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి, స్టోరీ టెల్లింగ్ మాత్రం పర్లేదు బానే ఉంది, మరి వర్స్ట్ గా కూడా లేదు. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే స్టార్టింగ్ లో కాయదు లోహర్ గారి కొంచెం రొమాంటిక్ అండ్ గ్లామర్ పోర్షన్స్ ఉంటాయి. ఇక ఈ సినిమాకి కాయదు లోహర్ గారు మేజర్ ప్లస్ అండి. జీవీ ప్రకాష్ కుమార్ గారు కూడా ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. నాకైతే సాటిస్ఫైడ్. హారర్ మూవీ లాగా కాకుండా సూపర్ నేచురల్ థ్రిల్లర్ లాగా సినిమాని చూడాలి. 

6.0
out of 9
1 week ago
Sep 22, 2026 Telugu
Why MRO?