Latest Movie Reviews
The most recent reviews from top critics and publications
Sigma movie review
By Baswaraj
If you step into the theater with sky-high expectations just because it marks the directorial debut of Thalapathy Vijay's son, Jason Sanjay prepare for utter disappointment. This film is pure frustration on the big screen.
total story and movie is an outdated, rehashed concept that South Indian cinema has recycled for decades. Even Sundeep Kishan’s sincere efforts and action sequences cannot rescue a completely flat screenplay devoid of emotional depth. Faria Abdullah is reduced to a irrelevant placeholder, while the high-pitched background score and pacing drag only amplify the headaches.
It is baffling how Lyca Productions burned millions on such a hollow script. A big brand name and star lineage are no longer enough to sell lazy storytelling to today's audience. With his good looks, Jason Sanjay should honestly reconsider acting over directing.
Sigma movie review
Jason Sanjay డెబ్యూ అని, Lyca ప్రొడక్షన్స్ భారీగా ఖర్చు పెట్టారని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్తే... సీన్ కంప్లీట్ రివర్స్ అయింది!
1000 క్రోర్స్ మనీ కీ, వరుసగా జరిగే మర్డర్స్, హీరో మనీ కొట్టేయడం... ఈ ప్లాట్ దశాబ్దాలుగా చూసి చూసి బోర్ కొట్టేసిన రొటీన్ కాన్సెప్ట్. సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్, సిన్సియర్ ఎఫర్ట్స్‌తో సినిమాని కాపాడటానికి గట్టిగానే ట్రై చేశాడు కానీ, ఫ్లాట్ స్క్రీన్‌ప్లే ముందు ఏదీ వర్కౌట్ అవ్వలేదు.
Lyca వాళ్ళు అసలు ఈ రొటీన్ స్టోరీలో ఏం చూసి అన్ని కోట్లు వాటర్ లా ఖర్చు పెట్టారో నాకైతే అర్థం కాలేదు! బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా అని ఏది తీసినా చూడటానికి యూత్ ఏమీ పిచ్చివాళ్లు కాదు. జేసన్ సంజయ్ కి మంచి లుక్స్ ఉన్నాయి, కాబట్టి డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టింగ్ ట్రై చేస్తే బెటర్!
Sigma movie review
విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్, సందీప్ కిషన్ హీరో, లైకా ప్రొడక్షన్ అంటే ఏదో ఉందనుకుని థియేటర్‌కి వెళ్తే... క్లీన్ డిజైనింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ టార్చర్ అయింది నాకైతే..
1000 కోట్ల మనీ చుట్టూ తిరిగే క్రైమ్ డ్రామా అని ఎగ్జైట్ అయ్యాను కానీ, ఆ కీ కోసం జరిగే రొటీన్ డ్రామా, క్లూలెస్ స్క్రీన్‌ప్లే చూసి విపరీతంగా బోర్ కొట్టింది. సీన్ సీన్‌కి ల్యాగ్ పెరిగిపోతుంటే ఈ సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశా.
అసలు సందీప్ కిషన్ ఈ ప్రాజెక్ట్ ఎలా ఒకే చేశాడో అర్థం కాలేదు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరీ గోలగా ఉంది. జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా కంప్లీట్ ఫ్లాప్... ఆయన యాక్టింగ్‌లో ట్రై చేయడం బెటర్! మీ మనీ, టైం సేవ్ చేసుకోవాలంటే థియేటర్ వైపు వెళ్లకపోవడమే బెటర్.
Dont Trouble The Trouble Movie review
#DontTroubleTheTrouble A Troublesome Watch!
A concept with potential is narrated in such a boring way that it ends up being neither engaging nor entertaining. There is some heart in places, especially towards the end, but when the core plot is held back until the final 20 minutes, everything leading up to it needs to keep you invested, and this very slow paced narration rarely does. The director’s writing and execution often feel amateurish and oddly childish.
Fahadh Faasil tries, but there’s only so much he can do with the material, while his dubbing feels out of place at times. Not a memorable Telugu lead debut for him. Boring!
Rating: 2/5
Dont trouble the trouble movie review
By Devi Priya
#Review డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
ఫాంటసీ టచ్ కాన్సెప్ట్ వరకు ఫరవాలేదు
సింపుల్ పాయింట్ చుట్టూ అల్లుకున్న
కథ..ఏమిటి..ఎలా అన్నది
విశ్రాంతి వేళకు తెలిసిపోయింది.
ఫస్ట్ హాఫ్ ఒకె..ఒకె అనుకుంటే
సెకండాఫ్ మధ్యలో ట్రాక్ మారిపోయింది.
…
అక్కడి నుంచి క్రయిమ్ కామ్ స్టయిల్ లోకి వెళ్లి
ప్రీ క్లయిమాక్స్ దగ్గర ఎమోషనల్ టర్న్ తీసుకుంది.
మ్యాజిక్ ల వరకు ఒకె కానీ లాజిక్ లు
అవసరం అయిన చోట్ల కూడా పూర్తిగా వదిలేసారు
..
ప్లస్ పాయింట్లు
నటీనటుల నటన
మేకింగ్..ఎగ్జిక్యూషన్
…
మైనస్ పాయింట్లు
సెకండాఫ్ స్క్రిప్ట్
…
పంచ్ లైన్
డోంట్ గెట్ ఇన్ ద ట్రబుల్
Sigma movie review
వెయ్యి కోట్ల మనీ చుట్టూ తిరిగే కథ ఈ సిగ్మా. ఆ మనీని దక్కించుకునేందుకు కారణమైన కీ కోసం హీరో గ్యాంగ్, విలన్ల గ్యాంగ్ చేసే పోరాటమే ఈ మూవీ. ఓ వైపు క్రైమ్ స్టోరీ, మరోవైపు హీరో అప్పుల బాధతో బాధపడటం వంటి అంశాలతో సినిమా సాగుతుంది. రెండింటిని ప్యారలల్‌గా దర్శకుడు సినిమాని నడిపించాడు. కానీ దర్శకుడు జేసన్ కథనం విషయంలోనే చాలా కాంప్లికేటెడ్‌గా మార్చాడు. కథ ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా తీసుకెళ్లారు.
ఆయా సీన్లలో ల్యాగ్ ఎక్కువగా ఉంటుంది. గురు పాత్రలో సందీప్ కిషన్ నటించి మెప్పించాడు. పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కానీ ఆయన పాత్రలోని డ్రామా కూడా ఓవర్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సామ్ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. దర్శకుడు జేసన్ సంజయ్.. దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ ఇలాంటి సబ్జెక్ట్ ఎంపిక చేయడం మైనస్‌గా చెప్పొచ్చు. పైగా ఆకట్టుకునేలా తీయడంలో తడబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఫెయిల్ అయ్యాడు. ఫైనల్‌గా సినిమా చూశాక.. జేసన్ సంజయ్.. దర్శకుడిగా కంటే నటుడిగా ట్రై చేస్తే బెటర్ అనిపించింది. ఆడియెన్స్ సహనంతో ఆడుకున్న సిగ్మా. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా సక్సెస్‌కాలేకపోయారు.
Sigma movie review
By TV9 Telugu
తమిళ సూపర్ స్టార్, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక సామాన్యుడు భారీ దొంగతనం వ్యవహారంలో ఇరుక్కోవడం అనే పాయింట్ బాగానే ఉంది. హాలీవుడ్ తరహాలో క్యారెక్టర్లను కామిక్ బుక్ స్టైల్‌లో ఇంట్రడ్యూస్ చేసిన విధానం దర్శకుడి టేకింగ్‌ను చూపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్, సెకండాఫ్ వేగం పెరిగినప్పటికీ యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా ఇలాంటి హీస్ట్ థ్రిల్లర్స్‌కు లాజిక్స్ చాలా అవసరం. ఇక్కడ మాత్రం లాజిక్ మిస్సయింది.
అలాగే ఫైట్లలో తుపాకులు ఉన్నా కూడా కత్తులతో దాడులు చేసుకోవడం లాంటివి నమ్మశక్యంగా అనిపించవు. హాలీవుడ్ స్టైల్లో ఒక ఫిమేల్ క్యారెక్టర్‌ను మోసం, నమ్మకద్రోహం చేసేలా డిజైన్ చేసినా దాన్ని కూడా తెరపై సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. దర్శకుడు ఆలోచనలు బాగున్నా, రాసుకున్న స్క్రీన్ ప్లేలో నిలకడ లోపించడం సినిమాకు ప్రధాన మైనస్. లాజిక్స్ పక్కనపెడితే ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా కొన్ని చోట్ల బాగానే వర్కవుట్ అయింది. ఏదో విజయ్ వీరాభిమానులకు సంజయ్ ఎలా డైరెక్ట్ చేసాడో తెలుసుకుందాం అనుకుంటే ఓసారి ట్రయల్ వేయొచ్చు. ఓవరాల్‌గా సిగ్మా.. యాక్షన్ డ్రామా.. కానీ చాలా కండీషన్స్ అప్లై..!
Sigma movie review
By Gulte
Sigma movie review :
Vijay’s son, Jason Sanjay decided to become a film director instead of becoming a hero as expected by most people. When his debut directorial film Sigma was announced, people were surprised by his choice of a Telugu hero, Sundeep Kishan, to play the lead role in the film and a Telugu heroine, Faria Abdullah, to play the lead actress role.
Positives:
1. Nothing
Negatives:
1. Clueless Storytelling
2. Amateurish Direction
3. Outdated Writing
4. Loud Background Score
5. Excessive Slow Motion Shots
6. Unnecessary Item Song
Overall, with a bad first half and an equally bad second half, Sigma, tests your patience throughout its runtime and it definitely doesn’t deserve a watch not just in theatres but on OTT as well. Yes, pursuing passion is commendable but the first thing, Jason Sanjay, has to do is work as an assistant director for a handful of films for a few years, learn the craft, improve his writing skills and then attempt to make his second film as director. It may sound harsh but he’s not yet ready to direct a film and his lack of command in storytelling and direction, was to be seen in each and every sequence of, Sigma.
Sigma movie review
By Great Andhra
లేటెస్ట్ యాక్షన్ డ్రామా సిగ్మా సినిమా చూశాక ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది—స్టైలిష్ టీజర్, హై-వోల్టేజ్ టైటిల్ పెట్టినంత మాత్రాన సినిమాలో స్టఫ్ ఉన్నట్టు కాదు. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ కావడం, సందీప్ కిషన్ హీరోగా నటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, కానీ అవన్నీ థియేటర్లో కర్పూరంలా కరిగిపోయాయి.
వైజాగ్ బ్యాక్‌డ్రాప్ లో అప్పుల తిప్పలు, యూట్యూబ్ ఛానెల్, డ్రగ్స్ పెన్ డ్రైవ్, విలన్ ని బ్లాక్‌మెయిల్ చేయడం... ఇలా అరడజను పాత సినిమాల ప్లాట్లను కలిపి రుబ్బిన రొటీన్ కథ ఇది. హీరో సందీప్ కిషన్ తన యాక్షన్ సీన్స్ మరియు సిన్సియర్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నిలబెట్టడానికి గట్టిగానే కష్టపడ్డాడు, కానీ రొటీన్ కథనాన్ని ఆయన ఒక్కడే కాపాడలేకపోయాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను కేవలం పేరుకే పరిమితం చేశారు, ఆమె క్యారెక్టర్‌కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు.
ఫస్ట్ హాఫ్ అంతా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా దారుణమైన ల్యాగ్‌తో సాగుతుంది. ఎమోషనల్ సీన్లలో అసలు డెప్త్ లేదు, ఫ్లాట్ క్లైమాక్స్ ఇంకా పెద్ద హెడేక్. ఫైనల్ గా సుదీర్ఘమైన క్లైమాక్స్ చూస్తూ 5 సెకన్లకొకసారి ఎగ్జిట్ డోర్ వైపు చూసే పరిస్థితి దాపురించింది.
Sigma movie Review
By ABP Desam
దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది. 'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకే ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్‌లో జేసన్ సంజయ్ సినిమా తీశారని అర్థం అవుతోంది. హీరో అండ్ విలన్ మధ్య ఫైట్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్ (పిల్లి ఎలుక మధ్య ఆట)ను తలపించింది. చివరకు క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? అని ఎదురు చూసేలా చేశారు. కథ, కథనాల్లో హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. కానీ, ఆ స్థాయిలో చేయలేదు.
ఓవరాల్ గా విజయ్ తనయుడు జేసన్ సంజయ్, సందీప్ కిషన్ కలిసి కొత్త తరహా సినిమా తీసి ఉంటారని ఆశిస్తే... బాగా డిజప్పాయింట్ చేశారు. ఇంతకు ముందు సందీప్ కిషన్ పరిచయం చేసిన దర్శకులు తమ మార్క్ చూపించారు. కానీ జేసన్ సంజయ్ ఓల్డ్ స్టైల్ సినిమా చేశారు. 'సిగ్మా' టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టు సినిమా చివరిలో ఓ మాట చెప్పారు ఫరియా అబ్దుల్లా. ఆ డైలాగ్ ఎందుకు రాయించారో అర్థం కాదు. అప్పటి వరకు చూసిన సినిమా కూడా అర్థం కాదు. ఫైనల్ గా కమర్షియల్ ఫార్మాట్ లో తీసిన అవుట్ డేటెడ్ సినిమా ఈ 'సిగ్మా'.
Sigma movie review
By NTV Telugu
సందీప్ కిషన్ హీరోగా, దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ థియేటర్లలో విడుదలయ్యి యావరేజ్ టాక్ దక్కించుకుంది! వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో అప్పుల బాధల్లో ఉన్న హీరో గురు, అనుకోకుండా డ్రగ్స్ నెట్‌వర్క్ పెన్ డ్రైవ్ సాధించి ఇంటర్నేషనల్ స్మగ్లర్ వెంకట రెడ్డి (సంపత్ రాజ్)ని బ్లాక్‌మెయిల్ చేసే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సందీప్ కిషన్ తన సిన్సియర్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ... కొత్తదనం లేని కథ, ఆకట్టుకోని కథనం వల్ల దర్శకుడిగా జాసన్ సంజయ్ పూర్తిగా విఫలమయ్యాడు.
ఫస్ట్ హాఫ్ డల్ గా సాగడం, ఫరియా అబ్దుల్లా పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేకపోవడం, ఎమోషన్స్‌లో డెప్త్ మిస్ అవ్వడం మరియు పూర్ డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ సినిమాకు పెద్ద మైనస్‌గా మారాయి. క్లైమాక్స్ కూడా ఫ్లాట్‌గా ముగియడంతో సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. ఓవరాల్‌గా సందీప్ కిషన్ ఎఫర్ట్స్ కోసం మాత్రమే రెగ్యులర్ మూవీ గోయర్స్ ఒకసారి టైమ్‌పాస్ కి ట్రై చేయవచ్చు! చివరగా సిగ్మా ఒక రొటీన్ అండ్ బోరింగ్ హీస్ట్ డ్రామా!
Sigma movie review
తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా 'సిగ్మా' చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాతో ఆ సంస్థ జాతకం ఏమైనా కాస్త మారుతుందేమో అని భావించిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎక్కడో ఉన్న డబ్బు కోసం రెండు వర్గాలు గొడవ పడటం, దానికి సంబంధించిన క్లూ కోసం వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లడం... చివరకు హీరో ఆ మొత్తాన్ని హస్తగతం చేసుకోవడం... ఈ కాన్సెప్ట్ ఇప్పటికే దశాబ్దాల కాలంగా నలిగి నలిగి పోయింది. మళ్ళీ అదే కథను తీసుకుని అటూ ఇటూ తిప్పి జనాలకు చూపించాలనే ప్రయత్నం జేసన్ సంజయ్ చేశాడు.
అసలు జేసన్ సంజయ్ చెప్పిన కథలో ఏ కొత్తదనం చూసి లైకా సంస్థ ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అర్థం కాదు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. పై పెచ్చు కోట్ల రూపాయలను నీళ్ళ మాదిరి ఖర్చుచేయించాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ అని ఇవాళ్టి తరం చెబితే... జనాలు వినే పరిస్థితి లేదు. నిజానికి ముక్కు ముఖం బాగున్న జేసన్ సంజయ్ దర్శకత్వం కంటే నటన మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో!