ఇట్లు అర్జున (Itllu Arjuna)
Itllu Arjuna : ఈ అర్జునుడి "మూగ" ప్రేమ కీర్తిని గెలుస్తుందా? త్వరలో ప్రేక్షకుల ముందుకు...
Available in:
About This Movie
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన వెంకీ కుడుముల (Venky Kudumula) నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న మూవీ "ఇట్లు అర్జున" (Itlu Arjuna). అనీష్ (Aniesh) అనే కొత్త కుర్రాడు ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి ఇంతకు ముందు వచ్చిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ లభించగా, తాజాగా టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ టీజర్ సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతుంది.
ఇక టీజర్ చాలా రీఫ్రెషింగ్ గా ఉండి ఆకట్టుకుంటుండగా, ఈ సినిమాలో హీరో ఒక మూగవాడిగా కనిపించబోతున్నట్టు తెలిసిపోతుంది. ఇక హీరోయిన్ అనశ్వర రాజన్ చాలా క్యూట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే కథ పరంగా హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంటుందని తెలుస్తూనే ఉంది కానీ, మిగతా కథనం అర్ధం అయ్యేట్లు లేదు. కానీ టీజర్ కట్స్ మంచి అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. దానికి తగ్గట్టు థమన్ ఇచ్చిన బీజీఎమ్ కూడా బాగుంది.
ఇక ఇట్లు అర్జున ఒక లవ్ అండ్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా, ప్రొడ్యూసర్ గా మారిన వెంకీ కుడుములకిది తొలి సినిమా అని చెప్పాలి. ఈ సినిమాను అక్టోబర్ 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.