Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సింగీతం శ్రీనివాసరావు గారి "సింగ్ గీతం" మూవీ ఇప్పుడే చూసొచ్చా. నాకైతే సినిమా బాగా నచ్చింది సినిమా. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఒకటి అనిపించింది ఏంటో తెలుసా భయ్యా. మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయడం రావట్లేదు. అందుకే లెజెండరీ డైరెక్టర్ వచ్చి సినిమాలు ఎలా తీయాలో నేర్పించినట్టనిపించింది. సింపుల్ స్టోరీయే అయినా డైరెక్టర్ తన విజన్ తో మనకి బాగా అర్ధమయ్యేట్టు బాగాచూపించారు. అండ్ సినిమాలో ఎక్కడా కూడా ఒక సెకండ్ వెస్ట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అంటే అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు నాకు బెస్ట్ అనిపించింది ఈ సినిమా.
అండ్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ డిఎస్పీ. సీరియస్లి బ్రో సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బేసిగ్గా గోల్డ్ మైన్, చెట్టు సెంటిమెంట్ అంతా ఒకే గాని, దానికి మూలం, ఒక మనిషి ఆశ అత్యాశగా ఎప్ప్పుడు మారుతదో అప్పుడే నెక్స్ట్ వచ్చే తరాలు ఎంత నాశనమైతాయో సినిమాలో బాగా చూపించిన్రు. ఓవరాల్ గా ఇదంతా సింగీతం గారి మ్యాజిక్కె. ఎందుకంటే చాలా సినిమాలు రిస్క్ చేయకుండా, కొత్తదనం లేకుండా సేఫ్ జోన్ లో ఉండాలని మేకర్స్ ట్రై చేస్తారు. వాళ్లకి ఈ సినిమా చూపించాలి. అండ్ ఓవరాల్ గా సింగీతం సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకింత బాగా నచ్చుతదని.. సింగీతం శ్రీనివాసరావు గారు మళ్ళీ సినిమాలు చేస్తారో లేదో తెల్వదు గాని, ఈ సినిమాకైతే హ్యాపీగా వెళ్లిపోవచ్చు.
ఫస్ట్ థింగ్ ఫస్ట్.. "సింగ్ గీతం" సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి. సింగీతం గారి సినిమా నేను థియేటర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ల్టీ ఇలాంటి స్టోరీని మన ముందుకు తెచ్చినందుకు నాగ్ అశ్విన్ ని అభినందించాలి. ఇక సినిమాలో చెప్పినట్టు కుబేరపురంలో మాటలు పాటలుగా మారే శాపం నుండి ఊరి మొత్తం ఎలా బైటపడిందన్నదే మెయిన్ కాన్సెప్ట్. ఇక సింగీతం గారు ఈ సినిమాని చివరి వరకు ఒక అందమైన కథలా ప్రెజెంట్ చేసారు.
అండ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో లాస్ట్ హాఫ్ అన్ హవర్ అదిరిపోయింది. అండ్ ఈ సినిమాకి డిఎస్పీ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇక సినిమాలో కొంతమంది ఎంటర్టైన్మెంట్ తగ్గిందని, బోరింగ్ గా ఉందని అనుకోవచ్చు. బట్ సింగీతం మూవీస్ అన్ని అలా డీసెంట్ గానే ఉంటాయి. ఓవర్ గా అస్సలుండవ్. అండ్ సింగీతం గారు మళ్లీ మ్యాజిక్ చెసార్రా అంటూ మూవీ లవర్స్ హ్యాపీగా బైటికొచ్చారు. అండ్ సినిమాలో లాస్ట్ లో ఒక ఫేమస్ ఆక్టర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. దానికి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఫైనల్లీ సింగ్ గీతం సినిమాకి ఫ్యామిలీని, స్పెషల్లీ కిడ్స్ ని తప్పకుండ థియేటర్ కి తీసుకెళ్లండి.
పెద్ది మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు.. సినిమా గురించి చెప్పాలంటే సెట్టు సినిమా అనిపించింది.. అనే ప్రతి సీన్ న్యాచురల్ అని చెప్పి సెట్స్ వేసి తీశారు... అది మేజర్ మైనస్. రామ్ చరణ్ లాంటి స్టార్ ని పెట్టుకుని పాన్ ఇండియా మూవీ అని 300 కోట్లు పెట్టి తీసారని చెప్తే నమ్మేట్టు లేదు మూవీ క్వాలిటీ. నా ఫ్రస్టేషన్ ఏంటంటే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి మరి ఎక్కువ టికెట్ రేట్లకు పర్మిషన్ తెచ్చుకున్నారు. మరి ఆ రేంజ్ క్వాలిటీ ఇచ్చారా అంటే లేదు. సినిమా మొత్తం ఎలివేషన్లు, బోల్డ్ సీన్లు అస్సలు నచ్చలేదు.
ఇక సినిమాలో హీరో చేత కొన్ని బోల్డ్ డైలాగ్స్ చెప్పించారు అది చాలా వల్గర్ గా అనిపించింది. అండ్ నాకు తెలిసిన నార్త్ ఛానెల్ లో సినిమాలో వల్గారిటీ ఎక్కువ ఉందని హీరోహీరోయిన్లను అడిగితే మాకు తెలీదు అన్నారు అది మరింత నచ్చలేదు. ఎందుకంటే హీరోహీరోయిన్లు ఫైనల్ ఔట్ పుట్స్ చూడరా? ఆ మాత్రం తెలీదా? దీనికి బుచ్చిబాబు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ సినిమాలో హీరో అన్ని స్పోర్ట్స్ ఎంట్రీ ఇవ్వగానే అలా గెలిచేస్తూ ఉంటాడు. అది కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పట్నుంచి చాలా మంది వాళ్లకిష్టమైన స్పోర్ట్స్ లో సాధించాలని ట్రై చేస్తుంటే, హీరో మాత్రం ఎంట్రీ ఇవ్వగానే కొన్ని రోజులకే గెలిచేస్తుంటాడు. ప్రాక్టికల్ గా అలా ఎలా కుదురుతుంది. సో ఫైనల్లి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమాలో ఊరి ఎమోషన్ ని వాడుకుని రొటీన్ కమర్షియల్ ని దించారు అనిపిస్తుంది. అందుకే నాకస్సలు నచ్చలేదు.
పెద్ది మూవీ ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, రెహమాన్ గారు లేకపోతే ఈ సినిమా వేరే లెవెల్ డౌన్ అయ్యేది. ప్రాబ్లెమ్ ఏంటంటే సినిమాలో అంత కథ మెటీరియల్ ఇవ్వలేదు. ముందుగా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే బిగ్గెస్ట్ ప్లస్ రామ్ చరణ్. చాలా చాలా కష్టపడ్డారు. సినిమాకి బ్యాక్ బోన్ అయ్యారు. యాక్టింగ్ పరంగానే కాకుండా, ఫిజికల్ గా కూడా బెస్ట్ ఇచ్చారు. అండ్ రెహమాన్ కూడా అదిరిపోయే బీజీఎమ్ తో ప్రతి ఫ్రేమ్ ని ఎలివేట్ చేసాడు. బట్ ఫస్ట్ హాఫ్ లో మూడు నాలుగు సీన్లు మాత్రమే బాగున్నాయి. అండ్ ఆర్టిస్టులు ఒక్కరికి కూడా లిప్ సింక్స్ కుదరలేదు.
సెకండ్ హాఫ్ లో సినిమా ఒక రకంగా వెళ్తా ఉంటది. అండ్ జాన్వికపూర్ క్యారెక్టర్ వరెస్ట్ గా డిజైన్ చేసారు. అండ్ రామ్ బుజ్జి క్యారెక్టర్ లో దివ్యేన్దు ని ఎందుకు తీసుకున్నారో కూడా తెలీదు. ఓవరాల్ గా మంచి స్పోర్ట్స్ డ్రామాగా ఉండాల్సిన ఈ సినిమాని పెద్ద హీరో ఉన్నాడని, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేసి చెడగొచ్చారు బుచ్చిబాబు. littirally రామ్ చరణ్ సినిమాని కాపాడాడు. అలాగే జగపతి బాబు, శివన్న చాలా ప్లస్ అయ్యారు. బుచ్చిబాబు ఏం చెప్పాలనుకొన్నాడో తెలీదు గాని అంతా సగం సగం కనెక్ట్ అయ్యింది. ఓవరాల్ గా నాకు యావరేజ్ గా అనిపించింది.
ఇప్పుడే పెద్ది చూసొచ్చా. హార్ట్ ఫుల్ గా నాకనిపించింది చెప్తా.. ఫస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్ గా ఒక వేళ వేరే హీరో ఫ్యాన్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, వాంటెడ్ గా నెగిటివ్ చేద్దామని అనుకున్నవాళ్ళు కూడా నెగిటివ్ చేయలేకపోతారు. ప్రతి జెన్యూన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. సో సినిమా విషయానికి వస్తే ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ.
ఫస్ట్ ఈ మూవీలో ఇద్దరు హీరోలు. ఒకరు రామ్ చరణ్ గారు, నెంబర్ 2 హీరో ఎఆర్ రహ్మాన్ గారు, సోషల్ మీడియాలో రహ్మాన్ మీద వచ్చిన నెగిటివ్ చూసి ఏదో అనుకున్నాం, గాని, సినిమాలో ప్రతి సీన్ కి అదిరిపోయే ఎలివేషన్లతో పర్ఫెక్ట్ బీజీఎమ్ ఇచ్చాడు రెహమాన్. సినిమాలో నచ్చని పార్ట్ ఏదైనా ఉందంటే అది హీరోయిన్ పార్ట్. అండ్ సినిమాలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు సినిమాలో హీరోయిన్ రోల్ తప్ప, ఇది బాగాలేదని ఏం చెప్పలేం అంత బాగుంది పెద్ది సినిమా. కానీ డిస్సపాయింట్ ఏంటంటే ఒక 10 పెర్సెంట్ మూవీలో సీన్స్ గురించి ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యాయి. అందువల్ల కొన్ని సీన్స్ ముందే తెలిసిపోయి ఫీల్ మిస్ అయ్యాను. అవి తప్పితే అన్ని బాగున్నాయి మావ. ఓవరాల్ గా సినిమాని తప్పకుండా మీ ఫ్యామిలీతో చూసేయండి.
పెద్ది గాడు ఆడాడు, పోరాడాడు, ఖచ్చితంగా గెలిచాడు. ఇది చాలా రూటెడ్ స్టోరీ అండ్ చాలా ఎమోషన్స్ తో కూడుకున్న జెన్యూన్ ఈ మూవీ. ఈ సినిమాలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మన బుచ్చిబాబు, రామ్ చరణ్, రహ్మాన్, రత్నవేలు వాళ్ళ బెస్ట్ వర్క్ తో మనకు కనిపిస్తే వుంటారన్నమాట. సినిమాలో కొన్ని బోరింగ్ సీన్స్ కూడా ఉంటాయి, అలాగే జాన్వికపూర్ రోల్ కూడా అంతగా ఎక్కలేదు. అలాగే స్టోరీ కూడా చాలా సింపుల్ గా తీసుకున్నాడు బుచ్చి. ఇవి తప్ప మిగతా అన్నిటికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
నా వరకు చెప్పాలంటే ఆడియన్స్ ఇందులో ఉన్న ఎమోషన్స్ కి కనెక్ట్ అయితే సినిమా ఎంత ల్యాగ్ ఉన్నా కనెక్ట్ అవుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అయి ఫ్లో దెబ్బతింటుంది అనుకున్నా, ఈ సినిమా క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్ గా, ఎంగేజింగ్ గా పట్టుకెళ్ళాడు బుచ్చిబాబు. అండ్ సినిమాలో రామ్ చరణ్ చితక్కొట్టి, ఉతికారేసాడు అని చెప్పొచ్చు. every సీన్ లో తన బెస్ట్ వర్క్ ఇచ్చాడు. అండ్ జగపతి బాబు రోల్ సినిమాలో story టర్న్ చేసే రోల్. అలాగే శివన్న రోల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎఆర్ రెహమాన్ కూడా తన బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఓవరాల్ గా బుచ్చిబాబు టెక్నిషియన్స్, అండ్ యాక్టర్స్ నుండి అన్ని రకాలుగా టాలెంట్ ని పిండుకుని ది బెస్ట్ రూటెడ్ స్టోరీ ఉన్న మూవీ ఇచ్చాడు డైరెక్టర్. సింగల్ వర్డ్ లో చెప్పాలంటే ఈ మూవీలో ఎమోషన్ కి కనెక్ట్ అయితే పెద్ది గాడ్ని గుండెలలో పెట్టుకుని ఆడియన్స్ థియేటర్ బైటికి వస్తారు.
పెద్ది సినిమా గురించి చెప్పాలంటే గుడ్ బాగుంది సినిమా. మంచి కమర్షియల్ సినిమా, మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. స్పెషల్లీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా కనెక్టివ్ గా ఉంటది. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఐటెం సాంగ్ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. సినిమాలో హీరో తన ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాడు. కథ కోర్ పాయింట్ కూడా ఇదే. ఇక బుచ్చిబాబు స్క్రీన్ ప్లే కూడా బాగుంటది. బేసిగ్గా ఇదంతా ఒక రైలు కథ. సినిమాలో చాలా థింగ్స్ ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైందనిపిస్తుంది. ఎండింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది.
అయితే ఇండియాలో చాలా ఊళ్లలో సినిమాలో చూపించిన ప్రాబ్లెమ్ ఉంటది. అందుకే ఊరి వాళ్లకు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో చాలా సీన్స్ ఊహించినట్టే ఉంటాయి, కానీ కొన్ని సీన్స్ అన్ ఎక్స్పెటెడ్ గా ఉంటాయి. ఇక మ్యూజిక్ మీద కూడా ఏఆర్ రెహమాన్ గట్టి ఎఫర్ట్ పెట్టారు. రామ్ చరణ్ నెవర్ బిఫోర్ రేంజ్ లో బాగా చేసారు. ఇక శివన్న, జగపతి బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ కె సరైన రోల్ లేదు. డైరెక్షన్ పరంగా సింపుల్ కథనే తీసుకున్నా, బుచ్చిబాబు బాగానే హ్యాండిల్ చేసారు. అయితే హిందీలో ప్రాపర్ రిలీజ్ ఉంటె సినిమా రేంజ్ వేరేలా ఉండేది. అయినా లాంగ్ రన్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక పెద్ది కి నా రేటింగ్ 4.3/5
పెద్ది ఎలా అనిపించిందంటే... ముందుగా ఫస్ట్ షోల్డర్ మీద గద మోసినట్టు సినిమాని మోశాడు రామ్ చరణ్. మూవీ నుండి బయటికొచ్చాక కూడా చరణ్ మాత్రమే గుర్తొస్తాడు. ఎంతలా అంటే చరణ్ పెర్ఫార్మన్స్ గురించి వేలెత్తి మాట్లాడరు. కాకపోతే సినిమా కథలో కొత్తదనం లేదు. పలానా ఇలాంటి సీన్సే ఉండాలి, ఇలాగే కథ ఉండాలి అన్నట్టు చేసినట్టు ఉంది కానీ, ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేసేలా లేదు. ఇక సీన్స్ గురించి చెప్పుకుంటే ఇంట్రో సీన్, సాంగ్స్, ఫైట్స్ కూడా బానే ఉంటాయి. కానీ ఏదో మిస్ అవుతుందనిపిస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో కుస్తీ ఫైట్ సీన్ స్టార్ట్ అవగానే ఇక్కడినుండి సినిమా రియలిస్టిక్ గా ఉందనిపిస్తుంది. ఒక డివైన్ ఫీల్ వస్తుంది. బట్ బుచ్చిబాబు తన ఐడియాస్ స్క్రీన్ పై సరిగా చెప్పలేదు ఏదో మిస్ అయిందనిపిస్తుంది. పైగా కొన్ని విఎఫెక్స్ షాట్స్ కూడా బాగాలేవు. లిప్ సింక్స్ అయితే కొంతమంది కి అస్సలు సెట్ అవలేదు. అండ్ 350 cr బడ్జెట్ అంటే నమ్మేలా లేదు. ఎందుకంటే చాలా వరకు సెట్స్ వేసి తీశారు. ఇక జాన్వీ కపూర్ అచ్చియమ్మ ట్రాక్ కూడా అంత లేదు. ఇక విజువల్స్ గా సినిమా బాగుంది. జగపతి బాబు, శివన్న కూడా షైన్ అయ్యారు. అయితే బుచ్చిబాబు ఐడియాస్ బాగున్నా దాని ఎక్స్యూగుషన్ అంత లేదు. కానీ సినిమాలో ఒక హానెస్టీ ఉంటది. కొంచెం లైట్ ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి వెళ్తే మంచి సినిమా అన్న సంతృప్తితో బైటికొస్తారు.
దృశ్యం 3 మూవీ చూసాక సింపుల్ గా చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు. ఇక్కడితో దృశ్యం ప్రాంచైజ్ ని ఆపేస్తే బెటర్ అన్న ఫీల్ వచ్చింది. సినిమాలో పెద్దగా కథా, కథనాలు ఈ మూడో పార్ట్ లో అంతగా ఆకట్టుకోలేదు, పైగా చాలా ల్యాగ్ అనిపిస్తుంది. పైగా తెలుగు వెర్షన్ కి కనెక్ట్ అయిన ఆడియన్స్ ఒరిజినల్ కి కనెక్ట్ కాలేరు అంత ఈజీగా.
ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. డీసెంట్ గా వెళ్తున్న సినిమాను క్లైమాక్స్ వరకు లాక్కొని వెళ్ళాడు డైరెక్టర్. కానీ మూడో పార్ట్ లో హీరో జార్జ్ చేసే పనులకు ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవరు. ఎందుకంటే సప్రైజ్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లను కూడా ఆడియన్స్ కొన్ని ముందే ఇమాజిన్ చేసుకుంటారు. పైగా ఆ ట్విస్ట్ లకు విసిగిపోయారు. క్లయిమాక్స్ బాగున్నా, సినిమా మొత్తం ఫినిష్ అయ్యాక ఆలోచిస్తే పెద్దగా ఏం లేదనిపిస్తుంది. ఓవరాల్ గా మోహన్ లాల్ వన్ మ్యాన్ షోతో మూవీకి బ్యాక్ బోన్ అయ్యారు. టెక్నికల్లి మూవీ ఓకే. బట్ కొత్తగా చెప్పడానికి మూవీ మూడో పార్ట్ లో ఎం లేదు. ఒకసారి చూసేలా ఉంది గాని, మరో పార్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేసేలా లేదు.
దృశ్యం 3 మూవీ గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే సెకండ్ హాఫ్ నుండి పీక్స్ ఉంటది సినిమాలో. కానీ ప్రాబ్లెమ్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు అర్ధం కావు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మలయాళం వెర్షన్ కాబట్టి, తెలుగు వెర్షన్ వెంకటేష్ దృశ్యం చూసిన ఆడియన్స్ తొందరగా అర్ధం కాక, కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ చాలా మైనస్ అయింది. ఇంటర్వెల్ తప్పిస్తే మొత్తం డొల్ల. పైగా డబ్బింగ్ వరెస్ట్ గా ఉంది.
ఇక కథలోకి వెళ్ళడానికి కూడా చాలా టైం తీసుకోవడం మైనస్. సెకండ్ హాఫ్ కూడా బుర్రపాడు. కానీ ఒరిజినల్ ని ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ రాడ్ అయినా, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వా.. అన్న ఫీలింగ్ వస్తుంది. పైగా పార్ట్ 4 కి కూడా లీడ్ ఇచ్చారు. బట్ మెజారిటీ ఆడియన్స్ దృశ్యం ఇక్కడితో ఆపేస్తే బెటర్ అన్న కామెంట్స్ వస్తున్నాయి. యాక్టింగ్ వరకు అందరూ బాగా చేసారు. సో మోస్ట్ లీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాది. ఓవరాల్ గా ఈ మూవీకి 3.5 వరకు రేటింగు ఇవ్వొచ్చు.
సూర్య లీడ్ రోల్ లో నటించిన వీరభద్రుడు మూవీ చూసాక సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. అయితే స్టోరీ లో ఏమాత్రం కొత్తదనం ఉండదు. కానీ కమర్షియల్ మూవీస్ చాలు ఎంజాయ్ చేయొచ్చు, సూర్య ఫ్యాన్స్ కి ఎలివేషన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి మూవీ నాచొచ్చు. అయితే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయితే సీన్లు బానే ఉంటాయి. కానీ స్టోరీ వైస్ గా చూస్తే నచ్చకపోవచ్చు. సినిమా చూస్తే డైరెక్టర్ ఆర్ జె బాలాజీ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసాడని తెలుస్తుంటే ఉంటుంది.
సరిగా గమనిస్తే... సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఓ స్టోరీ, సెకండ్ హాఫ్ లో మరో స్టోరీ ఉంటుంది. అది ఒక రకంగా మైనస్ అవచ్చు. ఇక సూర్య పెర్ఫార్మన్స్ పరంగా అదరగొట్టాడు. విలన్ గా నటించిన అర్జె బాలాజి పర్వాలేదన్పించాడు. సాంగ్స్ అంత బాలేవు. తమిళ్ నేటివిటీ మసాలా ఎక్కువయింది. ఓవరాల్ గా వీరభద్రుడు సూర్య ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. బట్ నార్మల్ ఆడియన్స్ గురించి చెప్పలేం. అయితే క్రేజీ సినిమాలు ఏమి ఈ మధ్య కాలంలో రాలేవు కాబట్టి, సూర్య వీరభద్రుడు సినిమాని ఓసారి టైంపాస్ కి చూసేయొచ్చు.
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన వీరభద్రుడు సినిమా రివ్యూ విషయానికి వస్తే... సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ సూర్య. సూర్య రోల్ చాల పవర్ ఫుల్ క్యారెక్టర్. కాకపోతే ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ వల్లే ఈ సినిమా స్టోరీ అంత బాగాలేదనిపిస్తుంది. ఇక స్టోరీ స్టార్ట్ అవుతూనే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ అంతే ఇంట్రెస్టింగ్ గా స్టోరీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు డైరెక్టర్. కథ పరంగా స్టోరీ ఫస్ట్ హాఫ్ కే ఎండ్ అయిపోయిన ఫీల్ వస్తది.
ముఖ్యంగా అర్జె బాలాజీ ఫస్ట్ హాఫ్ లో రాసుకున్న స్క్రిప్ట్ కి సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రిప్ట్ కి సంబంధమే ఉండదు. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ అంతగా ఇంపాక్టుబుల్ గా లేవు. మెయిన్ గా విలన్ క్యారెక్టర్ తేలిపోయింది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ లౌడ్ గా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే పవర్ఫుల్ గా బాగానే ఉంది. కానీ స్టోరీ వైస్ గా చూస్తే, ఆడియన్స్ ని ఎంగేజింగ్ గా ఉంచే స్క్రిప్ట్ పరంగా ఏమి వర్కౌట్ అవలేదని అనిపిస్తుంది. ఓవరాల్ గా ఫ్యాన్స్ మినహా మిగతా ఆడియన్స్ కనెక్ట్ అవడం కష్టమే.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers