Register as a Reviewer
ఇరుముడి (Irumudi)

ఇరుముడి (Irumudi)

21 Aug 2026
Overall Rating
7.1/10
30 Reviews

Irumudi : ఫైనల్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన "ఇరుముడి" సినిమా థియేటర్లలో విడుదలైంది. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఎలాగైనా కం బ్యాక్ ఇవ్వాలని, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేతులు కలిపాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Shiva Nirvana
Cast: Mass Maharaja Raviteja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra & Others

Available in:

Reviews

What critics and the public are saying about ఇరుముడి (Irumudi)

Media Reviews

23 Avg: 7.0/10
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
7

Hit

Irumudi Movie Review

ఇరుముడి... 2 hours 25 minutes తో థియేటర్లో రిలీజ్ అయింది. పాయింట్ కొస్తే ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా తీశారు.. ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ ఒచ్చింది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. చాలా రోజులకి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ బైటికి వచ్చాను. స్లో గా కాకుండా స్పీడ్ గా...

ఇరుముడి... 2 hours 25 minutes తో థియేటర్లో రిలీజ్ అయింది. పాయింట్ కొస్తే ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా తీశారు.. ఒక మంచి సినిమా చూసానన్న ఫీలింగ్ ఒచ్చింది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. చాలా రోజులకి కళ్ళలో నీళ్లు తిప్పుకుంటూ బైటికి వచ్చాను. స్లో గా కాకుండా స్పీడ్ గా వెళ్లే మలయాళం మూవీ లా అనిపించింది. అండ్ మాస్ అండ్ క్లాస్ గా సినిమా అనిపించింది. ఎక్కడా చాలా సినిమాల్లో సనాతన ధర్మం అంటూ దేవుడ్ని వాడుకుని సినిమా తీస్తారేమో అనుకున్నా... కానీ స్టోరీలో భక్తిని చూపించారు గాని, వాడుకోని హిట్ కొట్టెయాలని కాదు... 


ఇక రవితేజ గారు నెల రోజుల్లో ఫినిష్ అయ్యే సినిమాలు కాకుండా.. ఇలాంటి సూట్ అయ్యే కామన్ మ్యాన్ రోల్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక రవితేజ గారు చాలా న్యాచురల్ గా చేసారు. తండ్రి కూతుళ్ళ అనుబంధం చాలా బాగా తీశారు. అండ్ సాంగ్స్ సూపర్ ప్లస్ అవుతాయి. జివి ప్రకాష్ బీజీఎమ్ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగా తీశారు. కాకపోతే మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమాటిక్ లిబర్టీని బాగా తీసుకున్నారు. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు. మిగతా అంతా బాగుంది. ఓవరాల్ గా ఇరుముడి వర్త్ వాచబుల్ మూవీ. 

Aug 21, 2026 Watch
Barbell Pitch Meeting
Barbell Pitch Meeting Youtube Channel
6

Above Average

Irumudi Movie Review

ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజ గారిని after maybe 10, 12 films తర్వాత అనుకుంటా... చాలా కొత్తగా చూసాను. ఇలాంటి పాత్రలు చేయాలి ఆయన. అలాగని సినిమా మరీ బాగుందని కాదు... కష్టమే... సింపుల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఇదొక థ్రిల్లర్ మూవీ. డివోషనల్ ఎలిమెంట్స్ కొంచెం ఉంటాయి కానీ... ఇలా చాలా ఉంటాయి సినిమ...

ఇరుముడి మూవీ రివ్యూ... రవితేజ గారిని after maybe 10, 12 films తర్వాత అనుకుంటా... చాలా కొత్తగా చూసాను. ఇలాంటి పాత్రలు చేయాలి ఆయన. అలాగని సినిమా మరీ బాగుందని కాదు... కష్టమే... 


సింపుల్ గా సినిమా గురించి చెప్పాలంటే ఇదొక థ్రిల్లర్ మూవీ. డివోషనల్ ఎలిమెంట్స్ కొంచెం ఉంటాయి కానీ... ఇలా చాలా ఉంటాయి సినిమాలో... ముందుగా ఏం బాగున్నాయో మాట్లాడితే.. రెండు పాటలైతే చాలా బాగున్నాయి. అండ్ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. కాకపోతే సినిమాలో మాల వేసినప్పుడు కొన్ని రూల్స్ గురించి సినిమాలో చెప్పిస్తారనుకున్నాను... అంటే నిష్ఠ గురించి.. పెద్దగా ఏం చూపించలేదు. 


అండ్ సినిమా మొత్తం గురించి ఆలోచిస్తే.. ఒక్కటే ఒక్క పాయింట్ పెట్టుకున్నారు... రంగస్థలం సినిమాలో ట్విస్ట్ లాగానే.. ఇందులో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. తీయడం అయితే చాలా సిన్సియర్ గా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. కానీ సస్పెన్స్ వర్కౌట్ కాలేదు. విజయ్ సేతుపతి గారి ఒక మూవీకి సెమిలర్ గా ఈ సినిమా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా బాగా తీశారు. కానీ ముందే తెలిసిపోతుంది. ఓవరాల్ గా పెద్దగా ఎంటర్టైన్మెంట్ అనిపించలేదు. 

Aug 21, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
7

Hit

Irumudi Movie Review

సో రవితేజ గారి ఇరుముడి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ బెస్ట్ రవితేజ మూవీ since forever బ్రో. ముఖ్యంగా సినిమాలో అనవసరమైన ఎలివేషన్లు పెద్దగా ఏం లేవు.. మంచి భక్తిభావం ఉన్న సీన్లు పెట్టి అయ్యప్ప సీన్స్ తో పాటు ఒక సూపర్ డ్రామా నడించింది. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం స్లో ఉందని కొం...

సో రవితేజ గారి ఇరుముడి మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఇది పర్ఫెక్ట్ బెస్ట్ రవితేజ మూవీ since forever బ్రో. ముఖ్యంగా సినిమాలో అనవసరమైన ఎలివేషన్లు పెద్దగా ఏం లేవు.. మంచి భక్తిభావం ఉన్న సీన్లు పెట్టి అయ్యప్ప సీన్స్ తో పాటు ఒక సూపర్ డ్రామా నడించింది. అది నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం స్లో ఉందని కొందరు అనుకోవచ్చు, కానీ నాకు నచ్చింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని థ్రెట్స్ ఉంటాయి. అవి బాగా రాసుకున్నారు. అండ్ కొన్ని డార్క్ ఎలిమెంట్స్ ని కూడా బాగా రాసారు. 


అండ్ సినిమాలో టెక్నికల్లి హీరో రవితేజ స్వామి మాల వేసుకున్నాక ఉండే నిస్సహాయతని బాగా చూపించారు. కొన్ని సీన్లు పెట్టాలి అన్నట్టు కాకుండా ఆ సీన్స్ కి మంచి మీనింగ్ ఉన్నట్టు పెట్టారు. అండ్ ఎక్కడా మితిమీరలేదు. అండ్ కొన్ని సినిమాటిక్ లిబర్టీ సీన్స్ ఉంటాయి. రొటీన్ గా ఉన్నా వర్కౌట్ అయ్యాయి. అండ్ రవితేజ లాస్ట్ బెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ కంటే చాలా బెస్ట్ మూవీ ఇది. ఇక సినిమాలో ఎమోషన్ చాలా బాగుంది. అండ్ శివ నిర్వాణ పర్ఫెక్ట్ డైరెక్షన్ ఈ మూవీ. మజిలీ కంటే కూడా ఈ సినిమా బాగా అనిపించింది. ఓవరాల్ గా నైస్ రా మంచి సినిమా పడింది అన్న ఫీల్ వచ్చింది. 

Aug 21, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
7

Hit

Irumudi Movie Review

ఇరుముడి... first things first... సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇది చాలా ట్రిక్కీ ఫిలిం అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని 3 జోనర్స్ లో డివైడ్ చేస్తే... ముందుగా అందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా... చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగుంది. రవితేజ రోల్ డిజైన...

ఇరుముడి... first things first... సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇది చాలా ట్రిక్కీ ఫిలిం అండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని 3 జోనర్స్ లో డివైడ్ చేస్తే... ముందుగా అందులో ఒకటి ఫ్యామిలీ డ్రామా... చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ చాలా బాగుంది. రవితేజ రోల్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. రెండోది ఆ డివోషనల్ టచ్. మరీ ఓ రేంజ్ లో వాడుకున్నట్టు కాకుండా, ఎక్కడా తప్పులేకుండా సహజంగా చూపించారు. అండ్ మూడోది థ్రిల్లర్ అంది.. సెకండ్ హాఫ్ లో ఒక మెయిన్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కి సప్రయిజ్ అవుతారు. 


రివెంజ్ డ్రామా... ఇదొక్కటి మనకు రొటీన్ ఫీల్ ఇస్తుంది. అవి కథకు అవసరమా అని కూడా అనిపిస్తుంది. అండ్ మూవీ ఎండ్ చేసిన విధానం కూడా అంతగా తీసుకోలేకపోయాను. బట్ ఓవరాల్ మూవీ బాగుంది. రవితేజకి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. 

Aug 22, 2026 Watch
T2B Live
T2B Live Website
7

Hit

Irumudi Movie Review

ముందుగా "ఇరుముడి" కచ్చితంగా రవితేజ నుండి వచ్చిన రీసెంట్ బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు. కథ పాయింట్ ఆసక్తిని కలిగించగా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ ని బలంగానే చెప్పాడు, కానీ...

ముందుగా "ఇరుముడి" కచ్చితంగా రవితేజ నుండి వచ్చిన రీసెంట్ బెస్ట్ కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. మంచి స్క్రిప్ట్ ఉంటే రవితేజ ఏ రేంజ్ లో రేచ్చిపోతాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు. కథ పాయింట్ ఆసక్తిని కలిగించగా స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే డైరెక్టర్ చెప్పాలి అనుకున్న పాయింట్ ని బలంగానే చెప్పాడు, కానీ కొంచం అది హార్ట్ హిట్టింగ్ లెవల్ లో అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్స్ కూడా ఎమోషనల్ గా హార్డ్ హిట్టింగ్ లెవల్ లో ఉంటాయి. అవి ఆడియన్స్ ఎక్స్ పెర్ట్ చేయరు. కానీ ఇదే సినిమాకి మేజర్ గా ప్లస్ అయింది అని చెప్పొచ్చు.


అయ్యప్ప స్వామీ పాటలు రెండూ కూడా సినిమాలో హైలెట్ అనిపించాయి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచం స్లో గా అనిపించింది. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా కొంచం ఎలివేట్ చేసేలా ఉంటే బాగుండేది. రవితేజతో పాటూ చిన్న పాప బాగా నటించింది. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఓవరాల్ గా రీసెంట్ టైంలో రవితేజ నుండి వచ్చిన మూవీస్ లో ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. మరీ ఎక్కువ అంచనాలతో కాకుండా నార్మల్ గా థియేటర్స్ కి వెళితే కచ్చితంగా అంచనాలను అందుకుని మెప్పిస్తుంది సినిమా. 

Aug 22, 2026 Read Review
One India
One India Website
7

Hit

Irumudi Movie Review

వరుస పరాజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'ఇరుముడి'. ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం, గ్రామంలో చిన్న పిల్లలకు ఎదురయ్యే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓ ఆదర్శవంతమైన తండ్రిగా రవితేజ, ఆయన కూతురుగా బేబీ నక్షత్ర ఈ స్టోరీకి ప్...

వరుస పరాజయాల తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'ఇరుముడి'. ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అనుబంధం, గ్రామంలో చిన్న పిల్లలకు ఎదురయ్యే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓ ఆదర్శవంతమైన తండ్రిగా రవితేజ, ఆయన కూతురుగా బేబీ నక్షత్ర ఈ స్టోరీకి ప్రాణప్రతిష్ట చేశారు. వరుస డిజాస్టర్ల అనంతరం రవితేజ తన వయస్సుకు తగ్గ, నటనకు ఆస్కారం ఉన్న పాత్రను ఎంచుకుని అద్భుతమైన నటనను కనబరిచాడు. 


ఇక స్టోరీలోన బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను చివరి వరకు సీటును కట్టిపడేస్తాయి. ఇక ఇరుముడి సినిమా చివరి 20 నిమిషాల్లో వచ్చే తండ్రీ కూతుళ్ల క్లైమాక్స్ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టిస్తాయి. థ్రిల్లర్ సీన్లలో కొంత ఉత్కంఠ కొరవడినప్పటికీ, రవితేజ నటన, బలమైన ఎమోషనల్ కనెక్ట్, క్లైమాక్స్ దృశ్యాలు 'ఇరుముడి' చిత్రాన్ని తప్పక చూడదగినదిగా నిలబెట్టాయి.

Aug 21, 2026 Read Review
10TV Telugu
10TV Telugu News Channel
7

Hit

Irumudi Movie Review

రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని "ఇరుముడి"ని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్...

రవితేజతో శివ నిర్వాణ సినిమా అని, అయ్యప్ప మాల బ్యాక్ డ్రాప్ అని "ఇరుముడి"ని ప్రకటించడంతోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగున్నాయి. అయ్యప్ప మాలలు వేసే భక్తులు ఆ సీన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ సీక్వెన్స్ లు అన్ని బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులను ఏడిపించేసారు. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, కూతుళ్లు అన్ని ఇంట్లో వాళ్లకు చెప్పాలి అని మెసేజ్ ని చాలా చక్కగా చూపించారు. అయితే ఆ అమ్మాయిల సంబంధించిన సీన్స్ కొంత ఇబ్బందిగా, హార్డ్ హిట్టింగ్ గా అనిపించవచ్చు కొంతమందికి. 


సినిమా అంతా అయిపోయిన తర్వాత ఏదో అసంతృప్తి అనిపిస్తుంది. కానీ చివర్లో మణికంఠ పాత్ర చెప్పిన ఒక్క డైలాగ్ తో సినిమా పరిపూర్ణం అయింది అనే ఫీల్ వస్తుంది. ఇటీవల సినిమా థియేటర్స్ నుంచి ఏడుస్తూ బయటకువచ్చిన సినిమాలు రాలేదు. చాన్నాళ్ల తర్వాత ఒక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఏడుస్తూ బరువైన హృదయంతో బయటకు వస్తారు. అయితే కమర్షియల్ గా చూస్తే ఈ సినిమాని కార్తీక మాసం, అయ్యప్ప మాల సీజన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ హైప్, రీచ్ వచ్చేది. చాన్నాళ్ల తర్వాత రవితేజ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూడొచ్చు. మొత్తంగా ‘ఇరుముడి’ తన కూతురు, ఊళ్ళో ఆడపిల్లల కోసం నిలబడే ఓ మిడిల్ క్లాస్ తండ్రి కథ అయ్యప్ప స్వామి మాలతో యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ సినిమాగా మెప్పిస్తుంది.


Aug 21, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

Irumudi Movie Review

నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.. "ఇరుముడి" సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్...

నిజాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. వాటిని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు.. "ఇరుముడి" సినిమాలో అలాంటి కఠినమైన నిజాలని చెప్పాడు శివ నిర్వాణ. ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందా లేదా అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తీసాడు. ఆడపిల్ల తండ్రులకు ఈ సినిమా చూస్తున్నప్పుడు భయమేస్తుంది.. అలాంటి కొన్ని మనసును హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్నా కూడా ఇది పక్కా కమర్షియల్ సినిమా. తెలిసిన కథనే కానీ సరికొత్త స్క్రీన్ ప్లేతో చెప్పాడు శివ నిర్వాణ.. 


ఆడపిల్లకు భయం ఉండకూడదు అనే లైన్ ఈ సినిమాతో చెప్పాలనుకున్నాడు శివ. దానికి రవితేజ లాంటి యాక్టర్ తోడయ్యేసరికి మెసేజ్ బాగానే పాస్ అయింది. ఎమోషనల్ సినిమా కాబట్టి స్లోగానే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ఇరుముడిలో లోపాలు కూడా బాగానే ఉన్నాయి.. కానీ వాటిని కంటెంట్ తో కవర్ చేశాడు శివ నిర్వాణ. ఈ క్రమంలో అక్కడక్కడ ఆయన స్లో అయ్యాడు కానీ ఓవరాల్ గా మంచి మెసేజ్ ఇచ్చాడు. ఓవరాల్ గా ఇరుముడి.. మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా..!


Aug 21, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
7

Hit

Irumudi movie review

రవితేజ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించామా? మాస్ ఎలిమెంట్స్‌కు దూరంగా.. ఓ తండ్రి ఆవేదన, కూతురిపై ప్రేమ, అన్యాయంపై తిరుగుబాటును కథగా ఎంచుకున్నాడు శివ నిర్వాణ.‘ఇరుముడి’ కథ మొదలయ్యేది చాలా సింపుల్‌గా. త్రినాథ్ ఓ సాధారణ వ్యక్తి. కుటుంబమే అతడి ప్రపంచం. కానీ తన కూతురి జీవితంలో జరిగే ఓ విషాద ఘటన అతడిని...

రవితేజ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించామా? మాస్ ఎలిమెంట్స్‌కు దూరంగా.. ఓ తండ్రి ఆవేదన, కూతురిపై ప్రేమ, అన్యాయంపై తిరుగుబాటును కథగా ఎంచుకున్నాడు శివ నిర్వాణ.

‘ఇరుముడి’ కథ మొదలయ్యేది చాలా సింపుల్‌గా. త్రినాథ్ ఓ సాధారణ వ్యక్తి. కుటుంబమే అతడి ప్రపంచం. కానీ తన కూతురి జీవితంలో జరిగే ఓ విషాద ఘటన అతడిని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ఘటన వెనుక దాగి ఉన్న నిజాలను బయటకు తీసే కొద్దీ.. కథ వ్యక్తిగత సమస్య నుంచి పెద్ద పోరాటంగా మారుతుంది.


ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, కుటుంబ ఎమోషన్స్‌పై ఫోకస్ చేసిన సినిమా.. సెకండాఫ్‌లో అసలు రంగు చూపిస్తుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు కథకు ప్రాణం. తండ్రి బాధ, కోపం, కూతురికి న్యాయం చేయాలనే పట్టుదల ప్రేక్షకుడిని కూడా ఆ ఎమోషన్‌లోకి తీసుకెళ్తాయి.

త్రినాథ్‌గా రవితేజ తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కనపెట్టి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అరుపులు, యాక్షన్ కంటే కళ్లలో కనిపించే బాధతోనే ఎక్కువ ప్రభావం చూపించాడు. అయితే కథలోని కొన్ని సన్నివేశాలు, కొన్ని లాజిక్స్ సాధారణ ప్రేక్షకుడికి ప్రశ్నలు రేకెత్తించవచ్చు. అయినప్పటికీ దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ మాత్రం బలంగా రీచ్ అవుతుంది. మొత్తంగా.. ‘ఇరుముడి’ ఓ రెగ్యులర్ మాస్ సినిమా కాదు. ఓ తండ్రి గుండెల్లో మొదలైన బాధ.. చివరికి ప్రతీకారంగా ఎలా మారిందో చెప్పే ఎమోషనల్ డ్రామా. సింగిల్ వర్డ్ లో దీక్ష ఫలించింది. 


Aug 21, 2026 Read Review
8

Super Hit

Irumudi Movie Review

రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఇది సాగుతుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య బాండింగ్‌,, ఎమోషన్స్ ని ఆవిష్కరించే...

రవితేజ సినిమా అంటే మాస్‌, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు, డాన్సులు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు ఉంటాయి. కానీ అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న క్రమంలో తాను రూట్‌ మార్చి చేసిన మూవీ `ఇరుముడి`. అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంలో ఇది సాగుతుంది. ముఖ్యంగా తండ్రీ కూతురు మధ్య బాండింగ్‌,, ఎమోషన్స్ ని ఆవిష్కరించే మూవీ ఇది. సినిమాలో రవితేజ కనిపించరు, త్రినాథ్‌ మాత్రమే కనిపిస్తాడు. అంతగా పాత్రలో ఒదిగిపోయి నటించి ఆకట్టుకున్నాడు. 


ఇక సినిమాలో సెంటిమెంట్‌, ఎమోషనల్‌ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్‌ అయ్యారు. ఈ సినిమా సీరియస్‌ గా సాగుతున్నా, మధ్య మధ్యలో రవితేజ మార్క్ ఫన్‌ కూడా ఉంటుంది. తండ్రికూతురు మధ్య ఉన్న కెమిస్ట్రీని బలంగా చూపించారు. క్లైమాక్స్ మాత్రం కొంత రెగ్యూలర్‌గానే ఉంది. కొన్ని ట్విస్ట్ లు కూడా పెద్దగా పేలలేదు. అంతగా వర్కౌట్‌ కాలేదు. ఎమోషనల్‌ సీన్లు మాత్రం అదిరిపోయాయి. ఉత్కంఠకు గురి చేసే సీన్లు బాగున్నాయి. పైగా సినిమాలో అమ్మాయిలను ధైర్యంగా పెంచాలనే సందేశం బాగుంది. ఫైనల్ గా అయ్యప్పస్వామి భక్తుల బ్యాక్‌ డ్రాప్‌లో తండ్రికూతుళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగిన ఎమోషనల్‌ యాక్షన్‌ డ్రామా ఇరుముడి. రవితేజ చేసిన కొత్త ప్రయత్నమని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే మూవీ. అమ్మాయిలను, ముఖ్యంగా ఆడ పిల్లల్ని భయంతో కాదు, ధైర్యంతో పెంచాలని చెప్పడం బాగుంది.




Aug 21, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
7

Hit

Irumudi movie review

రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త...

రవితేజ అంటే మాస్ ఎలివేషన్స్, ఎనర్జీ, కామెడీ, పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. కానీ **‘ఇరుముడి’**లో మాత్రం ఆయనను పూర్తిగా మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ఒక సాధారణ తండ్రి.. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక చేసే పోరాటమే ఈ కథకు అసలు బలం. మొదటి భాగంలో కుటుంబం, ఊరి నేపథ్యం, త్రినాథ్ క్యారెక్టర్‌ను నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు.. కథ అసలు మలుపు తిరిగిన తర్వాత డ్రామాను బలంగా నడిపించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను గట్టిగా హిట్ చేస్తాయి.


త్రినాథ్‌గా రవితేజ నటన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. మాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి బాధ, కోపం, కసితో కూడిన పాత్రను ఆయన బాగా క్యారీ చేశాడు. అమ్మాయిలపై జరిగే అన్యాయం, తండ్రి ఆవేదనను కలిపి చెప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు, కథలోని కొన్ని అంశాలు అందరికీ సులభంగా కనెక్ట్ కాకపోవచ్చు. అయినా కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వెళ్లి ఎమోషన్‌ను నమ్ముకున్న ‘ఇరుముడి’.. రవితేజ కెరీర్‌లో డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలుస్తుంది.


Aug 21, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
7

Hit

Irumudi Movie Review

ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌ లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, స్టోరీ కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను విన్నది, చూసినది... ప్రతిదీ తండ్రితో చెప్పే అలవాటు ఉన్న అమ్మాయి మణెమ్మ. అటువంటి చిన్నారి ఒకానొక సంద...

ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు... ఏదైనా చెప్పుకోగలమనే ధైర్యంతో - ప్రీ క్లైమాక్స్‌ లో రవితేజ డైలాగ్. 'ఇరుముడి'లో మెయిన్ పాయింట్, స్టోరీ కోర్ ఎమోషన్ ఆ ఒక్క మాటలో చెప్పేశారు దర్శకుడు శివ నిర్వాణ. తాను విన్నది, చూసినది... ప్రతిదీ తండ్రితో చెప్పే అలవాటు ఉన్న అమ్మాయి మణెమ్మ. అటువంటి చిన్నారి ఒకానొక సందర్భంలో తండ్రికి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఓ ప్రమాదం. కూతురి దగ్గర తండ్రి ఉంటే ప్రమాదం జరిగేది కాదని ప్రేక్షకులు ఫీలయ్యేలా తీశారు శివ నిర్వాణ.


అయితే 'ఇరుముడి'... రెగ్యులర్ రవితేజ సినిమా కాదు. మాస్ కమర్షియల్ రొటీన్ అనిపించే సినిమాలకు భిన్నమైన సినిమా. అలాగని, రవితేజ ఫైట్స్ చేయలేదా? అంటే... చేశారు. అవన్నీ కథలో భాగంగా వచ్చాయి. కావాలని ఫైట్ చేసినట్టు అనిపించదు. కథ, కథలో కీలకమైన ట్విస్ట్ రొటీన్ అనిపించినా... ప్రారంభం నుంచి ముగింపు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న లోపాలను కవర్ చేసింది. కమర్షియాలిటీ కోసం శివ నిర్వాణ పక్కకు అడుగులు వేయలేదు. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కన పెట్టి ఆడపిల్ల తండ్రిగా జీవించారు. ఆయన్ను కొత్తగా చూడటం బావుంది. కుటుంబ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులకు అమితంగా నచ్చే చిత్రమిది.


Aug 21, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
7

Hit

Irumudi movie Review

రవితేజ నటించిన ఇరుముడి సినిమా థియేటర్లలో తాజాగా విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమాలో కొన్ని సీన్లు, ట్విస్టుల ద్వారా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను తెలియచేసేందుకు తీసిన ఈ సినిమాలోని ప్రధానాంశం బాగా ఎక్కేస్తుంది. అయితే త్రినాథ్‌ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడంతో సినిమా మొదల...

రవితేజ నటించిన ఇరుముడి సినిమా థియేటర్లలో తాజాగా విడుదలై డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. సినిమాలో కొన్ని సీన్లు, ట్విస్టుల ద్వారా ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు ఉండాల్సిన బాధ్యతను తెలియచేసేందుకు తీసిన ఈ సినిమాలోని ప్రధానాంశం బాగా ఎక్కేస్తుంది. అయితే త్రినాథ్‌ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడంతో సినిమా మొదలై... రకరకాల మలుపులు తిరిగి అతను గురుస్వామిగా మారడంతో కథ సుఖాంతమౌతుంది. ఈ మధ్యలో ప్రేక్షకులకు కొన్ని కొరుకుడు పడని వాస్తవాలు, అంగీకరించలేని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వీటిని అధిగమించేలా... అయ్యప్ప మాలలో రవితేజ కనిపించిన ప్రతి సన్నివేశం డివోషనల్ టచ్ తో బాగుంది. 


 ఇక సినిమాకి జివి ప్రకాష్ సంగీతం ప్రాణం పోసింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి అన్ని బాగున్నాయి. ప్రథమార్థం తండ్రీ కూతుళ్ళ అనుబంధంతో సరదాగా సాగిన ఈ సినిమా, ద్వితీయార్థంలో కథలోతుల్లోకి వెళ్ళే సరికీ భారంగా మారింది. అయితే చివరి ఇరవై నిమిషాలు రేసీగా సాగింది. ఏదేమైనా... డివోషనల్‌ బ్యాక్ డ్రాప్‌ లో, తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌ తో, నటీనటుల సహజ నటనతో రూపుదిద్దుకున్న 'ఇరుముడి' ఇటీవల వచ్చిన రవితేజ చిత్రాలతో పోల్చితే ఫార్ బెటర్ మూవీ! 

Aug 21, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
7

Hit

Irumudi Movie Review

టీచర్, స్టూడెంట్ రిలేషన్ గురించి మంచి ఎమోషనల్ సీన్‌ తో "ఇరుముడి" కథను మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ తొలి సీన్‌లోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ క్యారెక్టర్లను రెండు, మూడు సీన్లలో ఎస్టాబ్లిష్ చేసి.. ఆయన కూతురు మణెమ్మతో బంధాన్ని భావోద్వేగంగా...

టీచర్, స్టూడెంట్ రిలేషన్ గురించి మంచి ఎమోషనల్ సీన్‌ తో "ఇరుముడి" కథను మొదలుపెట్టి ఎమోషనల్‌గా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు శివ నిర్వాణ తొలి సీన్‌లోనే సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ క్యారెక్టర్లను రెండు, మూడు సీన్లలో ఎస్టాబ్లిష్ చేసి.. ఆయన కూతురు మణెమ్మతో బంధాన్ని భావోద్వేగంగా ఎస్టాబ్లిష్ చేసి సినిమాను పరుగులు పెట్టించాడు. ఎలాంటి హంగామా, ఆర్భాటం లేకుండా, రవితేజ్ ఇమేజ్‌ కు భిన్నంగా ఫీల్ గుడ్ సీన్స్ తో సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు. 


ఇరుముడి సినిమా గురించి ఫైనల్‌ గా చెప్పాలంటే.. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్, అయ్యప్ప స్వామి డివైన్, రూరల్ డ్రామాగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ అంశాలను పర్‌ఫెక్ట్‌ గా బ్లెండ్ చేశారు. దాంతో ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ఎమోషనల్ కనెక్ట్ చేసి సినిమాతో జర్నీ చేసేలా ఉంటుంది. రవితేజ కెరీర్‌ లో ది బెస్ట్ మూవీ. బేబీ నక్షత్ర, ఆడపిల్లలందరూ బాగా నటించారు. ఈ వారం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాను చూడాలంటే.. ఇరుముడిని ఏ మాత్రం ఆలోచించకుండా ఎంచుకోవచ్చు. ఈ సినిమా మంచి విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Aug 21, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
8

Super Hit

Irumudi movie review

మాస్ మహారాజా రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా **‘ఇరుముడి’**తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. త్రినాథ్ అనే సాధారణ అరటిపళ్ల వ్యాపారి జీవితంలో జరిగే విషాద ఘటన, ఆ తర్వాత అతడి పోరాటం చుట్టూ తిరుగుతుంది. కూతురు మణెమ్మకు జరిగిన అన్యాయం, ఊర్లో అమ్మా...

మాస్ మహారాజా రవితేజ ఈసారి తన రెగ్యులర్ మాస్ ఫార్ములాకు భిన్నంగా **‘ఇరుముడి’**తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. త్రినాథ్ అనే సాధారణ అరటిపళ్ల వ్యాపారి జీవితంలో జరిగే విషాద ఘటన, ఆ తర్వాత అతడి పోరాటం చుట్టూ తిరుగుతుంది. కూతురు మణెమ్మకు జరిగిన అన్యాయం, ఊర్లో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాల వెనుక అసలు నిజాన్ని తెలుసుకునే క్రమంలో త్రినాథ్ చేసే పోరాటం కథకు ప్రధాన బలం. ముఖ్యంగా చివరి అరగంటలో డ్రామా, ఎమోషన్ పీక్స్‌కు చేరుతాయి. రవితేజ తన పాత్రలోని బాధ, కోపం, కసిని అద్భుతంగా పలికించాడు.


కథలో కొన్ని అంశాలు సగటు ప్రేక్షకుడికి జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినా.. దర్శకుడు కమర్షియల్ మూసను పక్కనపెట్టి చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా తెరకెక్కించాడు. ఓవరాల్‌గా ‘ఇరుముడి’ మాస్ కంటే ఎమోషన్‌ను నమ్ముకున్న సినిమా. రవితేజ పెర్ఫార్మెన్స్, బలమైన క్లైమాక్స్, హృద్యమైన మెసేజ్ సినిమాకు ప్రధాన హైలైట్స్. ఫైనల్ గా డివోషనల్ టచ్ ఉన్న ఒక మెసేజ్ ఓరియెంటెడ్ థ్రిల్లర్. 

Aug 21, 2026 Read Review
Tupaki
Tupaki Website
7

Hit

Irumudi Movie Review

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకు...

ఓ మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ. ఇందుకోసం ఆయన ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి కూడా ప్రయత్నించాడు. కానీ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి ఫ్యామిలీ ట్రై చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ లాంటి మరో భిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. కానీ ఈసారి దెబ్బపడలేదు. ఏ ముహూర్తంలో ఇరుముడి టైటిల్ తో సినిమా స్టార్ట్ చేసారో తెలీదు గాని, సినిమా ఆడియన్స్ లోకి రిలీజ్ కి ముందే ఖచ్చితంగా చూడాలన్నట్టు మైండ్ లో ఫిక్స్ అయినట్టున్నారు. చాలా ఏళ్ళ తర్వాత రవితేజ సినిమాకి ఓ రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి


పైగా మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ఇలాంటి సినిమాకు ఒప్పుకోవడం.. ఆయన్ని పెట్టి శివ నిర్వాణ ఈ సినిమా తీయాలనుకోవడం షాకింగే. అయితే ‘ఇరుముడి’లో సగటు తెలుగు ప్రేక్షకులు ‘జీర్ణించుకోలేని’ విషయాలు చాలానే ఉన్నాయి. ఐతే ‘ఇలా ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు’ అనే స్టాక్ డైలాగును దాటి ‘ఇరుముడి’ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషమే. మాస్ చిత్రాల మూసలో మరుగున పడిపోయిన రవితేజలోని పెర్ఫామర్ ను ఈ సినిమాలో చూడొచ్చు. తెర మీద పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు ఎంత బాగా ఫీలయ్యారంటే.. ఆ కథ వారికి అంతగా కనెక్ట్ అయినట్లు. ‘ఇరుముడి’లో చివరి అరగంటలో ప్రేక్షకుల భావోద్వేగాలు అలాగే పతాక స్థాయికి వెళ్తాయి. హీరో పాత్ర తాలూకు బాధను.. కసిని ఆడియన్స్ కూడా అదే స్థాయిలో ఫీలవుతారు. ఫైనల్ గా చివరగా ఇరుముడి.. డ్రామా బలంగా.. మెసేజ్ హృద్యంగా ఆకట్టుకుంటుంది. 






Aug 21, 2026 Read Review
Samayam Telugu
Samayam Telugu Website
7

Hit

Irumudi movie review

‘ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌ గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా ఉండాలి, ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎంత ధైర్యంగా పెంచాలి అన్నది చూపించాడు శివ నిర్వాణ....

‘ఇరుముడి’ కోసం శివ నిర్వాణ ఎంచుకున్న కథని ఓవరాల్‌ గా చూస్తే సాధారణ రివేంజ్ డ్రామాలానే కనిపిస్తుంది. కానీ ఫాదర్, డాటర్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. తండ్రీకూతుళ్ల బంధం ఎలా ఉండాలి, ప్రస్తుత కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలి.. ఎంత ధైర్యంగా పెంచాలి అన్నది చూపించాడు శివ నిర్వాణ. ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన అన్ని అంశాల్ని జోడించి ఇరుముడిని శివ నిర్వాణ ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 


త్రినాథ్ గా రవితేజ చాలా అద్భుతంగా నటించాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. కానీ కథలో ఎమోషన్ కి కనెక్ట్ అయితే అవి ఏం అంత అనిపించవు. కొన్ని చోట్ల సినిమా కాస్త వీక్‌గా అనిపించినా.. టోటల్‌గా చూసుకుంటే మాత్రం ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. రవితేజకు చాలా రోజులకు మంచి విజయం వచ్చినట్టే. అలాగే శివ నిర్వాణకు దర్సకుడిగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక కమర్షియల్‌గా ఇది ఏ రేంజ్‌కి వెళ్తుంది అన్నది మున్ముందు తెలుస్తుంది. 

Aug 21, 2026 Read Review
123telugu
123telugu Website
8

Super Hit

Irumudi movie review

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ‘ఇరుముడి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బ...

రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించారు. కాగా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ‘ఇరుముడి’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా రవితేజ పవర్ ఫుల్ నటన, శివ నిర్వాణ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


అయితే కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి. ఐతే, రవితేజ, మిగిలిన నటీనటులు తమ నటనతో, మొత్తం సాంకేతిక విభాగం తమ పనితనంతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం రవితేజ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.


Aug 21, 2026 Read Review
Gulte
Gulte Website
6

Above Average

Irumudi Movie Review

#Irumudi - Empowering & EngagingFirstly, kudos to Raviteja and Shiva Nirvana for choosing a socially relevant subject and telling it honestly without deviating from the core point. If you are a parent of a girl child, the film will prompt you to reflect and may lead you to make some changes in y...

#Irumudi - Empowering & Engaging


Firstly, kudos to Raviteja and Shiva Nirvana for choosing a socially relevant subject and telling it honestly without deviating from the core point. If you are a parent of a girl child, the film will prompt you to reflect and may lead you to make some changes in your current parenting approach.


Throughout the first half of the film, Shiva Nirvana superbly built the tension. The bond between the father and the son, Sai Kumar's dialogues about girls and parenting, and the undercurrent suspense and thrill were nicely built along with a good pre-interval sequence in the first half.


Shiva Nirvana succeeded in writing the emotional drama and the twist in the second half well. However, the episode after the twist reveal, should have been a bit better. But, the director made sure to end the film with a very emotional climax. Also, the action episode with the ‘Mallepoola Pallaki’ song in the background, brought the roof down in the theatre with loud cheers from the audience.


Overall, Irumudi is empowering, thought provoking and entertaining. Raviteja is most likely to earn a lot of respect for doing such a socially relevant film.


Rating - 3/5

Aug 21, 2026 Read Review
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
8

Super Hit

Irumudi Movie Review

ఇరుముడి... సినిమా గురించి చెప్పాలంటే good. చాలా మంచి decent message oriented సినిమా. అండ్ unnessesery commerial elements లేని సినిమా. రవితేజ గారికి performance oriented movies లో వన్ అఫ్ ది బెస్ట్ సినిమా. కొంతమందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళకి సినిమా taste లేదనుకొని వదిలేయాలి. అలాంటి వాళ్ళకో...

ఇరుముడి... సినిమా గురించి చెప్పాలంటే good. చాలా మంచి decent message oriented సినిమా. అండ్ unnessesery commerial elements లేని సినిమా. రవితేజ గారికి performance oriented movies లో వన్ అఫ్ ది బెస్ట్ సినిమా. కొంతమందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళకి సినిమా taste లేదనుకొని వదిలేయాలి. అలాంటి వాళ్ళకోసం రొట్ట సినిమాలు తీసే రవితేజ ఈ పరిస్థితికొచ్చాడు అనిపిస్తుంది. ఏదేమైనా ఫైనల్ గా రవితేజ మంచి సక్సెస్ ఫుల్ కం బ్యాక్, చాలా మంచి హిట్టు ఈ సినిమాతో కొట్టాడు, come back ఇచ్చాడు అని చెప్పొచ్చు. 


and సినిమాలో కొంచెం heavy sences ఉన్నాయి. కొన్ని సార్లు తీసుకోలేకపోవచ్చు. మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి సినిమాలో. మెయిన్ గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటది సినిమా. ఇంకొకటి నాకనిపించిందేంటంటే, లాస్ట్ లో స్క్రీన్ ప్లే కొంచెం టూ మచ్ గా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ మిగతా అంత బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ చాలా బాగా ఉంది. సాంగ్స్ బాగా తీశారు. అండ్ అయ్యప్ప మాల వేసుకునే భక్తులకు ఐ ఫీస్ట్ లాంటి సినిమా ఇది. అండ్ ఫ్యామిలీస్ కి మంచి ఆప్షన్. అండ్ యాక్టింగ్ రవితేజ సహా అందరూ చాల బాగా చేసారు. అండ్ ఇరుముడి సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచి కం బ్యాక్ ఇచ్చారు రవన్న. 

Aug 21, 2026 Watch
Ideal Brain
Ideal Brain Twitter Channel
7

Hit

Irumudi Movie Review

Completed watching #Irumudi. The pre-climax and climax worked really well. The Ayyappa Deeksha is beautifully woven into the narrative and serves as the film’s central backdrop.The father-daughter relationship is handled very effectively, while Shiva Nirvana’s writing and screenplay are strong.Ravi...

Completed watching #Irumudi. The pre-climax and climax worked really well. The Ayyappa Deeksha is beautifully woven into the narrative and serves as the film’s central backdrop.


The father-daughter relationship is handled very effectively, while Shiva Nirvana’s writing and screenplay are strong.


Ravi Teja delivers a very natural performance, and Baby Nakshatra is terrific.


GV Prakash Kumar’s music - both the songs and background score - is a major plus.


Overall, #Irumudi is a blockbuster!

Aug 21, 2026 Read Review
Venky Reviews
Venky Reviews Twitter Channel
6

Above Average

Irumudi Movie Review

#Irumudi Satisfactory Slow-Burn Emotional Thriller That Has Its Share of Writing Flaws but Is Hard-Hitting and Sincere Enough!First half is on the slow side but stays engaging and builds a neat emotional connect through the father-daughter bond. Second half works in parts. It has convenient writing...

#Irumudi Satisfactory Slow-Burn Emotional Thriller That Has Its Share of Writing Flaws but Is Hard-Hitting and Sincere Enough!


First half is on the slow side but stays engaging and builds a neat emotional connect through the father-daughter bond. Second half works in parts. It has convenient writing and villains who feel overly cruel at times just for shock value. Despite that, a few key twists work, the emotional core stays intact, and the climax lands very well.


Ravi Teja delivers his best performance in recent times and this is easily his better outings in a while. Nakshatra is superb. Writing has its flaws and this template does feel familiar at times, but it remains sincere and meaningful enough to be given a try!


Rating: 2.75/5

Aug 21, 2026 Read Review
Cinema Picha
Cinema Picha Youtube Channel
7

Hit

Irumudi Movie Review

స్వామియే శరణం అయ్యప్ప: ఈ story ఇలా ప్రెజెంట్ చేసినందుకు, ఈ story ని ఇలా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలిసినా, మన రవితేజ గారు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఈ message ని delivery చేసినందుకు రవన్న మనం పెద్ద kudos చెప్పాలన్నమాట. దీక్ష వేయని నాకే ఆ అయ్యప్ప స్వామి దీక్ష సీన్స్ ఈ సినిమాలో ఆ పాటలు గాని సీన్స్ గాని sup...

స్వామియే శరణం అయ్యప్ప: ఈ story ఇలా ప్రెజెంట్ చేసినందుకు, ఈ story ని ఇలా ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలిసినా, మన రవితేజ గారు ఈ సినిమాలో యాక్ట్ చేసి ఈ message ని delivery చేసినందుకు రవన్న మనం పెద్ద kudos చెప్పాలన్నమాట. దీక్ష వేయని నాకే ఆ అయ్యప్ప స్వామి దీక్ష సీన్స్ ఈ సినిమాలో ఆ పాటలు గాని సీన్స్ గాని superb గా అనిపించాయి. goosbumps తెప్పించాయి. ఇంక దీక్షలో ఉన్న వారికి ఈ సీన్స్ ఏ రేంజ్ లో అనిపిస్తాయో చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే చాలా చాలా heavy గా ఉంది ఇరుముడి సబ్జెక్టు. కొంచెం distrubing గా కూడా అనిపిస్తది. అందరూ ఈ సినిమాని ఒకే రకంగా recive చేసుకుని బైటికి వెళ్లరు అనిపిస్తుంది. ఈ సినిమాని ఈ tone లో ఎందుకు చెప్పారు, వేరే tone లో కూడా చెప్పుండొచ్చు అని కూడా అనిపించొచ్చు. అలాగే మీరనొచ్చు. ఇలాంటి సినిమాలు తమిళ్ లో తీస్తే ఇలాగే encourage చేస్తారు కదరా అనొచ్చు. నాకు ఏ భాష అయినా, ఒకేలా చూస్తాను. కానీ ఈ సినిమాలో నాకైతే కొంచెం వేరే విధంగా తీస్తే బాగుందనిపించింది.


ఇక రవితేజ గారు చాలా రోజుల తర్వాత veru settled role లో అద్భుతంగా నటించి చితక్కొట్టేశారని చెప్పొచ్చు. హీరోయిన్ కైతే పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. బట్ డీసెంట్. సాయి కుమార్ గారు ప్లెయిడ్ ఏ వెరీ ఇంపార్టెన్స్ డీసెంట్ రోల్. అండ్ రవితేజ కూతురిగా నటించిన అమ్మాయి కూడా బ్రిలియంట్. ఇక జివి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ కి అయితే హెవీ టోన్ తో బైటికి వస్తారు. నాకైతే అయ్యప్ప దీక్ష సీన్స్, అలాగే ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ బాగా నచ్చాయి. ఇక సినిమాకైతే కొంచెం తక్కువ ఆలోచనలు పెట్టుకుని వెళ్తే, చాలా బాగా నచ్చుతుంది. 


Aug 21, 2026 Watch

Public Reviews

7 Avg: 7.3/10
T
Tharuni Valluru Small Business Owner
7

Hit

Irumudi Movie Review

eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.. trailer chusi vellanu... normal expectations tho chusa... movie chusaka one of the best movie.. i wa...

eeroje family tho Irumudi movie first show chusocchamu... recent times lo raviteja movie em theaterlo chudaledu... because anni routeen worest movie... but ee movie ki family lo andaru force cheste.. trailer chusi vellanu... normal expectations tho chusa... movie chusaka one of the best movie.. i watched recent times anipinchindi.


definitely Ravi Teja ki best comeback movie ani cheppali. directer shiva nirvana ki hatsoff. Story interesting ga untundi, emotional scenes and climax strong impact create chestayi. nenaithe edchesanu.. maree over hype tho vellakunda.. Normal expectations tho theatres ki velthe definitely connect avtaru movieki.

Aug 21, 2026
G
Goshika Shreshta CA/Advocate
7

Hit

Irumudi Movie Review

Just now finished to watch irumudi movie. story was routeen... but Irumudi is one of Ravi Teja’s best films in recent times and a solid comeback for the actor. The story is interesting, while the emotional moments and climax work well and leave an impact. and the music, cinematography, and productio...

Just now finished to watch irumudi movie. story was routeen... but Irumudi is one of Ravi Teja’s best films in recent times and a solid comeback for the actor. The story is interesting, while the emotional moments and climax work well and leave an impact. and the music, cinematography, and production values are good.


Ravi Teja delivers a strong performance, with the little girl also impressing. The only drawback is the slightly slow screenplay and editing in parts. Overall, a decent and emotionally engaging film that works well if you go in with normal expectations.

Aug 21, 2026
M
Mulollu Praveen Kumar CA/Advocate
7

Hit

Irumudi Movie Review

"Irumudi" easily Ravi Teja’s best comeback movie in recent times. The film once again proves what Ravi Teja can deliver when he gets a solid script that truly suits him. The core story is interesting, and the screenplay strongly conveys what the director wants to say. A few portions feel a little he...

"Irumudi" easily Ravi Teja’s best comeback movie in recent times. The film once again proves what Ravi Teja can deliver when he gets a solid script that truly suits him. The core story is interesting, and the screenplay strongly conveys what the director wants to say. A few portions feel a little heavy and emotionally intense, especially towards the climax.


The two Ayyappa Swamy songs are definite highlights and blend well with the narrative. GV prakash music is good, while the background score works well but could have been more elevating in key moments.


Ravi Teja delivers a strong performance, and the little girl deserves special mention for her impressive acting.


Overall, Irumudi stands out as one of Ravi Teja’s best films in recent times.

Aug 21, 2026
Rupavath Bixam
Rupavath Bixam Small Business Owner
8

Super Hit

Irumudi Movie Review

ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెంట్ గా ఉంటుందనుకున్నాను కానీ, ఏడిపించారు బ్రో థియేటర్లో... రవన్న కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. అండ...

ఇప్పుడే ఇరుముడి మూవీ చూసొచ్చా... బేసిగ్గా ఈ మధ్య రవితేజ మూవీస్ చూడ్డం మానేసాను. ఎందుకు అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా ఇరుముడి అని అనౌన్స్ అయినప్పుడే థియేటర్లో చూద్దాం అని ఫిక్స్ అయ్యా. సినిమా ఎదో డీసెంట్ గా ఉంటుందనుకున్నాను కానీ, ఏడిపించారు బ్రో థియేటర్లో... రవన్న కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ ఇది. అండ్ శివనిర్వాణ కి ఇంతమంచి మూవీ ఇచ్చినందుకు థ్యాంక్స్...


సినిమాలో పెద్దగా కథేమీ ఉండదు.. ప్రతి ఇంట్లో ఉండే చిన్న ఫ్యామిలీ స్టోరీ. father and daughter relationship మాత్రం సినిమాలో చాలా బాగా చూపించారు. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ మూవీ చూడాలి. ఎందుకో సినిమా చుస్తే మీకు తెలుస్తది. ఇంతకు మించి ఏమైనా మాట్లాడితే స్టోరీ లీక్ అయిపోద్దేమో... అందుకే నా రివ్యూ ఎవరైనా చూస్తే వెంటనే సినిమా టికెట్ బుక్ చేసుకుని చూసేయండి... సినిమాలో నా ఫెవరేట్స్ అయితే మల్లెపూల పల్లకి, అండ్ ఇరుముడి టైటిల్ సాంగ్.... సీట్లో కూర్చోలేం అసలు.. 

Aug 22, 2026
T
Talari Snehalatha IT Employee
7

Hit

Irumudi Movie Review

Irumudi Review: Finally… RaviTeja is back... in the moment ‘Irumudi’ was announced, something felt different. The title, the vibe, the whole setup created a positive buzz. The story isn’t something completely new. It’s actually a very relatable, everyday family story that could happen around us. I...

Irumudi Review: Finally… RaviTeja is back... in the moment ‘Irumudi’ was announced, something felt different. The title, the vibe, the whole setup created a positive buzz. The story isn’t something completely new. It’s actually a very relatable, everyday family story that could happen around us. I don’t want to reveal much because even a small detail can spoil the experience.


But there’s one thing I’ll definitely say — every parent who has a daughter MUST watch this film.

Ravi Teja didn’t just play the character… he lived it. The pain, anger, love and intensity — everything lands perfectly.


And thnanks to director Shiva Nirvana for giving Ravi Teja such a strong and emotionally powerful character.

Final Verdict: Irumudi is a MUST WATCH.


Aug 21, 2026
V
Velugubantla Ramadurga Private Employee
7

Hit

Irumudi Movie Review

Irumudi is a sincere and emotionally driven family drama that marks a refreshing change for Ravi Teja. The story may feel familiar, but its strong emotional core and relevant social message make it impactful.Ravi Teja delivers one of his most grounded performances in recent times, carrying the film...

Irumudi is a sincere and emotionally driven family drama that marks a refreshing change for Ravi Teja. The story may feel familiar, but its strong emotional core and relevant social message make it impactful.


Ravi Teja delivers one of his most grounded performances in recent times, carrying the film with conviction and intensity. Shiva Nirvana handles the emotional moments effectively, especially in the latter half.


The film may not be entirely flawless, but its strong performances, emotional depth and meaningful message make it a worthwhile theatrical watch.


Verdict: A heartfelt drama with a powerful Ravi Teja performance — definitely worth watching.

Aug 21, 2026
A
Arige Srikanth Private Employee
8

Super Hit

Irumudi Movie Review

ఫైనల్ గా రవన్న కొట్టేసాడు హిట్టు... ఇదొక్కటేనా... మా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. నాలుగైదేళ్ల నుండి రవితేజ నుండి సరైన సినిమా వస్తనే లేదు. క్రాక్ తర్వాత నాకే సినిమా కూడా నచ్చలేదు. అందుకే కొన్ని థియేటర్లో కూడా చూడలేదు. కానీ ఇరుముడి ఎప్పుడైతే స్టార్ట్ అయి టైటిల్ అనౌన్స్ అయిందో అప్పుడే ఒ...

ఫైనల్ గా రవన్న కొట్టేసాడు హిట్టు... ఇదొక్కటేనా... మా ఫ్యాన్స్ కి కావాల్సిన ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు. నాలుగైదేళ్ల నుండి రవితేజ నుండి సరైన సినిమా వస్తనే లేదు. క్రాక్ తర్వాత నాకే సినిమా కూడా నచ్చలేదు. అందుకే కొన్ని థియేటర్లో కూడా చూడలేదు. కానీ ఇరుముడి ఎప్పుడైతే స్టార్ట్ అయి టైటిల్ అనౌన్స్ అయిందో అప్పుడే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది నాకు. సినిమా పక్కా చూద్దాం ఎలా ఉన్నా సరే అని. ఫైనల్ గా ఈరోజు థియేటర్లోకి వచ్చేసింది... మార్నింగ్ షోకే వెళ్ళిపోయా.. 


సినిమా కొత్త కథేం కాదు... మన చుట్టూ ఉండే సగటు ఫ్యామిలీ స్టోరీ.. స్టోరీ గురించి నేనేం చెప్పినా రివీల్ అయిపొద్దని చెప్పట్లేదు గాని... ఒక్కటి మాత్రం చెప్తా... ప్రతి ఆడపిల్ల తల్లి దండ్రులు పక్కా చూడాల్సిన సినిమా ఇది. రవితేజ సినిమాలో జీవించేసాడు.. డైరెక్టర్ శివ నిర్వాణకి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నా తరపున ఆడియన్స్ తరపున పెద్ద థ్యాంక్స్... ఫైనల్ గా మస్ట్ వాచ్ ఇరుముడి...

Aug 21, 2026

About This Movie

Story :

కథ విషయానికి వస్తే... పొల్లూరు అనే ఊళ్ళో త్రినాథ్ (రవితేజ) అరటిపళ్ళ వ్యాపారం చేస్తూ, ట్రక్ నడుపుతూ తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)తో హ్యాపీగా జీవనం సాగిస్తుంటాడు. మద్యానికి బానిసైన త్రినాథ్.. ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రతి ఏటా అయ్యప్ప మాల వేస్తూ ఉంటాడు. అలాగే తన కూతురు మణెమ్మ లాగే ఊళ్ళో ప్రతి ఆడపిల్లలోనూ కూతుర్ని చూస్తాడు. అయితే ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఊళ్ళో త్రినాథ్ కూతురు చదివే స్కూల్లో ఒకమ్మాయి హత్య జరుగుతుంది. దానికి సంబంధించి వాస్తవాలు త్రినాథ్ కూతురికి తెలుస్తాయి. అలాగే తనకూ ఓ అన్యాయం జరుగుతుంది. ఈ క్రమంలో త్రినాథ్ ఆ హత్యకు గల కారణాల్ని తెలుసుకుని ఏం చేసాడు? ఈ కథలో ఎమ్మెల్యే (రమేష్ ఇందిర) పాత్ర ఏమిటి? ఊళ్ళో అమ్మాయిలకు, అలాగే మణెమ్మకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. అసలు     మణెమ్మకు జరిగిన అన్యాయం ఏంటి? తన కూతురుకు జరిగిన అన్యాయానికి త్రినాథ్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అనేది మిగిలిన కథ. 

 

Plus Points : 

సినిమా "ఇరుముడి" టైటిల్ అనౌన్స్ అయినప్పుడే సోషల్ మీడియాలో ఒక మంచి పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. ఇరుముడి సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రత్యక్షంగా రవితేజ అయితే.. పరోక్షంగా శివ నిర్వాణ రాసుకున్న కథ. చాలా ఏళ్ళ తర్వాత రవితేజలో నటుడ్ని మళ్ళీ ఆవిష్కరించిన సినిమా ఇది. ఒక సగటు తండ్రిగా, అయ్యప్ప స్వామి భక్తుడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు. ట్రైలర్ లో చూపించిన దానికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సినిమా. ముఖ్యంగా బరువైన ఎమోషనల్ సీన్స్ లో రవితేజ చూపించిన అభినయం చాలా బాగుంది. అలాగే పలు యాక్షన్ సన్నివేశాల్లోనూ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, రవితేజ తనలో నటుడ్ని మరోసారి ఆవిష్కరించారు. అలాగే ప్రియా భవానీ శంకర్ కావేరి పాత్రలో డీసెంట్ హోమ్లి రోల్ లో మెరిసింది. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర చాలా న్యాచురల్ గా మెచ్యూర్డ్ గా నటించగా, రవితేజ తో బాండింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక కీ రోల్స్ లో నటించిన స్వసికా విజయ్, సాయికుమార్, అజయ్ ఘోష్ తదితరులు బాగా నటించారు. అలాగే సినిమాలో అయ్యప్ప స్వామి భక్తుల నేపథ్యంగాని, తండ్రి – కూతురి మధ్య ఎమోషనల్ బాండింగ్ గాని, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అయ్యాయి. అలాగే సినిమాలో పరిస్థితులకు తగ్గట్టు శివ నిర్వాణ కథలో అల్లుకున్న సీన్లు చాలా బాగున్నాయి. 


Minus Points :

చాలా మంచి బలమైన కథా, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ పరంగా ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుంది. కానీ కొంతవరకు సినిమాటిక్ లిబర్టీని మరీ ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే సినిమాలో ఉన్న హై మూవ్మెంట్స్ ని చివరి వరకు ఇంకా బాగా మెయింటైన్ చేయాల్సింది అనిపించింది. సినిమాలో వచ్చే కొన్ని సీన్స్ కి ఆడియన్స్ బరువెక్కిపోతారు. కానీ అందరూ తీసుకుంటారా లేదా అనేది తెలీదు.

Technical Values  :

ఇరుముడికి సంబంధించి టెక్నికల్ గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాలో చాలా సీన్లు న్యాచురల్ గా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్‌ విష్ణు శర్మ వర్క్ చాలా బాగున్నాయి. విలేజ్ వాతావరణాన్ని అద్భుతంగా తెరకెక్కించగా, కొన్ని నైట్ సీన్స్ యాక్షన్ విజువల్స్ ని కూడా బాగా తీశారు. ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ మంచి ఆల్బమ్ ఇచ్చాడు. బీజీఎమ్ కూడా అదిరిపోయింది. ఇటు శివ నిర్వాణ రచయితగా, దర్శకుడిగా ఇరుముడికి పూర్తి న్యాయం చేశారు.  బలమైన కథను, దానికి తగ్గ అద్భుతమైన కథనాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించారు. దానికి మేకర్స్ సహా అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుంచి సరైన సహకారం అందింది కాబట్టి, ఇరుముడిని ఇంత పర్ఫెక్ట్ గా తీయగలిగారు.

Final Review  :

ఓవరాల్ గా ఇరుముడి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ సినిమా కథ, స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్, ఆక్షన్ మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంది. ముఖ్యంగా రవితేజలోని నటుడ్ని మరోసారి స్క్రీన్ పై ఆవిష్కరించిన సినిమా ఇది. అలాగే శివ నిర్వాణ తన దర్శకత్వ ప్రతిభ ఏంటో మరోసారి ఆడియన్స్ కి చూపించారు. కొన్ని స్లో సీన్స్ ని పక్కనబెడితే, ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాగా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా ఈ ఇరుముడి. 

 

Review Statistics

7.1
Overall Rating
Avg. of all reviews
30
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
7.0/10
Public
7.3/10
Why MRO?