Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

608
Total Reviews
90
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 37-48 of 608 reviews
Clear all filters

Sahaa movie review

సహ (Sahaa) 2026 Website
6.0
out of 10
సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అమ్మాయి ప్రేమలో పడి, తనే లోకంగా బతికి, అందులోంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన సంజు కథే ‘సహ’. ఈ కథకు కొన్ని చోట్ల లాజిక్స్ కనిపించవు. ఇలా కూడా ఉంటారా? అని అనిపించే అవకాశం ఉంటుంది. అయితే సహ మూవీ మాత్రం ఓ సె...

సహ సినిమాని ఎంతో డెప్త్‌తో రాసుకున్నాడు దర్శకుడు. పూర్తిగా ప్రేమ, అమ్మాయి అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కథను అల్లుకున్నాడు. సహ లైఫ్ ఆఫ్ సంజు అని పెట్టిన టైటిల్, క్యాప్షన్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంది. అమ్మాయి ప్రేమలో పడి, తనే లోకంగా బతికి, అందులోంచి బయటకు రాలేక చిక్కుకుపోయిన సంజు కథే ‘సహ’. ఈ కథకు కొన్ని చోట్ల లాజిక్స్ కనిపించవు. ఇలా కూడా ఉంటారా? అని అనిపించే అవకాశం ఉంటుంది. అయితే సహ మూవీ మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే అవకాశం ఉంటుంది.


సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారుతుంటుంది. ఇన్ని కష్టాలా? ఇన్ని బాధలా? అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం గుండెల్ని మరింత భారంగా చేస్తుంది. చివరి 20 నిమిషాల్లో ఆడియెన్స్ కన్నీరు పెట్టే అవకాశం ఉంది. ఆర్టిస్టుల విషయానికి వస్తే శివ కుమార్, శ్వేత లక్ష్మణ్ ఎక్కువగా కనిపిస్తారు. సంజు, సహ పాత్రలకు వారిద్దరూ వంద శాతం న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. వ్రజన పాండ్య పాత్ర కూడా బాగుంటుంది. చివరగా సహ మూవీని చూడాలంటే కాస్త ఓపిక, సహనం అయితే ఉండాల్సిందే. అసలే ఇంకా బ్రేకప్ బాధలు, డిప్రెషన్, ట్రామా ఉంటే మాత్రం ‘సహ’ మరింత భారంగా అనిపించే అవకాశం ఉంది.


Sep 09, 2026 Telugu
4.0
out of 10
అల్లరి' నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది ఒకప్పుడు. తెరపై ఆయన కనిపిస్తే చాలు... ఆడియన్స్ కూడా నవ్వేవారు. అయితే... క్రమక్రమంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక ఒకప్పటి అల్లరి నరేష్ సినిమాల్లో జోకులకు జనాలు నవ్వడం మానేశారు. ఇటువంటి తరుణంలో 'రంభ ఊర్వశి మేనక' అంటూ కామెడీ మూవీతో వచ్చారు.ఇక సినిమా విషయానికి వస్తే... ఒక మూవీలో ఉండాల్సిన సెంటిమెంట్,...

అల్లరి' నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది ఒకప్పుడు. తెరపై ఆయన కనిపిస్తే చాలు... ఆడియన్స్ కూడా నవ్వేవారు. అయితే... క్రమక్రమంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక ఒకప్పటి అల్లరి నరేష్ సినిమాల్లో జోకులకు జనాలు నవ్వడం మానేశారు. ఇటువంటి తరుణంలో 'రంభ ఊర్వశి మేనక' అంటూ కామెడీ మూవీతో వచ్చారు.


ఇక సినిమా విషయానికి వస్తే... ఒక మూవీలో ఉండాల్సిన సెంటిమెంట్, ఎమోషన్ గాని, కామెడీ గాని 'రంభ ఊర్వశి మేనక'లో మిస్ అయ్యింది. ఒక్కటంటే ఒక్క జోక్ కూడా సరిగా ల్యాండ్ కాలేదు. నవ్వించలేదు. సీనియర్ నరేష్ కాస్త నవ్వించడానికి ట్రై చేశారు గానీ వర్కవుట్ అవ్వలేదు. అల్లరి' నరేష్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'రంభం ఊర్వశి మేనక'లో ఆ టైమింగ్ కనిపించలేదు. ఓవరాల్ గా కష్టపడకుండా ఏదీ రాదని, యువత కలలు కంటే సరిపోదని, కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సందేశంతో తెరకెక్కిన సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చివరిలో మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ రెండూ మంచి పాయింట్స్. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. అసలు నవ్వించలేదు. అల్లరి నరేష్ మరోసారి డిజప్పాయింట్ చేశారు. కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి.



Sep 08, 2026 Telugu
5.0
out of 10
ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ "రంభ ఊర్వశి మేనక" చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్‌ అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ మధ్య గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అలాంటి జోనర్‌లో ఈ మూవీ చేశాడు. చేస్తే చేశాడు కానీ, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కామెడీ ఉండాలి, కానీ ఆయన తన ఇరవై ఏళ్ల క్రితం స్టయిల్‌ కామెడీతోనే రావడం, అదే ఫ...

ఇంద్రలోకం, దేవలోకం, యమలోకంతో ముడిపెడుతూ కామెడీ ప్రధానంగా చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ "రంభ ఊర్వశి మేనక" చాలా కాలం తర్వాత వచ్చిన మూవీ అని చెప్పొచ్చు. ఇక అల్లరి నరేష్‌ అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఈ మధ్య గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అలాంటి జోనర్‌లో ఈ మూవీ చేశాడు. చేస్తే చేశాడు కానీ, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా కామెడీ ఉండాలి, కానీ ఆయన తన ఇరవై ఏళ్ల క్రితం స్టయిల్‌ కామెడీతోనే రావడం, అదే ఫార్మాట్‌లో ఈ మూవీ చేయడం గమనార్హం. 


మూవీ స్టార్టింగ్ నుంచి అల్లరి నరేష్‌ మార్క్ రొటీన్‌ కామెడీ డైలాగ్‌లు, సీన్లతో సాగుతుంది. సీన్లలో మ్యాటర్‌ లేదు, డైలాగ్‌ల్లో కామెడీ లేదు. పైగా నాయిస్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో నవ్వు రాదు కదా, చిరాకు తెప్పిస్తుంది. చాలా సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. సీన్లలో క్వాలిటీ లేదు. అంతా ఊహించినట్టుగా, మరోవైపు రొటీన్‌గా నడుస్తుంటాయి. ఓవరాల్‌ గా మూవీ క్లైమాక్స్ ఉన్నంతలో బెటర్‌ గా ఉంటుంది. మిగిలిన సినిమా మొత్తం రొటీన్‌ రొడ్డకొట్టుడు, అరిగిపోయిన ఓల్డ్ ఫార్మాట్‌లో సాగే కామెడీ మూవీగా చెప్పొచ్చు.


ఓవరాల్ గా ఇది అల్లరి నరేష్‌ మార్క్ పరమ రొటీన్‌ కామెడీ సినిమా. నవ్వులు తక్కువ గోల ఎక్కువ. అల్లరి నరేష్‌ తన బలమైన గ్రౌండ్‌(కామెడీ)లోనూ సిక్స్ కాదు కదా, కనీసం ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు.




Sep 08, 2026 Telugu
4.0
out of 10
సినిమా రివ్యూ: రంభ ఊర్వశి మేనకఏదో కొత్త రుచి చూపిస్తారనుకుంటే, తిప్పి తిప్పి అదే పాత చింతకాయ పచ్చడిని విస్తరిలో వడ్డించారు! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలు చూస్తుంటే మన తాతల కాలం నాటి దేవలోకం ఫార్ములాకి కాస్త తిరగమాత పెట్టి రీ-సర్వ్ చేసినట్టే ఉంది.దేవలోకం కాన్సెప్ట్, యముడి హడావుడి, సుడిగాడు టైమ్ నాటి పాత స్పూఫ్‌లు.. ఇవన్నీ మనం ఎన్నో ఏళ్లుగా నమిలేసిన పాత రోటీన్ పిండే! రీసెంట్‌గా మంచి కంటెంట్ ఉన్న...

సినిమా రివ్యూ: రంభ ఊర్వశి మేనక

ఏదో కొత్త రుచి చూపిస్తారనుకుంటే, తిప్పి తిప్పి అదే పాత చింతకాయ పచ్చడిని విస్తరిలో వడ్డించారు! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలు చూస్తుంటే మన తాతల కాలం నాటి దేవలోకం ఫార్ములాకి కాస్త తిరగమాత పెట్టి రీ-సర్వ్ చేసినట్టే ఉంది.


దేవలోకం కాన్సెప్ట్, యముడి హడావుడి, సుడిగాడు టైమ్ నాటి పాత స్పూఫ్‌లు.. ఇవన్నీ మనం ఎన్నో ఏళ్లుగా నమిలేసిన పాత రోటీన్ పిండే! రీసెంట్‌గా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన అల్లరి నరేష్, మళ్లీ ఈ బూజు పట్టిన రెసిపీని ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు.


ఆయన తన టైమింగ్‌తో కాపాడే ప్రయత్నం చేసినా, చప్పబడిన సీన్ల వల్ల ఎక్కడా నవ్వులు పండవు. ద్వితీయార్థంలో సాగదీత ఎక్కువై ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

ఆఖరి మాట:

ఏమాత్రం కొత్తదనం లేని ఈ పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాను జీర్ణించుకోవడం కష్టమే. నిరభ్యంతరంగా స్కిప్ చేసేయొచ్చు!

Sep 08, 2026 Telugu

Romanchakam movie review

6.0
out of 10
ఐయామ్ గేమ్.. దుల్కర్ ఆడిన గేమ్ ఎలా ఉందంటే?దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్య...

ఐయామ్ గేమ్.. దుల్కర్ ఆడిన గేమ్ ఎలా ఉందంటే?


దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ తెరకెక్కించిన యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో మొదలయ్యే కథ.. ఊహించని మలుపులతో సాగుతుంది. కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించినా.. సెకండాఫ్‌లో కథనం కొంత గాడి తప్పుతుంది.


దుల్కర్ సల్మాన్ తన పాత్రలో మరోసారి మంచి పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాత్రలో వచ్చే మార్పులను ఆయన ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో చక్కగా చూపించారు. ఆంటోని వర్గీస్, మిస్కిన్ తమ పాత్రలకు న్యాయం చేయగా.. కయాదు లోహర్ ఆకట్టుకున్నారు.

సినిమాకు జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం. జిమ్షి ఖాలీద్ సినిమాటోగ్రఫీ విజువల్‌గా రిచ్‌గా ఉంది. అయితే లాంగ్ రన్‌టైమ్, సెకండాఫ్‌లో స్లో నెరేషన్, కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ మైనస్‌గా నిలిచాయి.

Sep 08, 2026 Telugu

Rambha Oorvasi menaka movie review

Gulte

By Gulte

4.0
out of 10
Allari Naresh who is doing too many Serious films these days is back to his strong forte, comedy with Ramba Oorvashi Menaka. Directed by Chandramohan, the movie is jointly produced by Hasya Movies Razesh Danda and Annapurna Studios.Allari Naresh is sincere in his act in the film. Probably, he has done more comedy characters than any of the heroes in this generation. But then, he is letdown by some...

Allari Naresh who is doing too many Serious films these days is back to his strong forte, comedy with Ramba Oorvashi Menaka. Directed by Chandramohan, the movie is jointly produced by Hasya Movies Razesh Danda and Annapurna Studios.


Allari Naresh is sincere in his act in the film. Probably, he has done more comedy characters than any of the heroes in this generation. But then, he is letdown by some bad writing in the film.


Positives:


1.⁠ ⁠A Few Comedy Episodes


Negatives:


1.⁠ ⁠Outdated Ideas In Writing

2.⁠ ⁠Unexciting Execution

3.⁠ ⁠Bland Emotions

4.⁠ ⁠Excessive pop-culture References


Overall, Ramba Oorvashi Menaka, offers nothing new to the audience.


Bottomline: Outdated Comedy




Sep 08, 2026 Telugu

I'M Game movie review

Gulte

By Gulte

5.0
out of 10
Dulquer Salmaan came up with ‘I’m Game’, an action fantasy thriller, in the direction of Nahas Hidhayath. Kayadu Lohar, played the lead actress role while Antony Varghese, Mysskin, Samyuktha Viswanathan and Kathir played crucial roles in the film. Let’s figure it out with a detailed analysis.Positives:1.⁠ ⁠First Half2.⁠ ⁠Dulquer’s PerformanceNegatives:1.⁠ ⁠Second Half2.⁠ ⁠Predictable Backstory3.⁠...

Dulquer Salmaan came up with ‘I’m Game’, an action fantasy thriller, in the direction of Nahas Hidhayath. Kayadu Lohar, played the lead actress role while Antony Varghese, Mysskin, Samyuktha Viswanathan and Kathir played crucial roles in the film. Let’s figure it out with a detailed analysis.


Positives:


1.⁠ ⁠First Half

2.⁠ ⁠Dulquer’s Performance


Negatives:


1.⁠ ⁠Second Half

2.⁠ ⁠Predictable Backstory

3.⁠ ⁠Excessive Runtime

4.⁠ ⁠Dragged-Out Action Episodes


Overall, I’m Game appeared promising in the first half with quite a few thrilling moments but the predictable execution during the second half along with unnecessary commercial elements, worked against the film. Especially, the film tests patience after a point with repetitive sequences. Better care in editing, a crisp runtime and an engaging backstory, could have made the film a memorable one but what we eventually got to see is a film which does not use its interesting core point to its full potential.



Bottom Line – ‘Game’ Lost In Second Innings

Sep 08, 2026 Telugu +1
6.0
out of 10
దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు రాసుకొన్న పొలిటికల్, క్రైమ్ డ్రామా పాయింట్ బాగుంది. అలాగే స్టోరి పాయింట్‌ కు తగినట్టుగా కొన్ని బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నం కూడా బాగుంది. కాకపోతే రెగ్యులర్ సీన్లు, రొటీన్ ఫార్మాట్ ఎంచుకోకుండా ఉండాల్సిందన ఫీలింగ్ కలుగుతుంది. ఇక డైరెక్టర్ నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం కూడా బాగుంది. సాయికుమార్,...

దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు రాసుకొన్న పొలిటికల్, క్రైమ్ డ్రామా పాయింట్ బాగుంది. అలాగే స్టోరి పాయింట్‌ కు తగినట్టుగా కొన్ని బలమైన సన్నివేశాలతో గ్రిప్పింగ్‌గా కథను చెప్పే ప్రయత్నం కూడా బాగుంది. కాకపోతే రెగ్యులర్ సీన్లు, రొటీన్ ఫార్మాట్ ఎంచుకోకుండా ఉండాల్సిందన ఫీలింగ్ కలుగుతుంది. 


ఇక డైరెక్టర్ నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం కూడా బాగుంది. సాయికుమార్, సుమన్ అలాగే వితికా షేరు లకు మంచి స్ట్రాంగ్ రోల్స్ పడ్డాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.


దర్శకుడు జై ఙ్ఞాన ప్రభ తోట ఎక్కడా డివియేట్ కాకుండా తను చెప్పాలనుకున్న కథను మెసేజ్ రూపంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. డెబ్యూ దర్శకుడే అయినా... పొలిటికల్ యాక్షన్ డ్రామాను చాలా ఎంగేజింగా తీశారు. రచయిత చంద్రబోస్ రాసిన పాటలు బాగున్నాయి. కాకపోతే ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను ఈ వారం సరదాగా చూసేయండి.


Sep 08, 2026 Telugu
6.0
out of 10
ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam)..అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ టైటిల్ పరంగా బాగానే ఉన్నా, సినిమాలో మాత్రం అంత విషయం లేనట్టు అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచయిత చంద్రబోస్ ‘రంగస్థలం’ తర్వాత అంతటి సంతృప్తిని ఇచ్చిన చిత్రమిదని ఆయన చెప్పడంతో.. నార్మల్‌గానే సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కానీ సినిమాలో మాత్రం అంత స్టఫ్ కనిపించలేదు. అయితే సినిమాలో బైర్రాజుగా సాయికుమా...

ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam)..అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ టైటిల్ పరంగా బాగానే ఉన్నా, సినిమాలో మాత్రం అంత విషయం లేనట్టు అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచయిత చంద్రబోస్ ‘రంగస్థలం’ తర్వాత అంతటి సంతృప్తిని ఇచ్చిన చిత్రమిదని ఆయన చెప్పడంతో.. నార్మల్‌గానే సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కానీ సినిమాలో మాత్రం అంత స్టఫ్ కనిపించలేదు.

 

అయితే సినిమాలో బైర్రాజుగా సాయికుమార్ ని చూపించిన తీరు బాగుంది. అలాగే మాదకద్రవ్యాల బిజినెస్‌తో కాలేజీ స్టూడెంట్స్ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయనేది చూపించి, బర్నింగ్ టాపిక్‌ ని దర్శకుడు టచ్ చేశాడు. కానీ, తొలి చిత్రం కావడంతో అనుభవలేమీ.. హిట్‌ కు అడుగడుగునా అడ్డుపడిందనే చెప్పాలి. సాయి కుమార్ ని విలన్‌ గా చూపించాలంటే ‘ప్రస్థానం’ చిత్రాన్ని బీట్ చేసేలా పాత్ర ఉండాలి. కానీ సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారి డైలాగ్స్ చెప్పించడంపైనే దృష్టి పెట్టారు. కానీ ఆ పాత్ర స్వభావాన్ని ఎలివేట్ చేయలేకపోయారు. 


పైగా ఈ కాన్సెప్ట్స్‌తో చాలా సినిమాలు వచ్చాయి. వాటిని అందుకునే రేంజ్ మాత్రం సినిమాలో లేదు. అయితే డైలాగ్స్, పాటలు మినహా.. ఈ సినిమాలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం రొటీన్‌గానే సాగింది.

Sep 08, 2026 Telugu
5.0
out of 10
తెలుగులో సోషియో ఫాంటసీలకు కొదవలేదు. పైగా దేవలోకం, యమలోకం నేపథ్యంలో ఎన్నో సినిమాలు యేళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాల్లోని అంశాలు తీసుకుని దర్శకుడు చంద్రమోహన్‌ 'పులిహోర' కలిపారు. అంతే! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇందులో చాలా సన్నివేశాలు స్పూఫ్ తో సాగి 'సుడిగాడు' మూవీని గుర్తు చేస్తాయి. జయాపజయాలను పక్కన పెడితే ఈ మధ్య కాలంలో 'అల్లరి' నరేశ్‌ కంటెంట్ బ...

తెలుగులో సోషియో ఫాంటసీలకు కొదవలేదు. పైగా దేవలోకం, యమలోకం నేపథ్యంలో ఎన్నో సినిమాలు యేళ్ళ తరబడి వస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చిన ఇలాంటి సినిమాల్లోని అంశాలు తీసుకుని దర్శకుడు చంద్రమోహన్‌ 'పులిహోర' కలిపారు. అంతే! రంభ ఊర్వశి మేనక సినిమా కథ, కథనాలలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇందులో చాలా సన్నివేశాలు స్పూఫ్ తో సాగి 'సుడిగాడు' మూవీని గుర్తు చేస్తాయి. జయాపజయాలను పక్కన పెడితే ఈ మధ్య కాలంలో 'అల్లరి' నరేశ్‌ కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తున్నాడు. దాంతో అతనిలోని నటుడు వెలుగులోకి వస్తున్నాడు. కానీ ఈ తరహా రొట్టకొట్టుడు కథలను ఎంచుకుని, సినిమాలు చేస్తే జనం ఆదరిస్తారని ఎలా అనుకున్నాడో అర్థం కాదు. 


ఇక నటన విషయానికి వస్తే అల్లరి నరేశ్‌ కు ఇలాంటి పాత్ర చేయడం నల్లేరు మీద బండి నడక. అలానే సాఫీగా లాగించేశాడు. మిగతా వాళ్ళందరూ సోసోగానే నటించారు. అయితే అల్లరి నరేశ్‌ తనదైన కామెడీని పండించాలని అనుకున్నప్పుడు ఈ తరం మెచ్చే కథలను ఎంచుకోవాలని తప్పితే... కోల్డ్ స్టోరేజ్ లోని స్టోరీలను ఇకపై ముట్టుకోకుండా ఉంటే బెటర్. ఈ కథను జనం మెచ్చుతారని నిర్మాతలు రాజేశ్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ ఎలా నమ్మి కోట్లు ఖర్చు పెట్టారో అర్థమే కాదు. ఓవరాల్ గా ఈ పాత చింతకాయ పచ్చడిని ఎంజాయ్ చేయాలంటే చాలా ఓపికుండాలి. 


Sep 07, 2026 Telugu

IM Game movie review

7.0
out of 10
దుల్కర్ సల్మాన్‌ నటించిన ఐమ్ గేమ్ సినిమా గురించి చెప్పుకుంటే... తన యాక్టింగ్ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని కాసినో, క్రికెట్ బెట్టింగ్ అంశాలను దర్శకుడు నివాస్ రాసుకొన్న ఇంటెన్సివ్ కథ, దుల్కర్‌ సల్మాన్ చేత మరోసారి నట విశ్వరూపం చూపించే ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌ దుల్కర్ సల్మాన్ తన పాత్రలో పెర్ఫార్మెన్స్ పరంగా చెలరేగిపోయారు. ప్రీమియర్ లీగ్ టోర్ని క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా క్రికెటర్ల...

దుల్కర్ సల్మాన్‌ నటించిన ఐమ్ గేమ్ సినిమా గురించి చెప్పుకుంటే... తన యాక్టింగ్ ప్రతిభను దృష్టిలో పెట్టుకొని కాసినో, క్రికెట్ బెట్టింగ్ అంశాలను దర్శకుడు నివాస్ రాసుకొన్న ఇంటెన్సివ్ కథ, దుల్కర్‌ సల్మాన్ చేత మరోసారి నట విశ్వరూపం చూపించే ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఫస్టాఫ్‌ దుల్కర్ సల్మాన్ తన పాత్రలో పెర్ఫార్మెన్స్ పరంగా చెలరేగిపోయారు. ప్రీమియర్ లీగ్ టోర్ని క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా క్రికెటర్ల జీవితాలు ఎలా డేంజరస్‌గా మారుతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చూపించారు.


ఇక సెకండాఫ్‌లో మిస్కిన్, ఆంటోని వర్గీస్ సినిమాకు మరింత బలంగా మారారు. కాయదు లోహర్ ఈ సినిమాకు గ్లామర్ పరంగానే కాకుండా తనకు లభించిన స్పేస్‌లో యాక్టింగ్‌తో మెప్పించారు. సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫి, స్పోర్ట్స్ కోరియోగ్రఫి బాగా డిజైన్ చేశారు. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎమోషనల్‌గాను, యాక్షన్ మోడ్‌ను బాగా ఎలిమేట్ చేసింది. జిమ్‌షి ఖాలీద్ సినిమాటోగ్రఫి ఈ సినిమాను క్వాలిటీగా, రిచ్‌గా చూపించారు. ఓవరాల్ గా ఒక డిఫరెంట్ కంటెంట్, హై ఎండ్ పెర్ఫార్మెన్స్ చూడాలనుకొంటే.. ఈ వారం ఐయామ్ గేమ్ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ఈ సినిమా మంచి థియేట్రికల్ వాల్యూ ఉన్న సినిమా. మంచి అనుభూతి కలిగిస్తుంది.


Sep 07, 2026 Telugu +1

Rambha oorvasi menaka movie review

Tupaki

By Tupaki

5.0
out of 10
సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమాతో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు అల్లరి నరేష్. సీరియస్ సినిమాలు కొన్ని తేడా కొట్టాక ఒకప్పుడు తనకు అనేక విజయాలందించిన కామెడీ జానర్లో రంభ ఊర్వశి మేనక మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. అల్లరి నరేష్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మాట వాస్తవం. అతడికో మంచి హిట్ పడాలని...

సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమాతో విజయాన్నందుకున్నప్పటికీ.. ఆ తర్వాత ట్రాక్ తప్పాడు అల్లరి నరేష్. సీరియస్ సినిమాలు కొన్ని తేడా కొట్టాక ఒకప్పుడు తనకు అనేక విజయాలందించిన కామెడీ జానర్లో రంభ ఊర్వశి మేనక మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. 


అల్లరి నరేష్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మాట వాస్తవం. అతడికో మంచి హిట్ పడాలని అందరూ కోరుకుంటారన్నది నిజం. కానీ ఇప్పుడు అతను కామెడీ ట్రై చేస్తున్నా ముందులా నవ్వులు పండట్లేదని ‘ఆ ఒక్కటీ అడక్కు’తోనే రుజువైంది. ఒకవేళ కామెడీ ట్రై చేసినా.. ఇప్పటి ట్రెండుకు తగ్గ కథను ఎంచుకుని డిఫరెంటుగా ఏదైనా ప్రయత్నించాలి కానీ.. కానీ ‘రంభ ఊర్వశి మేనక’లో ఓల్డ్ ట్రీట్మెంట్ వల్ల చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు అసహనమే కలిగిస్తాయి. ఇందులో ఇచ్చిన మెసేజ్ ఎన్నో వందల సినిమాల్లో చూసిందే. ఈ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరమా అన్నట్లుగా నడుస్తుందీ సినిమా.


ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ సినిమాలు బాగా నడిచిన రోజుల్లో ఈ కథను ట్రై చేస్తే బాగుండేది. ఈ రోజుల్లో మాత్రం ఇలాంటి కథ.. ఈ తరహా నరేషన్ తో మెప్పించడం చాలా కష్టం. చివరగా: రంభ ఊర్వశి మేనక.. మ్యాజిక్ పని చేయలేదు 

Sep 07, 2026 Telugu
Why MRO?