Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

780
Total Reviews
122
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 385-396 of 780 reviews
Clear all filters

Mareechika movie Review

3.0
out of 10
మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహిం...

మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ 'మరీచిక'లో థ్రిల్లర్ ఒక సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. కాని ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది.


ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ని చాలా నిరాశపరిచింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మరీచిక... పేరుకు తగ్గట్లుందీ ఈ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు స్కిప్ చేయడం బెటర్. లేదంటే ఓటిటిలో చూసేయొచ్చు. 

Jun 01, 2026 Telugu

Mareechika Movie Review

4.0
out of 10
మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్‌ ను జస్టిఫై చేశారు మేకర్స్. సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ...

మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్‌ ను జస్టిఫై చేశారు మేకర్స్. 


సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ కోసం మరికొందరు, స్నేహం కోసం ఇంకొందరు, ఆస్తుల కోసం మరికొందరు! ఈ డ్రామాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెసుకోవడమే పెద్ద పజిల్‌. ప్రేక్షకులకు ఇలాంటి ప్రహేళికను ఇచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ బోరింగ్ సీన్లతో, పస లేని కథతో ఆడియన్స్ కి విసుగుపుట్టించారు. ఇళయరాజా సంగీతం అందించారనో, కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉన్నారనో ఆశతో థియేటర్ కు వెళితే... ఎడారిలో ఎండమావిలా అవుతుంది ప్రేక్షకుల పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలానూ ఓటీటీలో వస్తుంది. అప్పుడు కూడా తీరుబడి ఉంటే... మీ కిష్టమైన అనుపమా పరమేశ్వరన్‌ నటన కోసం ఓసారి చూడండి. అంతే..

Jun 01, 2026 Telugu

Mareechika Movie Review

4.0
out of 10
సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్‌ తో కథను అత్యంత ఆస...

సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్‌ తో కథను అత్యంత ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ అదే క్యూరియాసిటీని ఆడియెన్స్‌ లో కొనసాగించలేకపోయాడనే చెప్పాలి. 


స్క్రీన్ ప్లే విషయంలో గందరగోళం కారణంగా ఒక మంచి పాయింట్‌తో వచ్చిన కథ ఆడియెన్‌ ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఇచ్చారు. కానీ కథలో కంటెంట్ బలంగా లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం, స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇళయరాజా కూడా తన మార్కు చూపించలేకపోయారనిపిస్తుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫి బాగుంది. రాజీవ్ చిలక, మేఘా చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే డీసెంట్ థ్రిల్లర్ అయి ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయిందనే చెప్పాలి.


Jun 01, 2026 Telugu

Mareechika movie Review

5.0
out of 10
ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సై...

ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.


ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కథనంలో బలహీనత కారణంగా మరీచిక చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.

May 30, 2026 Telugu

Drishyam Movie Telugu

5.0
out of 10
దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్‌ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్‌ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్‌, మీనానటించగా, ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్‌ వచ్చింది. అయితే గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్‌ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నా...

దృశ్యం సినిమాలకు ఇండియా వైడ్ గా మంచి క్రేజ్‌ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు అన్ని భాషల్లో పెద్ద హిట్‌ అయ్యాయి. దీనికి మూలం మలయాళం. అక్కడ మోహన్‌లాల్‌, మీనానటించగా, ఇందులో భాగంగా ఇప్పుడు మలయాళంలో మూడో సీక్వెల్‌ వచ్చింది. అయితే గత రెండు చిత్రాల మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో పార్ట్ కూడా అదే తరహాలో ఎంగేజ్‌ చేసిందా? ట్విస్ట్ లు, టర్న్ లతో సాగిందా? అవి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయా? అంటే ఆ స్థాయిలో లేదనే చెప్పాలి.


సినిమా ప్రారంభం నుంచి చాలా స్లోగా సాగుతుంది. కథ ముందే తెలియడంతో ఇందులో కథనం ఊహించినట్టుగానే ఉంటుంది. దీనికితోడు కథలో ఇంటెన్సిటీ మూడ్‌ ని క్రియేట్‌ చేయడానికి దర్శకుడు చాలా టైమ్‌ తీసుకున్నారు. దీంతో బోరింగ్‌ గా ఉంటుంది. మధ్య మధ్యలో థ్రిల్‌ ఎలిమెంట్లు ఒకటి రెండు యాడ్‌ చేశారు. కానీ అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. నటీనటుల పెర్ఫార్మన్స్ వరకు మోహన్ లాల్ సహా అందరూ బానే చేసారు. కానీ ఆ పాత్రలకు కనెక్ట్ అవ్వాలంటే కొంచెం కష్టమే. ఓవరాల్ గా స్లోగా, బోరింగ్‌ గా సాగే ఈ దృశ్యం 3 మూవీ, మధ్య మధ్యలో చిన్న మెరుపులు, క్లైమాక్స్ తో కాస్త ఆకట్టుకుంటుంది. అయితే గత రెండు సినిమాలతో పోల్చితే డిజప్పాయింట్‌ చేస్తుంది.


May 23, 2026 Telugu +1

Drishyam 3 Movie Review

6.0
out of 10
మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్రం అంతగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు దృశ్యం అంటేనే అద్భుతమైన స్క్రీన్‌ ప్లే, ఊహించని ట్విస్టులు...

మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం "దృశ్యం 3". జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 'దృశ్యం' మూవీ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ గా వచ్చింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న పాపులారిటీ వల్ల ఈసారి తెలుగు రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. అయితే ఈ మూడో పార్ట్ మాత్రం అంతగా రెస్పాన్స్ అందుకోలేకపోయింది. అసలు దృశ్యం అంటేనే అద్భుతమైన స్క్రీన్‌ ప్లే, ఊహించని ట్విస్టులు గుర్తుకొస్తాయి. కానీ దృశ్యం 3 మాత్రం ఆ స్థాయి మాయాజాలాన్ని పూర్తిగా అందుకోలేకపోయింది.



జీతు జోసెఫ్ పేరు వినగానే ప్రేక్షకులు పెద్ద ట్విస్టులు, తెలివైన కథనాన్ని ఆశిస్తారు. కానీ ఈసారి ఆయన కథను చాలా సాధారణంగా చెప్పిన భావన కలుగుతుంది. గత రెండు భాగాలతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తదనం తక్కువగా కనిపిస్తుంది. ఇక గ్రామీణ వాతావరణాన్నయితే సహజంగా చూపించారు. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాల్సింది. మొదటి భాగంలో అనవసరంగా సాగదీసిన సన్నివేశాలు తగ్గించి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. ఓవరాల్ గా దృశ్యం 3 మూవీని తక్కువ అంచనాలతో చూస్తే బెటర్. 


May 23, 2026 Telugu +1

Drishyam 3 Movie Review

5.0
out of 10
దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో crime thriller‌ని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా తాజాగా ‘దృశ్యం-3’ విడుదల కాగా, మలయాళ డబ్ నే తెలుగులోనూ రిలీజ్ చేసారు. కథా, కథనాల గురించి మాట్లాడితే ముందు భాగాల్లో ఉన్న ఆత్రుత, ఇంట్రెస్ట్ ఈ మూడో భాగంలో ఉండదు. మోహన్ లాల్ సహా మిగతా నటీనటులందరూ బా...

దృశ్యం’ అనే పేరు వినగానే ఆడియన్స్‌కు ముందుగా గుర్తొచ్చేది mind game screenplay. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో crime thriller‌ని mix చేసి ప్రేక్షకులని సీట్ల ఎడ్జ్ మీద కూర్చోబెట్టిన ఫ్రాంచైజ్ ఇది. ఇందులో భాగంగా తాజాగా ‘దృశ్యం-3’ విడుదల కాగా, మలయాళ డబ్ నే తెలుగులోనూ రిలీజ్ చేసారు. కథా, కథనాల గురించి మాట్లాడితే ముందు భాగాల్లో ఉన్న ఆత్రుత, ఇంట్రెస్ట్ ఈ మూడో భాగంలో ఉండదు. మోహన్ లాల్ సహా మిగతా నటీనటులందరూ బాగానే చేసినా, కథలో మాత్రం ఒక wow factor కనిపించదు. 


ఫస్టాఫ్ అంతా స్లో గా సాగదీసినట్టు ఉండడమే కాకుండా, ట్విస్టులు కూడా పెద్దగా షాక్ ఇవ్వవు. పైగా తెలుగు డబ్బింగ్ మేజర్ మైనస్ అయింది. డబ్బింగ్ సినిమాటిక్ గా, సహజంగా ఉండదు. ఓవరాల్ గా సినిమాలో క్లైమాక్స్ 20 నిముషాలు మినహా మొత్తం సినిమా డల్ గా ఉంటుంది. బీజీఎమ్ కూడా పెద్దగా హెల్ప్ అవలేదు. ఓవరాల్ గా దృశ్యం 3 గురించి సింపుల్ గా చెప్పాలంటే... లౌ ఎక్స్పెక్టేషన్స్ తో ఒకసారి చూసేయొచ్చు. కానీ ఇప్పటికైనా దృశ్యం సిరీస్ గౌరవాన్ని కాపాడుతూ.. ఈ సిరీస్ ఇక్కడితో ఆపేస్తే బెటర్. మొదటి రెండు భాగాలతో పోలిస్తే దృశ్యం 3 మసకబారింది. 

May 23, 2026 Telugu +1

Drishyam Movie Review

5.0
out of 10
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని విడుదల చేశారు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకులకు ఎదురయ్యే మొదటి సమస్య ఒరిజినల్ వె...

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆ రెండూ మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు రీమేక్స్. అయితే 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో సినిమాను రీమేక్ చేయలేదు. తాజాగా తెలుగులోనూ మోహన్ లాల్ సినిమాను డబ్బింగ్ చేసి దృశ్యం 3 ని విడుదల చేశారు. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకులకు ఎదురయ్యే మొదటి సమస్య ఒరిజినల్ వెర్షన్ లో , ప్రధాన పాత్రధారులను తొందరగా పోల్చుకోకపోవడం.


అందువల్ల కొంతమంది తెలుగు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ కాకపోవచ్చు. ఇక 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాల్లో కథతో పాటు కథనం కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. ట్విస్టులు సర్‌ప్రైజ్ చేయడంతో పాటు షాక్ ఇస్తాయి. పోలీస్ స్టేషన్ కింద దొరికిన అస్థిపంజరం వరుణ్‌ ది కాదని కోర్టులో తెలిసే సీన్, లాయర్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. కానీ 'దృశ్యం 3'లో అటువంటి సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఆ సంగతి పక్కన పెడితే... 'దృశ్యం' ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాల్లో సగం ఉత్కంఠ కూడా మూడో భాగం ఇవ్వలేదు. అందుకే ముందు భాగాల్లాగా దృశ్యం 3కి థియేటర్లలో థ్రిల్ అవ్వడం చాలా కష్టం. మోహన్ లాల్ వీరాభిమానులను సైతం దృశ్యం 3 మెప్పించడం కష్టమే అనిపిస్తుంది. 


May 23, 2026 Telugu +1

Drishyam Movie Review

Tupaki

By Tupaki

5.0
out of 10
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెలుగు మలయాళ భాషలలో విడుదలైంది. మలయాళం వెర్షన్ నే తెలుగులోనూ రిలీజ్ చేయగా, మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించారు. అయితే తెరపై జీతు-మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకం...

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ల జాబితా తీస్తే అందులో ‘దృశ్యం’ కచ్చితంగా ఉంటుంది. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం-2’ సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమా తెలుగు మలయాళ భాషలలో విడుదలైంది. మలయాళం వెర్షన్ నే తెలుగులోనూ రిలీజ్ చేయగా, మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ గా నటించారు. అయితే తెరపై జీతు-మోహన్ లాల్ కలిసి మరోసారి ఏదో మ్యాజిక్ చేసే ఉంటారని ఎంతో నమ్మకంతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. 


జార్జి కుట్టి క్యారెక్టర్.. ‘దృశ్యం’ ఫార్మాట్ బాగా అలవాటైపోయి ఉండడం వల్ల కొత్తదనం ఫీలవ్వలేని పరిస్థితి రావడం ‘దృశ్యం-3’కి అతి పెద్ద ప్రతికూలతగా మారింది. మోహన్ లాల్ మినహా వేరే క్యారెక్టర్లు పెద్దగా ఆకట్టుకోవు. పైగా తెలుగు డబ్బింగ్ బాగా చేయలేదు. డబ్బింగ్ వాసనలు గుప్పుమంటాయి. అన్నిటికి మించి తెలుగు ఆడియన్స్ వెంకటేష్ ప్లేస్ లో వేరే నటుడ్ని ఈజీగా కనెక్ట్ అవలేరు. జీతు జోసెఫ్ ఈసారి రచయితగా.. దర్శకుడిగా తన ప్రమాణాలను అందుకోలేకపోయాడు. దృశ్యం.. దృశ్యం-2 చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ రైటింగ్ తో కట్టిపడేసిన జీతు.. ఈసారి నిరాశపరిచాడు. ముఖ్యంగా ప్రేక్షకుల బుర్రలకు పని పెట్టేలా సాగే తన మార్కు స్క్రీన్ ప్లే ఇందులో మిస్ అయింది. దర్శకుడిగానూ జీతు పనితనానికి యావరేజ్ మార్కులే పడతాయి.

May 23, 2026 Telugu +1

Drishyam 3 Movie Review

5.0
out of 10
మోహన్‌ లాల్‌, మీనా (Meena) జంటగా నటించిన మలయాళ చిత్రం దృశ్యం రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్‌ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్‌ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్‌ చేయకుండా డబ్‌ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే మొదటి రెండు భాగాల...

మోహన్‌ లాల్‌, మీనా (Meena) జంటగా నటించిన మలయాళ చిత్రం దృశ్యం రెండు భాగాలను తెలుగులో వెంకటేశ్‌ (Venkatesh), మీనా చేశారు. అక్కడ మాదిరిగానే ఇక్కడా 'దృశ్యం, దృశ్యం 2' హిట్‌ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం 'దృశ్యం 3' (Drishyam 3)ని రీమేక్‌ చేయకుండా డబ్‌ చేసి తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు. మోహన్ లాల్, మీనా మెయిన్ లీడ్ లో నటించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. 


అయితే మొదటి రెండు భాగాలతో పోల్చితే... 'దృశ్యం 3' పేలవంగా సాగింది. నటీనటుల విషయానికి వస్తే మోహన్ లాల్ తనదైన శైలిలో జార్జి కుట్టి పాత్రకు మరోసారి ప్రాణం పోశాడు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. దృశ్యం' సీరిస్‌కు దర్శకుడు జీతూ జోసెఫ్‌ స్క్రీన్ ప్లేనే ప్రధాన బలం. మొదటి రెండు భాగాల్లో అది వర్కౌట్‌ అయి, ఆ సినిమాల విజయానికి కారణమైంది. మూడో భాగం దగ్గరకు వచ్చే సరికీ నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా... స్క్రీన్‌ ప్లే ఉత్కంఠను కలిగించలేదు కదా, కథనం నత్తనడకలా సాగి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఓ మాదిరిగా అనిపించవచ్చు కానీ మిగిలిన వారిని 'దృశ్యం 3' ఆకట్టుకోవడం కష్టమే. 

May 22, 2026 Telugu +1

Drishyam 3 Movie Review

6.0
out of 10
దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంతం...

దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. కథలో కొత్తదనం లేకపోవడం, కథ కథనంలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంతం వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు.


ఇక కేరళ అందాలను ఎప్పటిలానే సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఆశీర్వాద్ సినిమాస్, ఆంటోని పెరంబవూర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ట్విస్టులతో సాగే థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి కూడా ఈ దృశ్యం 3 సినిమా నచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. 

May 22, 2026 Telugu +1

Drishyam 3 Movie Review in Telugu

6.0
out of 10
మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడ్డాడు. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మోహన్ లాల్ సహా అందరూ బాగానే నట...

మోహన్ లాల్ నటించిన దృశ్యం 3 సినిమా మళయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవగా, తెలుగులో డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన వెంకటేష్ పాత్రలో మోహన్ లాల్ ని తొందరగా ఊహించుకోలేరు కాబట్టి, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ రెండు పార్ట్స్ స్థాయిలో మూడో పార్ట్ కి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ తడబడ్డాడు. అయితే నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా మోహన్ లాల్ సహా అందరూ బాగానే నటించారు.


ఇక ఓవరాల్ గా చూస్తే... ‘దృశ్యం 3’ ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన రేంజ్ లో అయితే అనిపించలేదు. అలా అని కాకుండా పార్ట్ 3 బానే ఉంది. కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒకే రేంజ్ లో ఉంది. కానీ ఆడియన్స్ మాత్రం ముందు పార్ట్స్ ఇచ్చిన హై ని ఈ మూవీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశ చెందుతారు. ఓవరాల్ గా మోహన్ లాల్ పెర్ఫార్మన్స్ కోసం, మలయాళం మూవీస్ ఇష్టపడే ఆడియన్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ సినిమా ట్రై చేయొచ్చు. కానీ మరింత ఎంగేజింగ్ కథనం మిస్ కావడంతో ఇది మిస్ ఫైర్ అయ్యింది.

May 22, 2026 Telugu +1
Why MRO?