మరీచిక (Mareechika)
విరాజ్ అశ్విన్, అనుపమ పరమేశ్వరన్, రెజీనా కాసాండ్ర మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "మరీచిక". సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా విడుదలైంది.
Available in:
Reviews
What critics and the public are saying about మరీచిక (Mareechika)
Media Reviews
5 Avg: 4.2/10Average
Mareechika Movie Review
మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్య...
మరీచిక సినిమాకు ప్రధాన బలం కథనమే. కానీ డైరెక్టర్ సతీష్ కాశెట్టి దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం ఆశించినంత లేదు. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. సినిమాలో కొన్ని సీన్స్ లో కాస్త ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది.
క్లైమాక్స్ కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంది.. కానీ ఆడియన్స్ ఊహకు అందకుండా నాన్-లీనియర్ పద్ధతిలో కథను నడిపించడంలో స్క్రీన్ ప్లే రైటర్స్ చూపించిన నేర్పు మెచ్చుకోవాలి. అయితే లాజిక్స్ వెతికే వాళ్లకు కొన్ని ప్రశ్నలు మిగిలినా.. ఓవరాల్‌గా ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్నిచోట్ల మాత్రం లాజిక్ ఉండదు.. మరికొన్నిచోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్లకు మరీచిక మంచి ఛాయిసే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మరీచిక.. డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!
Not Good
Mareechika movie Review
మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ ను...
మరీచిక సినిమా ఎలా ఉందో చెప్పే ముందు... ఈ టైటిల్ 'మరీచిక' గురించి ప్రస్తావిస్తే... అసలు మరీచిక అంటే అర్థం ఏమిటి? అని ప్రేక్షకులు కొద్దిమందైనా ఆలోచిస్తారు. అయితే మరీచిక అంటే ఎండమావి అని సినిమాలో చెప్పారు. వేసవిలో ఎండమావి కనిపిస్తుంది, కానీ నీళ్లు ఉండవు. అయితే ఈ సినిమాలోనూ అంతే... నెక్స్ట్ సీన్ నుంచి బావుంటుందని ప్రేక్షకులు ఎదురు చూడటం తప్ప బావుందన్న సంతృప్తి కలగదు. సతీష్ కాసెట్టి దర్శకత్వం వహించిన ఈ 'మరీచిక'లో థ్రిల్లర్ ఒక సినిమాకు కావాల్సిన ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. కాని ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా చెప్పే కథనం, దర్శకత్వం కరువైంది.
ఓవరాల్ గా నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. కానీ సరైన కథనం లేకపోవడంతో ఆడియన్స్ ని చాలా నిరాశపరిచింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మరీచిక... పేరుకు తగ్గట్లుందీ ఈ సినిమా. ఎండమావిలో నీళ్లు లేనట్టు... సినిమాలోనూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్జైట్ చేసే, థ్రిల్ ఇచ్చే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేవు. కథలో క్రైమ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నాయి. కానీ ప్రేక్షకుడు ఆహా అనేలా ఒక్కటీ లేదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు స్కిప్ చేయడం బెటర్. లేదంటే ఓటిటిలో చూసేయొచ్చు.
Below Average
Mareechika Movie Review
మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్ ను జస్టిఫై చేశారు మేకర్స్.&n...
మరీచిక.. అంటూ ఈ వారం విడుదలైన సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ అందుకుంది. ఎంతలా అంటే సినిమాలో మర్డర్ ని చూసి హీరోయిన్ తల పట్టుకుని ఏడుస్తుంది. అలాగే థియేటర్లోని ప్రేక్షకులు సైతం తల పట్టుకునేలా చేశారు సినిమా దర్శకులు. ఆ రకంగా ఈ సినిమా టైటిల్ ను జస్టిఫై చేశారు మేకర్స్.
సింపుల్ గా కథ నేపథ్యం చెప్పాలంటే... ఇందులోని పాత్రలన్నీ డ్రామా ఆడేవే. డబ్బుల కోసం కొందరు, ప్రేమ కోసం మరికొందరు, స్నేహం కోసం ఇంకొందరు, ఆస్తుల కోసం మరికొందరు! ఈ డ్రామాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెసుకోవడమే పెద్ద పజిల్. ప్రేక్షకులకు ఇలాంటి ప్రహేళికను ఇచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ బోరింగ్ సీన్లతో, పస లేని కథతో ఆడియన్స్ కి విసుగుపుట్టించారు. ఇళయరాజా సంగీతం అందించారనో, కాస్త పేరున్న ఆర్టిస్టులు ఉన్నారనో ఆశతో థియేటర్ కు వెళితే... ఎడారిలో ఎండమావిలా అవుతుంది ప్రేక్షకుల పరిస్థితి. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలానూ ఓటీటీలో వస్తుంది. అప్పుడు కూడా తీరుబడి ఉంటే... మీ కిష్టమైన అనుపమా పరమేశ్వరన్ నటన కోసం ఓసారి చూడండి. అంతే..
Below Average
Mareechika Movie Review
సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి...
సైకలాజికల్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, లవ్, రివేంజ్ లాంటి అంశాలతో తెరకెక్కిన మూవీ మరీచిక. తాజాగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బీలో యావరేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే దర్శకుడు సతీష్ కాసెట్టి కథను ఊహించుకోవడం బాగానే ఉన్నా, దానికి తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకొన్నా, కథను సాఫీగా, సూటిగా, సుత్తి లేకుండా చెప్పడంలో పూర్తిగా తడబాటుకు గురయ్యాడు. సంజూ (విరాజ్ అశ్విన్) ని చంపే సీన్ తో కథను అత్యంత ఆసక్తిగా ప్రారంభించాడు. కానీ అదే క్యూరియాసిటీని ఆడియెన్స్ లో కొనసాగించలేకపోయాడనే చెప్పాలి.
స్క్రీన్ ప్లే విషయంలో గందరగోళం కారణంగా ఒక మంచి పాయింట్‌తో వచ్చిన కథ ఆడియెన్ ను ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఇచ్చారు. కానీ కథలో కంటెంట్ బలంగా లేకపోవడం, సన్నివేశాలు పేలవంగా ఉండటం, స్టోరీలో క్లారిటీ లేకపోవడం వల్ల ఇళయరాజా కూడా తన మార్కు చూపించలేకపోయారనిపిస్తుంది. లక్ష్మీభూపాల డైలాగ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. అరవింద్ కన్నాభిరాన్ సినిమాటోగ్రఫి బాగుంది. రాజీవ్ చిలక, మేఘా చిలక అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత దృష్టి పెడితే డీసెంట్ థ్రిల్లర్ అయి ఉండేది. ఆ ఛాన్స్ మిస్ అయిందనే చెప్పాలి.
Average
Mareechika movie Review
ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.ఇక ఓవరాల్ గా చూసుకున్నట...
ఈ వారం థియేటర్లలో విడుదలైన "మరీచిక" మూవీ ప్రేక్షకుల నుండి బీలో యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. సరైన కథా కథనాలు లేకపోవడంతో మూవీ ఆర్టిస్ట్ లు కూడా బాగానే చేసినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నా, ఫలితం లేకపోయింది. దర్శకుడు సతీష్ కాసెట్టి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో విఫలమయ్యారు.
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. ఫైనల్ గా కథనంలో బలహీనత కారణంగా మరీచిక చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.
Public Reviews
3 Avg: 5.0/10Below Average
Mareechika Movie Review
ఎవ్రీ వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా వర్క్ అయిపోయిన తర్వాత ఈవెనింగ్ ఫ్రెండ్స్ తో కలిసి అలా సరదాగా ఏదో ఒక మూవీ చూద్దామని ‘మరీచిక’ మూవీకి వెళ్ళాం. వెళ్లెవరకూ తెలీదు ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని. లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లడం వల్ల సినిమా బీలో యావరేజ్ అనిపించింది. బట్ సినిమా మొత్తం చాలా బోర్ ఫీల్ ఒచ్చి...
ఎవ్రీ వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా వర్క్ అయిపోయిన తర్వాత ఈవెనింగ్ ఫ్రెండ్స్ తో కలిసి అలా సరదాగా ఏదో ఒక మూవీ చూద్దామని ‘మరీచిక’ మూవీకి వెళ్ళాం. వెళ్లెవరకూ తెలీదు ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని. లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్లడం వల్ల సినిమా బీలో యావరేజ్ అనిపించింది. బట్ సినిమా మొత్తం చాలా బోర్ ఫీల్ ఒచ్చింది. ఏదో టైంపాస్ కి కాసేపు ఎంటర్టైన్ అవుదామని సినిమాకొస్తే... సంబంధం లేని సీన్స్ తో తలపట్టుకునేలా చేసారు ఈ సినిమా మేకర్స్.
బట్ కొన్ని ట్విస్ట్స్ థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. అనుపమ, రెజీనా, విరాజ్ అందరూ బెస్ట్ గా పెర్ఫార్మ్ చేసారు. బట్ స్టోరీ కూడా బాగుంటే మేం పెట్టిన మనీ కి శాటిస్ఫై అయ్యేవాళ్ళం. అండ్ నా ఫెవరేట్ ఇళయరాజా మ్యూజిక్ ఉందని ఏదో అనుకుంటే అసలు ఆయనిచ్చిన మ్యూజిక్ లా అస్సలనిపించలేదు. ఓవరాల్ గా ఈ వీక్ ఎవరైనా సినిమా చూద్దామని అనుకుంటే... మరీచికకైతే స్కిప్ కొట్టడం మంచిది.
Average
Review For Mareechika
వారం మొత్తం ఆఫీస్ లో deadlines, meetings, calls తో బిజీగా గడిచిపోయింది. అందుకే Weekend లో రిలాక్స్ అవుదామని friends తో కలిసి ఈ Sunday ‘మరీచిక’ మూవీకి వెళ్లా.. Trailer కూడా చూడకుండా సినిమాకి వెళ్ళాను. అందుకే దానికి తగ్గ రిజల్ట్ అందుకున్నాం. ఏదో మంచి thriller అనుకున్నా, స్టోరీ లైన్ బాగున్నా, సినిమ...
Above Average
Mareechika Movie Review
Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense elements work well in key moments. ilayaraja music is also good, But expected more. overall Mareechika...
Watched Mareechika movie this weekend with low expectations and ended up enjoying it more than I expected. Anupama, Regina, and Viraj Ashwin deliver convincing performances, while the suspense elements work well in key moments.
ilayaraja music is also good, But expected more. overall Mareechika is a decent watchable.
About This Movie
Story : కాలేజ్ స్టూడెంట్ అయిన వెంకటలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) సిటీలో కెఫె ను రన్ చేసే సంజయ్ (విరాజ్ అశ్విన్) ని ప్రేమిస్తూ ఉంటుంది. ఫైనల్ గా ఓ రోజు సంజూ కి లక్ష్మి తన ప్రేమను ప్రపోజ్ చేద్దామనుకునే టైం కి, సంజూ వెంకటలక్ష్మి ద్వారా పరిచయమైన మరీచిక (రెజీనా కసండ్రా)కు ప్రపోజ్ చేస్తాడు. దీంతో లక్ష్మి తన ప్రేమను త్యాగం చేసి మరీచికతో సంజూ పెళ్లిని జరిపిస్తుంది. అయితే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం లక్ష్మీ ముందే సంజూని మరీచిక చంపేసి షాక్ ఇస్తుంది. దీంతో అసలు మరీచిక సంజూను ఎందుకు చంపింది? మరీచికను అరెస్ట్ చేయిద్దామని అనుకున్న లక్ష్మికి ఎదురైన పరిస్థితులేంటి? చివరికి వీళ్ళ ముగ్గురి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి? అనేది కథ.
ముందుగా కథా నేపథ్యం గురించి చెప్పుకుంటే సైకలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంతకు ముందు కూడా కొన్ని మూవీస్ వచ్చాయి. వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. మరీచిక కూడా ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి మూవీస్ కి క్లైమాక్స్ ట్విస్ట్స్ మంచి థ్రిల్ ఇస్తాయి. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక నటీనటులు విరాజ్ అశ్విన్, అనుపమ పరమేశ్వరన్, రెజీనా తో పాటు అజయ్ ఘోష్ పెర్ఫార్మన్స్ కూడా బాగుంది.
అయితే కోర్ పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కూడా దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు డైరెక్టర్ సతీష్ కాసెట్టి. ఇక ఫస్టాఫ్ నుండే చాలా లేజి స్క్రీన్ ప్లే ఉండడం వల్ల ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టయింది. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే సాగదీత సీన్లతో సినిమా మొత్తం బోర్ ఫీల్ ఇస్తుంది. అన్నిటికి మించి ఇన్వస్టిగేషన్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. ఒక్క క్లైమాక్స్ మినహా వేరే ఏ సీన్లు కూడా ఆకట్టుకునేలా లేవు.
టెక్నికల్ గా చూస్తే... ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక మాస్ట్రో ఇళయరాజ ఇచ్చిన మ్యూజిక్ అంతగా వర్క్ అవలేదు. బట్ బీజీఎమ్ సరిగ్గా కుదిరింది. అరవింద్ కన్నబిరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సినిమాలో సాగదీత సీన్లు ఒక అరగంట తగ్గిస్తే సినిమా వేరేలా ఉండేది. కథ పరంగా లక్ష్మి భూపాల్ బాగా ఇచ్చినా, దాన్ని దర్శకుడు సతీష్ కాసెట్టి మంచి సైకలాజికల్ థ్రిల్లర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఇంట్రెస్టింగ్ వే లో మలచలేకపోయారు.
Final Review :
ఇక ఓవరాల్ గా సైకాలజికల్ థ్రిల్లర్ అయినప్పటికీ "మరీచిక" ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేక డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ఆడియన్స్ ని కథ పరంగా ఆకట్టుకునే కంటెంట్ ఉన్నా, దానికి తగ్గ సరైన స్క్రీన్ ప్లే, దర్శకత్వం లేక సినిమా నిలబడలేకపోయింది. పెర్ఫార్మన్స్ పరంగా రెజీనా, అనుపమ, విరాజ్ అశ్విన్ తమ వరకు బాగానే ఇంప్రెస్ చేసారు. ఫైనల్ గా బోరింగ్ థ్రిల్లర్ గా మరీచిక ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.