Register as a Reviewer

Movie Reviews

Professional reviews and ratings from top critics and publications worldwide

780
Total Reviews
122
Movies Reviewed
24
Reviewer Categories
Active filters: Category: Website ×
Showing 289-300 of 780 reviews
Clear all filters

DC Movie Review

డీసీ (DC) 2026 Website
Tupaki

By Tupaki

7.0
out of 10
ఖైదీ.. విక్రమ్.. లియో.. కూలీ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం.. డీసీ. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా అంత గొప్పగా లేకపోయినా పాటల వల్ల ఆడేయడం ఒకప్పటి రోజుల్లో జరిగేది. చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్స్ జరగట్...

ఖైదీ.. విక్రమ్.. లియో.. కూలీ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం.. డీసీ. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


సినిమా అంత గొప్పగా లేకపోయినా పాటల వల్ల ఆడేయడం ఒకప్పటి రోజుల్లో జరిగేది. చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్స్ జరగట్లేదు. అందుకు మారిన పరిస్థితులు.. ప్రేక్షకుల అభిరుచి కారణం. ఈ రోజుల్లో కేవలం మ్యూజిక్ వల్ల ఒక సాధారణమైన సినిమా కూడా మెరుగ్గా అనిపించడం చాలా అరుదే. ఆ అరుదైన జాబితాలో ‘డీసీ’ నిలుస్తుంది. ఈ సినిమా కథ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అయినా సరే.. ‘డీసీ’ బోర్ కొట్టకుండా సాగిపోయేలా చేయడంలో అరుణ్ మాదేశ్వరన్ టేకింగ్ కొంత పాత్ర పోషిస్తే.. మేజర్ క్రెడిట్ అనిరుధ్ రవిచందర్ కే చెందుతుంది. 


ఓవరాల్ గా డిసి ని ఒక మామూలు కథనే, అందంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. దర్శకుడి అభిరుచిని చాటే సన్నివేశాలు చాలానే ఉన్నాయీ సినిమాలో. ముఖ్యంగా తొలిసారి తన గది దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన వేశ్య భావోద్వేగాన్ని చూపించే సన్నివేశాల్లో దర్శకుడి మార్కు కనిపిస్తోంది. చివరగా: డీసీ.. అనిరుధ్ షో..


Aug 08, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 Website
7.0
out of 10
దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌కి కేరాఫ్‌. విజయ్‌ని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. `విక్రమ్‌`, `లియో`, `కూలీ` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు హీరోగా మారి `డీసీ` అనే చిత్రంలో నటించారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇదొక గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే సినిమా. చూడ్డానికి యాక్షన్‌ ప్రధానంగా రన్‌ అవుతుంది. కానీ దీని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటుంది. కాకపోతే...

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌కి కేరాఫ్‌. విజయ్‌ని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. `విక్రమ్‌`, `లియో`, `కూలీ` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు హీరోగా మారి `డీసీ` అనే చిత్రంలో నటించారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇదొక గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే సినిమా. చూడ్డానికి యాక్షన్‌ ప్రధానంగా రన్‌ అవుతుంది. కానీ దీని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటుంది. కాకపోతే తెలుగు నటీనటులు లేరు. దీంతో కనెక్ట్ కావడానికి టైమ్‌ పడుతుంది.


అయితే దేవదాస్‌ పాత్రలో లోకేష్‌ కనగరాజ్‌ దుమ్ములేపాడు. సెటిల్డ్ గా చేశాడు. దర్శకుడే కాదు, ఆయనలో అదిరిపోయే నటుడు కూడా ఉన్నాడని నిరూపించాడు. పార్వతిగా సంజనా కృష్ణమూర్తి అందంగా ఉంది. అంతే బాగా యాక్ట్ చేసింది. ఇక చంద్ర పాత్రలో వామికా గబ్బి దుమ్ములేపింది. అయితే సినిమాలో పోయిటిక్‌ స్టయిల్‌ కనిపిస్తుంది. ఆయా పోయెటిక్‌ ఎలిమెంట్లు కొంత స్లోగా అనిపించినా ఆకట్టుకుంటాయి. లైట్‌ గా హార్ట్ టచ్‌ చేస్తూ యాక్షన్‌, ఎమోషనల్‌గా మెప్పించే డీసీ. లోకేష్‌ కనగరాజ్‌ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది.




Aug 08, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 Website
7.0
out of 10
'డీసీ' టీజర్, ట్రైలర్లలో లోకేష్ కనగరాజ్ స్టైల్ కనిపించిందన్నారు కొందరు. ఓటీటీలో 'చిన్ని' (తమిళ్ ఫిల్మ్ 'సాని కాయిదం') చూసిన ప్రేక్షకులకు అది అరుణ్ మాథేశ్వరన్ స్టైల్ అని తెలుసు. 'డీసీ'లో దర్శక రచయిత అరుణ్ మాథేశ్వరన్ క్లిష్టమైన కథను చెప్పలేదు. సింపుల్ కథను స్ట్రెయిట్‌గా చెప్పారు. సామాన్యులకు న్యాయం లభించినప్పుడు వ్యవస్థపై ఓ వ్యక్తి చేసిన తిరుగుబాటే 'డీసీ'. 'డీసీ'ని పైనుంచి చూస్తే... రివేంజ్ యాక...

'డీసీ' టీజర్, ట్రైలర్లలో లోకేష్ కనగరాజ్ స్టైల్ కనిపించిందన్నారు కొందరు. ఓటీటీలో 'చిన్ని' (తమిళ్ ఫిల్మ్ 'సాని కాయిదం') చూసిన ప్రేక్షకులకు అది అరుణ్ మాథేశ్వరన్ స్టైల్ అని తెలుసు. 'డీసీ'లో దర్శక రచయిత అరుణ్ మాథేశ్వరన్ క్లిష్టమైన కథను చెప్పలేదు. సింపుల్ కథను స్ట్రెయిట్‌గా చెప్పారు. సామాన్యులకు న్యాయం లభించినప్పుడు వ్యవస్థపై ఓ వ్యక్తి చేసిన తిరుగుబాటే 'డీసీ'. 'డీసీ'ని పైనుంచి చూస్తే... రివేంజ్ యాక్షన్ ఫిల్మ్. సింపుల్ స్టోరీని ఎక్సట్రాడినరీగా మార్చినది మాత్రం అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపథ్య సంగీతం. ఆయనతో పాటు ముఖేష్ జి సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటింగ్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్‌ను మర్చిపోలేం. 


ఓవరాల్ గా డీసీ'... దాసు, చంద్రల కథ. ఇదొక మోడ్రన్ దేవదాసు కథ. బాల్యంలో కన్నతల్లి ప్రేమకు దూరమైన ఓ యువకుడు... ప్రేమను వెతుక్కున్న కథ. అయితే... అతని ప్రయాణం పూల పాన్పు కాదు. అడుగడుగునా ముళ్ళబాట. 'దండుపాళ్యం' లాంటి వయలెన్స్ సినిమాలను ప్రేక్షకులు చూశారు. అయితే... అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం రా అండ్ రస్టిక్ వయలెంట్ సినిమాను క్లాసీగా మార్చింది. తెరపై రక్తం పారుతున్నప్పటికీ... యాక్షన్ వస్తున్నప్పటికీ... నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చూసేలా గ్రిప్పింగ్‌గా తీశారు అరుణ్ మాథేశ్వరన్. డోంట్ మిస్ ఇట్.



Aug 08, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 Website
6.0
out of 10
After months of anticipation, Lokesh Kanagaraj’s acting debut, DC, has finally hit theatres. Packed with raw action, graphic violence and a dark emotional undercurrent, the Tamil action drama has generated considerable interest, helped in large part by Anirudh Ravichander’s music.HighlightsAnirudh Ravichander’s musicLokesh Kanagaraj’s screen presenceWamiqa Gabbi’s performanceClimaxAction sequences...

After months of anticipation, Lokesh Kanagaraj’s acting debut, DC, has finally hit theatres. Packed with raw action, graphic violence and a dark emotional undercurrent, the Tamil action drama has generated considerable interest, helped in large part by Anirudh Ravichander’s music.


Highlights

Anirudh Ravichander’s music

Lokesh Kanagaraj’s screen presence

Wamiqa Gabbi’s performance

Climax

Action sequences


Drawbacks

Slow pace in parts

Heavy violence may not appeal to everyone

Limited emotional expression for the lead character


Overall, DC is a gritty action drama powered by Anirudh’s music, strong visuals and a confident acting debut from Lokesh Kanagaraj. It may not be a conventional mass entertainer, but it offers a distinctive theatrical experience for audiences comfortable with intense and graphic violence.


Bottom Line: Gritty Action with Strong Music.

Aug 08, 2026 Tamil +1

DC Movie Review

డీసీ (DC) 2026 Website
6.0
out of 10
డీసీ సినిమా కథను దర్శకుడు మాతేశ్వరన్ ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలు పెట్టి.. కేవలం ఇది గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు.. భావోద్వేగాలతో సాగే కథ అని చెప్పాడు. అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్‌ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆ...

డీసీ సినిమా కథను దర్శకుడు మాతేశ్వరన్ ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలు పెట్టి.. కేవలం ఇది గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు.. భావోద్వేగాలతో సాగే కథ అని చెప్పాడు. అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్‌ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్‌ లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.


అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌ గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్‌ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌ గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్‌లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.

Aug 08, 2026 Tamil +1

DC Movie review

డీసీ (DC) 2026 Website
7.0
out of 10
ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే చిన్న కథని అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్. మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “డిసి” చిత్రం సాలిడ్ మూమెంట్స్ తో సాగే మాస్...

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే చిన్న కథని అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్. 


మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “డిసి” చిత్రం సాలిడ్ మూమెంట్స్ తో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్ కి ఇది ఓ బ్యాంగర్ డెబ్యూ. తన రోల్ లో బాగా చేసి ఇంప్రెస్ చేసాడు. అలాగే అనిరుద్ సంగీతం మరో బలంగా ఇందులో నిలిచింది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం కూడా బాగా వర్కవుట్ కావడంతో ఈ సినిమా చూసే ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. చిన్న ఫ్లాస్ పక్కన పెడితే ఈ చిత్రం థియేటర్లులో మెప్పిస్తుంది.

Aug 08, 2026 Tamil +1
6.0
out of 10
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ..టైటిల్‌తోనే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎట్టకేలకు అధికారికంగా ఈ చిత్రం విడుదల కానుండగా అంతకంటే ఒకరోజు ముందే ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ షోస్‌ తో స్క్రీనింగ్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కొత్త లుక్,డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.హీరోయిన్ రితిక తన పాత్రకు న్యాయం చేశారు. అయితే సినిమాకు అసలు బ...

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ..టైటిల్‌తోనే ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. ఆగస్టు 7వ తేదీన ఎట్టకేలకు అధికారికంగా ఈ చిత్రం విడుదల కానుండగా అంతకంటే ఒకరోజు ముందే ఫ్యాన్స్ కోసం థియేటర్లలో స్పెషల్ షోస్‌ తో స్క్రీనింగ్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కొత్త లుక్,డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు.హీరోయిన్ రితిక తన పాత్రకు న్యాయం చేశారు. అయితే సినిమాకు అసలు బలం మాత్రం సత్య (కిష్టప్ప) కామెడీనే.తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.


అయితే మొదటి భాగం నెమ్మదిగా సాగడం, స్క్రీన్‌ప్లేలో గ్రిప్ లేకపోవడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హారర్ కామెడీకి అవసరమైన ఊహించని ట్విస్టులు లేకపోవడం, భయపెట్టాల్సిన సన్నివేశాలు పెద్దగా ప్రభావం చూపకపోవడం నిరాశ కలిగిస్తాయి. మొత్తంగా 'కొరియన్ కనకరాజు' కొత్త కాన్సెప్ట్‌ తో వచ్చిన వినోదాత్మక హారర్ కామెడీ కథనం మరింత బిగుతుగా ఉండి,ట్విస్టులు బలంగా ఉంటే ఫలితం మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ సత్య కామెడీ, తమన్ BGM, ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాను ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.

Aug 07, 2026 Telugu
6.0
out of 10
వరుణ్ తేజ్ హీరోగా నటించిన `కొరియన్‌ కనకరాజు` ఫైనల్ గా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ రొటీన్ సబ్జెక్టు పట్టుకుని దాని చుట్టూ కామెడీ ప్రధానంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అయితే దాన్ని ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా కథ బలంగా లేదు. లాజిక్ లెస్ సీన్లు కూడా బాగా ఉన్నాయి. ఇటు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వించే సినిమా కోసమని...

వరుణ్ తేజ్ హీరోగా నటించిన `కొరియన్‌ కనకరాజు` ఫైనల్ గా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ రొటీన్ సబ్జెక్టు పట్టుకుని దాని చుట్టూ కామెడీ ప్రధానంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అయితే దాన్ని ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే సినిమా కథ బలంగా లేదు. లాజిక్ లెస్ సీన్లు కూడా బాగా ఉన్నాయి. 


ఇటు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వించే సినిమా కోసమని ఈ కొరియన్ కనకరాజుకి వెళ్తే కాసేపే నవ్వించాడని తెలుస్తుంది. పైగా సినిమాకి క్లైమాక్స్ లో కెన్యా కనకరాజు అంటూ సీక్వెల్ ప్రకటించడం కూడా అంతగా నచ్చలేదు. ఫైనల్ గా కొరియన్ కనకరాజు సగమే మెప్పించాడు. 

Aug 07, 2026 Telugu
7.0
out of 10
హర్రర్‌ ని బేస్‌ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్‌ వచ్చింది. తాజాగా `కొరియన్‌ కనకరాజు` ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్ హర్రర్‌ కామెడీ చిత్రం. ఇందులో కామెడీ ప్రధానంగా చేసుకొని, అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్‌ చేయడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టచెక్కలావ్వాల్సిందే. ఇక క్లైమాక్స్...

హర్రర్‌ ని బేస్‌ చేసుకుని కామెడీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు గ్యాప్‌ వచ్చింది. తాజాగా `కొరియన్‌ కనకరాజు` ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్ హర్రర్‌ కామెడీ చిత్రం. ఇందులో కామెడీ ప్రధానంగా చేసుకొని, అందులోనూ సత్య పాత్ర చుట్టూ కామెడీని ప్రధానంగా చేసుకొని రూపొందించారు. కామెడీని సరిగ్గా బ్లెండ్‌ చేయడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారు. సత్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టచెక్కలావ్వాల్సిందే. ఇక క్లైమాక్స్ లో ఫైట్‌ అదిరిపోయింది.


అయితే సినిమా కథ బలంగా లేదు. దర్శకుడు తనకు అనుకూలంగా ప్లెక్సీబుల్‌గా మార్చుకున్నారు. లాజిక్ లను పట్టించుకోకుండా సినిమా తీశాడు. వరుణ్‌ తేజ్‌ని పక్కన పెట్టి దర్శకుడు సత్యతో సినిమాని నడిపించడం విశేషం. అతను కూడా అదే స్థాయిలో ఇరగదీశాడు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మొత్తంగా ఈ చిత్రం హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. యాక్షన్‌ ప్రధానంగా సాగే హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ `కొరియన్‌ కనకరాజు`. సరదాగా నవ్వుకోవడానికి మంచి ఆప్షన్‌.

Aug 07, 2026 Telugu
6.0
out of 10
Mega Prince Varun Tej is going through a lean phase for quite sometime. He decided to keep experiments aside for a while and try entertainment genre. He teamed up with director Merlapaka Gandhi for a Horror comedy film, Korean Kanakaraju.Positives:Satya’s ComedyVarun Tej’s PerformanceNegatives:Predictability in the StoryConvenient WritingClimaxFinally, Korean Kanakaraju is a mixed bag while it sco...

Mega Prince Varun Tej is going through a lean phase for quite sometime. He decided to keep experiments aside for a while and try entertainment genre. He teamed up with director Merlapaka Gandhi for a Horror comedy film, Korean Kanakaraju.


Positives:


Satya’s Comedy

Varun Tej’s Performance


Negatives:


Predictability in the Story

Convenient Writing

Climax


Finally, Korean Kanakaraju is a mixed bag while it scores in the comedy department, it falters in the writing department. Try it but have your expectations in check.


Bottomline: High on laughs, Weak on script


Rating: 2.5/5

Aug 07, 2026 Telugu
6.0
out of 10
సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంలో హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' చేశారు.కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందీ కథలో! అయితే... దర్శ...

సినిమాల్లో కమర్షియల్ అంశాల కంటే కంటెంట్ ఉన్న కథలకు వరుణ్ తేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మాస్ ఇమేజ్ కోసం ఆయన ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆయన ఫిల్మోగ్రఫీలో డిఫరెంట్ స్టోరీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. అయితే... అటు కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్, ఇటు కమర్షియల్ సినిమాలకు ఇటీవల ఆయనకు సరైన విజయాలు ఇవ్వలేదు. ఈ తరుణంలో హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు' చేశారు.


కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా ఉందీ కథలో! అయితే... దర్శకుడు మేర్లపాక గాంధీ రాత, తీత ఆశ్చర్యపరిచింది. హారర్ కామెడీలకు లాజిక్కులతో పని లేదు. స్క్రీన్ మీద మేజిక్ జరిగితే చాలు. ఈ 'కొరియన్ కనకరాజు'లో కామెడీ మేజిక్ జరిగింది. నవ్వులకు లోటు లేదు. నవ్వుల మేజిక్ కోసం అయితే ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వెళ్ళండి.

Aug 07, 2026 Telugu
7.0
out of 10
కామెడీ కి హారర్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ "కొరియన్ కనకరాజు" హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్‌లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్నా... దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను...

కామెడీ కి హారర్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కొరియా నేపథ్యంలో ఈ "కొరియన్ కనకరాజు" హారర్ కామెడీ డ్రామాను మేర్లపాక గాంధీ రాసుకున్నట్టున్నారు. నిజానికి కథ పాతదే అయినా... ట్రీట్ మెంట్, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. కనకరాజు శరీరంలోకి కొరియన్ ఆత్మ ప్రవేశించిన తర్వాతే సినిమా కొత్తపుంతలు తొక్కింది. సెకండ్ హాఫ్‌లో కొరియాలోని సన్నివేశాలు కొంత రొటీన్ గా ఉన్నా... దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాను దర్శకుడు రక్తికట్టించాడు.


నటీనటుల విషయానికి వస్తే వరుణ్‌ తేజ్ చాలా ఈజ్ తో ఈ పాత్రను చేశాడు. ఆత్మ ఆవహించిన తర్వాత నటన కాస్తంత శ్రమతో కూడుకున్నదే అయినా... బాగానే కష్టపడ్డాడు. అయితే తనదైన కామెడీ టైమింగ్‌ తో అద్భుతంగా నటించి, ఈ సినిమానునిలబెట్టింది మాత్రం సత్యనే! నిర్మాణ విలువలకు వంక పెట్టలేం. క్లయిమాక్స్ లో వి.ఎఫ్‌.ఎక్స్ కూడా బాగున్నాయి. మొత్తం మీద ఈ హారర్ కామెడీతో ఇటు వరుణ్‌ తేజ్, అటు మేర్లపాక గాంధీ ఖాతాలో హిట్ మూవీ పడిందనుకోవచ్చు.

Aug 07, 2026 Telugu
Why MRO?