Register as a Reviewer
డీసీ (DC)

డీసీ (DC)

07 Aug 2026
Overall Rating
6.5/10
23 Reviews

డైరెక్టర్లు కూడా యాక్టర్లు అవడం కొత్తేమి కాదు, ఎస్.జె.సూర్య మొదలుకొని నిన్నటి ప్రదీప్ రంగనాథన్ వరకు చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తాజాగా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Director: Arun Matheswaran
Cast: Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Sanjana Krishnamoorthy

Available in:

Reviews

What critics and the public are saying about డీసీ (DC)

Media Reviews

17 Avg: 6.6/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
6

Above Average

DC Movie Review

మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం డిసి. ఈ సినిమా ఒక సీరియస్ టోన్ లో ఈవెంట్ బేస్డ్ ఫిలిం అనమాట. ఎటువంటి కామెడీ ట్రాక్స్ లేకుండా, స్టోరీ కి స్ట్రిక్ అయి స్ట్రయిట్ గా వెళ్లిపోయే సినిమా ఇది. అండ్ ఈ సినిమాకి డిసి అనే టైటిల్ కన్నా, గన్స్ అండ్ రొసెస్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి...

మూవీ రివ్యూ అఫ్ ది ఫిలిం డిసి. ఈ సినిమా ఒక సీరియస్ టోన్ లో ఈవెంట్ బేస్డ్ ఫిలిం అనమాట. ఎటువంటి కామెడీ ట్రాక్స్ లేకుండా, స్టోరీ కి స్ట్రిక్ అయి స్ట్రయిట్ గా వెళ్లిపోయే సినిమా ఇది. అండ్ ఈ సినిమాకి డిసి అనే టైటిల్ కన్నా, గన్స్ అండ్ రొసెస్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ సినిమాకి. 


ఇక ఈ సినిమాకి ఎటువంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా పాయింట్ టు పాయింట్ వెళ్లిపోయారు. అండ్ సినిమాలో లోకేష్ కానగరాజ్ పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. ఆ లుక్స్ కూడా క్యారెక్టర్ రోల్ కి తగ్గట్టు మ్యాచ్ అయింది. అండ్ వామికా గబ్బి కూడా సూపర్ గా చేసారు. ఇక సినిమాలో కొన్ని సినిమాటిక్ లిబర్టీ వాడి కొన్ని సీన్స్ బాగా చేసారు. అండ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్ మ్యూజిక్. అన్ని సీన్స్ కి ఫ్రెష్ మ్యూజిక్, ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఓవరాల్ గా చెప్పాలంటే బాగుంది సినిమా. 


అండ్ సినిమాలో కామెడీ, ఫన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. యాక్షన్ మాత్రమే చూడండి. మంచి ఐ ఫీస్ట్ ఇస్తుంది.

Aug 07, 2026 Watch
Man of Fiction
Man of Fiction Youtube Channel
6

Above Average

DC Movie Review

సో లోకేష్ కానగరాజ్ సినిమా డిసి చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే బానే ఉంది. గ్రేట్ అని కాదు గాని, పర్లేదు చూసేలానే ఉంది. అండ్ సినిమా చిన్న స్టోరీనే బట్ మంచి స్క్రీన్ ప్లే రాసారు. ఈ సినిమాలో నాకేం నచ్చిందంటే స్పెషల్లీ అనిరుద్ మ్యూజిక్ బాగా నచ్చింది. ర్యాంప్ ఆడించారు. టెక్నికల్లి కూడా సినిమా చాలా అంటే చాల...

సో లోకేష్ కానగరాజ్ సినిమా డిసి చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే బానే ఉంది. గ్రేట్ అని కాదు గాని, పర్లేదు చూసేలానే ఉంది. అండ్ సినిమా చిన్న స్టోరీనే బట్ మంచి స్క్రీన్ ప్లే రాసారు. ఈ సినిమాలో నాకేం నచ్చిందంటే స్పెషల్లీ అనిరుద్ మ్యూజిక్ బాగా నచ్చింది. ర్యాంప్ ఆడించారు. టెక్నికల్లి కూడా సినిమా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే సినిమాలో తమిళ్ నేటివిటీ బాగా ఎక్కువైంది. ఎదో మణిరత్నం స్టయిల్లో ఏదో చెప్దామని ట్రై చేసారు. 


అండ్ ఆక్షన్ సీన్స్ అయితే అదిరిపోయాయి. ఇక్కడవరకైతే బాగానే ఉంది. కాకపోతే సినిమాలో ఎదో యూనిక్ పాయింట్ తీసుకున్నారా అంటే ఎం లేదు. వైలెన్స్ కూడా ఎక్కువైంది. కొన్ని సీన్స్ అయితే నాకు చాలా చిరాకేసింది. పెర్ఫార్మన్స్ వైస్ మాత్రం టూ గుడ్. స్పెషల్లీ వామికా గబ్బి చాలా బాగా చేసింది. అండ్ లోకేష్ కానగరాజ్ అయితే సలార్ లో ప్రభాస్ లాగా ఎక్కువగా మాట్లాడాడు. అలా పని చేసుకుంటూ పోతాడు. చాలా వన్ టోన్ గా క్యారెక్టర్ పోతా ఉంటది. ఇక డైరెక్టర్ అరుణ్ మాధేశ్వరన్ గురించి చెప్పాలంటే తన లాస్ట్ మూవీ కంటే బెస్ట్ గా తీశారు. ఓవరాల్ గా ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. 

Aug 07, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
8

Super Hit

DC Movie Review

"డీసీ". ఈ సినిమాలో చెప్పాలంటే ఇద్దరు హీరోలున్నారు. ఒకరు లోకేష్ కానగరాజ్, ఇంకొకరు అనిరుధ్. హీరోయిన్ వచ్చేసి వామిక గబ్బి. ఇక సినిమా గురించి చెప్పాలంటే... అదిరిపోయింది సినిమా. మాములుగా లేదు. మాస్ కమర్షియల్ సినిమా.. దానికి రీసన్ ఏంటంటే.. ముందుగా అనిరుద్ గారు ఈ సినిమాకి వంద పెర్సెంట్ వర్క్ ఇస్తారనుక...

"డీసీ". ఈ సినిమాలో చెప్పాలంటే ఇద్దరు హీరోలున్నారు. ఒకరు లోకేష్ కానగరాజ్, ఇంకొకరు అనిరుధ్. హీరోయిన్ వచ్చేసి వామిక గబ్బి. ఇక సినిమా గురించి చెప్పాలంటే... అదిరిపోయింది సినిమా. మాములుగా లేదు. మాస్ కమర్షియల్ సినిమా.. దానికి రీసన్ ఏంటంటే.. ముందుగా అనిరుద్ గారు ఈ సినిమాకి వంద పెర్సెంట్ వర్క్ ఇస్తారనుకుంటే 500 పర్సెంట్ ఇచ్చారు. నిజానికి అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు లేకపోతే అంతా డొల్లే. madness మ్యూజిక్. 


అండ్ సినిమా కూడా చాలా బాగుంది. లోకేష్ కూడా హీరోగా గ్రాండ్ డెబ్యూ ఇచ్చారని చెప్పాలి. పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. అండ్ వామికా గబ్బి కూడా టూ గుడ్ అసలు. స్టోరీ చిన్నగా ఉంది కానీ, స్క్రీన్ ప్లే అయితే స్ట్రాంగ్ గా రాసుకున్నారు. డైరెక్టర్ కూడా టూ గుడ్ హ్యాండిల్ చేసారు. అండ్ సినిమాకైతే నేను 4.5 రేటింగ్ ఇస్తాను. ఫైనల్ గా సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ డిసి సినిమా గురించి చెప్పాలంటే.. its a story between a gun and a plastic flower. అండ్ ఈ సినిమాతో లోకి హీరోగా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ ఉంది.

Aug 07, 2026 Watch
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
7

Hit

DC Movie review

DC... డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కాని, అనిరుద్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను, కానీ సినిమా ఇంటర్వెల్ సీన్ నుండి మొత్తం మారిపోయింది. స్పెషల్లీ వామికా గబ్బి ఎంటరైన తర్వాత స్పీడ్ గా ఎల్తుంది. సెకండ్ హాఫ్ కూడా బానే వెళ్ళిపోయింది. ఆక్షన్...

DC... డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ హీరోగా చేసిన ఫస్ట్ మూవీ. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కాని, అనిరుద్ మ్యూజిక్ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాను, కానీ సినిమా ఇంటర్వెల్ సీన్ నుండి మొత్తం మారిపోయింది. స్పెషల్లీ వామికా గబ్బి ఎంటరైన తర్వాత స్పీడ్ గా ఎల్తుంది. సెకండ్ హాఫ్ కూడా బానే వెళ్ళిపోయింది. ఆక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. స్పెషల్లీ బీజీఎమ్ అదిరిపోయింది. 


అండ్ సినిమా స్టోరీ పరంగా చూస్తే కొత్త రైటింగ్ అని చెప్పలేం. కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటది. ఉన్న తక్కువ క్యారెక్టర్స్ తోనే డ్రామా బాగా బిల్డ్ చేసారు. అండ్ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఫ్యామిలీస్ కాస్త అలోచించి వెళ్తే బెటర్. అండ్ సినిమాలో హీరో కన్నా హీరోయిన్ కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక టైటిల్ కి తగ్గట్టే సినిమాలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగా న్యాచురల్ గా ఉంది. ఫైనల్ గా లోకి కి ఇది గ్రాండ్ డెబ్యూ అని చెప్పాలి. ఇక మైనస్ అంటే చాలా సింపుల్ స్టోరీ, అండ్ ఆక్షన్ మూవీ లవర్స్ కి మాత్రమే నచ్చే ఛాన్స్ ఉంది. మాస్ ఆక్షన్ లవర్స్ కైతే ఐ ఫీస్ట్. అండ్ నా రేటింగ్ ఈ సినిమాకి 3.25/5 

Aug 08, 2026 Watch
Thyview
Thyview Youtube Channel
7

Hit

DC Movie Review

"డిసి". డైరక్టర్ లోకేష్ కానగరాజ్ ఫస్ట్ టైం హీరోగా నటించాడు. దేవదాస్ స్టోరీ ని తీసుకుని మార్చి కమర్షియల్ గా డిఫరెంట్ గా తీశారు. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇస్ a decent engeging action movie అనిపించింది. సినిమాకి మెయిన్ హైలెట్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్. మెయిన్ హీరో కూడా తానే...

"డిసి". డైరక్టర్ లోకేష్ కానగరాజ్ ఫస్ట్ టైం హీరోగా నటించాడు. దేవదాస్ స్టోరీ ని తీసుకుని మార్చి కమర్షియల్ గా డిఫరెంట్ గా తీశారు. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే.. ఇస్ a decent engeging action movie అనిపించింది. సినిమాకి మెయిన్ హైలెట్ గా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్. మెయిన్ హీరో కూడా తానే అనిపించాడు. ఎందుకంటే సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అలాంటిది. స్పెషల్లీ బీజీఎమ్ అయితే కుమ్మేసాడు. 


అండ్ సినిమాలో లోకేష్ కానగరాజ్ డైరెక్టర్ గా ఎలాంటి సత్తా ఉన్నవాడో తెలిసిందే. ఇప్పుడు ఆక్టర్ గా డీసెంట్ అనిపించాడు. ఇక సంజనా, వామిక గబ్బి కూడా అదరగొట్టారు. ఇక యాక్షన్ బ్లాక్స్ కూడా అదిరిపోయింది. ఇక సినిమా టెక్నికల్ గా కూడా సూపర్. కొన్ని షాట్స్ అయితే మైండ్ లోంచి పోవు. బట్ ఎడిటింగ్ లో కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఫైనల్ గా చెప్పాలంటే లోకి హీరోగా డీసెంట్ డెబ్యూ ఇచ్చాడని చెప్పాలి. 

Aug 08, 2026 Read Review
T2B Live
T2B Live Website
6

Above Average

DC Movie Review

తమిళ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) హీరోగా మారి తీసిన మొదటి సినిమా డిసి(DC) ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయింది. కథగా చెప్పాలి అంటే చాలా నార్మల్ పాయింట్ తోనే తెరకెక్కిన DC మూవీ స్క్రీన్ ప్లే కూడా, మొత్తం యాక్షన్ సీన్స్ గన్స్,...

తమిళ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) హీరోగా మారి తీసిన మొదటి సినిమా డిసి(DC) ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయింది. కథగా చెప్పాలి అంటే చాలా నార్మల్ పాయింట్ తోనే తెరకెక్కిన DC మూవీ స్క్రీన్ ప్లే కూడా, మొత్తం యాక్షన్ సీన్స్ గన్స్, కత్తులతోనే నిండిపోయి ఉంటుంది. కానీ రెండున్నర గంటల సినిమాలో చాలా పార్ట్ బోర్ ఏమి కొట్టకుండా మొత్తం కూర్చుని చూసేలా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. హీరోగా లోకేష్ కనగరాజ్ ఆ పాత్రకి సెట్ అయ్యేలా సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించేలా యాక్ట్ చేయగా అందరి కన్నా బెటర్ గా క్యారెక్టర్ ఆర్క్ తో మెప్పించి వామిక గబ్బి ఫుల్ మార్కులు కొట్టేసింది. 


ఇక డైరెక్టర్ సింపుల్ కథని వైలెన్స్ ను ఒక పొయెటిక్ వేలో చెప్పే క్రమంలో స్లో నరేషన్ ఉన్నా కూడా అనిరుద్ టెర్రిఫిక్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ సినిమాను సేఫ్ చేయడమే కాదు ఏం సినిమారా అనిపించేలా చేసింది. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ టేకింగ్, కొన్ని ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అలాగే అన్నింటికీ మించి అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఈజీగా చూడొచ్చు ఈ సినిమాను ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 3 స్టార్స్.

Aug 07, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
6

Above Average

DC Movie Review

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాకు కాస్త ఎమోషన్స్ జోడించి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించిన చిత్రం డిసి. అయితే కథగా ఇదేమీ కొత్తది కాదు. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామానే. ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ ను జోడించి బాగానే డ్రైవ్ చేసినా… హింసాత్మక సన్నివేశాలు ఎక్కువ కావడం, యాక్షన్ కు పెద్ద పీట...

గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగే రివేంజ్ యాక్షన్ డ్రామాకు కాస్త ఎమోషన్స్ జోడించి రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించిన చిత్రం డిసి. అయితే కథగా ఇదేమీ కొత్తది కాదు. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామానే. ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ ను జోడించి బాగానే డ్రైవ్ చేసినా… హింసాత్మక సన్నివేశాలు ఎక్కువ కావడం, యాక్షన్ కు పెద్ద పీట వేయడం వల్ల కథలోని అసలు ఫ్లేవర్, ఎమోషన్స్ సైడ్ అయి పోయిన భావన కలుగుతుంది.


ఈ సినిమాకు మేజర్ ఎసెట్ సంగీతం. అనిరుధ్ నూటికి నూరు శాతం తన పనికి న్యాయం చేశాడు. ముఖేష్. జి సినిమాటోగ్రఫీ స్టోరీకి, నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. ‘ప్రాణంలేని పువ్వు, ప్రాణం తీసే తుపాకీ ముందుకు నడిపిస్తున్నాయి’ లాంటి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రొటీన్ కథే అయినా దర్శకుడు నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. పూర్తిగా హింసతో యాక్షన్ కు ఎక్కువ స్పేస్ ఇవ్వడంతో ఒక సెక్షన్ ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు. గ్యాంగ్ స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం సినిమా నచ్చుతుంది. దర్శకుడిగానే కాదు... లోకేశ్ హీరోగా కూడా కంటిన్యూ కావచ్చు అనిపిస్తుంది.


Aug 08, 2026 Read Review
Gulte
Gulte Website
7

Hit

DC Movie Review

Arun Matheswaran teamed up with the director-turned-actor Lokesh Kanagaraj for DC, a film based on Devdas, a hugely popular novel by Sarat Chandra Chattopadhyay. Wamiqa Gabbi and Sanjana Krishnamoorthy, played the female lead roles, while Anirudh Ravichander, scored the music and Sun Pictures produc...

Arun Matheswaran teamed up with the director-turned-actor Lokesh Kanagaraj for DC, a film based on Devdas, a hugely popular novel by Sarat Chandra Chattopadhyay. Wamiqa Gabbi and Sanjana Krishnamoorthy, played the female lead roles, while Anirudh Ravichander, scored the music and Sun Pictures produced the film. 


Positives:


1.⁠ ⁠Background Score

2.⁠ ⁠Screenplay & Direction

3.⁠ ⁠Actors Performances

4.⁠ ⁠Dialogue Writing

5.⁠ ⁠Utmost Honesty In Narration

6.⁠ ⁠Pre-Interval to Climax


Negatives:


1.⁠ ⁠Editing In Parts

2.⁠ ⁠Excessive Violence


Overall, DC is a stunning addition to the list of films which are based on Devdas. It is brutal, honest, realistic, philosophical, poetic and yet very engaging and entertaining. Arun Matheswaran, Anirudh and the team came up with an emotional action spectacle that has every chance to touch your heart and make you root for the lead characters unconditionally. And yes, finally, the director, Arun Matheswaran, has every chance to score his much-deserved first commercial success with, DC. Go, watch it and fall in love with Das, Chandra and their unadulterated world.


Aug 08, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
7

Hit

DC Movie Review

డీసీ మూవీకి దర్శకుడు ఎంచుకున్న మార్గం చాలా షార్ట్ అండ్ షార్ప్‌గా ఉంది. పైకి కేవలం క్రైమ్ డ్రామాలాగా కనిపించినా, లోపల బలమైన సామాజిక అంశాన్ని, పేదల విద్యా హక్కును చర్చించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. విశ్రాంతి సమయానికి ముందు వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా పండాయి....

డీసీ మూవీకి దర్శకుడు ఎంచుకున్న మార్గం చాలా షార్ట్ అండ్ షార్ప్‌గా ఉంది. పైకి కేవలం క్రైమ్ డ్రామాలాగా కనిపించినా, లోపల బలమైన సామాజిక అంశాన్ని, పేదల విద్యా హక్కును చర్చించారు. హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. విశ్రాంతి సమయానికి ముందు వచ్చే పోరాట సన్నివేశాలు అద్భుతంగా పండాయి. ఎన్నాళ్ళయిందో ఒక అదిరిపోయే ఇంటెన్స్ యాక్షన్ డ్రామా చూసి.. DC తో ఆ లోటు తీరిపోయిందని ఆడియన్స్ ఖచ్చితంగా అనుకుంటారు. 


పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా అలాంటిదే ఈ సినిమా.. వెరీ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అన్నట్టు తీశాడు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్. ఇదేమీ తెలియని కథ కాదు.. ఎన్నో సినిమాల్లో చూసిన కథే.. సమాజానికి ఎదురెళ్లే ఒక గ్యాంగ్ స్టర్.. సమాజం చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి.. కలిసి చేసే ప్రయాణమే డిసి సినిమా. ఇక సినిమాని మెజారిటీ నిలబెట్టింది అనిరుధ్ బీజీఎమ్. ఇటు దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తన మేకింగ్ స్టైల్ చూపించాడు.. మరోసారి పోలీసుల చేతిలో అణిచివేయబడుతున్న సామాన్యుల కథనే తీసుకున్నాడు. ఓవరాల్‌ గా డిసి.. గన్స్ అండ్ రోజెస్.. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్..!

Aug 08, 2026 Read Review
Tupaki
Tupaki Website
7

Hit

DC Movie Review

ఖైదీ.. విక్రమ్.. లియో.. కూలీ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం.. డీసీ. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా అంత గొప్పగా లేకపోయినా పాటల వల్ల ఆడేయడం ఒకప్ప...

ఖైదీ.. విక్రమ్.. లియో.. కూలీ చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన చిత్రం.. డీసీ. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


సినిమా అంత గొప్పగా లేకపోయినా పాటల వల్ల ఆడేయడం ఒకప్పటి రోజుల్లో జరిగేది. చరిత్రలో అందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్స్ జరగట్లేదు. అందుకు మారిన పరిస్థితులు.. ప్రేక్షకుల అభిరుచి కారణం. ఈ రోజుల్లో కేవలం మ్యూజిక్ వల్ల ఒక సాధారణమైన సినిమా కూడా మెరుగ్గా అనిపించడం చాలా అరుదే. ఆ అరుదైన జాబితాలో ‘డీసీ’ నిలుస్తుంది. ఈ సినిమా కథ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. అయినా సరే.. ‘డీసీ’ బోర్ కొట్టకుండా సాగిపోయేలా చేయడంలో అరుణ్ మాదేశ్వరన్ టేకింగ్ కొంత పాత్ర పోషిస్తే.. మేజర్ క్రెడిట్ అనిరుధ్ రవిచందర్ కే చెందుతుంది. 


ఓవరాల్ గా డిసి ని ఒక మామూలు కథనే, అందంగా తెరపై ప్రెజెంట్ చేశాడు. దర్శకుడి అభిరుచిని చాటే సన్నివేశాలు చాలానే ఉన్నాయీ సినిమాలో. ముఖ్యంగా తొలిసారి తన గది దాటి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టిన వేశ్య భావోద్వేగాన్ని చూపించే సన్నివేశాల్లో దర్శకుడి మార్కు కనిపిస్తోంది. చివరగా: డీసీ.. అనిరుధ్ షో..


Aug 08, 2026 Read Review
7

Hit

DC Movie Review

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌కి కేరాఫ్‌. విజయ్‌ని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. `విక్రమ్‌`, `లియో`, `కూలీ` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు హీరోగా మారి `డీసీ` అనే చిత్రంలో నటించారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇదొక గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే స...

దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌కి కేరాఫ్‌. విజయ్‌ని మాస్‌ హీరోగా నిలబెట్టిన దర్శకుడు. `విక్రమ్‌`, `లియో`, `కూలీ` వంటి చిత్రాలతో తానేంటో చూపించారు. ఇప్పుడు హీరోగా మారి `డీసీ` అనే చిత్రంలో నటించారు. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇదొక గ్యాంగ్‌ స్టర్‌ ప్రధానంగా సాగే సినిమా. చూడ్డానికి యాక్షన్‌ ప్రధానంగా రన్‌ అవుతుంది. కానీ దీని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటుంది. కాకపోతే తెలుగు నటీనటులు లేరు. దీంతో కనెక్ట్ కావడానికి టైమ్‌ పడుతుంది.


అయితే దేవదాస్‌ పాత్రలో లోకేష్‌ కనగరాజ్‌ దుమ్ములేపాడు. సెటిల్డ్ గా చేశాడు. దర్శకుడే కాదు, ఆయనలో అదిరిపోయే నటుడు కూడా ఉన్నాడని నిరూపించాడు. పార్వతిగా సంజనా కృష్ణమూర్తి అందంగా ఉంది. అంతే బాగా యాక్ట్ చేసింది. ఇక చంద్ర పాత్రలో వామికా గబ్బి దుమ్ములేపింది. అయితే సినిమాలో పోయిటిక్‌ స్టయిల్‌ కనిపిస్తుంది. ఆయా పోయెటిక్‌ ఎలిమెంట్లు కొంత స్లోగా అనిపించినా ఆకట్టుకుంటాయి. లైట్‌ గా హార్ట్ టచ్‌ చేస్తూ యాక్షన్‌, ఎమోషనల్‌గా మెప్పించే డీసీ. లోకేష్‌ కనగరాజ్‌ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే చిత్రమవుతుంది.




Aug 07, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
7

Hit

DC Movie Review

'డీసీ' టీజర్, ట్రైలర్లలో లోకేష్ కనగరాజ్ స్టైల్ కనిపించిందన్నారు కొందరు. ఓటీటీలో 'చిన్ని' (తమిళ్ ఫిల్మ్ 'సాని కాయిదం') చూసిన ప్రేక్షకులకు అది అరుణ్ మాథేశ్వరన్ స్టైల్ అని తెలుసు. 'డీసీ'లో దర్శక రచయిత అరుణ్ మాథేశ్వరన్ క్లిష్టమైన కథను చెప్పలేదు. సింపుల్ కథను స్ట్రెయిట్‌గా చెప్పారు. సామాన్యులకు న్యా...

'డీసీ' టీజర్, ట్రైలర్లలో లోకేష్ కనగరాజ్ స్టైల్ కనిపించిందన్నారు కొందరు. ఓటీటీలో 'చిన్ని' (తమిళ్ ఫిల్మ్ 'సాని కాయిదం') చూసిన ప్రేక్షకులకు అది అరుణ్ మాథేశ్వరన్ స్టైల్ అని తెలుసు. 'డీసీ'లో దర్శక రచయిత అరుణ్ మాథేశ్వరన్ క్లిష్టమైన కథను చెప్పలేదు. సింపుల్ కథను స్ట్రెయిట్‌గా చెప్పారు. సామాన్యులకు న్యాయం లభించినప్పుడు వ్యవస్థపై ఓ వ్యక్తి చేసిన తిరుగుబాటే 'డీసీ'. 'డీసీ'ని పైనుంచి చూస్తే... రివేంజ్ యాక్షన్ ఫిల్మ్. సింపుల్ స్టోరీని ఎక్సట్రాడినరీగా మార్చినది మాత్రం అనిరుధ్ రవిచందర్ పాటలు, నేపథ్య సంగీతం. ఆయనతో పాటు ముఖేష్ జి సినిమాటోగ్రఫీ, ప్రసన్న జీకే ఎడిటింగ్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్‌ను మర్చిపోలేం. 


ఓవరాల్ గా డీసీ'... దాసు, చంద్రల కథ. ఇదొక మోడ్రన్ దేవదాసు కథ. బాల్యంలో కన్నతల్లి ప్రేమకు దూరమైన ఓ యువకుడు... ప్రేమను వెతుక్కున్న కథ. అయితే... అతని ప్రయాణం పూల పాన్పు కాదు. అడుగడుగునా ముళ్ళబాట. 'దండుపాళ్యం' లాంటి వయలెన్స్ సినిమాలను ప్రేక్షకులు చూశారు. అయితే... అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం రా అండ్ రస్టిక్ వయలెంట్ సినిమాను క్లాసీగా మార్చింది. తెరపై రక్తం పారుతున్నప్పటికీ... యాక్షన్ వస్తున్నప్పటికీ... నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చూసేలా గ్రిప్పింగ్‌గా తీశారు అరుణ్ మాథేశ్వరన్. డోంట్ మిస్ ఇట్.



Aug 08, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
6

Above Average

DC Movie Review

After months of anticipation, Lokesh Kanagaraj’s acting debut, DC, has finally hit theatres. Packed with raw action, graphic violence and a dark emotional undercurrent, the Tamil action drama has generated considerable interest, helped in large part by Anirudh Ravichander’s music.HighlightsAnirudh R...

After months of anticipation, Lokesh Kanagaraj’s acting debut, DC, has finally hit theatres. Packed with raw action, graphic violence and a dark emotional undercurrent, the Tamil action drama has generated considerable interest, helped in large part by Anirudh Ravichander’s music.


Highlights

Anirudh Ravichander’s music

Lokesh Kanagaraj’s screen presence

Wamiqa Gabbi’s performance

Climax

Action sequences


Drawbacks

Slow pace in parts

Heavy violence may not appeal to everyone

Limited emotional expression for the lead character


Overall, DC is a gritty action drama powered by Anirudh’s music, strong visuals and a confident acting debut from Lokesh Kanagaraj. It may not be a conventional mass entertainer, but it offers a distinctive theatrical experience for audiences comfortable with intense and graphic violence.


Bottom Line: Gritty Action with Strong Music.

Aug 08, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
6

Above Average

DC Movie Review

డీసీ సినిమా కథను దర్శకుడు మాతేశ్వరన్ ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలు పెట్టి.. కేవలం ఇది గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు.. భావోద్వేగాలతో సాగే కథ అని చెప్పాడు. అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్‌ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్...

డీసీ సినిమా కథను దర్శకుడు మాతేశ్వరన్ ఓ ఎమోషనల్ పాయింట్‌తో మొదలు పెట్టి.. కేవలం ఇది గ్యాంగ్‌స్టర్ సినిమానే కాదు.. భావోద్వేగాలతో సాగే కథ అని చెప్పాడు. అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్‌ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్‌ లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.


అయితే ఆ తర్వాత చంద్రతో జర్నీ మరింత ఎమోషనల్‌ గా రాసుకోవడంలో దర్శకుడు తనదైన శైలిని ప్రదర్శించడమే కాకుండా లోకేష్ కనకరాజ్‌ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ తగినట్టుగా సీన్లును, క్యారెక్టర్‌ను డిజైన్ చేయడంతోపాటు కథను గ్రిప్పింగ్‌ గా చెప్పేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంటుంది. కాకపోతే మితి మీరిన హింస, యాక్షన్ పెద్ద పీట వేయడం వల్ల ఈ కథలో బయటకు రావాల్సిన ఎమోషన్స్ మరుగున పడిపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా అంతా ఒకే నోట్‌లో సింగిల్ పాయింట్‌తో సాగడం వల్ల రొటీన్, రెగ్యులర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది.

Aug 07, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
6

Above Average

DC Movie Review

తీసింది కొన్ని సినిమాలైనా మంచి స్టార్ డైరెక్టర్ గా తమిళనాట ఓ వెలుగువెలుగుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘డిసి’ ఈ వారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలం...

తీసింది కొన్ని సినిమాలైనా మంచి స్టార్ డైరెక్టర్ గా తమిళనాట ఓ వెలుగువెలుగుతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘డిసి’ ఈ వారం థియేటర్లలో విడుదలైంది. అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాకు మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.


చిన్న కథను ఆసక్తికరమైన ట్రీట్‌మెంట్‌తో, సాలిడ్ యాక్షన్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. హీరోగా లోకేష్ కనకరాజ్ తన పాత్రలో మెప్పించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ చూపించాడు. అనిరుధ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ప్లస్‌గా నిలిచాయి.


కథలో కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, దర్శకుడి స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. మొత్తంగా ‘డిసి’ మంచి మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్‌కు ఇది ఇంప్రెసివ్ డెబ్యూ అని చెప్పొచ్చు. ఫైనల్ గా డిసి ఎంగేజింగ్ మూవ్మెంట్స్ ఉన్న ఒక రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెప్పొచ్చు. 

Jul 08, 2026 Read Review
Sakshi
Sakshi News Channel
6

Above Average

DC Movie Review

ఈ వారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. అయితే సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు...

ఈ వారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటోంది. అయితే సినిమాను తెరకెక్కించిన విధానం, స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు.


చిన్న కథాంశాన్నే తీసుకుని దానికి ఆసక్తికరమైన మలుపులు, యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమాను రూపొందించాడు. ముఖ్యంగా సినిమా సాగుతున్న కొద్దీ వచ్చే కొన్ని సాలిడ్ మూమెంట్స్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. కథలో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా, దర్శకుడు ఎంచుకున్న ట్రీట్‌మెంట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.


ఇక ఈ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన లోకేష్ కనకరాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలకమైన ఎమోషనల్ సీన్స్‌లోనూ తనదైన పెర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. మరోవైపు అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాల ఇంపాక్ట్‌ను మరింత పెంచింది.


ఓవరాల్‌గా ‘డిసి’ సినిమా సాలిడ్ యాక్షన్ మూమెంట్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే మాస్ డ్రామాగా నిలుస్తుంది. అక్కడక్కడా కనిపించే చిన్న లోపాలను పక్కన పెడితే, థియేటర్లలో ఒకసారి చూడదగ్గ సినిమాగా అనిపిస్తుంది.

Aug 08, 2026 Read Review
123telugu
123telugu Website
7

Hit

DC Movie review

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే చిన్న కథని అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ఆకట్టుకునేలా త...

ఈ వారం థియేటర్స్ లో విడుదలకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘డిసి’ కూడా ఒకటి. దర్శకుడు అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే చిన్న కథని అదిరిపోయే స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కి ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్. 


మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “డిసి” చిత్రం సాలిడ్ మూమెంట్స్ తో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా నిలిచింది. లోకేష్ కనకరాజ్ కి ఇది ఓ బ్యాంగర్ డెబ్యూ. తన రోల్ లో బాగా చేసి ఇంప్రెస్ చేసాడు. అలాగే అనిరుద్ సంగీతం మరో బలంగా ఇందులో నిలిచింది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం కూడా బాగా వర్కవుట్ కావడంతో ఈ సినిమా చూసే ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. చిన్న ఫ్లాస్ పక్కన పెడితే ఈ చిత్రం థియేటర్లులో మెప్పిస్తుంది.

Aug 08, 2026 Read Review

Public Reviews

6 Avg: 6.3/10
G
Goshika Shreshta CA/Advocate
6

Above Average

DC Movie review

DC is pure cinematic madness with a stylish edge. Lokesh Kanagaraj owns the screen with a raw, effortless performance, while Wamiqa Gabbi adds mystery and intensity to every frame. The film’s moody visuals, hard-hitting action and atmospheric world-building keep the energy alive. Anirudh background...

DC is pure cinematic madness with a stylish edge. Lokesh Kanagaraj owns the screen with a raw, effortless performance, while Wamiqa Gabbi adds mystery and intensity to every frame.


The film’s moody visuals, hard-hitting action and atmospheric world-building keep the energy alive. Anirudh background score hits exactly where it should, turning several scenes into theatre moments.


Not a flawless ride.. the pacing occasionally drags, and the violence may feel excessive—but when DC clicks, it CLICKS HARD.

A bold, stylish crime drama that feels made for the big screen.


Aug 11, 2026
B
Baswaraj Students & Youth
7

Hit

DC Movie review

ninnane dc movie ki vella... genral ga action movies peddaga chudanu.. so ee cinemaku vaddante, friends force cheste chusa.. but chusaaka manchi action movie chusananna satisfy vacchindi. movie lo pedda story kooda em undadu... dailouges kooda undavu.. flow lo ala velta untadi anthe. but anirudh roc...

ninnane dc movie ki vella... genral ga action movies peddaga chudanu.. so ee cinemaku vaddante, friends force cheste chusa.. but chusaaka manchi action movie chusananna satisfy vacchindi.

movie lo pedda story kooda em undadu... dailouges kooda undavu.. flow lo ala velta untadi anthe. but anirudh rocking music icchadu. anirudh music remove chesi chuste edo documentery la untadi anthe.

every sence ki fresh music icchadu. & hero heroins andaru well performed. kakapothe mana netivity touch ki dooranga undi.

Aug 11, 2026
A
7

Hit

DC Movie review

DC.. first time lokesh kanagaraj heroga try chesadu. trailer chuse vellam cinemaki. edo normal revenge story la untundani anukunnam gani... baboy.. action movie lovers ki i feast movie idi. every sence, every frame, every action episode adiripoyayi. chala mandi idedo avarage story annaru.. nijame pe...

DC.. first time lokesh kanagaraj heroga try chesadu. trailer chuse vellam cinemaki. edo normal revenge story la untundani anukunnam gani... baboy.. action movie lovers ki i feast movie idi.


every sence, every frame, every action episode adiripoyayi. chala mandi idedo avarage story annaru.. nijame peddaga katha emi ledu. but screenplay magic chesindi. daniki taggattu anirudh bgm ayithe rocks. simple ga cheppalante anirudh music lekapothe cinema bokkala untadi.


ante cinemaki main hero anirudh ani cheppocchu. and movielo loki decent ga perform chesadu. peddaga dailouges kooda undavu. but vamica gabbi ayithe solid perfromance chupinchindi. finally worth movie.

Aug 08, 2026
T
Talari Snehalatha IT Employee
5

Average

DC Movie review

DC — Went in with zero expectations, but unfortunately the movie didn’t really impress me.The story feels very routine, like an old Devdas story turned into an action/revenge drama. Lokesh is decent, and Wamiqa Gabbi is good, while Anirudh’s music is easily the biggest plus.The only downside is that...

DC — Went in with zero expectations, but unfortunately the movie didn’t really impress me.


The story feels very routine, like an old Devdas story turned into an action/revenge drama. Lokesh is decent, and Wamiqa Gabbi is good, while Anirudh’s music is easily the biggest plus.


The only downside is that the movie is heavily steeped in Tamil sensibilities and style.


The action is good in parts, but overall the movie feels underwhelming. Not really for families, and even action lovers might find it just okay.

Overall, below average.

Aug 08, 2026
V
Velugubantla Ramadurga Private Employee
6

Above Average

DC Movie review

DC — Honestly, I didn’t even know what kind of movie this was until I went to the theatre. My friends forced me to join them, and I went without any expectations.Turns out, it’s a proper action film, and Lokesh did a pretty good job as the lead. I actually watched the whole movie as a Lokesh film, a...

DC — Honestly, I didn’t even know what kind of movie this was until I went to the theatre. My friends forced me to join them, and I went without any expectations.

Turns out, it’s a proper action film, and Lokesh did a pretty good job as the lead. I actually watched the whole movie as a Lokesh film, and I enjoyed it.

There’s no big or complicated story. It feels like an old-school Devdas story adapted into a modern action/revenge drama.

Lokesh performed well, and Wamiqa Gabbi was really good. Anirudh’s music is was stunning.

i think familys not like this type of movies..overall its a decent.

Aug 10, 2026
A
Arige Srikanth Private Employee
7

Hit

DC Movie review

డీసీ (DC). అసలు సినిమాకెళ్లే వరకు తెలీదు ఇది ఏం సినిమా ఇది అని. మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వాళ్ళతో కలిసి వెళ్ళా. తీరా చూస్తే డైరెక్టర్ లోకి హీరోగా చేసాడు. పక్కా ఆక్షన్ ఫిలిం ఇది. పోనీ డైరెక్టర్ అతనేనా అంటే వేరే వాళ్ళని తెలిసింది. కానీ నేను మూవీ చుసాతున్నంత సేపు లోకి సినిమాగానే చూసాను. అండ్...

డీసీ (DC). అసలు సినిమాకెళ్లే వరకు తెలీదు ఇది ఏం సినిమా ఇది అని. మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వాళ్ళతో కలిసి వెళ్ళా. తీరా చూస్తే డైరెక్టర్ లోకి హీరోగా చేసాడు. పక్కా ఆక్షన్ ఫిలిం ఇది. పోనీ డైరెక్టర్ అతనేనా అంటే వేరే వాళ్ళని తెలిసింది. కానీ నేను మూవీ చుసాతున్నంత సేపు లోకి సినిమాగానే చూసాను. అండ్ సినిమా నాకైతే నచ్చింది. 


ఎదో పెద్ద స్టోరీ ఉందా అంటే అంత ఎం లేదు. మన పాత దేవదాస్ సినిమాని ట్రెండ్ కి తగ్గట్టు యాక్షన్ మూవీ లాగా, ఎదో రివెంజ్ డ్రామా లాగా తీసినట్టు తీశారు. లోకేష్ కూడా బాగానే ఆక్ట్ చేసాడు. స్పెషల్లీ వామికా గబ్బి సూపర్ అసలు. అనిరుద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్. పెద్దగా ఫ్యామిలీస్ చూడలేరేమో గాని, యాక్షన్ మూవీ లవర్స్ కి ఐ ఫీస్ట్ ఈ సినిమా. 

Aug 08, 2026

About This Movie

Story : 

చిత్తూరు ప్రాంతంలో సర్కార్ అని పిలువబడే ఓ క్రైమ్ ముఠా పోలీసుల వాహనాలపై దాడి చేసి అందులో ఆయుధాలు కాజేస్తారు. ఆ సర్కార్ గ్యాంగ్ లోనే దేవదాస్ (లోకేష్ కనకరాజ్) కూడా ఉంటాడు.  అయితే ఆ ఆయుధాల దొంగతనం కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసుని వీళ్ళు చంపడంతో పొలిసు డిపార్ట్మెంట్ వారు సర్కార్ గ్యాంగ్ ని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ వేశ్యావాటికలో పార్వతి (సంజనా కృష్ణమూర్తి)ని కలుస్తాడు. అయితే అక్కడినుండి ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆమె చనిపోతుంది. అయితే మరో అమ్మాయి చంద్ర (వామికా గబ్బి) ని వేశ్యా గృహం నుండి తప్పిస్తాడు. అక్కడ చంద్ర లైఫ్ గురించి తెలుసుకొన్న దేవదాస్ తనకు సాయం చేస్తాడు. ఇటు చంద్ర కూడా దేవదాస్ తోనే ట్రావెల్ అవ్వడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో  సర్కార్ ముఠాలోని దేవదాస్ గ్యాంగ్ ను అసలు పోలీసులు ఎందుకు వేటాడుతున్నారు? దేవదాస్ - చంద్ర ఎమోషనల్ జర్నీ ఎలా ముందుకు వెళ్ళింది. చివరికి ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

 

PlusPoints :

ఇక డిసి సినిమా అనౌన్స్ చేసినపుడు పెద్దగా అంచనాలు లేవు గాని, ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో సినిమాపై ఉన్న హైప్ పీక్స్ కి వెళ్ళిపోయింది. మాములుగా లోకేష్ కానగరాజ్ సినిమాలు మొత్తం యాక్షన్ డ్రామాలే ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే తెరకెక్కగా, ఈసారి డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక స్ట్రాంగ్ యాక్షన్ స్క్రీన్ ప్లే బలంతో వచ్చిన ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇచ్చిన బీజీఎమ్ స్కోర్ అదిరిపోయింది. దీంతో హీరోగా లోకేష్ కనకరాజ్ మాంచి డెబ్యూని ఇచ్చాడని చెప్పాలి. అలాగే సినిమాలో తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే కథకు తగ్గ స్క్రీన్ ప్లే సినిమాకి బిగ్ ఎస్సెట్. ఇక హీరోయిన్ వామికా గబ్బి కి కూడా సాలిడ్ రోల్ దక్కింది. తన డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఇంటెన్స్ లుక్స్ తో కళ్ళతోనే బాగా నటించింది. కీ రోల్ లో నటించిన సంజన కూడా తన లిమిటెడ్ రన్ టైం లో అట్రాక్ట్ చేసింది. అలాగే గురు సోమసుందరం, సహా సినిమాలో అందరూ బాగా చేసారు. 

 

Minus Points :

ఇక ఈ డిసి సినిమా టోటల్ గా డిఫరెంట్ యాక్షన్ డ్రామాగానే తెరకెక్కింది కాబట్టి అలాగే చూడాలి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ అయితే డిస్సపాయింట్ అవ్వొచ్చు. కొర్ కాన్సెప్ట్ కూడా ఊహించిందే. చిన్న కథని అటు తిప్పి, ఇటు తిప్పి భావోద్వేగాల నడుమ నడిపిస్తారు. ఇక సినిమాలో హీరో - విలన్ కి మధ్య ఉన్న పగ ఏంటి అన్నది సరిగా చూపించలేదు. అలాగే కొంచెం వైలెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అవకాశం లేదు. 

 

Technical Values :

ఈ సినిమాకి అరుణ్ మాధేశ్వరన్ డైరెక్టర్ అయినా, ప్రతి ఫ్రేమ్ లో లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ స్కిల్స్ టేస్ట్ కనిపిస్తాయి. ఆడియన్స్ కూడా ఇది "లోకి" సినిమాగానే భావించి చూస్తున్నారు. అది మంచి ప్లస్ అయింది. దానికి తగ్గట్టు అనిరుద్ ఇచ్చిన బీజీఎమ్ వర్క్ కూడా దుమ్ము రేపింది. ముఖేష్ జి కెమెరా వర్క్ తో పాటు, జీకే ప్రసన్న ఎడిటింగ్ కూడా బాగుంది. అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనిరుద్ మ్యూజిక్. చాలా ఫ్రెష్ గా రాంప్ ఆడించేలా ఉంది. కాకపోతే తెలుగు యాక్టర్లు ఎవరైనా సినిమాలో ఉంటె ఇంకా బాగా అనిపించేది. 

 

FinalReview : 

ఓవరాల్ గా చూసుకుంటే.. పక్కా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన "డిసి" అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. తమిళ్ లో ఓ రేంజ్ లో దుమ్ములేపుతున్న ఈ మూవీ, తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. లోకేష్ కానగరాజ్ కి ఇది మంచి డెబ్యూ గా నిలవనుండగా, యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా మంచి ఐ ఫీస్ట్ ని ఇస్తుందని చెప్పాలి. తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుందో లేదో ముందు ముందు చూడాలి.

Review Statistics

6.5
Overall Rating
Avg. of all reviews
23
Total Reviews
From 4 Provider Types

Review Average

Media
6.6/10
Public
6.3/10
Why MRO?