Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
సర్దార్ 2 రివ్యూ... first of all movie చూసాక నా openoin చెప్పాలంటే.. very dissapointed.. PS మిత్రన్ మరీ ఇలా తీస్తారని అనుకోలేదు. పార్ట్ వన్ టెంప్లేట్ లోనే వెళ్తుంది ఈ కూడా. బట్ పార్ట్ వన్ లో వర్కవుట్ అయిన యాక్షన్ గాని, స్పై సీన్స్ గాని, క్యారెక్టర్ ఎమోషన్స్ గాని ఏవి సర్దార్ 2 లో వర్కౌట్ కాలేదు. చాలా ప్లేయిన్ గా టూ ప్రెడిక్ట్రబుల్ గా వెళ్ళిపోతుంది సినిమా. కొన్ని ఇంట్రెస్టింగ్ చాయిస్ ఉంటాయి సినిమాలో. బట్ వాటికివ్వాల్సిన వెయిట్ ఇవ్వలేదు. కార్తీ is the saving race in this movie. but writing support చేయనపుడు ఆయన కూడా ఎంత వరకు కాపాడగలుగుతారు.
part 1 ఎండింగ్ లో సర్దార్ వెనక్కి తగ్గాక, తన కొడుకు తన తండ్రిపై ఉన్న బ్లాక్ మార్క్ ని తీసేద్దామని పర్సనల్ గా ఒక మిషన్ లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంతకి ఆ మిషన్ ఏంటి? సర్దార్ ఈ మిషన్ లోకి ఎలా వచ్చాడు అని సినిమాలో చూడాలి. అయితే సినిమాలో అన్ని సీన్లు చాలా ఆర్డినరీగా సాగిపోతుంటాయి. అండ్ చాలా సీన్లు క్రిస్పీగా ఉన్నాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ సినిమాలో ఉన్నా, వాళ్ళు చేసే పనులు అలా ఉండవు. ఫైనల్ గా కార్తీకి థ్యాంక్స్ చెప్పాలి పెర్ఫార్మన్స్ విషయంలో. ఇక ఎస్.జె. సూర్య ని అస్సలు వాడుకోలేదు. ఫైనల్ వర్డ్ ఏంటంటే సర్దార్ 2 టోటల్లీ డిస్సపాయింటెడ్.
సహ.. లైఫ్ అఫ్ సంజు అని మూవీ రిలీజ్ అయింది. సో లైఫ్ అఫ్ సంజు సహా అనే ఈ మూవీని ఒక డీసెంట్ అండ్ క్లీన్ లవ్ స్టోరీస్ లాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో... ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా, డీసెంట్ గా నీట్ గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారేమో అని నాకు అనిపించింది. అండ్ సినిమాకి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కి అప్రిషియేట్ చేయగలిగేలాగానే మన ముందుకు తీసుకొచ్చారు అని చెప్పాలి.
అండ్ లైఫ్ అఫ్ సంజు లైఫ్ లో సహ ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్ ఏంటి? అండ్ సంజు ట్రాన్సషన్ లైఫ్ ని ఈ స్క్రీన్ ప్లే ద్వారా బాగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేసారు. అండ్ అక్కడక్కడా బోర్ సీన్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడా కొంచెం యాక్షన్ తో కూడిన ఎపిసోడ్స్ ని కూడా ట్రై చేసారు. ఓవరాల్ గా ఆ లవ్ స్టోరీ లో సంజు - సహా లైఫ్ లో వాళ్ళ రేలేషన్షిప్ ని బాగా చూపించారు. అండ్ సినిమా క్లైమాక్స్ బాగా డిస్ట్రబ్ చేసింది. అందుకనే ఈ క్లైమాక్స్ కి అందరూ కనెక్ట్ కాకపోవచ్చు. కొందరు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఆ లాస్ట్ 15 మినిట్స్ అయితే మనం ఎమోషనల్ అయ్యేట్టుగా మేకర్స్ తీసుకెళ్లారు. ఫైనల్ గా ఇది ఒక గ్రేట్ మూవీ అని చెప్పను గాని, వాళ్ళు తీసిన సినిమా, చేసిన ప్రయత్నం, అండ్ పెర్ఫార్మన్సెస్, వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ని కూడా చక్కగానే చెప్పారు అనేది నా ఫీలింగ్.
Ramba Oorvasi Menaka Movie review
By Cinema Picha
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ఆల్మోస్ట్ అల్లరి నరేష్ గత మూవీ యముడికి మొగుడు కాన్సెప్ట్ లాగానే ఇది కూడా ఉంటుంది. అండ్ సినిమా స్టోరీ పాయింట్ గురించి చెప్తే బానే ఉంది. ఓవరాల్ గా కామెడీ అయితే నాకు వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి కూడా కనెక్ట్ అవలేం. అండ్ హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక AI అయితే సినిమాలో వరెస్ట్ గా ఉన్నాయి. సెట్ ప్రాపర్టీస్ ఫేక్ గా అనిపిస్తాయి.
అండ్ సినిమాలో మెయిన్ గా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పెద్దగా లేదు. కానీ ఆయన పొటెన్షియల్ కి తగ్గ రోల్ కాదు ఇది. అండ్ మిగతా వాళ్ళు అంతంత మాత్రమే.. అండ్ సినిమాలో ఓవరాల్ గా కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఇంకేమి వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ అల్లరి నరేష్ గారు ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా బాగా చేద్దామనుకున్నారు కానీ, ఇది యముడికి మొగుడు 2.0 లా ఉంది కానీ, కనెక్ట్ కాదు.
Ramba oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. నాకు అల్లరి నరేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన మీదున్న అభిమానంతోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసాక ఓవరాల్ గా కొన్ని సీన్స్ మాత్రమే బాగున్నాయి. బేసిగ్గా స్టోరీ పాయింట్ చూస్తే.. ఒక బుక్ లో ఉన్నట్టు, రంభ ఊర్వశి మేనక లు ఏదో ఒకరోజు వచ్చి వరం ఇస్తాడని ఎదురుచూస్తుంటారు. ఓపెన్ గా చెప్పాలంటే మంచి లైన్ ని తీసుకొచ్చి, రొటీన్ ట్రీట్మెంట్ తో తలనొప్పి తీసుకొచ్చారు. అండ్ సినిమాలో నరేష్ గారు మాత్రం బాగా పెర్ఫార్మ్ చేసారు.
కొన్ని సీన్స్ కోసం ఒకసారి చూసేలానే ఉంది. మూవీలోని కాన్సెప్ట్ బాగుంది. కామెడీ సీన్స్ బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఇంద్రుడిగా బాగున్నాడు. మైనస్ పాయింట్స్ చెప్పుకుంటే, రొటీన్ సీన్స్, రొటీన్ స్టోరీ.. అండ్ ట్రీట్మెంట్ కూడా యావరేజ్ టెంప్లెట్ తో వెళ్ళిపోతుంది. అండ్ మదర్ సెంటిమెంట్ కనెక్ట్ కాలేదు. కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా లేదు. అండ్ ముగ్గురి హీరోయిన్లకు సరైన సీన్లు లేవు. ఓవరాల్ గా పెద్ద పెద్ద కామెడియన్లను పెట్టి బాగానే ట్రై చేసారు. కానీ ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు. కొన్ని ఫన్ సీన్ల కోసం ఒకసారి చూసేలా సినిమా ఉంది. అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ 2.75\5
Rambha Oorvasi Menaka movie review
By Thyview
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. అసలు సినిమాలో స్టోరీ పాయింట్ ఏముందో కూడా సరిగా అర్ధం కాదు. ఎందుకంటే టైటిల్ రోల్ చేసిన వాళ్ళ చుట్టూ సినిమా ఉంటుంది కానీ, వాళ్లకు అస్సలు కనెక్ట్ అవదు. అండ్ ఈ సినిమా పదేళ్ల కిందట వచ్చినా కూడా హిట్ అవదు. మొత్తం సినిమాలో ఒక్క సీన్ కూడా నచ్చలేదు. అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్ లో సినిమా చేంజ్ అవుతుంది అన్న ఆశ వస్తుంది, కానీ సినిమాలో అదొక్క సీన్ తప్ప ఇంకేమి లేదు.
అండ్ సినిమాలో హీరోయిన్లు ఐదు నిమిషాల కొచ్చి ఏవో డాన్సులు వేసి, డైలాగులు చెప్పి వెళ్ళిపోతారు. అండ్ సినిమాలో వింటేజ్ నరేష్ కనిపిస్తాడు అని, చాలా మంది ఆడియన్స్ అనుకున్నారు కానీ, ఇప్పుడు కూడా దెబ్బేసారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎవ్వరు కూడా ఫ్రెష్ గా చేయలేదు. ఓవరాల్ గా మూవీలో కథ పరంగా ఎక్కడా సీరియస్ నెస్ లేదు. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా లేదు. ఓవరాల్ గా రంభ ఊర్వశి మేనకా డిస్సపాయింట్ చేసిందండి.
Ramba Oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. మూవీ గురించి చెప్పాలంటే గుడ్. బాగుంది సినిమా.. అంటే అవుట్ రైట్ ఫన్నే. స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటది, ఎండింగ్ లో ఒకలా ఉంటది. సినిమాలో ఫన్ బాగానే వర్కవుట్ అయింది. అవుట్ డేటెడ్ అనుకున్నా, కానీ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పాలి. అల్లరి నరేష్ గారు ఇలా ఫన్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తే బాగుంటుంది. అండ్ సినిమాలో చాలా సినిమాల రిఫరెన్స్ లు ఉంటాయి. ఇక ఎమోషనల్ డ్రామా అనేది సినిమాలో వర్కౌట్ అయింది. కానీ దానికన్నా ఫన్ మెయిన్ కంటెంట్ అని చెప్పాలి.
అండ్ సినిమాలో 1 or 2 సీన్స్ రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తాయి. అల్లరి నరేష్ గారితో పాటు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరోయిన్లు అందరూ బాగా చేసారు. సినిమాలో చిన్న మెసేజ్ కూడా బాగుంది. సాంగ్స్ అండ్ బీజీఎమ్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా గుడ్. ఇప్పటికైతే ఈ రివ్యూ ఇంతే.
Ramba Oorvasi menaka movie review
'రంభ ఊర్వశి మేనక' రివ్యూ.. గురించి చెప్పాలంటే... ముందు నేను అల్లరి నరేష్ మూవీ చాలా రోజులుగా మిస్ అయ్యాను ఎలాగైనా వెళ్లాలని వెళ్ళా... చూసాక it is so bad... ఈ సినిమా అయితే ఇక కష్టమే. మాములుగా కొన్ని సినిమాలుంటాయి.. అరె ఇది అప్పుడొచ్చుంటే ఆడుండేదేమో రా అనేట్టు ఉంటాయి.. కానీ ఈ సినిమా అలా కూడా ఉండదు. ఎప్పుడొచ్చినా ఆడవు అనేలా ఉంటుంది.
పైగా ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనకలను దేవతలంటూ చూపిస్తూ ఐటెం సాంగ్ చేయించారు అది అస్సలు నచ్చలేదు. పైగా వెకిలి చేష్టలు చేయిస్తారు. ఈ స్టోరీ లైన్ రాయడం చాలా రొట్టగా ఉంది. అసలు ఈ సీన్ కి నవ్వాలా అని ఒక్క సీన్ కూడా అనిపించదు. తల తోక సంబంధం లేని జబర్దస్త్ కామెడీ కన్నా ఘోరంగా రోతగా ఉంటుంది ఈ సినిమా. సినిమాలో ఎన్ని బెస్ట్ సీన్స్ ఉన్నాయో లెక్కబెట్టడం కూడా అవసరం ఉండదు. ఎందుకంటే నాకైతే ఎక్కడా కనిపించలేదు. అసలు స్టోరీ ఎట్నుంచి ఎటొచ్చి ఎల్తుందో కూడా తెలీదు. పైగా సినిమాలో AI సీన్లు పెట్టారు. దరిద్రంగా ఉంటాయి. చాలా సీన్లు non sink లో ఉంటాయి. ఓవరాల్ గా దీని గురించి ఎంత మాట్లాడితే అంత వేస్ట్.
Ramba oorvasi menaka movie review
సో 'రంభ ఊర్వశి మేనక' మూవీ చూసొస్తున్నాను. సగమే చూసొస్తున్నాను. బేసిగ్గా అంతే ఎం లేదు మూవీ.. నేను సినిమాలో ఎంత దరిద్రం ఉన్నా, ఒక్క పాజిటివ్ ఉన్నా మొత్తం చూస్తా.. కానీ ఈ సినిమాలో ఒక్క జోక్ కి నవ్వు రాలేదు. నాకొక్కడికే నవ్వు రావట్లేదేమో అనుకున్నా, కానీ థియేటర్లో మిగతా వాళ్ళు కూడా నవ్వట్లేదు. సినిమా మొత్తం 90స్ లో కూడా రాని క్రిమ్జ్ కామెడీని ఇరికించారు. ఎంతలా అంటే నేను చూసిన థియేటర్లో కొంతమంది నిద్రపోయారు.
సినిమా అయితే దారుణాతి దారుణం. సినిమాలో హీరో సహా ఎవ్వరి క్యారెక్టర్ కూడా నచ్చలేదు నాకు. అండ్ సినిమా కోసం చాలా ట్రావెల్ చేశా.. దాంతో మరింత తలనొప్పి ఒచ్చింది నాకు. అండ్ ట్రైలర్ కూడా నచ్చలేదు కానీ ఎందుకు పోయాను అంటే... ఈ ఇయర్ లో కొన్ని రొటీన్ ట్రైలర్ ఇచ్చి, సినిమాలో మంచి కంటెంట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమా కూడా ఉంటుందేమో అని ఆశతో వెళ్ళాను. కానీ తప్పు చేసానని వెళ్ళాక తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే ఏదో పైత్యంతో వెళ్ళాను. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే... నా వల్ల కాదు. ఇక మిగతా వాళ్ళు రుద్దుతున్నావు అంటే కూడా నేనేం చేయలేను. ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు.
Bethlehem Kudumba unit movie review
బెత్లేహెం కుడుంబ యూనిట్.. బేసిగ్గా మలయాళంలో రెండు వారాల కిందే వచ్చింది.. కానీ తెలుగు వెర్షన్ చూద్దామని అనుకుని ఇప్పుడు చూసొచ్చా... ఇక సినిమా గురించి చెప్పుకుంటే... ఎందుకో అంత బాలేదు సినిమా.. అంటే అంత ఏమి ఎక్కలేదు సినిమా.. అదేందో ఎదో రకంగా ఉంది సినిమా.. రెండున్నర గంటల సినిమా చూస్తే... కూడా నాలుగు గంటల సినిమా చూసిన ఫీల్ కలిగింది నాకు.. మలయాళం సినిమా ఇది పక్కా మలయాళం ఛాయలు ఉంటాయి కానీ ఫ్రెష్ ఫీల్ అయితే ఎక్కలేదు.
అండ్ సినిమాలో కామెడీ కూడా ఎక్కలేదు. ఎదో కొన్ని సీన్స్ నవ్వించాయి గాని గుర్తుపెట్టుకునేలా లేవు. రెగ్యులర్ మూవీ లవర్స్ కి నచ్చోచ్చు ఈ సినిమా... కానీ నాకైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానో ఏమో అంత ఎక్కలేదు. బట్ సినిమాలో హీరోహీరోయిన్లు బాగానే యాక్ట్ చేసారు. సో ఇక చెప్పాల్సింది ఎం లేదు, బాగా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కుడుంబ యూనిట్ నచ్చాలంటే గుడుంబా తీసుకోవాలి. ఇక నా రేటింగ్ ఈ సినిమాకు ఇవ్వాల్సి వస్తే... 2.75\5
Bethlehem Kudumba Unit movie Review
సో బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. సో సినిమా ఎలా ఉందంటే మాములుగా లేపలేదు భాయ్ ఈ మూవీని. ok its good. అండ్ సినిమాలో హీరో నివిన్ పౌలి ఒక పెద్దమనిషిలాగానే ఉంటాడు. న్యాచురల్ గా క్యారెక్టర్ బాగుంది. ఇక సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు మధ్య ఏజ్ గ్యాప్ కాన్సెప్ట్ ని బాగా చూపించారు. అండ్ సినిమాలో ప్రేమలు ఎఫెక్ట్ చాలా కనిపించింది. చాలా సీన్లు ప్రేమలుని గుర్తుచేస్తాయి. కాకపోతే సినిమాలో మీమ్స్ డైలాగ్స్ ని ఇరికించినట్టు అనిపిస్తుంది.
అండ్ సినిమా సెకండ్ హాఫ్ ని మాత్రం బాగా ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అనవసరంగానే లాగినట్టు అనిపించింది. ఓకే వన్ టైం వాచబుల్. ఇక తెలుగులో సాంగ్స్ మాత్రం అష్ట దరిద్రంగా ఉన్నాయి. డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ కార్ సీన్స్ చాలా బాగున్నాయి. జెన్యూన్ గా నవ్వుకోవచ్చు. సో ఓవరాల్ గా బెత్లేహెం కుటుంబ యూనిట్ బాగుంది. డీసెంట్. ఒకసారైతే పక్కా చూసేలానే ఉంది.
Bethlehem kubumba unit movie review
బెత్లేహెం కుడుంబ యూనిట్... మలయాళంలో few వీక్స్ బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయి, ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అయి మంచి డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక సినిమా గురించి చెప్పాలంటే మూవీ చూసాక కొంచెం మిక్స్డ్ ఫీలింగే కలిగింది. ఇక సినిమాలో ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు హీరో హీరోయిన్లు వాళ్ళ పెద్దల్ని ఒప్పించి ఎలా పెళ్లిచేసుకున్నారనేది స్టోరీ. ఇక నివిన్ పౌలి - మామితా బైజు ఇద్దరూ పోటీ పడి మరి బాగా నటించారు. అండ్ మూవీలో వీళ్ళ ప్రపోజల్ సీన్ హైలెట్.
ఇక మూవీలో విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. సినిమా చాలా సింపుల్ వే లో ఉంటుంది. అందరికి అర్ధమేయ్యేలా, ఫ్యామిలీ కూడా చూసేలా ఉంది. మైనస్ అంటే రన్ టైం ఒక్కటే.. కొంచెం ల్యాగ్ ఫీల్ ఒస్తుంది. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ చాలానే చూసాం.. ఇందులో కొంత ఏజ్ గ్యాప్ ఉంటుంది అంతే. ఫైనల్ గా ఒక ఫీల్ గుడ్ మలయాళ లవ్ స్టోరీలా తక్కువ అంచనాలతో చూస్తే నచ్చుతుంది.
Bethlehem kudumba unit movie review
By Thyview
బెత్లేహెం కుడుంబ యూనిట్... మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే il iked it. ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ. మూవీ అయితే ఏం తేడా అవ్వకుండా క్లీన్ గా ఎల్లిపోతుంది. స్టోరీ ఏంటంటే గిరీష్ ఏ.డి సినిమాల్లో పెద్దగా స్టోరీ ఉండదు. కానీ ఈ మూవీలో స్టోరీ యావరేజ్ గా ఉన్నా, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ఎంటెర్టైనింగ్ గా ఉంటుంది. ఇక సినిమాలో పెద్దగా హెవీ డైలాగ్స్ కూడా ఉండవు. సింపుల్ ఫన్ క్యూట్ మూమెంట్స్.. అండ్ చాలా లైఫ్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్ లో. సో ఆర్గానిక్ గా స్టోరీ ముందుకు వెళ్తా ఉంటది.
అండ్ సినిమాలో నివిన్ పౌలి - మామితా బైజు చాలా నాచురల్ గా చేసారు. ఇక సినిమాలో మ్యూజిక్ చాలా బాగుంది. మిక్సింగ్ కూడా బాగుంది. మూవీలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ కూడా బాగుంది. సినిమాలో ప్రతి పాయింట్ ని కూడా ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఎంతలో చెప్పాలో అంతలోనే చెప్పారు. ఓవరాల్ గా మూవీ బాగా నచ్చేసింది. ఇట్స్ వర్త్ వాచబుల్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Freelancer & Consultant
Homemaker / Housewives
Women managing households
Influencer
IT Employee
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers