Movie Reviews
Professional reviews and ratings from top critics and publications worldwide
టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ “హే బలవంత్’’ (Hey Balwanth). గోపి ఆచార డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కామెడీ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన ఈ చిత్రంలో.. మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సుహాస్, సీనియర్ నరేశ్ నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి.
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన చీకటిలో మూవీ లో శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ లో నటించింది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించిన విశ్వదేవ్ రాచకొండ జస్ట్ ఓకే అనిపించాడు. కృష్ణచైతన్య పోలీస్ పాత్రకు న్యాయం చేశాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన సీనయిర్ నటుడు సురేష్.. ఈషా చావ్లాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వాళ్ల పాత్రలు అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. రవీంద్ర విజయ్ క్యారెక్టర్ కూడా అంతే. వడ్లమాని శ్రీనివాస్ బాగా చేశాడు. అయితే ఓవరాల్ గా యావరేజ్ కంటెంట్ గా చీకటిలో ఒకసారి ట్రై చేయొచ్చు.
శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో సినిమా గురించి చెప్పాలంటే.. దర్శకుడు శరణ్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. ఇంకా బెటర్‌గా కంటెంట్‌ను డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇప్పటి వరకు శోభితాను చూసిన విధానం వేరు.. ఈ సినిమాలో సంధ్య పాత్రలో ఆమె ఫుల్ మార్కులు కొట్టేసింది. సీనియర్ నటుడు సురేష్, రవీంద్ర విజయ్, ఆమని, ఝాన్సీ, చైతన్య లాంటి ఆర్టిస్టులు ఉన్నా కథలో వారి పాత్రలను బలంగా చూపించకలేకపోయారనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ మధ్య నడిచే ట్విస్టు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాకు ఆ ఎపిసోడ్ కొంత మేరకు హైలెట్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా రెగ్యులర్ పాయింట్‌తో సాగే ఎమోషనల్ మర్డర్ మిస్టరీ అనే ఫీలింగ్ కలిగేలా చేస్తుంది.
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 'చీకటిలో' మూవీలో శోభిత క్రైమ్ జర్నలిస్ట్ గా బాగానే చేసింది. సీఐ గా నటించిన చైతన్య కృష్ణ పాత్ర కాస్తంత బలమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇషాచావ్లా మరోసారి కెమెరా ముందుకొచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఆమె నటించింది. వడ్లమాని సాయి శ్రీనివాస్ పాత్ర ఇందులో భిన్నమైంది. నిజానికి ఈ సినిమాలో ప్రతిభగల నటీనటులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళను పూర్తి స్థాయిలో దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఉపయోగించుకోలేదు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం బాగుంది. సంభాషణలు అర్థవంతంగా ఉన్నాయి. 'తప్పు చేసి చీకట్లో దాక్కునే ఏ మృగాన్ని వదల కూడదు, మన భయం వాళ్ళకి బలంగా మారకూడదు' అనే పాయింట్ మీద తీసిన 'చీకటిలో...' మూవీ క్రైమ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. కాకపోతే భారీ అంచనాలు మాత్రం పెట్టుకోకూడదు.
సినిమాల్లో, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్లలో సత్యం కోసం వెతికే జర్నలిస్ట్ అనేది ఫెమిలియర్ క్యారక్టెర్. OTT ప్లాట్‌ఫామ్‌లలో ట్రూ-క్రైమ్ జానర్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేసేసిన సమయంలో ‘చీకటిలో’ సినిమా వచ్చింది. 126 నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా జానర్‌కి కొత్తగా ఏం యాడ్ చేయలేదు. తెలిసిన కథనే చెబుతున్నట్లు ఉంటుంది. చాలా సీన్స్‌ని ముందే ఊహించవచ్చు. మిస్టరీ థ్రిల్లర్ మూడ్, టెన్షన్, అట్మాస్ఫియర్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇందులోని పాత్రలు, వరల్డ్ నేచురల్‌గా డెవలప్ అయి ఉంటే ఇంకా బాగుండేది. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా సీన్స్‌ని ఎలివేట్ చేసింది. రైటింగ్ వీక్‌గా ఉన్న ప్రతి సీన్‌లో బలంగా పని చేసింది. అయితే కేవలం మ్యూజిక్ మాత్రమే సినిమాని కాపాడలేదు. శోభితా ధూళిపాల యాక్టింగ్, సోషల్లీ రిలవెంట్ ఐడియా పక్కనపెడితే ‘చీకటిలో’.. ఓ యావరేజ్ అనే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
సీరియల్ కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వచ్చిన సినిమాలు కోకొల్లలు. అయితే చాలా సినిమాల్లో హంతకుడు వరుస హత్యలు చేయడానికి గల కారణాలు అప్పటికే పలు సినిమాల్లో చూసినట్టు లేదా రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'చీకటిలో' సీరియల్ కిల్లర్ మోటివ్ డిఫరెంట్‌గా ఉంది. ఇన్నాళ్ళూ లైంగిక వేధింపులను ఒక కోణంలో చూపించారు. ఇందులో మరో కోణం తీసుకున్నారు. సినిమాకు అది డిఫరెంట్ టచ్. 'చీకటిలో' పాయింట్ కొత్తగా ఉంది. ఎండింగ్ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, ప్రతి ఒక్కరి ఊహలకు అతీతంగా వెళ్ళింది. చివరి వరకు హంతకుడు ఎవరు? అనేది ఊహించడం కష్టం. మంచి ఎండింగ్ రాసుకున్న దర్శక రచయితలు రొటీన్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేయడం మైనస్ పాయింట్. శోభితా ధూళిపాళ పాత్రను, వరుస హత్యలను పరిచయం చేసిన తీరు ఎటువంటి ఉత్కంఠకు గురి చేయదు. ఏ విధమైన ఆసక్తి కలిగించదు. సింపుల్ & స్ట్రైయిట్‌గా వెళుతుంది. ఓవరాల్ గా మూవీ ఒక్కసారి చూసే విధంగా ఉంది.
శోభిత ధూళిపాళ మెయిన్ లీడ్ గా నటించిన చీకటిలో మూవీ శరన్ కొప్పిశెట్టి డైరెక్ట్ చేయగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే, ఈ ‘చీకటిలో’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లో సెటప్ ఒకింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్య రోల్ లో శోభిత బాగా చేశారు. అంతే కాకుండా ఇందులో అంతర్లీనంగా ఉండే సందేశం కూడా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఈ క్రమంలో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన మూడ్ కొంచెం మిస్ అయ్యింది. ఇంకా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్ట్ గా సాగే సన్నివేశాలు ఇందులో జోడించి ఉండాల్సింది. సో చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది.
నిజజీవిత కథతో, రూటెడ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన సీరియస్ కథాంశం ఇది. ఎటువంటి సినిమాటిక్ అంశాలు లేకుండా రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందక పోవచ్చు. ఇలాంటి రియలిస్టిక్ కథకు కథలో సోల్ లోపించకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, మరిన్ని కమర్షియల్ వాల్యూస్ యాడ్ చేసి ఉంటే 'బైసన్' అందరిని ఆకట్టుకునే అవకాశం ఉండేది. సినిమాలో కథ కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కుటుంబ నేపథ్యంతో సాగిన కథ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. పాటలు మధురంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ మంచి స్థాయిలో ఉన్నాయి. కొంతవరకు కథ ముందే ఊహించగలిగినదే అయినా, ప్రదర్శన కారణంగా సినిమా ఆకట్టుకుంటుంది.
చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా నటించిన చిత్రం “బైసన్”. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 1990 కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న వర్గ రణాల్ని, వాటి కారణంగా అసువులు బాసిన మనుషుల వ్యథల్ని కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు మారి సెల్వరాజ్. అయితే.. ఈ కథకు తెలుగు ప్రేక్షకులు ఎంతవరకూ రిలేట్ అవ్వగలరు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే.. పూర్తిగా తమిళ నెటివిటీ, సంస్కృతికి అద్దం పట్టేలా ఉండడంతో.. ఈ చిత్రం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే.. పూర్తిస్థాయిలో నచ్చకపోవచ్చు అనే చెప్పాలి. అయితే.. ధృవ్ విక్రమ్, పశుపతిల మాస్టర్ క్లాస్ యాక్టింగ్ & మారి సెల్వరాజ్ టేకింగ్ ను ఆస్వాదించడం కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే!
బైసన్ సినిమా విషయానికి వస్తే మేకర్స్ మంచి క్వాలిటీతో సినిమా తీశారు. నివాస్ ప్రసన్న నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో ఉపయోగపడింది. తన పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. ఎలిల్ అరసు ఛాయాగ్రహణం సినిమాలో మేజర్ హైలైట్. విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారి సెల్వరాజ్.. ఇంతకుముందు తీసిన నాలుగు సినిమాలతో పోలిస్తే ‘బైసన్’ సాధారణంగా అనిపిస్తుంది. తన సినిమాల్లో బలమైన ఎమోషన్ ఉంటుంది. ఇందులో అది మిస్ అయింది. సాధారణమైన పాత్రలు.. సన్నివేశాలతో తన మీద ఉన్న అంచనాలను అతను అందుకోలేకపోయాడు. కుల కోణాన్ని అతను ఈసారి సరిగా ఎలివేట్ చేయకపోవడమే సినిమాకు సమస్యగా మారింది
బైసన్ సినిమా విషయానికి వస్తే.. ధ్రువ్ విక్రమ్ పెర్ఫార్మెన్స్, ఆయన పాత్రతోపాటు పశుపతి ఇతర క్యారెక్టర్లను చిత్రీకరించిన తీరు ఈ మూవీకి అత్యంత బలంగా మారింది. కథ, కథనాలు మరో ప్లస్ పాయింట్, ఫస్టాఫ్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. కానీ రెండో భాగంలో అంతా ఊహించినట్టే సన్నివేశాలు ఉండటం కొంత మైనస్. తమిళ వాసన ఎక్కువగా ఉండటం తెలుగు ప్రేక్షకులకు రుచించని అంశంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా ఆద్యంతం కట్టిపడేసే కథనం, ఆలోచింపజేసే కథ, స్పోర్ట్స్, దేశభక్తిని రగిలించే అంశాలు ఉన్న ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందే. హై ఎండ్ థియేట్రికల్ వాల్యూస్ ఉన్న సినిమా ఇది. ఎలాంటి అంచనాలు ఉన్న చక్కటి అనుభూతిని పంచే మూవీ బైసన్. ఈ వారం థియేటర్‌లో చూడటానికి, సినిమాటిక్ అనుభూతిని పొందడానికి ప్రేక్షకులకు, సినీ అభిమానులకు చక్కటి ఆప్షన్. డోంట్ మిస్ బైసన్ దిస్ వీక్.
మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన బైసన్ మూవీ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా. మణాతి గణేశన్ లైఫ్ స్టైల్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ధృవ్ విక్రమ్ టైటిల్ రోల్ చేసాడు. అయితే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది ఈ సినిమా. కంటెంట్ బాగున్నా, స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉండడం వల్ల, కథలో కావాల్సిన కంటెంట్ కన్నా, సమాజంలో జరిగే అసమానతలపై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల మూవీ ఆడియన్స్ కి అంతగా రీచ్ కాదు. ఓవరాల్‌గా చూస్తే, ‘బైసన్’ చిత్రం అనచివేత, సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామాగా పర్వాలేదనిపిస్తుంది. ధృవ్ విక్రమ్ డెడికేషన్, పశుపతి ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అయితే, మారి సెల్వరాజ్ గతచిత్రాలతో పోలిస్తే ఈ సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపెట్టలేకపోయింది. సాగదీసే రన్‌టైమ్, వీక్ రైటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. స్పోర్ట్స్ డ్రామాలతో పాటు సామాజిక అంశాలు ఉన్న చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
Browse by Reviewer Category
Discover reviews from different types of critics and publications
News Channel
Movie-specific media and publications
Twitter Channel
Website
Youtube Channel
CA/Advocate
Corporate (Non IT) Employee
Doctor/Health Worker
Homemaker / Housewives
Women managing households
Journalists & Critics
Private Employee
Small Business Owner
Less than 20 team size
Students & Youth
School students, college students, young viewers