Register as a Reviewer
సర్దార్ 2 (Sardar 2)

సర్దార్ 2 (Sardar 2)

10 Sep 2026
Overall Rating
4.7/10
26 Reviews

కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన సర్దార్ మూవీ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. నాలుగేళ్ళ కిందట విడుదలైన ఈ మూవీ కార్తీ కెరీర్లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ మూవీకి సర్దార్ 2 తెరకెక్కగా, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ గా థియేటర్లలో విడుదలైంది. PS మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కార్తీ హీరో కాగా, SJ. సూర్య విలన్ గా నటించారు.

Director: PS Mithran
Cast: Karthi, SJ Suryah, Malavika Mohanan, Ashika Ranganath, Yogi Babu, Rajisha Vijayan and others.

Available in:

Reviews

What critics and the public are saying about సర్దార్ 2 (Sardar 2)

Media Reviews

20 Avg: 4.8/10
Cinema Picha
Cinema Picha Youtube Channel
6

Above Average

Sardar 2 movie review

సర్దార్ 2.. 2022 లో రిలీజ్ అయిన సర్దార్ కి సీక్వెల్ ఇది. మూవీ లో సినిమాలో ఉన్న పాజిటివ్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. మన సర్దార్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా బాగున్నాయి. సాంగ్స్ డిస్ట్రబ్ చేయడం కూడా పెద్దగా ఏమి లేవు. ఫన్ కూడా కొన్ని బ...

సర్దార్ 2.. 2022 లో రిలీజ్ అయిన సర్దార్ కి సీక్వెల్ ఇది. మూవీ లో సినిమాలో ఉన్న పాజిటివ్ మాట్లాడుకుందాం ముందు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందండి. మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో. మన సర్దార్ ఫ్లాష్ బ్యాక్ సీన్లు కూడా బాగున్నాయి. సాంగ్స్ డిస్ట్రబ్ చేయడం కూడా పెద్దగా ఏమి లేవు. ఫన్ కూడా కొన్ని బాగుంటాయి. అండ్ ఆ మూమెంట్ లో ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే మెసేజ్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఆ మెసేజ్ ఈ జెనరేషన్ వాళ్ళకి చాలా బాగా కావాల్సిందే. 


అండ్ ఫస్ట్ హాఫ్ అలా ఉండగా, సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి మాత్రం కథ మారిపోతుంది. మూవీ లో మెయిన్ మైనస్ లెంగ్త్. అండ్ కార్తీ - ఎస్.జె. సూర్య మధ్య కాంబో సీన్స్ అంతగా పేలలేదు. డైరెక్టర్ స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. అండ్ ఒక స్పై సినిమాకి కావాల్సిన ఎలెమెంట్స్ ఇందులో మిస్ చేసారు. ముఖ్యంగా స్పై సినిమాలో గన్స్ చాలా నార్మల్. కానీ ఇందులో చాలా తక్కువగా వాడారు. అండ్ సినిమాలో VFX చాలా బాడ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా బానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త డిస్సపాయింట్ చేస్తుంది. 

Sep 10, 2026 Watch
T2B Live
T2B Live Website
5

Average

Sardar 2 movie review

సర్దార్ మొదటి పార్ట్ సాలిడ్ విజయం సాధించడంతో రెండో పార్ట్ ను తెరకెక్కించగా ఎక్కడా కూడా సీక్వెల్ హైప్ కి మ్యాచ్ అయ్యేలా అయితే సర్దార్2 స్క్రీన్ ప్లే ను రాసుకోలేక పోయాడు డైరెక్టర్. కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే చాలా లాగ్ ఉన్న సీన్స్ తో డ్రాగ్ అవుతూ అసలు ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అయి...

సర్దార్ మొదటి పార్ట్ సాలిడ్ విజయం సాధించడంతో రెండో పార్ట్ ను తెరకెక్కించగా ఎక్కడా కూడా సీక్వెల్ హైప్ కి మ్యాచ్ అయ్యేలా అయితే సర్దార్2 స్క్రీన్ ప్లే ను రాసుకోలేక పోయాడు డైరెక్టర్. కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అలాగే చాలా లాగ్ ఉన్న సీన్స్ తో డ్రాగ్ అవుతూ అసలు ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అయిన సర్దార్ సీక్వెలేనా అని అనిపించేలా ఉంటుంది. ఉన్నంతలో కార్తి తన వరకు రెండు రోల్స్ డిఫెరెంట్ గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ ఉన్నంతలో ఓకే అనిపించుకోవా ఎస్ జే సూర్య విలన్ గా పర్వాలేదు అనిపించినా కథ పెద్దగా లేక పోవడంతో ఇంపాక్ట్ లేకపోయింది.



ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపించగా ఏ దశలో మెప్పించలేకపోయింది…ఫస్టాఫ్ లోనే డ్రాగ్ ఎక్కువ ఉందంటే సెకెండ్ ఆఫ్ డ్రాగ్ మరీ ఎక్కువ అయింది…సీన్స్ వైజ్ గా కూడా చాలా కొన్ని సీన్స్ మినహా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది ఈ సీక్వెల్. మొత్తం మీద మరీ తక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళినా కూడా సినిమా ఆ అంచనాలను కూడా అందుకోవడానికి చాలా ఓపిక పట్టి చూడాల్సి ఉంటుంది…అంత ఓపిక ఉంటే ఓవరాల్ గా కొంచం కష్టం అయినా ఓకే అనిపించవచ్చు.


Sep 10, 2026 Read Review
Featu Gadi Media
Featu Gadi Media Youtube Channel
6

Above Average

Sardar 2 Movie Review

సర్దార్ 2... ఇది ఫస్ట్ హాఫ్ కి డైరెక్ట్ కంటిన్యుయేషన్.. ఇది చూడాలంటె ముందు ఫస్ట్ పార్ట్ కూడా చూడల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి కనెక్షన్స్ చాల ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ చూసాక చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ కే వచ్చేసింది. దీంతో సెక...

సర్దార్ 2... ఇది ఫస్ట్ హాఫ్ కి డైరెక్ట్ కంటిన్యుయేషన్.. ఇది చూడాలంటె ముందు ఫస్ట్ పార్ట్ కూడా చూడల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కి కనెక్షన్స్ చాల ఉంటాయి. అండ్ సెకండ్ పార్ట్ చూసాక చెప్పాలంటే... ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ కే వచ్చేసింది. దీంతో సెకండ్ హాఫ్ లో ఏం పెట్టాలో డైరెక్టర్ మర్చిపోయాడు అన్నట్టుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే... చూడొచ్చు... 


ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే కార్తీ.. చాలా బాగా చేసాడు. అండ్ స్టోరీ పాయింట్ కూడా బాగుంది. అయితే ఎస్.జె. సూర్య రోల్ మాత్రం వేరే సినిమాల్లో ఉన్నట్టే ఉంది. యాక్టింగ్ కూడా ఫ్రెష్ గా లేదు. బీజీఎమ్ అయితే వరెస్ట్ గా ఉంది. అండ్ ల్యాగ్ సీన్స్ చాలా ఉన్నాయి. అండ్ సినిమాలో ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అండ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న స్ట్రాంగ్ మెసేజ్ పాయింట్ సెకండ్ పార్ట్ లో రాసుకోలేదు. అది సినిమాకి మైనస్ అయింది. అండ్ AI విజువల్స్ బాగాలేవు. మూవీ లెంగ్త్ చాలా మైనస్ అయింది. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ బాగుంది నాకు నచ్చింది కాబట్టి, ఎవరైనా చూడాలంటె వన్ టైం వాచబుల్ అంటాను. కాబట్టి ఓవరాల్ గా నా రేటింగ్ 2.75\5


Sep 10, 2026 Watch
Sakshi
Sakshi News Channel
4

Below Average

Sardar 2 movie review

కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది. పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ఈసారి పెద్దగా ప్రభావం చూపించవు. కథనం రొటీన్ ఫార్ములాలో సాగుతూ, చాలా సందర్భాల్లో ముందే ఊహించే వి...

కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ 2 పై మొదటి భాగం కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఈ సీక్వెల్ అందుకోలేకపోయింది.


పార్ట్ 1లో ఆకట్టుకున్న స్పై ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ ఈసారి పెద్దగా ప్రభావం చూపించవు. కథనం రొటీన్ ఫార్ములాలో సాగుతూ, చాలా సందర్భాల్లో ముందే ఊహించే విధంగా ఉంటుంది.


కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని బలమైన స్క్రీన్‌ప్లేతో నడిపించడంలో దర్శకుడు విఫలమయ్యారు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. కార్తీ తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. బలహీనమైన రైటింగ్ కారణంగా పూర్తిస్థాయిలో ఫలితం కనిపించదు.


overall.. భారీ అంచనాలతో వచ్చిన ‘సర్దార్ 2’ రొటీన్ కథనం, బలహీనమైన స్క్రీన్‌ప్లేతో నిరాశపరిచింది. పార్ట్ 1తో పోలిస్తే ఇది స్పష్టంగా డౌన్‌గ్రేడ్ సీక్వెల్.

Sep 10, 2026 Read Review
One India
One India Website
5

Average

Sardar 2 movie review

సర్దార్ 2 సినిమా గురించి చెప్పుకుంటే... డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానికి అతిగా మందులు, యాంటీబయోటిక్స్ అలవాటు చేయడం వల్ల వచ్చే ముప్పును ప్రధానాంశంగా ఎంచుకున్నారు. అయితే సెక...

సర్దార్ 2 సినిమా గురించి చెప్పుకుంటే... డైరెక్టర్ పీఎస్ మిత్రన్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను కోర్ పాయింట్ గా చూపిస్తే.. ఈ సీక్వెల్లో కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, మానవ శరీరానికి అతిగా మందులు, యాంటీబయోటిక్స్ అలవాటు చేయడం వల్ల వచ్చే ముప్పును ప్రధానాంశంగా ఎంచుకున్నారు. అయితే సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంత నెమ్మదిస్తుంది. స్టోరీలో రొటీన్ ఫార్ములా సీన్లు, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ డ్రామా ప్రేక్షకుడికి ముందే ఊహించగలిగేలా ఉండటం కాస్త నిరాశపరుస్తుంది. 


అయితే ఎడిటింగ్ టేబుల్ పై ఇంకాస్త కత్తెర వేసి ఉంటే సినిమా వేగం పెరిగేది. మొత్తానికి ఎలాంటి థ్రిల్స్ లేని స్టోరీ, లాజిక్ లేని సీన్లు, సుదీర్ఘమైన రన్ టైమ్‌తో వచ్చిన 'సర్దార్ 2' ఓ విఫల సీక్వెల్‌గా మిగిలిపోయింది. ఫైనల్‌గా.. మొదటి భాగం స్థాయి మ్యాజిక్‌ను పూర్తిగా రిపీట్ చేయలేకపోయినప్పటికీ.. అంతర్జాతీయ స్పై థ్రిల్లర్స్, కార్తీ నటనను ఇష్టపడే వారు 'సర్దార్ 2' సినిమాను ఒకసారి వీక్షించవచ్చు.

Sep 10, 2026 Read Review
TV9 Telugu
TV9 Telugu News Channel
5

Average

Sardar 2 Movie Review

సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురా...

సర్దార్ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అవే అంచనాలు సీక్వెల్ మీద కూడా ఉన్నాయి. అందుకే దర్శకుడు మిత్రన్ అసలు కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా సూటిగా పాయింట్‌లోకి తీసుకెళ్లడం సినిమాకు పెద్ద ప్లస్. ముఖ్యంగా స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన అంశాలన్నీ బాగానే రాసుకున్నా కూడా వాటిని సరిగ్గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో అంతగా ఆకట్టుకోలేదు దర్శకుడు మిత్రన్. సర్దార్‌లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ నుంచి కలిగే నష్టాల గురించి చెప్పినట్లే.. ఇందులో కృత్రిమ మాంసాహారం, శరీరానికి మందులు విపరీతం అలవాటు చేస్తున్న విధానం గురించి చూపించారు. 


అయితే ఫస్ట్ పార్ట్ చూసి చాలా ఏళ్లవడంతో కాస్త కన్ప్యూజన్స్ కూడా వస్తుంటాయి. మొదటి భాగానికి లింక్ పెడుతూ రాసుకున్న సన్నివేశాలు మళ్లీ గుర్తు చేసుకోవడం కష్టం. ఇక మూవీలో చివర్లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఫైట్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. స్క్రీన్‌ ప్లేలో నిడివి కొంచెం తగ్గించి, ఎమోషన్స్‌ను ఇంకొంచెం బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఈ స్పై థ్రిల్లర్ రేంజ్ మరింత పెరిగి ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్లుగా చాలా రిచ్‌ గా ఉన్నాయి. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే అవుట్‌ పుట్ ఇంకా అద్భుతంగా వచ్చేది. ఓవరాల్‌ గా సర్దార్ 2.. యావరేజ్ స్పై థ్రిల్లర్..!


Sep 10, 2026 Read Review
ABP Desam
ABP Desam Website
5

Average

Sardar 2 movie review

సర్దార్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... కమల్ హాసన్‌కు 'భారతీయుడు'లా తనకు 'సర్దార్' అని కార్తీ చెప్పారు. అది నిజమే. 'భారతీయుడు'లో కమల్, 'సర్దార్'లో కార్తీ... తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా మెప్పించారు. రెండు సినిమాల్లోనూ కంటెంట్ ఉంది. 'భారతీయుడు'కు సీక్వెల్ 'ఇండియన్...

సర్దార్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో... కమల్ హాసన్‌కు 'భారతీయుడు'లా తనకు 'సర్దార్' అని కార్తీ చెప్పారు. అది నిజమే. 'భారతీయుడు'లో కమల్, 'సర్దార్'లో కార్తీ... తమ వయసుకు మించిన పాత్రల్లో కనిపించారు. లుక్స్, యాక్టింగ్ పరంగా మెప్పించారు. రెండు సినిమాల్లోనూ కంటెంట్ ఉంది. 'భారతీయుడు'కు సీక్వెల్ 'ఇండియన్ 2'తో కమల్ డిజాస్టర్ అందుకున్నారు. అలాగే సర్దార్ 2 తో కూడా కార్తీ డిజాస్టర్ అందుకున్నట్టు అనిపిస్తుంది. 


చాలా మంచి విషయం చెప్పాలనుకున్నారు. కానీ, ఎగ్జిక్యూషన్ పరంగా ఎగ్జైట్ చేయలేదు. స్పై థ్రిల్లర్ కథకు కమర్షియల్ హంగులు యాడ్ చేసి సినిమాను సాగదీశారు. కానీ, కథ సీరియస్‌గా సాగేటప్పుడు కామెడీ చేసి కంపరం పుట్టించారు. 


'సర్దార్ 2'లో ప్రజలకు చెప్పాలనుకున్న సందేశం బావుంది. కానీ, చెప్పిన విధానం బాలేదు. ఆసక్తిగా సినిమా ముందుకు సాగలేదు. కథను సాగదీసి సాగదీసి చెప్పారు. అక్కడక్కడా యోగిబాబు నవ్వించారు. అయితే... సీరియస్ కథలో ఆ కామెడీ సెట్ కాలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులతో పాటు సగటు సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసే చిత్రమిది. ఫైనల్ గా మరో భారతీయుడు 2 లా, మరో సర్దార్ 2 ఉంది. 


Sep 10, 2026 Read Review
Great Andhra
Great Andhra Website
5

Average

Sardar 2 movie review

సర్దార్ 2 చూస్తుంటే అసలు కొత్తగా ఏం చూస్తున్నామో అనిపించదు. రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడిన ఫీలింగ్ వస్తుంది. Part 1లో పనిచేసిన elementsనే తీసుకొచ్చారు కానీ ఈసారి అవి అంతగా work అవ్వలేదు. Story చాలా predictableగా ఉంటుంది.atleast screenplay లో grip కనిపించదు. కొన్ని interesting ide...

సర్దార్ 2 చూస్తుంటే అసలు కొత్తగా ఏం చూస్తున్నామో అనిపించదు.


రొటీన్ స్పై థ్రిల్లర్ ఫార్ములానే మళ్లీ మళ్లీ వాడిన ఫీలింగ్ వస్తుంది. Part 1లో పనిచేసిన elementsనే తీసుకొచ్చారు కానీ ఈసారి అవి అంతగా work అవ్వలేదు. Story చాలా predictableగా ఉంటుంది.


atleast screenplay లో grip కనిపించదు. కొన్ని interesting ideas ఉన్నప్పటికీ వాటిని proper గా develop చేయలేదు.


Karthi మాత్రం తన performance తో సినిమాని నిలబెట్టడానికి full effort పెట్టారు. కానీ S.J. Suryah లాంటి strong actorని కూడా పెద్దగా ఉపయోగించుకోలేదు.

Sep 10, 2026 Read Review
5

Average

Sardar 2 movie review

దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మనం తీసుకునే ఆహారం, అందులో కలిసే మందులు, యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోలాస్టిన్ (Colastin) అంశం ద్వారా...

దర్శకుడు పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ‘సర్దార్’లో ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగంపై అవగాహన కల్పించిన దర్శకుడు ‘సర్దార్ 2’లో మనం తీసుకునే ఆహారం, అందులో కలిసే మందులు, యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోలాస్టిన్ (Colastin) అంశం ద్వారా చూపించారు. పాయింట్ మంచిదే అయినా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు.


స్పై థ్రిల్లర్‌కు కమర్షియల్ అంశాలను జోడించడంతో సినిమా బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. సీరియస్ సన్నివేశాల మధ్య వచ్చే కామెడీ కూడా కథ ఫ్లోను దెబ్బతీసింది. తెలుగు డబ్బింగ్‌ కూడా దారుణంగా ఉంది. ఏమాత్రం సహజంగా అనిపించలేదు. అది పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ లో మాత్రం ఏ డోకా లేదు. ఎస్.జె. సూర్య మాత్రం చాలా సినిమాల్లో చేసిన క్యారెక్టర్ నే మళ్ళీ మళ్ళీ చేసినట్టుంది. మొత్తంగా సందేశం బాగున్నా.. ఎగ్జిక్యూషన్ ఆకట్టుకోలేదు. కార్తీ, పీఎస్ మిత్రన్ అభిమానులను, సగటు ప్రేక్షకులను ‘సర్దార్ 2’ నిరాశపరుస్తుంది. మంచి పాయింట్‌ను ఆసక్తికరమైన స్పై థ్రిల్లర్‌గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు.


Sep 10, 2026 Read Review
Gulte
Gulte Website
4

Below Average

Sardar 2 movie review

Sardar 2 Review : Positives:Karthi’s screen presenceNegatives:Weak screenplayForced ComedyHeavily inspired actionSardar2 basic idea is good, but the screenplay never interests you. Yet another major drawback is the lack of tension in the narrative. Spy thrillers are always pulsating, but that a...

Sardar 2 Review : 


Positives:


Karthi’s screen presence


Negatives:


Weak screenplay

Forced Comedy

Heavily inspired action


Sardar2 basic idea is good, but the screenplay never interests you. Yet another major drawback is the lack of tension in the narrative. Spy thrillers are always pulsating, but that aspect is totally missing in the film. The makers have spent money and given the film a lavish scale, but in all this, the basic emotion is missing, and the characters are hardly developed, making Sardar 2 a tedious watch. The film is only made to cash in on the franchise and nothing else.


Bottomline: Failed Mission.

Sep 10, 2026 Read Review
NTV Telugu
NTV Telugu News Channel
5

Average

Sardar 2 movie review

Sardar 2 Review :సర్దార్ 2 పై భారీ అంచనాలతో థియేటర్‌ కి వెళ్లిన ఆడియన్స్‌ కి మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. పీఎస్ మిత్రన్ మరోసారి పార్ట్ 1 టెంప్లేట్‌ నే కొనసాగించినప్పటికీ, మొదటి భాగంలో ఆకట్టుకున్న యాక్షన్, స్పై ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఈసారి అదే స్థాయిలో వర్కౌట్ కాలేదు. కథనం చాలా సాదాసీదాగా, ముందుగానే...

Sardar 2 Review :


సర్దార్ 2 పై భారీ అంచనాలతో థియేటర్‌ కి వెళ్లిన ఆడియన్స్‌ కి మాత్రం నిరాశ తప్పదనే చెప్పాలి. పీఎస్ మిత్రన్ మరోసారి పార్ట్ 1 టెంప్లేట్‌ నే కొనసాగించినప్పటికీ, మొదటి భాగంలో ఆకట్టుకున్న యాక్షన్, స్పై ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఈసారి అదే స్థాయిలో వర్కౌట్ కాలేదు. కథనం చాలా సాదాసీదాగా, ముందుగానే ఊహించగలిగే విధంగా సాగుతుంది. కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నప్పటికీ, వాటికి తగినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు.


కార్తీ తన అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా, బలహీనమైన రైటింగ్ కారణంగా అది పూర్తిస్థాయిలో ఫలించలేదు. ఎస్.జే. సూర్యను కూడా ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. మొత్తంగా చూస్తే.. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నా, ఎంగేజింగ్ రైటింగ్ లేకపోవడంతో ‘సర్దార్ 2’ ఒక డిసప్పాయింటింగ్ సీక్వెల్‌గా మిగిలింది.

Sep 10, 2026 Read Review
Chitra Jyothy
Chitra Jyothy Website
5

Average

Sardar 2 Movie Review

దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తన సినిమాల ద్వారా సాధారణ ప్రజలలో ఏదో ఒక అంశంపై అవగాహన కల్గించడానికి కృషి చేస్తుంటారు. 'సర్దార్' మూవీలో డ్రింకింగ్‌ వాటర్ మాఫియా గురించి చెప్పిన మిత్రన్... ఈ సీక్వెల్ లో మనం తినే ఆహారం ఎంతగా కలుషితం అయిపోయింది? విపరీతంగా మందుల వాడకం కారణంగా మన శరీరం ఎలా నిర్వీర్యం అయిపోతోందన్...

దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తన సినిమాల ద్వారా సాధారణ ప్రజలలో ఏదో ఒక అంశంపై అవగాహన కల్గించడానికి కృషి చేస్తుంటారు. 'సర్దార్' మూవీలో డ్రింకింగ్‌ వాటర్ మాఫియా గురించి చెప్పిన మిత్రన్... ఈ సీక్వెల్ లో మనం తినే ఆహారం ఎంతగా కలుషితం అయిపోయింది? విపరీతంగా మందుల వాడకం కారణంగా మన శరీరం ఎలా నిర్వీర్యం అయిపోతోందన్నది తెలియ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే డైరెక్టర్ ఈసారి సరైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు.


ఇక సర్దార్‌ 2' సినిమా ఒక ఫ్లో లో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయినా... తెర మీద జరిగే తంతు అంతా యాంత్రికంగా ఉంది. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం కూడా ఏమంత గొప్పగా లేవు. అవీ రొటీన్ గానే సాగాయి. సినిమా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా హై మూమెంట్ అనేది లేదు. 'రా' ఏజెంట్స్ పై తీసిన సినిమాను మరీ ఇంత 'రా'గా తీయడం అవసరమా అనిపిస్తుంది. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ మాత్రం బాగుంది. ఓవరాల్ గా కథలో కొత్తదనం లేకపోవడం, కథనం ఆసక్తిని కలిగించకపోవడంతో ప్రేక్షకులను మెప్పించడంలో 'సర్దార్‌ 2' విఫలమైంది.

Sep 10, 2026 Read Review
Filmi Beat
Filmi Beat Website
5

Average

Sardar 2 Movie Review

సర్దార్ సినిమా ద్వారా ప్లాస్లిక్ బాటిల్ వాడకం వల్ల ఎలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయనే సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు. సర్దార్ 2 విషయానికి వస్తే.. కోలాస్టిన్ అనే మెడిసిన్ గురించి యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పించే చక్కటి ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఎంచుకొన్న కథ,...

సర్దార్ సినిమా ద్వారా ప్లాస్లిక్ బాటిల్ వాడకం వల్ల ఎలాంటి అనర్థాలకు దారి తీస్తున్నాయనే సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చారు. సర్దార్ 2 విషయానికి వస్తే.. కోలాస్టిన్ అనే మెడిసిన్ గురించి యాంటీ బయోటిక్స్ వాడకంపై అవగాహన కల్పించే చక్కటి ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఎంచుకొన్న కథ, కథనాలు, చెప్పిన విధానం ఆకట్టుకోలేకపోయింది.


దర్శకుడు మిత్రన్ రాసుకొన్న సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. దాంతో ఇలాంటి థీమ్‌తో ఇప్పటికే ఎన్నో కథలు రావడం వల్ల పాత సినిమానే చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విదేశీ మాఫియా కుట్రలు, బయో వెపన్ లాంటి కథలు పాత చింతకాయ పచ్చడి మాదిరిగానే అనిపిస్తాయి. ఇక పెర్ఫార్మన్స్ పరంగా కార్తీ చేయాల్సింది చేస్తే... ఎస్.జె. సూర్య చేయాల్సిందనికన్నా ఎక్కువ చేసినట్టు ఉంది. 


ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి ప్రామిసింగ్ ఎఫర్ట్స్ పెట్టారనిపిస్తుంది. అయితే ఎడిటింగ్ విభాగం పూర్తిగా ఫెయిల్ అవ్వడంతో సినిమా నేరేషన్ గ్రిప్పింగ్‌గా అనిపించదు. బీజీఎమ్ కూడా డిస్సపాయింట్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా కథ మంచి పాయింటే అయినప్పటికీ.. దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. దాంతో కార్తీ సర్దార్ కంప్లీట్ గా నిరాశపరిచిందనే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పాల్సిందే.


Sep 10, 2026 Read Review
Tupaki
Tupaki Website
5

Average

Sardar 2 movie review

సర్దార్-2’ ఎంతో ఎఫర్ట్ పెట్టిన రాసిన కథతో తయారైన సినిమా. రైటర్ కమ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ అంత భారీగా.. అనేక లేయర్లతో ఆ కథను రాసుకున్నాడు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టి రాసినా.. తెర మీద ఎంత భారీగా ఆ కథను ప్రెజెంట్ చేసినా.. చెప్పాలనుకున్న విషయం అర్థవంతంగా అనిపిస్తేనే.. ప్రేక్షకులకు అది సరిగ్గా చేరితేనే మంచ...

సర్దార్-2’ ఎంతో ఎఫర్ట్ పెట్టిన రాసిన కథతో తయారైన సినిమా. రైటర్ కమ్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ అంత భారీగా.. అనేక లేయర్లతో ఆ కథను రాసుకున్నాడు. కానీ ఎంత ఎఫర్ట్ పెట్టి రాసినా.. తెర మీద ఎంత భారీగా ఆ కథను ప్రెజెంట్ చేసినా.. చెప్పాలనుకున్న విషయం అర్థవంతంగా అనిపిస్తేనే.. ప్రేక్షకులకు అది సరిగ్గా చేరితేనే మంచి అనుభూతి కలుగుతుంది. ‘సర్దార్’లో వాటర్ మాఫియా అంశాన్ని.. ఒక పంచె కట్టిన గూఢచారి చేసే విన్యాసాలను మిత్రన్ అలా అర్థవంతంగానే తెరపై ప్రెజెంట్ చేశాడు. కానీ ‘సర్దార్-2’కు వచ్చేసరికి.. బయో వార్ కాన్సెప్టు చుట్టూ అల్లుకున్న కథను కనీసం తన టీం సభ్యులకు అయినా అర్థమయ్యేలా చెప్పగలిగాడా అనే సందేహం కలుగుతుంది.



ఎస్.జె.సూర్య చేసిన విలన్ పాత్రను తీర్చిదిద్దిన విధానమే ప్రేక్షకులకు తీవ్ర గందరగోళంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు అతను విలనో హీరోనో అర్థం కాదు. ఒకవైపేమో పరిమితికి మించి యాంటీ బయాటిక్స్ వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లాసులు పీకుతాడు. ఇంకోవైపేమో అలా చేయడం తప్పు కాబట్టి ఆ మనుషులకు బతికే అర్హత లేదంటాడు. ఇంకోవైపేమో ఈ తరం అంతా పోయాక ఒక మంచి తరాన్ని తయారు చేస్తా అంటాడు.


అయితే కార్తి పెర్ఫామెన్స్ పరంగా ఏమీ లోటు చేయలేదు. ఇటు డైరెక్టర్ కూడా కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశాడని.. ఎంతో కసరత్తు చేసి స్క్రిప్టు రాశాడని అర్థమవుతుంది. కానీ ఎంత కష్టపడ్డప్పటికీ.. అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా కథను చెబితేనే ఆశించిన ప్రయోజనం చేకూరుతుంది. కానీ రైటింగ్-టేకింగ్ లో విపరీతమైన గందరగోళం.. అర్థరహితంగా అనిపించే విలన్ పాత్ర వల్ల.. కన్విన్సింగ్ గా లేని కొన్ని సన్నివేశాల వల్ల మిత్రన్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. చివరగా సర్దార్-2.. దారి తప్పిన ఏజెంట్ అయ్యాడు. 



Sep 10, 2026 Read Review
Man of Fiction
Man of Fiction Youtube Channel
5

Average

Sardar 2 Movie Review

సో కార్తీ గారి సర్దార్ 2... సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే.. ఆహా ఈ రేంజ్ డిస్సపాయింట్ బాబోయ్.. ఇంత దారుణంగా కూడా తీయొచ్చా అన్నట్టు ఉంది. అండ్ సినిమాలో ఫస్ట్ పార్ట్ లాగానే ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ ఇద్దామని స్టోరీ పాయింట్ రాసుకున్నాడు... ఎక్కడివరకు బానే ఉంది. కానీ దాన్...

సో కార్తీ గారి సర్దార్ 2... సినిమా ఇప్పుడే చూసొస్తున్నాను. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే.. ఆహా ఈ రేంజ్ డిస్సపాయింట్ బాబోయ్.. ఇంత దారుణంగా కూడా తీయొచ్చా అన్నట్టు ఉంది. అండ్ సినిమాలో ఫస్ట్ పార్ట్ లాగానే ఈ మూవీలో కూడా మంచి మెసేజ్ ఇద్దామని స్టోరీ పాయింట్ రాసుకున్నాడు... ఎక్కడివరకు బానే ఉంది. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు బాలేదు. కామెడీ అయితే దరిద్రంగా ఉంది. అండ్ కార్తీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగున్నాయి. ఇలా కొన్ని సీన్లు సినిమాలో బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో చిన్న కార్తీ సీన్లు అయితే ఆర్డినరీగా ఉన్నాయి. 


అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నసుగుతా నసుగుతా ఉంటాదయ్యా. విలన్ క్యారెక్టర్ అయితే బాగుంది. అండ్ సర్దార్ కే వాడికి ఉన్న కనెక్షన్ బాగుంది. కానీ దాన్ని ఏ రేంజ్ లో పండబెట్టాలో ఆ రేంజ్ లో పండబెట్టారు. విలన్ పెర్ఫార్మన్స్ చూస్తే ఒక సీరియస్ నెస్ లేకుండా చాలా ఛండాలంగా ఉంది. ముఖ్యంగా డైలాగ్స్ అయితే అంటిఅంటరాని తెలుగు చూసినట్టు ఉంటుంది. అండ్ సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ సీన్స్ ఉంటాయి. ప్రాబ్లెమ్ ఏంటంటే ప్రతి ఇరవై నిమిషాలకు సినిమాలో సీరియస్ నెస్ మారిపోతది. గోల్ మరి పోతది. క్యారెక్టర్స్ అయితే సర్దార్ కి తప్ప అన్ని క్యారెక్టర్లు దరిద్రంగా రాసుకున్నారు. అండ్ సినిమాలో పాటలు కూడా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా దరిద్రంగా ఉంది. ఫైనల్ గా డిస్సపాయింట్ చేసింది మొత్తం. 

Sep 10, 2026 Watch
Mahidhar Vibes
Mahidhar Vibes Youtube Channel
4

Below Average

Sardar 2 movie review

సర్దార్ 2... సినిమా చూసొచ్చాక సినిమా గురించి చెప్పాలంటే... ఫస్ట్ అఫ్ అల్ అసలు ఇది గుడ్ మూవీయా బాడ్ మూవీయా అనేది పక్కన పెడితే, అసలు ఈ మూవీ రాకూడదు. కానీ నా దృష్టిలో ఈ సినిమా రాకూడదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ని చెడగొట్టేలా ఉంది ఈ సినిమా. సర్దార్ సినిమాకి ఉన్న పాజిటివిటి పాజిటివిటి ఏదైతే ఉందొ దాన్ని చెడగ...

సర్దార్ 2... సినిమా చూసొచ్చాక సినిమా గురించి చెప్పాలంటే... ఫస్ట్ అఫ్ అల్ అసలు ఇది గుడ్ మూవీయా బాడ్ మూవీయా అనేది పక్కన పెడితే, అసలు ఈ మూవీ రాకూడదు. కానీ నా దృష్టిలో ఈ సినిమా రాకూడదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ ని చెడగొట్టేలా ఉంది ఈ సినిమా. సర్దార్ సినిమాకి ఉన్న పాజిటివిటి పాజిటివిటి ఏదైతే ఉందొ దాన్ని చెడగొట్టడానికి సర్దార్ 2 తీసినట్టుంది. అసలు డైరెక్టర్ ఏం తాగి క్యారెక్టర్స్ రాసుకున్నారో కూడా అర్ధం కాదు. ముఖ్యంగా కామెడీ సీన్లు ఇరిటేటింగ్ గా ఉంటాయి. ఇంత సీరియస్ సినిమాలో కామెడీ సీన్లు పెడితే దాని వల్ల సినిమా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. 


అయితే ఎండ్ అఫ్ ది మూవీ అసలు ఏంటి ఈ మూవీ అన్న డౌట్ వస్తుంది. కొన్ని పాయింట్స్ బాగున్నా వాటి గురించి పెద్దగా మాట్లాడుకోలేం. ఆ మంచి సీన్ల వల్ల మనకు తలనొప్పి ఎక్కువ రాదు గాని, ఓవరాల్ గా యావరేజ్ కి దగ్గరగా వచ్చి ఆగింది. బేసిగ్గా సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కంప్లీట్ ఔట్రైట్ సినిమాలా ఉంది. కార్తీ తన వరకు బాగా చేసాడు. అనవసరంగా సర్దార్ కి కంటిన్యూ చేసారు. ఏందో మరి.. సర్లే ఇంకేం చేయలేము మరి... డిస్సపాయింటెడ్... ఇక మ్యూజిక్ అయితే రాడ్ బీజీఎమ్ ఇచ్చాడు. 

Sep 10, 2026 Watch
123telugu
123telugu Website
5

Average

Sardar 2 Movie Review

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ లు ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ సీక్వెల్ సినిమానే ‘సర్దార్ 2’. పార్ట్ 1 మంచి హిట్ కావడంతో దాని సీక్వెల్ ని తీసుకురాగా, థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక గత సినిమాలో లానే ఈసార...

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ లు ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు పి ఎస్ మిత్రన్ తెరకెక్కించిన స్పై యాక్షన్ సీక్వెల్ సినిమానే ‘సర్దార్ 2’. పార్ట్ 1 మంచి హిట్ కావడంతో దాని సీక్వెల్ ని తీసుకురాగా, థియేటర్లలో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక గత సినిమాలో లానే ఈసారి కూడా ఓ సెన్సిటివ్ సబ్జెక్ట్ ని దర్శకుడు పట్టుకోవడం జరిగింది. అయితే పార్ట్ 1 లో ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్, మూమెంట్స్ పార్ట్ 2 లో బాగా మిస్ అయ్యాయి.


అయితే మూవీలో కొన్ని ఐడియాలు పార్ట్ 2 లో బాగానే ఉన్నాయి. కానీ వాటికీ తగ్గ సెటప్, స్క్రీన్ ప్లే మిస్ అయినట్టు కూడా చూసే ఆడియెన్ కి అర్ధం అయ్యిపోతుంది. కార్తీ బాగానే నటించినా, సినిమాలో అనవసర సన్నివేశాలతో ల్యాగ్ చేసారు. ఇక మొత్తంగా చూసుకుంటే ‘సర్దార్ 2’ మాత్రం పార్ట్ 1 తో పోలిస్తే అంచనాలు అందుకోలేకపోయింది. అలాగే సబ్జెక్టులో కోర్ పాయింట్ కూడా బాగానే ఉంది, కానీ ఇవే ఎలిమెంట్స్ పార్ట్ 1 లో కూడా ఉన్నప్పటికీ అక్కడ కనిపించిన గ్రిప్పింగ్ కథనం, థ్రిల్ మూమెంట్స్ ఇందులో బాగా మిస్ అయ్యాయి. సో వీటితో ఈ చిత్రం ఒక డల్ స్పై థ్రిల్లర్ గా నిలిచిపోయింది.


Sep 10, 2026 Read Review
Devi Priya
Devi Priya Twitter Channel
4

Below Average

Sardar2 movie review

సర్దార్ 2 ..IDreamRating 1.5/5బయోవార్ నేపథ్యానికి..ప్రజల మందుల వాడకాన్ని ముడిపెట్టి..తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రంగరించి..అస్సలు రిలీఫ్ అన్నది లేకుండా చేసి..మూడు గంటలుచెవులు మూయకుండా చావగొట్టిన సినిమాప్లస్ పాయింట్లువెదికినా దొరకవుమైనస్ పాయింట్లువెదక్కుండా దొరుకుతాయిపంచ్ లైన్టాక్సిక్ 2

సర్దార్ 2 ..IDreamRating 1.5/5


బయోవార్ నేపథ్యానికి..


ప్రజల మందుల వాడకాన్ని ముడిపెట్టి..


తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రంగరించి..


అస్సలు రిలీఫ్ అన్నది లేకుండా చేసి..


మూడు గంటలు


చెవులు మూయకుండా చావగొట్టిన సినిమా


ప్లస్ పాయింట్లు


వెదికినా దొరకవు


మైనస్ పాయింట్లు


వెదక్కుండా దొరుకుతాయి


పంచ్ లైన్


టాక్సిక్ 2

Sep 10, 2026 Read Review
Thyview
Thyview Youtube Channel
4

Below Average

Sardar 2 move Review

సర్దార్ 2 రివ్యూ... first of all movie చూసాక నా openoin చెప్పాలంటే.. very dissapointed.. PS మిత్రన్ మరీ ఇలా తీస్తారని అనుకోలేదు. పార్ట్ వన్ టెంప్లేట్ లోనే వెళ్తుంది ఈ కూడా. బట్ పార్ట్ వన్ లో వర్కవుట్ అయిన యాక్షన్ గాని, స్పై సీన్స్ గాని, క్యారెక్టర్ ఎమోషన్స్ గాని ఏవి సర్దార్ 2 లో వర్కౌట్ కాలేదు....

సర్దార్ 2 రివ్యూ... first of all movie చూసాక నా openoin చెప్పాలంటే.. very dissapointed.. PS మిత్రన్ మరీ ఇలా తీస్తారని అనుకోలేదు. పార్ట్ వన్ టెంప్లేట్ లోనే వెళ్తుంది ఈ కూడా. బట్ పార్ట్ వన్ లో వర్కవుట్ అయిన యాక్షన్ గాని, స్పై సీన్స్ గాని, క్యారెక్టర్ ఎమోషన్స్ గాని ఏవి సర్దార్ 2 లో వర్కౌట్ కాలేదు. చాలా ప్లేయిన్ గా టూ ప్రెడిక్ట్రబుల్ గా వెళ్ళిపోతుంది సినిమా. కొన్ని ఇంట్రెస్టింగ్ చాయిస్ ఉంటాయి సినిమాలో. బట్ వాటికివ్వాల్సిన వెయిట్ ఇవ్వలేదు. కార్తీ is the saving race in this movie. but writing support చేయనపుడు ఆయన కూడా ఎంత వరకు కాపాడగలుగుతారు. 


part 1 ఎండింగ్ లో సర్దార్ వెనక్కి తగ్గాక, తన కొడుకు తన తండ్రిపై ఉన్న బ్లాక్ మార్క్ ని తీసేద్దామని పర్సనల్ గా ఒక మిషన్ లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇంతకి ఆ మిషన్ ఏంటి? సర్దార్ ఈ మిషన్ లోకి ఎలా వచ్చాడు అని సినిమాలో చూడాలి. అయితే సినిమాలో అన్ని సీన్లు చాలా ఆర్డినరీగా సాగిపోతుంటాయి. అండ్ చాలా సీన్లు క్రిస్పీగా ఉన్నాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా ఉంటాయి. అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ సినిమాలో ఉన్నా, వాళ్ళు చేసే పనులు అలా ఉండవు. ఫైనల్ గా కార్తీకి థ్యాంక్స్ చెప్పాలి పెర్ఫార్మన్స్ విషయంలో. ఇక ఎస్.జె. సూర్య ని అస్సలు వాడుకోలేదు. ఫైనల్ వర్డ్ ఏంటంటే సర్దార్ 2 టోటల్లీ డిస్సపాయింటెడ్. 




Sep 10, 2026 Watch
Venky Reviews
Venky Reviews Twitter Channel
4

Below Average

Sardar 2 Movie review

#Sardar2 Promising Ideas, Lifeless Execution!An interesting start dives straight into the story, but the over the top execution never really engages. PS Mithran comes up with a few promising ideas and a decent message, but the narration is childish and unconvincing. Film is unnecessarily long. Sam C...

#Sardar2 Promising Ideas, Lifeless Execution!


An interesting start dives straight into the story, but the over the top execution never really engages. PS Mithran comes up with a few promising ideas and a decent message, but the narration is childish and unconvincing. Film is unnecessarily long. Sam CS’s music is a major letdown, while the production values and a few action sequences stand out.


Had potential, but ends up being a disappointing watch.


Rating: 2/5

Sep 10, 2026 Read Review

Public Reviews

6 Avg: 4.2/10
G
Goshika Shreshta CA/Advocate
4

Below Average

Sardar 2 Movie Review

Sardar 2 attempts to build on the world established in the first film, but unfortunately, it struggles to recreate the same impact. The action sequences in the movie don’t deliver the expected highs, the spy elements rarely generate genuine suspense, and the emotional moments fail to leave a lasting...

Sardar 2 attempts to build on the world established in the first film, but unfortunately, it struggles to recreate the same impact.


The action sequences in the movie don’t deliver the expected highs, the spy elements rarely generate genuine suspense, and the emotional moments fail to leave a lasting impression.


The film does have a few intriguing ideas, but they are not explored with enough depth or conviction. The predictable screenplay and occasional logical inconsistencies further weaken the experience.


Karthi remains the strongest aspect of the film, bringing sincerity and conviction to his performance, but the writing limits how much he can elevate the material. S.J. Suryah, despite his potential, is also underutilised.


overall A disappointing follow-up with a strong lead performance but weak writing.

Sep 10, 2026
B
Baru Sri Harshitha Students & Youth
4

Below Average

Sardar 2 Movie review

Part 1 ఇచ్చిన experience తర్వాత Sardar 2 మీద expectations naturally high గా ఉంటాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం “ఇంతేనా?” అనే feeling వస్తుంది. అదే spy-thriller setup, అదే template, and Story చాలా predictableగా వెళ్లిపోవడంతో audienceకి engage అయ్యే అవకాశం కూడా తక్కువ.కొన్ని ideas genuinely inter...

Part 1 ఇచ్చిన experience తర్వాత Sardar 2 మీద expectations naturally high గా ఉంటాయి. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం “ఇంతేనా?” అనే feeling వస్తుంది. అదే spy-thriller setup, అదే template, and Story చాలా predictableగా వెళ్లిపోవడంతో audienceకి engage అయ్యే అవకాశం కూడా తక్కువ.


కొన్ని ideas genuinely interestingగా అనిపిస్తాయి, కానీ వాటిని explore చేసే depth లేకపోవడంతో impact miss అవుతుంది. కొన్ని scenes అయితే logicకి కూడా దూరంగా అనిపిస్తాయి.


Overall, Sardar 2 feels less like a worthy continuation and more like a routine sequel made around a familiar template. Part 1 ఇచ్చిన highకి ఈ సినిమా చాలా దూరంలోనే ఆగిపోయింది.


Sep 10, 2026
T
Talari Snehalatha IT Employee
3

Not Good

Sardar 2 movie review

Honestly bro, చాలా డిసప్పాయింటింగ్ అయ్యా సర్దార్ 2 మూవీ చూసి! సర్దార్ Part 1 ఇచ్చిన hype తో వెళ్తే అసలు 10 persent కూడా match అవ్వదు. Story చాలా predictable గా ఉంటుంది, ఎక్కడా proper excitement రాదు. Action, spy scenes, emotions — ఏదీ Part 1 level లో అనిపించలేదు. కొన్ని scenes అయితే logic లేకుం...

Honestly bro, చాలా డిసప్పాయింటింగ్ అయ్యా సర్దార్ 2 మూవీ చూసి! 


సర్దార్ Part 1 ఇచ్చిన hype తో వెళ్తే అసలు 10 persent కూడా match అవ్వదు. Story చాలా predictable గా ఉంటుంది, ఎక్కడా proper excitement రాదు. Action, spy scenes, emotions — ఏదీ Part 1 level లో అనిపించలేదు. కొన్ని scenes అయితే logic లేకుండా సాగిపోతాయి.


Karthi performance మాత్రం solid.. అది కూడా few సీన్స్ మాత్రమే. 

ఓవరాల్ గా writing weak గా ఉండడం మాత్రమే కాదు... సినిమాలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే... వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అలా ఉంది మూవీ. కార్తీ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ చూసి ఫీల్ అవుతారేమో. ఇంతకు మించి సినిమా గురించి చెప్పలేకపోతున్న.


Sep 10, 2026
P
Patwari Sinduja Homemaker / Housewives
5

Average

Sardar 2 movie review

చాలా తక్కువ సినిమాలు వెళ్తుంటాను నేను... అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ preference ఇస్తుంటాను. అందుకే సర్దార్ మూవీ నచ్చి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ 2 కి ఫస్ట్ డే నే ఫ్యామిలీతో వెళ్ళాం. బట్ సినిమా చూసాక నా ఫీలింగ్ ఒక్కటే — చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను!Part 1 నచ్చిన వాళ్లకి Part 2 మీద...

చాలా తక్కువ సినిమాలు వెళ్తుంటాను నేను... అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ preference ఇస్తుంటాను. అందుకే సర్దార్ మూవీ నచ్చి సీక్వెల్ గా వచ్చిన సర్దార్ 2 కి ఫస్ట్ డే నే ఫ్యామిలీతో వెళ్ళాం. బట్ సినిమా చూసాక నా ఫీలింగ్ ఒక్కటే — చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను!


Part 1 నచ్చిన వాళ్లకి Part 2 మీద మంచి expectations ఉంటాయని తెలుసు కదా, కానీ ఈ మూవీలో పార్ట్ 1 కి సగంలో సగం కూడా మ్యాచ్ కాలేదు. Story చాలా predictable గా వెళ్లిపోయింది. and Action, spy scenes, emotions లో ఏవి కూడా నాకు నచ్చలేదు. ఫైనల్ గా atleast ఓ మంచి message ని Part 1 లో చూపించినట్టు చుపిస్తారేమో అనుకున్నా కానీ, ఇందులో కూడా ఆలా ఏం చూపించలేదు. అండ్ బట్ కార్తీ performance మాత్రం బాగుంది. అతని కోసం మూవీ చేద్దామనుకున్నా, ఎక్కువ సేపు ఉండలేం.. అలా ఉంది మూవీ. overall dissapoint అయ్యా.. 

Sep 10, 2026
V
Velugubantla Ramadurga Private Employee
5

Average

Sardar 2 Movie Review

After watching Sardar 2, my honest take is that the film is quite disappointing.Directer P.S. Mithran returns with the same basic template from Part 1, but unfortunately, the elements that made the first film work — the action, spy portions and emotional depth — don’t have the same impact here.The n...

After watching Sardar 2, my honest take is that the film is quite disappointing.


Directer P.S. Mithran returns with the same basic template from Part 1, but unfortunately, the elements that made the first film work — the action, spy portions and emotional depth — don’t have the same impact here.


The narrative feels too plain and predictable, with only a few interesting ideas that aren’t given enough weight or elevation.


but Karthi acting was good... and A few logical inconsistencies also affect the experience.


Overall, Sardar 2 had the potential to be a strong sequel, but weak writing and predictable execution make it a largely underwhelming experience.

Sep 10, 2026
A
Arige Srikanth Private Employee
4

Below Average

Sardar 2 Movie Review

ippude Sardar 2 morning show chusocchanu... Honestly, Sardar 2 very disappointed! asalu part 1 lo work ayina action, spy elements, emotions e movie lo evi kooda naku proper ga click avvaledu. chala plain & predictable ga velthundi. few interesting choices unna, aa sences ki avasaramaina weight i...

ippude Sardar 2 morning show chusocchanu... Honestly, Sardar 2 very disappointed!


asalu part 1 lo work ayina action, spy elements, emotions e movie lo evi kooda naku proper ga click avvaledu. chala plain & predictable ga velthundi. few interesting choices unna, aa sences ki avasaramaina weight ivvaledu.


Karthi movie ni save cheyadaniki chala try chesadu. His performance is solid, but correct writing support lekapothe audiance kooda support cheyaru.


part one lo exiting ee movie start ayyaka sagam kooda ledu nalo.. inervel ke opika poyindi. vellipodam anukunna kaani... edo directer meeda nammakamtho last daka unna... aa tarvatha picchekkipoyindi...


ippatike naa review chusina vallaki movie talk ento ardhamai untundi.

Sep 10, 2026

About This Movie

Story :

కథ విషయానికి వస్తే.. ఈ సినిమా స్టోరీ భారత్ ని నాశనం చేయడానికి మొదలైన ఆపరేషన్ డాకు నేపథ్యంలో నడుస్తుంది. దీన్ని ఇండియన్ స్పై టీమ్ ముందు అడ్డుకున్నా, బ్లాక్ డాగర్ (SJ. సూర్య) అనే అండర్ వరల్డ్ డాన్ మళ్ళీ యాక్టీవ్ చేస్తాడు. అయితే దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో రా ఏజెంట్ విజయ్‌ (కార్తీ)ని, అతడి చీఫ్ బొమ్మై (ఆషిష్‌ విద్యార్థి) లూప్ లైన్‌ లో పెడతాడు. అయినా సరే, విజయ్‌ అప్పటికే ఈ మిషన్ కోసం కనిపించకుండా పోయిన రా ఏజెంట్ ల దగ్గరి నుండి, ఫైజా (ఆషిష్‌ రంగనాథ్‌), ఇంకా తన టీం సాయంతో రెండు ఇంపార్టెంట్ "కీ"లు సంపాదిస్తాడు. అయితే మూడో 'కీ' డి.ఆర్.డి.వో. ఛీఫ్‌ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఉంటుంది. దాన్ని సంపాదించి ఈ దేశాన్ని కాపాడే ప్రయత్నంలో అనుకోకుండా, బ్లాక్‌ డాగర్ ఆ 'కీ' సొంతం చేసుకుని ఇండియాని నాశనం చేయడానికి రెడీ అవుతాడు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత... విజయ్ విఫలమవుతున్న టైం లో, ఊహించని విధంగా అతని తండ్రి సర్దార్‌ (కార్తీ) మిషన్ లోకి ఎంటర్ అవుతాడు. అయితే అందరి దృష్టిలో చనిపోయిన సర్దార్‌ మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? బ్లాక్ డాగర్ ఇండియాని నాశనం చేసే ఆ బయో వెపన్ ప్లాన్ ని ఫెయిల్ చేయడానికి తండ్రి కొడుకులు ఏం చేసారు? అనేది కథ.

 

Plus Points :

సర్దార్ కి సీక్వెల్ తీయడమే మూవీకి బిగ్గెస్ట్ ప్రమోషన్ అయింది. పైగా టీజర్, ట్రైలర్స్ కూడా అంచనాలని రెట్టింపు చేసాయి. ఇక ఫస్ట్ పార్ట్ లో ఓ చిన్నపాటి మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. సెకండ్ పార్ట్ లో కూడా అలాంటి మెసేజ్ ఇచ్చే పాయింట్ ని పట్టుకున్నాడు డైరెక్టర్. ఇది యూనివర్సల్ పాయింట్ కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రా ఏజెంట్ గా హీరో కార్తీ మరోసారి అదరగొట్టాడు. డ్యూయల్ రోల్ లో కార్తీ పెర్ఫామెన్స్ మూవీ కి హైలెట్ అయింది. అలాగే కొన్ని కీ ఎపిసోడ్స్ లో ఎమోషనల్ ఎపిసోడ్స్ మూవీలో బాగున్నాయి. అలాగే మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ తమ క్యారెక్టర్స్ లో బాగా నటించారు. ఇక ఎస్.జే సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనలో తన అనుభవాన్ని మరోసారి చూపించాడు. 

Minus Points :

సర్దార్ ఫస్ట్ పార్ట్ సాధించిన గ్రాండ్ సక్సెసే ఈ సీక్వెల్ తీయడానికి కారణమయింది. అలాంటి సీక్వెల్ ని తీస్తున్నప్పుడు డైరెక్టర్ ఎంత పగడ్బందీగా ప్లాన్ చేయాలి.. ఎంత జాగ్రత్తగా తీయాలి. ఫస్ట్ పార్ట్ కి కొంచెం డిస్కనెక్ట్ అయినా ఆడియన్స్ దారుణంగా రిజెక్ట్ చేస్తారని తెలిసిందే. కానీ సర్దార్ 2 చూసాక డైరెక్టర్ ఇవేమి పట్టనట్టు చాలా లేజీగా సినిమా తీసినట్టు అనిపించింది. కథ పాయింట్ బాగున్నా, దానికి తగ్గ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. పార్ట్ 1 లో ఉన్న సస్పెన్స్ గాని, థ్రిల్ మూమెంట్స్ గాని, ఎమోషన్స్ గాని రెండో పార్ట్ లో ఏమి ఉండవు. 

అండ్ కాన్సెప్ట్ పరంగా ఐడియాస్ బాగానే ఉన్నా, వాటికి తగ్గ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేక బోర్ కొట్టేస్తుంది. యాక్షన్ ఎపిసోడ్లు బాగానే ఉన్నా వాటికి కనెక్ట్ కారు. కొన్ని ఇల్లాజికల్ సీన్ల వల్ల ఆడియన్స్ కి విసుగొచ్చేస్తుంది. ఇదంతా పక్కనబెడితే ఈ మూవీలో ఒక స్పై ఏజెంట్ కి ఉండాల్సిన షార్ప్ సీన్లు ఇందులో మిస్ అయ్యాయి. కార్తితో ఉండే ఇతర స్పై ఏజెంట్లను ఇంటెలిజెంట్ అనే పదానికి దూరంగా చూపించినట్లు ఉంటారు. ఇక అనవసరమైన సీన్లతో మూవీ ఆడియన్స్ కి ల్యాగ్ ఫీల్ కూడా వచ్చేస్తుంది. పోనీ క్లైమాక్స్ లో అయినా థ్రిల్స్ ఉంటాయేమో అనుకుంటే అది కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంది.


Technical values :


టెక్నికల్ గా చూసుకుంటే... ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ కి రెండింతలు పెట్టినట్టు ఉంటుంది. కానీ కంటెంట్ లో ఆ బలం లేదు. ఇక సామ్ CS మ్యూజిక్ పరంగా దెబ్బేసాడు. బీజీఎమ్ యావరేజ్ గా ఉంది. జార్జ్ విలియమ్స్ కెమెరా వర్క్ బాగుంది. ఇక ఈ సినిమాలో అన్నిటికంటే ఎక్కువ పని పడేది ఎడిటరే. అనవసరమైన సీన్లు చాలా ఉన్నాయి... వాటిని ల్యాగ్ సీన్స్ ని ట్రిమ్ చేయాల్సింది. ఇక డైరెక్టర్ పిఎస్ మిత్రన్ స్టోరీ లైన్ బాగానే రాసుకున్నా, స్క్రీన్ ప్లే పరంగా బాగా దెబ్బేసాడు. ఏ సీన్ కూడా స్క్రీన్ పే థ్రిల్ మూవ్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది. ముఖ్యంగా ఇలాంటి స్పై మూవీస్ కి ఒక రేసి స్క్రీన్ ప్లే కావాలి... కానీ దీంట్లో అదే మిస్ అయింది.  

Final Review : 

ఓవరాల్ గా సర్దార్ 2 సినిమా ఫస్ట్ పార్ట్ కి తగ్గట్టు ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పేలవమైన కథ, కథనాల కారణంగా. ల్యాగ్ సీన్ల వల్ల, అన్నిటికి మించి లాజిక్ లేని సీన్లు, కథకి ఎమోషనల్ కనెక్టివిటి కాకపోవడం వల్ల మూవీ నిరుత్సాహపరుస్తుంది. అయితే కార్తీ పెర్ఫార్మన్స్ కోసం, కొన్ని మంచి మెసేజ్ ఇచ్చే సీన్ల కోసం ఫ్యాన్స్ ఓసారి ట్రై చేయొచ్చు. మిగతా వారికి కష్టమే. 

Review Statistics

4.7
Overall Rating
Avg. of all reviews
26
Total Reviews
From 5 Provider Types

Review Average

Media
4.8/10
Public
4.2/10
Why MRO?